Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కమర్షియల్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్

Commercial Property insurance in india by Bajaj Allianz

మీ వివరాలను తెలియజేయండి

 
దయచేసి కేటగిరీని ఎంచుకోండి
దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి కంపెనీ పేరు ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే సంప్రదింపు వివరాలను ఎంటర్ చేయండి
 
దయచేసి ప్రదేశం/నగరం ఎంచుకోండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్‌

మీరు ఒక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పుడు, ఆ వ్యాపారాన్ని నిర్వహించే మరియు ఇన్వెంటరీని నిల్వ చేసుకునే స్థలాన్ని ఒక బేస్ క్యాంప్‌గా పరిగణించవచ్చు. ప్రతి విషయం అక్కడే ప్రారంభం అవుతుంది మరియు ముగుస్తుంది. ఇది ప్లాంట్స్ మరియు మెషినరీ నుండి కంప్యూటర్లు, ప్రింటర్‌ల వరకు మీ ఆస్తులన్నిటికీ ఇది నిలయంగా ఉంటుంది మరియు ఇక్కడే మీరు, మీ ఉద్యోగులు మేథాశక్తితో, కష్టపడి పనిచేస్తూ అద్భుతాన్ని సృష్టిస్తారు. ఇది మీ వ్యాపారం యొక్క ఉనికి, మనుగడకు, అభివృద్ధికి కేంద్రం.

ఎటువంటి అవాంతరాలైనా, అవి పెద్దవి లేదా చిన్నవి అయినా మీ కంపెనీ యొక్క రోజువారీ పనితీరుపై పర్యవసాన ప్రభావాన్ని చూపుతాయి, అది పెను ప్రమాదంగా కూడా మారవచ్చు. ఉదాహరణకు, ఒక అగ్నిప్రమాదం కేవలం భవనాన్ని మాత్రమే కాకుండా దానిలోని స్టాక్‌, యంత్రాలకు మరియు పరికరాలకు కూడా నష్టం కలిగిస్తుంది. దీని వలన ఒక భారీ ప్రతికూల ఆర్థిక ప్రభావం పడుతుంది, మీ వ్యాపారం యొక్క రోజువారీ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది మరియు క్లయింట్‌లతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.  

అటువంటి పరిస్థితిలో ఉన్న చాలా కంపెనీలు ఇలాంటి సంఘటనల నుండి బయటపడి నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడతారు. దారుణమైన విషయం ఏమిటంటే మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చాలాసార్లు ఊహించని పరిస్థితులలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగవచ్చు.

మీ దగ్గర ఉన్నదంతా పెట్టుబడి చేసి మీ వ్యాపారాన్ని నిర్మించుకున్నారని మాకు తెలుసు. అటువంటి సంఘటన కారణంగా ఇవన్నీ కోల్పోవడాన్ని అన్యాయమైనదిగా మరియు అనవసరమైనదిగా భావిస్తున్నాము. అందువల్ల, మేము మీకు బజాజ్ అలియంజ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ని అందిస్తున్నాము. 

బజాజ్ అలియంజ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎందుకు?

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌ తరపున అత్యంత క్లిష్టమైన మరియు సవాలు విసిరే ఎక్స్‌పోజర్ల కోసం కమర్షియల్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌లను అందించడంలో మేము నిపుణులం. ప్రధానమైన నేషనల్ రిస్క్ పోర్ట్‌ఫోలియోలపై దృష్టి సారించి, చిన్న మరియు మధ్యతరహా సంస్థల నుండి భారీపరశ్రమల వరకు అన్ని సంస్థల అవసరాలను తీర్చడానికి తగిన విధంగా ప్రాపర్టీ డామేజ్ మరియు బిజినెస్ ఇంటరప్షన్ వంటి ప్రత్యేకమైన ఇన్సూరెన్స్‌లను రూపొందించాము.

కమర్షియల్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌లో మాకు ఉన్న గొప్ప అనుభవంతో ఇతర ఇన్సూరెన్స్ సంస్థలు తీర్చని నష్టాలను కూడా మేము పరిష్కరిస్తాము. మేము కేవలం మా సామర్థ్యాన్ని మీ ముందు ఉంచడమే కాకుండా - ప్రత్యేక సవాళ్లు ఎదురైనపుడు అవసరమైన చోట దాని విలువను జోడిస్తాము.

మా వద్ద సాంకేతికంగా సర్టిఫై చేయబడిన రిస్క్ కన్సల్టెంట్‌ల బృందం ఉంది, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అలియంజ్ రిస్క్ కన్సల్టెంట్‌లకు యాక్సెస్ ఉంది, ఇలాంటి భాగస్వామ్యపు అనుభవం నుండి క్లయింట్‌లకు ప్రయోజనం చేకూరుతుందని మేము హామీ ఇస్తున్నాము. ఇది రిస్క్ సర్వే ప్రోగ్రాంను కలిగి ఉండవచ్చు లేదా సరికొత్త ప్రాపర్టీ రిస్క్ మోడలింగ్ పద్దతుల ద్వారా ప్రకృతి విపత్తుకి గురికావడాన్ని సమీక్షించడానికి క్లయింట్‌తో కలిసి పని చేయడం కూడా ఉండవచ్చు.

కమర్షియల్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌లో మాకున్న సుదీర్ఘమైన అనుభవంతో సంక్లిష్టమైన మరియు సవాళ్లు విసిరే సంఘటనలను పరిష్కరించడానికి మరియు మీ సంస్థ యొక్క వివిధ అవసరాలను తీర్చడానికి తగిన విధంగా పాలసీలను తయారుచేసాము, ఈ విధంగా మేము మీ వెంటే ఉన్నామని విశ్వసించమని కోరుతున్నాము.

మేము మా సామర్థ్యాల గురించి చెప్పుకుంటూ పోవచ్చు కానీ, మీరు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే మా నైపుణ్యం మరియు సామర్థ్యం మీకు మీ వ్యాపారం పై ఉన్న అవగాహన మరియు దాని పై మాకు ఉన్న బాధ్యత మరియు సంరక్షణ ఆధారంగా ఉంటాయి. 

మేము వివిధ రకాల ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు ప్యాకేజీ పాలసీలను కూడా అందిస్తున్నాము. కాబట్టి, మీరు మీ వ్యాపారానికి సంబంధించిన అవసరాలను బట్టి పాలసీని ఎంచుకోవచ్చు. ఎందుకంటే, మీ వ్యాపారం గురించి మీకంటే బాగా మరెవరికి తెలుస్తుంది?

స్టాండర్డ్ ఫైర్ మరియు స్పెషల్ పెరిల్స్ ఇన్సూరెన్స్

    ఒక చిన్న నిప్పురవ్వ పెద్ద అగ్ని ప్రమాదాన్ని సృష్టిస్తుంది, ఆ అగ్ని మీ ఆస్తులన్నింటినీ దహించి వేస్తుంది. అలాంటి ప్రమాదాలు సాధారణమైనవి, తప్పించలేనివి మరియు భారీ నష్టాన్ని కూడా కలిగిస్తాయి. మా స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక అత్యంత విలువైన ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది అలాంటి ప్రమాదాల వల్ల ఏర్పడే ప్రభావాల నుండి మీ కంపెనీని రక్షించడానికి రూపొందించబడింది.

    ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, పేలుడు, విస్ఫోటనం మరియు అంతస్ఫోటనం, గాలిలోని పరికరాల వలన మీ ఆస్తిపై జరిగిన విధ్వంసం లేదా నష్టాన్ని మేము కవర్ చేస్తాము. అల్లర్లు, సమ్మె మొదలైన మానవ నిర్మిత విపత్తులను మరియు తుఫాను, వరద వంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా మేము కవర్ చేస్తాము. అలాగే, రైలు లేదా రోడ్డుపై నడిచే వాహనం వల్ల జరిగే నష్టాన్ని కూడా కవర్ చేస్తాము.  

    కొండచరియలు విరిగిపడడం లేదా జారిపోవడం, కాలుష్యం మరియు కలుషితాలు, నీటి ట్యాంకులు, పరికరాలు మరియు పైపులు పగిలిపోవడం మరియు/లేదా పొంగిపొర్లడం, మిసైల్ టెస్టింగ్ ఆపరేషన్స్, ఆటోమేటిక్ స్ప్రింక్లర్ ఇన్‌స్టాలేషన్స్ నుండి లీకేజ్ మరియు కార్చిచ్చు వలన కలిగే నష్టం కూడా కవర్ చేయబడుతుంది.

    ప్రమాదం సహజమైనది లేదా మానవ నిర్మితమైనదే అయినా దాని పరిణామాల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ పాలసీ నిర్ధారిస్తుంది.

బిజినెస్ ఇంటరప్షన్ ఇన్సూరెన్స్

    విస్తృత శ్రేణిలో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీలను పొందటం వలన ప్రత్యక్షంగా ఏర్పడే ఆర్థిక నష్టాలను కవర్ చేయడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, ప్రమాదవశాత్తు యంత్రాలకు ఏదైనా ప్రమాదం లేదా నష్టం జరిగితే, ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్ ఇన్సూరెన్స్‌ వాటిని కవర్ చేస్తుంది.

    అయితే, పరోక్షంగా ఏర్పడే నష్టం సంగతి ఏంటి? మీ యంత్రాలు రిపేర్ చేయబడుతున్న లేదా రీప్లేస్ చేయబడుతున్న కాలంలో ఉత్పత్తిలో అంతరాయం వలన కలిగే నష్టం సంగతి ఏంటి? అటువంటి నష్టం కూడా గణనీయమైనది, మీ వ్యాపారానికి సంబంధించిన రోజువారీ కార్యకలాపాలలో తీవ్రమైన అంతరాయం కలిగించవచ్చు. మా బిజినెస్ ఇంటరప్షన్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయంతో అటువంటి నష్టాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటాం.

    ఏదైనా ప్రమాదం లేదా సంఘటనల ప్రభావం వలన మీ వ్యాపారానికి అంతరాయం కలిగితే ఆ నష్టం కంపెనీ పై పడకుండా మేము కవర్ చేస్తాము. 

బర్‌గ్లరీ ఇన్సూరెన్స్

    దొంగలు మన సమాజానికి పట్టిన చీడ, మీ వ్యాపార ఆస్తికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత భద్రతను కల్పించినా అది వారి తదుపరి లక్ష్యంగా మారితే, అంత సురక్షితం కాదు.

    బజాజ్ అలియంజ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ అనేది ఒక కీలకమైన ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది మీరు ఇన్సూర్ చేసిన స్థలంలో ఉన్న వాటికి జరిగిన నష్టాన్ని మరియు డ్యామేజీలను కూడా కవర్ చేస్తుంది. మేము కేవలం వాస్తవంగా జరిగిన దొంగతనం, దోపిడీల వలన కలిగే నష్టాన్ని మాత్రమే కాకుండా దోపిడీ, దొంగతనం చేసేందుకు ప్రయత్నించడం వలన కలిగిన నష్టాన్ని కూడా కవర్ చేస్తాము.

ఇండస్ట్రియల్ ఆల్ రిస్క్స్ ఇన్సూరెన్స్

    ఒక దురదృష్టకరమైన సంఘటనను నివారించడానికి మరియు దాని పర్యవసానాల ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సాధారణంగా మనం ఆ సంఘటన జరిగిన తరువాత ఆలోచిస్తాము. 

    ఎందుకంటే, జీవితం సంక్లిష్టమైనది, మరియు ప్రతి విషయం గురించి ఆలోచించడం అన్ని సార్లు కుదరదు.

    అయితే, ఇలాంటి ప్రతీ అవసరం కోసం మేము మా ఇండస్ట్రియల్ ఆల్ రిస్క్స్ ఇన్సూరెన్స్ పాలసీని జాగ్రత్తగా రూపొందించాము. ఇది ఒక సమగ్రమైన ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ పాలసీ, ఇది మీ కంపెనీ తన రోజువారీ కార్యకలాపాల సమయంలో ఎదుర్కొనే అన్ని రకాల ప్రమాదాలకు, అపాయాలకు కవరేజ్‌ని అందిస్తుంది.

    మా పరిశ్రమ అనుభవం మరియు నైపుణ్యం సహాయంతో, మీ వ్యాపారానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని ప్రమాదం లేదా నష్టం నుండి కవర్ చేయడానికి ఈ సంపూర్ణమైన కవర్‌ని రూపొందించాము.. ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ మీ భవనం, మెషినరీ, ఫర్నిచర్, ఫిక్చర్స్ ,ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్‌లు మరియు మరెన్నో వాటి పునఃస్థాపన విలువను కవర్ చేస్తుంది. ఇది మార్కెట్ విలువ ఆధారంగా మీ స్టాక్‌ని కూడా కవర్ చేస్తుంది.

    ఇండస్ట్రియల్ ఆల్ రిస్క్స్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది, మీ వ్యాపార అవసరాలను తీర్చే ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్ ఇన్సూరెన్స్ , బిజినెస్ ఇంటెరప్షన్ ఇన్సూరెన్స్ వంటి వివిధ రకాల వ్యక్తిగత ఇన్సూరెన్స్‌లను కలిగి ఉంటుంది. ఈ విధంగా మీరు బలహీనంగా ఉన్న చోటు మేము జాగ్రత్త తీసుకుంటాము మరియు మీరు ఎన్నడూ ఆర్ధికపరమైన ఇబ్బందికర పరిస్థితులలో పడరు.

మెగా రిస్క్ ఇన్సూరెన్స్

    మీ సంస్థ పెద్దది అయితే, కలిగే నష్టాలు కూడా పెద్ద స్థాయిలో ఉంటాయి అని మీకు తెలుసు. భారీ నష్టాలను భరించగలిగే ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు శోధిస్తున్నట్లయితే, బజాజ్ అలియంజ్ మెగా రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ మీ కోసం తగినది.

    మీ వ్యాపార స్థలం కోసం బిజినెస్ ఇంటెరప్షన్ ఇన్సూరెన్స్, మెషినరీ ఇన్సూరెన్స్ మొదలైనటువంటివి మీరు ఎంచుకోవాలనుకునే ఇన్సూరెన్స్ పాలసీల మొత్తం రూ. 2500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, మీకు మెగా రిస్క్ ఇన్సూరెన్స్ అవసరం అవుతుంది.

రిస్క్ మేనేజ్‌మెంట్ సేవలు

    మీ కంపెనీ చేపట్టే ప్రతీ ప్రాజెక్ట్ లేదా వెంచర్ దానితో పాటు కొత్త కొత్త ప్రమాదాలను తెచ్చి పెడుతుంది. కానీ అది కేవలం ఒక వ్యాపార స్వభావం మాత్రమే మరియు అది మిమ్మల్ని భయపెట్టదని మాకు తెలుసు. మీ ఆత్మస్థైర్యానికి జోహార్లు!

    అటువంటి సంభావ్య ప్రమాదాలకు భయపడకుండా ఉండటం మంచిది అయినప్పటికీ, వాటిని నివారించడానికి వ్యూహాత్మక చర్యలు తీసుకోవడం మరియు వ్యాపారం కార్యకలాపాలు, లాభదాయకతపై వాటి ప్రభావాన్ని తగ్గించడం కూడా చాలా ముఖ్యం.

    బజాజ్ అలియంజ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్వీసులు సంభావ్య ప్రమాదాలను అంచనా వేయడం మరియు వాటిని నివారించడంలో మాత్రమే కాకుండా ప్రధాన నిర్ణయాలను తీసుకోవడంలో కూడా మీకు సహాయపడతాయి. ఇది ఆర్థికంగా పడే ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు మీ సంస్థ సజావుగా కార్యకలాపాలు నిర్వహించేలా తోడ్పడుతుంది.

కమర్షియల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి