Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

సరళ్ సురక్షా బీమా, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.

 

వ్యక్తి కోసం సరళ్ సురక్షా బీమా
Saral Suraksha Bima Policy

మీ కోసం స్టాండర్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ

దీనితో మీకు కలిగే లాభం?

ప్రమాదవశాత్తు మరణాన్ని కవర్ చేస్తుంది

తాత్కాలిక వైకల్యం సందర్భంలో కవరేజీ

ప్రమాదం కారణంగా హాస్పిటల్ ఖర్చులు

సరళ్ సురక్షా బీమా అంటే ఏమిటి?

సరళ్ సురక్షా బీమా అనేది బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే ఒక ప్రామాణీకరించబడిన పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ ప్లాన్ ఊహించని ప్రమాదాల నుండి ఆర్థిక రక్షణను అందిస్తుంది, ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత పూర్తి వైకల్యం మరియు శాశ్వత పాక్షిక వైకల్యాన్ని కవర్ చేస్తుంది. ఇది సరళమైన మరియు సమగ్ర కవరేజీని అందించడానికి రూపొందించబడింది, ఇది పాలసీదారులు మరియు వారి కుటుంబాలు ప్రమాదవశాత్తు గాయాల ఆర్థిక పరిణామాల నుండి రక్షించబడతారని నిర్ధారిస్తుంది.

రూ. 5,000 మల్టిపుల్స్‌లో గరిష్టంగా రూ. 1 కోటి వరకు కవరేజీని పెంచుకునే ఎంపికలతో, ఈ పాలసీ కనీసం రూ. 25,000 ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని అందిస్తుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ వ్యక్తులు తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉండే కవరేజీని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. వార్షిక పునరుద్ధరణ కోసం ఎంపికతో పాలసీ వ్యవధి ఒక సంవత్సరం, ఇది నిరంతర రక్షణకు భరోసా ఇస్తుంది.

బేస్ కవర్లకు అదనంగా, సరళ్ సురక్షా బీమా తాత్కాలిక పూర్తి వైకల్యం, ప్రమాదాల కారణంగా హాస్పిటలైజేషన్ ఖర్చులు మరియు ఆధారపడిన పిల్లలకు ఎడ్యుకేషన్ గ్రాంట్ వంటి ఆప్షనల్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఆప్షనల్ కవర్లు పాలసీ సమగ్రతను మెరుగుపరుస్తాయి, ప్రమాదం జరిగిన సందర్భంలో అదనపు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.

పారదర్శక మరియు ఏకరీతి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అందించడం ద్వారా, సరళ్ సురక్షా బీమా పాలసీదారులు ప్రమాదవశాత్తు గాయాలపై విశ్వసనీయమైన కవరేజీని అందుకుంటారని నిర్ధారిస్తుంది, ఇది వ్యక్తులు మరియు వారి కుటుంబాలకు మనశ్శాంతిని అందిస్తుంది.

మీరు సరళ్ సురక్షా బీమా ఎందుకు కొనుగోలు చేయాలి?

ప్రామాణిక పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అనేది ప్రమాదం కారణంగా శాశ్వత లేదా పాక్షిక వైకల్యం మరియు మరణం సంభవించిన సందర్భంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి లేదా అతని/ఆమె చట్టపరమైన వారసులు/నామినీకి పరిహారం అందిస్తుంది.

మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రమాదం కారణంగా తాత్కాలిక వైకల్యం మరియు హాస్పిటలైజేషన్ కోసం కవరేజీ అందిస్తుంది.

సరళ్ సురక్షా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి క్లెయిమ్-రహిత సంవత్సరంతో క్యుములేటివ్ బోనస్ సంపాదించడంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి సహాయపడుతుంది. ఇన్సూరెన్స్ సంస్థలన్నీ సరళ్ సురక్షా బీమా ప్లాన్‌ను వారి క్లయింట్‌లకు తప్పక అందించడాన్ని IRDAI తప్పనిసరి చేసింది.

ముఖ్యమైన ఫీచర్లు

  • పాలసీ క్రింద అందుబాటులో ఉన్న బేస్ కవరేజ్

    1. మరణం: గాయం కారణంగా ప్రమాదవశాత్తు మరణం సంభవించిన సందర్భంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కుటుంబానికి 100% పరిహార మొత్తం లభిస్తుంది.

    2. శాశ్వత పూర్తి వైకల్యం: యాక్సిడెంట్ కారణంగా ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి శాశ్వత పూర్తి వైకల్యం ఏర్పడిన పక్షంలో, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం, ఇన్సూర్ చేయబడిన 100%కి సమానమైన ప్రయోజనాన్ని కంపెనీ చెల్లిస్తుంది

    3. శాశ్వత పాక్షిక వైకల్యం: యాక్సిడెంట్ కారణంగా, ఏదైనా పాక్షిక వైకల్యం సంభవిస్తే, దాని చికిత్సా ప్రయోజనాల కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తం పొందడం కోసం ఇన్సూర్ చేయబడిన వ్యక్తి క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు.

  • పాలసీ రకం

    సరళ్ సురక్షా బీమా అనేది వ్యక్తిగత ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం అనేది ప్రతి కుటుంబ సభ్యునికి ప్రత్యేకంగా వర్తిస్తుంది .

  • వార్షిక పాలసీ

    సరళ్ సురక్షా బీమాతో, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 1 సంవత్సరం కవర్ లభిస్తుంది. 

  • ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్దతిలో ప్రీమియం చెల్లింపు

    వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ వాయిదాల్లో పాలసీని చెల్లించవచ్చు. ప్రతి ప్లాన్‌లోని నిబంధనలు మరియు షరతుల ఆధారంగా, ప్రీమియం ఛార్జీలు మారవచ్చు. ఇతర పాలసీ ప్లాన్లు లాగా కాకుండా, సరళ్ సురక్షా బీమా పాలసీ ప్రీమియం రేట్లు తక్కువగా మరియు చౌకైనవిగా ఉంటాయి. 

  • పూర్తి ఫ్యామిలీ కవర్

    ఈ పాలసీ అనేది స్వీయ, చట్టపరంగా వివాహిత జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు మరియు అత్తమామలకు కవర్ అందిస్తుంది. 

  • క్యుములేటివ్ బోనస్

    ప్రతి క్లెయిమ్-ఫ్రీ సంవత్సరం కోసం, ఇన్సూర్ చేయబడిన మొత్తంతో సంబంధం లేకుండా క్యుములేటివ్ బోనస్‌లో 5% పెరుగుదల ఉంటుంది. అయితే, ఇన్సూర్ చేయబడిన మొత్తంలో గరిష్టంగా 50% వరకు ఎలాంటి బ్రేక్స్ లేకుండా పాలసీ రెన్యూవల్ చేయబడాలనేది వర్తించే ముందస్తు షరతుగా ఉంటుంది. ఏదైనా నిర్దిష్ట సంవత్సరంలో క్లెయిమ్ చేయబడితే, CB పెంచబడిన నిష్పత్తిలోనే అది తగ్గించబడుతుంది. 

  • ఇన్సూర్ చేయబడిన మొత్తం

    ఈ పాలసీ క్రింద ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఎంచుకున్న కవరేజీ కోసం, ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వహించే గరిష్ట బాధ్యతగా ఉంటుంది. ఈ పాలసీ క్రింద కనీస ఇన్సూరెన్స్ మొత్తం రూ. 2.5 లక్షలు మరియు గరిష్ట ఇన్సూరెన్స్ మొత్తం రూ. 1 కోట్లుగా ఉంటుంది

సరళ్ సురక్షా బీమా ప్రయోజనాలు

తాత్కాలిక పూర్తి వైకల్యం (ఆప్షనల్ కవర్)

తాత్కాలిక వైకల్యం క్రింద, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి గరిష్టంగా 100 వారాల వరకు ప్రతి వారం ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 0.2% అందుకుంటారు మరింత చదవండి

తాత్కాలిక పూర్తి వైకల్యం (ఆప్షనల్ కవర్)

పూర్తి తాత్కాలిక వైకల్యం కింద, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి గరిష్టంగా 100 వారాల వరకు ప్రతి వారం ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 0.2% అందుకుంటారు. ప్రమాదం కారణంగా, ఆ వ్యక్తి పని చేయలేనంత స్థాయిలో గాయపడినప్పుడు, ఇది వర్తిస్తుంది.

యాక్సిడెంట్ కారణంగా హాస్పిటలైజేషన్ ఖర్చులు (ఆప్షనల్ కవర్)

ప్రమాదం కారణంగా ఉత్పన్నమయ్యే హాస్పిటలైజేషన్ ఖర్చులనేవి బేస్ సమ్ ఇన్సూర్డ్‌లో 10% పరిమితి వరకు నష్టపరిహారంగా అందించబడతాయి.

ఎడ్యుకేషన్ గ్రాంట్ (ఆప్షనల్ కవర్)

ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించిన సందర్భంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కుటుంబంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మీద ఆధారపడిన ప్రతి చిన్నారి కోసం వన్-టైమ్ 10% ఎడ్యుకేషన్ గ్రాంట్ క్లెయిమ్ చేయవచ్చు. మరింత చదవండి

ఎడ్యుకేషన్ గ్రాంట్ (ఆప్షనల్ కవర్)

ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించిన సందర్భంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కుటుంబంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మీద ఆధారపడిన ప్రతి చిన్నారి కోసం వన్-టైమ్ 10% ఎడ్యుకేషన్ గ్రాంట్ క్లెయిమ్ చేయవచ్చు. ఈ క్రింది షరతుల మేరకు మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవచ్చు:

  • ఆధారపడిన చిన్నారి లేదా పిల్లలు ఏదైనా సర్టిఫైడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్‌లో పూర్తి సమయం విద్యార్థిగా ఏదైనా విద్యా కోర్సును కొనసాగిస్తుండాలి.
  • ఇన్సూరెన్స్ పరిహారం కోసం క్లెయిమ్ చేయడానికి పిల్లల వయస్సు 25 కంటే ఎక్కువగా ఉండకూడదు.

ముఖ్యమైన గమనిక:

పాలసీ ప్రయోజనాలనేవి ప్రతి ఒక్క ఆప్షనల్ కవర్ల క్రింద చెల్లించబడతాయి మరియు ఇన్సూర్ చేయబడిన ప్రాథమిక మొత్తంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటాయి.

హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‍లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

సరళ్ సురక్షా బీమా పాలసీని కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు

  • చేర్పులు

  • మినహాయింపులు

మరణం (బేస్ కవర్)

ఇన్సూర్ చేయబడిన 100% కి సమానమైన ప్రయోజనం చెల్లించడానికి కంపెనీ బాధ్యత వహిస్తుంది. ప్రమాదం జరిగిన 12 నెలల్లోపు మరణం సంభవించినప్పుడు మాత్రమే, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణం కోసం మొత్తం చెల్లించబడుతుంది. 

శాశ్వత పూర్తి వైకల్యం (బేస్ కవర్)

పాలసీలో పేర్కొన్న ఇన్సూర్ చేయబడిన 100% కి సమానమైన ప్రయోజనాన్ని కంపెనీ చెల్లిస్తుంది

మరింత చదవండి

శాశ్వత పూర్తి వైకల్యం (బేస్ కవర్)

ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి ప్రమాదం కారణంగా శాశ్వత పూర్తి వైకల్యం ఏర్పడితే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న బీమా చేయబడిన 100% కి సమానమైన ప్రయోజనాన్ని కంపెనీ చెల్లిస్తుంది. ప్రమాదం జరిగిన 12 నెలల్లోపు, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి దృష్టి లేదా ఏదైనా అవయవం కోల్పోయిన పరిస్థితిని శాశ్వత వైకల్యం ప్రమాదంగా పరిగణిస్తారు. 

శాశ్వత పాక్షిక వైకల్యం (బేస్ కవర్)

ప్రమాదం కారణంగా, ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి శాశ్వత పాక్షిక వైకల్యం ఎదురైతే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న మేరకు ఇన్సూర్ చేయబడిన మొత్తంలో శాతాన్ని కంపెనీ చెల్లిస్తుంది.

1 ఆఫ్ 1

ఆత్మహత్య కారణంగా మరణం లేదా ఆత్మహత్యా ప్రయత్నం కారణంగా శాశ్వత వైకల్యం సంభవిస్తే, ఎలాంటి క్లెయిమ్ అనుమతించబడదు. 

మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంలో జరిగే ప్రమాదాలు కూడా దీని నుండి మినహాయించబడుతాయి. 

నేరపూరిత ఉద్దేశంతో ప్లాన్ చేసిన ప్రమాదంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి గాయపడితే, అలాంటి సంఘటనను సరళ్ సురక్ష బీమా క్రింద క్లెయిమ్ చేయడానికి అనుమతించబడదు. 

ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కొండలు ఎక్కడం/దిగడం మరియు విమానం లేదా బెలూన్‌లో ప్రయాణించినప్పుడు జరిగే ఏదైనా ప్రమాదం లేదా మరణం...

మరింత చదవండి

ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పర్వతాలు ఎక్కడం/దిగడం మరియు ప్రపంచవ్యాప్త ఏదైనా షెడ్యూల్ చేయబడిన విమానయాన సంస్థ ద్వారా విమానంలో లేదా బెలూన్‌లో ప్రయాణించిన సమయంలో జరిగే ప్రమాదం లేదా మరణాన్ని క్లెయిమ్ చేయడం వీలుకాదు. బెలూన్ లేదా విమానంలో ప్రయాణం కోసం ఇన్సూర్ చేయబడిన వ్యక్తి చెల్లింపు చేసి ఉన్నప్పటికీ, ఇదే వర్తిస్తుంది. 

ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి సంభవించే మరణం, వైకల్యం (అది శాశ్వతం కావచ్చు లేదా తాత్కాలికం కావచ్చు) లేదా హాస్పిటలైజేషన్ కోసం ఏదైనా క్లెయిమ్ ...

మరింత చదవండి

ప్రమాదకర లేదా సాహస క్రీడల్లో ఒక ప్రొఫెషనల్‌గా పాల్గొన్నప్పటికీ, ఆ కారణంగా సంభవించే మరణం, వైకల్యం (అది శాశ్వతం కావచ్చు లేదా తాత్కాలికం కావచ్చు) లేదా హాస్పిటలైజేషన్ కోసం క్లెయిమ్ చేయడం అనుమతించబడదు. పారా-జంపింగ్, బండరాళ్లు ఎక్కడం, పర్వతారోహణ, రాఫ్టింగ్, మోటార్ రేసింగ్, హార్స్ రేసింగ్ లేదా స్కూబా డైవింగ్, హ్యాండ్ గ్లైడింగ్, స్కైడైవింగ్, డీప్-సీ డైవింగ్ లాంటి కార్యకలాపాలు ఈ కోవలోకే వస్తాయి.  

రేడియోయాక్టివ్ మెటీరియల్ కారణంగా ఉత్పన్నమయ్యే ప్రమాదాలు, గాయాలు మరియు వైకల్యాలు ...

1 ఆఫ్ 1

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

4.75

(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

Faiz Siddiqui

విక్రమ్ అనిల్ కుమార్

నా హెల్త్ కేర్ సుప్రీమ్ పాలసీని రెన్యూ చేసుకోవడానికి, మీరు అందించిన సహకారానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు. 

Rekha Sharma

ప్రిథ్బీ సింగ్ మియాన్

లాక్‌డౌన్ సమయంలో కూడా మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ సర్వీస్. కాబట్టి నేను ఎక్కువ కస్టమర్‌లకు బజాజ్ అలియంజ్ హెల్త్ పాలసీని విక్రయించాను

Susheel Soni

అమగొంద్ విట్టప్ప అరకేరి

బజాజ్ అలియంజ్ వారి అద్భుతమైన, ఇబ్బందులు లేని సేవలు, కస్టమర్ల కోసం ఫ్రెండ్లీ వెబ్‌సైట్, అర్థం చేసుకోవడం సరళం మరియు ఆపరేట్ చేయడం సులభం. కస్టమర్‌లకు పూర్తి ఆనందంతో మరియు ఉత్సాహంతో సేవలు అందిస్తున్నందుకు మీ బృందానికి ధన్యవాదాలు...

సరళ్ సురక్షా బీమా పాలసీ గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు

సరళ్ సురక్షా బీమా పాలసీ అంటే ఏమిటి?

సరళ్ సురక్షా బీమా పాలసీ అనేది రెగ్యులేటర్ ద్వారా ఆదేశించబడిన ఒక ప్రామాణిక పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ. ప్రమాదం, పాక్షిక వైకల్యం లేదా శాశ్వత వైకల్యం సందర్భంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తులు మరియు వారి కుటుంబానికి ఇది ఆర్థిక భద్రత అందిస్తుంది. 

నేను పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌తో ఇన్సూర్ చేయబడాల్సిన అవసరమేమిటి?

ఒక ప్రమాదం కారణంగా మీకు వైకల్యం లేదా గాయం సంభవిస్తే, పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ మీకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఊహించని వైద్య ఖర్చులన్నీ మీకు ఆర్థికంగా కీలక అడ్డంకి కావచ్చు. సమగ్ర పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఊహించని సంఘటన తర్వాత మీకు మరియు మీ కుటుంబానికి ఆర్థికంగా సురక్షితంగా ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది రూ. 2.5 లక్షల నుండి రూ. 1 కోటి వరకు ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని అందిస్తుంది.

సహజ మరణం లేదా ఏదైనా అనారోగ్యం/వ్యాధి కారణంగా మరణాన్ని సరళ్ సురక్షా బీమా పాలసీ కవర్ చేస్తుందా?

లేదు, సరళ్ సురక్షా బీమా పాలసీ అనేది ప్రమాదం లేదా ప్రమాదవశాత్తు గాయాల కారణంగా సంభవించే మరణాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. 

పాలసీ క్రింద ఏయే కవరేజీలు లభిస్తాయి?

పాలసీ క్రింద కవరేజీలు క్రింది విధంగా ఉంటాయి:

బేస్ కవర్లు:

  • మరణం: ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పాలసీ వ్యవధిలో దురదృష్టకర మరణానికి గురైతే, పాలసీ క్రింద ఎంచుకున్న మేరకు ఇన్సూరెన్స్ మొత్తం అనేది అతని/ఆమె చట్టపరమైన వారసుడు/నామినీకి లభిస్తుంది.
  • శాశ్వత పూర్తి వైకల్యం: స్టాండర్డ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ప్రమాదం కారణంగా సంభవించే జీవితకాల వైకల్యాన్ని కవర్ చేస్తుంది.
  • శాశ్వత పాక్షిక వైకల్యం: అదనంగా, ప్రమాదం కారణంగా సంభవించిన పాక్షిక వైకల్యానికి చికిత్స కోసం ఖర్చును కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీ పథకం క్రింద కవర్ చేయబడుతుంది.

ఆప్షనల్ కవర్లు:

  • తాత్కాలిక పూర్తి వైకల్యం: పాలసీ వ్యవధిలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి ప్రమాదం కారణంగా గాయం ఏర్పడితే మరియు ఆ కారణంగా, ఉపాధి లేదా వృత్తిలో ఆ వ్యక్తి పాల్గొనే పరిస్థితి పూర్తిగా లేకపోవడాన్ని ఇలా పేర్కొంటారు. ఈ పరిస్థితిలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మళ్లీ పనిచేయగల స్థితికి చేరుకునే వరకు, గరిష్టంగా 100 వారాల వరకు ప్రతి వారం బేస్ సమ్ ఇన్సూర్డ్‌లో 0.2% రేటుతో పరిహారం చెల్లించబడుతుంది.
  • ప్రమాదాల కారణంగా హాస్పిటలైజేషన్ ఖర్చులు: క్లెయిమ్ అప్లికేషన్ ఆమోదం పొందినప్పుడు మాత్రమే, ప్రమాదం తర్వాత ఇన్సూరర్ హాస్పిటల్ ఖర్చులను ఇది కవర్ చేస్తుంది.
  • ఎడ్యుకేషన్ గ్రాంట్: ఈ పాలసీ అనేది ఇన్సూరర్ మీద ఆధారపడిన పిల్లల ఎడ్యుకేషన్ గ్రాంట్ కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 10%న్ని వన్-టైమ్ చెల్లిస్తుంది.

ఈ పాలసీ క్రింద ప్రవేశ వయస్సు ఏమిటి?

ఈ ప్లాన్ క్రింద ఇన్సూర్ చేయడానికి వయోజనులకు ప్రవేశ వయస్సు 18 నుండి 70 సంవత్సరాలు. అయితే, 3 నెలల వయసు నుండి పిల్లల్ని కూడా ఈ ప్లాన్ క్రింద కవర్ చేయవచ్చు. అయితే, ఆధారపడిన పిల్లల కోసం గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు మాత్రమే. 

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి