రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Orthopaedic Surgery Coverage Under Health Insurance
ఆగస్టు 5, 2022

మెడికల్ ఇన్సూరెన్స్ కింద ఆర్థోపెడిక్ సర్జరీ కోసం కవరేజ్

ఒకప్పుడు వృద్ధుల వరకు మాత్రమే పరిమితమై ఉన్న ఆర్థోపెడిక్ సమస్యలు, ఇప్పుడు అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్నాయి. యువత వారి నిశ్చలమైన జీవనశైలి కారణంగా ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్నారు, తద్వారా వారి కీళ్లకు ప్రమాదం జరుగుతుంది. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఈ సమస్య మరింత పెరిగింది, ఇది యువత జీవనశైలిని మరింత దిగజార్చింది. కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌ని అవలంభిస్తున్నందున, ముఖ్యంగా ఉద్యోగం చేసే వారికి ఇది ప్రమాదాన్ని పెంచుతోంది.

ఆర్థోపెడిక్ సర్జరీ అర్థం

ఆర్థోపెడిక్ సర్జరీలు శరీరంలోని మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థపై చేసే చికిత్సలు, ఇవి గాయం లేదా పుట్టుకతో వచ్చే లేదా పొందిన రుగ్మతలు, క్రానిక్ ఆర్థరైటిస్, ఎముకలు, లిగమెంట్స్, టెండన్స్ మరియు ఇతర అనుబంధ కణజాలాలకు తీవ్రమైన గాయాలు వంటి ఇతర వైద్య పరిస్థితుల కారణంగా నిర్వహించబడతాయి. ఈ ఆర్థోపెడిక్ సర్జరీలు ఆర్థ్రోస్కోపీ అనే ప్రక్రియ ద్వారా లేదా సాంప్రదాయకంగా ఓపెన్ సర్జరీ పద్ధతి ద్వారా నిర్వహించబడతాయి. ఆర్థ్రోస్కోపీ ఒక డేకేర్ విధానం అయినప్పటికీ, ఓపెన్ సర్జరీల కోసం రోగి కొన్ని రోజులపాటు ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. అయితే, రెండు సందర్భాల్లోనూ చికిత్స ఖర్చు చాలా ఎక్కువగా ఉండవచ్చు మరియు అలాంటి సమయంలోనే మెడికల్ ఇన్సూరెన్స్ చికిత్స సంబంధిత ఆర్థిక భారాన్ని తగ్గించడానికి అందుబాటులో ఉంటుంది. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

ఆర్థోపెడిక్ సర్జరీ కోసం అయ్యే ఖర్చులు ఏవి?

మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ కోసం అయ్యే చికిత్స ఖర్చులు గణనీయమైనవి కాబట్టి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఉపయోగించి మీ ఆర్థిక స్థితిని కాపాడుకోవడం చాలా అవసరం. సర్జరీ అనేది చికిత్స కోసం ఏకైక ఖర్చు కాదు, కానీ ప్రీ/పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు, కన్సల్టేషన్ ఫీజు, సూచించబడగల ఏవైనా వైద్య పరీక్షలు అనేవి చేయగల కొన్ని ఇతర ఖర్చులు. కొన్నిసార్లు, ఇది చికిత్స ఖర్చులను మరింత పెంచుతుంది. కాబట్టి, రెండవ అభిప్రాయం కూడా అవసరం కావచ్చు. అంతేకాకుండా, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ, జాయింట్ ఆర్థ్రోస్కోపీ, బోన్ ఫ్రాక్చర్ రిపేర్, సాఫ్ట్ టిష్యూ రిపేర్, స్పైన్ ఫ్యూజన్ మరియు డిబ్రైడ్‌మెంట్ లాంటి వివిధ భాగాల చికిత్స రకం ఆధారంగా చికిత్స ఖర్చులు భిన్నంగా ఉంటాయి. ఈ చికిత్స మీరు కష్టపడి సంపాదించిన పొదుపులను హరించివేయవచ్చు, కావున, కొన్ని ఈ విధమైన మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ల సహాయంతో ఇండివిడ్యువల్ కవర్, కుటుంబం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, గ్రూప్ ఇన్సూరెన్స్ కవర్లు, సీనియర్ సిటిజన్ల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఇలాంటి మరికొన్ని ఉపయోగకరంగా ఉంటాయి. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఆర్థోపెడిక్ సర్జరీ కోసం కవరేజ్ అందిస్తాయా?

ఇన్సూరెన్స్ కవర్ రకాన్ని బట్టి, ఆర్థోపెడిక్ సర్జరీలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడతాయి. దాదాపు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తాయి, అయితే, మీరు ప్రీ-ట్రీట్‌మెంట్ ఖర్చుల కవరేజ్ కోసం వెతకాలి. కొన్ని ప్లాన్లు శస్త్రచికిత్స ఉపకరణాల ఖర్చు, ఇంప్లాంట్ల ఖర్చు, డాక్టర్ ఫీజు, గది అద్దె ఛార్జీలు మరియు చికిత్స విధానాల ఆధారంగా ఇతర సారూప్య ఖర్చులను కూడా కవర్ చేస్తాయి. డిశ్చార్జ్ తర్వాత, చాలా సందర్భాల్లో రోగులకు ఫిజియోథెరపీ సిఫార్సు చేయబడుతుంది మరియు అప్పుడు చికిత్స తర్వాత ఖర్చులను కవర్ చేసే పాలసీ ప్రయోజనకరంగా ఉంటుంది. శస్త్రచికిత్స అనేది ఒక డేకేర్ విధానం అయినప్పటికీ, డేకేర్ కవరేజ్ అందించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు పాలసీ పరిధిలోని చికిత్సలను కవర్ చేస్తాయి. చికిత్స ఖర్చును పాలసీ ఎంత వరకు కవర్ చేస్తుంది అనేది ప్లాన్ నిబంధనలు మరియు షరతులపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, మీరు ప్రత్యేకంగా ఆర్థోపెడిక్ చికిత్సలను కవర్ చేసే ప్లాన్‌ను కోరుకుంటే, పాలసీ యొక్క ముఖ్య వివరాలలో పేర్కొన్న వాటిని పూర్తిగా తెలుసుకోవాలి. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

ఆర్థోపెడిక్ చికిత్సలకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా?

అన్ని ఆర్థోపెడిక్ చికిత్సలకు వెయిటింగ్ పీరియడ్ ఉండదు. ప్రారంభంలో 30-రోజుల వెయిటింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత కొన్ని చికిత్సలు కవర్ చేయబడతాయి. అయితే, కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ పీరియడ్ గురించి పేర్కొనబడుతుంది, అది 12 నెలల నుండి 24 నెలల మధ్య ఉండవచ్చు. అంతేకాకుండా, ముందు నుండి ఉన్న ఆర్థోపెడిక్ వ్యాధి చికిత్స కోసం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుందని కూడా మీరు గ్రహించాలి. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి, ఆర్థోపెడిక్ చికిత్సలు ఒక మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా కవర్ చేయబడతాయని గుర్తుంచుకోండి, అలాగే, ఊహించని సంఘటన జరిగినప్పుడు లేదా ప్లాన్ చేయబడిన వైద్య విధానం కోసం కూడా మీరు దీని నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ఒక కొనుగోలుని పూర్తి చేయడానికి ముందు దాని ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించిన మరిన్ని వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/పాలసీ షరతులు మరియు నిబంధలను జాగ్రత్తగా చదవండి.  

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి