రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
కమర్షియల్ మోటార్ ఇన్సూరెన్స్ అనేది వాణిజ్య ప్రయోజనాల కోసం వాహనాలను ఆపరేట్ చేసే వ్యాపారాలను రక్షించడానికి రూపొందించబడిన ఒక నిర్దిష్ట రకమైన ఇన్సూరెన్స్. పర్సనల్ ఆటో ఇన్సూరెన్స్ లాగా కాకుండా, ఇది ఈ పని చేసే వాహనాల ప్రత్యేక రిస్కులు మరియు బాధ్యతలను కవర్ చేస్తుంది. ప్రమాదాలు, దొంగతనాలు, నష్టాలు లేదా థర్డ్-పార్టీ బాధ్యతల విషయంలో ఇది మీ వ్యాపారాన్ని ఆర్థికంగా రక్షిస్తుంది.
భారతదేశంలో, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ఏదైనా వాహనానికి కమర్షియల్ మోటార్ ఇన్సూరెన్స్ చట్టపరంగా తప్పనిసరి. ఇందులో ఇటువంటి విస్తృత శ్రేణి వాహనాలు ఉంటాయి:
ట్రక్స్ మరియు లారీలు
బస్సులు
టాక్సీలు మరియు క్యాబ్స్ (ఓలా, ఊబర్‌తో సహా)
త్రీ-వీలర్లు (ఆటో రిక్షాలు)
కమర్షియల్ వ్యాన్లు
మీరు ఒకే కమర్షియల్ వాహనాన్ని నిర్వహించినప్పటికీ, మీ వ్యాపార ఆస్తులను రక్షించడానికి మరియు ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి సరైన ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం.
కమర్షియల్ టాక్సీ ఇన్సూరెన్స్ పాలసీ మీ వ్యాపారం కోసం అనేక మార్గాల్లో ఒక భద్రతా కవచాన్ని అందిస్తుంది:
ఇది ప్రమాదాలు, దొంగతనాలు, అగ్నిప్రమాదం లేదా ప్రకృతి వైపరీత్యాల విషయంలో మీ వాహనం మరమ్మత్తు ఖర్చులను కవర్ చేస్తుంది, ఇది మీ వ్యాపారంపై ఆర్థిక ఒత్తిడిని నివారిస్తుంది.
మీ వాహనం ఇతరులకు గాయం లేదా ఆస్తి నష్టాన్ని కలిగించినట్లయితే ఇది మీ వ్యాపారాన్ని చట్టపరమైన మరియు ఆర్థిక బాధ్యతల నుండి రక్షిస్తుంది.
కొన్ని ప్లాన్లు ప్రమాదం జరిగిన సందర్భంలో డ్రైవర్ వైద్య ఖర్చులకు కవరేజ్ అందిస్తాయి.
మీకు సరైన ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందని తెలుసుకోవడం అనేది ఊహించని ఆర్థిక భారాల గురించి తగ్గించబడిన ఆందోళనలతో మీ వ్యాపారాన్ని నడపడం పై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ మీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వివిధ కవరేజ్ ఎంపికలను అందిస్తుంది. కొన్ని సాధారణ రకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
ఇది చట్టం ప్రకారం తప్పనిసరి మరియు మీ వాణిజ్య వాహనం ద్వారా థర్డ్ పార్టీకి జరిగిన ఏవైనా గాయాలు లేదా ఆస్తి నష్టాన్ని కవర్ చేస్తుంది.
ఇది దొంగతనం, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఢీకొనడాలు అలాగే థర్డ్-పార్టీ బాధ్యత నుండి మీ వాహనానికి కవరేజ్‌తో సహా మరింత విస్తృతమైన రక్షణను అందిస్తుంది.
మెరుగైన రక్షణ కోసం డ్రైవర్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్, ప్యాసింజర్ కవర్ మరియు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి యాడ్-ఆన్ కవర్లతో మీరు మీ పాలసీని కస్టమైజ్ చేసుకోవచ్చు.
కమర్షియల్ వెహికల్స్ లయబిలిటీ ఓన్లీ ఇన్సూరెన్స్ : ఆన్ రోడ్ నిర్వాణ
ప్రమాదం ఎలా జరిగినా, ప్రాణనష్టం జరిగితే, ఆ నష్టాన్ని పూడ్చలేము. యాక్సిడెంట్‌కు గురైన బాధితులకు శాశ్వత గాయాలు లేదా ప్రాణనష్టం జరిగితే, అందుకు తగినవిధంగా న్యాయమైన పరిహారం ఇవ్వాలని చట్టం చెబుతుంది. అటువంటి నష్టాలను కవర్ చేసే పాలసీని ఎంచుకోవడం ద్వారా మీ బాధ్యత పరిమితి చేయబడిందని మీరు నిర్ధారించుకోవచ్చు.
బజాజ్ అలియంజ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు థర్డ్ పార్టీ ఆస్తికి ఏదైనా నష్టం జరిగినపుడు మీకు మంచి చేయడంలో సహాయపడతాయి. కార్యాలయ ప్రాంగణం, యంత్రాలు వంటి మౌలిక సదుపాయాలకు జరిగే నష్టాలు కూడా ఇందులో కవర్ చేయబడ్డాయి.
మీరు దూరంగా ఉండాలనుకునే ఒక విషయం ఉంది: అది పాలసీ గడువు ముగింపు. ఇది మీకు, మీ వ్యాపారానికి అవసరమయ్యే రక్షణను దూరం చేస్తూ, మీకు నష్టాలను కలిగించవచ్చు. ఇన్సూర్ చేయబడి ఉండడం అనేది, మీరు జీవితాన్ని సజావుగా గడపడం నుండి అంచెలంచెలుగా ఎదగడానికి సహాయపడుతుంది!
కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ సమయం ఒక సంవత్సరం వరకు మాత్రమే, ఆ తర్వాత దానిని రెన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1st జూలై 2017 నుండి 18% రేటు వద్ద జిఎస్‌టి వర్తిస్తుంది.
వ్యాపారాల యజమాని వాహనాలు ఈ పాలసీని తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ పాలసీ, థర్డ్ పార్టీకి జరిగిన ప్రమాదం నుండి తలెత్తే ఆర్థిక నష్టాలు మరియు చట్టపరమైన బాధ్యతల నుండి కమర్షియల్ వెహికల్ యజమానులను రక్షిస్తుంది.
కమర్షియల్ వెహికల్ యజమానులు ఈ పాలసీని కొనుగోలు చేయడానికి అర్హులు
పాలసీదారుడు చేసిన తప్పు కారణంగా థర్డ్ పార్టీకి ఏదైనా ప్రమాదవశాత్తు మరణం సంభవించడం లేదా శారీరక గాయాలు. ఏ విధమైన థర్డ్ పార్టీకి ఎలాంటి ఆస్తి నష్టాలు జరిగినా అవి కూడా కవర్ చేయబడతాయి
ప్రయాణీకుల వాహనాలు, వస్తువులను మోసుకెళ్లే వాహనాలు, ట్రాక్టర్లు, క్రేన్లు, ట్రైలర్స్ వంటి ఇతర వాహనాలు.
*వివరణాత్మక సమాచారం కోసం దయచేసి పాలసీ నిబంధనలు మరియు షరతుల డాక్యుమెంట్‌ని డౌన్‌లోడ్ చేయండి
ఇది దొంగతనం లేదా పూర్తి నష్టం జరిగిన సందర్భంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ల ఆధారంగా పరిగణించబడే మీ కమర్షియల్ వాహనం మార్కెట్ విలువను సూచిస్తుంది.
అనేక అంశాలు మీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి: వాహనం రకం, వయస్సు, లొకేషన్, ఎంచుకున్న కవరేజ్ (టిపి లేదా సమగ్ర), ఐడివి మరియు మీ వ్యాపారం నడిచే చరిత్ర.
వాహనం సవరణలు, ఆపరేషన్ ప్రాంతం లేదా సరిగాలేని క్లెయిమ్‌ల చరిత్ర వంటి అంశాల ఆధారంగా ఇన్సూరర్ ఈ అదనపు ఛార్జీని వసూలు చేస్తారు, ఇది మీ ప్రీమియంను పెంచుతుంది.
నష్టానికి గురి అయిన వాహనాన్ని మరమ్మత్తు చేయడానికి భారీగా ఖర్చు అయినప్పుడు ఇది జరుగుతుంది. ఇన్సూరర్ మీకు ఐడివి లేదా అంగీకరించిన విలువను చెల్లిస్తారు, మరియు మీరు వాహనం యొక్క సాల్వేజ్‌ను సరెండర్ చేస్తారు.
ప్రమాదాన్ని వెంటనే మీ ఇన్సూరర్‌కు రిపోర్ట్ చేయండి. ఎఫ్‌ఐఆర్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి బుక్ మరియు మరమ్మత్తు అంచనాలు వంటి డాక్యుమెంట్లను సేకరించండి. ప్రాసెసింగ్ కోసం మీ ఇన్సూరర్‌తో క్లెయిమ్ ఫైల్ చేయండి.
క్యాష్లెస్ క్లెయిమ్‌లతో, ఇన్సూరర్ నేరుగా నెట్‌వర్క్ గ్యారేజీలతో మరమ్మత్తు బిల్లులను సెటిల్ చేస్తారు. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల కోసం, మీరు ముందుగానే చెల్లిస్తారు మరియు తర్వాత మొత్తాన్ని క్లెయిమ్ చేస్తారు.
కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఒక సంవత్సరం వ్యవధి ఉంటుంది, అయితే కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు దీర్ఘకాలిక వ్యవధులను అందించవచ్చు. సకాలంలో రెన్యూ చేయడం అనేది నిరంతర కవరేజీని నిర్ధారిస్తుంది.
వీటిలో సరిగ్గా నింపబడిన క్లెయిమ్ ఫారం, ఎఫ్‌ఐఆర్, పాలసీ కాపీ, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్‌సి బుక్, మరమ్మత్తు బిల్లులు మరియు పోలీస్ ధృవీకరణ రిపోర్ట్ (వర్తిస్తే) ఉంటాయి.
గడువు తేదీకి ముందు రెన్యూ చేసుకునే మీ ఉద్దేశ్యం గురించి మీ ఇన్సూరర్‌కు తెలియజేయండి. వారు ప్రీమియం మొత్తంతో ఒక రెన్యూవల్ నోటీసు పంపుతారు. మీ కవరేజీని కొనసాగించడానికి ప్రీమియంను చెల్లించండి.
బజాజ్ అలియంజ్ కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు మరియు ప్రయోజనాల సమగ్ర ప్యాకేజీని అందిస్తుంది:
ఆర్థిక భద్రత : మరమ్మత్తు ఖర్చులు, థర్డ్-పార్టీ బాధ్యతలు మరియు డ్రైవర్ రక్షణను కవర్ చేస్తుంది (ప్లాన్ ఆధారంగా).
నగదురహిత నెట్‌వర్క్ : వేగవంతమైన టర్న్‌అరౌండ్ సమయాల కోసం గ్యారేజీల నెట్‌వర్క్‌లో నగదురహిత మరమ్మత్తులను ఆనందించండి.
24/7 మద్దతు : క్లెయిమ్స్, రెన్యూవల్స్ లేదా రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో ఎప్పుడైనా సహాయం పొందండి.
కస్టమైజ్ చేయదగిన కవరేజ్ : మీ అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌ను రూపొందించడానికి యాడ్-ఆన్ కవర్లను ఎంచుకోండి.
మనశ్శాంతి : మీ వాణిజ్య వాహనాలను రక్షించడం ద్వారా మీ వ్యాపారాన్ని నడపడంపై దృష్టి పెట్టండి.
ఎటువంటి ఆందోళన లేకుండా మీ వాహనాన్ని నడపండి
ఒక కోట్ పొందండిబజాజ్ అలియంజ్ ఆన్‌లైన్‌లో కమర్షియల్ టాక్సీ ఇన్సూరెన్స్‌ను అందించే ప్రముఖ ప్రొవైడర్:
విస్తృత శ్రేణి ప్లాన్‌లు : మీ నిర్దిష్ట వాహన రకం మరియు వ్యాపార అవసరాలకు అనుగుణంగా వివిధ ప్లాన్‌ల నుండి ఎంచుకోండి.
పోటీ ప్రీమియంలు : పోటీ కోట్స్ మరియు ఫ్లెక్సిబుల్ చెల్లింపు ఎంపికలను పొందండి.
విస్తృతమైన నెట్‌వర్క్ : డౌన్‌టైమ్‌ను తగ్గించడం, మరమ్మత్తుల కోసం నగదురహిత గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయండి.
24/7 కస్టమర్ సపోర్ట్ : ఎప్పుడైనా, ఎక్కడైనా తక్షణ మరియు సమర్థవంతమైన సహాయం పొందండి.
చక్రం కనుగొన్న క్షణం నుండి ప్రపంచం మారిపోయింది. పిజ్జా నుండి విమాన భాగాల వరకు వాణిజ్య వస్తువులను మోసే ప్రతీ వాహనం నేటి ప్రపంచంలోని ఆధునిక వ్యాపారాలకు జీవనాడి లాంటిది. ప్రస్తుతం మీ టేబుల్‌పై ఉన్న ఒక కప్పు తాజా అస్సాం టీ మిమ్మల్ని చేరుకోవడానికి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఉండవచ్చు!
మీ ఆఫీస్ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చే క్యాబ్ అగ్రిగేటర్ సేవలు, సముద్ర తీరాల నుండి చారిత్రాత్మక రాజభవనాల వరకు పర్యాటకులకు వాహనదారులు అందించే సేవలు అమితమైనవి, అవి లేని జీవితాన్ని ఊహించలేము!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలు వినియోగదారులకు తమ సేవలను అందించడానికి కమర్షియల్ వెహికల్స్‌పై ఆధారపడి ఉంటాయి. ఒక వ్యాపార యజమానిగా, నష్టాలు కొత్త అవకాశాలను సూచిస్తాయి; కానీ, ఎటువంటి హెచ్చరిక లేకుండా ఉండే రోడ్డు ప్రమాదాలు వంటి భయాలు కూడా ఉంటాయి.
మీరు ఒక హోటల్ లేదా ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే ఉదాహరణకు, మీ జీవనోపాధి మీ కమర్షియల్ వాహనాల బృందం యొక్క పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఒక దురదృష్టకరమైన ప్రమాదం సంభవించినట్లయితే, మీరు చట్టపరమైన ఇబ్బందుల కారణంగా భారీగా ఆదాయ నష్టాన్ని చవిచూస్తారు. పర్యవసానంగా జరిగే నష్టాలు - అసంతృప్తికి లోనయిన కస్టమర్లు మరియు వ్యాపార అవకాశాలను కోల్పోవడం వంటి వాటి గురించి చెప్పనవసరం లేదు!
కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ మీ వ్యాపారాన్ని థర్డ్-పార్టీ లయబిలిటీల నుండి రక్షించడం ద్వారా అలాంటి నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రమాదాలను ఊహించడం కష్టతరం అయినప్పటికీ, కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అనునది దాని పర్యవసానంగా ఎదురయ్యే చట్టపరమైన ఖర్చుల భారం మీ పై పడకుండా మీ డబ్బులను ఆదా చేస్తుంది.
ఈ మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి కమర్షియల్ వాహనానికి మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. వాహనాలు ఇది లేకుండా కనీసం రోడ్లపై ప్రయాణించడం చట్టవిరుద్ధం- థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ కవరేజ్. అందుకే దీనిని "యాక్ట్ ఓన్లీ కవర్" అని పిలుస్తారు.
బజాజ్ అలియంజ్ వద్ద మీ అవసరాలకు తగిన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునే విధానాన్ని మేము సరళీకృతం చేస్తాము. 2001 నుండి కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అందించే ఒక విశ్వసనీయ సంస్థగా, దేశవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు మద్దతు ఇవ్వడానికి మేము ప్రపంచ స్థాయి డొమైన్ నైపుణ్యాలు మరియు సేవలను అందిస్తున్నాము.
ప్రమాదం నుండి తలెత్తే ఏదైనా థర్డ్ పార్టీ లయబిలిటీ నుండి మిమ్మల్ని రక్షించడానికి మేము ఇక్కడ ఉన్నాము. అప్లికేషన్ నుండి క్లెయిమ్ సెటిల్‌మెంట్ వరకు, మీరు ఆన్‌లైన్‌లో కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన అనేక సేవలను పరిశీలించి, ఎంచుకోవచ్చు. మీకు సేవలు అందించడానికి మా వినూత్న విధానం మాకు ఉత్తమమైన గుర్తింపును అందించింది జనరల్ ఇన్సూరెన్స్ వరల్డ్ క్వాలిటీ కాంగ్రెస్ 2018 వద్ద కంపెనీ.
విపత్తు సంభవించినప్పుడు, అన్నీ రెప్పపాటు కాలంలో జరిగిపోతాయి. మేము మా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ మరియు పాలసీ రెన్యువల్‌ను, మీకు ఉన్న సమయానికి, అవసరాలకు అనుగుణంగా వేగంగా మరియు ప్రతిస్పందించే విధంగా రూపొందించాము. బజాజ్ అలియంజ్‌తో, మీకు ఎదురయ్యే తీవ్రమైన నష్టాల నుండి థర్డ్ పార్టీలు అనుభవించే శాశ్వత వైకల్యం వరకు ప్రతిదాని పై కవరేజ్ పొందుతారు. ఫలితం: సుదీర్ఘమైన చట్టపరమైన దావాలు మరియు సంబంధిత ఖర్చుల నుండి స్వేచ్ఛ.
మా క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ పూర్తి అవడానికి కేవలం కొద్ది నిమిషాల సమయం మాత్రమే పడుతుంది మరియు మీ కస్టమర్లకు సేవలను అందించడంలో సహాయపడుతుంది. మా కస్టమర్ సేవా బృందాలు మిమ్మల్ని విజయవంతమైన మార్గంలో ఉంచుతూ, కస్టమైజ్ చేసిన పరిష్కారాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తాయి.
మీరు చిన్న వ్యాపారస్తులు లేదా పెద్ద సంస్థకు యజమాని అయినా బజాజ్ అలియంజ్‌తో, భారతదేశంలో ఎక్కడైనా పారదర్శకంగా, నమ్మదగిన మరియు సమర్థవంతమైన కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ కవరేజీని పొందుతారు. మా వెబ్‌సైట్, ఆన్‌లైన్‌లో విస్తృతమైన కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ పరిష్కారాల నుండి సరైనది ఎంచుకునేలా మీకు వీలు కల్పిస్తుంది.
కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్‌ని పొందడం కోసం సరైన ఎంపికలు చేయడానికి, మీకు కావలసిన సమాచారాన్ని మరియు సాధనాలను అందించడానికి ఇది రూపొందించబడింది. కాగిత రహిత ప్రక్రియను ఎంచుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకై మీ వంతు బాధ్యతను నిర్వర్తించడం మర్చిపోవద్దు; ఒక మౌస్ క్లిక్‌తో ఇన్సూరెన్స్ కోట్స్, క్లెయిమ్ ఫారమ్ అప్‌డేట్, రెన్యూవల్స్ మరియు మరెన్నో పొందండి!
నష్టం యొక్క పరిధిని బట్టి, ప్రమాదం యొక్క ఖర్చులు పెద్ద మొత్తంలో ఉండవచ్చు. మేము బజాజ్ అలియంజ్ తరపున, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటామని, మీ మోహంలో చిరునవ్వుకు ఒక భరోసా ఇస్తున్నాం!
ఒక కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ మీ వ్యాపార నష్టాలను అభివృద్ధి కోసం అవకాశాలుగా మార్చడానికి కూడా సహాయపడుతుంది.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి