రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
డబ్బు సంపాదించడం అనేది ఒక కళ అలాగే మంచి వ్యాపారం చేయడం ఉత్తమమైన కళ అని చెబుతారు. పికాసో లేదా లియోనార్డో డా విన్సి? మీరే ఎంచుకోండి. మా కళాత్మక నైపుణ్యాలు గొప్పగా ఉండవు కానీ కమర్షియల్ ఇన్సూరెన్స్ పరిష్కారాలను అందించడంలో మాకు మంచి నైపుణ్యం ఉంది.
మీ వ్యాపారాన్ని నిర్వహించడం అనేది ఒక కళని సృష్టించడం వంటిది. ప్రాణములేని కాన్వాస్‌ను అందమైన కళాఖండంగా మార్చే బ్రష్ స్ట్రోక్స్ లాగా, మీరు తెలివైన వ్యాపార నిర్ణయాలు తీసుకున్నప్పుడే మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. కానీ ఒకవేళ రేపు ప్రకృతి విపత్తు లేదా మానవుల వలన కలిగే విపత్తు ఎదురై అన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతే?!
వ్యాపారంలో అనిశ్చితి అనేది వాస్తవం. అన్నీ సరిగ్గా ఉంటే, ఎప్పుడూ తప్పు జరగదు మరియు విపత్తులు కూడా ఉండవు. కానీ వాస్తవానికి, కేవలం మీ అదృష్టాన్ని నమ్ముకోవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకనే, ఒక సీనియర్ మేనేజర్ లేదా వ్యాపార యజమానిగా, రిస్క్ మరియు కంటింజెన్సీ మానేజ్మెంట్ ప్లాన్లు పై మీరు అధిక సమయం వెచ్చిస్తారు.
వ్యాపార ప్రక్రియలలో తిరిగి పుంజుకునే సామర్థ్యాన్ని నిర్మించడానికి దీర్ఘకాలిక దృక్పథం అవసరం. ఒక సంక్షోభం ఎదురైనప్పుడు నష్టాలను నివారించడానికి మీకు తగినంత వనరుల కేటాయింపు, విశ్వసనీయ IT పరిష్కారాలు మరియు సరిగ్గా నిర్వచించబడిన ఫలితాలు అవసరం.
వ్యాపార నష్టాలు అనేక విధాలుగా సంభవిస్తాయి. భూకంపాలు, అగ్నిప్రమాదాలు లేదా వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి కార్మిక సమస్యలు మరియు వ్యాజ్యాల వరకు. మీ వ్యాపార అభివృద్ధి పై దృష్టిని నిలపడానికి మీ మేనేజ్‌మెంట్ బృందానికి తగినంత కవరేజ్ అవసరం. కమర్షియల్ ఇన్సూరెన్స్‌తో, మీరు అటువంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవచ్చు మరియు సమస్య ఏర్పడినప్పుడు కాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు.
2001 నుండి, పలు రంగాలు మరియు ప్రదేశాలలో, వ్యాపారాలు సమస్యలను ప్రశాంతంగా మరియు సులభంగా ఎదుర్కొనేందుకు బజాజ్ అలియంజ్ సహకారం అందించింది. భారతదేశంలోని కొన్ని ప్రముఖ కార్పొరేట్లు వారి ఇన్సూరెన్స్ అవసరాల కోసం మా పరిష్కారాలపై ఆధారపడుతున్నాయి.
మీ వ్యాపారాన్ని అస్థిరపరిచే అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు కమర్షియల్ ఇన్సూరెన్స్ మీకు అదనపు ఎంపికలను అందిస్తుంది. ఒక బలమైన మరియు భవిష్యత్తు కోసం సంసిద్ధంగా ఉండి, వ్యాపార సవాళ్ళను అభివృద్ధికి కొత్త అవకాశాలుగా మార్చుకోగలిగే సామర్థ్యం కలిగిన వ్యాపారాలకు ఇది పునాదిగా నిలుస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యాపార నిర్ణయాలను తీసుకునే విధంగా బజాజ్ అలియంజ్ కమర్షియల్ ఇన్సూరెన్స్ మీకు దోహదపడుతుంది.
మీ వ్యాపారాన్ని విజయపథంలో నిలపడానికి ఇది సరైన సమయం అని మీకు అనిపించడం లేదా? బజాజ్ అలియంజ్ కమర్షియల్ ఇన్సూరెన్స్ పరిష్కారాలు మీ అభివృద్ధి కోసం అనువైనవి.
మీ వ్యాపారం కోసం సరైన ఇన్సూరెన్స్ పరిష్కారాన్ని ఎంచుకోవడం అనేది మీరు నిర్వహిస్తున్న పరిశ్రమ పై ఆధారపడి ఉంటుంది. మీరు పిజ్జా ఫ్రాంచైజీని కలిగి ఉంటే మీ కమర్షియల్ ఇన్సూరెన్స్ అవసరాలు, ఒక కమర్షియల్ ఆర్గానిక్ ఫార్మ్ బిజినెస్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను జాగ్రత్తగా అంచనా వేసి వాటిని పరిష్కరించడానికి ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ అవసరమో నిర్ణయించుకోండి.
స్థూలంగా, ప్రతి వ్యాపారం తన ప్రాథమిక అసెట్స్ అయిన ఆఫీసులు లేదా వేర్‌హౌజులు మరియు వాటిలో పని చేసే ఉద్యోగులకు రక్షణ కలిపించాలి. కారణాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి:
వ్యాపార స్థలం
ప్రతి వ్యాపారం, అది చిన్నదైనా, పెద్దది అయినా లేదా మధ్య స్థాయిలో ఉన్నా, ఆ విషయంతో సంబంధం లేకుండా దాని రిజిస్టర్ ఆఫీసు, వేర్‌హౌజులు లేదా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సంరక్షించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో, మీ వ్యాపారం సాధ్యమైనంత త్వరగా కార్యాచరణ స్థితికి చేరుకుంటుందని నిర్ధారించడానికి ఇది చాలా సహకరిస్తుంది.
అసెంబ్లీ లైన్లు మరియు కార్యాలయాలు వంటి స్థిర ఆస్తులలో మీ పెట్టుబడికి తగిన రక్షణ అవసరం. అందుకోసం కమర్షియల్ ఇన్సూరెన్స్ సిఫార్సు చేయబడుతుంది.
ఆపరేషనల్ రిస్కులు
రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు, అనిశ్చితి పరిస్థితులు తలెత్తవచ్చు. కార్మిక అశాంతి, అంతరాయాలు మరియు ఉత్పత్తి సమస్యల వలన మీరు సకాలంలో డెలివరీ చేయలేకపోవచ్చు మరియు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అటువంటి అత్యవసర పరిస్థితులు మీ వ్యాపారానికి నష్టం కలగజేయకుండా ఉండడానికి, కమర్షియల్ ఇన్సూరెన్స్ లయబిలిటీ రక్షణను ఎంచుకోండి.
ఉద్యోగి ప్రయోజనాలు
ఏదైనా వ్యాపారంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఆ సంస్థలోని ఉద్యోగులు. రోజువారీ తయారీ కార్యకలాపాలు లేదా గూడ్స్ అసెంబ్లీ మరియు సేవల డెలివరిలో మీ ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను పరిగణనలోకి తీసుకోండి.
సహోద్యోగి మరణం లేదా శాశ్వత వైకల్యానికి దారితీసే అత్యవసర పరిస్థితుల్లో, మీ వ్యాపారం ప్రతికూలంగా ప్రభావితం కాదని నిర్ధారించుకోవడానికి తగిన ఉద్యోగుల బీమాను అందించడం అనేది మీకు సహాయంగా ఉంటుంది.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
మీ కార్యాలయ ప్రాంగణం మీ రెండవ ఇల్లు లాంటిది. మీరు మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి లెక్కలేనన్ని రోజులు మరియు నిద్రలేని రాత్రులు గడుపుతారు మరియు చాలా వాటిని పణంగా పెట్టవలసి వస్తుంది.
సముద్రం ద్వారా మీ ఉత్పత్తులను రవాణా చేయడం తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు నమ్మదగినది, కానీ సముద్రంలో పరిస్థితులు ఊహించని విధంగా ఉంటాయి. ఇవే కాదు. తయారైన సరుకులను ఫ్యాక్టరీ నుండి పోర్టు వరకు రవాణా చేయడంలో కూడా కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి.
ఒక దావా వలన మీకు చాలా డబ్బు ఖర్చవుతుంది మరియు అనవసరమైన ఒత్తిడికి దారి తీస్తుంది. మీ వ్యాపారం పలు ప్రదేశాలలో విస్తరించి ఉంటే ప్రమాదం రెట్టింపవుతుంది.
ఉద్యోగులు యజమానుల పై దాఖలు చేసిన దావాలు పెరుగుతున్నాయి మరియు ఇటువంటి సందర్భాలు, ఇతర దావాల మధ్య, మీ వ్యాపారాన్ని గణనీయమైన ఆర్థిక మరియు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్టుతో కలిగే నష్టాల గురించి మీకు బాగా తెలుసు. ఒకవేళ మీ ఇంజనీరింగ్ ప్రాజెక్టు అమలులో ఏవైనా సమస్యలు ఎదురైతే, ఖర్చు మరియు జాప్యం అనేవి మీ వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
ఆయిల్ మరియు గ్యాస్ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ లూసియానా తీరంలో 2010 లో జరిగిన "డీప్ వాటర్ హొరైజన్" విస్ఫోటనను ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. అలాంటి పొరపాట్లు మిమ్మల్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టగలవు.
మీ ఉద్యోగి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు లేదా ఆసుపత్రిలో చేరినపుడు మీరు ఒక మంచి యజమానిగా అతని వైపు నిలబడాలని కోరుకుంటారు. నేడు భారీగా పెరిగిన వైద్య ఖర్చులతో, ఉద్యోగి ప్రయోజనాలను అందించడం అనేది మీ ఆర్థిక స్థితని దెబ్బతీస్తుంది.
మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని, పలు ప్రదేశాల్లో దానిని విస్తరించాలని కలలు కంటున్నారా? నష్ట భయం మిమ్మల్ని దీనిని సాధించకుండా ఆపుతుందా? బజాజ్ అలియంజ్ అందించే ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్‌తో ఇప్పుడు మీరు మీ చింతలను దూరం చేసుకోవచ్చు.
వ్యాపారంలో నష్టాలు అనేవి వ్యాపారంలో వృద్ధి మరియు విస్తరణకు కొత్త అవకాశాలను సూచిస్తాయి. కమర్షియల్ ఇన్సూరెన్స్‌తో మీరు విజయం సాధించడానికి తగిన రిస్కులను తీసుకోవచ్చు. మంచి విషయం ఏమిటంటే, మనఃశాంతిని మరియు రాత్రుల్లో మంచి నిద్రను అందించే వివిధ రకాల ఇన్సూరెన్స్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి,.
కమర్షియల్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.
ఆస్తి కోసం రక్షణ
మీకు షాప్ లేదా ఆఫీస్ ఏది ఉన్నప్పటికీ, మీకు వ్యాపారానికి ఆదాయం, గుర్తింపుని తీసుకువచ్చే ఉత్పత్తులను లేదా సేవలను మీరు సృష్టించే ప్రదేశమే మీ వ్యాపార ప్రాంగణంగా గుర్తించబడుతుంది. బజాజ్ అలియంజ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ మీ వ్యాపార స్థలాన్ని వివిధ రకాల ప్రమాదాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది మరియు మీ పరిశ్రమలో నూతన ఆవిష్కరణలు చేసి గొప్పగా రాణించడంలో మీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది.
మీ ఉద్యోగులను రక్షించడం
మీ ఉద్యోగులే మీ నిజమైన ఆస్తులు అని మాకు తెలుసు. మీ ఉద్యోగులకు తగిన కవర్‌ను అందించడం ద్వారా మీ సంస్థ యొక్క విజయానికి దోహదపడేలా వారిని ప్రోత్సహించవచ్చు.
గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ లేదా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ మీ సిబ్బందిలో శ్రేయస్సుని ప్రోత్సహించడమే కాకుండా, వారిలో అందరం ఒకటే అనే స్ఫూర్తిని కూడా సృష్టిస్తుంది. మా ఉద్యోగుల బెనిఫిట్ ప్లాన్లను ఎంచుకోవడం ద్వారా మీరు, మీ ఉద్యోగుల పురోగతికి కట్టుబడి ఉన్నారని తెలియజేయండి.
లయబిలిటీల నుండి రక్షణ
బిజినెస్ లయబిలిటీ అనేది ఏ క్షణంలోనైనా తలెత్తవచ్చు, అది మీ వ్యాపారాన్ని చిక్కుల్లో పడేస్తుంది. పని ప్రదేశంలో జరిగే ప్రమాదాల వలన కలిగే గాయాల నుండి వినియోగదారు ఫిర్యాదుల వరకు ఎదురయ్యే ఊహించని వ్యాపార నష్టాల నుండి మీకు తగినంత రక్షణ అవసరం. లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన కమర్షియల్ ఇన్సూరెన్స్ , ఇది మిమ్మల్ని చట్టపరమైన లయబిలిటీల నుండి కవర్ చేస్తుంది.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
డిస్‌క్లెయిమర్
వెబ్సైట్లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి