రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మీ మనస్సు ఎప్పుడూ మీ ఇంటి పైనే ఉంటుంది. మీ ఇల్లు అనేది మీ ప్రపంచానికి మూలం, ఒక అమూల్యమైన పెట్టుబడి మరియు వేల జ్ఞాపకాలు కలిగి ఉన్న ఖజానా. ఇది మీ ఇంటిని ఒక సాటిలేని ఆస్తిగా చేస్తుంది. అయితే, కొన్ని సందర్భాలలో మీ నివాసం కొన్ని భయాలు లేదా ఊహించని పరిస్థితులను ఎదుర్కోవచ్చు.
బజాజ్ అలియంజ్ వద్ద, మేము మీ ఇంటిని రక్షించవలసిన అవసరాన్ని అర్థం చేసుకుంటాము మరియు తదనుగుణంగా మీ ఇంటికి, దాని లోపల ఉన్న వస్తువులు మరియు ఇతర విలువైన వస్తువులకు సాటిలేని కవరేజ్ అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన మై హోమ్ ఇన్సూరెన్స్ ఆల్ రిస్క్ పాలసీతో ముందుకు వచ్చాము.
మీకు ఇష్టమైన హోమ్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్‍గా, మీ ఇంటికి రక్షణ కలిపించడం మా ప్రాధాన్యత. మరియు అందుకే; మేము మీకు తగిన సులభమైన ఇంకా విస్తృతమైన ఇన్సూరెన్స్ కవర్ అందిస్తాము, అదే సమయంలో ఇది సరసమైనది కూడా.
రెన్యూవల్ సంగతి ఏమిటి?
మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని తప్పనిసరిగా రెన్యూ చేయాలి, ఎందుకంటే మీ ఈ సులభమైన దశ ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని రీస్టోర్ చేస్తుంది మరియు సమగ్ర కవరేజ్‍ని మళ్ళీ ప్రారంభిస్తుంది. అయితే, దాని చిన్న నిర్దిష్ట వివరాలను తెలుసుకోవడం మంచిది.
బజాజ్ అలియంజ్ వద్ద మేము సౌకర్యవంతమైన రెన్యువల్ ప్రాసెస్ అందిస్తున్నాము. అయితే, మోరల్ హాజర్డ్, తప్పుడు ప్రాతినిధ్యం లేదా మోసాల ఆధారంగా రెన్యువల్‍ను తిరస్కరించే హక్కు మాకు ఉంటుంది.
మై హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలోని ఫీచర్లు గృహ యజమానులు, భూస్వాములు మరియు అద్దె ఇంటిలో నివసించేవారికి వర్తిస్తుంది:
ఈ పాలసీ మీ ఫర్నిచర్ మరియు ఫిక్స్చర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వంటగది వస్తువులు, దుస్తులు మరియు వ్యక్తిగత వస్తువులు అలాగే మీరు ఇన్సూర్ చేసిన ఇతర ప్రోడక్టులకు జరిగిన నష్టం/డామేజిని కవర్ చేస్తుంది.
ఈ పాలసీ భారతదేశంలో ఎక్కడైనా 'పోర్టబుల్ ఎక్విప్మెంట్' కు ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిన నష్టం లేదా డామేజిని కవర్ చేస్తుంది. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ కవర్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించవచ్చు.
ఈ పాలసీ భారతదేశంలో ఎక్కడైనా 'ఆభరణాలు మరియు విలువైన వస్తువులకు' ప్రమాదవశాత్తు జరిగిన నష్టం లేదా డామేజిని కవర్ చేస్తుంది. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ కవర్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించవచ్చు.
ఈ పాలసీ మీ భవనంలో నిల్వ చేయబడి లేదా పెట్టి ఉన్న 'అరుదైన వస్తువులు, కళా ఖండాలు మరియు పెయింటింగ్స్' కు ప్రమాదవశాత్తు జరిగిన నష్టం లేదా డామేజిని కవర్ చేస్తుంది. వస్తువుల మూల్యాంకన ఒక ప్రభుత్వం-ఆమోదిత వాల్యూయర్ ద్వారా చేయబడుతుంది మరియు మా ద్వారా ఆమోదించబడుతుంది.
ఈ పాలసీ చోరీ మరియు దొంగతనం వలన కలిగే నష్టం నుండి మీ ఇంటిని కవర్ చేస్తుంది.
మీ బిల్డింగ్ (అది ఒక అపార్ట్‌మెంట్ లేదా స్టాండ్‌అలోన్ బిల్డింగ్ అయినా), వస్తువులు, ఆభరణాలు మరియు విలువైన వస్తువులకు జరిగే నష్టాలు బాధకు గురిచేస్తాయి. అంతేకాకుండా, మీరు కళ మరియు పెయింటింగ్ పై అభిరుచిని కలిగి ఉంటే, వాటి విషయంలో జరిగే ఏదైనా నష్టం మిమ్మల్ని ఎంతగానో కలవర పెట్టవచ్చు. మీ బాధను మేము పంచుకుంటాము, మీరు మాత్రమే ఆ భారం భరించవలసిన అవసరం లేకుండా మీకు మద్దతుగా నిలుస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాము.
మా బిల్డింగ్ కవర్ రూ. 20,000 వరకు విలువగల ఆహారం, దుస్తులు, మందులు మరియు రోజువారీ అవసరాల ఎమర్జెన్సీ కొనుగోళ్లకు కూడా మిమ్మల్ని కవర్ చేస్తుంది/-.
మేము భారతదేశంలో విస్తృత కవరేజ్ అందిస్తాము మరియు మా పూర్తి సామర్థ్యం మేరకు మీ నష్టాలను తగ్గించడానికి ప్రయత్నిస్తాము. నామమాత్రపు అధిక ప్రీమియం చెల్లించిన తర్వాత, పోర్టబుల్ ఎక్విప్మెంట్ ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువుల కోసం మీకు ప్రపంచవ్యాప్తంగా కవరేజ్ అందించగలము.
1) సర్వేయర్ నియమించబడతారు మరియు నష్టం అంచనాల కోసం ఒక సందర్శన నిర్వహిస్తారు
2) క్లెయిమ్ మా సిస్టమ్‌లో రిజిస్టర్ చేయబడుతుంది మరియు కస్టమర్‌కు క్లెయిమ్ నంబర్ జారీ చేయబడుతుంది
3) 48-72 గంటల్లోపు (కేస్ ప్రకారం) ఒక సర్వే నిర్వహించబడుతుంది మరియు అవసరమైన డాక్యుమెంట్ల జాబితా కస్టమర్‌కు అందించబడుతుంది. వాటిని ఏర్పాటు చేయడానికి కస్టమర్‍కు7-15 పని రోజులు సమయం ఇవ్వబడుతుంది
4) డాక్యుమెంట్లు అందుకున్న తర్వాత, ఆ లాస్ అడ్జస్టర్ రిపోర్ట్‌ను బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తారు
5) రిపోర్ట్ మరియు డాక్యుమెంట్లు అందుకున్న తర్వాత, NEFT ద్వారా 7-10 రోజుల్లోపు (నష్టం రకం ఆధారంగా) క్లెయిమ్ ప్రాసెస్ చేయబడుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి మీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి.
మై హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ క్రింది విధంగా అందరికీ వర్తిస్తుంది:
A) 50 సంవత్సరాల కంటే ఎక్కువ పాతది కాని ఆస్తిని స్వంతంగా కలిగి ఉన్న గృహ యజమానులు మా మై హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు.
B) అద్దె వసతిలో నివసిస్తున్న ఉన్నవారు మరియు ఇంటి యాజమాన్యం లేని ఇతరులు నివసిస్తున్న ఆస్తిలో ఉన్న వస్తువులను ఇన్సూర్ చేసుకోవచ్చు.
మీరు అండర్ లేదా ఓవర్ ఇన్సూర్ చేయబడలేదని నిర్ధారించుకోవడానికి ఒక హౌస్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు మీ గృహ నిర్మాణం మరియు దాని వస్తువుల విలువను సరిగ్గా అంచనా వేయడం ముఖ్యం. ఇది నష్టం జరిగిన సందర్భంలో క్లెయిమ్ మొత్తాన్ని ప్రభావితం చేయగలదు, లేదా మీరు చెల్లించవలసిన దాని కంటే ఎక్కువ ప్రీమియం చెల్లిస్తూ ఉండవచ్చు. విలువ అంచనా వేసే ప్రక్రియను సులభతరం చేయడానికి మీ అవసరానికి తగినట్లుగా మీరు ఎంచుకోవడానికి నిర్మాణ సంబంధిత అంశాలను మూడు వేర్వేరు ప్రతిపాదికన, మరియు వస్తువుల సంబంధిత అంశాలను రెండు వేర్వేరు ప్రతిపాదికన విభజించబడ్డాయి:
అంగీకరించబడిన విలువ ప్రాతిపదికన: మార్కెట్ విలువ కంటే ఎక్కువగా ఉండగల విలువకు మాతో అంగీకరించబడిన విలువకు మీ ఆస్తి యొక్క నిర్మాణాన్ని మీరు కవర్ చేయవచ్చు. ఇది నిర్మాణం కోసం మాత్రమే వర్తిస్తుంది మరియు వస్తువులకు కాదు.
రీఇన్‌స్టేట్‌మెంట్ ప్రాతిపదికన: మీరు రీఇన్‌స్టేట్‌మెంట్ విలువ ప్రాతిపదికన హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే, క్లెయిమ్ సమయంలో ఎటువంటి తరుగుదల విధించబడదు మరియు ఇన్సూర్ చేయబడిన మొత్తం ఆధారంగా మీకు రీప్లేస్‌మెంట్ ఖర్చు మొత్తం చెల్లించబడుతుంది. ఇది నిర్మాణం కోసం మాత్రమే వర్తిస్తుంది మరియు వస్తువులకు కాదు.
నష్టపరిహార విలువ ప్రాతిపదికన: సాధారణంగా మార్కెట్ విలువ ప్రాతిపదికన అని పిలువబడే నష్టపరిహార విలువ ప్రాతిపదికన అనేది నిర్మాణాన్ని ఇన్సూర్ చేయడానికి ఉపయోగించే ఒక పద్ధతి, ఇది క్లెయిమ్ సమయంలో, భవనం యొక్క వయస్సు ప్రకారం వెలతగ్గడం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. వస్తువులను ఇన్సూర్ చేసేటప్పుడు కూడా ఈ పద్ధతిని వర్తింపజేయవచ్చు.
పాత ప్రాతిపదికన కొత్తది: వస్తువులను ఇన్సూర్ చేసేటప్పుడు ఈ పద్ధతిని ఎంచుకున్నప్పుడు, రిపేర్ చేయలేని విధంగా దెబ్బతిన్న వస్తువు కొత్త దాంతో రీప్లేస్ చేయబడుతుంది లేదా అది ఎంత పాతది అనే దాంతో సంబంధం లేకుండా మేము రిప్లేస్ చేయబడిన వస్తువు పూర్తి ఖర్చును చెల్లిస్తాము.
మీ కలల ఇల్లు రక్షించబడాలి. మా మై హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది భూకంపాలు, వరదలు, అగ్నిప్రమాదం, దొంగతనం, చోరీలు మరియు దానికి సంభవించగల ఏవైనా ఇతర ప్రమాదాలకు సంబంధించి మీ ఇంటిని మరియు దాని వస్తువులను కవర్ చేయడానికి రూపొందించబడిన ఒక సరసమైన ఫైనాన్షియల్ సాధనం.
ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది వారి ఆస్తి నిర్మాణం అలాగే దాని వస్తువులను కవర్ చేయాలనుకునే గృహ యజమానులకు అందించబడే ఒక పాలసీ, ఇది అగ్నిప్రమాదం, చోరీ, వరద, దొంగతనం మొదలైనటువంటి సంఘటనల కారణంగా జరిగే ఫైనాన్షియల్ నష్టాల నుండి వారిని రక్షిస్తుంది. మీరు నివసించే ఉద్దేశ్యం కోసం అద్దెకు తీసుకున్న ఇంటి యొక్క వస్తువులను మాత్రమే కూడా మీరు కవర్ చేసుకోవచ్చు.
బజాజ్ అలియంజ్ మై హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఆస్తికి మరియు దానిలో ఉన్న వస్తువులకు నష్టాలు కలగజేయగల అనేక ప్రమాదాలను కవర్ చేస్తుంది. అయితే, నిర్మాణం మరియు వస్తువుకు ముందు నుంచే ఉన్న డామేజీలు, లోపభూయిష్టమైన పనితనం, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ వస్తువులలో తయారీ లోపాలు, వస్తువులను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం, యుద్ధం, దండయాత్ర లేదా విదేశీ శత్రువు వైరంతో కూడిన చర్య యొక్క ప్రత్యక్ష లేదా పరోక్ష పర్యవసానంగా నష్టం లేదా డామేజ్, రహస్యంగా మాయం అవడం లేదా వివరణ లేని నష్టాలు, నీతిలేని లేదా అనైతిక ఉపయోగం కారణంగా ఇన్సూరెన్స్ చేయబడిన ఆస్తికి లేదా సాధారణ ప్రజలకు జరిగిన నష్టం వంటి కొన్ని పరిస్థితుల కింద అవి కవర్ చేయబడవు.
ప్రధానంగా అగ్ని ప్రమాదం, చోరీ, దొంగతనం, ప్రమాదవశాత్తు జరిగిన నష్టం మరియు ప్రకృతి వైపరీత్యాలతో పాటు అన్ని రకాల ప్రమాదాల వలన మీ ఆస్తి మరియు/లేదా వస్తువులకు జరిగే నష్టాన్ని మై హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. మీ ఇంటిలో కళా ఖండాలు, ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులకు కూడా మీరు కవరేజ్ పొందుతారు. పైన పేర్కొన్న ఏదైనా ప్రమాదాల కారణంగా మీ ఆస్తి ఒక నిర్దిష్ట వ్యవధి కోసం నివాసయోగ్యమైనది కాకపోతే మరియు దానికి రిపేర్‌లు అవసరమైతే, ఆస్తి మళ్ళీ బాగు చేయబడే వరకు మీరు ప్రత్యామ్నాయ వసతిని అద్దెకు తీసుకునే ప్రయోజనాన్ని పొందుతారు.
హోమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు అనేవి డామేజికి కారణమైన ఆపద పై ఆధారపడి ఉంటాయి ఎందుకంటే, దానిని సాక్ష్యంగా సమర్పించవచ్చు కనుక. ఒక అగ్నిప్రమాదం జరిగి ఉంటే, మీరు సరిగ్గా నింపబడిన మరియు సంతకం చేయబడిన క్లెయిమ్ ఫారంతో పాటు ఒక ఫైర్ బ్రిగేడ్ రిపోర్ట్‌ను సమర్పించాలి, అయితే, ఒక దొంగతనం జరిగి ఉంటే, ఒక FIR నమోదు చేయబడాలి మరియు దాని వివరాలను మాకు అందించాలి. ఏ సందర్భంలోనైనా, క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడానికి క్లెయిమ్ ఫారం అవసరం.
మీరు మీ ఇల్లు మరియు దాని వస్తువుల కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని ఒక అంగీకరించబడిన విలువ ప్రాతిపదికన, రీఇన్‌స్టేట్‌మెంట్ ప్రాతిపదికన లేదా నష్టపరిహారం ప్రాతిపదికన లెక్కించవచ్చు.
అవును, మీరు 25% కంటే మించని అదనపు ప్రీమియంకు ఎస్కలేషన్ క్లాజ్ ఎంచుకోవడం ద్వారా పాలసీ అవధి సమయంలో మీ ఇంటి కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని పెంచుకోవచ్చు. ఉదాహరణకు, SI రూ. 10 లక్షలు మరియు మీరు 25% ఎస్కలేషన్ క్లాజ్ కోసం ఎంచుకున్నారు. ప్రతిరోజూ గడిచే కొద్దీ SI పెరుగుతుంది మరియు పాలసీ యొక్క చివరి రోజున SI 12.5లక్షలు అవుతుంది.
గమనిక: రీఇన్‍స్టేట్మెంట్ మరియు నష్టపరిహారం ప్రాతిపదికన ఎంచుకోబడిన నిర్మాణం SI పై మాత్రమే ఎస్కలేషన్ క్లాజ్ అందుబాటులో ఉంటుంది.
ఆభరణాలు, అరుదైన వస్తువులు మరియు కళా ఖండాల కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తం ప్రభుత్వం చేత-ఆమోదించబడిన వాల్యూయర్ ద్వారా చేయబడిన మరియు మా ద్వారా ఆమోదించబడే వస్తువుల మూల్యాంకన ఆధారంగా నిర్ణయించబడుతుంది.
లేదు, అరుదైన వస్తువులు మీ భవనంలో నిల్వ చేయబడి లేదా ఉంచబడి ఉన్నప్పుడు మాత్రమే అవి కవర్ చేయబడతాయి.
లేదు, మై హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద ఒక మొత్తం సొసైటీ లేదా బిల్డింగ్ కవర్ చేయబడదు.
మా మై హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఈ క్రింద ఇవ్వబడిన ఆస్తులు కవర్ చేయబడవు:
· నిర్మాణంలో ఉన్న ఆస్తి
· భూమి మరియు ప్లాట్లు
· దుకాణాలు మరియు ఇతర వాణిజ్య స్థలాలు
· 'కచ్చా' నిర్మాణాలు
· ఆఫీసులుగా కూడా పనిచేసే నివాసాలు మరియు నివాసాలుగా పనిచేసే ఆఫీసులు
ప్రోడక్ట్ కొనుగోలు చేసేటప్పుడు సేల్స్ మేనేజర్‌తో పని చేయడం ఒక చక్కటి అనుభవం.
సేల్స్ ఎగ్జిక్యూటివ్ చాలా సమాచారం అందించారు మరియు నా ఇంటి కోసం ఉత్తమ పాలసీని సూచించారు. అద్భుతమైన సపోర్ట్ అందింది.
హోమ్ ఇన్సూరెన్స్ కోసం చాలా సమర్థవంతమైన సర్వీస్ మరియు బ్యాక్-అప్.
మీ ఇంటిని సురక్షితం చేయడం కేవలం ఒక క్లిక్ దూరంలో ఉంటుంది.
సంపూర్ణ రక్షణ కోసం మీ పాలసీని కస్టమైజ్ చేసుకోండి
ఒకవేళ ఏదో విపత్తు కారణంగా మీరు అద్దెకి ఇచ్చిన ఆస్తి ధ్వంసం అయితే, మరియు మీ కిరాయిదారు దానిని ఖాళీ చేసిన కారణంగా మీరు అద్దె అందుకోవడం ఆగిపోతే, ఆ ఆస్తి నివాసయోగ్యంగా లేనంత కాలం పోగొట్టుకున్న మొత్తం కోసం మేము మీకు నష్టపరిహారం అందిస్తాము.
అగ్నిప్రమాదం, వరదలు మొదలైనటువంటి కొన్ని సంఘటనల కారణంగా మీ ఇల్లు ధ్వంసం చేయబడి మరియు మీరు ప్రత్యామ్నాయ వసతికి మారవలసి వస్తే, మేము రవాణా మరియు ప్యాకింగ్ ఖర్చుల కోసం మీకు నష్టపరిహారం చెల్లిస్తాము.
మీ ఇంటిలో దోపిడీ జరిగినా, లేదా మీ ఇంటి లేదా వాహనం యొక్క తాళం చెవులు దొంగిలించబడినా, మేము తాళాలు బాగుచేసే వ్యక్తి ఖర్చులను తిరిగి చెల్లిస్తాము.
మీరు ATM నుండి డబ్బును విత్‍డ్రా చేసిన వెంటనే దోచుకోబడితే, దొంగతనం కారణంగా పోగొట్టుకున్న మొత్తానికి మేము మీకు పరిహారం ఇస్తాము.
మీ వ్యాలెట్ పోయినా లేదా దొంగిలించబడినా, మేము దాని కోసం మీకు రీప్లేస్‌మెంట్ ఖర్చును అలాగే వాలెట్‍లో ఉన్న పోయిన కాగితాలు మరియు కార్డుల కోసం అప్లికేషన్ ఖర్చును చెల్లిస్తాము.
ఇన్సూరెన్స్ వ్యవధిలో మీ పెంపుడు కుక్క ప్రమాదం మరియు/లేదా సంక్రమించిన వ్యాధుల కారణంగా మరణించినట్లయితే, మీకు జరిగిన నష్టానికి మేము మీకు ఒక ఫిక్స్‌డ్ మొత్తాన్ని చెల్లిస్తాము.
మీరు నివాస ప్రయోజనాల కోసం ఒక ప్రదేశాన్ని ఉపయోగిస్తే లేదా ఆక్రమిస్తే, మరియు ఎవరికైనా గాయం అయినా లేదా వారి ఆస్తి పాడైనా, ఆ డామేజీలను సరిచేయడానికి అవగల ఖర్చును పబ్లిక్ లయబిలిటీ కవర్ చెల్లిస్తుంది.
ఉపాధి కాలంలో ఒక ఉద్యోగికి ప్రమాదం జరిగి గాయపడితే, అతనికి నష్టపరిహారం లభిస్తుంది.
బిల్డింగ్ కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తం
అంగీకరించబడిన విలువ ప్రాతిపదికన
ఇన్సూర్ చేయబడిన మొత్తం = మొత్తం చదరపు అడుగులు (అమ్మకపు డీడ్‌లో పేర్కొన్నట్లుగా) * ధర/చదరపు అడుగులు (నిర్దిష్ట లొకేషన్ కోసం)
రీఇన్‌స్టేట్‌మెంట్ విలువ ప్రాతిపదికన
బిల్డింగ్ యొక్క వైశాల్యం (చదరపు అడుగులు) *ఆ ప్రాంతంలో నేటి రోజున నిర్మాణం యొక్క ఖర్చు * (1+ ఎంచుకోబడిన ఎస్కలేషన్ % )
నష్టపరిహార విలువ ప్రాతిపదికన భవనం యొక్క వైశాల్యం (చదరపు. అడుగులు) *ఆ ప్రాంతంలో ప్రస్తుత రోజు నిర్మాణం యొక్క ఖర్చు * (1+ ఎంచుకోబడిన ఎస్కలేషన్ % ) * (1 –తుది డిప్రిషియేషన్ రేటు వెరశి 70% మించకుండా డిప్రిశియేషన్ 2.5% P.A వద్ద x భవనం యొక్క వయస్సు).
వస్తువుల కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తం
పాతదాని కోసం కొత్తది ప్రాతిపదికన
ఇది అదే రకమైన మరియు సామర్థ్యంగల కొత్త వస్తువు ద్వారా ఇన్సూర్ చేయబడిన వస్తువుల రిప్లేస్మెంట్ విలువను సూచిస్తుంది (అరుగుదల మరియు తరుగుదల మరియు డిప్రిషియేషన్ అవకాశం లేకుండా).
నష్టపరిహారం ప్రాతిపదికన
ఈ అంకె కొత్తవిగా (సవరణ, అరుగుదల మరియు తరుగుదల మరియు డిప్రిషియేషన్ అవకాశం లేకుండా) ఇన్సూర్ చేయబడిన వస్తువుల రీప్లేస్మెంట్ విలువ ఆధారంగా ఉంటుంది.
ఆభరణాలు మరియు విలువైన వస్తువుల కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తం
గోల్డ్ ప్లాన్ కోసం రూ. 2 లక్షల 50 వేలు, డైమండ్ ప్లాన్ కోసం రూ. 5 లక్షలు, మరియు ప్లాటినం ప్లాన్ కోసం రూ. 10 లక్షలు వరకు వెల కట్టబడిన ఆభరణాలు మరియు విలువైన వస్తువుల కోసం, మీరు పూర్తి వివరణ మరియు మార్కెట్ విలువతో వస్తువుల జాబితాను అందించాలి.
బజాజ్ అలియంజ్ ద్వారా ఆమోదించబడిన వాల్యూయర్ నుండి ఒక వాల్యుయేషన్ రిపోర్ట్‌ను మీరు అందించవలసి ఉంటుంది. ఇన్సూర్ చేయబడిన మొత్తం రెండిటి పై ఆధారపడి ఉంటుంది: ఇన్సూర్ చేయబడిన పూర్తి మొత్తం మరియు నష్ట పరిమితి ప్రాతిపదికన.
నష్ట పరిమితి ఎంపికల్లో ఇవి ఉంటాయి:
1 మొత్తం ఇన్సూర్ చేయబడిన మొత్తం యొక్క 25%
2 మొత్తం ఇన్సూర్ చేయబడిన మొత్తం యొక్క 40%
కళాఖండాలు, పెయింటింగ్ మరియు అరుదైన వస్తువులు కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తం
బజాజ్ అలియంజ్ ద్వారా ఆమోదించబడిన వాల్యూయర్ నుండి వాల్యుయేషన్ రిపోర్ట్ ఆధారంగా ఇన్సూర్ చేయబడిన మొత్తం అంగీకరించబడిన విలువ ప్రాతిపదికన ఉంటుంది.
మార్కెట్‌లో ప్రచారంలో ఉన్న ఎన్నో ఇతర పాలసీల మధ్య, మా సాటివారు మరియు ప్రత్యర్ధుల నుండి కూడా ఒకే విధంగా మమ్మల్ని ప్రత్యేకంగా నిలిపే ఫీచర్లు మా పాలసీకి ఉన్నాయి. ఏమైనా, సురక్షత (ఇన్సూరెన్స్ అని చదవండి)కోసం మీ ఆవశ్యకత మాకు ఆజ్ఞ వంటి.
✓ మై హోమ్ ఇన్సూరెన్స్ ఆల్ రిస్క్ పాలసీ మీ ఇంటికి మరియు అందులో మీరు విలువైనవిగా భావించే వస్తువులకు ఒక వ్యవధి కోసం కవరేజ్ అందిస్తుంది.
✓ మీకు ఆభరణాల పై అభిరుచి ఉండవచ్చు. లేదా మీరు కళల పై ఆసక్తి ఉండవచ్చు. అవసరం ఏమైనప్పటికీ, మేము కష్ట కాలంలో మిమ్మల్ని కవర్ చేసి ఉంచుతాము. మా ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీతో, ఒకే కవర్ కింద మీ ఆభరణాలు, కళా ఖండాలు, పెయింటింగ్స్, అరుదైన వస్తువులకు మరియు ఇతర వ్యక్తిగత విలువైన వస్తువులకు కవరేజ్ పొందండి.
ఇది ఎందుకంటే వాటిని ఇన్సూర్ చేయడం తదుపరి తరం కోసం మీ వారసత్వాన్ని కాపాడుతుంది.
✓ కొంతకాలం గడిచిన తర్వాత మీ అభిరుచి మరియు వ్యక్తిత్వం ప్రతిబింబించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు మీ ఇంటికి వస్తుంది. ఇంటిలో ఉన్న ఒక వస్తువు కాకుండా మరొక వస్తువును రక్షించడానికి ఎంచుకోవడం చాలా కష్టంగా ఉండవచ్చు. అందుకే ఇన్సూర్ చేయబడిన మొత్తం రూ. 5 లక్షలకు మించినట్లయితే, మేము మీ నుండి వస్తువుల జాబితాను అడగము.
✓ అది వ్యాపారం లేదా విశ్రాంతి కోసం అయినా, ప్రయాణం అనేది మీ ప్రాధాన్యత జాబితాలో అకస్మాత్తుగా కనిపించవచ్చు,. మీరు విలువైన వస్తువులు లేదా ఎక్విప్మెంట్ పోగొట్టుకున్నా లేదా డామేజ్ చేసుకున్నా అది ఎంత గాభరా కలిగిస్తుందో మాకు తెలుసు. మీరు ఇంకా విదేశీ ప్రాంతాల్లో ఉండగా నష్టం జరిగినట్లయితే ఆ కంగారు మరీ వేగంగా పెరిగిపోతుంది. ఈ ఆలోచనను దృష్టిలో ఉంచుకుని, నామమాత్రపు అధిక ప్రీమియం చెల్లించిన మీదట మీ ఆభరణాలు, విలువైన వస్తువులు మరియు పోర్టబుల్ ఎక్విప్మెంట్‍కు ప్రపంచవ్యాప్తంగా కవరేజ్ అందించడానికి మేము మా పాలసీని రూపొందించాము.
కాబట్టి మీరు ప్రయాణం గురించి ఈ సారి ఆలోచించినప్పుడు, బజాజ్ అలియంజ్ గురించి ఆలోచించండి.
✓ పాలసీ సంవత్సరంలో ఒక క్లెయిమ్ కారణంగా పూర్తిగా ఖర్చు అయిన మొత్తాన్ని మేము రీస్టోర్ చేస్తాము. మీరు చేయవలసిందల్లా మాకు తెలియజేయడం మాత్రమే. మిగిలిన వాటి గురించి మేము ఆలోచిస్తాము.
✓ మీ వస్తువులు, ఆభరణాలు, పెయింటింగ్లు, కళాఖండాలు, అరుదైన వస్తువులు మరియు ఇతర విలువైన వస్తువులు అంగీకరించిన విలువ ప్రాతిపదికన వాటి నిజమైన విలువ కంటే తక్కువగా ఇన్సూర్ చేయబడినట్లయితే, మేము కండిషన్ ఆఫ్ యావరేజ్‌ని సంతోషంగా రద్దు చేస్తాము.
మీ వస్తువులను సురక్షితం చేయడానికి ఆ అదనపు అడుగు వేయడానికి మేము ఇష్టపడతాము!
మీ అవసరాలకు అనుగుణంగా ఉండటానికి మా ఆల్ రిస్క్ పాలసీ రూపొందించబడింది. ఖచ్చితంగా అందుకోసమే మీరు ఒక రోజు నుండి 5 సంవత్సరాల మధ్య ఎంత వ్యవధికైనా దాని కోసం సైన్ అప్ చేసుకోవచ్చు.
మై హోమ్ ఇన్సూరెన్స్ | బిల్డింగ్ ఇన్సూరెన్స్ (నిర్మాణం) | ||||
అంగీకరించిన విలువ ప్రాతిపదికన (ఫ్లాట్/అపార్ట్‌మెంట్) |
రీఇన్‌స్టేట్‌మెంట్ వాల్యూ బేసిస్ (ఫ్లాట్ / అపార్ట్‌మెంట్ / ఇండిపెండెంట్ బిల్డింగ్) |
నష్టపరిహారం ప్రాతిపదికన (ఫ్లాట్ / అపార్ట్‌మెంట్ / ఇండిపెండెంట్ బిల్డింగ్) |
|||
పోర్టబుల్ పరికరాలతో సహా వస్తువులు | పాతదాని కోసం కొత్తది ప్రాతిపదికన (ఆభరణాలు మరియు విలువైన వస్తువులు, పెయింటింగ్, కళా ఖండాలు మరియు అరుదైన వస్తువులను మినహాయించి) | ప్లాటినం ప్లాన్ -I ఫ్లాట్/అపార్ట్‌మెంట్ ఇన్సూరెన్స్ - అంగీకరించిన విలువ ప్రాతిపదికన + వస్తువులు - పాతదాని కోసం కొత్తది |
డైమండ్ ప్లాన్ -I ఫ్లాట్/అపార్ట్‌మెంట్/బిల్డింగ్- రీఇన్‌స్టేట్‌మెంట్ విలువ ప్రాతిపదికన + వస్తువులు - పాతదాని కోసం కొత్తది ప్రాతిపదికన |
గోల్డ్ ప్లాన్ -I ఫ్లాట్/అపార్ట్‌మెంట్/బిల్డింగ్ - నష్టపరిహారం ప్రాతిపదికన + వస్తువులు- పాతదాని కోసం కొత్తది ప్రాతిపదికన |
|
---|---|---|---|---|---|
నష్టపరిహారం ప్రాతిపదికన (ఆభరణాలు మరియు విలువైన వస్తువులు, పెయింటింగ్, కళా ఖండాలు మరియు అరుదైన వస్తువులను మినహాయించి) | ప్లాటినం ప్లాన్ -II ఫ్లాట్/అపార్ట్‌మెంట్ ఇన్సూరెన్స్ - అంగీకరించిన విలువ ప్రాతిపదికన + వస్తువులు - నష్టపరిహారం ప్రాతిపదికన |
డైమండ్ ప్లాన్ -II ఫ్లాట్/అపార్ట్‌మెంట్/బిల్డింగ్ - రీఇన్‌స్టేట్‌మెంట్ విలువ ప్రాతిపదికన + వస్తువులు - నష్టపరిహారం ప్రాతిపదికన |
గోల్డ్ ప్లాన్ -II ఫ్లాట్/అపార్ట్‌మెంట్/బిల్డింగ్ - నష్టపరిహారం ప్రాతిపదికన + వస్తువులు - నష్టపరిహారం ప్రాతిపదికన |
||
పోర్టబుల్ పరికరాల కవరేజ్ | ఇన్‌బిల్ట్ కవరేజ్ : అదనపు ప్రీమియం చెల్లింపుపై భారతదేశం కవరేజ్ పొడిగింపు: ప్రపంచవ్యాప్తంగా | ||||
ఆభరణాలు, విలువైన వస్తువులు, అరుదైన వస్తువులు మొదలైనవి. | ఆభరణాలు, విలువైన వస్తువులు, అరుదైన వస్తువులు, పెయింటింగ్ మరియు కళా ఖండాలు) | ఆభరణాలు మరియు విలువైన వస్తువుల కోసం: ఇన్‌బిల్ట్ కవరేజ్ : అదనపు ప్రీమియం చెల్లింపుపై భారతదేశం కవరేజ్ పొడిగింపు: ప్రపంచవ్యాప్తంగా | |||
అదనపు ప్రయోజనం | ప్రత్యామ్నాయ వసతి కోసం అద్దె మరియు బ్రోకరేజ్ | i) ప్రత్యామ్నాయ వసతి కోసం అద్దె a) ఫ్లాట్/అపార్ట్‌మెంట్ ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 0.5% లేదా b) వాస్తవ అద్దె, పునర్నిర్మాణం పూర్తి అయ్యే లేదా 24 నెలలు ఏది తక్కువ అయితే ఆ వ్యవధి వరకు నెలకు గరిష్టంగా రూ. 50,000 కు లోబడి, (a) మరియు (b) లలో ఏది తక్కువ అయితే అది ii) ఒక నెల అద్దెకు మించకుండా చెల్లించవలసిన వాస్తవ బ్రోకరేజ్ |
i) ప్రత్యామ్నాయ వసతి కోసం అద్దె a) ఫ్లాట్/అపార్ట్‌మెంట్ ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 0.3% లేదా b) బ్రోకరేజ్‍తో సహా వాస్తవ అద్దె, పునర్నిర్మాణం పూర్తి అయ్యే లేదా 24 నెలలు ఏది తక్కువ అయితే ఆ వ్యవధి వరకు నెలకు గరిష్టంగా రూ. 35,000 కు లోబడి, (a) మరియు (b) లలో ఏది తక్కువ అయితే అది ii) ఒక నెల అద్దెకు మించకుండా చెల్లించవలసిన వాస్తవ బ్రోకరేజ్ |
- | |
ఎమర్జెన్సీ కొనుగోళ్లు | రూ. 20,000 లేదా వాస్తవ మొత్తం ఏది తక్కువగా ఉంటే అది | ||||
గమనిక | ఇన్సూర్ చేయడానికి ఎంపికలు | ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి ఫ్లాట్/అపార్ట్‌మెంట్/స్వతంత్ర బిల్డింగ్ మాత్రమే లేదా వస్తువులు మాత్రమే లేదా రెండింటిని ఇన్సూర్ చేయడానికి ఎంపిక ఉంటుంది. | |||
పాలసీ వ్యవధి | పాలసీ వ్యవధి కోసం ఎంపికలు | i) 15/30/60/90/120/150/180/210/240/270 రోజుల వరకు షార్ట్ టర్మ్ పాలసీ ii) 1 సంవత్సరం/2 సంవత్సరాలు/3 సంవత్సరాలు/4 సంవత్సరాలు/5 సంవత్సరాల వార్షిక పాలసీ (గమనిక: అన్ని పాలసీలకు ఎంచుకోబడిన అన్ని కవర్ల కోసం పాలసీ వ్యవధి ఒకే విధంగా ఉంటుంది) |
|||
యాడ్ ఆన్ కవర్లు | అన్ని ప్లాన్ల కోసం యాడ్ ఆన్ కవర్ | 1) అద్దె నష్టం 2) తాత్కాలిక రీసెటిల్‌మెంట్ కవర్ 3) కీస్ మరియు లాక్స్ రీప్లేస్మెంట్ కవర్ 4) ఏటిఎం విత్‍డ్రాల్ దొంగతనం కవర్ 5) పోయిన వాలెట్‌కి కవర్ 6) డాగ్ ఇన్సూరెన్స్ కవర్ 7) పబ్లిక్ లయబిలిటీ కవర్ 8) ఉద్యోగి యొక్క పరిహారం కవర్ |
|||
వస్తువులు ఇన్సూర్ చేయబడి ఉంటే తప్ప ఆభరణాలు మరియు విలువైన వస్తువులు మరియు / లేదా అరుదైన వస్తువులు, పెయింటింగ్లు మరియు కళా ఖండాల కోసం స్టాండ్అలోన్ కవర్ ఎంచుకోలేము. |
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(25 సమీక్షలు & రేటింగ్‍ల ఆధారంగా)
నిశాంత్ కుమార్
ఆన్‌లైన్‌లో హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి సులభమైన మరియు ఇబ్బందులు లేని, సౌకర్యవంతమైన మార్గం.
రవి పుత్రేవు
హోమ్ ఇన్సూరెన్స్ కోసం ప్రొఫెషనల్, వేగవంతమైన మరియు సరళమైన క్లెయిమ్ ప్రాసెస్!
ప్రఖర్ గుప్తా
నేను బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాను, అతను హోమ్ ఇన్సూరెన్స్ గురించి అన్నీ నాకు వివరించారు, అది ప్రశంసనీయం.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి