ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
విలువైన దానిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది మీ యొక్క సహజ స్వభావం. మరియు, మీ ఆరోగ్యం కూడా మీకు అత్యంత విలువైనదని మాకు తెలుసు. మీరు ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. కానీ, ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రమాదం వంటి అత్యవసర పరిస్థితులలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, మీకు బలమైన ఆర్థిక సహాయం అవసరం.
బజాజ్ అలియంజ్ ద్వారా ఆరోగ్య సంజీవనీ పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఆర్థిక సహాయాన్ని అందించడంలో మరియు హాస్పిటలైజేషన్ సమయంలో ఆర్థిక భారం నుండి మిమ్మల్ని సురక్షితం చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్‌తో మీరు, మీ పొదుపులను వినియోగించడం గురించి ఆలోచించడం మానేసి, ఎలాంటి వైద్య అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనవచ్చు.
ఆరోగ్య సంజీవని పాలసీ సహాయంతో మీరు, ఊహించని ప్రమాదాల సందర్భంలో చికిత్స కోసం తగినంత డబ్బు లేకపోవడం గురించి ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
బజాజ్ అలియంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు రూపొందించిన ఆరోగ్య సంజీవనీ పాలసీ, మీకు ఆర్థిక సహాయాన్ని పొందడంలో మరియు ఆసుపత్రిలో చేరే సమయంలో ఆర్థిక భారం నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.. వీటితో పాటు ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్, మీరు పొదుపు చేసిన డబ్బు ఖర్చు అయిపోతుంది అని ఆందోళన చెందకండి మరియు ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితిని నేరుగా ఎదుర్కోండి.
ఆరోగ్య సంజీవనీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని ఈ విధంగా కవర్ చేస్తుంది*:
a) హాస్పిటలైజేషన్:
✓ రూమ్ రెంట్, బోర్డింగ్, నర్సింగ్ ఖర్చులు
✓ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)/ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ (ICCU)
✓ రోడ్ అంబులెన్స్ కవర్
b) జాబితాలో ఉన్న ఆధునిక చికిత్స పద్ధతులు
c) అన్ని డే కేర్ చికిత్సలు
డి) AYUSH చికిత్స: పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా, ప్రతీ పాలసీ సంవత్సరంలో ఆయుర్వేదం, యోగా మరియు నేచురోపతి, యునాని, సిద్ధ మరియు హోమియోపతి ఔషధ వ్యవస్థల కింద, రోగి సంరక్షణ మరియు చికిత్స కోసం అయ్యే వైద్య ఖర్చులు ఏ AYUSH హాస్పిటల్‌లో నైనా ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం పరిమితి వరకు కవర్ చేయబడతాయి.
ఇ) కంటిశుక్లం చికిత్స: కంటిశుక్లం చికిత్స కోసం అయ్యే వైద్య ఖర్చులు
*పరిమితులకు లోబడి
ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఒక రోగిని లేదా హాస్పిటల్‌లో డే కేర్ చికిత్సలో భాగంగా ఈ క్రింది విధానాలను కవర్ చేస్తుంది*:
a) గర్భాశయ ధమని ఎంబోలైజేషన్ మరియు HIFU (హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్)
b) బెలూన్ సినుప్లాస్టీ
c) డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్
d) ఓరల్ కీమోథెరపీ
e) ఇమ్యునోథెరపీ - మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్‌గా ఇవ్వబడుతుంది
f) ఇంట్రా విట్రియల్ ఇంజెక్షన్లు
g) రోబోటిక్ సర్జరీలు
h) స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీలు
i) శ్వాసనాళ థర్మోప్లాస్టీ
j) ప్రోస్టేట్ యొక్క బాష్పీభవనం (గ్రీన్ లేజర్ చికిత్స లేదా హోల్మియం లేజర్ చికిత్స)
k) IONM – (ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్)
l) స్టెమ్ సెల్ థెరపీ: హేమాటోలాజికల్ పరిస్థితులను కవర్ చేయడానికి, ఎముక మజ్జ మార్పిడి కోసం హేమాటోపోయిటిక్ మూల కణాలు.
*పరిమితులకు లోబడి
ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో రెండు రకాలు ఉన్నాయి, రెండూ ఒక సంవత్సరం వ్యవధితో వస్తాయి:
a) ఆరోగ్య సంజీవనీ పాలసీ, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ – వ్యక్తిగత పాలసీ
b) ఆరోగ్య సంజీవనీ పాలసీ, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ - ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ
ప్రీమియం చెల్లింపు పూర్తిగా లేదా వాయిదాల రూపంలో చేయవచ్చు - అర్ధ వార్షిక, త్రైమాసిక, నెలవారీ.
ఆరోగ్య సంజీవనీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఒక సంవత్సరం కాలం పాటు కవర్ చేయబడతారు.
ఆరోగ్య సంజీవనీ పాలసీ లైఫ్‌టైం రెన్యూవల్ ప్రయోజనాలతో వస్తుంది.
ఫ్యామిలీ డిస్కౌంట్: అర్హత కలిగిన 2 కుటుంబ సభ్యులు ఒకే పాలసీ పరిధిలో ఉంటే 10% ఫ్యామిలీ డిస్కౌంట్ మరియు అర్హత కలిగిన కుటుంబ సభ్యులలో 2 కంటే ఎక్కువ మంది ఒకే పాలసీ పరిధిలో ఉంటే 15% డిస్కౌంట్ వర్తిస్తుంది. అంతేకాకుండా, ఈ ఫ్యామిలీ డిస్కౌంట్ కొత్త పాలసీలతో పాటు రెన్యూవల్ పాలసీలకు కూడా అందించబడుతుంది.
ఆన్‌లైన్/డైరెక్ట్ బిజినెస్ డిస్కౌంట్: ప్రత్యక్షంగా/ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా అండర్‌రైట్ చేయబడిన పాలసీల కోసం, ఈ ప్రోడక్ట్‌లో 5% డిస్కౌంట్ అందించబడుతుంది.
గమనిక: ఉద్యోగి డిస్కౌంట్ పొందే ఉద్యోగులకు ఈ డిస్కౌంట్ వర్తించదు
అందించే సేవలో ఎటువంటి అంతరాయం లేకుండా, నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ సదుపాయం సంవత్సరం అంతటా 24x7 అందుబాటులో ఉంటుంది. నగదురహిత సెటిల్‌మెంట్ పొందగల ఆసుపత్రుల జాబితా ఎటువంటి నోటీసు లేకుండా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అడ్మిట్ అవడానికి ముందు మీరు తప్పనిసరిగా హాస్పిటల్ జాబితాను చెక్ చేయాలి. అప్‌డేట్ చేయబడిన జాబితా మా వెబ్‌సైట్‌లో మరియు మా కాల్ సెంటర్ వద్ద అందుబాటులో ఉంటుంది. క్యాష్‌లెస్ సౌకర్యం పొందే సమయంలో బజాజ్ అలియంజ్ హెల్త్ కార్డుతో పాటు ప్రభుత్వ ID ప్రూఫ్ కూడా తప్పనిసరి.
మీరు క్యాష్‌లెస్ క్లెయిమ్‌లను ఎంచుకున్నప్పుడు, కింది దశలను అనుసరించండి:
పై సేవల కోసం అయ్యే ఖర్చును మీరు మాత్రమే భరించాలి మరియు డిశ్చార్జీకి ముందు నేరుగా హాస్పిటల్‌కు చెల్లించాలి.
పాలసీ ప్రకారం అడ్మిట్‌కు ముందు మరియు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత, సంబంధిత వైద్య ఖర్చులు తిరిగి చెల్లించబడతాయి. వైద్య సేవలకు సంబందించిన ప్రిస్క్రిప్షన్లను మరియు బిల్లులు/రశీదులను, సరిగ్గా సంతకం చేసిన క్లెయిమ్ ఫారంతో పాటు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వారికి సమర్పించాలి.
హాస్పిటలైజేషన్ గురించి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌కు తెలియజేయండి.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోండి.
మీ క్లెయిమ్‌ను ఆఫ్‌లైన్‌లో రిజిస్టర్ చేయడానికి, దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి: 1800-209-5858.
క్లెయిమ్‌ల రీయింబర్స్‌మెంట్ కోసం ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి యొక్క అవసరమైన డాక్యుమెంట్లను, హెల్త్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ (HAT) కు నిర్ణీత కాలపరిమితిలో, క్రింద పేర్కొన్న విధంగా సమర్పించాలి:
క్లెయిమ్ రకం | నిర్దేశించిన సమయ పరిమితి |
హాస్పిటలైజేషన్, డే కేర్ మరియు ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్ | హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయబడిన తేదీ నుండి 30 రోజుల్లోపు |
పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్ | హాస్పిటలైజేషన్ తరువాత చికిత్స పూర్తయిన 15 రోజుల్లోపు |
క్లెయిమ్ డాక్యుమెంట్ల పూర్తి సెట్‌ను ఇక్కడికి చేరవేయాల్సి ఉంటుంది
హెల్త్ అడ్మినిస్ట్రేషన్ టీమ్,
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.
2వ అంతస్తు, బజాజ్ ఫిన్‌సర్వ్ బిల్డింగ్, Weikfield IT పార్క్ వెనుక, ఆఫ్ అహ్మద్‌నగర్ రోడ్, విమాన్ నగర్-పూణే - 411 014.
ఆరోగ్య సంజీవనీ, హాస్పిటలైజేషన్ సందర్భంలో ఆర్థిక భారం నుండి మిమ్మల్ని రక్షించే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. జరగరానిది జరిగి, చికిత్స కోసం మీ వద్ద తగినంత డబ్బు లేకపోవడం గురించి చింతించకుండా, మీకు నచ్చినట్లుగా మీ జీవితాన్ని ఆనందంగా గడిపేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.
అవును, ఆరోగ్య సంజీవని పాలసీతో మీరు మీ కోసం, చట్టపరమైన మీ జీవిత భాగస్వామి కోసం, మీపై ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామల కోసం వ్యక్తిగత మరియు ఫ్లోటర్ ఈ రెండు ఆప్షన్‌ల కింద కవరేజిని పొందవచ్చు
స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద SI ఎంపికలను అర్థం చేసుకోవడానికి దయచేసి క్రింది పట్టికను చూడండి:
వరుస. సంఖ్య | కవరేజ్ | ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం (కనిష్ఠంగా) | ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం (గరిష్టంగా) | వ్యాఖ్యలు |
1 | హాస్పిటలైజేషన్ | రూ. 1,00,000 | రూ. 5,00,000 | 1 రోజుకు గరిష్టంగా రూ.5000/- చొప్పున, ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తంలో 2% వరకు రూమ్ రెంట్, బోర్డింగ్, నర్సింగ్ ఖర్చులు 2 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) / ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ (ICCU) - ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 5%, ప్రతిరోజు గరిష్టంగా రూ.10,000/- వరకు 3 ప్రతీ హాస్పిటలైజేషన్ కోసం, రోడ్ అంబులెన్స్ ఖర్చులు గరిష్టంగా రూ. 2000/ |
2 | AYUSH చికిత్స | రూ. 1,00,000 | రూ. 5,00,000 | |
3 | కంటిశుక్లం చికిత్స | 25% ఇన్సూరెన్స్ మొత్తం లేదా రూ. 40, 000 / - ప్రతీ పాలసీ వ్యవధిలో, ప్రతి కంటి కోసం, ఏది తక్కువైతే అది. | ||
4 | హాస్పిటలైజేషన్‌కు పూర్వం | హాస్పిటలైజేషన్ బీమా మొత్తం లోపు లేదా మొత్తం వరకు | 30 రోజులు | |
5 | హాస్పిటలైజేషన్ అనంతరం | 60 రోజులు | ||
6 | ఆధునిక చికిత్స పద్ధతులు | హాస్పిటలైజేషన్ SI లో50% | 1 గర్భాశయ ధమని ఎంబోలైజేషన్ మరియు HIFU (హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్) 2 బెలూన్ సినుప్లాస్టీ 3 డీప్ బ్రెయిన్ స్టిములేషన్ 4 ఓరల్ కీమోథెరపీ 5 ఇమ్యూనోథెరపీ - మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్‌గా ఇవ్వబడుతుంది 6 ఇంట్రా విట్రియల్ ఇంజెక్షన్లు 7 రోబోటిక్ సర్జరీలు 8 స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీలు 9 బ్రాంకియల్ థర్మోప్లాస్టీ 10 ప్రోస్ట్రేట్ యొక్క బాష్పీభవనం (గ్రీన్ లేజర్ చికిత్స లేదా హోల్మియం లేజర్ చికిత్స) 11 IONM – (ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్) 12 స్టెమ్ సెల్ థెరపీ: హేమాటోలాజికల్ పరిస్థితులను కవర్ చేయడానికి, ఎముక మజ్జ మార్పిడి కోసం హేమాటోపోయిటిక్ మూల కణాలు |
హాస్పిటలైజేషన్, ప్రీ-హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు అనేవి ఆరోగ్య సంజీవనీ పాలసీ కింద కవర్ చేయబడతాయి.
మీరు క్రింద పేర్కొన్న దశలను అనుసరిస్తూ ఆరోగ్య సంజీవనీ హెల్త్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయవచ్చు:
ఈ పాలసీ కోసం ప్రీమియంను మీరు వాయిదాల రూపంలో చెల్లించవచ్చని దయచేసి గమనించండి, వీటిని వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన చెల్లించవచ్చు.
మీరు ఈ స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని పొందడానికి అర్హులు ఒకవేళ:
దయచేసి గమనించండి మీ పిల్లలు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు మరియు ఆర్థికంగా స్వతంత్రులు అయితే, తదుపరి రెన్యూవల్స్‌లో వారు కవరేజ్ కోసం అర్హత పొందలేరు.
ఆరోగ్య సంజీవనీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద సబ్-లిమిట్స్ ఇవి:
వార్షిక పాలసీ ప్రయోజనం/విధానం | ఉప-పరిమితి |
ప్రతి రోజు రూమ్ రెంట్ - సాధారణం | గరిష్టంగా రూ. 5000 కు లోబడి, బీమా చేయబడిన మొత్తంలో 2%/- |
ప్రతి రోజు ICU/ICCU ఖర్చులు | గరిష్టంగా రూ. 10,000 కు లోబడి, బీమా చేయబడిన మొత్తంలో 5%/- |
కంటిశుక్లం సర్జరీ | ప్రతి కంటి కోసం, ఇన్సూరెన్స్ మొత్తంలో 25% లేదా రూ. 40,000/-, ఏది తక్కువగా ఉంటే అది |
రోడ్ అంబులెన్స్ | ప్రతి హాస్పిటలైజేషన్ కోసం రూ. 2000/ |
ఆధునిక చికిత్స పద్ధతులు | బీమా చేయబడిన మొత్తంలో 50% |
రెన్యూవల్ సమయంలో లేదా ఏ సమయంలోనైనా ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని, కంపెనీ యొక్క అండర్‌రైటింగ్ నిబంధనలకు లోబడి మార్చుకోవచ్చు (పెంచవచ్చు/తగ్గించవచ్చు). SI లో ఏదైనా పెరుగుదల కోసం, అనగా ఇన్సూరెన్స్ మొత్తం యొక్క మెరుగైన భాగం కోసం మాత్రమే వెయిటింగ్ పీరియడ్ తాజాగా మొదలవుతుంది.
అవును, మీరు ఈ పాలసీని ఎంచుకున్నప్పుడు 5% తప్పనిసరి కో-పేమెంట్ వర్తింపజేయబడుతుంది.
ఒకవేళ ఇన్సూర్ చేయబడిన వ్యక్తి హాస్పిటల్‌లో ప్రవేశాన్ని కోరుకుంటే, వినియోగ వస్తువులు మరియు మందులను మినహాయించి అన్ని హాస్పిటలైజేషన్ ఖర్చులపై 5% కో-పేమెంట్ వర్తిస్తుంది.
మీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ అద్భుతమైనది, యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్రాసెస్ సజావుగా సాగుతుంది.
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ అపారమైన మద్దతునిచ్చారు మరియు అందుకు నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ పాలసీ ప్రయోజనాలను చాలా చక్కగా వివరించారు. ఆమె మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని కలిగి ఉన్నారు మరియు చాలా బాగా వివరించారు.
హాస్పిటలైజేషన్ సమయంలో మీ ఆర్థిక భారాన్ని నిర్వహించడానికి ఆరోగ్య సంజీవనీ హెల్త్ ఇన్సూరెన్స్
ఒక కోట్ పొందండిమీరు అత్తమామలు, కజిన్స్ వంటి మీ ఇతర కుటుంబ సభ్యులని కూడా కవర్ చేయవచ్చు.
ఈ పాలసీ క్రింద లైఫ్‌టైమ్ రెన్యూవల్ ప్రయోజనం అందుబాటులో ఉంది.
మా నగదురహిత మరియు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌తో మేము, మీ ఫైలింగ్, ట్రాకింగ్ మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను చాలా సులభమైనదిగా మరియు సౌకర్యవంతంగా చేస్తాము.
వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు.
కొత్త ప్రపోజల్స్ విషయంలో, 45 సంవత్సరాల వయస్సు పరిమితి వరకు, మీరు ఏ వైద్య పరీక్షల కోసం వెళ్లనవసరం లేదు.
ప్రతి క్లెయిమ్ రహిత పాలసీ సంవత్సరానికి (నో క్లెయిములు రిపోర్ట్ చేయబడవు) సంబంధించి క్యుములేటివ్ బోనస్ 5% పెరుగుతుంది, అయితే మరింత చదవండి
ప్రతీ క్లెయిమ్ రహిత పాలసీ సంవత్సరానికి (ఎలాంటి క్లెయిమ్‌లు లేకపోతే) సంబంధించి కుములేటివ్ బోనస్ 5% పెరుగుతుంది, అయితే, ప్రస్తుత పాలసీ ఎలాంటి విరామం లేకుండా కంపెనీ కింద రెన్యూవ్ చేయబడితే, ఈ బోనస్ ఇన్సూరెన్స్ మొత్తంలో గరిష్టంగా 50% కి లోబడి ఉంటుంది.
బీమా దారు లేదా బీమా చేయబడిన వ్యక్తి (లు), పాలసీ స్వీకరించిన తేదీ నుండి పదిహేను రోజుల వ్యవధి వరకు, పాలసీ నిబంధనలను సమీక్షించడానికి అనుమతించబడతారు మరింత చదవండి
పాలసీ నిబంధనలు, షరతులను సమీక్షించడానికి మరియు ఆమోదయోగ్యం కాకపోతే దానిని తిరిగి ఇవ్వడానికి, బీమా దారు లేదా బీమా చేయబడిన వ్యక్తి (లు), పాలసీని స్వీకరించిన తేదీ నుండి పదిహేను రోజుల వ్యవధి వరకు అనుమతించబడతారు.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
సుందర్ కుమార్ ముంబై
మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు.
పూజ ముంబై
బజాజ్ అలియంజ్ చాలా సమాచారాన్ని అందించే సహాయక ప్రతినిధులను కలిగి ఉంది.
నిధి సూర ముంబై
పాలసీ జారీ అనేది చాలా వేగవంతమైనది మరియు సరళమైనది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి