Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

సైబర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రాసెస్

మీరు ఒక సమగ్రమైన జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నుండి కేవలం ఒక క్లిక్ దూరంలో ఉన్నారు

అది మాల్‌వేర్ దాడి అయినా, ఐటి థెఫ్ట్ లాస్ అయినా, సైబర్ స్టాకింగ్, సైబర్ దోపిడి, ప్రైవసీ మరియు డేటా ఉల్లంఘన జరిగినా, మా సైబర్ సేఫ్ ఇన్సూరెన్స్ పాలసీతో బజాజ్ అలియంజ్ అన్ని రకాల నష్టాలను కవర్‌ చేస్తుంది. అటువంటి సైబర్ దాడులకు మీరు గురి అయితే (ఇక, ఇది అనవసరమైన విషయం కాదు), మా సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని ఏదైనా ఆర్థిక నష్టం పై కవరేజ్ అందిస్తుంది.

సైబర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్

మీ సైబర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోండి

మా టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయండి

1800-209-5858

మా ఇమెయిల్ అడ్రస్

bagichelp@bajajallianz.co.in

మీ సైబర్ సేఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు 6 సులభమైన దశలు

  • 1

    థర్డ్ పార్టీ ద్వారా మీ గోప్యత మరియు సమాచార ఉల్లంఘన జరిగినట్లు మీరు గుర్తించారు

  • 2

    ఇక సమయం వృథా చేయకండి, పోలీస్ స్టేషన్, సైబర్ సెల్ విభాగానికి లిఖితపూర్వక ఫిర్యాదు / FIR ని సమర్పించండి

  • 3

    మీ క్లెయిమ్ గురించి మీరు 1 నుండి 2 పని దినాలలో మాకు తెలియజేయాలి. మా టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1800-209-5858 పై మమ్మల్ని సంప్రదించడం ద్వారా ఇది మీకు సాధ్యమవుతుంది. మేము ప్రతీ రోజూ ప్రతీ క్షణం మీతోనే ఉన్నాము

  • 4

    అన్ని సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించడంతో సమాచారాన్ని జత చేయండి (క్రింద చెక్‌లిస్ట్ చూడండి)

  • 5

    మీ పనిని మీరు పూర్తి చేశారు; ఇక పై బాధ్యత మాది. మేము ఫోరెన్సిక్ నిపుణులను సంప్రదిస్తాము, క్లెయిమ్ ప్రారంభాన్ని తనిఖీ చేస్తాము

  • 6

    అలా జరిగితే, మేము క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను ప్రారంభిస్తాము మరియ ఫోరెన్సిక్ / సైబర్ నిపుణుల నుండి అన్ని రిపోర్టులను, డాక్యుమెంట్లను స్వీకరించిన తర్వాత 5 పని దినాలలోపు మీకు చెల్లింపును పంపిస్తాము

నగదు వేగంగా మీ ఇంటిని చేరుకోవడానికి, వీటిని మర్చిపోకండి:
  • క్లెయిమ్ ఫారం- సరిగ్గా నింపబడినది మరియు సంతకం చేయబడింది
  • ఎఫ్‌ఐఆర్ కాపీ
  • చట్టపరమైన నోటీసు యొక్క కాపీలు
  • ఏదైనా కోర్టు నుండి సమన్ల కాపీలు
  • IT థెఫ్ట్ లాస్‌కు సంబంధించి ఆర్థిక సంస్థలతో కరస్పాండెన్స్ కాపీలు
  • సమాచారం లేదా గోప్యత ఉల్లంఘన కారణంగా థర్డ్-పార్టీకి వ్యతిరేకంగా ఫైల్ చేయబడిన చట్టపరమైన నోటీసు యొక్క కాపీలు
  • సంబంధిత నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీపై నమోదైన క్రిమినల్ కేసుల కాపీలు
  • పునరుద్ధరణ ఖర్చుల కోసం అయిన ఖర్చుల యొక్క ఇన్వాయిస్‌ల కాపీలు
  • IT కన్సల్టెంట్ సర్వీసెస్ కవర్‌ కోసం అయిన ఖర్చుల యొక్క ఇన్వాయిస్‌ల కాపీలు
  • థర్డ్ పార్టీకి వ్యతిరేకంగా నష్టపరిహారం కోసం క్రిమినల్ కేసు / దావా వేయడానికి చేసిన ఖర్చుల వివరాలు
  • మీకు జరిగిన నష్టానికి రుజువు
  • మీకు చెందిన వ్యక్తిగత సమాచారం యొక్క రుజువు
క్లెయిమ్ ఫారంలు:
  • పూర్తిగా నింపిన మరియు సంతకం చేయబడిన క్లెయిమ్ ఫారం
  • పోలీసు అధికారులు / సైబర్ సెల్ వద్ద నమోదు చేసిన FIR కాపీ
  • ప్రభావితమైన వ్యక్తి/సంస్థ నుండి అందుకున్న చట్టపరమైన నోటీసు యొక్క కాపీలు
  • ప్రభావితమైన పార్టీ/సంస్థ దాఖలు చేసిన ఒక దావాకు సంబంధించి కోర్టు నుండి అందుకున్న సమన్ల కాపీలు
  • IT థెఫ్ట్ లాస్‌కు సంబంధించి ఆర్థిక సంస్థలతో కరస్పాండెన్స్ కాపీలు
  • ఏదైనా ఆర్థిక సంస్థపై లేదా IT థెఫ్ట్ లాస్ గురించి ఏదైనా ఆర్థిక సంస్థపై దాఖలు అయిన కేసులో లీగల్ నోటీసు పనిచేస్తుంది
  • ఏదైనా సమాచార ఉల్లంఘన లేదా గోప్యతా ఉల్లంఘన కోసం థర్డ్ పార్టీకి వ్యతిరేకంగా చట్టపరమైన నోటీసు యొక్క కాపీలు
  • సంబంధిత ఇన్సూరింగ్ నిబంధనల క్రింద థర్డ్ పార్టీకి వ్యతిరేకంగా ఫైల్ చేయబడిన క్రిమినల్ కేస్ యొక్క కాపీలు
  • పునరుద్ధరణకు అయ్యే ఖర్చుల కోసం ఇన్వాయిస్‌ల కాపీలు
  • IT కన్సల్టెంట్ సర్వీసెస్ కవర్‌లో చేసిన ఖర్చుల కోసం ఇన్వాయిస్‌ల కాపీలు
  • థర్డ్ పార్టీకి వ్యతిరేకంగా క్రిమినల్ కేసు / క్లెయిమ్ కోసం దావా వేయడానికి అయ్యే ఖర్చుల వివరాలు / ఇన్వాయిస్‌లు
  • వ్యక్తిగత సమాచారం అనేది ఇన్సూరెన్స్‌కు చెందిన యాజమాన్య సమాచారం అని నిరూపించే రుజువు
  • ఇన్సూరెన్స్ చేసిన వారికి నష్టం జరిగిందని చూపించడానికి రుజువు
LET’S SIMPLIFY

మీ సందేహాలకు సమాధానాలు

కవర్ నోట్ అంటే ఏమిటి?

ఇది, పాలసీని జారీ చేయడానికి ముందు ఇన్సూరర్ మీకు అందించే ఒక తాత్కాలిక ఇన్సూరెన్స్ సర్టిఫికేట్. మీరు ప్రపోజల్ ఫారంను సరిగ్గా నింపి, సంతకం చేసి మరియు పూర్తి ప్రీమియం చెల్లించిన తర్వాత ఇది అందించబడుతుంది.

ఇది 60 రోజుల వ్యవధి వరకు చెల్లుతుంది (దాని జారీ చేసిన తేదీ నుండి), అలాగే కవర్ నోట్ గడువు ముగిసేలోపు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ మీకు అందించేలా ఇన్సూరెన్స్ కంపెనీని అనుమతిస్తుంది.

పాలసీలో కొన్ని మార్పులు చేయాలనుకుంటే ఏం చెయ్యాలి?

మీరు ఇక్కడ వెతుకుతున్న పదం ఎండార్స్‌మెంట్, ఇది మీ ఇన్సూరెన్స్ పాలసీలో మార్పులకు సంబంధించిన ఒక వ్రాతపూర్వక ఒప్పందం. ఎండార్స్‌మెంట్ అనేది పాలసీ జారీ చేసేటప్పుడు అమలులోకి వస్తుంది. ఇది యాడ్-ఆన్‌లు, మరింత విస్తృతమైన కవరేజీని లేదా కొన్ని పరిమితులను విధించడానికి ప్రవేశపెట్టబడుతుంది.

నో క్లెయిమ్ బోనస్ అంటే ఏమిటి?

మీ పాలసీ వ్యవధిలో మీరు ఒక్క ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయకపోతే మీరు నో క్లెయిమ్ బోనస్ (NCB) కి అర్హులు. ఇది మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీపై ప్రీమియంను తగ్గిస్తుంది, మంచి డ్రైవర్ అయినందుకు గాను ఇది మీకు ఒక గుర్తింపు లాంటిది.

ఒకే తరగతికి చెందిన కొత్త వాహనానికి NCB ని బదిలీ చేయవచ్చు మరియు మీ మోటారు ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసిన 90 రోజుల వరకు ఇది చెల్లుతుంది. కొత్త మెషిన్ ఖరీదైనది అయితే, అధిక ఇన్సూరెన్స్ ప్రీమియంతో పాటు అదనపు అడ్మినిస్ట్రేటివ్ రుసుము కూడా మీ నుండి వసూలు చేయబడవచ్చు.

నా పాలసీ గడువు ముగిసినప్పుడు ఏమి చేయాలి?

బజాజ్ అలియంజ్‌ని మీ స్పీడ్ డయల్‌ లిస్ట్‌లో ఉంచండి, మీ పాలసీ గడువు ముగిసినట్లయితే మా టోల్ ఫ్రీ నంబర్ 1800-209-5858 కు కాల్ చేయండి. మీకు అవాంతరాలు లేని ఇన్సూరెన్స్ అనుభవాన్ని అందించడం కోసం మేము 24 గంటలు అందుబాటులో ఉంటాము

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి