Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్: ప్రీమియం పర్సనల్ గార్డ్ పాలసీ

ఊహించని ప్రమాదాలతో ఎదురయ్యే ఖర్చుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

Personal Accident Insurance: Premium Personal Guard

ప్రమాదవశాత్తు అయిన గాయాలపై మీకు మరియు మీ ప్రియమైనవారికి ఆర్థిక భద్రత

మీ ప్రయోజనాలను పొందండి

ఆసుపత్రిలో నిర్బంధ భత్యం

15-రోజుల ఫ్రీ లుక్ పీరియడ్

క్విక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్

బజాజ్ అలియంజ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌‌ను ఎందుకు ఎంచుకోవాలి?

ఒక బలమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక ప్రత్యేక హక్కు కాదు, ఇది తప్పనిసరిగా ఉండాల్సిన ఒక అవసరం. జీవితం ఊహించలేనిది మరియు రేపు ఏం జరగుతుందో ఎవరికీ తెలియదు. అయితే, ఎల్లప్పుడూ మనం భవిష్యత్తులో జరగబోయే దాని కోసం సిద్ధంగా ఉండాలి మరియు దురదృష్టకర సంఘటనలు తెచ్చే ఆర్థిక భారం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి, ఏవైనా ప్రమాదాలు లేదా దుర్ఘటనల వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుండి మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని కవర్ చేసే ఒక మంచి పాలసీని ఎంచుకోవడమే మన ప్రధాన కర్తవ్యం.

బజాజ్ అలియంజ్ ప్రీమియం పర్సనల్ గార్డ్ అనేది ఒక పర్సనల్ యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది ప్రమాదాలపై సమగ్ర కవరేజీని అందిస్తుంది మరియు సంక్షోభ సమయంలో మీకు మద్దతునిస్తుంది. ప్రీమియం పర్సనల్ గార్డ్, ఒక ప్రమాదం కారణంగా మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని శారీరక గాయాలు లేదా మరణం నుండి కవర్ చేస్తుంది. రూ. 10 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు అధిక మొత్తంలో ఇన్సూరెన్స్ హామీ కోసం ఆప్షన్‌లను అందిస్తుంది.

ప్రీమియం పర్సనల్ గార్డ్ విషయానికి వస్తే మేము చాలా ఎక్కువ అందిస్తున్నాము

ముఖ్యమైన ఫీచర్లు

వివిధ ప్రతికూల పరిస్థితులకు కవర్‌ని అందించడంతో పాటు ఈ ప్లాన్ మిమ్మల్ని ప్రశాంతంగా మరియు ఒత్తిడికి గురికాకుండా చూస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఇది మీ జీవితాన్ని ఎలా సులభతరం చేస్తుందో ఇక్కడ చూడవచ్చు:

  • విస్తృత కవర్

    శాశ్వత పూర్తి వైకల్యం (పిటిడి): ప్రమాదం కారణంగా పిటిడి విషయంలో, మీరు బీమా చేసిన మొత్తంలో 200% చెల్లింపు కోసం అర్హత పొందుతారు.

    శాశ్వత పాక్షిక వైకల్యం (పిపిడి): ప్రమాదం కారణంగా పిపిడి విషయంలో చెల్లించవలసిన బీమా మొత్తం క్రింద చూపిన విధంగా ఉంటుంది:

    భుజం జాయింట్ వద్ద ఒక బాహువు

    70%

    మోచేయి పై భాగంలోని ముంజేయి

    65%

    మోచెయ్యి జాయింట్ క్రింద ఒక బాహువు

    60%

    మణికట్టు వద్ద ఒక చెయ్యి

    55%

    ఒక బొటనవేలు

    20%

    ఒక చూపుడు వ్రేలు

    10%

    ఏదైనా ఇతర వ్రేలు

    5%

    మధ్య తొడ పైన కాలు భాగం

    70%

    మధ్య తొడ వరకు కాలు

    60%

    మోకాలి క్రింద వరకు కాలు

    50%

    మోకాలు చిప్ప కింద కాలు వరకు

    45%

    యాంకిల్ చివర పాదం వద్ద

    40%

    ఒక పెద్ద బొటనవేలు

    5%

    ఏదైనా ఇతర కాలివేలు

    2%

    ఒక కన్ను

    50%

    ఒక చెవి వినికిడి

    30%

    రెండు చెవుల వినికిడి

    75%

    వాసన అనుభూతి

    10%

    రుచి అనుభూతి

    5%

    తాత్కాలిక పూర్తి వైకల్యం (TTD): ప్రమాదవశాత్తు శారీరక గాయం కారణంగా TTD విషయంలో, మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం ఒక వారం పాటు ప్రయోజనం చెల్లించబడుతుంది. మీ జీవిత భాగస్వామికి TTD ప్రయోజనం కింద క్లెయిమ్ చెల్లింపు 50% కి పరిమితం చేయబడింది.

    ప్రమాదవశాత్తు మరణం కవర్: ప్రమాదం కారణంగా మరణం సంభవించినప్పుడు మీ నామినీకి 100% ఇన్సూరెన్స్ మొత్తం చెల్లించబడుతుంది.

  • ఫ్యామిలీ కవర్

    ప్రమాదవశాత్తు గాయం లేదా మరణం సంభవించినప్పుడు ఈ పాలసీ మిమ్మల్ని, మీ జీవిత భాగస్వామిని మరియు పిల్లలను కవర్ చేస్తుంది.

  • కాంప్రిహెన్సివ్ యాక్సిడెంటల్ కవర్

    యాక్సిడెంట్ కారణంగా జరిగిన శారీరక గాయం, వైకల్యం లేదా మరణం నుండి ఈ ప్లాన్ మిమ్మల్ని రక్షిస్తుంది.

  • ఆసుపత్రిలో నిర్బంధ భత్యం

    మీరు హాస్పిటల్‌లో చేరినప్పుడు గరిష్టంగా 30 రోజుల వరకు, ప్రతి రోజు రూ. 1,000 నుండి రూ. 2,500 చొప్పున ప్రయోజనాన్ని అందుకోవడానికి అర్హత పొందుతారు.

  • పిల్లల విద్యా ప్రయోజనం

    మరణం లేదా PTD విషయంలో, మీరు 2 వరకు ఆధారపడిన పిల్లల విద్యా ఖర్చు (మీ ప్రమాదం జరిగిన రోజున 19 సంవత్సరాల లోపు) కోసం (ప్రతి బిడ్డకు) రూ. 5,000 చొప్పున పరిహారం అందుకుంటారు.

  • క్యుములేటివ్ బోనస్

    ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరానికి, మీ నష్టపరిహార పరిమితి వరకు 10% పొందండి, ఆసుపత్రిలో చేరిన సందర్భంలో బీమా చేసిన మొత్తంలో 50% వరకు పొందండి.

  • మెరుగైన ఇన్సూరెన్స్ మొత్తం

    మీరు మీ పాలసీని రెన్యూ చేసినప్పుడు, మీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని సవరించుకోవచ్చు.

మా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్‍ల గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ వీడియోను చూడండి.

Video

సులభమైన, అవాంతరాలు-లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్

క్లెయిమ్ ప్రాసెస్

యాక్సిడెంట్ కారణంగా గాయం లేదా మరణం సంభవించిన సందర్భంలో, క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది రీయింబర్స్‌మెంట్ ప్రాసెస్ ద్వారా చేయబడవచ్చు. ఈ ప్రక్రియలో అయ్యే పూర్తి చికిత్స ఖర్చును మొదట మీరు భరించాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను మరియు వ్రాతపూర్వక పత్రాలను సమర్పించిన తరువాత, మేము ఈ మొత్తానికి నష్టపరిహారం చెల్లిస్తాము.

మీరు క్లెయిమ్ చేసిన కవర్‌ను బట్టి, అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇక్కడ ఉన్నాయి:

A) మరణం:

  • నామినీ సంతకం చేసిన పర్సనల్ యాక్సిడెంట్ క్లెయిమ్ ఫారమ్.
  • నామినీ సంతకం చేసిన NEFT ఫారం మరియు క్యాన్సిల్ చేసిన చెక్.
  • డెత్ సర్టిఫికెట్ యొక్క అటెస్టెడ్ కాపీ.
  • ధృవీకరించబడిన FIR/పంచనామ/విచారణ పంచనామ కాపీ.
  • పోస్ట్-మార్టమ్ రిపోర్ట్ యొక్క అటెస్టెడ్ కాపీ, నిర్వహించబడితే.
  • విసెరా/రసాయన విశ్లేషణ రిపోర్ట్ యొక్క అటెస్టెడ్ కాపీ (ఒకవేళ విసెరా భద్రపరచి నిల్వచేయబడితే).
  • సాక్షిదారు స్టేట్‌మెంట్ యొక్క అటెస్టెడ్ కాపీ (ఏదైనా ఉంటే).
  • బరియల్ సర్టిఫికేట్ (వర్తించే చోట).
  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి / క్లెయిమెంట్ అడ్రస్ ప్రూఫ్.
  • ఒరిజినల్ పాలసీ కాపీ.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

B) PTD, PPD and TTD:

  • క్లెయిమెంట్ సంతకం చేసిన మరియు సరిగ్గా పూర్తి చేయబడిన క్లెయిమ్ ఫారం.
  • ధృవీకరించబడిన FIR/పంచనామా/ఇంక్వెస్ట్ పంచనామా కాపీ.
  • వైకల్యం యొక్క శాతం పేర్కొంటూ ఒక ప్రభుత్వ ఆసుపత్రి యొక్క సివిల్ సర్జన్ నుండి వైకల్యం సర్టిఫికెట్ యొక్క ధృవీకరించబడిన కాపీ.
  • రోగనిర్ధారణకు మద్దతుగా X-ray/ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లు.
  • నామినీ సంతకం చేసిన NEFT ఫారం మరియు క్యాన్సిల్ చేసిన చెక్.
  • ఒరిజినల్ పాలసీ కాపీ.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

C) పిల్లల కోసం విద్యా బోనస్:

  • పాఠశాల/కళాశాల నుండి బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా విద్యా సంస్థ నుండి ఎడ్యుకేషన్ సరిఫికేట్/బర్త్ సర్టిఫికేట్.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

D) హాస్పిటల్ నిర్బంధం కోసం అలవెన్స్:

  • డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్.
  • యాక్సిడెంటల్ హాస్పిటల్ రీయింబర్స్‌మెంట్.
  • క్లెయిమెంట్ సంతకం చేసిన మరియు సరిగ్గా పూర్తి చేయబడిన క్లెయిమ్ ఫారం.
  • హాస్పిటల్ డిశ్చార్జ్ కార్డ్.
  • బిల్లులో పేర్కొన్న అన్ని ఖర్చుల వివరిస్తూ ఒక హాస్పిటల్ బిల్లు. OT ఛార్జీలు, డాక్టర్ కన్సల్టేషన్స్ మరియు సందర్శన ఛార్జీలు, OT కన్జ్యూమబుల్స్, ట్రాన్స్‌ఫ్యూజన్స్, గది అద్దె మొదలైన వాటి గురించి స్పష్టమైన వివరాలను తెలియజేయాలి.
  • ఒక రెవెన్యూ స్టాంప్‌ కలిగి ఉండి సరిగ్గా సంతకం చేయబడిన డబ్బు చెల్లించిన రసీదు.
  • అన్ని ఒరిజినల్ ల్యాబరేటరీ మరియు డయాగ్నిస్టిక్ టెస్ట్ రిపోర్టులు, ఉదాహరణకు, ఎక్స్-రే, ECG, USG, MRI స్కాన్, హెమోగ్రామ్ మొదలైనవి.
  • క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌కు అవసరం అయ్యే ఇతర డాక్యుమెంట్లు.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను సులభతరం చేద్దాం

యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి?

ప్రమాదవశాత్తు అయిన గాయాలపై విస్తృతమైన కవరేజీని అందిస్తూ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచుతుంది. దాని ప్రయోజనాలు ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం మరియు గాయాలను కవర్ చేస్తాయి. 

ప్రీమియం పర్సనల్ గార్డ్ ఇన్సూరెన్స్ కోసం అర్హత ఏంటి?

ప్రతిపాదకునికి మరియు వారి జీవిత భాగస్వామికి ప్రవేశ వయస్సు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య ఉంటుంది. పిల్లలకు ప్రవేశ వయస్సు 5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య ఉంటుంది.

హెల్త్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఎవరు?

హెల్త్ అడ్మినిస్ట్రేషన్ బృందంలో వైద్యులు మరియు పారామెడిక్స్ నిపుణులు ఉంటారు, వీరు హెల్త్ అండర్‌రైటింగ్ మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం బాధ్యత వహిస్తారు. ఇది అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీహోల్డర్ల ఆరోగ్య సంరక్షణ సంబంధిత సేవలకు, ఏక మాధ్యమం ద్వారా సహాయాన్ని అందిస్తుంది. ఈ ఇన్-హౌస్ టీమ్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. వీరు, ఒకే చోట వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌‌మెంట్‌ను అందిస్తారు. HAT కస్టమర్ ప్రశ్నలను వేగంగా మరియు సమర్థవంతంగా పరిష్కరిస్తుంది.

ఫ్రీ లుక్ పీరియడ్ అంటే ఏమిటి?

మీ పాలసీ కవరేజ్‌లోని నిబంధనలు మరియు షరతులతో మీరు సంతృప్తి చెందకపోతే, మీ మొదటి సంవత్సరం పాలసీ డాక్యుమెంట్లను స్వీకరించిన 15 రోజుల్లోనే పాలసీని క్యాన్సిల్ చేయవచ్చు, అయితే అందులో ఎలాంటి క్లెయిమ్ ఉండకూడదు. పాలసీ రెన్యూవల్స్ కోసం ఫ్రీ లుక్ పీరియడ్ వర్తించదని దయచేసి గమనించండి.

పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం రేట్లు ఏమిటి?

మా ప్రీమియం పర్సనల్ గార్డ్, కాంపిటేటివ్ ప్రీమియం రేట్లతో ప్రమాదవశాత్తు అయిన గాయాలకు సమగ్ర కవరేజీని అందిస్తుంది, ఇవి క్రింద పట్టికలో పేర్కొనబడ్డాయి:

ప్లాన్‌

 

'ఏ'

'బి'

'సి'

'డి'

SI (రూ.)

 

10లక్ష

15లక్ష

20లక్ష

25లక్ష

ప్రాథమిక ప్లాన్

మరణం

100%

100%

100%

100%

PTD1

200%

200%

200%

200%

PPD2

పట్టిక ప్రకారం

TTD3(రూ./wks.)

5,000/100

5,000/100

7,500/100

10,000/100

యాడ్ ఆన్

యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ (రూ.)

2,00,000

3,00,000

4,00,000

5,00,000

హాస్పిటల్ కన్ఫైన్మెంట్
అలవెన్స్

1,000

1,500

2,000

2,500

ప్రీమియం

ప్రాథమిక ప్లాన్*

1,300

2,100

2,875

3,650

యాడ్ ఆన్*

475

710

950

1,200

అదనపు సభ్యుడు 'A'

స్పౌస్

సెల్ఫ్ ప్లాన్ యొక్క 50% ప్రయోజనాలు

ప్రాథమిక ప్లాన్*

650

1,050

1,438

1,825

యాడ్ ఆన్*

238

355

475

600

అదనపుసభ్యుడు 'B'

ప్రతి బిడ్డకు

సెల్ఫ్ ప్లాన్ యొక్క 25% ప్రయోజనాలు

ప్రాథమిక ప్లాన్*

325

525

719

913

యాడ్ ఆన్*

119

178

238

300

నా ప్రీమియం పర్సనల్ గార్డ్ పాలసీని నేను ఎలా పొందగలను?

మీరు మా టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా మా ఏజెంట్లను నేరుగా సంప్రదించవచ్చు. మా యూజర్-ఫ్రెండ్లీ ప్రాసెస్‌లను దశలవారీగా మీకు తెలియజేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది. ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయడానికి మీరు మా వెబ్‌సైట్ www.bajajallianz.co.in ను కూడా సందర్శించవచ్చు.

నేను ఆన్‌లైన్‌లో ప్రీమియం పర్సనల్ గార్డ్ పాలసీని ఎందుకు కొనుగోలు చేయాలి?

మీకు వేగవంతమైన మరియు ఇబ్బందులు-లేని కొనుగోలు కావాలనుకుంటే, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి. ప్రీమియం పర్సనల్ గార్డ్ పాలసీని సులభంగా మరియు సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి మీకు సహాయపడటానికి మేము ఉన్నాము. మా అనేక చెల్లింపు ఎంపికలు మీ చెల్లింపు బాధలను మరింత తగ్గిస్తాయి. మీ పాలసీ ఆన్‌లైన్‌లో జారీ చేయబడుతుంది, దీని వలన ఒక హార్డ్ కాపీని వెంట తీసుకువెళ్లవలసిన ఇబ్బంది దూరం అవుతుంది. ఈ అంశాలతో పాటు, చురుకైన కస్టమర్ సపోర్ట్ వలన ఆన్‌లైన్‌లో ప్రీమియం పర్సనల్ గార్డ్ పాలసీ కొనుగోలు ఒక మెరుగైన ప్రత్యామ్నాయంగా మారుతుంది.

నా పాలసీ కోసం నేను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించగలను?

మీరు మా ఇన్సూరెన్స్‌‌ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు మరియు ఈ క్రింది పద్ధతుల ద్వారా చెల్లించవచ్చు:

· మా బ్రాంచ్‌లో చెక్ లేదా క్యాష్ ద్వారా చెల్లింపు.

· ఇసిఎస్

· ఆన్‌లైన్ చెల్లింపు - డెబిట్/క్రెడిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్.

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

ఆశీష్ జుంజున్వాలా

2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...

సునీత ఎం అహూజా

లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు

రేని జార్జ్

నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...

ఈరోజే మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ప్రీమియం పర్సనల్ గార్డ్‌తో కవర్ చేయండి.

10 లక్షల నుండి 25 లక్షల పరిధి వరకు బీమా మొత్తం.

అంతే కాదు, మీ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీతో వచ్చే అదనపు ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

ప్రమాదాల వల్ల సంభవించే మరణం, వైకల్యం మరియు గాయాలను కవర్ చేసే ఆల్-ఇన్-వన్ ఇన్సూరెన్స్ మరియు ఇది వేర్వేరు ప్రయోజనాలతో వస్తుంది:
Hospital Cash multiple

ఇన్సూరెన్స్ మొత్తం కోసం అనేక ఎంపికలు

రూ. 10 లక్షలు మరియు రూ. 25 లక్షల మధ్య ఇన్సూరెన్స్ మొత్తం కోసం ఆప్షన్‌లు.

Hassle-free claim settlement

అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌మెంట్

మా అంతర్గత క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం, అవాంతరాలు లేని మరియు త్వరిత క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ని అందిస్తుంది. మేము నగదు రహితంగా కూడా సేవలు అందిస్తున్నాము ... మరింత చదవండి

అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌మెంట్

Our in-house claim settlement team provides seamless and quick claim settlement. We also offer cashless facility at more than 18,400+ network hospitals* across India. This comes in handy in case of hospitalisation or treatment wherein we take care of paying the bills directly to the network hospital and you can focus on recovering and getting back on your feet. 

Healthcaresupreme Lifetime Renewal Lifetime Renewal

రెన్యువబిలిటీ

మీరు మీ ప్రీమియం పర్సనల్ గార్డ్ పాలసీని లైఫ్‌టైం కోసం రెన్యూవల్ చేసుకోవచ్చు.

ప్రీమియం పర్సనల్ గార్డ్‌ని కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు

  • చేర్పులు

  • మినహాయింపులు

ఫ్యామిలీ కవర్

మిమ్మల్ని, మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలను కవర్ చేస్తుంది.

కాంప్రిహెన్సివ్ యాక్సిడెంటల్ కవర్

ప్రమాదం కారణంగా జరిగిన శారీరిక గాయం, వైకల్యం లేదా మరణం నుండి మిమ్మల్ని కవర్ చేస్తుంది.

ఆసుపత్రిలో నిర్బంధ భత్యం

ప్రమాదం కారణంగా హాస్పిటల్‌లో చేరినట్లయితే, గరిష్టంగా 30 రోజుల వరకు, ప్రతి రోజు మీరు నగదు ప్రయోజనాన్ని పొందవచ్చు.

పిల్లల విద్య కొరకు బోనస్

మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం సందర్భంలో 2 వరకు ఆధారపడిన పిల్లల విద్యా ఖర్చు కోసం రూ 5,000 అందుకోండి.

1 ఆఫ్ 1

ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం లేదా స్వయంగా చేసుకున్న గాయం లేదా అనారోగ్యం ఫలితంగా జరిగిన ప్రమాదం కారణంగా ఏర్పడిన శారీరక గాయం.
మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంలో జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన గాయం/మరణం.
నేరపూరితమైన ఉద్దేశ్యంతో ఏదైనా చట్టం ఉల్లంఘించడం వలన జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన గాయం/మరణం.

ఏవియేషన్ లేదా బెలూనింగ్‌లో పాల్గొని ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన గాయం/మరణం...

మరింత చదవండి

విమానయానం లేదా బెలూనింగ్‌లో పాల్గొనడం వల్ల, ప్రపంచంలో ఎక్కడైనా సక్రమంగా లైసెన్స్ పొందిన ప్రామాణిక రకం విమానాలలో ప్రయాణీకుడిగా (ఛార్జీల చెల్లింపు లేదా ఇతరత్రా) కాకుండా వేరే బెలూన్ లేదా విమానంలో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు లేదా ప్రయాణించేటప్పుడు ప్రమాదవశాత్తు జరిగే గాయం/మరణం.

మోటార్ రేసింగ్ లేదా ట్రయల్ రన్స్ సమయంలో డ్రైవర్, కో-డ్రైవర్ లేదా మోటార్ వాహనం ప్రయాణీకునిగా పాల్గొన్నప్పుడు జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన గాయం/ మరణం.
మీ శరీరంపై మీరు నిర్వహించే లేదా నిర్వహించిన ఏవైనా స్వస్థత కలిగించే చికిత్సలు లేదా ఇంటర్వెన్షన్లు.

సైనిక వ్యాయామాల రూపంలో ఏదైనా నావికా, సైనిక లేదా వైమానిక దళ కార్యకలాపాలలో పాల్గొనడం...

మరింత చదవండి

ఎటువంటి విరామం లేకుండా నిర్వహించబడిన మిలిటరీ ఎక్సర్‌సైజెస్ లేదా వార్ గేమ్స్ లేదా విదేశీ లేదా దేశీయ శత్రువుతో యుద్ధం రూపంలో ఏదైనా నేవీ, మిలిటరీ లేదా ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క భాగస్వామ్యం.

మీ పై వాస్తవంగా లేదా ఆరోపించబడిన చట్టపరమైన బాధ్యతల వలన కలిగిన పర్యవసాన నష్టాలు.
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు.
హెచ్ఐవి మరియు/లేదా ఎయిడ్స్ తో సహా ఏదైనా హెచ్ఐవి సంబంధిత అనారోగ్యం మరియు/లేదా ఏ రకంగానైనా కలిగిన దాని మ్యూటెంట్ డెరివేటివ్స్ లేదా దాని వేరియేషన్లు.
గర్భధారణ, దాని ఫలితంగా శిశుజననం, గర్భస్రావం, అబార్షన్ లేదా వీటిలో దేని నుండి అయినా ఉత్పన్నమయ్యే సమస్యలు.

యుద్ధం కారణంగా ఉత్పన్నమయ్యే చికిత్స (ప్రకటించబడినా లేదా కాకపోయినా), పౌర యుద్ధం, ఆక్రమణ, విదేశీ శత్రువుల చర్య...

మరింత చదవండి

యుద్ధం, దండయాత్ర, విదేశీ శత్రువుల చర్యలు, శత్రుత్వాలు (యుద్ధం ప్రకటించబడినా లేదా ప్రకటించబడకపోయినా), అంతర్యుద్ధం, కల్లోలం, అశాంతి, ఉద్యమాలు, విప్లవం, తిరుగుబాటు, సైనిక లేదా స్వాధీనం చేసుకున్న అధికారం లేదా జప్తు లేదా జాతీయం లేదా ఏదైనా ప్రభుత్వం లేదా ప్రజా, స్థానిక సంస్థల అధికారం చేత జారీచేయబడిన ఆదేశాల ద్వారా జరిగిన నష్టం/ దెబ్బతినడం కారణంగా జరిగే చికిత్స.

అణు శక్తి, రేడియోధార్మికతకి గురి అయితే చేయబడే చికిత్స.

1 ఆఫ్ 1

హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‍లోడ్ చేసుకోండి

మీ మునుపటి పాలసీ గడువు ఇంకా ముగియలేదా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

4.75

(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

Juber Khan

రమా అనిల్ మాటే

మీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ అద్భుతమైనది, యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్రాసెస్ సజావుగా సాగుతుంది.

Juber Khan

సురేష్ కాడు

బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ అపారమైన మద్దతునిచ్చారు మరియు అందుకు నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.

Juber Khan

అజయ్ బింద్ర

బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ పాలసీ ప్రయోజనాలను చాలా చక్కగా వివరించారు. ఆమె మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని కలిగి ఉన్నారు మరియు చాలా బాగా వివరించారు.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి