ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మనం ఒక పదానికి సంబంధించిన ఆట ఆడదామా? మేము 'ఇంటర్నెట్’ అనే పదం చెప్పగానే, మీ మనసులో ఏముంటుంది?
సోషల్ మీడియా, స్నేహితులు, వినోదం ఇంటర్‌నెట్ అందించే బహుమతి. ఇంటర్‌నెట్ లేని సమయాన్ని ఇప్పుడు మనం ఊహించలేము. మనం కొద్దిగా వెనక్కు వెళ్లి ఊహిస్తే, ఆ సమయం చాలా విసుగ్గా మరియు చీకటి యుగంగా అనిపిస్తుంది. అయితే ఇప్పటితో పోలిస్తే అది చాలా సురక్షితమైన సమయం
అయితే, నేటి ప్రపంచంలో మీరు కనీసం కొంతవరకు అయినా ఆన్‌లైన్ ప్రపంచానికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోకుండా పనిచేయడం దాదాపుగా అసాధ్యం. మరొకవైపు ఇది చాలా ప్రమాదకరమైనది కూడా
ఐడెంటిటీ ఫ్రాడ్, ఫిషింగ్, సైబర్ స్టాకింగ్
దాదాపుగా ప్రతి రోజు మీరు ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంటర్‌నెట్ వినియోగాన్ని ఆపేస్తారా? అస్సలు కానే కాదు! సంభావ్య సైబర్ బెదిరింపులు, ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఒక మార్గాన్ని ఎంచుకుంటారు మరియు బజాజ్ అలియంజ్ సైబర్ ఇన్సూరెన్స్ అందుకు మీకు సహకరిస్తుంది
భారతదేశంలో సైబర్ ఇన్సూరెన్స్ కోసం పెరుగుతున్న అవసరాన్ని గ్రహించి, మేము వ్యక్తిగత సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్‌కు మద్దతు ఇవ్వడానికి మా పాలసీని రూపొందించాము మరియు సైబర్ ఇన్సూరెన్స్‌ని అందించే మొదటి భారతీయ బీమా సంస్థగా నిలిచాము.
ఇంటర్‌నెట్ అనేది కొన్నిసార్లు మానవజాతి కనిపెట్టిన అత్యుత్తమైన లేదా పనికిరాని సృష్టి. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ మరియు సౌలభ్యం లాంటి ప్రయోజనాలతో ఇది కొత్త రకం ప్రమాదాలను వెంట తెస్తుంది. ఇవి ఆర్ధిక సమాచార దుర్వినియోగం, వ్యక్తిగత సమాచారం దొంగతనం నుండి సైబర్ స్టాకింగ్, గుర్తింపు దొంగతనం వరకు అనేక రకాలుగా ఉంటాయి.
మేము బజాజ్ అలియంజ్ తరపున అలాంటి కొత్త రకం ప్రమాద కారకాలను మరియు వాటి ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాము. మా వ్యక్తిగత సైబర్ సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీ సంభావ్య సైబర్ నేరాలు మరియు ప్రమాదాల నుండి మీకు సరైన రక్షణ లభిస్తుందని నిర్ధారిస్తుంది.
ఒక సింగిల్ పాలసీ కింద అనేక కవర్‌లు
మీ డిజిటల్ పరికరాలు మిమ్మల్ని ప్రతిబింబిస్తాయి, ఎందుకంటే, అవి మీ గురించిన పూర్తి సమాచారాన్ని, పచ్చి నిజాలను కలిగి ఉంటాయి. ఇందులో మీ వ్యక్తిగత సంభాషణలు, ఫోటోలు, వీడియోలు, మెసేజెస్, బ్రౌజర్ చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు బ్యాంక్ వివరాలు ఉంటాయి. దీర్ఘకాలిక సంబంధాలలో ఉన్నవారు కూడా సాధారణంగా ఫోన్ మరియు అకౌంట్ పాస్‌వర్డ్‌లను సాధారణంగా షేర్ చేయరు. మరింత చదవండి
గుర్తింపు దొంగతనం అనగా, మీ డిజిటల్ పరికరాలతో సహా మీ కంప్యూటర్ సిస్టమ్‌లో నిల్వ చేయబడిన మీ వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించడం, తొలగించడం లేదా మార్చడం వంటి ఏదైనా మోసపూరిత మరియు అనధికార ప్రాప్యత చర్య. ఇది భయంకరమైనది, నిజంగా జరిగే అవకాశం కూడా ఉంది.
అందించబడే కవరేజ్
సోషల్ మీడియా
సోషల్ మీడియా సైబర్ దాడులు మనం ఊహించిన వాటి కంటే చాలా సాధారణమైనవి. కానీ, మా వ్యక్తిగత సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ, సైబర్ దాడుల ఫలితంగా మీ ఒరిజినల్ సోషల్ మీడియా అకౌంట్లో సంభవించే గుర్తింపు దొంగతనం కారణంగా తలెత్తే చట్టపరమైన మరియు ప్రాసిక్యూషన్ ఖర్చులను భరిస్తుంది.
అందించబడే కవరేజ్
సైబర్ స్టాకింగ్ అనేది భయంకరమైన అనుభవం, ఇది ఎవరికీ ఎదురవకూడదని మేము కోరుకుంటున్నాము. ఇది ఒక వ్యక్తిని పదేపదే వేధించడానికి లేదా భయపెట్టడానికి డిజిటల్ కమ్యూనికేషన్‌ను ఉపయోగించడం. వ్యక్తి ఎక్కడ ఉన్నారని సంబంధం లేకుండా, ఏ సమయంలోనైనా దాడి జరిగినట్లుగా మరియు అసురక్షితమైన అనుభూతిని కలిగిస్తుంది. మరింత చదవండి
అందించబడే కవరేజ్
మీరు ప్రతిరోజూ అందుకునే టెక్స్ట్ మెసేజ్‌ల సంఖ్య లేదా డౌన్‌లోడ్‌ల సంఖ్యను గురించి ఆలోచించడానికి ఒక నిమిషం కేటాయించండి. సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కదా? మరింత చదవండి
అందువల్ల, SMS, ఇంటర్‌నెట్ డౌన్‌లోడ్‌లు, ఫైల్ ట్రాన్స్‌ఫర్ మరియు మరెన్నింటి ద్వారానో వ్యాపింపజేయగల కంప్యూటర్ ప్రోగ్రామ్‌ల సహాయంతో, మీకు తెలియకుండా లేదా అనుమతి లేకుండానే హానికరమైన ఉద్దేశ్యంతో ఎవరైనా మీ డిజిటల్ పరికరాల్లోకి చొరబడటం మరియు దెబ్బతీయడం చాలా సులభం.
అందించబడే కవరేజ్
ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ల సౌలభ్యం మరియు సైబర్ దొంగతనం అనేవి ఒకే నాణానికి రెండు వైపులా ఉండే ముఖచిత్రాలు. మీరు మంచిని ఆనందించడాన్ని కొనసాగించవచ్చు, ఎందుకంటే మా సైబర్ సేఫ్ పాలసీ చెడు నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మరింత చదవండి
మీ కంప్యూటర్ సిస్టమ్‌లో మీ అనుమతి లేకుండా థర్డ్ పార్టీ వలన జరిగిన సైబర్ చొరబాటు కారణంగా పొరపాటును లేదా తప్పుగా డబ్బును కోల్పోవడం వలన జరిగిన ఆర్థిక నష్టాన్ని మేము కవర్ చేస్తాము.
అందించబడే కవరేజ్
ఫిషింగ్ అనేది మోసగాళ్లు మరియు నేరగాళ్లు, సందేహించని వ్యక్తులను మోసం చేయడానికి ఎంచుకున్న ఒక కొత్త మార్గం. ఒక ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా నమ్మదగిన సంస్థగా మారువేషాలు కట్టి యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్‌లు మరియు క్రెడిట్ కార్డ్ వివరాలు (మరియు కొన్నిసార్లు, పరోక్షంగా, డబ్బు) వంటి తప్పుడు కారణాలతో మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి చేసే ప్రయత్నం ఇది. మరింత చదవండి
మా వ్యక్తిగత సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా ఆర్థిక నష్టాన్ని పూరించడమే కాకుండా, తిరిగి పోరాడటానికి మీకు సహాయం చేస్తుంది.
అందించబడే కవరేజ్
ఇమెయిల్ స్పూఫింగ్ అనేది ఒక ఫోర్జరీ లేదా ఇ-మెయిల్ హెడర్‌ని తప్పుగా తారుమారు చేయడం, తద్వారా సందేశం నిజమైన సోర్స్ నుండి వచ్చినట్లు కనిపిస్తుంది. మరింత చదవండి
అందించబడే కవరేజ్
మీ డిజిటల్ పరికరాలతో సహా కంప్యూటర్ సిస్టమ్‌పై జరిగిన సైబర్ దాడి ఫలితంగా, ఏదైనా డిజిటల్ కంటెంట్ యొక్క అనాలోచిత ప్రచురణ లేదా ప్రసారం వల్ల నష్టం జరిగినట్లయితే, మా వ్యక్తిగత సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు సహాయం అందిస్తుంది. మరింత చదవండి
అందించబడే కవరేజ్
సైబర్ దోపిడి అనేది ప్రైవసీ ఉల్లంఘన, డేటా ఉల్లంఘన లేదా సైబర్ దాడికి కారణమయ్యే ఏదైనా ముప్పు. ఆన్‌లైన్‌లో వ్యక్తులు అజ్ఞాతంగా ఉండి బయట మనల్ని కత్తి పట్టుకొని బెదిరించే వ్యక్తుల కన్నా భయంకరమైన వాళ్ళు, ఇలాంటి వారి నుండి తప్పించుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. మరింత చదవండి
తిరిగి పోరాడే శక్తి ఉందనే భరోసాను కల్పిస్తూ మేము మా సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ద్వారా మీకు సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము.
అందించబడే కవరేజ్
ఈ రోజుల్లో ఇంటర్‌నెట్ మరియు కంప్యూటర్ సిస్టమ్‌లు మీకు ‘ఇష్టమైన డైరీ’ కి నవయుగపు వెర్షన్ లాగా ఉన్నాయి. ఫోటోలు, వీడియోలు, మెసేజెస్ మరియు మరెన్నో- మీ వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని అవి కలిగి ఉంటాయి - సాధారణంగా మీరు వాటిని ఎవరూ చూడకూడదని కోరుకుంటారు. మరింత చదవండి
గోప్యత మరియు సమాచార ఉల్లంఘన అనేది థర్డ్ పార్టీ ద్వారా మీ వ్యక్తిగత డేటాను అనధికారికంగా బహిర్గతం చేయడం లేదా థర్డ్ పార్టీ వారు కంప్యూటర్ సిస్టమ్‌లో నిల్వ చేసిన మీ వ్యక్తిగత డేటాను అనధికారకంగా యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం.
అందించబడే కవరేజ్
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
ఆశీష్ శర్మ
బజాజ్ అలియంజ్ సులభమైన మరియు అవాంతరాలు లేని ప్రక్రియను అందించింది. మీ పనితీరు చాలా బాగుంది, దానిని కొనసాగించండి
ఆదర్ష ఉప్పుంద
ఆన్‌లైన్ పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది
ఉజాగర్ ప్రసాద్ సింగ్
పాలసీ వివరణను అర్థం చేసుకోవడానికి చక్కటి రూపకల్పన
18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల ఏ వ్యక్తి అయినా కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం ప్రతీ ఒక్కరు రోజూ కొన్ని గంటల పాటు ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్నారని మేము అర్థం చేసుకున్నాము, అలాగే మా వ్యక్తిగత సైబర్ సేఫ్ పాలసీ యొక్క రక్షణకు సులభమైన యాక్సెస్ అందించాలని అనుకుంటున్నాము. అందువల్ల, చట్టబద్దమైన వయసు గల వారికి మా అవసరం ప్రాథమికమైనది.
ఇది ఒక వార్షిక పాలసీ.
మా పాలసీ రెన్యూవల్ అనేది చాలా వేగవంతం మరియు సులభమైనది, కేవలం కొన్ని క్లిక్‌లలో ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోవడం ద్వారా ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తున్నంత కాలం మీరు వ్యక్తిగత సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క రక్షణను ఆస్వాదించవచ్చు.
ప్రతీ వ్యక్తికి వేర్వేరు అవసరాలు ఉంటాయని మరియు మీరు ఇంటర్‌నెట్‌ని వినియోగించే అలవాట్లను బట్టి, ఇతర విషయాలతోపాటు, మీకు వేరే కవరేజ్ మొత్తం కూడా అవసరం అవుతుందని మేము అర్థం చేసుకున్నాము.
అందువల్ల, మా సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ కింద రూ. 1 లక్షల నుండి ప్రారంభమై రూ. 1 కోట్ల వరకు ప్లాన్లు ఉన్నాయి. వ్యక్తిగత సైబర్ ఇన్సూరెన్స్ ఖర్చు కూడా తదనుగుణంగా మారుతుంది మరియు అనేక సరసమైన ప్లాన్లను కలిగి ఉంటుంది.
ఈ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలో అదనంగా ఏమి ఉండవు.
ఇన్సూరెన్స్ ప్రొవైడర్ క్లెయిమ్ సెటిల్ చేయడానికి ముందు మీరు క్లెయిమ్ కోసం చెల్లించవలసినది మాత్రమే అదనపు డబ్బు మొత్తం. ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఈ మొత్తాన్ని నిర్ణయిస్తారు. మా సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే అదనంగా ఏమీ వసూలు చేయదు.
ఇలా జరిగినందుకు మేము చింతిస్తున్నాము. అదే గనక జరిగితే, మీరు ఈ పాలసీ కింద ఒక క్లెయిమ్ చేయవచ్చు. అయితే, మీరు ఓకే సంఘటన కోసం ఇన్సూరెన్స్ నిబంధనలలో ఒక దాని కింద మాత్రమే క్లెయిమ్ చేయవచ్చు.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి