Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ

Public liability insurance, product liability insurance and more by Bajaj Allianz

మీ వివరాలను తెలియజేయండి

 
దయచేసి కేటగిరీని ఎంచుకోండి
దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి కంపెనీ పేరు ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే సంప్రదింపు వివరాలను ఎంటర్ చేయండి
 
దయచేసి ప్రదేశం/నగరం ఎంచుకోండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

లయబిలిటీ ఇన్సూరెన్స్

ఎప్పటికప్పుడు ఏర్పడే వ్యాపార రిస్కులతో మీ వ్యాపారం, సొరచేపలతో నిండిన సముద్రం మధ్యలో చిక్కిన ఒక గాయపడిన వ్యక్తిలా ఉంటుంది. అవి రక్తం వాసన గ్రహిస్తాయి, వాటికి దయ అనే భావనకు అర్థం తెలియదు.

మీ వ్యాపార నిర్మాణం ఎంత ధృడంగా ఉన్నా, నిరంతరం మారే వ్యాపార పరిస్థితులలో ఇది అనేక రకాల నష్టాలకు గురి అయ్యే అవకాశం ఉంది. ఒక కస్టమర్ నుండి ఉద్యోగి వరకు మీ వ్యాపారంపై అనేక క్లెయిమ్‌లు చేయవచ్చు.

అటువంటి క్లెయిములు మీ వ్యాపారాన్ని ఒక భారీ నష్టాన్ని చవిచూసేలా చేస్తాయి, మీ నగదు ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి మరియు మీ వ్యాపార రోజువారీ కార్యకలాపాలకు భంగం కలిగిస్తాయి. అయితే, వ్యాపారం ప్రారంభించే సమయంలో అందులో ఉన్న అన్ని ప్రమాదాల గురించి మీకు తెలిసినప్పటికీ, అవి మిమ్మల్ని ఆపలేదు, కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆపాలి?

మీకు కావలసినది, ఊహించని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆధార పడటానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉనికి ఉన్న మరియు నైపుణ్యం ఉన్న విశ్వసనీయమైన దీర్ఘకాలిక భాగస్వామి, బజాజ్ అలియంజ్ వద్ద మా లయబిలిటీ ఇన్సూరెన్స్ ద్వారా మేము అంటాము, 'సవాలు స్వీకరిస్తున్నాము!’ 

బజాజ్ అలియంజ్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఎందుకు?

మేము ఈ సవాలు యొక్క బాధ్యత, డిమాండ్లను అర్థం చేసుకున్నాము మరియు ఈ క్రింది వాటి సహాయంతో దానిని నెరవేరుస్తాము:

అండర్‌రైటర్స్, క్లెయిమ్‌లు మరియు లాయర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణుల వంటి రిస్క్ కన్సల్టింగ్ నిపుణులతో కూడిన బృందం మా వద్ద అందుబాటులో ఉంది. అతి పెద్ద బిజినెస్ లయబిలిటీ ఇన్సూరెన్స్ సవాళ్లను కూడా ఎదుర్కొనేలా మద్దతు లభిస్తుంది.

ఫార్మాస్యూటికల్ తయారీదారులు, నిర్మాణ సంస్థలు, విద్యుత్ మరియు యుటిలిటీ కంపెనీ నుండి ఆటోమోటివ్ తయారీదారుల వరకు అన్ని పరిశ్రమలలో మా బృందాలకు అనేక సంవత్సరాల అనుభవం ఉంది. 

మీ అవసరాలకు మరియు మీ వ్యాపారం యొక్క స్థితిగతులకు అనుగుణంగా మేము కవరేజీని రూపొందించాము. 


లయబిలిటీ ఇన్సూరెన్స్ కవర్లు

    మా బిజినెస్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ప్రోడక్టులు సాధారణంగా వ్యక్తిగత లేదా శారీరక గాయం మరియు ఆస్తి నష్టాన్ని కవర్ చేస్తాయి, అలాగే మా వ్యక్తిగత ప్రాథమిక పాలసీల ద్వారా, అదనపు లేయర్లు మరియు అంబ్రెల్లా పాలసీల ద్వారా, అంతర్జాతీయ బీమా కార్యక్రమాల ద్వారా అనేక ప్రదేశాలలో వివిధ రకాల నష్టాల కోసం కవరేజిని అందిస్తాయి.

    మేము ఇక్కడ ఇవ్వబడిన లయబిలిటీ ఇన్సూరెన్స్‌ రకాలను అందిస్తాము:

పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్

    పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ మీ వ్యాపారానికి వ్యతిరేకంగా థర్డ్ పార్టీ చేసిన పరిహార క్లెయిమ్‌లను కవర్ చేస్తుంది. థర్డ్ పార్టీ అను వారు ఒక సప్లయర్ నుండి క్లయింట్ వరకు ఎవరైనా ఉండవచ్చు.

    ఉదాహరణకు, ఒక సప్లయర్ మీ కంపెనీలో ఒక కేబుల్‌‌ని దాటుతూ పడిపోతే లేదా మీ ఉద్యోగులలో ఒకరు ఒక సమావేశంలో అనుకోకుండా క్లయింట్ ల్యాప్‌టాప్‌‌పై జ్యూస్ చిందించినట్లయితే, సప్లయర్‌కు జరిగిన గాయం మరియు క్లయింట్‌ ల్యాప్‌టాప్‌కు జరిగిన నష్టానికి మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది.

    అటువంటి పరిస్థితులు ఉహించలేనివి మరియు అనివార్యమైనవి, అందువల్ల, మీ వ్యాపారంలో అటువంటి పరిహార దావాలను కవర్ చేయడానికి, మేము మా పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తున్నాము.

    ఇన్సూరెన్స్ గడువులో వ్యాపార ప్రాంగణంలో మరియు వ్యాపారం నిర్వహించే సమయంలో ఒక ప్రమాదం వల్ల కలిగే శారీరక గాయాలకు లేదా ఆస్తికి జరిగిన నష్టం వలన ఏర్పడే థర్డ్ పార్టీ క్లెయిమ్ల కోసం చట్టపరమైన బాధ్యతగా చెల్లించవలసిన పరిహారం నుండి మేము మీకు రక్షణ అందిస్తాము. 

ప్రోడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్

    లయబిలిటీ ఇన్సూరెన్స్ ‌రకాలలో ప్రోడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అత్యంత ముఖ్యమైనది. మీరు విక్రయించిన ప్రొడక్ట్ వల్ల కలిగే గాయం లేదా నష్టం కోసం, ఇది మీ వ్యాపారానికి వ్యతిరేకంగా ఉన్న దావాలను కవర్ చేస్తుంది.

    మీ ప్రాసెస్‌లు ఎంత బలంగా ఉన్నా, లోపాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి మరియు కొన్ని సార్లు అవి పర్యవేక్షణకు నోచుకోవు. ఇది కస్టమర్‌కు తీవ్రమైన గాయాన్ని కలిగించే అవకాశం ఉంది లేదా వారి ఆస్తికి గణనీయమైన నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది.

    ఉదాహరణకు, మీరు ఫర్నిచర్‌ని తయారు చేసి విక్రయిస్తే, ఆ విక్రయించిన ఆ కుర్చీ విరిగి కస్టమర్‌ను గాయపరిస్తే, మీరు ఆర్థిక మరియు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మా ప్రోడక్ట్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఇటువంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.

    వ్యాపారం నిర్వహించే సమయంలో మరియు ఇన్సూరెన్స్ గడువులో మీ కంపెనీ ఉత్పత్తుల విక్రయం లేదా సరఫరా వలన జరిగే వస్తి నష్టం లేదా ప్రమాదవశాత్తు జరిగే శారీరక గాయం వలన సంభవించే థర్డ్ పార్టీ క్లెయిమ్ల నుండి మేము మీకు రక్షణ కలిపిస్తాము. 

ప్రోడక్ట్ రికాల్ ఇన్సూరెన్స్

    ఒక ప్రోడక్ట్ రీకాల్ అనేది స్వచ్చందం లేదా అసంకల్పితమే అయినా, అది మీ వ్యాపారంపై పెద్ద ఎత్తున ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రోడక్ట్ రికాల్స్ అనేవి ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో సర్వ సాధారణం.

    ఇప్పుడు సరఫరా గొలుసు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండటం వలన మరియు తయారీ నియమాలు వివిధ దేశాలలో వివిధ రకాలుగా ఉండటం వలన, ప్రోడక్ట్ రీకాల్ రిస్క్ ఒక్కసారిగా పెరగడమే కాకుండా దాని ఖర్చు కూడా పెరిగింది.

    కానీ అవి అవసరం, ఎందుకంటే మీరు మీ కస్టమర్లకు లోపాలు కలిగిన వస్తువులను సరఫరా చేయాలనుకోరు, అలాంటివి అనేక వ్యాజ్యాలకు దారితీయడం మాత్రమే కాకుండా, మీ బ్రాండ్ పేరును కూడా శాశ్వతంగా దెబ్బతీయవచ్చు.

    కానీ ప్రోడక్ట్ రికాల్ ఇన్సూరెన్స్‌తో మీరు దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆర్థిక భారాన్ని భరించకుండా మీరు ముందుకు సాగడానికి మరియు అవసరమైనది చేయడానికి అయ్యే మీ ఖర్చుల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటాం. 

క్లినికల్ ట్రయల్స్ ఇన్సూరెన్స్

    క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ వివిధ ప్రాణాంతక వ్యాధులకు చికిత్సను కనుగొనడంలో చాలా కీలకం, అలాగే అటువంటి వ్యాధుల వల్ల జరిగే ప్రమాదాన్ని గుర్తించడానికి, నిర్ధారించడానికి మరియు తగ్గించడానికి కొత్త మార్గాలను అభివృద్ధి చేస్తుంది. అయినప్పటికి, క్లినికల్ ట్రయల్స్ అనేవి చాలా జాగ్రత్తగా మరియు నేర్పుతో నిర్వహించాలి మరియు కొన్నిసార్లు పొరపాట్లు కూడా జరుగుతాయి.

    మా క్లినికల్ ట్రయల్స్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయంతో మేము ట్రయల్‌లో పాల్గొన్నవారు చేసిన క్లెయిమ్‌ల నుండి క్లినికల్ ట్రయల్స్ మరియు పరిశోధనలు నిర్వహించే విశ్వవిద్యాలయాలు మరియు ఆసుపత్రులతో పాటు ఆహారం, సౌందర్య మరియు ఔషధ కంపెనీలకు రక్షణ కల్పిస్తాము. 

కార్మికుల కాంపన్సేషన్ ఇన్సూరెన్స్

    ఉద్యోగులు మరియు వారి కృషి మీ కంపెనీ యొక్క ఉనికికి చాలా కీలకం, వారి భద్రత మరియు శ్రేయస్సు అనేవి మీకు ముఖ్యమని అని మాకు తెలుసు. అందువల్ల, కార్మికుల కాంపెన్సేషన్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది చిన్న వ్యాపారంతో పాటు పెద్ద సంస్థలకు తప్పనిసరిగా అవసరమయ్యే లయబిలిటీ ఇన్సూరెన్స్.

    ఉపాధి పొందుతున్న సమయంలో తలెత్తే చేస్తున్న వృత్తి కారణంగా తలెత్తే వ్యాధులు లేదా ప్రమాదాల వలన జరిగే శారీరక గాయం లేదా మరణం సంభవించినప్పుడు మీ ఉద్యోగులకు చెల్లించవలసిన పరిహారాన్ని ఇది కవర్ చేస్తుంది.

    ఇది మీ చట్టపరమైన అవసరాలను తీర్చడంలో సహాయపడటమే కాకుండా, మీ ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహాయపడుతుంది. 

ప్రొఫెషనల్ లయబిలిటీ ఇన్సూరెన్స్

    మీ కంపెనీ ప్రొఫెషనల్ అడ్వైజ్ లేదా అలాంటి మరొక సేవను అందిస్తే, మీరు ఆలస్యం చేయకుండా ప్రొఫెషనల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ సహాయంతో దానిని రక్షించుకోవాలి. 

    వ్యక్తిగత లేదా వృత్తిపరమైన నిర్ణయాలను తీసుకోవడం ఎప్పటికీ కఠినమైన పని, ఎందుకంటే ఎంత విశ్లేషణ లేదా ఆలోచన చేసినప్పటికీ, ఫలితాలు ఊహించని విధంగా ఉండవచ్చు.

    ప్రొఫెషనల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది మీ వలన జరిగిన పొరపాటు లేదా నిర్లక్ష్యం కారణంగా వారు అనుభవించిన నష్టాలకు వ్యతిరేకంగా క్లయింట్ చేసే దావాల నుండి మీ వ్యాపారాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.  

కమర్షియల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి