రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Eligibility for Group Health Insurance for Employees - Bajaj Allianz
9 మార్చి, 2023

సమగ్ర గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ: ఉద్యోగుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్

నేటి కాలంలో, ప్రతిభను ఆకర్షించడానికి మరియు నిలిపి ఉంచుకోవడానికి ఉద్యోగి ప్రయోజనాలు అందించడమనేది సంస్థలకు చాలా ముఖ్యం. ఉద్యోగికి అందించే అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి . అనారోగ్యం లేదా గాయం కారణంగా హాస్పిటల్‌లో చేరినప్పుడు, వైద్య ఖర్చులను ఇది కవర్ చేస్తుంది. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ అనేది అలాంటి ఒక ప్రయోజనం అందించే పదంగా ఉంటుంది. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు గురించి వివరంగా చర్చిద్దాం మరియు భారతదేశంలోని ఉద్యోగులు మరియు యజమానులకు అవి ఎందుకు ముఖ్యమైనవో అర్థం చేసుకుందాం.

గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ అంటే ఏమిటి?

గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ అనేది ఒక సంస్థలోని ఉద్యోగులు మరియు వారి మీద ఆధారపడిన వ్యక్తులకు కవరేజ్ అందించే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అనారోగ్యం లేదా గాయం కారణంగా హాస్పిటల్‌లో చేరినప్పుడు, ఇన్సూర్ చేయబడిన వ్యక్తులకు అయ్యే వైద్య ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది. హాస్పిటలైజేషన్ ఛార్జీలు, గది అద్దె, డాక్టర్ ఫీజులు మరియు ప్రీ-హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులతో సహా, అనేక రకాల వైద్య ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగుల కోసం  and their families at an affordable cost. The premium for the policy is usually lower than an వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, as the risk is spread across a larger group of individuals. The policy is usually renewed annually, and the premium is paid by the employer.

ఉద్యోగులకు గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ ఎందుకు ముఖ్యం?

భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ముఖ్యమైన ఉద్యోగి ప్రయోజనం. ఎందుకంటే, వైద్య అత్యవసర పరిస్థితిలో ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఇది ఆర్థిక భద్రతను అందిస్తుంది. వైద్య అత్యవసర పరిస్థితులనేవి ఎప్పుడైనా తలెత్తవచ్చు మరియు హాస్పిటలైజేషన్ మరియు వైద్య చికిత్స కోసం ఖర్చు చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఒక గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ ఉండడం వల్ల ఉద్యోగులు వారి వైద్య ఖర్చుల ఆర్థిక భారం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరియు అనారోగ్యం లేదా గాయం నుండి కోలుకోవడం మీద దృష్టి పెట్టవచ్చు. భారతదేశంలో, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్నాయి మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అనేది ఖరీదైనదిగా మారుతోంది. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ అనేది ఈ ఖర్చు గురించి ఆందోళన చెందకుండా, ఉద్యోగులు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు యాక్సెస్ కలిగి ఉండడాన్ని నిర్ధారిస్తుంది. ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు ఆసుపత్రిలో చేరిన తర్వాత అయ్యే ఖర్చులు, డేకేర్ విధానాలు మరియు అంబులెన్స్ ఛార్జీలతో సహా అనేక వైద్య ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది. అదనంగా, ఖరీదైన వైద్య చికిత్స అవసరమయ్యే క్యాన్సర్, గుండె జబ్బులు మరియు మూత్రపిండ వ్యాధులు లాంటి తీవ్రమైన అనారోగ్యాలకు కూడా ఈ పాలసీ కవరేజ్ అందిస్తుంది. అంతేకాకుండా, ఉద్యోగులతో పాటు వారిమీద ఆధారపడిన వారిని ఈ కవరేజీలో చేర్చవచ్చు. కాబట్టి, వారు ప్రత్యేకంగా కుటుంబం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు  కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం వల్ల వైద్య అత్యవసర పరిస్థితుల్లో వారికి మరియు వారి కుటుంబసభ్యులకు కవరేజ్ లభిస్తుందని తెలియడం వల్ల, ఉద్యోగులకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఇది, ఉద్యోగిలో సంతృప్తి మరియు మనోబలం పెంచుతుంది. తద్వారా, మరింత ఉత్పాదక శ్రామిక శక్తికి దారితీస్తుంది.

యజమానులకు గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ ఎందుకు ముఖ్యం?

గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ అందించడమనేది ఉద్యోగులకే కాకుండా యజమానులకు కూడా ముఖ్యం. ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడానికి ఇది ఒక ఖర్చు-తక్కువ మార్గంగా ఉంటుంది. ఈ పాలసీ కోసం ప్రీమియం అనేది సాధారణంగా ఒక వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం అనేది పెద్ద వ్యక్తుల సమూహంలో విస్తరించబడి ఉంటుంది. ఇది, యజమాని వెచ్చించాల్సిన ఆరోగ్య సంరక్షణ ఖర్చును తగ్గించడం ద్వారా, ఖర్చు పొదుపులకు దారితీస్తుంది. అదనంగా, ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందించడం అనేది ప్రతిభను ఆకర్షించడానికి మరియు దానిని నిలిపి ఉంచడానికి ఒక మార్గంగా ఉంటుంది. పోటీతో కూడిన నేటి ఉద్యోగ మార్కెట్లో, ఉద్యోగి ప్రయోజనాలనేవి ప్రతిభను ఆకర్షించడంలో మరియు దానిని నిలిపి ఉంచుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్‌తో సహా, సమగ్ర ఉద్యోగి ప్రయోజనాల ప్యాకేజీ అందించడమనేది ఇతర సంస్థలతో పోటీలో పైచేయి సాధించడంలో యజమానులకు సహాయపడగలదు. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ అందించడమనేది యజమానికి పన్ను ప్రయోజనాలను కూడా అందించగలదు. పాలసీ కోసం చెల్లించిన ప్రీమియం అనేది ఆదాయపు పన్ను చట్టం - 1961లోని సెక్షన్ 80D క్రింద ఒక వ్యాపార ఖర్చుగా పన్ను-మినహాయింపు పొందగలదు. ఇది, యజమాని పన్ను బాధ్యతను తగ్గిస్తుంది.

గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ కొనుగోలు చేసేటప్పుడు యజమానులు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?

గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీని ఎంచుకున్నప్పుడు, యజమానులు తప్పనిసరిగా వారి ఉద్యోగులు మరియు వారి కుటుంబాల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రాణాంతక వ్యాధులు, ముందుగా ఉన్న పరిస్థితులతో సహా అనేక రకాల వైద్య ఖర్చుల కోసం పాలసీ తప్పనిసరిగా భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కవరేజీని అందించాలి. యజమానులు వారి ఉద్యోగులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యత ఉందని నిర్ధారించడం కోసం పాలసీకి సంబంధించిన ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంరక్షణ ప్రదాతల నెట్‌వర్క్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే, ఒక గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ అనేది ఏదైనా సంస్థలోని ఉద్యోగి ప్రయోజనాల ప్యాకేజీలో ఒక అవసరమైన భాగంగా ఉంటుంది. ఇది ఉద్యోగుల మరియు వారి కుటుంబాల శ్రేయస్సును నిర్ధారిస్తుంది మరియు యజమానికి ఖర్చు పొదుపులు మరియు పన్ను ప్రయోజనాలు కూడా అందిస్తుంది.

ముగింపు

చివరగా, ఒక గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ అనేది వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత అందించే ఒక అవసరమైన ఉద్యోగి ప్రయోజనంగా ఉంటుంది. ఇది యజమానులు తమ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ ‌‌ను అందించడానికి, నిపుణులను ఆకర్షించడానికి మరియు నిలిపి ఉంచుకోవడానికి మరియు వారి పన్ను బాధ్యతను తగ్గించుకోవడానికి ఒక సరసమైన మార్గం. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ అనేది ఈ ఖర్చు గురించి ఆందోళన చెందకుండా, ఉద్యోగులు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యత కలిగి ఉండటాన్ని నిర్ధారిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌తో సహా సమగ్ర ఉద్యోగి ప్రయోజనాల ప్యాకేజీ అందించడం ద్వారా, యజమానులు ప్రతిభను ఆకర్షించవచ్చు మరియు దానిని నిలిపి ఉంచుకోవచ్చు, ఉద్యోగిలో సంతృప్తి మరియు మనోబలం పెంచుకోవచ్చు, ఇది మరింత ఉత్పాదక శ్రామిక శక్తికి దారితీస్తుంది.   ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి