Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హాస్పిటల్ క్యాష్ పాలసీ

ఒక టాప్-అప్ క్యాష్ బెనిఫిట్ ప్లాన్

Hospital cash policy provides daily payable benefits

ఊహించని హాస్పిటలైజేషన్ ఖర్చుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

మీ ప్రయోజనాలను పొందండి

ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్

ట్యాక్స్ సేవింగ్

రోజూవారీ నగదు ప్రయోజనం

హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

హాస్పిటల్ బస సమయంలో పాలసీదారులకు ఒక నిర్ణీత రోజువారీ ప్రయోజనాన్ని అందించడం ద్వారా హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ ఒక ముఖ్యమైన మద్దతు వ్యవస్థను అందిస్తుంది. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో, ఈ కవరేజ్ ఆసుపత్రి గది అద్దె, రవాణా మరియు అదనపు వైద్య ఫీజు వంటి వైద్యేతర ఖర్చులను భరించడానికి సహాయపడుతుంది, ఇది కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వైద్య బిల్లులను రీయంబర్స్ చేసే లేదా నేరుగా కవర్ చేసే సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగా కాకుండా, ఈ హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ అనేది ఒక డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ పాలసీ, ఇది మీ అవసరాలకు అనుగుణంగా నిధులను ఫ్లెక్సిబుల్‌గా ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆసుపత్రి ఖర్చుల కోసం అదనపు ఆర్థిక రక్షణ కోరుకునే వారికి ఇది ఒక ఆదర్శవంతమైన యాడ్-ఆన్. ఆసుపత్రిలో ఉండే సమయంలో మనశ్శాంతి కోసం రోజువారీ హాస్పిటల్ క్యాష్ పాలసీని ఎంచుకోండి.

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్ క్యాష్ డైలీ అలవెన్స్ పాలసీ అనేది ఆకస్మిక వైద్య ఖర్చుల నుండి మీకు ఉత్తమ రక్షణను అందించడానికి రూపొందించబడింది. ఈ ప్లాన్‌తో, హాస్పిటల్ బస అంతటా ఆకస్మిక ఖర్చులను కవర్ చేయడానికి మీరు రోజువారీ భత్యం అందుకుంటారు. ఇది ఎందుకు పరిగణించాలో ఇక్కడ ఇవ్వబడింది:

  • రోజువారీ నగదు ప్రయోజనాలు :

    స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడని ఖర్చులతో సహాయపడటానికి, హాస్పిటలైజేషన్ యొక్క ప్రతి రోజు ఒక నిర్ణీత నగదు మొత్తాన్ని అందుకోండి.

  • ఫ్లెక్సిబుల్ ఇన్సూరెన్స్ మొత్తం :

    రోజుకు రూ. 500 నుండి రూ. 2,500 వరకు ఉండే వివిధ కవరేజ్ స్థాయిల నుండి ఎంచుకోండి, ఇది మీ అవసరాల ఆధారంగా ప్రత్యేకమైన కవరేజీని రూపొందించుకోవడానికి మీకు స్వేచ్ఛను అందిస్తుంది.

  • ఐసియు ప్రయోజనాలు :

    ఐసియు అడ్మిషన్ల విషయంలో రోజువారీ నగదు మొత్తాన్ని రెట్టింపు చేయండి, క్లిష్టమైన పరిస్థితులలో అదనపు మద్దతును అందిస్తుంది.

  • పన్ను పొదుపులు :

    చెల్లించిన ప్రీమియంలు సెక్షన్ 80D క్రింద పన్ను మినహాయింపులకు అర్హత కలిగి ఉంటాయి, ఇది ఆర్థిక ఉపశమనం అందిస్తుంది.

  • ఫ్యామిలీ డిస్కౌంట్ :

    మీరు ఒకే పాలసీలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కుటుంబ సభ్యులను కవర్ చేస్తే 5% వరకు డిస్కౌంట్ పొందండి.

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ ప్లాన్ రోజువారీ సపోర్ట్ ఫండ్‌గా పనిచేస్తుంది. మీరు ఆసుపత్రిలో చేరినప్పుడు, మీరు రోజువారీ నగదు భత్యానికి అర్హులు, దీనిని స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడని వైద్యేతర ఖర్చులతో సహా ఏవైనా ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు. ఆసుపత్రి గది అప్‌గ్రేడ్‌ల కోసం చెల్లించడం లేదా అదనపు జేబు ఖర్చులను నిర్వహించడం అయినా, ఆసుపత్రిలో ఉండే సమయంలో రోజువారీ భత్యం ఆర్థిక సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది. మీరు ఈ హాస్పిటల్ డైలీ క్యాష్ పాలసీని ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు, సరైన ఫ్లెక్సిబిలిటీ మరియు రక్షణ కోసం వివిధ ప్రీమియం ప్లాన్లు మరియు పాలసీ నిబంధనల నుండి ఎంచుకోవచ్చు.

బజాజ్ అలియంజ్ వారి హాస్పిటల్ క్యాష్ డైలీ అలవెన్స్‌ ఎందుకు ఎంచుకోవాలి?

హాస్పిటల్ ఖర్చులు మీకు అధిక భారాన్ని కలిగిస్తాయి మరియు మీరు చేసిన మొత్తం సేవింగ్స్ కూడా ఖర్చు అయిపోతాయి. డాక్టర్ ఫీజు, మెడికల్ బిల్లులు, హాస్పిటల్ రూమ్ రెంట్ మరియు మరెన్నో, హాస్పిటలైజెషన్ సందర్భంలో జరిగే లెక్కలేనన్ని ఖర్చులకు జోడించబడతాయి. ఇది మీ కుటుంబం ఇప్పటికే ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి తోడుగా, వారిపై ఆర్థిక భారాన్ని జోడిస్తుంది.

మా హాస్పిటల్ క్యాష్ డైలీ అలవెన్స్ పాలసీతో మేము, హాస్పిటల్‌లో చికిత్స సమయంలో తలెత్తే ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు ఒక పరిష్కారాన్ని అందిస్తాము. హాస్పిటలైజేషన్ సందర్భంలో ఆకస్మిక ఖర్చులను భరించడానికి, ఈ పాలసీ రోజువారీ ప్రయోజనం కింద కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ పాలసీ ఒక యాడ్-ఆన్ పాలసీ మరియు ఇది ఈ పాలసీకి ప్రత్యామ్నాయంగా కొనుగోలు చేయబడదు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.

హాస్పిటల్ క్యాష్ డైలీ అలవెన్స్ అనేది, ఊహించని హాస్పిటలైజెషన్ సమయంలో రోజువారీ నగదు ప్రయోజనాన్ని అందిస్తుంది. పోటీ ప్రీమియం రేట్ల వద్ద ఈ పాలసీని ఎంచుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి .

ప్రతి రోజుకు కవరేజీ

ప్రపోజర్ వయస్సు

ప్రీమియం(రూ.) 
30 రోజుల కోసం కవర్

ప్రీమియం(రూ.) 
60 రోజుల కోసం కవర్

రూ. 500

25 సంవత్సరాల వరకు
25 సంవత్సరాల పైన 40 సంవత్సరాల వరకు
40 సంవత్సరాల పైన 50 సంవత్సరాల వరకు
50 సంవత్సరాల పైన 55 సంవత్సరాల వరకు
55 సంవత్సరాల పైన 60 సంవత్సరాల వరకు

250
400
650
900
1,200

300
525
850
1,200
1,600

రూ. 1,000

25 సంవత్సరాల వరకు
25 సంవత్సరాల పైన 40 సంవత్సరాల వరకు
40 సంవత్సరాల పైన 50 సంవత్సరాల వరకు
50 సంవత్సరాల పైన 55 సంవత్సరాల వరకు
55 సంవత్సరాల పైన 60 సంవత్సరాల వరకు

300
600
900
1,300
1800

500
825
1,800
2,400
3,000

రూ. 2,000

25 సంవత్సరాల వరకు
25 సంవత్సరాల పైన 40 సంవత్సరాల వరకు
40 సంవత్సరాల పైన 50 సంవత్సరాల వరకు
50 సంవత్సరాల పైన 55 సంవత్సరాల వరకు
55 సంవత్సరాల పైన 60 సంవత్సరాల వరకు

600
850
1,700
2,800
3,600

1,000
1,500
3,600
4,400
4,800

రూ. 2,500

25 సంవత్సరాల వరకు
25 సంవత్సరాల పైన 40 సంవత్సరాల వరకు
40 సంవత్సరాల పైన 50 సంవత్సరాల వరకు
50 సంవత్సరాల పైన 55 సంవత్సరాల వరకు
55 సంవత్సరాల పైన 60 సంవత్సరాల వరకు

800
1,100
2,600
3,500
4,600

1,350
1,800
4,200
5,000
5,800

హాస్పిటల్ క్యాష్ డైలీ అలవెన్స్ పాలసీ: మీ ఆరోగ్య సంరక్షణ కోసం విస్తృత ప్రయోజనాలు

హాస్పిటల్ క్యాష్ డైలీ అలవెన్స్ పాలసీ, దాని విస్తృత శ్రేణి ఫీచర్లతో హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవరేజ్ అందిస్తుంది:

  • రోజూవారీ నగదు ప్రయోజనం

    ఈ పాలసీ హాస్పిటల్‌లో చేరిన ప్రతి రోజు నుండి నగదు చెల్లింపు ప్రయోజనాన్ని అందిస్తుంది.

  • ఫ్యామిలీ డిస్కౌంట్

    ఈ పాలసీ క్రింద 2 లేదా అంతకంటే ఎక్కువ కుటుంబ సభ్యులు కవర్ చేయబడితే ఫ్యామిలీ డిస్కౌంట్‌ 5% వరకు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ కొత్త మరియు రెన్యూ చేయబడిన పాలసీలపై వర్తిస్తుంది.

  • డబుల్ క్యాష్ ప్రయోజనం

    ఈ పాలసీ కింద, ICU అడ్మిషన్ విషయంలో నగదు ప్రయోజనం రెట్టింపు అవుతుంది.

  • ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తంలో మెరుగుదల

    రెన్యూవల్ సమయంలో మీరు మీ పాలసీ యొక్క ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

మా టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

Video

సులభమైన, అవాంతరాలు-లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్

క్లెయిమ్ ప్రాసెస్

  • మీరు లేదా మీ తరపున క్లెయిమ్ ఫైల్ చేసే మీ ప్రియమైన వ్యక్తి, మీరు హాస్పిటల్‌లో చేరిన 48 రోజుల్లోపు, విషయాన్నీ మాకు వ్రాత పూర్వకంగా తెలియజేయాలి, అత్యవసర పరిస్థితులలో మరియు ప్లాన్ చేయబడిన హాస్పిటలైజెషన్ సందర్భంలో హాస్పిటలైజెషన్‌కు 48 గంటల ముందు తెలియజేయాలి.
  • మీరు లేదా మీ తరపున క్లెయిమ్ ఫైల్ చేసే మీ ప్రియమైన వ్యక్తి, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన 30 రోజులలోపు, క్రింద జాబితా చేయబడిన డాక్యుమెంట్లను మాకు సమర్పించాలి.
  • మీ మరణం సంభవించినపుడు, మీ తరపున క్లెయిమ్ చేసే మీ ప్రియమైన వ్యక్తి, విషయాన్నీ మాకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలి మరియు 30 రోజులలోపు పోస్ట్ మార్టం రిపోర్ట్ (ఏదైనా ఉంటే) కాపీని మాకు పంపాలి.

అవసరం అయిన డాక్యుమెంట్లు:

  • ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి చేత సంతకం చేయబడిన క్లెయిమ్ ఫారమ్.
  • డిస్చార్జ్ సారాంశం/డిస్ఛార్జ్ సర్టిఫికెట్ యొక్క ఒక కాపీ.
  • ఫైనల్ హాస్పిటల్ బిల్ కాపీ.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

హెల్త్ ఇన్సూరెన్స్‌ని సరళంగా చూద్దాం

హాస్పిటల్ క్యాష్ డైలీ అలవెన్స్ పాలసీ కింద ప్రవేశ వయస్సు ఎంత?

హాస్పిటల్ క్యాష్ డైలీ అలవెన్స్‌ని ఎంచుకోవడానికి కావలసిన అర్హత క్రింద ఇవ్వబడింది:

ప్రతిపాదించేవారు మరియు జీవిత భాగస్వామికి ప్రవేశ వయస్సు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆధారపడిన పిల్లలకు ప్రవేశ వయస్సు 3 నెలల నుండి 21 సంవత్సరాల మధ్య ఉంటుంది.

ఇన్సూరెన్స్‌లో హాస్పిటల్ క్యాష్ అంటే ఏమిటి?

హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేయడానికి ఇన్సూరెన్స్‌లో హాస్పిటల్ క్యాష్ రోజువారీ ఫిక్స్‌డ్ మొత్తాన్ని అందిస్తుంది. ఇది ప్రయాణ లేదా గది అప్‌గ్రేడ్‌లు వంటి ఖర్చులను కవర్ చేయడం ద్వారా సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి ఉండే ఒక సప్లిమెంటల్ పాలసీ. రోజువారీ హాస్పిటల్ క్యాష్ పాలసీ ఎంపికలతో, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఊహించని హాస్పిటల్ ఖర్చులను నిర్వహించడానికి ఒక ఫ్లెక్సిబుల్ పరిష్కారాన్ని అందిస్తుంది, ఇది క్లిష్టమైన సమయాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

హాస్పిటల్ క్యాష్ ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేయాలి?

మీ హాస్పిటల్ క్యాష్ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయడానికి, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్లెయిమ్స్ బృందాన్ని సంప్రదించండి మరియు డిశ్చార్జ్ సారాంశం, హాస్పిటల్ బిల్లులు మరియు రిపోర్టులతో సహా అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి. వేగవంతమైన ప్రాసెసింగ్‌ను నిర్ధారించడానికి క్లెయిమ్స్ ప్రాసెస్ చాలా సులభం మరియు ఇన్-హౌస్ బృందం నేరుగా నిర్వహించబడుతుంది. హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్‌లు సాధారణంగా పాలసీ నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఆమోదించబడతాయి, ఇది హాస్పిటలైజేషన్ సమయంలో నిధులకు వేగవంతమైన యాక్సెస్ అందిస్తుంది.

క్యాష్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?

హాస్పిటల్ క్యాష్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు హాస్పిటల్‌లో చేరిన ప్రతి రోజు ఒక నిర్ణీత రోజువారీ ప్రయోజనాన్ని అందిస్తుంది. సాంప్రదాయక ఇన్సూరెన్స్ లాగా కాకుండా, ఈ హాస్పిటల్ డైలీ క్యాష్ పాలసీ వాస్తవ వైద్య ఖర్చులపై ఆధారపడి ఉండదు. బదులుగా, మీరు ఆసుపత్రిలో చేరిన ప్రతి రోజు ఇది ముందుగా నిర్ణయించబడిన మొత్తాన్ని చెల్లిస్తుంది, దీనిని అదనపు లేదా వైద్యేతర ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు, ఇది అదనపు ఆర్థిక భద్రతను అందిస్తుంది.

ఏ స్కీమ్ నగదు మరియు వైద్య ప్రయోజనాలు రెండింటినీ అందిస్తుంది?

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హెల్త్ గార్డ్ పాలసీ రోజువారీ నగదు ప్రయోజనాలతో వైద్య ఖర్చులను కలుపుతుంది. మీ పాలసీలో హాస్పిటల్ క్యాష్ కవర్‌ను కలిగి ఉండటం అనేది ఆకస్మిక ఖర్చులను కవర్ చేయడం ద్వారా మీ హెల్త్ ఇన్సూరెన్స్‌కు అనుగుణంగా ఉంటుంది, మీరు నగదు ప్రయోజనాలు మరియు వైద్య రక్షణ రెండింటినీ ఒకే ప్యాకేజీలో ఉపయోగించడానికి అనుమతిస్తుంది, ఇది ఆసుపత్రిలో బస సమయంలో సమగ్ర మద్దతును అందిస్తుంది.

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

ఆశీష్ జుంజున్వాలా

2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...

సునీత ఎం అహూజా

లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు

రేని జార్జ్

నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...

హాస్పిటల్ ఖర్చులు? అన్ని జాగ్రత్తలు తీసుకోబడతాయి.

ఇతర వైద్య ఖర్చుల కోసం అందిస్తుంది.

అంతే కాదు, మీ హాస్పిటల్ క్యాష్ డైలీ అలవెన్స్‌తో అదనపు ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

ఈ టాప్-అప్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఆకస్మిక హాస్పిటల్ ఖర్చుల నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది మరియు క్రింద జాబితా చేయబడిన ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది:
Renewability

రెన్యువబిలిటీ

మీరు, మీ హాస్పిటల్ క్యాష్ డైలీ అలవెన్స్ పాలసీని లైఫ్‌టైం కోసం రెన్యూ చేసుకోవచ్చు.

Tax saving

ట్యాక్స్ సేవింగ్

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 D కింద రూ. 1 లక్ష వరకు పన్ను ఆదా.* మరింత చదవండి

ట్యాక్స్ సేవింగ్

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 D కింద రూ. 1 లక్ష వరకు పన్ను ఆదా.*

*మీకు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు మరియు తల్లిదండ్రుల కోసం హాస్పిటల్ క్యాష్ డైలీ అలవెన్స్ పాలసీని ఎంచుకున్న తర్వాత, మీరు మీ పన్నుల పై సంవత్సరానికి రూ. 25,000 మినహాయింపు పొందవచ్చు (మీకు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు లేకపోతే). సీనియర్ సిటిజన్స్ (వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ) అయిన మీ తల్లిదండ్రులకు మీరు ప్రీమియం చెల్లిస్తే, పన్ను ప్రయోజనాల కోసం గరిష్ట హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం రూ 50,000 వద్ద పరిమితం చేయబడుతుంది. అందువల్ల, ఒక పన్ను చెల్లింపుదారుగా మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి మరియు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే, సెక్షన్ 80D క్రింద గరిష్టంగా రూ. 75,000 వరకు పన్ను ప్రయోజనాన్ని పెంచుకోవచ్చు. మీరు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలవారై మరియు మీ తల్లిదండ్రులకు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, సెక్షన్ 80D క్రింద గరిష్ట పన్ను ప్రయోజనం రూ. 1 లక్ష ఉంటుంది.

Multiple sum insured options

ఇన్సూరెన్స్ మొత్తం కోసం అనేక ఎంపికలు

మీరు రోజుకి రూ. 500 నుండి రూ. 2,500 చొప్పున ప్రయోజనం అందించే ఇన్సూరెన్స్ మొత్తం గురించిన ఆప్షన్‌ల నుండి ఎంచుకోండి.

హాస్పిటల్ క్యాష్ డైలీ అలవెన్స్‌ని కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు

  • చేర్పులు

  • మినహాయింపులు

హాస్పిటల్ ఖర్చులు

నెట్‌వర్క్ హాస్పిటల్‌లో ఏదైనా చికిత్స/హాస్పిటలైజెషన్ సందర్భంలో కవర్‌ని అందిస్తుంది.

ICU ఖర్చులు

ICU హాస్పిటలైజేషన్ విషయంలో, రెట్టింపు నగదు ప్రయోజనాన్ని అందిస్తుంది.

1 ఆఫ్ 1

పాలసీ ప్రారంభం నుండి 30 రోజుల్లోపు హాస్పిటలైజేషన్.
ముందు నుండి ఉన్న వ్యాధులు.

దంత చికిత్స లేదా సర్జరీ ఖర్చులు.

గర్భం లేదా ప్రసవానికి సంబంధించిన ఏదైనా చికిత్స. 

హిమపాతం, భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటనాలు మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల తలెత్తే గాయాలు. 

తాగి డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు.

క్యాన్సర్ మరియు దానికి సంబంధించిన ఏదైనా చికిత్స కారణంగా ఉత్పన్నమయ్యే ఖర్చులు.

సున్తీ, కాస్మెటిక్ లేదా సౌందర్య చికిత్సలు మరియు జీవిత మార్పిడి కోసం శస్త్రచికిత్స లేదా చికిత్స...

మరింత చదవండి

ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తు శారీరక గాయాలకు ప్రమాదం జరిగిన 6 నెలల్లోపు చికిత్స అవసరమైతే తప్ప, సున్తీ, కాస్మెటిక్ లేదా సౌందర్య చికిత్సలు, జీవిత మార్పిడి కోసం శస్త్రచికిత్స లేదా చికిత్స, ప్లాస్టిక్ సర్జరీలు వంటివి కవర్ చేయబడవు.

స్వతహా చేసుకున్న గాయం, ఆత్మహత్య లేదా ఆత్మహత్యాయత్నం.

1 ఆఫ్ 1

హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‍లోడ్ చేసుకోండి

మీ మునుపటి పాలసీ గడువు ఇంకా ముగియలేదా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

4.75

(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

Satish Chand Katoch

సతీష్ చంద్ కటోచ్

పాలసీ తీసుకునేటప్పుడు మనం రివ్యూ చేయగల అన్ని ఎంపికలతో, వెబ్ ద్వారా అవాంతరాలు లేకుండా పూర్తి అయింది.

Ashish Mukherjee

ఆశీష్ ముఖర్జీ

ఎటువంటి వారికైనా సులభంగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, గందరగోళం ఉండదు. గొప్ప పని. గుడ్ లక్.

Prashanth Rajendran

ప్రశాంత్ రాజేంద్రన్

బజాజ్ అలియంజ్ అందించే ఆన్‌లైన్ పాలసీ సౌకర్యం నచ్చింది

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి