Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్ మరియు మెషినరీ బ్రేక్‌డౌన్ ఇన్సూరెన్స్

Engineering insurance & machinery breakdown insurance by Bajaj Allianz

మీ వివరాలను తెలియజేయండి

 
దయచేసి కేటగిరీని ఎంచుకోండి
దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి కంపెనీ పేరు ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే సంప్రదింపు వివరాలను ఎంటర్ చేయండి
 
దయచేసి ప్రదేశం/నగరం ఎంచుకోండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్

ఇంజనీరింగ్ మరియు నిర్మాణ పరిశ్రమలు పూర్తిగా వేర్వేరు విషయాలు మరియు అవి నిర్దిష్ట అవసరాలను కలిగి ఉంటాయి. మేము, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, మీ ఇంజనీరింగ్ మరియు కన్‌స్ట్రక్షన్ ఇన్సూరెన్స్ అవసరాల కోసం ప్రత్యేకమైన కవర్‌లను అందిస్తున్నాము.

ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్ కవర్ అంటే ఏమిటి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు సరైన చోటికి వచ్చారు. ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్ పాలసీలు పరిశ్రమలోని అనిశ్చితితో కూడుకున్న రిస్కుల నుండి మీకు ఆర్థిక రక్షణ కల్పిస్తాయి. ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్‌లో ప్రతిదీ కవర్ చేయబడుతుంది, పని ప్రదేశంలో మెషినరీ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు లేదా అది నిలిపి ఉంచినప్పుడు లేదా వ్యాపారంలో అంతరాయం ఏర్పడినప్పుడు.

బజాజ్ అలియంజ్‌ వద్ద మా రిస్క్ కన్సల్టింగ్, క్లెయిమ్‌లు మరియు అండర్‌రైటింగ్ బృందాలు, అతిపెద్ద ఇంజనీరింగ్ రిస్కులు మరియు నిర్మాణ ప్రాజెక్టులను నిర్వహించడం వంటి నైపుణ్యాన్ని, ఆచరణాత్మక అనుభవాన్ని కలిగి ఉండడమే కాకుండా, మీ వ్యాపారం మీకు ఎంత ముఖ్యమైనదో అని అర్థం చేసుకొని అత్యంత శ్రద్ధ వహిస్తాయి.

మా క్లెయిమ్స్, రిస్క్ కన్సల్టింగ్ మరియు అండర్‌రైటింగ్ బృందాలతో మాత్రమే కాకుండా, క్లయింట్ మరియు క్లయింట్ యొక్క ప్రొఫెషనల్ బృందం సహా అన్ని పార్టీల మధ్య, మా ముఖ్యమైన అకౌంట్ మానేజ్మెంట్ ఫిలాసఫీ ద్వారా సరైన అనుసంధానం ఏర్పరచడం ద్వారా మీ ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్ పాలసీల సేవలను అందిస్తాము.

ఈ ఫిలాసఫీ మా నిపుణుల బృందాల భాగస్వామ్య నైపుణ్యం ఆధారంగా స్థాపించబడింది: పవర్ మరియు యుటిలిటీలు, ఆయిల్ మరియు గ్యాస్, నిర్మాణాలు, భారీ పరిశ్రమలు, ప్రధాన భారీ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు మరియు రవాణా వ్యవస్థలు వంటి నిర్దిష్ట ఇంజనీరింగ్ రిస్క్ తరగతులను కవర్ చేస్తుంది.

మేము మా క్లయింట్‌లు మరియు వారి సలహాదారులతో అన్ని విషయాలను కూలంకుషంగా చర్చించమని ప్రోత్సహిస్తాము, దీని ద్వారా అన్ని పక్షాల మధ్య ఒక ఆచరణీయమైన పద్ధతి మరియు పరస్పర అవగాహన వృద్ధికి ఆస్కారం కలిపిస్తాము. మేము అందించే అన్ని రకాల ఇంజినీరింగ్ ఇన్సూరెన్స్ పాలసీలు మీ వ్యాపార స్వభావానికి తగినట్లుగా జాగ్రత్తగా రూపొందించబడ్డాయి మరియు అత్యంత అనుకూలంగా ఉండే విధంగా కస్టమైజ్ చేయబడ్డాయి. 

ఎరెక్షన్ ఆల్ రిస్క్స్ (EAR) ఇన్సూరెన్స్

    ప్లాంట్ మరియు మెషినరీ మీ వ్యాపారానికి కీలకంగా ఉన్నట్లయితే, మీకు ఇప్పటికే వాటి ఇన్‌స్టాలేషన్ లేదా స్థాపనకి సంబంధించిన రిస్కుల పై అవగాహన కలిగి ఉంటారు; ఆర్థికపరంగా వాటి ప్రభావాలు కూడా తీవ్రంగా ఉంటాయి.

    మా ఎరెక్షన్ ఆల్ రిస్క్స్ (EAR) ఇన్సూరెన్స్ పాలసీ అనేది మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ప్లాంట్‌ల స్థాపన మరియు/లేదా ఇన్‌స్టాలేషన్ సమయంలో జరిగే నష్టాలను కవర్ చేయడానికి రూపొందించబడిన ఒక రకం ఇంజినీరింగ్ ఇన్సూరెన్స్ పాలసీ. టెస్టింగ్ మరియు కమిషనింగ్ సమయంలో జరిగే నష్టాలను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.

    మీ కంపెనీ ఒక కొత్త ప్రాజెక్టుని ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుని విస్తరించడం లేదా ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుని తీసివేసి తిరిగి ఏర్పాటు చేయడం కోసం ఎరెక్షన్ ఆల్ రిస్క్ పాలసీ సమగ్రమైన కవరేజీని అందిస్తుంది. మొదటి సరుకును అన్‌లోడ్ చేసిన సమయం నుండి దాని టెస్టింగ్ వరకు కవరేజీ లభిస్తుంది.

కాంట్రాక్టర్స్ ఆల్ రిస్క్స్ ఇన్సూరెన్స్

    ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ అనేది పేక ముక్కలతో చేసిన ఇల్లు లాంటిది - ఒక తప్పుడు కదలికతో అన్నీ ఒక్కసారిగా కుప్పకూలుతాయి. ప్రమాదాలు కేవలం ఆర్థిక నష్టాలకు మాత్రమే కాకుండా, శరీర గాయాలను కూడా కలిగించవచ్చు. ప్రమాదాలు అనేవి సైట్‌లో ముందుగా పూర్తిచేసిన పనిని కూడా దెబ్బతీస్తాయి మరియు గడువు తేదీలను చేరుకోవడం అసాధ్యమవుతుంది.

    కన్‌స్ట్రక్షన్ సైట్లలో ఇటువంటి భయాలు ఉంటాయని తెలిసి, వ్యాపారంలోకి అడుగుపెట్టడం అనేది మీలాంటి ధైర్యవంతులకు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ, మీకు తగిన రక్షణ అవసరం మరియు మేము, బజాజ్ అలియంజ్ వద్ద, మీ వ్యాపారానికి భద్రత కల్పించడానికి కాంట్రాక్టర్స్ ఆల్ రిస్క్స్ ఇన్సూరెన్స్‌ని అందిస్తున్నాము.

    కాంట్రాక్టర్స్ ఆల్ రిస్క్స్ (CAR) ఇన్సూరెన్స్, ప్రధానంగా అన్ని రకాల పౌర నిర్మాణ ప్రాజెక్టులను (భవనాలు, కర్మాగారాలు, రోడ్లు, వంతెనల నిర్మాణం వంటివి… ) కవర్ చేసే సమగ్ర ఇన్సూరెన్స్. ఇది ప్రత్యేకంగా మినహాయించినవి కాకుండా, ఏదేని కారణం చేత దెబ్బతిన్న లేదా నాశనం చేయబడిన ఆస్తికి కవరేజీని అందిస్తుంది.

కాంట్రాక్టర్స్ ప్లాంట్ మరియు ఎక్విప్‌మెంట్

    ప్లాంట్ మరియు ఎక్విప్‌మెంట్‌లు కన్‌స్ట్రక్షన్ సైట్‌లలో చేసే ఏ పనినైనా సులభతరం చేస్తాయి. అన్ని భారీ పనులను అవే చేస్తాయి. మీ ప్లాంట్ మరియు ఎక్విప్‌మెంట్‌కు ఏదైనా నష్టం జరిగితే కన్‌స్ట్రక్షన్ సైట్‌లో పని పూర్తిగా ఆగిపోతుంది, ఇలా జరగడాన్ని మీరు ఎన్నడూ కోరుకోరు.

    అటువంటి సందర్భంలో మీరు మీ ప్లాంట్ మరియు ఎక్విప్‌మెంట్‌కు త్వరగా రిపేర్ చేయించవలసి ఉంటుంది, లేదా భర్తీ చేయవలసి ఉంటుంది. కానీ, అది అంత సులువైనది కాదు మరియు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది.

    బజాజ్ అలియంజ్ కాంట్రాక్టర్స్ ప్లాంట్ మరియు ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ మీ కోసం రిపేర్ మరియు / లేదా ఇన్‌స్టాలేషన్ ఖర్చులను భరిస్తుంది, తద్వారా కన్స్ట్రక్షన్ సైట్‌లోని పనులు త్వరగా ప్రారంభమవుతాయి మరియు సజావుగా కొనసాగవచ్చు. 

ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్

    కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, కంపెనీల రోజువారీ కార్యకలాపాలను సులభంగా మరియు సమర్థవంతంగా నడపడానికి వీలు కల్పిస్తాయి. మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఏదైనా నష్టం జరిగితే, మీ వ్యాపారం పనితీరు చతికిలబడుతుంది మరియు అనేక అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుంది.

    బజాజ్ అలియంజ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఎలక్ట్రానిక్ పరికరాలను భౌతికపరమైన డ్యామేజీ నుండి డేటా కోల్పోవడం వరకు అన్ని రకాల ప్రమాదాలను కవర్ చేస్తుంది.

    ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ అనేది, పాలసీలో మినహాయించబడని అకస్మాతుగా మరియు ఊహించని భౌతిక ప్రమాదం వలన ఎలక్ట్రానిక్ పరికరానికి ప్రమాదవశాత్తుగా, ఊహించని మరియు ఆకస్మిక భౌతికపరమైన నష్టం లేదా డ్యామేజీని కవర చేస్తుంది.

    కంప్యూటర్‌లు, ప్రింటర్‌లు, స్కానర్‌లు, సర్వర్‌లు మరియు డేటా స్టోరేజ్ పరికరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ పాలసీలో కవర్ అవుతాయి.

మెషినరీ బ్రేక్‌డౌన్ ఇన్సూరెన్స్

    మెషనరీ బ్రేక్‌డౌన్ అనేది వ్యాపారంలో జరిగే అతిపెద్ద దుర్ఘటనలలో ఒకటి ఎందుకనగా, మెషనరీ మరియు పరికరాలు లేకుండా ఉత్పత్తి అసాధ్యం అవుతుంది, డెలివరీ షెడ్యూల్స్ సాధారణంగా కఠినంగా ఉంటాయి. వాటిని చేరకపోవడం అనేది జరిమానాలు మరియు ఉద్రిక్త వ్యాపార సంబంధాలకు దారితీస్తుంది.

    ఊహించని సంఘటనలు జరిగినప్పుడు నిధులను కలిగి ఉండటం అనేది ప్రతీసారి సాధ్యం కాదు. అటువంటి సందర్భంలో బ్యాకప్ ప్లాన్ కలిగి ఉండటం అవసరం మరియు మా మెషినరీ బ్రేక్‌డౌన్ ఇన్సూరెన్స్ పాలసీ ఖచ్చితంగా అందుకు సహకరిస్తుంది. 

    ఒకవేళ మీ మెషినరీ అకస్మాత్తుగా బ్రేక్‌డౌన్‌కు గురైన సందర్భంలో ఈ మెషినరీ బ్రేక్‌డౌన్ పాలసీ దానిని కవర్ చేస్తుంది.

రిస్క్ మేనేజ్‌మెంట్ సేవలు

    కొందరు నిపుణులు, బిజినెస్ మరియు రిస్క్ అనేవి ఒకే నాణెంకు ఉండే ఇరువైపులని చెబుతుంటారు. స్వంత వ్యాపారాన్ని నడుపుతున్నప్పుడు మీరు వారి మనోభావాలను అర్థం చేసుకోవచ్చు. ‘చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం’ అనే సామెతను గుర్తు చేసుకుంటూ, నష్టాలను నివారించడానికి మరియు వాటి ప్రభావాన్ని తగ్గించడానికి వ్యూహాత్మక చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.

    బజాజ్ అలియంజ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, సంభావ్య ప్రమాదాలను అంచనా వేయడం మరియు నిరోధించడం మాత్రమే కాకుండా మీ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో సహాయం చేస్తుంది. ఇది ఆర్థికంగా పడే ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు మీ సంస్థ సజావుగా కార్యకలాపాలు నిర్వహించేలా తోడ్పడుతుంది.

    మా ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్ పాలసీలో చేరికలు మరియు మినహాయింపుల గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు మా ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్ PDF ని చదువుకోవచ్చు.

బాయిలర్ ప్రెజర్ ప్లాంట్ (BPP)

    బాయిలర్ ఇన్సూరెన్స్ మీ బాయిలర్లకు (అగ్నిప్రమాదం కాకుండా), ప్రెజర్ ప్లాంట్లకు విస్ఫోటనం లేదా కుప్పకూలడం వంటి అనుకోని ప్రమాదాల కారణంగా జరిగే నష్టం నుండి రక్షణ కలిపిస్తుంది.

    అదనపు ప్రీమియం చెల్లింపు పై ఓనర్స్ సరౌండింగ్ ప్రాపర్టీ మరియు థర్డ్ పార్టీ లయబిలిటీ వంటి కొన్ని పొడిగింపులు ఈ పాలసీలో అందుబాటులో ఉన్నాయి.

    పాలసీ షరతుల ప్రకారం వారంటీకి అనుగుణంగా ప్రభుత్వం నియమించిన ఇన్‌స్పెక్టర్లు లేదా స్వతహా నియమించిన సమర్థులైన వ్యక్తిచే మీరు ప్రతి సంవత్సరం బాయిలర్ మరియు ప్రెజర్ ప్లాంట్‌ను తనిఖీ చేయించడాన్ని మేము సిఫారసు చేస్తాము.

కమర్షియల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి