క్యాన్సర్ లేదా గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధుల తాకిడి పెరుగుతుంది. Indian Council for Medical Research ప్రకారం, ప్రతి సంవత్సరం పది లక్షల కంటే ఎక్కువ సంఖ్యలో కొత్త క్యాన్సర్ రోగులు భారతదేశంలో గుర్తించబడతారు. The Lancet ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారం గుండె సంబంధిత అనారోగ్యాల వలన కలిగే మరణాల సంఖ్య భారతదేశంలోని పట్టణాల కంటే గ్రామీణ ప్రదేశాలలో ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి గుండె వ్యాధులు వంటి కొన్ని ప్రాణాంతక వ్యాధులకు గురయ్యే అవకాశాన్ని తగ్గించగలదు, అయితే క్యాన్సర్ వంటి ఇతర వ్యాధులను ఊహించలేము. గతంలో ఒక వ్యక్తికి అటువంటి వ్యాధులు సోకే అవకాశాలు తక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి క్లిష్టమైన వ్యాధులతో బాధపడుతున్న ఒక వ్యక్తి గురించి మనం తరచుగా వినిపించవచ్చు,
మూత్రపిండ వ్యాధులు మరియు మరిన్ని. అంతేకాకుండా, ఈ తీవ్రమైన అనారోగ్యాల చికిత్స కోసం అయ్యే ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి మరియు మీకు మరియు మీ కుటుంబానికి తీవ్రమైన ఆర్థిక భారం కలిగించవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, మీరు పొదుపు చేసిన డబ్బు మొత్తం ఖర్చు అయిపోయి మీరు రుణాలను తీసుకోవలసి ఉంటుంది, అది మీ ఆర్థిక లక్ష్యాలను ప్రతికూలంగా ప్రభావితం చేయగలదు. అటువంటి భయానకమైన పరిస్థితులను నివారించడానికి క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను ఎంచుకోవలసిందిగా మీకు సలహా ఇవ్వబడుతుంది. ఒకవేళ మీకు ఇప్పటికే ఒక
మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే, మీరు దానికి ఒక క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌ను జోడించడాన్ని పరిగణించాలి. అలాగే, క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్‌ను ఒక స్టాండ్‌అలోన్ పాలసీగా కూడా కొనుగోలు చేయవచ్చు
తరచుగా ఏర్పడే తీవ్రమైన అనారోగ్యాలు మరియు వాటి చికిత్స కోసం అయ్యే ఖర్చులలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి
1. క్యాన్సర్
క్యాన్సర్ అనేది ఒక జన్యు సంబంధిత రుగ్మత, ఇందులో శరీరంలోని ఒక భాగం లేదా అవయవంలో నియంత్రణ లేకుండా కణాల వృద్ధి జరుగుతుంది మరియు ఇది శరీరంలోని ఇతర భాగాలకు సోకే అవకాశం ఉంది. అటువంటి కణాల పెరుగుదలకి క్యాన్సర్ ప్రేరక కణాలు కారణం. అటువంటి నియంత్రణ లేని కణాల వృద్ధి క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలుగా ఉండే గడ్డలు ఏర్పడటానికి కారణం అవుతాయి. క్యాన్సర్ అనేది వేగంగా ప్రబలుతున్న వ్యాధులలో ఒకటి, దీని కోసం ఎక్కువ మంది హెల్త్ కవర్‌ను ఎంచుకుంటున్నారు. అత్యధికంగా ఉండే చికిత్స ఖర్చు వలన చికిత్స పొందడానికి ఒక క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం. Indian Council of Medical Research (ICMR) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం క్యాన్సర్ వలన మరణాలు 2020 నాటికి 8.8 లక్షలను దాటుతుంది. కుటుంబంలోని సంపాదించే వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లయితే, అది కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కీమోథెరపీ మరియు ఔషధాలతో పాటు క్యాన్సర్ చికిత్సకు చెక్-అప్‌ల కోసం అనేక సందర్శనలు అవసరం. ఈ మందులు చవకగా ఉండవు మరియు ఒక
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ ప్లాన్ ఉపయోగపడుతుంది. కీమోథెరపీ ధర రూ.1 నుండి రూ.2 లక్షల మధ్య ఎక్కడైనా ఉంటుంది, మరియు మందుల కోసం అయ్యే ఖర్చు రూ.75,000 నుండి రూ.1 లక్ష మధ్య ఉంటుంది. మొత్తంగా, వ్యాధి తీవ్రతను బట్టి క్యాన్సర్ చికిత్సల కోసం మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు.
2. గుండె అనారోగ్యాలు
కార్డియోవాస్కులర్ వ్యాధుల కారణంగా సంభవించే మరణాలలో గణనీయమైన పెరుగుదల ఉంది. ప్రముఖ కారణాల్లో స్ట్రోక్ మరియు ఐసెమిక్ గుండె వ్యాధి ఒకటి. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, అధిక కొలెస్ట్రాల్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, ఒత్తిడి, హైపర్‌టెన్షన్, ఊబకాయం మరియు ధూమపానం వంటివి కార్డియోవాస్కులర్ అనారోగ్యాల సంఖ్య పెరుగుదలకు కొన్ని ప్రాథమిక కారణాలు. కరోనరీ ఆర్టరీ వ్యాధి, పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి, పల్మనరీ స్టెనోసిస్ మరియు డైలేటెడ్ కార్డియోమయోపతి అనేవి భారతదేశంలో ప్రబలంగా ఉన్న గుండె వ్యాధులకు కొన్ని సాధారణ రూపాలు. గుండె అనారోగ్యాలలో పెరుగుదలకు ప్రాథమిక కారణం జీవనశైలిలో మార్పులు. ఈ కార్డియోవాస్కులర్ సమస్యలకు చికిత్స చాలా ఖరీదైనది. ఇది రూ.3 లక్షల నుండి ప్రారంభం కావచ్చు మరియు మీ గుండె పరిస్థితి యొక్క సంక్లిష్టత ప్రకారం ఇంకా పెరగవచ్చు. అంతేకాకుండా, ఈ చికిత్సలకు నిరంతర ఫాలో-అప్ ఉంటుంది, ఇది భారీ హాస్పిటల్ బిల్లులకు కారణం అవుతుంది. అటువంటి సమయాల్లో, ఏకమొత్తపు చెల్లింపు సౌకర్యంతో మీ పొదుపులను సురక్షితం చేసుకోవడానికి ఒక క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ మీకు సహాయపడుతుంది. ఇది ఒక ప్రత్యేక సదుపాయంలో ఒక స్పెషలిస్ట్ మెడికల్ ప్రొఫెషనల్ నుండి సరైన చికిత్స పొందడంలో మీకు సహాయపడుతుంది.
3. మూత్రపిండ వ్యాధులు
పది వ్యక్తులలో ఒకరు మూత్రపిండాల రుగ్మతతో బాధపడుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చికిత్స సాధ్యమైనప్పటికీ ఇతర చికిత్సలతో పోలిస్తే అది చాలా ఖరీదైనది. కిడ్నీ రుగ్మత లేదా సరిగ్గా పనిచేయకపోవడం కోసం చికిత్స అందించడానికి డయాలసిస్ మరియు కిడ్నీ రీప్లేస్‌మెంట్ చేయవలసి ఉంటుంది. కిడ్నీ రుగ్మతతో బాధపడే వారిలో అందరు రీప్లేస్‌మెంట్ ఖర్చును భరించలేరు మరియు ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే డయాలిసిస్ కోసం అయ్యే ఖర్చును భరించగలరు. ఈ సంఖ్య ఆశ్చర్యానికి గురి చేయవచ్చు, ఎందుకంటే డయాలసిస్ చికిత్స కోసం అయ్యే ఖర్చు రూ.18,000 - రూ.20,000 వరకు ఉంటుంది మరియు ఒక ట్రాన్స్‌ప్లాంట్ కోసం పూర్తిగా సరిపోలే కిడ్నీ దొరకడం చాలా కష్టం మరియు దాని కోసం అయ్యే ఖర్చు రూ. 6.5 లక్షలను దాటవచ్చు. అంతేకాకుండా, ఒక విజయవంతమైన ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత స్టెరాయిడ్స్, సప్లిమెంట్స్ మరియు ఇమ్యూనోసప్రెసెంట్స్ పై ఆధారపడటం పెరుగుతుంది, దీని కోసం దాదాపుగా రూ.5,000 నిరంతరంగా ఖర్చు అవుతుంది. తరచుగా అయ్యే ఈ వైద్య ఖర్చులు మీకు ఆర్థిక భారాన్ని కలిగించవచ్చు మరియు ఒక క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం అనేది మీ చికిత్స ఖర్చులో చాలా వరకు కవర్ చేయగలదు.
4. లివర్ సిర్రోసిస్
లివర్ సిర్రోసిస్ కేసుల సంఖ్య పెరుగుతుంది, ప్రతి సంవత్సరం దాదాపుగా 10 లక్షల మందికి ఈ వ్యాధి సోకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, దేశంలో సంభవించే మరణాలలో పదవ వంతుకు ఇది కారణం అవుతుంది. సిర్రోసిస్ రోగ నిర్ధారణ జరిగిన తరువాత, కాలేయ మార్పిడి ఒక్కటే అందుబాటులో ఉన్న చికిత్స, ఇది చేయకపోతే కొన్ని సంవత్సరాలలో రోగి మరణించే అవకాశం ఉంది. దీని చికిత్స కోసం అవయవ మార్పిడి తప్ప వేరొక ప్రత్యామ్నాయం లేనందున, ఇది చాలా ఖరీదైనది మరియు రూ.10 - రూ.20 లక్షల వరకు ఉండవచ్చు. అంతేకాకుండా, సరైన దాతను కనుగొనడం కూడా కష్టం. అలాగే, అవయవ మార్పిడి తర్వాత, ఇమ్యూనోసప్రెసెంట్ల అవసరం ఉంటుంది, ఇది ఖర్చును మరింత పెంచుతుంది మరియు ఇటువంటి పరిస్థితులలో ఒక క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను కలిగి ఉండడం ఒక వరంగా మారుతుంది.
5. అల్జీమర్ వ్యాధి
పెరుగుతున్న వృద్ధుల సంఖ్యతో పాటు వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తికీ అల్జీమర్స్ సోకే ప్రమాదం కూడా పెరుగుతుంది. 2017 యొక్క ఇండియా ఏజింగ్ రిపోర్ట్ వృద్ధుల పెరుగుదల రేటు దాదాపుగా 3% అని పేర్కొంది. దీని ప్రకారం రాబోయే కాలంలో అల్జీమర్ కేసులు పెరిగే అవకాశం ఉంది. అల్జీమర్ చికిత్స కోసం ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్‌ని మరియు రికరింగ్ డోస్లు తరచుగా తీసుకోవడం అవసరం. ఈ మందుల కోసం నెలకు ₹40,000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అనారోగ్యం తీవ్రతకు తగినట్లుగా ఔషధాలను పెంచాలి మరియు ఇది ఔషధాల కోసం మీరు చేసే ఖర్చును కూడా పెంచుతుంది.
ముగింపు
ఆరోగ్య సంరక్షణ కోసం పెరుగుతున్న ఈ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయమని సిఫారసు చేయబడుతుంది. దీని వలన చికిత్స కోసం అయ్యే ఖర్చు కవర్ చేయబడటమే కాక కష్ట సమయాల్లో మీ కుటుంబానికి అవసరమైన ఆర్థిక మద్దతు లభిస్తుంది.
రిప్లై ఇవ్వండి