Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్

జీవితంలో మంచి విషయాలు శాశ్వతంగా ఉంటాయి

ఇతర వాల్యూ యాడెడ్ సేవలతో పాటు ఉత్తమ కవరేజ్‌ని మీకు అందించే మా ప్రయత్నంలో, ఆన్‌లైన్ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సిస్టమ్ అనేది మీ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. మీ కోసం సౌకర్యవంతమైన క్లెయిమ్ ప్రాసెస్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మీరు మీ క్లెయిమ్‌ని రిజిస్టర్ చేసుకోవచ్చు, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయవచ్చు మరియు స్టేటస్‌ని తక్షణమే తెలుసుకోవచ్చు.

సలహాని చూడటానికి క్లిక్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి?

మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోండి

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ మీ సౌలభ్యం కోసం రూపొందించబడింది. మీ డాక్టర్ చికిత్స లేదా హాస్పిటలైజేషన్‌కు సలహా ఇస్తే, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో క్లెయిమ్‌ను తెలియజేయడం మీ మొదటి దశ . నగదురహిత క్లెయిమ్ కోసం, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి తప్పనిసరిగా ప్లాన్ చేయబడిన అడ్మిషన్‌కు 48 గంటల్లోపు తెలియజేయాలి మరియు అత్యవసర అడ్మిషన్ విషయంలో 24 గంటల్లోపు హాస్పిటల్ యొక్క థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టిపిఎ) ప్రీ-ఆథరైజేషన్ కోసం బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క హెల్త్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ (హెచ్ఎటి)తో కనెక్ట్ అయ్యే ఏదైనా నెట్‌వర్క్ హాస్పిటల్‌ను సందర్శించాలి. ఆమోదం పొందిన తర్వాత, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా ఆసుపత్రితో మీ వైద్య ఖర్చులను సెటిల్ చేస్తుంది. మీరు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను ఇష్టపడితే, ఏదైనా ఆసుపత్రిని ఎంచుకోండి, ప్రారంభ ఖర్చులను కవర్ చేయండి మరియు తరువాత అసలు డాక్యుమెంట్లను బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించండి, ఇది మీ క్లెయిమ్‌ను సమర్థవంతంగా ప్రాసెస్ చేస్తుంది. అలాగే మేము అన్ని ప్యానెల్డ్ మరియు నాన్ ప్యానెల్డ్ ఆసుపత్రులలో అందరికీ నగదురహిత సదుపాయాన్ని అందిస్తున్నాము .

ఇతర ప్రోడక్టులు

మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్

  • 1

    చికిత్స లేదా హాస్పిటలైజేషన్ కోసం మీ డాక్టర్ సలహా ఇస్తారు

  • 2

    మీ హెల్త్ ఇన్సూరెన్స్‌పై క్లెయిమ్‌ను తెలియజేయండి

  • 3

    నెట్‌వర్క్ హాస్పిటల్‌ని సందర్శించండి (క్యాష్‌లెస్ కోసం) లేదా మీకు నచ్చిన హాస్పిటల్‌ని సందర్శించి, తదనుగుణంగా చెల్లించండి (రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం)

  • 4

    నగదురహిత చికిత్స కోసం నెట్‌వర్క్ హాస్పిటల్‌‌ యొక్క టిపిఎ డెస్క్ బ్యాజిక్ ను సంప్రదించండి (నగదు రహిత దావా కోసం) లేదా డిశ్చార్జ్ తర్వాత హాస్పిటల్‌కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను బ్యాజిక్ - హెచ్ఎటి కి (రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం) సమర్పించండి

  • 5

    మా వద్దనున్న టిపిఎ లు

మాతో అనుబంధం ఉన్న టిపిఎల జాబితా

జీవితం అనేది ఒక ఊహించని రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. కానీ, అన్ని అస్థిరతల మధ్య, అన్ని సమయాల్లో మీ పక్షాన ఉండటానికి మీరు మాపై ఆధారపడవచ్చు.


మీరు ఆన్‌లైన్‌లో మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ని ఫైల్ చేయాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేయండి. అందుకోసం, మీరు టోల్ ఫ్రీ నంబర్ 1800-209-5858 ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తాము.


క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం

ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, మేము మీ ఆరోగ్యాన్ని కోరుకుంటాము



  • పూర్తి నగదురహిత సదుపాయం కోసం బజాజ్ అలియంజ్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లో దేనినైనా సంప్రదించండి
  • హాస్పిటల్ మీ వివరాలను ధృవీకరిస్తుంది మరియు సరిగ్గా నింపిన ప్రీ-ఆథరైజేషన్ ఫారమ్‌ను, బజాజ్ అలియంజ్ - హెల్త్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ (హెచ్ఎటి) కు పంపిస్తుంది

  • మేము పాలసీ ప్రయోజనాలతో, ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ వివరాలను సక్రమంగా ధృవీకరిస్తాము మరియు 1 పని దినాలలో హెల్త్‌కేర్ ప్రొవైడర్‌కు మా నిర్ణయాన్ని తెలియజేస్తాము


యే! మీ నగదురహిత క్లెయిమ్ ఆమోదించబడింది



  • మేము 60 నిమిషాల్లో మీ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌కు మొదటి రెస్పాన్స్‌ని పంపుతాము

  • మా నెట్‌వర్క్ హాస్పిటల్‌లో మీ చికిత్స ఖర్చులు మా ద్వారానే సెటిల్ చేయబడతాయి, వైద్య బిల్లుల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు


మా కోసం ఒక ప్రశ్న ఉన్నట్లుగా అనిపిస్తోంది



  • హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రాసెస్‌లను వేగంగా ప్రారంభించేందుకు అనుమతించే మరింత సంబంధిత సమాచారాన్ని కోరుతూ మేము హెల్త్‌కేర్ ప్రొవైడర్‌కు ఒక ప్రశ్న లేఖను పంపుతాము

  • మేము అదనపు సమాచారాన్ని అందుకున్న తర్వాత, 7 పని దినాలలో మీ హెల్త్ కేర్ ప్రొవైడర్‌కు ఆథరైజేషన్ లెటర్‌ని పంపుతాము

  • మా నెట్‌వర్క్ హాస్పిటల్ మీకు చికిత్సను అందిస్తుంది మరియు మీరు వైద్య బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

క్షమించండి, మీ క్లెయిమ్ తిరస్కరించబడింది



  • మేము హెల్త్ కేర్ ప్రొవైడర్‌కు తిరస్కరణ లెటర్‌ని పంపుతాము

  • పూర్తిగా చెల్లించే విధంగా, ప్రొవైడర్ చికిత్సను అందిస్తారు

  • అయితే, రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్‌ని మీరు తరువాతి తేదీల్లో ఖచ్చితంగా ఫైల్ చేయవచ్చు
హెల్త్ ఇన్సూరెన్స్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం

ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, మేము మీ ఆరోగ్యాన్ని కోరుకుంటాము



  • హాస్పిటలైజేషన్ సంబంధిత అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను సేకరించి, వాటిని బ్యాజిక్ హెచ్ఎటి కి సమర్పించండి

  • మేము అవసరమైన డాక్యుమెంట్లకు కస్టమరీ వెరిఫికేషన్‌ని నిర్వహిస్తాము


ఓహ్, మాకు మరికొంత సమాచారం కావాలి



  • అటువంటి లోపం గురించి మీకు ముందస్తు సమాచారం పంపుతాము, తద్వారా మీకు మరింత సమాచారం అందించడానికి తగిన సమయం ఉంటుంది

  • అవసరమైన డాక్యుమెంట్లను మరియు మరికొంత విచారణలను స్వీకరించిన తరువాత, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ని ప్రారంభించడానికి మరియు 10 పని దినాలలో ECS ద్వారా చెల్లింపును విడుదల చేయడానికి, మీరు మాపై ఆధారపడవచ్చు (నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉండవచ్చు)

  • ఒకవేళ ఇంకా మీరు పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను మాకు అందించడంలో విఫలమైతే, సమాచారం ఇచ్చిన తేదీ నుండి ప్రతీ 10 రోజులకు ఒకసారి, మేము మీకు మూడు రిమైండర్‌లను పంపుతాము

  • అయితే, సమాచారం ఇచ్చిన తేదీ నుండి 3 రిమైండర్‌లకు (30 రోజులు) మించి పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను అందజేయడంలో మీరు విఫలమైతే, మేము బలవంతంగా క్లెయిమ్‌ని మూసివేసి మరియు దానికి సంబంధించిన ఒక లెటర్‌ని మీకు పంపించవలసి వస్తుందని దయచేసి గుర్తుంచుకోండి


యే! మీ క్లెయిమ్ ఆమోదించబడింది


మేము డాక్యుమెంట్ల ప్రామాణికత యొక్క కస్టమరీ వెరిఫికేషన్‌ని మొదలుపెడతాము మరియు పాలసీ పరిధిలో అనుమతించబడితే, చెల్లింపును 7 పని దినాలలో ECS ద్వారా విడుదల చేస్తాము.


అయితే, మీ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, పాలసీ పరిధిలోకి రాకపోతే మేము క్లెయిమ్‌ని తిరస్కరించాల్సి వస్తుంది మరియు అది తెలుపుతూ మీకు ఒక లెటర్‌ని పంపించాల్సి ఉంటుంది.

క్లెయిమ్ ఫారంలు
  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ద్వారా సరిగ్గా నింపబడిన మరియు సంతకం చేయబడిన హాస్పిటలైజేషన్ క్లెయిమ్ ఫారం
  • ఒరిజినల్ డిశ్చార్జ్ సమ్మరీ సర్టిఫికేట్
  • ఖర్చుల యొక్క వివరణాత్మక విశ్లేషణతో కూడిన ఒరిజినల్ హాస్పిటల్ బిల్లు
  • పేమెంట్ చేసిన ఒరిజినల్ రశీదులు
  • అన్ని ల్యాబ్ మరియు టెస్ట్ రిపోర్టులు
  • ఇంప్లాంట్స్ విషయంలో ఇన్వాయిస్/స్టిక్కర్లు/బార్‌కోడ్ యొక్క కాపీ
  • డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్
  • కెవైసి ఫారం
  • పాలసీ హోల్డర్/ప్రపోజర్ ద్వారా పూర్తిగా నింపబడిన మరియు సంతకం చేయబడిన NEFT ఫారమ్
  • ఇన్సూర్ చేసుకున్న వ్యక్తి నింపిన మరియు సంతకం చేసిన క్లెయిమ్ ఫారం
  • ఒరిజినల్ డెత్ సమ్మరీ డాక్యుమెంట్
  • ఖర్చుల యొక్క వివరణాత్మక విశ్లేషణతో కూడిన ఒరిజినల్ హాస్పిటల్ బిల్లు
  • పేమెంట్ చేసిన ఒరిజినల్ రశీదులు
  • అన్ని ల్యాబ్ మరియు టెస్ట్ రిపోర్టులు
  • ఇంప్లాంట్స్ విషయంలో ఇన్వాయిస్/స్టిక్కర్లు/బార్‌కోడ్ యొక్క కాపీ
  • డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్
  • అఫిడవిట్ మరియు ఇండెమినిటీ బాండ్‌ని కలిగి ఉన్న లీగల్ హెయిర్ సర్టిఫికెట్
  • పాలసీ హోల్డర్/ప్రపోజర్ ద్వారా పూర్తిగా నింపబడిన మరియు సంతకం చేయబడిన NEFT ఫారమ్.

    పర్సనల్ యాక్సిడెంట్ క్లెయిములు




  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి / క్లెయిమెంట్ ద్వారా సరిగ్గా నింపబడిన మరియు సంతకం చేయబడిన క్లెయిమ్ ఫారం.
  • పాలసీపై లబ్ధిదారుని పేరు మరియు ఇన్సూర్ చేయబడిన వ్యక్తి / నామినీ నెఫ్ట్ వివరాలు.
  • బ్రాంచ్, బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సి కోడ్, అకౌంట్ రకం పేర్కొంటూ పూర్తిగా నింపబడిన నెఫ్ట్ వివరాలు, ప్రీ-ప్రింటెడ్ చెక్ అందుబాటులో లేకపోతే ఒరిజినల్ ప్రీ-ప్రింటెడ్ క్యాన్సిల్ చెక్‌తో నామినీ / క్లెయిమెంట్ ద్వారా సంతకం చేయబడిన పూర్తి అకౌంట్ నంబర్ దయచేసి బ్యాంక్ పాస్ బుక్‌లో 1వ పేజీ/ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను అందించండి, ఇది లబ్ధిదారుని పేరు మరియు పూర్తి అకౌంట్ నంబర్ అలాగే ఐఎఫ్ఎస్‌సి కోడ్‌ను స్పష్టంగా సూచిస్తుంది. (ప్రాసెస్ చేయడానికి ఫారంలోని అన్ని ఫీల్డ్‌లు తప్పనిసరి).
  • నామినీ / క్లెయిమెంట్ / ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఆధార్ కార్డ్ మరియు పాన్‌కార్డ్ వివరాలు.
  • జీతం వివరాల కోసం పాలసీ జారీ చేసే సమయంలో మాకు జీతం స్లిప్/ఐటిఆర్ అవసరం.

    ప్రమాదవశాత్తు హాస్పిటలైజేషన్




  • ఒరిజినల్ డిశ్చార్జ్ వివరాలు.
  • అన్ని మునుపటి కన్సల్టేషన్ పేపర్లు.
  • రోగనిర్ధారణకు మద్దతు ఇచ్చే ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు.
  • ఆపరేషన్ థియేటర్ నోట్స్.
  • వివరణాత్మక బిల్లు విశ్లేషణ మరియు చెల్లించిన రసీదులతో ఒరిజినల్ తుది బిల్లు.
  • ఒరిజినల్ ఫార్మసీ మరియు ఇన్వెస్టిగేషన్ బిల్లులు.

    మరణం




  • డెత్ సర్టిఫికెట్ యొక్క అటెస్టెడ్ కాపీ.
  • ఎఫ్‌ఐఆర్ / పంచనామా / విచారణ యొక్క ధృవీకరించబడిన కాపీ.
  • పోస్ట్ మార్టం రిపోర్ట్ యొక్క ధృవీకరించబడిన కాపీ.
  • విసెరా / కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ యొక్క ధృవీకరించబడిన కాపీ ఏదైనా ఉంటే.
  • హాస్పిటలైజేషన్ డాక్యుమెంట్లు, ఏవైనా ఉంటే.
  • మరణం సంభవించిన సందర్భంలో పాలసీ కాపీ పై నామినీ నిర్వచించబడకపోతే, మాకు క్రింది డాక్యుమెంట్లు అవసరం.
  • రూ. 200 కి అఫిడవిట్ మరియు నష్టపరిహార బాండ్‌‌తో కూడిన చట్టపరమైన వారసుల సర్టిఫికెట్ (జోడించబడిన ఫార్మాట్ ప్రకారం). అది నోటరీ చేయబడి ఉండాలి మరియు చట్టపరమైన వారసులందరి ద్వారా సరిగ్గా సంతకం చేయబడాలి.
  • నామినీ మైనర్ అయితే, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క సంరక్షకుడిని పేర్కొంటూ కోర్టు నుండి ఫర్మానా సర్టిఫికెట్ అవసరం..

    శాశ్వత పాక్షిక వైకల్యం మరియు శాశ్వత పూర్తి వైకల్యం




  • పర్సనల్ యాక్సిడెంట్ క్లెయిమ్ ఫారంలో సరిగ్గా నింపబడిన మెడికల్ సర్టిఫికెట్.
  • రోగనిర్ధారణకు మద్దతు ఇచ్చే ఎక్స్-రే ఫిల్మ్స్ /ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు.
  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వైకల్యాన్ని ధృవీకరించే ప్రభుత్వ అథారిటీ నుండి శాశ్వత పూర్తి వైకల్యం మరియు శాశ్వత పాక్షిక వైకల్యం సర్టిఫికెట్.
  • వైకల్యానికి మద్దతుగా, ప్రమాదానికి ముందు మరియు తరువాత తీసిన రోగి ఫోటో.

    తాత్కాలిక పూర్తి వైకల్యం / ఆదాయం నష్టం




  • గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ క్లెయిమ్ ఫారంలో సరిగ్గా నింపబడిన మెడికల్ సర్టిఫికెట్
  • ఖచ్చితమైన సెలవు వ్యవధిని పేర్కొంటూ, యజమాని ద్వారా సరిగ్గా సంతకం చేయబడి సీల్ చేయబడిన యజమాని నుండి లీవ్ సర్టిఫికెట్.
  • టిటిడి వ్యవధిలో చికిత్స వివరాలతో అన్ని కన్సల్టేషన్ పేపర్లు.
  • వైకల్యం రకం, వైకల్యం కాలం మరియు రోగి తన విధులను తిరిగి ప్రారంభించడానికి ట్రీట్‌మెంట్ చేసే డాక్టర్ నుండి తగిన ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే ఫైనల్ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్.
  • రోగనిర్ధారణకు మద్దతు ఇచ్చే ఎక్స్-రే ఫిల్మ్స్ /ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు.

    పిల్లల విద్య కొరకు బోనస్




  • మరణం మరియు పిటిడి విషయంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పిల్లలు అక్కడ చదువుతున్నారని పేర్కొంటూ దయచేసి స్కూల్ అధికారుల నుండి బోనఫైడ్ సర్టిఫికెట్‌ను అందించండి. (పేరు, S/D/o, పుట్టిన తేదీ మరియు తరగతి) స్కూల్ గుర్తింపు కార్డ్.
  • భారీ ఖర్చులు మరియు రవాణా ఖర్చులు
  • పేమెంట్ చేసిన ఒరిజినల్ రశీదులు

    హాస్పిటల్ క్యాష్ ఖర్చులు




  • తుది బిల్లు మరియు డిశ్చార్జ్ సారాంశం కాపీ.
  • రోగనిర్ధారణ కోసం ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు.

హెల్త్ ఇన్సూరెన్స్ టిపిఎ క్లెయిమ్ స్థితి

అవాంతరాలు లేని క్లెయిమ్ మద్దతును అందించడానికి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ Medi Assist, FHPL, GHPL, మరియు MDIndiaతో సహా భారతదేశం యొక్క అనేక హెల్త్ ఇన్సూరెన్స్ టిపిఎలతో భాగస్వామ్యం కలిగి ఉంది. భారతదేశంలోని మీ హెల్త్ ఇన్సూరెన్స్ టిపిఎ క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయడానికి, మీరు నేరుగా టిపిఎను సంప్రదించవచ్చు లేదా బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఆన్‌లైన్ క్లెయిమ్ ట్రాకింగ్ సేవలను ఉపయోగించవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మీ మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ గురించి సకాలంలో అప్‌డేట్లతో మీకు తెలియజేస్తుంది. నగదురహిత క్లెయిముల కోసం, అప్రూవల్స్ నిర్వహించడానికి మరియు స్థితి అప్‌డేట్లను అందించడానికి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఆసుపత్రి సంప్రదింపులు జరుపుతుంది, అయితే రీయింబర్స్‌మెంట్ల కోసం, అవసరమైన ఏదైనా అదనపు సమాచారంపై మీరు అప్‌డేట్లను అందుకుంటారు. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని డాక్యుమెంట్లు అందుకున్న తర్వాత 10 పని రోజుల్లోపు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులను విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంది, క్లిష్టమైన సమయాల్లో ఇది ఒక మృదువైన అనుభవాన్ని నిర్ధారిస్తుంది.

General Insurance FAQs

మీ సందేహాలకు సమాధానాలు

కవర్ నోట్ అంటే ఏమిటి?

ఇది, పాలసీని జారీ చేయడానికి ముందు ఇన్సూరర్ మీకు అందించే ఒక తాత్కాలిక ఇన్సూరెన్స్ సర్టిఫికేట్. మీరు ప్రపోజల్ ఫారంను సరిగ్గా నింపి, సంతకం చేసి మరియు పూర్తి ప్రీమియం చెల్లించిన తర్వాత ఇది అందించబడుతుంది.

ఇది 60 రోజుల వ్యవధి వరకు చెల్లుతుంది (దాని జారీ చేసిన తేదీ నుండి), అలాగే కవర్ నోట్ గడువు ముగిసేలోపు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ మీకు అందించేలా ఇన్సూరెన్స్ కంపెనీని అనుమతిస్తుంది.

పాలసీలో కొన్ని మార్పులు చేయాలనుకుంటే ఏం చెయ్యాలి?

మీరు ఇక్కడ వెతుకుతున్న పదం ఎండార్స్‌మెంట్, ఇది మీ ఇన్సూరెన్స్ పాలసీలో మార్పులకు సంబంధించిన ఒక వ్రాతపూర్వక ఒప్పందం. ఎండార్స్‌మెంట్ అనేది పాలసీ జారీ చేసేటప్పుడు అమలులోకి వస్తుంది. ఇది యాడ్-ఆన్‌లు, మరింత విస్తృతమైన కవరేజీని లేదా కొన్ని పరిమితులను విధించడానికి ప్రవేశపెట్టబడుతుంది.

నో క్లెయిమ్ బోనస్ అంటే ఏమిటి?

మీ పాలసీ వ్యవధిలో మీరు ఒక్క ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయకపోతే మీరు నో క్లెయిమ్ బోనస్ (NCB) కి అర్హులు. ఇది మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీపై ప్రీమియంను తగ్గిస్తుంది, మంచి డ్రైవర్ అయినందుకు గాను ఇది మీకు ఒక గుర్తింపు లాంటిది.

ఒకే తరగతికి చెందిన కొత్త వాహనానికి NCB ని బదిలీ చేయవచ్చు మరియు మీ మోటారు ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసిన 90 రోజుల వరకు ఇది చెల్లుతుంది. కొత్త మెషిన్ ఖరీదైనది అయితే, అధిక ఇన్సూరెన్స్ ప్రీమియంతో పాటు అదనపు అడ్మినిస్ట్రేటివ్ రుసుము కూడా మీ నుండి వసూలు చేయబడవచ్చు.

ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ గార్డ్ పాలసీ అంటే ఏమిటి?

వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, పాలసీదారునికి దాని కవరేజీని పరిమితం చేస్తుండగా, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ గార్డ్ పాలసీ, కుటుంబంలోని ఏ సభ్యుడికైనా ఇన్సూరెన్స్ చేసిన మొత్తాన్ని ఉపయోగించుకునేలా వీలు కల్పిస్తుంది.

నా పాలసీ గడువు ముగిసినప్పుడు ఏమి చేయాలి?

బజాజ్ అలియంజ్‌ని మీ స్పీడ్ డయల్‌ లిస్ట్‌లో ఉంచండి, మీ పాలసీ గడువు ముగిసినట్లయితే మా టోల్ ఫ్రీ నంబర్ 1800-209-5858 కు కాల్ చేయండి. మీకు అవాంతరాలు లేని ఇన్సూరెన్స్ అనుభవాన్ని అందించడం కోసం మేము 24 గంటలు అందుబాటులో ఉంటాము

NRI లు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఎంచుకోవచ్చా? తదుపరి చికిత్స మరియు క్లెయిమ్ కోసం వారు భారతదేశానికి ప్రయాణించగలరా?

అవును, NRI లు భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవచ్చు. మరియు వారు తప్పనిసరిగా భారతదేశానికి వచ్చి వారి పరిస్థితి కోసం చికిత్స పొందవచ్చు మరియు చివరికి హామీ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు.

వారు చేయవలసిందల్లా చిరునామా రుజువు, ITR మొదలైన కొన్ని సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించడం. ఈ డాక్యుమెంట్లను సమర్పించలేకపోతే ఇన్సూరెన్స్ కోసం అర్హత దెబ్బతింటుంది.

ప్లాన్ చేయబడిన/అత్యవసర హాస్పిటలైజేషన్‌ సందర్భాల్లో ఎలా క్లెయిమ్ చేయాలి?

మీ అన్ని డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసి సిద్ధంగా ఉంచండి. మీ వ్యక్తిత్వం యొక్క ప్రాముఖ్యతను ఏది ఢీ కొట్టలేదు, అన్నివేళలా అది మిమ్మల్ని మంచి స్థితిలో ఉంచుతుంది.

గతంలోని వైద్య పరిస్థితి యొక్క ఏదైనా చరిత్ర ఉంటే, దాని గురించి నిజాయితీగా ఉండండి మరియు అలాంటి డాక్యుమెంట్లను అన్ని సమయాల్లో అందుబాటులో ఉంచుకోండి. ఎందుకంటే, సాధారణంగా TPA, ఇది ముందుగా-ఉన్న పరిస్థితి అని లేదా కాదని చివరలో తేలుస్తుంది.

దయచేసి గమనించండి, మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ముందుగానే తెలియజేయాలి మరియు ముందుగానే ఒక ఆథరైజేషన్ లెటర్ తీసుకోవాలి.

నేను నా క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చా?

ఖచ్చితంగా! మా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసినప్పుడు, మీ సమస్య తీరకపోతే, మీరు ఎప్పుడైనా క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లోరిజిస్టర్ చేసుకోవచ్చు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి