Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

మోటార్ ఇన్సూరెన్స్

చెల్లుబాటయ్యే రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయండి
పాన్ కార్డ్ ప్రకారం పేరు ఎంటర్ చేయండి
చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి

24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

ఆన్ ది స్పాట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్లు

7,200+ నెట్‌వర్క్ గ్యారేజీలు

 

About Motor Insurance

మోటార్ ఇన్సూరెన్స్ గురించి

మోటార్ ఇన్సూరెన్స్ అనేది ట్రక్కులు, కార్లు, బైక్‌లు, జీపులు, స్కూటర్లు మొదలైన వాహనాలకు తప్పనిసరి. ఈ పాలసీ వాహన యజమాని/డ్రైవర్‌కు యాక్సిడెంట్లు లేదా ఇతర రకాల డ్యామేజీల వల్ల ఎదురయ్యే ఆర్థిక నష్టాలపై కవరేజీని అందిస్తుంది.

సంభవించే ఆర్థిక ప్రమాదాల నుండి రక్షించబడడానికి వాహన యజమానులు, భారతదేశంలో చెల్లుబాటు అయ్యే మోటార్ ఇన్సూరెన్స్‌ని కలిగి ఉండటం తప్పనిసరి. ప్రమాదం తరువాత సంభవించే పెద్ద మొత్తం ఖర్చులను నివారించడానికి మీరు పొందగలిగే అత్యుత్తమ భద్రత ఇది. ప్రతిరోజూ మోటారు వాహనాల ద్వారా ప్రయాణించే వ్యక్తుల భద్రతపై ప్రభుత్వం తప్పనిసరిగా దృష్టిపెడుతుంది.

వాహనం కొనడం అనేది ఇంటి తర్వాత ఒక వ్యక్తి జీవితంలో రెండవ అత్యంత ఖరీదైన పెట్టుబడి అని ఎవరూ కాదనలేరు. అందువల్ల, ఊహించని సంఘటనల నుండి మన పెట్టుబడిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. వాహనాల రిపేయిరింగ్ ఛార్జీల పెంపు మరియు డ్రైవింగ్ వల్ల కలిగే నష్టాలను పరిశీలిస్తే, ఒక ఊహించని దురదృష్టకర ప్రమాదం మీకు ఎక్కువ ఖర్చు అయ్యేలా చేస్తుంది.

ప్రమాదాల సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీ మీకు అందించే ప్రయోజనాలు మరియు రక్షణతో పోల్చితే, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు చెల్లించే వార్షిక ప్రీమియంలు చాలా తక్కువ. పాలసీకి సంబంధించి అనేక అపోహలు ఉన్నప్పటికీ, ఇది వివిధ పరిస్థితులలో తలెత్తే భౌతిక నష్టాలపై మీకు ఖచ్చితమైన పరిహారాన్ని అందిస్తుంది.

 

మీరు ఒక వాహన ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు కొనుగోలు చేయాలి?

మీరు నమ్ముతారో లేదో, భారతదేశంలో డ్రైవింగ్ చాలా రిస్కుతో కూడుకున్నది. లక్షలాది మంది డ్రైవింగ్ లైసెన్స్‌ని కలిగి ఉన్నారు మరియు ప్రతి ఇంట్లో కనీసం ఒక వాహనం ఉంది. వాహనాలు రవాణాకు కీలకమైన మార్గంగా మారాయి, ప్రజా రవాణా సౌకర్యాల ద్వారా ప్రయాణించాల్సిన ప్రజల అవసరాన్ని ఇవి తొలగించాయి. అదే సమయంలో, ప్రైవేట్ వాహనాలు పెరగడం కూడా రోడ్డు ప్రమాదాలు మరియు నియమాలను ఉల్లంఘించే ప్రమాదాలను పెంచుతుందని మాకు తెలుసు. అటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, ఒక వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అలా కాకుండా, సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి గల ప్రాథమిక కారణాలను పరిశీలిద్దాం.

  • చట్టపరమైన అవసరం:

    మొదటి కారణం ఏంటంటే, ప్రభుత్వ చట్టాలను మరియు నిబంధనలను పాటించడం. ఒక వ్యక్తి వాహనాన్ని రోడ్డుపైకి తీసుకెళ్లే ముందు కనీస కవరేజీతో ఒక మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవలసి ఉంటుంది.

  • థర్డ్-పార్టీ డ్యామేజ్ కవరేజ్:

    తగినంత కవరేజీతో, థర్డ్ పార్టీతో ఢీకొన్న తర్వాత జరిగిన నష్టాలకు మీరు చెల్లించవచ్చు. మోటార్ ఇన్సూరెన్స్ లేనట్లయితే, మీరు మీ జేబు నుండి చెల్లించాల్సి వస్తుంది మరియు తగిన మొత్తంలో కవరేజ్ మాత్రం అటువంటి ఖర్చులను కవర్ చేస్తుంది.

  • దొంగతనం పై భద్రత:

    దొంగతనం అనేది వాహనానికి సంబంధించిన అతి ముఖ్యమైన అపాయాలలో ఒకటి. కానీ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు దొంగతనం, విధ్వంసం మరియు అన్ని మానవ నిర్మిత హానికరమైన చర్యల నుండి రక్షించబడతారు.

  • డ్యామేజ్ కారణంగా అయ్యే ఖర్చుకి కవరేజ్:

    వాహనాల డ్యామేజీల రిపేయిరింగ్ కోసం పూర్తిగా చెల్లించడం అనేది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. అయితే, మీకు తగినంత కవరేజీ ఉన్నంత వరకు ఈ ఖర్చు మొత్తం భారీగా ఉన్నప్పటికీ, ఇన్సూరెన్స్‌తో ఇలాంటి నష్టాలను కవర్ చేయవచ్చు.

  • శారీరక గాయాల కోసం ఇన్సూరెన్స్:

    ప్రతీ వాహన యజమాని గాయాలతో బాధపడకుండా ప్రమాదాల నుండి బయటపడటం అదృష్టం కాదు. ప్రమాదాల కారణంగా సంభవించే చిన్న మరియు పెద్ద గాయాలకు మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ చెల్లిస్తుంది.

పవర్-ప్యాక్డ్ మోటార్ ఇన్సూరెన్స్, మీ వేలికొనల పై

 

POWER-PACKED MOTOR INSURANCE, AT YOUR FINGERTIPS

 

 

మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ఫీచర్లు

వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ వాహన యజమానులకు మాత్రమే కాకుండా, ఇతర పార్టీలకు కూడా ఉపయోగపడే అనేక ప్రయోజనాలతో కూడి ఉంటుంది. ఈ క్రింది ఫీచర్‌లను అందించడం ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ, వాహన యజమాని మరియు ఇతర కస్టమర్లను రోడ్డుపై సురక్షితంగా ఉండేలా అనుమతిస్తాయి.

  • కనీస ప్రయత్నాలతో ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్‌ను పొందటానికి చాలా సులభమైన మార్గం.
  • పూర్తి రక్షణ కోసం కాంప్రిహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ని పొందండి.
  • మీ ప్రయాణ సమయాన్ని వృథా చేయకుండా లేదా దరఖాస్తు పత్రాలను నింపకుండా మీ ఇన్సూరెన్స్‌‌ని ఆన్‌లైన్‌లో రెన్యూ చేయండి.
  • యాక్సిడెంట్లు, వరదలు, భూకంపాలు, దొంగతనం మరియు విధ్వంసాలతో సహా, సహజ మరియు మానవ నిర్మిత విపత్తుల నుండి రక్షణ కల్పించే సరైన కవరేజీని పొందండి.
  • ఇతర పార్టీల నష్టాలకు పరిహారాన్ని చెల్లించడానికి థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీని చేర్చండి.
  • ప్రమాదాలు మరియు దొంగతనం జరిగినప్పుడు తగిన సాక్ష్యాలను అందించడం ద్వారా క్యాష్‌లెస్ క్లెయిమ్స్ చేయడం కూడా సులభం.
  • చాలా కంపెనీలకు గ్యారేజీల నెట్‌వర్క్ ఉంది, ఇక్కడ మీరు రిపేయిరింగ్ పనులు పూర్తి చేసుకోవచ్చు మరియు ప్రమాదాల తర్వాత వాహనం యొక్క పరిస్థితిని కూడా అంచనా వేయవచ్చు.
  • నో క్లెయిమ్ బోనస్ ఫీచర్ ఒక వాహన యజమానిని ఏ సమయంలోనైనా క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి అనుమతిస్తుంది మరియు ఇతర ఇన్సూరెన్స్ సంస్థలకు బదిలీని కూడా అందిస్తుంది.
  • మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వినియోగదారులకు మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ మరియు క్లెయిమ్ స్టేటస్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించడానికి ప్రత్యేక కస్టమర్ సపోర్ట్ సేవలను, సహాయాన్ని అందిస్తాయి.
  • ఏ సమయంలోనైనా పాలసీలో కవరేజీని జోడించేలా వినియోగదారులను అనుమతించడానికి యాడ్-ఆన్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

 

ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు

కొంతకాలం క్రితం, ఇన్సూరెన్స్ పాలసీల గురించి తెలుసుకోవడానికి ప్రజలు అనేక స్టోర్‌లను సందర్శించాల్సి వచ్చేది. కానీ, అన్ని సేవల డిజిటలైజేషన్‌తో వినియోగదారులు, ఇప్పుడు ఆన్‌లైన్‌ మోటార్ ఇన్సూరెన్స్ కొనుగోలుతో కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. ఇన్సూరెన్స్‌ ని పొందడంలో పాతకాలపు పద్దతి కంటే ఇది చాలా మంచిది మరియు మీ నిర్ణయాన్ని పోల్చడానికి, ఖరారు చేయడానికి ఇది సులువైన మార్గాన్ని అందిస్తుంది.

మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో పొందడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.

 

  • Easy Comparison

    సులభంగా సరిపోల్చడం:

    అనేక దుకాణాలను సందర్శించడానికి బదులుగా, వీలైనంత ఎక్కువగా మోటార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ల నుండి ఇన్సూరెన్స్ కోట్‌లను పొందవచ్చు మరియు వారి సేవలు, రేట్లను ఎలాంటి జోక్యం లేకుండా పోల్చవచ్చు. చాలా కంపెనీలు తమ ప్లాన్‌ల గురించి ఒక వివరణాత్మక విశ్లేషణను అందిస్తాయి, ఫలితంగా అవాంతరాలు లేని పద్దతిలో అనేక ఫీచర్లను, ప్రయోజనాలను వినియోగదారులకు అందించడం మరింత సాధ్యమవుతుంది.

  • Time-Saving

    సమయం-పొదుపు:

    విస్తృతమైన పేపర్‌‌వర్క్‌ ద్వారా మరింత సమయం వృథా చేయనవసరం లేదు! వెహికల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ సేవలు తక్కువ వివరాలను సేకరించడం ద్వారా పని చేస్తాయి మరియు ప్రాసెస్ మొత్తాన్ని సులభతరం చేస్తాయి. సమాచారం సజావుగా ప్రాసెస్ చేయబడుతుంది మరియు మరింత ఆలస్యం జరగకుండా జారీ చేయబడుతుంది.

  • Secure Transactions

    సురక్షితమైన ట్రాన్సాక్షన్లు:

    మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ఆఫ్‌లైన్ కొనుగోలులో, కాన్ఫిడెన్షియల్ డేటాను కలిగి ఉన్న చాలా పేపర్‌వర్క్‌ ఉంటుంది. ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఆ ప్రమాదాన్ని తొలగిస్తుంది మరియు డాక్యుమెంటేషన్ లేకుండానే ట్రాన్సాక్షన్లు సురక్షితంగా చేయబడతాయి.

  • Multiple Payment Modes

    బహుళ చెల్లింపు విధానాలు:

    చాలా కంపెనీలు తమ ఇన్సూరెన్స్ పాలసీ కోసం నగదురహిత లావాదేవీలు మరియు ప్రీమియం చెల్లింపులను పొందటానికి అనేక చెల్లింపు విధానాలను అందిస్తాయి. మీరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో పాలసీని రెన్యూ చేసుకోవచ్చు.

  • Customisation Option

    కస్టమైజేషన్ ఆప్షన్:

    కస్టమర్లు ఏదైనా కవరేజ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు మరియు మీకు కావలసిన విధంగా పాలసీపై యాడ్-ఆన్‌లను పొందవచ్చు. అంతేకాకుండా, ఉత్తమ ప్లాన్‌ను ఎంచుకోవడానికి మీరు వివిధ కంపెనీలు అందించే ఫీచర్లు మరియు పాలసీల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.

  • Transparency

    పారదర్శకత:

    మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్లతో డీల్ గురించిన వ్యవహారం మరియు తికమక పెట్టె సాంప్రదాయ శోధనలు ఇప్పుడు అవసరం లేవు. ఆసక్తి గల కొనుగోలుదారులను ఒప్పించేందుకు ఏజెంట్లు అనేక వివరణలను వదిలివేసేవారు. కానీ ఇప్పుడు, వెహికల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ కవర్‌లతో ప్రాసెస్‌ పారదర్శకంగా ఉంటుంది

  • No Middleman

    మధ్యవర్తి లేడు:

    పైన పేర్కొన్న విధంగా, మోటార్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు లేదా థర్డ్ పార్టీలు ప్రతీ అంశాన్ని, అనగా పాలసీ నియమాలను మరియు నిబంధనలను స్పష్టంగా వివరించరు. కానీ ఆన్‌లైన్ ప్రాసెస్ మధ్యవర్తిని తొలగిస్తుంది మరియు ఉత్తమ ప్లాన్‌ను ఎంచుకోవడంలో మీకు వీలు కల్పిస్తుంది.

  • Immediate Policy Issuance

    తక్షణ పాలసీ జారీ:

    మీరు వెహికల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే, డాక్యుమెంట్లను ప్రాసెస్ చేయడానికి తీసుకునే సమయం నిమిషాలకు తగ్గించబడుతుంది. మీరు సమర్పించిన వివరాలు ఇన్సూరెన్స్ కంపెనీతో సేవ్ చేయబడి ఉంటాయి మరియు మీరు తక్షణమే పాలసీని పొందవచ్చు

  • Convenient

    సౌకర్యవంతం:

    మీరు సిటీలో లేకపోయినా లేదా బిజీ షెడ్యూల్‌లో ఉన్నా, మీకు కావలసిన మోటార్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ని ఇంట్లో లేదా ఆఫీస్‌లో కూర్చొని సౌకర్యవంతంగా కొనుగోలు చేయవచ్చు.

  • Online Renewal

    ఆన్‌లైన్ రెన్యూవల్:

    ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు యొక్క ఒక మంచి ప్రయోజనం ఏమిటంటే, మీరు పాలసీతో అప్‌డేటెడ్‌గా ఉండవచ్చు, గడువు ముగిసే సమయానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవచ్చు.

 

 

బజాజ్ అలియంజ్ మోటార్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎంచుకోవాలి?

ఫీచర్ బజాజ్ అలియంజ్ ఆఫర్లు
ఖర్చులకు కవర్ ప్రకృతి వైపరీత్యాలు లేదా వాహనం పనిచేయకపోవడం కారణంగా జరిగే ప్రమాదాలు మరియు నష్టానికి పూర్తి కవరేజ్
థర్డ్-పార్టీ లయబిలిటీ ఇతరులకు జరిగిన నష్టాలకు పరిహారం
వ్యక్తిగత ప్రయోజనాలు ప్రమాదాల ఫలితంగా ఏర్పడిన తీవ్రమైన గాయాలు, శాశ్వత వైకల్యం పట్ల ఆర్థిక సహాయం
పిఎ కవర్ రూ.15 లక్షల వరకు
క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి 98%
నో క్లెయిమ్ బోనస్ 50% వరకు
అదనపు ప్రయోజనాలు జీరో డిప్రిసియేషన్ కవర్, బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్ , రవాణా బెనిఫిట్, కన్జ్యూమబుల్ కవర్ మరియు మరెన్నో
ఆన్‌లైన్ సేవలు పేపర్‌లెస్-డిజిటల్ ఇన్సూరెన్స్ దరఖాస్తు మరియు దాని ప్రాసెసింగ్, ఆన్‌లైన్ క్లెయిమ్‌లు, స్పాట్ సేవలు మరియు కవరేజ్ అడాప్షన్
క్లెయిమ్స్ ప్రాసెస్ డిజిటల్ - 20 నిమిషాల్లో*

 

భారతదేశంలో మోటార్ ఇన్సూరెన్స్ రకాలు

మీరు ఒక ప్రైవేట్ కారు, టూ వీలర్ లేదా కమర్షియల్ వాహనాన్ని కొనుగోలు చేస్తున్నా, మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు రెండు రకాలుగా విభజించబడ్డాయి:

  • సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ

    ఈ పాలసీతో, మోటారుబైక్‌లు, ప్రైవేట్ కార్లు, స్కూటర్లు మరియు కమర్షియల్ వాహనాలతో సహా మీ వాహనాలు అన్నింటికీ జరిగిన నష్టాలకు మీరు చెల్లించవచ్చు.


  • థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ

    థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అన్ని రకాల వాహనాలకు ఒకే విధంగా వర్తించే ఒక లయబిలిటీ కవరేజ్. 1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం, థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ మరియు బైక్ కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ భారతీయ రోడ్లపై ప్రయాణించే వాహనాలకు తప్పనిసరి. ఈ నిబంధనను పాటించడంలో విఫలమైతే మోటారు సవరణ చట్టం, 2019 ప్రకారం ఒక వ్యక్తి భారీ జరిమానాలను చెల్లించాల్సి ఉంటుంది.


  • మీ వినియోగం ప్రకారం చెల్లించండి

    ఇది ఒక కొత్త రకం పాలసీ, వాహనం నడిచిన కిలోమీటర్ల లెక్కింపు ద్వారా పరిహారం చెల్లించేలా పాలసీదారులను అనుమతినిస్తుంది.

ఈ రెండు మోటారు ఇన్సూరెన్స్ పాలసీలను పరిగణనలోకి తీసుకుని, వెహికల్ ఇన్సూరెన్స్ రకాలను క్రింది విధంగా వర్గీకరించారు.

  • Car Insurance

    కారు ఇన్సూరెన్స్

    మీ ప్రైవేట్ ఫోర్-వీలర్‌ను భద్రపరచడానికి అనువైన ఎంపిక కారు ఇన్సూరెన్స్. ఇది కాంప్రిహెన్సివ్ పాలసీ, థర్డ్ పార్టీ లయబిలిటీ ఈ రెండింటినీ కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీకి మరియు వాహన యజమానికి మధ్య జరిగిన ఒక ఒప్పందం. ఈ ప్లాన్‌తో, మీరు ఇలాంటి ప్రయోజనాలను పొందుతారు:

    • నగదురహిత క్లెయిములు
    • పర్సనల్ యాక్సిడెంట్ కవర్
    • నష్టం/డ్యామేజీ నుండి ప్రొటెక్షన్
    • థర్డ్-పార్టీ గాయాలు మరియు మరణం క్లెయిములకు అపరిమిత బాధ్యత
  • Two Wheeler Insurance

    టూ వీలర్ ఇన్సూరెన్స్

    పేరు సూచిస్తున్నట్లుగా, టూ వీలర్ ఇన్సూరెన్స్ లేదా బైక్ ఇన్సూరెన్స్ స్కూటర్లు, బైక్‌లు మరియు ఇతర టూవీలర్ వాహనాల కోసం ఉద్దేశించబడింది. టూ వీలర్ వాహనాలతో వ్యక్తిగత గాయాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున, ఈ వెహికల్ ఇన్సూరెన్స్ మీకు సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది. ప్లాన్‌లో చేర్చబడిన ప్రయోజనాలు:

    • సమగ్రమైన కవరేజ్
    • 2/3 సంవత్సరాల ఓన్ డ్యామేజ్ మోటార్ ఇన్సూరెన్స్
    • నో క్లెయిమ్ బోనస్ రక్షణ
    • ద్రవ్యోల్బణ రక్షణ
  • Commercial Vehicle Insurance

    కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్

    ప్రైవేట్ వాహనాల కంటే కమర్షియల్ వాహనాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. అందువల్ల, కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ దురదృష్టకరమైన సంఘటనల వల్ల కలిగే నష్టాలను తగ్గించేలా డ్రైవర్లకు మద్దతునిస్తుంది. ఇందులో ట్రాక్టర్లు, క్రేన్లు, టాక్సీలు, గూడ్స్ క్యారీయింగ్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ మొదలైనవి ఉంటాయి. ప్రయోజనాలలో ఇవి ఉంటాయి:

    • గాయం మరియు మరణం క్లెయిముల కోసం అపరిమిత బాధ్యత కవరేజ్
    • పర్సనల్ యాక్సిడెంట్ కవర్
    • నష్టం మరియు డ్యామేజ్ పై రక్షణ అందిస్తుంది
    • ఇతరుల ఆస్తి కోసం నష్టపరిహారం

    సంక్లిష్టమైన పరిస్థితులలో అన్ని రకాల వాహనాలను రక్షించే, తగిన వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు కొనుగోలు చేయవచ్చు. ఇది అగ్ని, దోపిడీ, విధ్వంసం, భూకంపం, వరద, తుఫానులు లేదా ప్రమాదాలు ఏవైనా కావచ్చు; మీరు అన్ని పరిస్థితులలోనూ సురక్షితమైన అనుభూతిని పొందుతారు.

 

 

మోటార్ ఇన్సూరెన్స్ కవరేజ్



కవరేజ్ థర్డ్-పార్టీ సమగ్రమైన
ప్రకృతి విపత్తుల పై లేదు ఉంది
మానవుల వలన కలిగిన విపత్తుల పై లేదు ఉంది
పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ఉంది ఉంది
థర్డ్-పార్టీ ఖర్చు కవరేజ్ ఉంది ఉంది
అగ్ని ప్రమాదం లేదు ఉంది
ఇంజిన్ ప్రొటెక్షన్ లేదు ఉంది
డిప్రిసియేషన్ ప్రొటెక్షన్ లేదు ఉంది
సిఎన్‌జి కిట్ కవర్ లేదు యాడ్ ఆన్
యాక్సెసరీస్ కవరేజ్ లేదు యాడ్ ఆన్

 

చేర్పులు

వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు, మీరు వివిధ ప్లాన్‌లతో వచ్చే కవరేజ్‌ గురించి అన్వేషించాలి. బజాజ్ అలియంజ్ వారు అందించే కాంప్రిహెన్సివ్ పాలసీలో చేర్చబడిన అంశాల జాబితా ఇక్కడ ఉంది. కాంప్రిహెన్సివ్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ, థర్డ్ పార్టీ లయబిలిటీని కూడా కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి.

  • థర్డ్ పార్టీ కవరేజ్: మీ బాధ్యతలను నెరవేర్చడానికి ఒక వ్యక్తి ఇతర వ్యక్తులపై మరియు వారి ఆస్తిపై చేసిన నష్టానికి థర్డ్ పార్టీ కవరేజ్‌ చెల్లిస్తుంది

  • పర్సనల్ యాక్సిడెంట్ కవర్ :  శాశ్వత వైకల్యం లేదా వ్యక్తి మరణం సందర్భంలో ఇది డ్రైవర్ లేదా వాహన యజమాని ఒక థర్డ్ పార్టీకి రూ.15 లక్షల పరిహారం చెల్లించేందుకు అనుమతిస్తుంది.

  • మానవుల వలన కలిగే విపత్తుల వల్ల జరిగే నష్టం :దోపిడీ, అల్లర్లు, సమ్మెలు, హానికరమైన చర్యలు, దొంగతనం, విధ్వంసాలు మరియు ఇలాంటి అమానవీయ సంఘటనలు, కార్యకలాపాలు కూడా మీ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడ్డాయి.
    ప్రైవేట్ కార్లు, టూ వీలర్‌లు మరియు కమర్షియల్ వెహికల్స్ ఉన్న ప్రతీ యజమానులు మరియు డ్రైవర్లు చట్టప్రకారం థర్డ్ పార్టీ లయబిలిటీ మరియు కాంప్రిహెన్సివ్ కవరేజ్ రెండింటినీ కలిగివుండటం తప్పనిసరి. మీరు ఆ బాధ్యత వహించడంలో విఫలమైతే, అదనపు ఛార్జీలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎంచుకున్న పాలసీ మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా మరియు ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతుందని నిర్ధారించుకోండి.
    మీకు కావలసిన ప్లాన్‌లో చేరికలు మరియు మినహాయింపుల యొక్క వివరణాత్మక జాబితాను పరిశీలించడానికి, చూడండి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ షరతులు మరియు నిబంధనలు.

IRDA ఏర్పాటు చేసిన నియమం తర్వాత అప్‌డేట్ చేయబడిన వాహన ఇన్సూరెన్స్ కవర్లు

వాహన యజమానులకు వెహికల్ ఇన్సూరెన్స్‌‌ను మరింత సరసమైనదిగా మార్చాలని IRDAI ఖచ్చితంగా చెప్పింది. అందువల్ల, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల చుట్టూ ఉన్న నియమనిబంధనలు అప్‌‌డేట్ చేయబడ్డాయి.

ఇన్సూరెన్స్ కవర్‌లు IRDAI 2018 రెగ్యులేషన్ IRDAI 2020 రెగ్యులేషన్
థర్డ్ పార్టీ ఓన్లీ కవర్ కార్ల కోసం 3 - సంవత్సరాల టిపి ఇన్సూరెన్స్ మరియు 5 - సంవత్సరాల టిపి కవర్ తటస్థం
థర్డ్ పార్టీ + కాంప్రిహెన్సివ్ కవర్ 3-సంవత్సరాలు మరియు 5-సంవత్సరాల టిపి + కాంప్రిహెన్సివ్ కవర్ 3 - సంవత్సరాల మరియు 5 - సంవత్సరాల టిపి + 1 - సంవత్సరం కాంప్రిహెన్సివ్ కవర్‌కు నవీకరించబడింది
స్టాండలోన్ కాంప్రిహెన్సివ్ కవర్ (టిపి కవర్ తప్పనిసరి) 3-సంవత్సరాలు మరియు 5-సంవత్సరాల కాంప్రెహెన్సివ్ కవర్ 1-సంవత్సరం కాంప్రిహెన్సివ్ ఒడి కవర్

పాలసీదారులను ఎక్కువగా ప్రభావితం చేసే మార్పులు ఇక్కడ ఉన్నాయి:

  • ప్రైవేట్ కార్ల కోసం మూడు సంవత్సరాల వరకు ఇన్సూర్ చేయబడిన మొత్తం రోడ్డు పన్ను / రిజిస్ట్రేషన్, ఆన్-రోడ్ వెహికల్ ధర మరియు మ్యానుఫ్యాక్చరర్ యాక్సెసరీలపై ఆధారపడి ఉంటుంది.
  • మీరు స్టాండ్‌అలోన్ ఒడి పాలసీని వేర్వేరు తేదీలలో కొనుగోలు చేస్తే, లాంగ్-టర్మ్ పాలసీ ఎక్స్‌పైరీ తేదీ మరియు థర్డ్ పార్టీ లయబిలిటీ ఎక్స్‌పైరీ తేదీ మ్యాచ్ అవదు.
  • వాహనం యొక్క ఐడివి, భౌగోళిక ప్రాంతం, కార్ మేక్, మోడల్, ఇంజిన్ సామర్థ్యం మొదలైన వాటి ఆధారంగా కాకుండా ప్రీమియంలు, వ్యక్తి యొక్క డ్రైవింగ్ అలవాట్లపై ఆధారపడి ఉంటాయి.
  • అన్నిరకాల వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం IRDAI నో క్లెయిమ్ బోనస్ గ్రిడ్‌ను 20-50% రెన్యూవల్ పరిధితో ప్రామాణీకరించింది.
  • దొంగతనం మరియు పూర్తి నష్టం / నిర్మాణాత్మక పూర్తి నష్టం వంటి దావాలు కలిగిన వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రద్దు చేయబడుతుంది మరియు డాక్యుమెంట్లు సరెండర్ చేసుకోబడతాయి.
  • తప్పనిసరి మినహాయింపులు ఇప్పుడు ప్రామాణికమైనవి మరియు తక్కువ అస్పష్టత కారణంగా ఈ తగ్గింపులపై మాఫీ కూడా ఎత్తివేయబడుతుంది.
  • క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో పరిష్కరించబడే వాహనం యొక్క డిప్రిసియేషన్ విలువను లెక్కించడానికి ఒక ప్రామాణిక అంశం ప్రతిపాదించబడింది.
  • ప్రమాదాల సందర్భంలో మోటార్ వాహనాలలోని ప్రయాణీకులు రూ. 25,000 వరకు వైద్య ఖర్చుల కవర్‌ని అందుకుంటారు మరియు అది ప్రాథమిక పాలసీ క్రిందకు వస్తుంది.
  • ప్రైవేట్ కార్లు మరియు టూ వీలర్‌ల కోసం, పాలసీ షెడ్యూల్‌లో డ్రైవర్ వివరాలను పొందుపరచడానికి ఒక పేరొందిన డ్రైవర్ పాలసీని ఎంచుకోవాలి.
  • ఎలక్ట్రిక్ వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియంలకు 15% డిస్కౌంట్ లభిస్తుంది. ఒక సంస్థ నుండి లాంగ్‌టర్మ్ కవర్‌ను ఉపసంహరించుకునే స్వేచ్ఛ మరియు మరొక సంస్థకు మారడం అనేది కస్టమర్‌లకు స్నేహపూర్వకమైన చర్య. భారతదేశంలో ఎన్నో సానుకూలమైన మార్పులతో అందుబాటులోకి వచ్చిన వెహికల్ ఇన్సూరెన్స్‌ కోసం సులభంగా వెచ్చించవచ్చు.

మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ మినహాయింపులు

మినహాయింపులను తెలుసుకోవడం వల్ల క్లెయిమ్స్ సమయంలో మీకు ఎలాంటి సవాళ్లు ఎదురు కావని నిర్ధారించుకోవచ్చు:

  • వాహనం యొక్క డిప్రిసియేషన్ మోటారు ఇన్సూరెన్స్ పాలసీలో సాధారణ తరుగుదల మరియు అరుగుదలలా పరిగణించబడదు, కాలక్రమేణా వెహికల్ భాగాలకు పర్యవసానంగా నష్టం జరుగుతుంది.
  • నిషేధిత పదార్థాల ప్రభావంతో డ్రైవింగ్ చేయడం వల్ల మీరు క్లెయిమ్‌లకు అనర్హులు అవుతారు. మేము అన్ని పరిస్థితులలోనూ సురక్షితమైన డ్రైవింగ్‌ని ప్రోత్సహిస్తాము.
  • చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం చట్టవిరుద్ధం, కనుక చెల్లని లైసెన్స్ మీ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్‌ని కూడా రద్దు చేస్తుంది.
  • యుద్ధం, తిరుగుబాటు లేదా అణు దాడుల వంటి అననుకూలమైన ప్రమాదాలు అస్తవ్యస్తమైనవి మరియు అనియంత్రితమైనవి, ఫలితంగా ఇవి ఇన్సూరెన్స్ పాలసీ నుండి మినహాయింపుకు దారితీస్తాయి.

వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే పారామీటర్లు

స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రయాణం ఈ రెండింటిలోనూ, వెహికల్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలను ప్రభావితం చేసే పారామితులు ఇక్కడ ఉన్నాయి.

  • మోడల్/మేక్/వేరియంట్: వాహనం యొక్క మౌళిక కూర్పు అనగా వాహన రకం, ఇంజిన్ యొక్క క్యూబిక్ సామర్థ్యం మొదలైనవి మోటారు ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.

  • వయస్సు మరియు ఇంజిన్ రకం : వయస్సు అనేది వాహన డిప్రిసియేషన్ మరియు ఇన్సూర్ చేసిన వ్యక్తి ప్రకటించిన మొత్తం విలువకు సంబంధించింది, ఇది కాలక్రమేణా వాహనం విలువను తగ్గిస్తుంది. ఇంజిన్ రకం అనగా పెట్రోల్ లేదా డీజిల్ ఐడివిని ప్రభావితం చేస్తాయి, ప్రీమియంను పెంచుతాయి.

  • డెమోగ్రాఫిక్స్: ఎక్కువ యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం పొంచి ఉన్నందున మెట్రో ప్రాంతంలో కారు నడపడం చాలా విలువతో కూడుకున్నది.

  • కవర్: స్టాండ్‌అలోన్ థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజ్ కంటే కూడా కాంప్రిహెన్సివ్ కవరేజ్‌ ఎక్కువ ఖర్చుతో వస్తుంది, మిమ్మల్ని ఇన్సూరెన్స్ పరిధిలో ఉంచుతుంది.

  • యాడ్-ఆన్స్: భద్రతా ఫీచర్లు, జీరో డిప్రిసియేషన్ మరియు ప్యాసింజర్ కవర్ వంటి మొదలైన కవర్‌లను జోడించడం వల్ల ప్రీమియం మొత్తం పెరుగుతుంది.

  • నో క్లెయిమ్ బోనస్: మీరు మునుపటి పాలసీ వ్యవధిలో క్లెయిమ్ చేయకపోతే పాలసీ ప్రీమియంలపై డిస్కౌంట్ పొందుతారు.

  • తగ్గింపులు:ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తూ, మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను తగ్గించే విధంగా స్వచ్చంధమైన మినహాయింపును ఎంచుకునే అవకాశం మీకు లభిస్తుంది.

  • యాంటీ-థెఫ్ట్ ఫీచర్స్: ARAI చే ధృవీకరించబడిన యాంటీ-థెఫ్ట్ పరికరాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాలేషన్, మోటారు ఇన్సూరెన్స్ ప్రీమియంలపై మంచి డిస్కౌంట్లను పొందడంలో మీకు సహాయపడుతుంది.

  • విక్రేత: మోటారు ఇన్సూరెన్స్ ప్రీమియంలలో లబ్ది పొందడానికి, ఏజెంట్ వద్ద కాకుండా నేరుగా విక్రేత నుండి పాలసీని కొనుగోలు చేయండి.

  • డిజిటల్ ఇన్సూరెన్స్: కొత్త పాలసీ కొనుగోలు లేదా పాలసీ రెన్యూవల్ కోసం, డిజిటల్-ఫస్ట్ ప్లాన్ మార్కెట్ కంటే తక్కువ ధరలో వివిధ రకాల ఫీచర్లను మీకు అందిస్తుంది.

వాహన ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

చాలా కంపెనీలు ఒక స్టాండర్డ్ మోటార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకున్న కవరేజ్ కోసం ప్రీమియంల మొత్తాన్ని నిర్ణయించడానికి ఉపయోగిస్తాయి. వేర్వేరు కంపెనీలు విభిన్న ప్రమాణాలను అనుసరిస్తున్నప్పటికీ, మేము క్యాలిక్యులేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సూటిగా మరియు సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించాము. మీ అవసరాల గురించి కొంత సమాచారాన్ని మాకు అందించడం ద్వారా మా ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.

ఒక కొత్త కారు కోసం, మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను లెక్కించడానికి మీరు ఈ క్రింది సమాచారాన్ని మాకు అందించాలి.

  • వాహన తయారీదారు పేరు
  • కార్ మోడల్
  • కార్ రిజిస్ట్రేషన్ చేసిన రాష్ట్రం
  • తయారీ సంవత్సరం
  • కార్ యజమాని వివరాలు

ఒక వినియోగించిన కారు కోసం, వెహికల్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌కు క్రింద ఇవ్వబడిన కొంత వేరియబుల్ సమాచారం అవసరం:

  • ఉపయోగించిన కారు మరియు ఇంధనం రకం
  • మునుపటి కార్ మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్ వివరాలు
  • రిజిస్ట్రేషన్ నంబర్
  • యాజమాన్య డాక్యుమెంట్ల మార్పు (వర్తిస్తే)
  • క్లెయిముల చరిత్ర

ఈ వివరాలతో, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం, ప్రీమియంల ఉత్తమ విలువను మేము లెక్కిస్తాము.

వాహన ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు

కొనుగోలు సమయంలో కాంప్రిహెన్సివ్ కవరేజ్‌పై ఉత్తమ రేట్లను పొందడానికి, ఈ కింది అంశాలు పరిగణలోకి తీసుకోబడతాయి.

  • ✓   కవరేజ్ : అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా, మీకు కాంప్రిహెన్సివ్ కవరేజ్ లేదా థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజ్‌ ఈ రెండింటిలో ఏది అవసరమవుతుందోనని విశ్లేషించండి. మీరు ఆన్‌లైన్‌లో ఒక కాంప్రిహెన్సివ్ వెహికల్ ఇన్సూరెన్స్‌ని ఎంచుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం అని మా అభిప్రాయం.

  • ✓   యాడ్-ఆన్స్ : కంపెనీ అందించే యాడ్-ఆన్ ఫీచర్లను గురించి తెలుసుకోండి మరియు మీకు ఒక ప్రత్యేక సందర్భంలో అవసరమయ్యే అదనపు కవరేజీని ఎంచుకోండి.

  • ✓   పర్సనల్ యాక్సిడెంట్ కవర్ : వ్యక్తిగత ప్రమాదాలు జరిగినప్పుడు మీరు కొనుగోలు చేస్తున్న పాలసీ మీకు కవరేజీని ఇస్తుందా లేదా అనే విషయాన్ని ఎల్లప్పుడూ పరిగణించండి.

  • ✓   క్లెయిమ్ విధానం : ఏదైనా సమయంలో మీరు ఒక క్లెయిమ్ ఫైల్ చేయాల్సి వస్తే, అది ఎంత కష్టంగా ఉంటుందో తెలుసుకోవడానికి క్లెయిమ్ ప్రాసెస్‌ను చూడండి.

  • ✓   గ్యారేజీలు : అన్ని మోటార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు గ్యారేజీల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి, అక్కడ వెహికల్ సర్వీస్ మరియు రిపేరింగ్ ఖర్చులు స్థానిక గ్యారేజీల కంటే మరింత సరసమైన ధరల్లో ఉంటాయి. మీరు తరచుగా ప్రయాణం చేస్తున్నట్లయితే వాహనాన్ని సర్వీసింగ్‌కు ఇవ్వడం కూడా తప్పనిసరి.

  • ✓   జీరో డిప్రిషియేషన్ కవర్ :  షోరూమ్ నుండి బయటికి అడుగుపెట్టిన ఒక కారు విలువ దాదాపు సగం అవుతుంది. వాహనం డబ్బు విలువను నిర్వహించడానికి మరియు డిప్రిసియేషన్ ఫలితంగా జరిగే నష్టాన్ని ఎదుర్కోవడానికి మీరు, జీరో డిప్రిసియేషన్ కవర్‌ను ఎంచుకోవాలి.

  • ✓   ఎన్‌సిబి : గడువు ముగిసిన పాలసీని రెన్యూచేయాలనుకున్నపుడు, మోటార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు సరైన నో క్లెయిమ్ బోనస్ మరియు ఎక్కువ సంఖ్యలో ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయో లేదో తెలుసుకోండి. మీరు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయకుండా గడిపే ప్రతీ సంవత్సరానికి గాను తదుపరి సంవత్సరం ప్లాన్‌లో డిస్కౌంట్ క్రమంగా పెరుగుతుంది.

  • ✓   ఐడివి : నమ్మకస్తులైన ఇన్సూరర్లు డిప్రిసియేషన్ మొత్తాన్ని మినహాయించిన తర్వాత వాహనం యొక్క ఉత్తమ మార్కెట్ విలువను మాత్రమే అందజేస్తారు. దీంతో, మీ వాహనం దొంగతనానికి గురైనపుడు లేదా డ్యామేజ్ అయిన సందర్భంలో మీరు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని పొందవచ్చు.

  • ✓   పాలసీ డాక్యుమెంట్ : పాలసీని చదవకుండా మరియు దానిని సమీక్షించకుండా ఎలాంటి పేపర్లపై సంతకం చేయవద్దు. డాక్యుమెంట్లలో మిమ్మల్ని తికమక పెట్టె అనేక నిబంధనలు ఉన్నాయి. కాబట్టి, ఎల్లప్పుడూ డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలించి, కొనుగోలును ఖరారు చేయండి.

  • ✓   ప్రీమియంలు : మీ మోటారు ఇన్సూరెన్స్ కోసం కంపెనీ ఆన్‌లైన్‌ ప్రీమియంలను ఎలా లెక్కిస్తుందో అనే పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అడగండి. అందులో కీలక పాత్రను పోషిస్తున్న అంశాలను గురించి వివరంగా తెలుసుకోండి మరియు ఏ సంకోచం లేకుండా మీ సందేహాలను తీర్చుకోండి.

వాహన ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌ను పొందటానికి అవసరమైన డాక్యుమెంట్లు క్రింద ఇవ్వబడ్డాయి.

    • ✓ ఐడెంటిటీ ప్రూఫ్ (పాస్‌పోర్ట్ /డ్రైవింగ్ లైసెన్స్/ఆధార్/పాన్ కార్డ్/ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడి)
    • ✓ పాస్‌పోర్ట్/డిఎల్/బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్/ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడి ద్వారా చిరునామా రుజువు
    • ✓ ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో
    • ✓ డ్రైవింగ్ లైసెన్స్
    • ✓ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్

ఆన్‌లైన్‌లో వెహికల్ ఇన్సూరెన్స్ కోసం ఎలా అప్లై చేయాలి

మా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి, భారతదేశం అంతటా వెహికల్ ఇన్సూరెన్స్ కొనుగోలు మరియు రెన్యూవల్ కోసం ప్రతి ఒక్కరికీ జాగ్రత్తగా మార్గనిర్దేశం చేస్తున్నాము.

  • వాహన ఇన్సూరెన్స్ స్థితిని తనిఖీ చేయండి

    ఆన్‌లైన్‌లో మోటారు ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయడానికి గల మంచి కారణం ఏంటంటే, మీరు ఆన్‌లైన్‌లో దాని స్టేటస్‌ని కూడా చెక్ చేయవచ్చు. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి మరియు గడువు ముగిసే తేదీకి సంబంధించి మీకు అలర్ట్స్ వస్తాయి. ప్లాన్ ప్రారంభం మరియు ముగింపు తేదీలను మీరు డాక్యుమెంట్లలో చూడవచ్చు. మా డిజిటల్-ఫస్ట్ సేవతో, మీరు మీ క్రెడెన్షియల్స్‌ ఉపయోగించి లాగిన్ అవ్వవచ్చు మరియు ఆన్‌లైన్‌లో స్టేటస్‌ని చెక్ చేయవచ్చు. అంతే కాకుండా, స్టేటస్ వివరాల కోసం మీరు మాకు కాల్ చేయవచ్చు లేదా ఈమెయిల్ కూడా పంపవచ్చు. తక్షణమే ఆ సమాచారం మీ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ అడ్రస్‌కు పంపించబడుతుంది.

  • మొబైల్ యాప్ ద్వారా వాహన ఇన్సూరెన్స్ ఆన్‌లైన్‌లో పొందండి

    మొబైల్ యాప్ ద్వారా బజాజ్ అలియంజ్ వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కూడా సాధ్యమే. వెబ్‌సైట్ యొక్క అన్ని ఫీచర్లకు మద్దతు ఇచ్చే మోటారు ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి మాకు ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ ఉంది మరియు ఏజెంట్లతో కమ్యూనికేట్ చేయడానికి ఇబ్బంది లేని మార్గం. పాత పాలసీ వివరాల కోసం యాప్‌లో ఎంటర్ అయ్యి, ఆన్‌లైన్ రెన్యూవల్ ఫారంను నింపండి. ఫారంలోని సమాచారాన్ని తనిఖీ చేయండి మరియు డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించి తుది చెల్లింపు చేయండి. రెన్యూ చేయబడిన పాలసీ డాక్యుమెంట్ వెంటనే జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్‌ని సేవ్ చేయండి మరియు సమయం దొరికినప్పుడు ప్రింట్‌అవుట్ తీసుకోండి.

  • మోటార్ ఇన్సూరెన్స్ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ప్రాసెస్

    మోటారు ఇన్సూరెన్స్‌ను పొందటానికి మరియు రెన్యూ చేయడానికి అనుసరించే మార్గం అన్ని డాక్యుమెంట్లతో శాఖను సందర్శించడం. మీరు డాక్యుమెంట్ల భౌతిక కాపీని అందించటం తప్పితే, ఆఫ్‌లైన్ ప్రాసెస్ కూడా దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. చెక్, డెబిట్ కార్డ్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించడం కోసం సమీప శాఖకు మీ సందర్శనను షెడ్యూల్ చేయండి మరియు తగిన కవరేజ్‌తో పాలసీని కొనుగోలు చేయండి.

భారతదేశంలో మోటార్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

మోటారు వాహనాల చట్టం, భారతదేశంలో డ్రైవింగ్‌కు సంబంధించిన నియమ నిబంధనలను నిర్దేశిస్తుంది. దేశంలో ఏటా జరిగే ప్రమాదాల సంఖ్యను పరిశీలిస్తే, డ్రైవర్లు మరియు వాహన యజమానులందరికీ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్‌ ఉండటం తప్పనిసరి అని మాకు తెలుసు.

మోటార్ వాహన చట్టం ఏమి నిర్దేశిస్తుంది?

మోటారు వాహన చట్ట ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో తిరిగే అన్ని వాహనాలు, ఎలాంటి మినహాయింపు లేకుండా తగినంత మోటార్ వెహికిల్ కవరేజీని కలిగి ఉండాలి. ప్రాథమిక మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ, ప్రమాదాలు లేదా దుర్ఘటనలతో నష్టపోయిన వ్యక్తులకు పరిహారాన్ని చెల్లించే కనీస థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీని కలిగి ఉండాలి.

మోటారు వాహన ఇన్సూరెన్స్ పాలసీని కొనడానికి ప్రధాన కారణం, ప్రమాదాల తరువాత జరిగే ఖర్చులను నివారించడం. మరియు మరిచిపోకండి, జనాభా అస్పష్టంగా పెరుగుతున్న దేశం మన భారతదేశం. ఫలితంగా, వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది. రోడ్డుపై జరిగే ప్రమాదాల నుండి రక్షించబడటానికి, వెహికల్ ఇన్సూరెన్స్ ఉత్తమ పరిష్కారం.

1988 లో సవరణ తరువాత, డ్రైవర్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పర్మిట్స్, లయబిలిటీ కవరేజ్, ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ మొదలైన ముఖ్యమైన డాక్యూమెంట్లు మనతో పాటు రోడ్డుపైకి తీసుకెళ్లడం చాలా అవసరం. ఇటీవలి మార్పుల తరువాత, ఈ బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైతే రూ. 500 నుండి 25, 000 వరకు జరిమానాలు మరియు అదనపు చార్జీలతో పాటు, మీ డాక్యుమెంట్లను రద్దుచేసే కొత్తరకపు పరిహారానికి దారితీస్తుంది.

మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి

ఒకవేళ మీరు సరైన ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను ఎంచుకుంటే, వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం దాఖలు చేయడం మీరు అనుకున్నంత కష్టమేమి కాదు. మీరు చివరిసారిగా ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేయాలని నిర్ణయించుకోడానికి ముందు, తప్పక జాగ్రత్త వహించాల్సిన కొన్ని అవసరాలు ఇక్కడ ఉన్నాయి.

 

  • ✓ ప్రమాదానికి గురైన వెంటనే మీరు ఎఫ్‌ఐఆర్ ని ఫైల్ చేసి, వీలైనంత త్వరగా మీ ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించండి.
  • ✓ ప్రమాద స్థలానికి సంబంధించిన అన్ని ఆధారాలను భద్రపరిచిన తర్వాత మాత్రమే వాహనాన్ని సమీప గ్యారేజీకి తరలించడంలో సహాయాన్ని పొందండి.
  • ✓ రిపేరింగ్ ఖర్చుల అంచనాకు సంబంధించిన కోట్‌ను నెట్‌వర్క్ గ్యారేజీ మీకు అందిస్తుంది.
  • ✓ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లకు సమర్పించడానికి మీకు ఆ బిల్లు అవసరం.
  • ✓ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ డాక్యుమెంట్లను ధృవీకరించి మరియు వాటి ప్రామాణికతను అంచనా వేసిన తరువాత మాత్రమే, క్లెయిమ్ ప్రాసెస్ మొదలవుతుంది.
  • ✓ మినహాయింపులు మరియు డిప్రిసియేషన్ విలువను క్లెయిమ్ చేయలేమని తెలుసుకోండి. మిగిలిన మొత్తాన్ని మాత్రమే మీకు పరిహారంగా చెల్లించబడుతుంది.
  • ✓ వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత, మీరు అనుసరించాల్సిన ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది.
  • దశ 1: క్లెయిమ్ కోసం రిజిస్టర్ చేసుకోండి

    క్లెయిమ్ దాఖలు చేయడానికి మా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి లేదా మా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. క్లెయిమ్ వేయడంలో మరియు మమ్మల్ని సంప్రదించడంలో మీరు చేసే ఆలస్యం, మీరు సేకరించిన సాక్ష్యాల స్వభావం మారడానికి ఎక్కువ అవకాశం ఉంది.

  • దశ 2: తప్పనిసరి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి

    మోటారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్‌లో ఏమాత్రం తగ్గకుండా చూసుకోవడానికి మీరు ఈ క్రింది డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.

    • ✓ ఛాసిస్ మరియు ఇంజిన్ నంబర్
    • ✓ ప్రమాదం తేదీ మరియు సమయం
    • ✓ ఈవెంట్ యొక్క లొకేషన్ మరియు వివరణ
    • ✓ కార్ తనిఖీ చిరునామా
    • ✓ కిలోమీటర్ రీడింగ్స్
    • ✓ పోలీస్ ఫిర్యాదు (ప్రమాదాలు మరియు దొంగతనం విషయంలో)
  • దశ 3: క్లెయిమ్ సెటిల్‌మెంట్

    మీరు డాక్యుమెంట్లను సమర్పించిన క్షణం నుండి మేము ప్రాసెస్‌ని ప్రారంభిస్తాము మరియు ధృవీకరణ తర్వాత డబ్బును నేరుగా, అర్హులైన థర్డ్ పార్టీకి పంపుతాము.

 

మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ యొక్క ప్రాముఖ్యత

మీరు దీనిని నమ్మకపోవచ్చు, కానీ ఒక సర్వే ప్రకారం, భారతదేశంలోని రహదారులపై 60% వాహనాలు చెల్లుబాటు అయ్యే భీమా లేకుండా పనిచేస్తున్నాయి. మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకోకపోవడమే దీనికి కారణం. భారతదేశంలో మోటార్ ఇన్సూరెన్స్ మీకు మరియు ఇతరులకు చట్టపరమైన భద్రతను కల్పిస్తుంది. మోటారు వాహనాలతో సంబంధం ఉన్న నష్టాలు మనం ఊహించిన వాటికంటే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, గడువుకు ముందే మీ ఇన్సూరెన్స్ పాలసీలను రెన్యూచేసుకోవాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము.

  • కార్ ఇన్సూరెన్స్ క్లెయిముల తిరస్కరణ ఉండదు:

    గడువు ముగిసే ముందు రోజు మీ పాలసీని రెన్యూచేయడం వలన మీరు క్లెయిమ్ ప్రాసెస్‌లో ఎటువంటి సవాళ్లను ఎదుర్కొనరు. పాలసీ గడువు ముగిసాక ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే, రిపేయిరింగ్‌ల కోసం చెల్లించడానికి లేదా వైద్య ఖర్చులతో వ్యవహరించడానికి మీకు ఎటువంటి బ్యాకప్ ఉండదు.

  • ఇన్సూరెన్స్ ప్రీమియంలను మధ్యస్థాయిలో ఉంచుకోండి:

    ఒక నిర్దిష్ట వ్యవధిలో పాలసీని రెన్యూ చేయకపోతే వెహికల్ ఇన్సూరెన్స్ పొందటానికి మీ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. మరియు అప్లికేషన్ అంగీకరించినప్పటికీ, మీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో ఇన్సూరెన్స్‌ని రెన్యూ చేయడం ద్వారా ఇవన్నింటిని నివారించవచ్చు.

  • నో క్లెయిమ్ బోనస్‌తో సేవ్ చేయండి:

    తమ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సీరియస్‌గా తీసుకునే పాలసీదారులకు మాత్రమే నో క్లెయిమ్ బోనస్ అందించబడుతుంది. ఒకవేళ మీరు పాలసీ గడువు ముగిసే వరకు చూస్తే, వాహన యజమానులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే డిస్కౌంట్ రద్దు చేయబడుతుంది మరియు మీరు పెద్దమొత్తంలో ఇన్సూరెన్స్ ప్రీమియంలను చెల్లించాల్సి ఉంటుంది.

  • రెన్యూవల్ కోసం సులభమైన తనిఖీ:

    మీ వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం కంపెనీలు ఒక ప్రామాణిక విధానాన్ని అనుసరిస్తాయి, ఇందులో మీ వాహన పరిస్థితిని అంచనా వేసే తనిఖీ కూడా చేయబడుతుంది. ఆ అంచనాతో, మీరు ఎంత ఇన్సూరెన్స్ కవరేజీని కొనుగోలు చేయాలో నిర్ణయించుకోవచ్చు.

  • వేగవంతమైన మరియు ఇబ్బందులు లేని రెన్యూవల్:

    పాలసీని రెన్యూ చేయకపోవడం అనేది ఇన్సూరెన్స్ కంపెనీల నుండి తిరస్కరణకు దారితీస్తుంది. కొత్త ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కోసం వెతకడంలో ఎదురయ్యే ఇబ్బందిని నివారించడానికి, మీరు సమయానికి వెహికల్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవాలి. మరియు మమ్మల్ని నమ్మండి, పాలసీ గడువు ముగిసాక మీ బడ్జెట్‌కు సరిపోయే ప్రొవైడర్ కోసం వెతకడం ఒక సవాలుగా మారుతుంది.

 

వాహన ఇన్సూరెన్స్ కస్టమర్ సమీక్షలు

 

సగటు రేటింగ్:

 4.75

(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

 

శిబ ప్రసాద్ మొహంటీ

క్యాప్షన్ ఉన్న వెహికల్ ప్రమాదానికి గురైంది. 31.10.2020 తేదీ నాడు మా జోనల్ మేనేజర్ సర్ ఆ వెహికల్ ఉపయోగించారు. అతి తక్కువ వ్యవధిలో వాహనాన్ని ఉపయోగం కోసం సిద్ధం చేయడానికి మీరు సకాలంలో ప్రారంభించిన మరియు వేగవంతమైన చర్యను మేము అభినందిస్తున్నాము. ఈ చర్యను అందరూ మెచ్చుకున్నారు.

ప్రమోద్ చంద్ లక్ర

నా క్లెయిమ్‌ విషయంలో, నన్ను ట్రీట్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. కాబట్టి, కస్టమర్‌ డీలింగ్ చాలా ప్రొఫెషనల్‌గా మరియు స్నేహపూర్వకంగా ఉంది. దాంతో బజాజ్ అలియంజ్ వారి ఒప్పందంపై నా నమ్మకం మెరుగుపడింది. ఇతరులకు దీనిని తీసుకొమ్మని సలహా ఇస్తాను. నేను కూడా తదుపరి దాని కోసం ఆలోచిస్తాను.

చందన్ కుమార్ దత్త

బజాజ్-అలియంజ్ సర్వీసుతో నేను చాలా సంతృప్తి చెందాను . సరికొత్త ఒటిఎస్ సర్వీసు ద్వారా 2 గంటల్లోపు నా క్లెయిమ్ సెటిల్‌ చేయబడింది . మరియు సర్వేయర్ మిస్టర్ దుర్గా ప్రసన్న గిరి నాకు అద్భుతమైన సర్వీసుని అందించారు .

ఆర్‌ గోవర్ధన్ రెడ్డి

నా లాంటి సీనియర్ సిటిజన్‌లకు ఇబ్బంది లేకుండా, లాక్ డౌన్ సమయంలో మీ సిబ్బంది చేసిన సేవ ప్రసంశనీయమైనది. మరొకసారి కృతఙ్ఞతలు. దయచేసి పాలసీ కాపీని కొరియర్ ద్వారా పంపండి

రంగరాజన్ శేషాద్రి

లాక్ డౌన్ సమయం ప్రారంభంలో, నా ప్రశ్నలకు సమాధానాలిచ్చే వారెవరూ లేరని భావించాను. సిబ్బంది అంతా ఒకసారి సెట్ అయిన తర్వాత, మీ కస్టమర్ కేర్ బృందం అద్భుతమైన పని చేసింది మరియు నాకు వెహికల్ పాలసీ కాపీ లభించింది. వాస్తవానికి, నా సమస్య పరిష్కరించబడిందని నిర్ధారించడానికి చాలా మంది నాకు కాల్ చేసారు. చాలా ధన్యవాదాలు.

పియల్ నాగ్

ముఖ్యంగా కోవిడ్ లాక్ డౌన్ వ్యవధిలో, క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం రెస్పాన్స్ వేగవంతంగా ఉంది. ఇది అవాంతరాలు లేనిది..

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

 

మోటార్ ఇన్సూరెన్స్ తరచుగా అడగబడే ప్రశ్నలు

 

 

 

   మోటార్ ఇన్సూరెన్స్ కోసం ఎలా అప్లై చేయాలి?

మా ఆన్‌లైన్ పోర్టల్‌ సాయంతో బజాజ్ అలియంజ్‌ వారి మోటార్ ఇన్సూరెన్స్ దరఖాస్తు ప్రక్రియ కేవలం నిమిషాల్లో పూర్తవుతుంది. మీరు మా వెబ్‌సైట్ ద్వారా లేదా యాప్‌ని ఉపయోగించి ఫారంను నింపవచ్చు మరియు దరఖాస్తు పూర్తి చేయడానికి అవసరమైన డాక్యు మెంట్లను సమర్పించవచ్చు. డాక్యుమెంట్లు ధృవీకరించబడతాయి మరియు మీ బడ్జెట్‌కు తగిన ప్లాన్‌లను ఎంచుకోగలుగుతారు మరియు వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని వీలైనంత త్వరగా ఖరారు చేస్తారు. 

   మోటార్ పాలసీ జారీ చేయబడే సమయం ఎంత?

సాధారణంగా, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక సంవత్సరానికి చెల్లుతుంది. ఆ తరువాత, వాహన యజమాని పాలసీ ల్యాప్స్ అవకుండా, నిర్ణీత తేదీకి ముందుగానే పాలసీని రెన్యూ చేయాలి; లేకపోతే, ఇది ఎన్‌సిబి డిస్కౌంట్ మరియు ప్రీమియం రేట్లను ప్రభావితం చేస్తుంది. 

   కస్టమర్ నుండి మాకు ప్రపోజల్ ఫారం ఎప్పుడు అవసరం అవుతుంది?

ప్రపోజల్ ఫారం ఇలాంటి పరిస్థితులలో అవసరం:

● కొత్త బిజినెస్

● ఇతర కంపెనీ రెన్యూవల్

● వడ్డీ బదిలీ కోసం

● లయబిలిటీ ఓన్లీ కవర్‌ను పూర్తి ప్యాకేజీ పాలసీగా మార్చడానికి

● వాహనం యొక్క మార్పు/సబ్‌స్టిట్యూషన్

● ప్రస్తుత పాలసీ సమయంలో లేదా రెన్యూవల్ సమయంలో వాహనం యొక్క సవరణ లేదా మెరుగుదల 

   కవర్ నోట్ అంటే ఏమిటి?

కవర్ నోట్ అనేది ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లకు వెహికల్ ఇన్సూరెన్స్ యొక్క తాత్కాలిక డాక్యుమెంటేషన్‌ను వివరించే సర్వసాధారణమైన పదం. మీకు చివరిగా లభించే డాక్యుమెంట్‌ని పొందడానికి ముందు, మీ వద్ద చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉందని రుజువుచేయడానికి ఇది పనికొస్తుంది. పేరు, చిరునామా, వెహికల్ రిజిస్ట్రేషన్, వెహికల్ యొక్క ఉద్దేశ్యం, కవర్ స్థాయి, పాలసీ సంఖ్య, గడువు తేదీ మరియు ప్రత్యేక షరతులను గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి. 

   ఐడివి అంటే ఏమిటి?

ఐడివి అంటే ప్రకటించబడిన ఇన్సూరెన్స్ విలువ, ఇది మీ వాహనం దెబ్బతిన్నప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు ఇన్సూరర్ చెల్లించే గరిష్ట మొత్తాన్ని సూచిస్తుంది

   ముందస్తు-అంగీకారం తనిఖీలు ఎప్పుడు నిర్వహించాలి?

వాహనం యొక్క ముందస్తు-అంగీకారం తనిఖీలు ఈ క్రింది పరిస్థితుల్లో నిర్వహించబడతాయి:

● బ్రేక్-ఇన్ ఇన్సూరెన్స్

● టిపి కవర్ యొక్క ఒడి కవర్ కన్వర్షన్

● దిగుమతి చేయబడిన వాహనాలను కవర్ చేస్తోంది

● బౌన్స్ అయిన చెక్ తర్వాత తాజా చెల్లింపు అరైవల్

● వాహన పరిశీలన కోసం పూచికత్తు విభాగం నుండి ఒక అధికారి వచ్చినపుడు 

   నేను కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు నా మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ బదిలీ చేయబడుతుందా?

లేదు, మీరు ఒక కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే, ఆ రెండింటికీ ప్రత్యేకమైన ఇన్సూరెన్స్‌ని కలిగి ఉండాలి. నియమాల ప్రకారం, మీరు ఒకేసారి రెండు వాహనాల కోసం ఒక ప్రధాన ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండకూడదు. అయితే, బజాజ్ అలియంజ్‌లో ఒక పాలసీ కింద రెండు వాహనాల పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ గురించిన నిబంధన ఉంది. 

   ఎండార్స్‌మెంట్ ఎప్పుడు అవసరం?

పాలసీని మార్చడానికి సాక్ష్యంగా ఉపయోగపడే ఒక పత్రం ఎండార్స్‌మెంట్. ఒకవేళ పాలసీలో కస్టమర్ ఏవైనా మార్పులను కోరినట్లయితే ఇది పాలసీ టర్మ్స్‌లో కూడా మార్పు చేస్తుంది మరియు ఇది కేవలం పాలసీ జారీ సమయంలో, మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించడం ద్వారా మాత్రమే జరుగుతుంది. 

   పాలసీని రెన్యూ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏవి?

మీరు పాలసీని రెన్యూ చేయాలనుకుంటే, ఈ క్రింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి:

● ప్రీమియం చెక్

● రెన్యూవల్ రిప్లై ఫారం

● కొత్త పాలసీలో కస్టమర్‌కు అవసరమైన మార్పులు

● పాత పాలసీ వివరాలు

● వాహన రిజిస్ట్రేషన్ నంబర్

● చెల్లింపు వివరాలు

● గుర్తింపు రుజువు

● చిరునామా మరియు వాహన యాజమాన్యం యొక్క రుజువు 

   ఉద్యోగుల పరిహారం చట్టం అంటే ఏమిటి? ఇది టిపి ఇన్సూరెన్స్ క్లెయిమ్లను ఎలా ప్రభావితం చేస్తుంది?

పారిశ్రామిక పని వల్ల కలిగే ప్రమాదం లేదా వృత్తి సంబంధిత వ్యాధి వలన ఉద్యోగికి వైకల్యం లేదా ఆకస్మిక మరణం వంటివి సంభవిస్తే, ఉద్యోగుల పరిహార చట్టం ప్రకారం కార్మికులు మరియు వారి కుటుంబాలకు పరిహారం చెల్లించబడుతుంది. 

దురదృష్టకర సంఘటన కారణంగా ఒకరు శారీరకంగా గాయపడితే మరియు అది మరణానికి దారితీసినప్పుడు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇతర పార్టీలకు అపరిమిత లయబిలిటీని పరిహారంగా చెల్లిస్తుంది, ఇది సాధారణంగా కోర్టు చట్టం ద్వారా నిర్ణయించబడుతుంది. 

   థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల తీర్పులో న్యాయవ్యవస్థ ఎలాంటి పాత్ర పోషిస్తుంది?

మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత, మెలికలు తిరిగిన భీమా కేసులు మరియు పెరుగుతున్న మోసాలను న్యాయవ్యవస్థ మెరుగైన సామర్థ్యంతో నిర్వహిస్తుంది. సహజ న్యాయం చేస్తున్నప్పుడు, బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేయడానికి న్యాయవ్యవస్థ సహాయం చేస్తుంది. 

   థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ అంటే ఏమిటి? ఇది నా మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ చేయబడుతుందా?

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పరిధిలో, థర్డ్ పార్టీకి పలు ప్రయోజనాలు మరియు డ్యామేజీల కోసం కవర్ లభిస్తుంది. ట్రాన్సాక్షన్‌లో పాల్గొన్న ఇతర రెండు పార్టీలు కాకుండా, మిగిలిన వారు థర్డ్ పార్టీ అనగా లభ్డిదారులు. మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద, కాంప్రిహెన్సివ్ పాలసీ కవర్ కానందున అదనపు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ని పొందాల్సి ఉంటుంది. 

   థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‌లో నిర్లక్ష్యానికి సంబంధించిన సంఘటనలు ఏవి?

నిర్లక్ష్యం అనేది ముందుగా నిర్ణయించిన విధుల ఉల్లంఘనను సూచిస్తుంది, దీని వలన సంస్థలకు నష్టాలు లేదా డ్యామేజీలు జరగవచ్చు. ఈ రెండు రకాల నిర్లక్ష్యాలలో, గాయపడిన వ్యక్తి ఇతర పార్టీకి జరిగిన నష్టాలకు సహాయం అందించినపుడు, సహకార నిర్లక్ష్యం జరుగుతుంది. మరొక పార్టీ కారణంగా జరిగే ప్రమాదాలు మరియు గాయపడిన వ్యక్తికి ఆ సంఘటనతో ప్రమేయం లేని పరిస్థితులు మిశ్రమ నిర్లక్ష్యం కిందకు వస్తాయి. 

   నా వెహికల్ ఇన్సూరెన్స్ పథకం కింద నా నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) బదిలీ చేయబడుతుందా?

అవును, మీరు మునుపటి వెహికల్ ఇన్సూరెన్స్ సంస్థ నుండి నో క్లెయిమ్ బోనస్‌ను జమచేసినట్లయితే, ఎన్‌సిబి ప్రయోజనాలను బజాజ్ అలియంజ్ మోటార్ ఇన్సూరెన్స్‌కు బదిలీ చేయవచ్చు. అయితే, ఆ ప్రయోజనాలను బదిలీ చేయడానికి మీకు 90 రోజులు మాత్రమే లభిస్తాయి. 

   వాహన ప్రమాదం/దొంగతనం జరిగిన సందర్భంలో నేను ఏమి చేయాలి?

మీరు చేయవలసిన మొదటి పని, మీ వాహనం దొంగిలించబడిన ప్రదేశం నుండి సమీప పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయడం. అప్పుడే మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, దాని కోసం మీరు ఎఫ్ఐఆర్ మరియు క్లెయిమ్ డాక్యుమెంట్లతో సహా అనేక అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. మీరు క్లెయిమ్‌ని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయవచ్చు, మా ప్రతినిధిని అడగవచ్చు లేదా మాకు కాల్ చేయవచ్చు. 

   నేను నా వాహనం కోసం ఇన్సూరెన్స్‌ని ఎప్పుడు రెన్యూచేయాలి మరియు ఎందుకు?

ఇప్పటికే ఉన్న మీ ఇన్సూ రెన్స్ పాలసీ గడువు ముగిసేలోపు, దానిని రెన్యూ చేసుకోవడం అనేది ఉత్తమ సమయం. మీ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూచేయడం చాలా అవసరం, ఎందుకంటే ఇది వాహనాన్ని సురక్షితంగా ఉంచుతుంది మరియు ఎలాంటి నష్టాల నుండి అయినా లేదా మీ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలో ఉన్న అన్ని సంఘటనల నుండి సురక్షితంగా ఉంచడం ద్వారా మీకు ప్రయోజనాలను కల్పిస్తుంది. 

   మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ఏవైనా అర్హతా ప్రమాణాలు ఉన్నాయా?

మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ఎటువంటి ప్రత్యేక షరతులు లేవు. చట్టపరంగా పొందిన మీ పేరుతో మీ వాహనం ఉంటే, అప్పుడు మీరు బజాజ్ అలియంజ్ నుండి ఎలాంటి రకమైన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా పొందడానికి మీరు అర్హులవుతారు. 

   భారతదేశంలో మోటార్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాథమిక వర్కింగ్ మోడల్ అంటే ఏమిటి?

భారతదేశంలో మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక సాధారణ మరియు సమర్థవంతమైన వ్యవస్థ కింద పనిచేస్తుంది. ప్రారంభంలో కొనుగోలుదారుడు ఇన్సూరర్ నుండి ఒక ఇన్సూ రెన్స్ పాలసీని పొందుతారు మరియు వాహనం దెబ్బతిన్నట్లయితే ఒక క్లెయిమ్ చేస్తారు, అయితే, ఇన్సూ రర్ దానిని ధృవీకరించడానికి కొంత సమయం తీసుకోవచ్చు, తరువాత దానిని ఆమోదించవచ్చు. కొనుగోలు సమయంలో ఏర్పాటు చేసిన నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌ను సెటిల్ చేస్తుంది. 

   మరొక ఇన్సూరెన్స్ సంస్థతో పాటు వేరే ఇన్సూరెన్స్ ప్లాన్‌కు మారడం సాధ్యమేనా?

మీకు ఇప్పటికే ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే, మరొక ఇన్సూరెన్స్ ప్లాన్‌కు మారడం మరియు వేరే ఇన్సూరెన్స్ సంస్థ నుండి సేవలను పొందడం అనేది సాధ్యమయ్యే పని కాదు. పాలసీని రెన్యూ చేసేటప్పుడు మీరు పాలసీలు మరియు ప్రొవైడర్ మధ్య మారవచ్చు. 

   ఆన్‌లైన్‌లో వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు ప్రాసెస్ కోసం ఎంత సమయం పడుతుంది?

ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే ప్రాసెస్, పాలసీని పొందడం వేగవంతమైన మరియు సులభమైన మార్గాల్లో ఒకటి. వెహికల్ ఇన్సూరెన్స్‌ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి 3 నుండి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ, ఒక ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ముందు మీరు పరిశోధన చేయాలి. 

   మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ఏమి కవర్ చేస్తుంది?

మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద ఇన్సూర్ చేసిన వ్యక్తి పొందగలిగేవి;

● వారి స్వంత వాహనానికి నష్టాల కోసం కవర్.

● పర్సనల్ యాక్సిడెంట్ కవర్

● ప్రయాణీకుల కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్

● మూడవ వ్యక్తి యొక్క మరణం లేదా శారీరక గాయం

● థర్డ్ పార్టీ ఆస్తికి జరిగిన నష్టం

   వాహన ఇన్సూరెన్స్ కింద ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ కవర్ చేయబడతాయా?

ఆన్‌లైన్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద, వినియోగదారులు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాల కోసం కవర్ పొందవచ్చు కానీ, అది ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ పాలసీకి అదనంగా జోడించిన యాడ్-ఆన్ కవర్‌తో మాత్రమే సాధ్యం అవుతుంది. 

   మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద అనుమతించబడగల రాయితీలు ఏమిటి?

అంధులు, వికలాంగులు లేదా ప్రత్యేక సామర్థ్యం గల వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మరియు సవరించిన వాహనాలకు రాయితీలు ఉన్నాయి. కాబట్టి, ఈ వ్యక్తులు తక్కువ ప్రీమియంతో ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. 

   మోటార్ ఇన్సూరెన్స్ కింద అందుబాటులో ఉన్న అదనపు పిఎ కవర్‌లు ఏమిటి?

భారతదేశంలోని మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద, అదనపు పిఎ కవర్‌లలో ఇవి ఉంటాయి;

● యజమాని డ్రైవర్ మరియు చెల్లింపు డ్రైవర్ కోసం పిఎ. అంతే కాకుండా, మీరు పేరులేని యజమానులకు మరియు పేరున్న యజమానులకు పిఎ కవర్ కూడా పొందవచ్చు. 

   నేను నా వాహనాన్ని విక్రయించినపుడు నా మోటారు ఇన్సూరెన్స్ పాలసీ బదిలీ చేయబడుతుందా?

వెహికల్ ఇన్సూరెన్స్‌ను మరొక వ్యక్తి పేరిట బదిలీ చేయడం సాధ్యమయ్యే పని. అయితే, వాహనాన్ని బదిలీ చేసుకున్న తేదీ నుండి 14 రోజులలోపు మాత్రమే దీనిని బదిలీ చేయడం సాధ్యమవుతుంది. ఒకవేళ యజమాని కొత్త కారును కొనుగోలు చేసి, ఇన్సూరెన్స్‌ని కొత్త వాహనానికి బదిలీ చేయాలనుకుంటే, బదిలీ చేయబడిన వాహనం యొక్క యజమాని ఆన్‌లైన్‌లో కొత్త మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని పొందాలి. 

   వేర్వేరు వాహనాల కోసం నాకు అనేక పిఎ కవర్‌లు అవసరమా?

లేదు, కొత్త IRDAI నిబంధనల ప్రకారం, బహుళ వాహనాలు కలిగిన యజమానులు మోటారు ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేసేటప్పుడు, స్టాండ్‌అలోన్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ని తీసుకోవచ్చు. 

   మోటార్ టిపి ఇన్సూరెన్స్‌లో 'ఫాల్ట్ మరియు ఫాల్ట్ లయబిలిటీ' అంటే ఏమిటి?

నో ఫాల్ట్ లయబిలిటీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం, హక్కుదారు తన లేదా వాహనం యొక్క డిఫాల్ట్ లేదా ప్రమాదం జరిగినప్పుడు జరిగిన నిర్లక్ష్యాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు. కొత్త మోటార్ ఇన్సూరెన్స్ చట్టం, నో ఫాల్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ యొక్క పరిహారాన్ని మరణం విషయంలో 5 లక్షలకు మరియు గాయం విషయంలో 2.5 లక్షలకు పెంచింది. ఫాల్ట్ లయబిలిటీ కింద, ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందడానికి పాలసీదారుడు నిర్లక్ష్యం మరియు డిఫాల్ట్‌‌ని నిరూపించాల్సి ఉంటుంది. 

   లాంగ్‌టర్మ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ఫీచర్లు ఏంటి?

లాంగ్‌టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద, ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి తన వాహనానికి సంబంధించిన థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ యొక్క అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. దీనికి అదనంగా, ఈ ఇన్సూరెన్స్ కవర్ పరిధిలో, పాలసీ కింద భరోసా ఇవ్వబడిన నష్టాల కోసం కవర్ వెంటనే ప్రారంభం అవ్వడం వలన పాలసీహోల్డర్ బీమా ప్రయోజనాలను పొందవచ్చు. లాంగ్‌టర్మ్ ఆన్‌లైన్ మోటారు ఇన్సూరెన్స్ పాలసీ కారు కోసం మూడు సంవత్సరాలు మరియు టూ వీలర్ కోసం ఐదు సంవత్సరాలు తీసుకోవచ్చు. 

   వాహనం వేరొకరి పేరుతో రిజిస్టర్ చేయబడి,నేను ఆ వెహికల్‌ను డ్రైవ్ చేస్తే, ప్రీమియం కూడా నేనే చెల్లిస్తే నాకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ వర్తిస్తుందా?

రూల్స్ ప్రకారం, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ యజమాని-డ్రైవర్ వల్ల కలిగే నష్టాలకు మరియు గాయాలకు చెల్లిస్తుంది. ఒకవేళ, వాహనానికి మరొక డ్రైవర్ ఉంటే, అప్పుడు ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి అదనపు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ని కొనుగోలు చేయాలి, ఇది అదనపు ప్రీమియాన్ని అందిస్తుంది. 

   వాహనం విలువ (ఐడివి - ప్రకటించబడిన ఇన్సూరెన్స్ విలువ) ఎలా నిర్ణయించబడుతుంది?

వాహనం యొక్క ఐడివి ను లెక్కించడానికి, మనం మూడు విషయాలను గుర్తుంచుకోవాలి;

● మ్యానుఫ్యాక్చరర్ జాబితా చేసిన కారు ధర (బ్రాండ్ మరియు మోడల్ ప్రకారం)

● వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రారంభం (కొత్త లేదా రెన్యూవల్ )

● డిప్రిసియేషన్ 

వాహనం యొక్క ఐడివి లెక్కింపులో, సైడ్ కార్లు మరియు ఇతర ఉపకరణాలను లిస్టింగ్ ధరలో చేర్చబడవు. 

   నా వాహనం కోసం ప్రీమియం ఎంత ఉంటుంది?

వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కలోకి చాలా విషయాలు వస్తాయి.

● రకం

● తయారీ

● వినియోగం (ప్రయాణించిన కిలోమీటర్లు)

● క్యూబిక్ సామర్థ్యం

● రిజిస్ట్రేషన్ తేదీ మరియు స్థలం

● గత క్లెయిములు

   నా వాహన ఇన్సూరెన్స్ ప్రీమియంను నేను ఎలా తగ్గించుకోగలను?

మీరు ఎక్కువ ఖర్చుతో కూడిన వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లించారని నిర్ధారించుకోవడానికి, విభిన్న ఆఫర్‌లను, ఇన్సూరెన్స్ ప్లాన్‌లను పోల్చడాన్ని మొదలుపెట్టండి. అంతే కాకుండా, మొత్తం కాలంలో ఇన్సూరెన్స్ ప్రయోజనాలను క్లెయిమ్ చేయకపోవడం కూడా, తదుపరి పాలసీలో ప్రీమియం తగ్గింపుకు సహాయపడుతుంది. చివరగా, భద్రతా పరికరాలు కలిగిన వాహనాలు మరియు మెరుగైన డ్రైవింగ్ రికార్డ్ ఉన్న డ్రైవర్లు తక్కువ ప్రీమియంను ఎంచుకుంటారు. 

   జిఎస్‌టి నా మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎలా ప్రభావితం చేస్తుంది?

కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 18% జిఎస్‌టి ని ఆకర్షిస్తాయి. సర్వీస్ టాక్స్ ఆధారంగా, ఇన్సూరెన్స్ ప్రీమియం 15% ఉంది. కానీ జిఎస్‌టి పాలన ప్రకారం, వినియోగదారులు మునుపటి ప్లాన్ కంటే 3% అధిక పన్నుని చెల్లిస్తారు. 

   ప్రమాదంలో పాదచారులు గాయాలైనపుడు నేను వెహికల్ ఇన్సూరెన్స్ ‌ను క్లెయిమ్ చేయవచ్చా?

గాయపడిన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా మీరు భయపడకుండా, ప్రమాద స్థలాన్ని మరియు వాహనాన్ని పరిరక్షించాలి, సాధ్యమైనంత వరకు తగినమొత్తంలో గాయపడిన వ్యక్తుల ఫోటోలను తీయాలి. పోలీసులకు సమాచారం ఇవ్వండి మరియు ప్రమాద స్థలం నుండి పారిపోకండి ఎందుకంటే ఇది అపరాధ భావనకు దారితీస్తుంది, మీ పాలసీపై కాంప్రిహెన్సివ్ క్లెయిమ్ చేయడానికి దారితీస్తుంది. ఈ ప్రాసెస్‌ని అనుసరించడం ద్వారా మీరు కాంట్రిబ్యూటరీ క్లెయిమ్‌ను పొందే అవకాశాలు ఉన్నాయి. 

   ఈ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలో లేని సంఘటనలు లేదా నష్టాల రకాలు ఏమిటి?

మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం, ఈ కింది నష్టాలకు మీరు ప్రయోజనాలను పొందలేరు:

● బ్రేక్‌డౌన్ (మెకానికల్ మరియు ఎలక్ట్రికల్)

● వయసు కారణంగా వాహనం పూర్తిగా పనిచేయలేని స్థాయిలో ఉండటం

● డిప్రిషియేషన్ మరియు పర్యవసాన నష్టం

● ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రమాదాల కారణంగా సంభవించే నష్టాలు

● మత్తు మందుల ప్రభావంలో చేసిన డ్రైవింగ్ కారణంగా జరిగే నష్టాలు

● లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వలన జరిగే నష్టాలు

   గ్రేస్ పీరియడ్‌లో నా వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని క్లెయిమ్ చేయవచ్చా?

గ్రేస్ పీరియడ్ అనేది, ప్రీమియం సమయానికి చెల్లించకపోతే ఇన్సూరెన్స్‌ కంపెనీ ఇన్సూరర్‌కు అందించిన పొడిగింపు సమయాన్ని సూచిస్తుంది. అయితే, ఇన్సూరెన్స్ చేసినవారు గ్రేస్ వ్యవధిలో క్లెయిమ్ చేయలేరు, ఎందుకంటే గ్రేస్ వ్యవధిలో కవరేజ్ అందించబడదు. 

   నేను వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను దాఖలు చేసిన తర్వాత, క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ఎంత సమయం పడుతుంది?

ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అందించిన క్లెయిమ్‌ను పరిష్కరించడానికి అనువైన సమయం 14 నుండి 28 రోజులు. కానీ ఇది క్లెయిమ్ స్టేటస్ మరియు ప్రస్తుత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. 

   నా మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసినట్లయితే ఏం చెయ్యాలి?

ఒకవేళ మీ వెహికల్ ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లయితే, వెంటనే కొత్త పాలసీని పొందమని మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా భారతీయ రోడ్లపై వాహనాన్ని నడపడం అనుమతించబడదు. మీ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగియడానికి ముందే దానిని రెన్యూచేయడం ఉత్తమ పద్ధతి, కానీ గడువు ముగిసిన తర్వాత మీరు దానిని మళ్లీ ప్రారంభించవచ్చు. 

 

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి