Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ఈవి హెల్ప్‌లైన్ నంబర్ : 1800-103-5858

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్

11 రోడ్‌సైడ్
అసిస్టెన్స్ సర్వీసులతో ఈవి కోసం సంరక్షణ

ఆన్-సైట్ ఛార్జింగ్, పికప్ & డ్రాప్

ఎస్‌ఒఎస్‌తో ఈవి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్

ఒక కోట్ పొందండి

 

What is Health Insurance

ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకోండి

ప్రస్తుతం, వాహన పరిశ్రమలో అత్యంత ఉత్తేజకరమైన ఎంపికల్లో ఒకటిగా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఒకప్పుడు కాన్సెప్ట్‌గా మాత్రమే ఉన్న ఈ కార్లు ఇప్పుడు ప్రధాన మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేశాయి.

ప్రజలు ఇప్పుడు ఈ కార్లను మరింత మరింత ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఎక్కువమంది వినియోగదారుల ఎలక్ట్రిక్ వాహనాలను, ప్రత్యేకించి కార్లను ఎంచుకోవడానికి అవి అందుబాటు ధరలో లభ్యం అవ్వడం అనేది ప్రధానమైన కారణంగా ఉంటోంది.

ఈ వాహనాలు పర్యావరణానికి అనుకూలమైనవిగా విశ్వసించడం మరొక కారణం కావచ్చు.

అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడంలో కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంధనం ఖర్చు మీద భారీగా పొదుపు చేయగలగడం అనేది అలాంటి ప్రయోజనాల్లో ఒకటిగా ఉంటోంది.

ఈ వాహనాల కొనుగోలు మీద మీకు కొన్ని ప్రోత్సాహకాలు కూడా లభించే అవకాశం ఉంది.

నేడు మార్కెట్‌లో ప్రాథమికంగా నాలుగు రకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అవి ఇలా ఉన్నాయి:

✓ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు

✓ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు

✓ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు

✓ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు

 

 

అయితే, ఎలక్ట్రిక్ కార్ కోసం ఇన్సూరెన్స్‌‌ను మర్చిపోకండి

ఇంధన వాహనాలకు ఇన్సూరెన్స్ అందుబాటులో ఉన్నట్లుగానే, ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి మీ ఎలక్ట్రిక్ కారుకు జరిగే నష్టాలకు ఆర్థిక కవర్ అందించే ప్లాన్లు.

మీరు ఎంచుకున్న పాలసీ రకాన్ని బట్టి, ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీకి జరిగిన నష్టాలు లేదా మీ కారుకు లేదా మీకు జరిగిన నష్టాల నుండి రక్షణను అందిస్తుంది.

ఉదాహరణకు, థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ అనేది మీ ప్రమేయంతో థర్డ్ పార్టీకి జరిగే ఏవైనా నష్టాల నుండి మీకు రక్షణ అందిస్తుంది. మరోవైపు, సమగ్ర పాలసీలనేవి.

ఆర్థిక ఖర్చులకు దారితీసే డ్యామేజీల నుండి మీ ఎలక్ట్రిక్ కారును మీరు కవర్ చేయాలనుకుంటే, ఒక సమగ్ర పాలసీ కవర్ కొనుగోలు చేయడం మంచిది.

  • ✅ సమగ్ర పాలసీలలో వివిధ యాడ్-ఆన్‌లు కూడా ఉంటాయి.
  • ✅ A  పర్సనల్ యాక్సిడెంట్ కవర్  అనేది మీరు సమగ్ర పాలసీలను కొనుగోలు చేసినప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది.
  • ✅ మీరు ఒక దురదృష్టకర సంఘటనను ఎదుర్కొన్నట్లయితే అటువంటి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మీ పాలసీ నుండి ఆర్థిక సహాయం పొందడానికి మీకు వీలు కల్పిస్తుంది.

 

 

ఈవి కార్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలతో మిమ్మల్ని మీరు రక్షించుకోండి

మీ ఎలక్ట్రిక్ కార్ కోసం మీరు ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం అవసరమా?

1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం, మీ కారు కోసం థర్డ్-పార్టీ బాధ్యతను పొందడం తప్పనిసరి. ఈ నియమం మీ ఎలక్ట్రిక్ కారుకు కూడా వర్తిస్తుంది. నిజానికి, మీ వాహనం కోసం సమగ్ర కవరేజీ పొందడం తప్పనిసరి కాదు. అయినప్పటికీ, ప్రత్యేకించి ఒక దురదృష్టకర ప్రమాదం ఎదురైనప్పుడు, దాని కోసం మీరు ఆర్థిక కవరేజీ కోరుకుంటే, అలాంటి పాలసీ తీసుకోవాలని సూచించడమైనది.

ఈవి కోసం కార్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే, ఇన్సూరెన్స్ అనేది ఎలా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ, మీ కారుకు ఏదైనా నష్టం జరిగితే,.

మరమ్మత్తులు కోసం గణనీయమైన మొత్తం ఖర్చు కావడంతో పాటు మీ పొదుపులను ఖాళీ చేస్తాయి. మీకు ఇన్సూరెన్స్ ఉంటే, మీ పొదుపులు ప్రభావితమయ్యే అవకాశం ఉండదు. మీ పాలసీ వివరాల ఆధారంగా ఇన్సూరెన్స్ ప్రొవైడర్, మరమ్మత్తుల ఖర్చు కోసం మీకు కవరేజ్ అందిస్తారు. అదేవిధంగా, ఒక థర్డ్-పార్టీ పాలసీ మరొక వ్యక్తి వాహనానికి జరిగిన ఏవైనా నష్టాల కోసం చెల్లించవలసిన అవసరం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

అందువల్ల, ఒక సమగ్ర పాలసీ తప్పనిసరి కాకపోవచ్చు, ఒకదాన్ని కొనుగోలు చేయడం మీకు ఉత్తమమైన ఆసక్తిగా ఉంటుంది.

 

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ఈవి పాలసీ నుండి మీ పాలసీని ఎంచుకోండి

ఎలక్ట్రిక్ కార్ల కోసం అనేక ఇన్సూరెన్స్ ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ, బజాజ్ అలియంజ్ నుండి ఒక పాలసీ ఎంచుకోవడం వల్ల క్రింది ప్రయోజనాలు లభిస్తాయి:

ఫీచర్లు

సమర్పణలు

నగదురహిత మరమ్మతులు

7200+ నెట్‌వర్క్ గ్యారేజీలలో

నగదురహిత హాస్పిటలైజేషన్ సౌకర్యం

8600+ హాస్పిటల్స్ సౌకర్యం

త్వరిత కొనుగోలు ప్రయాణం

3 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది

క్లెయిమ్ సదుపాయం

నగదురహిత క్లెయిములు

నో క్లెయిమ్ బోనస్ బదిలీ

అందుబాటులో ఉంది, 50% వరకు

కస్టమైజ్ చేయదగిన యాడ్-ఆన్‌లు

మోటార్ ప్రొటెక్షన్ కవర్‌తో సహా, 7+ యాడ్-ఆన్‌లు

క్లెయిమ్‌ల ప్రాసెసింగ్

20 నిమిషాల్లోనే డిజిటల్ సౌకర్యం

క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి

98%*

ఆన్-ద-స్పాట్ సెటిల్‌మెంట్

కేరింగ్లీ యువర్స్ యాప్ ద్వారా అందుబాటులో ఉంది

*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

 

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ కోసం ఇరవై నాలుగు గంటల సహాయం

ఎలక్ట్రిక్ కారు కలిగిన లేదా అలాంటి కారు కొనాలనే ఆలోచన కలిగిన వ్యక్తి ఆ కారు కోసం తగిన ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఇన్సూర్ చేయబడిన వాహనానికి మరియు లేదా ఆ వాహనానికి జరిగే ఏదైనా ఊహించని నష్టం లేదా డ్యామేజీ కోసం ఆర్థిక భద్రత అందిస్తుంది.

ఈవి ఇన్సూరెన్స్ పాలసీ క్రింద, బజాజ్ కస్టమర్ల కోసం రూపొందించబడిన మా ప్రత్యేక రోడ్ సైడ్ అసిస్టెన్స్ సర్వీసులకు మీరు యాక్సెస్ పొందవచ్చు:

 

* ఎంపిక చేయబడిన నగరాల్లో 

నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

బజాజ్ అలియంజ్ ఈవి ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తనిఖీ చేయండి


ఎలక్ట్రిక్ కారుతో, పర్యావరణాన్ని పరిరక్షించడంలో మీరు ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేశారు.

అయితే, మీ కారు కోసం బజాజ్ అలియంజ్ ఈవి ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

Financial Protection

ఆర్ధిక కవరేజ్

మీ సరికొత్త ఈవి కోసం ఆర్థిక భద్రతను ఒక కార్ ఇన్సూరెన్స్ పాలసీ నిర్ధారిస్తుంది, ఎందుకంటే మీ కారుకు జరిగే నష్టాలకు ఇన్సూరర్ కవరేజ్ అందిస్తారు.

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ రేట్లు సంభావ్య నష్టం వలన ఏర్పడే ఖర్చుల కంటే గణనీయంగా తక్కువగా ఉండవచ్చు, ఈ విధంగా ఇది మీకు డబ్బు భారీగా ఖర్చు అవకుండా రక్షణను అందిస్తాయి.

Abiding by the Laws

మెరుగైన ఇన్సూరెన్స్ కవరేజీ

బజాజ్ అలియంజ్ అందించే ఇ-కార్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీరు తప్పనిసరి థర్డ్-పార్టీ కవరేజ్‌తో మీ కారును ఇన్సూర్ చేయడానికి మాత్రమే కాకుండా, సమగ్ర పాలసీని కూడా ఎంచుకోవచ్చు.

ఒక సమగ్ర ప్లాన్ మెరుగైన కవరేజ్ కలిగి ఉంటుంది, ఇందులో మీ కారుకు జరిగిన నష్టాలు కూడా కవర్ చేయబడతాయి. అంతేకాకుండా, ఇన్సూరెన్స్ కవరేజీని సరిగ్గా ట్యూన్ చేయడానికి మీకు సహాయపడే యాడ్-ఆన్‌లను ఉపయోగించి సమగ్ర ప్లాన్‌లను మెరుగుపరచవచ్చు.

Peace of Mind

నష్టాలను వేగంగా సరిచేసే సదుపాయం

మీ కారు కోసం ఈవి పాలసీ ద్వారా, మరమ్మతుల కోసం అయ్యే ఖర్చులను త్వరగా పరిష్కరించవచ్చు. మరమ్మతు ఖర్చులు పెరుగుతున్న ఈ సమయంలో, మీ ఈవి పాలసీ మీకు సహాయం చేస్తుంది కాబట్టి, మీరు ఖర్చుల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

మీరు మీ ఖర్చులు పరిగణనలోకి తీసుకున్నప్పుడు, మీకు ఏర్పడే డ్యామేజీల కోసం చెల్లించడం కంటే, మీ ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించడానికే ఎంచుకునే అవకాశం ఉంది.

Peace of Mind

చట్టానికి అనుగుణంగా

ఒక వాహన యజమానిగా, 1988 మోటార్ వాహన చట్టం మేరకు కార్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం ఒక తప్పనిసరి అవసరం అని మీరు తెలుసుకోవాలి.

కాబట్టి, ఒక ఇ-కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం వలన చట్టాన్ని అనుసరించిన వారు అవుతారు.

Peace of Mind

మానసిక శాంతి

చివరగా, మీరు ఒక ఇ-కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ఎంచుకున్నప్పుడు మీరు మానసిక శాంతిని పొందుతారు. మీ కారు కోసం మరమ్మత్తులు మీ ఈవి ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేస్తుంది, అందువల్ల, మీరు ఖర్చుల గురించి ఇకపై ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

బజాజ్ అలియంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్‌లో ఏవి కవర్ చేయబడతాయి మరియు ఏవి కవర్ చేయబడవో తెలుసుకోండి

  • చేర్పులు

  • మినహాయింపులు

ప్రమాదాలు

మీరు ఒక సురక్షితమైన డ్రైవర్‌ అయినప్పటికీ, ప్రమాదాలు మరియు ఢీకొనడాలు లాంటి ఊహించలేని పరిస్థితులు ఎదురుకావచ్చు.

మరింత చదవండి

ప్రమాదాలు

మీరు ఒక సురక్షితమైన డ్రైవర్‌ అయినప్పటికీ, ప్రమాదాలు మరియు ఢీకొనడాలు లాంటి ఊహించలేని పరిస్థితులు ఎదురుకావచ్చు.

ఈవి ఇన్సూరెన్స్ ఉపయోగించడం ద్వారా, మీరు మీ తప్పు కారణంగా, తప్పు లేకపోయినప్పటికీ, జరిగే ప్రమాదాలు మరియు దురదృష్టకర సంఘటనల కారణంగా మీ కారుకి జరిగే నష్టాలనేవి మీ ఇన్సూరెన్స్ కవరేజీ ద్వారా కవర్ చేయబడతాయి.

దొంగతనం

కార్ల సంఖ్యలో పెరుగుదల స్థాయిలోనే , కార్ల దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి.

మరింత చదవండి

దొంగతనం 

కార్ల సంఖ్యలో పెరుగుదల స్థాయిలోనే , కార్ల దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి.

కాబట్టి, మీ గ్యారేజీ నుండి లేదా ఏదైనా ఇతర ప్రదేశం నుండి మీ కారు దొంగతనం జరిగిన దురదృష్టకర సందర్భంలో, ఒక ఈవి పాలసీ దాని కోసం పరిహారం చెల్లిస్తుంది. 

అగ్ని ప్రమాదం

కార్లను నడపడానికి ఉపయోగించే ఇంధనాలు మండే స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి, ప్రమాదం జరిగినప్పుడు అలాంటి కార్లకు అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంది.

మరింత చదవండి

అగ్ని ప్రమాదం 

కార్లను నడపడానికి ఉపయోగించే ఇంధనాలు మండే స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి, ప్రమాదం జరిగినప్పుడు అలాంటి కార్లకు అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంది.

అగ్నిప్రమాదం లాంటి ఈ దురదృష్టకర సంఘటనలు సైతం ఈవి ఇన్సూరెన్స్ ప్లాన్‌. 

ప్రకృతి వైపరీత్యాలు

హరికేన్లు, తుఫాన్లు, భూకంపాలు, వరదలు మరియు మరిన్ని సంఘటనలు మానవ జీవితానికి నష్టం కలిగిస్తాయి.

మరింత చదవండి

ప్రకృతి వైపరీత్యాలు

హరికేన్లు, తుఫాన్లు, భూకంపాలు, వరదలు మరియు మరిన్ని సంఘటనలు మానవ జీవితానికి నష్టం కలిగిస్తాయి.

అయితే, వాటి కారణంగా మీ ఇల్లు మరియు మోటార్ వాహనాలు లాంటి మీ స్వంత వస్తువులు కూడా ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు.

పాలసీ పరిధిలోని చేర్పుల కారణంగా, అలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో మీ కారుకు జరిగే నష్టాలను ఈవి పాలసీ కవర్ చేయగలదు. 

పర్సనల్ యాక్సిడెంట్లు

మీరు సరైన ఇ-కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకున్నప్పుడు, వైకల్యానికి దారితీసే గాయాలు

మరింత చదవండి

పర్సనల్ యాక్సిడెంట్లు

మీరు సరైన ఇ-కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకున్న పక్షంలో, వైకల్యం మరియు మరణానికి దారితీసే గాయాలు కూడా పాలసీ ద్వారా ఇన్సూర్ చేయబడుతాయి.

థర్డ్-పార్టీకి జరిగే నష్టాలు

మీ వల్ల మూడవ వ్యక్తి గాయపడినప్పుడు లేదా మీ కారు కారణంగా వారి ఆస్తికి నష్టం కలిగినప్పుడు

మరింత చదవండి

థర్డ్-పార్టీకి జరిగే నష్టాలు

థర్డ్ పార్టీ వ్యక్తికి మీ వల్ల గాయాలైనప్పుడు లేదా మీ కారు కారణంగా వారి ఆస్తికి నష్టం కలిగినప్పుడు, ఈవి కోసం మీ ఇన్సూరెన్స్లోని థర్డ్-పార్టీ కవరేజీ ద్వారా కవర్ చేయబడుతుంది.

1 ఆఫ్ 1

ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ వైఫల్యం కారణంగా జరిగే నష్టాలు

సాధారణ అరుగుదల మరియు భాగాలకు జరిగే అరుగుదల (తరుగుదల) కారణంగా జరిగే నష్టాలు

చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం

నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కారణంగా జరిగే నష్టాలు

చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం

మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంతో డ్రైవింగ్ చేయడం

1 ఆఫ్ 1

 

మీ ఈవి కార్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీని మెరుగుపరచగల వివిధ యాడ్-ఆన్‌ల కోసం బ్రౌజ్ చేయండి

యాడ్-ఆన్‌లనేవి మీ ఇ-కార్ ఇన్సూరెన్స్తో ఐచ్ఛిక ప్రాతిపదికన అందుబాటులో ఉండే అదనపు ఫీచర్లుగా ఉంటాయి. ఈ అదనపు ఫీచర్‌లనేవి మీ అవసరాల ఆధారంగా మీ పాలసీ కవరేజీని వ్యక్తిగతీకరించడం కోసం దానిని సరైన విధంగా ట్యూన్ చేయడంలో మీకు సహాయపడగలవు.

మీరు ఎంచుకోగల కొన్ని యాడ్-ఆన్‌లు ఇక్కడ ఉన్నాయి –

  • Zero-depreciation cover

    జీరో-డిప్రిసియేషన్ కవర్ : బంపర్-టూ-బంపర్ కవర్ అని కూడా పిలువబడే జీరో-డిప్రిసియేషన్ యాడ్-ఆన్ అనేది డిప్రిసియేషన్‌ను కవర్ చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇది సాధారణ మినహాయింపుల్లో దీనిలో భాగంగా ఉంటుంది, ఒక ఈవి ఇన్సూరెన్స్ పాలసీ.

    జీరో-డిప్రిసియేషన్ యాడ్-ఆన్ ఉపయోగించి మీరు క్లెయిమ్ చేసినప్పుడు, మీ మొత్తం రీయింబర్స్‌మెంట్ నుండి భాగాల మీద తరుగదల మినహాయించబడదు.

  • Motor protector cover

    మోటార్ ప్రొటెక్టర్ కవర్ : ఎలక్ట్రిక్ కార్లలో, మోటార్ అనేది మీ వాహనంలో అత్యంత కీలక భాగంగా ఉంటుంది.

    అయితే, ప్రామాణిక పాలసీ పరిమితుల కారణంగా, దీనికోసం మరమ్మత్తులనేవి ప్రామాణిక ఇ-కార్ ఇన్సూరెన్స్ కవరేజీలో భాగంగా ఉండవు.

    కాబట్టి, అవసరమైన మరమ్మతుల కోసం సహాయపడడంలో మోటార్ ప్రొటెక్టర్ కవర్ మీకు సహాయపడుతుంది.

    అదనంగా, మోటార్‌ కోసం ఏవైనా మరమ్మత్తుల వల్ల మీ జేబుకి భారం కావచ్చు.

    మోటార్ ప్రొటెక్టర్ యాడ్-ఆన్ కవర్‌ ఉపయోగించి, మీ ఈవి మోటార్‌కు చేసే మరమ్మత్తులనేవి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కవర్ చేయబడుతాయి.

  •  24X7 Roadside assistance cover

    24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ : బ్రేక్‌డౌన్‌లనేవి మీ వాహన యాజమాన్య అనుభవంలో ఒక భాగంగా ఉంటాయి. వాటిలో కొన్నింటిని సర్వీస్ గ్యారేజీకి వెళ్లడం ద్వారా సరిచేయవచ్చు. అయితే, కొన్నింటి విషయంలో అది వీలుకాదు.

    మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, మీ ప్రయాణం మధ్యలో మీరు బ్రేక్‌డౌన్ పరిస్థితిని ఎదుర్కొంటే, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్  అనేది దాని పరిష్కారం కోసం ఒక అనువైన యాడ్-ఆన్‌గా ఉంటుంది.

    ఇంజన్ ఆగిపోవడం లేదా టైర్ పంక్చర్ అయిన స్థితుల్లో, ఆ ఇబ్బంది నుండి మిమ్మల్ని బయటపడేసే సహాయం మీకు ఒక కాల్ లేదా క్లిక్ దూరంలో ఉంటుంది.

  • Lock and Key replacement cover

    లాక్ మరియు కీ రీప్లేస్‌మెంట్ కవర్: తరచుగా మనం పోగొట్టుకునే వస్తువుల్లో కారు తాళాలు కూడా భాగమే. మీ ఇంట్లోనే ఎక్కడో మర్చిపోవడం మొదలుకొని, కెఫేలో పోగొట్టుకోవడం వరకు ఎప్పుడైనా ఆ పరిస్థితి ఎదురు కావచ్చు.

    అయితే, మీ కారు తాళం మార్చాల్సి వస్తే, కేవలం తాళం మాత్రమే కాకుండా, మీ కారులోని పూర్తి లాకింగ్ వ్యవస్థను మార్చాల్సి వస్తుంది.

    అంతేకాకుండా, ఆధునిక కార్లలో ఎలక్ట్రానిక్ చిప్స్ పొందుపరచబడి ఉంటాయి కాబట్టి, ఈ మార్పిడి మరింత ఖరీదుగా ఉంటుంది. లాక్ మరియు కీ రీప్లేస్‌మెంట్ కవర్‌తో, ఈ రీప్లేస్‌మెంట్ ఖర్చులనేవి మీ ఈవి ఇన్సూరెన్స్ పాలసీతో కవర్ చేయబడతాయి కాబట్టి, మీకు గణనీయమైన రిపేరింగ్ ఖర్చులు ఆదా అవుతుంది.

  • Consumables add-on cover

    కన్జ్యూమబుల్స్ యాడ్-ఆన్ కవర్ : ఒక ఈవి కార్ కొనుగోలు చేయడం మరియు దానిని నిర్వహించడం అనేవి రెండు వేర్వేరు అంశాలుగా ఉంటాయి. కారు కొనడం సరళంగానే అనిపించవచ్చు కానీ, దాని నిర్వహణ కొనసాగించడం సవాలుగా ఉంటుంది - ఆ సవాలు అనేది ఆర్థికంగా కాకపోయినప్పటికీ, విడిభాగాలు మరియు కాంపోనెంట్‌లు మార్చడంలో ఆ పరిస్థితి ఎదురుకావచ్చు.

    ఈ ప్రాసెస్‌లో, కొన్నిసార్లు, ఈ రీప్లేస్‌మెంట్‌లు నిర్లక్ష్యం చేయబడితే, అది మీ కారు మొత్తం పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు.

    కాబట్టి, అవసరమైన ద్రవాలు మరియు భాగాలను సకాలంలో భర్తీ చేయడం అవసరం.

    మీ ఎలక్ట్రిక్ కార్ పాలసీ వివిధ ఖర్చులను కవర్ చేస్తుంది కాబట్టి, కన్జ్యూమబుల్స్ యాడ్-ఆన్ కవర్తో, ఈ రీప్లేస్‌మెంట్‌లనేవి ఆందోళన లేని అనుభవం అందిస్తాయి.

  • Personal baggage cover

    పర్సనల్ బ్యాగేజ్ కవర్: ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు మరియు ఇతర విలువైన వస్తువులు లాంటివి మీ కారులో ఉంచినప్పుడు దొంగతనం మరియు దోపిడీ వాటికి రక్షణ ఉండదు.

    పర్సనల్ బ్యాగేజ్ కవర్‌తో, మీ వ్యక్తిగత వస్తువులు దొంగతనానికి గురైనప్పుడు ఏర్పడే ఆర్థిక నష్టం అనేది ఈ యాడ్-ఆన్ క్రింద కవర్ చేయబడుతుంది.

  • Conveyance benefit add-on

    రవాణా ప్రయోజనం యాడ్-ఆన్ : బజాజ్ అలియంజ్ వారి ఈవి కార్ ఇన్సూరెన్స్ అనేది మరొక ఉపయోగకరమైన యాడ్-ఆన్. యాక్సిడెంట్ తర్వాత మీ కారు సర్వీస్ చేయబడుతున్న సమయం కోసం ఇన్సూరర్ మీకు చెల్లింపు చేస్తారు.

    కాబట్టి, మీ కారు మళ్లీ సిద్ధమయ్యే వరకు మీ ప్రయాణం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

 

మీ ఈవి పాలసీ ప్రీమియంను ప్రభావితం చేసే పారామితుల గురించి మీరు తెలుసుకోండి

ఈవి కార్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ విభిన్నంగా ఉండవచ్చు. అందువల్ల, అదే కారును కలిగి ఉన్నప్పటికీ, మీరు మరియు మీ స్నేహితుడు వేర్వేరు ప్రీమియం మొత్తాలను కలిగి ఉండవచ్చు.
ప్రీమియం లెక్కింపును అనేక అంశాలు పరస్పరంగా ప్రభావితం చేస్తాయి.

మీ ప్రీమియంను ప్రభావితం చేసే దీని పారామితులు కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి ఈవి ఇన్సూరెన్స్ పాలసీ –

1. కార్ రకం :
మీ ఈవి కారు మోడల్ మరియు తయారీదారు అనే అంశాలు దాని ప్రీమియంతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. విభిన్న తయారీదారులు అందించే వివిధ మోడల్స్‌కు సంబంధించిన క్లెయిమ్ నిష్పత్తుల కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రత్యేక నివేదికను నిర్వహిస్తాయి.
కాబట్టి, మీ కారు కోసం ప్రమాద తీవ్రతను నిర్ణయించడంలో ఇన్సూరెన్స్ సంస్థలకు ఒక గణాత్మక విధానం ఉంటుంది. ప్రమాదం మీద ఆధారపడి, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియంను నిర్ణయిస్తుంది.
ఇంకా, మిడ్-రేంజ్ మరియు లో-ఎండ్ వాహనాలతో పోలిస్తే, లగ్జరీ కార్లు మరియు హై-ఎండ్ మోడల్‌ల కోసం అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

2. ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ :
పూర్తి నష్టం లేదా సంపూర్ణ నష్టం సందర్భంలో, ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారంగా చెల్లించే గరిష్ట మొత్తాన్నే ఇన్సూర్డ్ డిక్లేర్ విలువ లేదా ఐడివి అంటారు.
కాబట్టి, మీ కారు ఐడివి అనేది ఇన్సూరర్ ద్వారా చెల్లించబడే గరిష్ట పరిహారంగా ఉంటుంది.
ఐడివి అనేది ఇన్సూరర్ అండర్‌రైట్ చేసే గరిష్ట మొత్తం కాబట్టి, ఎలక్ట్రిక్ కార్ పాలసీ ప్రీమియంతో ఇది నేరుగా సంబంధం కలిగి ఉంటుంది.
కాబట్టి, ఐడివి ఎంత ఎక్కువగా ఉంటే, ఫలిత ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది మరియు ఇది విపర్యంగా కూడా ఉంటుంది.

3. భౌగోళిక జోన్ :
మీ ఈవి కారు రిజిస్ట్రేషన్ లొకేషన్ అనేది మీ ఎలక్ట్రిక్ కార్ పాలసీ ప్రీమియం మీద ప్రభావం చూపుతుంది.
దీనికి కారణం, భారతదేశాన్ని రెండు జోన్‌లుగా విభజించారు - అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ మరియు పూణే నగరాలు జోన్ ఏలో ఉండగా, మిగిలిన భారతదేశపు నగరాలు జోన్ బిలో ఉన్నాయి.
బాగా రద్దీగా ఉండే మెట్రో ప్రాంతాల్లో వాహనాలకు అధిక నష్టం జరిగే అవకాశం ఉన్న కారణంగా, అండర్‌రైట్ చేసిన రిస్క్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా, ప్రీమియంలు పెరుగుతాయి.

4. యాడ్-ఆన్ కవర్లు :
పైన పేర్కొన్న విధంగా, యాడ్-ఆన్ కవర్లు అనేవి ఐచ్ఛిక రైడర్లుగా ఉంటాయి. ఇవి మీ ఎలక్ట్రిక్ కార్ పాలసీకి సంబంధించిన కవరేజ్. ప్రామాణిక పాలసీ పరిధిలో చేర్చబడని అంశాలను ఇవి కవర్ చేస్తాయి కాబట్టి, ఇవి ప్రీమియంను ప్రభావితం చేస్తాయి.
మీరు ఎన్ని యాడ్-ఆన్‌లు ఎంచుకున్నారనే దాని మీద ఆధారపడి, మీ ప్రీమియం ప్రభావితమవుతుంది.    

5. నో-క్లెయిమ్ బోనస్ :
గత పాలసీ కాల వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్ చేయనందుకు ఇన్సూరెన్స్ కంపెనీ అందించే రాయితీనే నో-క్లెయిమ్ బోనస్ లేదా ఎన్‌సిబి అంటారు.
ప్రీమియంలో మార్క్‌డౌన్ కోసం, ఎన్‌సిబి అనేది గత పాలసీ వ్యవధిని ప్రాతిపదికగా లెక్కించబడుతుంది కాబట్టి, రెండవ సంవత్సరం ప్రీమియం ప్రారంభమయ్యే సమయం నుండి అది అందుబాటులో ఉంటుంది.
ఎన్‌సిబి ప్రయోజనంతో, స్థిరమైన క్లెయిమ్-రహిత పాలసీ రెన్యూవల్స్ ఆధారంగా మీరు మీ మొత్తం ఇన్సూరెన్స్ అవుట్ ఫ్లోను 20% నుండి 50% వరకు తగ్గించుకోవచ్చు.

6. వాలంటరీ ఎక్సెస్ :
ప్రతి ఈవి ఇన్సూరెన్స్ పాలసీ కోసం ప్రామాణిక లేదా తప్పనిసరి మినహాయింపుగా పిలువబడే ఒక తప్పనిసరి మినహాయింపు మొత్తం ఉంటుంది.
ప్రతి క్లెయిమ్ సమయంలో, ఈ మినహాయించదగిన మొత్తాన్ని పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, స్వచ్ఛంద అదనం లేదా మినహాయింపు అనేది ప్రామాణిక మినహాయింపు కంటే ఎక్కువైనప్పుడు, పాలసీదారుగా, మీరు ఆ మొత్తం చెల్లించాలి.
ఒక పాలసీదారు ఎంచుకున్న స్వచ్ఛంద మొత్తం ఆధారంగా, ప్రీమియంలు లెక్కించే సమయంలో రాయితీ అందుబాటులో ఉంటుంది.

7. సెక్యూరిటీ యాక్సెసరీస్ :
కారు భద్రతా స్థాయిలను మెరుగుపరచే సెక్యూరిటీ ఫీచర్‌లనేవి ఎలక్ట్రిక్ కార్ పాలసీ ప్రీమియంను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి.
ఈ ఫీచర్‌ల కారణంగా, మొత్తంమీది రిస్క్‌ ప్రభావం తగ్గుతుంది కాబట్టి, ప్రీమియంను తగ్గించడంలో అవి దోహదపడుతారు.

8. ప్రత్యేక రాయితీలు :
పైన పేర్కొన్న కారణాలే కాకుండా, కొన్ని ప్రత్యేక రాయితీల కారణంగా కూడా మీ ఎలక్ట్రిక్ కార్ పాలసీ ప్రీమియం తగ్గవచ్చు. మీ కారుకి యాంటీ-థెఫ్ట్ పరికరాలు అమర్చడం మరియు స్వచ్ఛంద అదనపు మొత్తం ఎంచుకోవడమనే ఒక గుర్తింపు పొందిన ఆటోమొబైల్ అసోసియేషన్‌తో సంబంధం అనే రూపంలో ఈ సౌలభ్యం లభిస్తుంది.

బజాజ్ అలియంజ్ నుండి మీ ఈవి కార్ కోసం ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవడానికి కారణాలు

బజాజ్ అలియంజ్ ఈవి కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఆనందం కలిగించే క్రింది ప్రయోజనాలు అందిస్తుంది:

ఆర్థిక భద్రత
మీ ఈవి కోసం మెరుగుపరచబడిన ఇన్సూరెన్స్ కవరేజీలు మరియు సేవలు
వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్
చట్టానికి అనుగుణంగా
మనశ్శాంతి
ప్రత్యేకమైన ఈవి 24x7 సహాయం
ఈవి హెల్ప్‌లైన్
ఆన్-సైట్ ఛార్జింగ్

మోటార్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

 

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు సమయంలో ఈ 3 అంశాలను పరిగణనలోకి తీసుకోండి

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు అనేది ఒక ఆలోచనాత్మక ప్రక్రియగా ఉండాలి కాబట్టి, క్రింది పరిగణనలు మీకు తగిన ప్లాన్‌ ఎంచుకోవడంలో సహాయపడుతాయి.

1. వాహనం ధర
ఏదైనా వాహనం కోసం మరమ్మత్తు ఖర్చులనేవి దాని ధరకు అనులోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి, ఒక ఎలక్ట్రిక్ కార్ పాలసీ ఎంచుకునేటప్పుడు, మీరు మీ ఐడివిని జాగ్రత్తగా సెట్ చేయాలి. ఎందుకంటే, అవసరమైన మరమ్మత్తు ఖర్చులకు తగినంత పరిహారాన్ని ఇదే నిర్ధారిస్తుంది.

2. ఎలక్ట్రిక్ వాహనం ప్రత్యేక ఫీచర్లు
సంప్రదాయక ఇంటర్నల్ కంబూస్టన్ ఇంజిన్ కారుతో పోలిస్తే, ఎలక్ట్రిక్ కార్లు భిన్నంగా పనిచేస్తాయి. కాబట్టి, మీ ఈవి కారులోని ప్రత్యేక ఫీచర్ల కవరేజీ కోసం ఒక పరిగణన అవసరం. బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌లు మరియు మరమ్మత్తులనేవి ఒక కీలకమైన అంశంగా ఉంటాయి కాబట్టి, వాటి కవరేజీ కోసం మీరు మీ పాలసీలో తప్పనిసరిగా చెక్ చేయాలి.

3. అందించబడే యాడ్-ఆన్ ఫీచర్‌లు 
మీ పాలసీలో అందించబడే యాడ్-ఆన్ ఫీచర్‌లనేవి మీ పాలసీ పరిధిని గణనీయంగా పెంచుతాయి. మొత్తం ప్రీమియం మీద అవి ప్రభావం చూపుతాయి కాబట్టి, ధరతో పాటు కవరేజీ మీద వాటి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. 

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అవసరమైన ఈ డాక్యుమెంట్‌ల జాబితాను సేవ్ చేయండి

ఈ డిజిటల్ యుగంలో, మీ ఎలక్ట్రిక్ కార్ పాలసీని సంప్రదాయక ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
మీరు డిజిటల్ మార్గంలో తీసుకోవడానికి ఎంచుకున్నప్పుడు, అవాంతరాలు లేని కొనుగోలు ప్రక్రియ కోసం కొన్ని సాఫ్ట్ డాక్యుమెంట్‌ల కాపీలను మీరు అందుబాటులో ఉంచుకోవాలి –

  • ✓ మీ కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • ✓చెల్లుబాటు అయ్యే డ్రైవర్ లైసెన్స్
  • ✓వ్యక్తిగత గుర్తింపు వివరాలు
  • ✓మీ కారు పన్ను రసీదులు
  • ✓బ్యాంక్ వివరాలు

ఇన్సూరెన్స్ కంపెనీలను బట్టి, అవసరమైన ఈ డాక్యుమెంట్‌ల జాబితా భిన్నంగా ఉండవచ్చు కాబట్టి, పాలసీదారు గుర్తింపు వివరాలతో పాటు వాహనం గుర్తింపు మరియు రిజిస్ట్రేషన్ వివరాలు కూడా అవసరం. 

 

 

మీ ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనండి

బజాజ్ అలియంజ్‌తో, మీరు మీ ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఐదు సులభమైన దశల్లో పొందవచ్చు:

1. బజాజ్ అలియంజ్ కార్ ఇన్సూరెన్స్ పేజీని సందర్శించండి.

2. తయారీదారు, కారు మోడల్ మరియు తయారీ మరియు రిజిస్ట్రేషన్ లొకేషన్ వంటి మీ కారు వివరాలు పేర్కొనండి.

3. మీ అవసరాలకు సరిపోయే పాలసీని ఎంచుకోండి.

4. మీరు మీ పాలసీని రెన్యూవల్ చేస్తున్నట్లయితే, అప్పటివరకు చేసిన ఏవైనా క్లెయిమ్‌లు మరియు అందుబాటులోని నో-క్లెయిమ్ బోనస్ వివరాలతో పాటు మీ ఈవి కోసం మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ వివరాలు పేర్కొనండి.

5. మీ కోట్ జనరేట్ చేయబడిన తర్వాత, మీరు ఎంచుకున్న పాలసీ రకం ఆధారంగా మీరు యాడ్-ఆన్ ఎంచుకోవచ్చు. ఈ దశలో, మీరు మీ కారు ఐడివి కూడా మార్చవచ్చు మరియు ప్రీమియం మీద మొత్తం ప్రభావాన్ని తనిఖీ చేయవచ్చు.

6. చివరగా, మీ పాలసీలోని ఎంపికల ఆధారంగా చెల్లింపు చేయండి మరియు సెకన్లలోనే మీ ఇన్‌బాక్స్‌లో పాలసీని అందుకోండి.

ఇప్పటికే ఉన్న వాటితో పాటు కొన్ని ఇతర సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి

మోటార్ ఇన్సూరెన్స్‌ను పొందడానికి సమయం: 3 నిమిషాల కంటే తక్కువ
ప్రత్యేకంగా రూపొందించబడిన యాడ్-ఆన్‌లు: యాడ్ ఆన్‌ల జాబితాతో రక్షణను మరింత పెంచుకోండి
నో క్లెయిమ్ బోనస్ ట్రాన్స్‌ఫర్: 50% వరకు
సెటిల్ చేయబడిన క్లెయిమ్లు నిష్పత్తి: 98%
నగదురహిత సర్వీసులు: 7,200+ నెట్‌వర్క్ గ్యారేజీలలో
క్లెయిమ్స్ ప్రాసెస్: డిజిటల్ - 20 నిమిషాల్లో*
ఆన్-ది-స్పాట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్: 'కేరింగ్లీ యువర్స్' యాప్‌తో

మీ చిరునవ్వును సురక్షితం చేసుకోండి, ఎలక్ట్రిక్ వాహనం నడపండి, నేడే మీ ప్రయాణాన్ని ఇన్సూర్ చేయండి

 

మీ ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేయండి

మీకు మీ ఎలక్ట్రిక్ కార్ పాలసీ వివరాలు గుర్తు లేకపోయినా, లేదా మీ పాలసీ డాక్యుమెంట్‌లు పోగొట్టుకుంటే, మీ ఎలక్ట్రిక్ కార్ కోసం మీ కార్ ఇన్సూరెన్స్ స్థితిని తనిఖీ చేయడానికి ఆన్‌లైన్‌లో సులభమైన మార్గం ఉంది.

మీ పాలసీతో వ్యవహారం నిర్వహించడానికి ఆన్‌లైన్ విధానం సమర్థవంతమైనది మరియు వేగవంతమైనది.

మీ పాలసీ స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవడానికి ఐదు దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి –

1. అధికారిక IIB వెబ్-పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.

2. అవసరమైన వివరాలను వెబ్ పోర్టల్‌లో నమోదు చేయండి. ఆ వివరాల్లో పేరు, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, చిరునామా, కారు రిజిస్ట్రేషన్ నంబర్ మొదలైనవి ఉంటాయి.

3. మీరు అన్ని వివరాలు పూరించి, వాటిని ధృవీకరించిన తర్వాత, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.

4. మీ వివరాలతో సంబంధం కలిగిన పాలసీ వివరాలు కనిపిస్తాయి.

5. అంటే, మీ పాలసీ ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉంది.

ఒకవేళ, అది యాక్టివ్‌గా లేకపోతే, ఫలితాలనేవి గత పాలసీ వివరాలు చూపుతాయి.

6. ఈ పద్ధతిని అనుసరించి మీకు అవసరమైన ఫలితాలు లభించకపోతే, మీరు మీ కారు ఇంజిన్ మరియు ఛాసిస్ నంబర్ ఉపయోగించి మళ్ళీ శోధించవచ్చు.

 

మీ ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి


ఎలక్ట్రిక్ కార్ల కోసం అన్ని కార్ ఇన్సూరెన్స్ పాలసీలు పరిమిత వ్యవధి కోసం మాత్రమే చెల్లుతాయి. కాబట్టి, మీరు దాని గడువు తేదీని గురించి తెలుసుకోవాలి.

గడువు ముగిసిన పాలసీ అనేది మిమ్మల్ని ప్రమాదాలు మరియు విపత్తుల్లో ఇబ్బందికి గురిచేయడంతో పాటు నిబంధనలకు సంబంధించిన చిక్కుల్లోకి నెడుతుంది.

ఆన్‌లైన్ రెన్యూవల్ సౌకర్యంతో, మీ పాలసీ దాని కవరేజీలో ఎలాంటి ఆటంకం లేకుండా సకాలంలో రెన్యూవల్ చేయబడిందని మీరు నిర్ధారించుకోవచ్చు.

మీరు మీ ఎలక్ట్రిక్ వాహన పాలసీని ఆన్‌లైన్‌లో ఎలా రెన్యూవల్ చేసుకోవచ్చో ఇక్కడ ఇవ్వబడింది –

దశ 1:     బజాజ్ అలియంజ్ కార్ ఇన్సూరెన్స్ పేజీని సందర్శించండి మరియు రెన్యూవల్ విభాగం ఎంచుకోండి.

దశ 2:     ఆన్‌లైన్ రెన్యూవల్స్ కోసం, మీరు మీ ప్రస్తుత పాలసీ వివరాలు అందించాలి, అందులో పాలసీ నంబర్ ఉండాలి.

ఇది ఇన్సూరర్‌కు మీ ఈవి కారుకు సంబంధించి ఇప్పటికే ఉన్న ఏదైనా ఇన్సూరెన్స్‌ను కవర్ చేయడానికి సహాయపడుతుంది.

దశ 3:     పాలసీని రెన్యూవల్ చేసేటప్పుడు, వివరాలన్నీ తాజాగా ఉన్నాయని నిర్ధారించుకోవడం కోసం వీరు వాటిని సవరించవచ్చు.

ఈ దశలో, పాలసీ రకం ఎంచుకోండి మరియు దాని కవరేజీ కోసం యాడ్-ఆన్ కవర్లు జోడించడం లాంటి అవసరమైన సవరణలు చేయండి.

దశ 4:     పాలసీ వివరాలను ఫైనలైజ్ చేసిన తర్వాత, చెల్లింపును పూర్తి చేయండి. పాలసీ ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేయబడినప్పుడు, మీ చెల్లింపు విజయవంతమైన తర్వాత నుండి కవరేజీ ప్రారంభమవుతుంది మరియు మీరు మీ మెయిల్‌ బాక్స్‌లో పాలసీ డాక్యుమెంట్‌ను అందుకోవచ్చు.

 

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు సమయంలో ఈ 3 అంశాలను పరిగణనలోకి తీసుకోండి

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు అనేది ఒక ఆలోచనాత్మక ప్రక్రియగా ఉండాలి కాబట్టి, క్రింది పరిగణనలు మీకు తగిన ప్లాన్‌ ఎంచుకోవడంలో సహాయపడుతాయి.

1. వాహనం ధర
ఏదైనా వాహనం కోసం మరమ్మత్తు ఖర్చులనేవి దాని ధరకు అనులోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి, ఒక ఎలక్ట్రిక్ కార్ పాలసీ ఎంచుకునేటప్పుడు, మీరు మీ ఐడివిని జాగ్రత్తగా సెట్ చేయాలి. ఎందుకంటే, అవసరమైన మరమ్మత్తు ఖర్చులకు తగినంత పరిహారాన్ని ఇదే నిర్ధారిస్తుంది.

2. ఎలక్ట్రిక్ వాహనం ప్రత్యేక ఫీచర్లు
సంప్రదాయక ఇంటర్నల్ కంబూస్టన్ ఇంజిన్ కారుతో పోలిస్తే, ఎలక్ట్రిక్ కార్లు భిన్నంగా పనిచేస్తాయి. కాబట్టి, మీ ఈవి కారులోని ప్రత్యేక ఫీచర్ల కవరేజీ కోసం ఒక పరిగణన అవసరం. బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌లు మరియు మరమ్మత్తులనేవి ఒక కీలకమైన అంశంగా ఉంటాయి కాబట్టి, వాటి కవరేజీ కోసం మీరు మీ పాలసీలో తప్పనిసరిగా చెక్ చేయాలి.

3. అందించబడే యాడ్-ఆన్ ఫీచర్‌లు 
మీ పాలసీలో అందించబడే యాడ్-ఆన్ ఫీచర్‌లనేవి మీ పాలసీ పరిధిని గణనీయంగా పెంచుతాయి. మొత్తం ప్రీమియం మీద అవి ప్రభావం చూపుతాయి కాబట్టి, ధరతో పాటు కవరేజీ మీద వాటి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. 

మీ ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద సులభంగా క్లెయిమ్ ఫైల్ చేయండి

మీరు ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసినప్పుడు, అది చట్టపరమైన సమ్మతి కోసమే కాకుండా, ఊహించని నష్టం లేదా డ్యామేజీలు జరిగిన సమయాల్లో ఆర్థిక కవరేజీ కూడా అందిస్తుంది.

ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు, క్రింద పేర్కొన్న దశలను మీరు అనుసరించాలి –

✓ ముందుగా మీ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయండి.

డ్యామేజీల కోసం క్లెయిమ్ చేయడంలో ఇదే మొదటి దశ.

✓ మీ కారుకు జరిగిన డ్యామేజీలకు సాక్ష్యంగా ఉండే చిత్రాలను క్లిక్ చేయండి.

ఇది ఇన్సూరర్‌కు సమర్పించే రుజువుగా పనిచేస్తుంది.

✓ క్లెయిమ్ ఫైల్ చేసే సమయంలో, క్లెయిమ్ ఫారమ్‌తో సహా అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లను మీరు సిద్ధంగా ఉంచుకోవాలి.

✓ నష్టాల తీవ్రతను నిర్ధారించడం కోసం ఇన్సూరెన్స్ సర్వేయర్ తనిఖీ పూర్తి చేసిన తర్వాత, మీ ఎలక్ట్రిక్ కారును రిపేరు చేయవచ్చు.

✓ చివరగా, పరిహారం అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంపిణీ చేయబడుతుంది.

పరిహారం రకాన్ని బట్టి, ఎలక్ట్రిక్ కార్ల కోసం కార్ ఇన్సూరెన్స్‌ను క్యాష్‌లెస్ ప్లాన్‌లు మరియు రీయింబర్స్‌మెంట్ ప్లాన్‌లుగా విభజించవచ్చు.

క్యాష్‌లెస్ ప్లాన్‌ల విషయంలో మినహాయించదగిన మొత్తం తగ్గించిన తర్వాత, రిపేర్ కోసం తాను చెల్లించాల్సిన మొత్తాన్ని సర్వీస్ గ్యారేజీకి ఇన్సూరర్ నేరుగా చెల్లిస్తారు.

మీ ఎలక్ట్రిక్ కారుని నెట్‌వర్క్ గ్యారేజీల్లో ఒక దానిలోనే రిపేర్ చేయాలని గుర్తుంచుకోండి. రీయింబర్స్‌మెంట్ ప్లాన్‌లనేవి పరిహారానికి సంప్రదాయక మార్గాలుగా ఉంటాయి. ఇందులో, మరమ్మత్తు ఖర్చుల కోసం పాలసీదారునికి ఇన్సూరెన్స్ కంపెనీ రీయింబర్స్‌మెంట్ చేస్తుంది.

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ ఉపయోగించండి

ఈవి ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ అనేది అదనపు సదుపాయంగా అందించబడే ఒక నిఫ్టీ సాధనం. ఇందులో, మీరు మీ ప్లాన్‌ ఎంపిక మరియు దానికి వివిధ యాడ్-ఆన్‌లు జోడించినప్పుడు మీ పాలసీ ప్రీమియం ఎంత ఉంటుందో అంచనా వేయవచ్చు.

ఈ సౌకర్యం అనేది సాధారణంగా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

సరైన ఐడివి సెట్ చేయడమనేది తగిన యాడ్-ఆన్‌లు ఎంచుకోవడం మరియు మీ బడ్జెట్‌కి ప్రీమియం సరిపోతుందని నిర్ధారించడం అనేవి దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల్లో కొన్నిగా ఉంటాయి.

అదనంగా, వివిధ ప్లాన్‌లను సరిపోల్చడానికి మరియు మీ అవసరాలకు అనుగుణంగా ఒకదాన్ని ఎంచుకోవడం కోసం మీరు ఈవి ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ కూడా ఉపయోగించవచ్చు.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

 4.67

(18,050 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

శిబ ప్రసాద్ మొహంటీ

వాహనం మా జోనల్ మేనేజర్ సర్ ద్వారా ఉపయోగించబడింది. అతి తక్కువ కాలంలోనే వాహనాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా చేయడంలో మీరు ప్రారంభించిన సకాలంలో మరియు వేగవంతమైన చర్యను మేము ప్రశంసిస్తున్నాము. ఈ చర్యను అందరూ ప్రశంసించారు. 

రాహుల్

“ఎంచుకోవడానికి ఎంపికల శ్రేణి.”

ఒక పర్ఫెక్షనిస్ట్ అయి ఉండటం వలన, నేను అన్నింటిలోనూ ఉత్తమమైనదాన్ని ఇష్టపడతాను. నేను నా కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎయిర్‌టైట్‍గా కూడా ఉండాలని కోరుకున్నాను. యాడ్-ఆన్‍లు మరియు సమగ్ర ప్లాన్లతో,...

మీరా

“ఒటిఎస్ క్లెయిమ్‌లు ఒక వరం లాంటివి.”

ఒక ప్రమాదం జరిగినప్పుడు నేను మార్గమధ్యంలో ఉన్నాను. డబ్బు తక్కువగా ఉండటంతో, నా నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేయకుండా నా కారు సర్వీస్ చేయించుకోవడానికి నేను మార్గాల కోసం చూస్తున్నాను...

ఈ తరచుగా అడగబడే ప్రశ్నలతో ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్‌ గురించి మెరుగ్గా అర్థం చేసుకోండి

  భారతదేశంలో ఎలక్ట్రిక్ కారు కోసం కారు ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అవసరమా?

మీరు ఒక కారు కొంటే, అది ఎలక్ట్రిక్ లేదా ఇతరత్రా అయినప్పటికీ, దానికోసం ఒక ఇన్సూరెన్స్ కవర్ తప్పకుండా ఉండాలి. 1988 నాటి మోటార్ వాహనాల చట్టం ప్రకారం, మీరు మీ వాహనం కోసం కనీసం థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ కలిగి ఉండాలి.

మీకు లేదా మీ వాహనానికి ఏదైనా నష్టం ఎదురైనప్పుడు ఆర్థికంగా మీకు రక్షణ అవసరం కాబట్టి, మీరు ఒక సమగ్ర కవర్ పొందడం ఉత్తమం.

మీ ఎలక్ట్రిక్ కారు కోసం మీరు ఏ రకమైన ఇన్సూరెన్స్‌ ఎంచుకోవాలి?

మీ ఎలక్ట్రిక్ వాహనం కోసం సాధ్యమైనంత గరిష్ట కవరేజీ పొందడం ఉత్తమం.

మోటారు వాహనాల చట్టం ప్రకారం, కనీసం థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజీ కలిగి ఉండడం అవసరం. అయితే, ఇది థర్డ్ పార్టీకి జరిగే నష్టాల నుండి మాత్రమే మీకు ఆర్థిక రక్షణ అందిస్తుంది.

మీరు విస్తృత కవరేజీ కోరుకుంటే, ఒక సమగ్ర ప్లాన్‌ ఎంచుకోవాలి.

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఏ పద్ధతిలో లెక్కిస్తారు?

మీ ఎలక్ట్రిక్ కారు కోసం కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించేటప్పుడు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

మీ కారు తయారీదారు, దాని మోడల్, దాని వయస్సు మరియు ఇంజిన్ సామర్థ్యం లాంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి.

పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల ఇన్సూరెన్స్ కంటే, ఎలక్ట్రిక్ వాహనం ఇన్సూరెన్స్ ఖరీదు ఎక్కువగా ఉంటుందా?

ఒక ఎలక్ట్రిక్ కార్ కోసం మీ కార్ ఇన్సూరెన్స్ ధర అనేది మీ వాహనం ధర మీద ఆధారపడి ఉండవచ్చు. కొన్ని ఎలక్ట్రిక్ కార్ల ధరలు వాటి పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లతో పోలిస్తే ఎక్కువగా ఉండవచ్చు.

అంతేకాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల భాగాలు కూడా ఎక్కువ ధర కలిగి ఉంటాయి. కాబట్టి, ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ ఖర్చు కూడా సాపేక్షంగా ఎక్కువగానే ఉంటుంది

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ అనేది దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ప్రకృతి వైపరీత్యాలకు కవర్ అందిస్తుందా?

థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ అనేది ఈ అవకాశాల నుండి మీ వాహనానికి కవర్ అందించదు. అయితే, ఒక సమగ్ర ప్లాన్ ద్వారా మీకు వీటి నుండి రక్షణ లభించగలదు.

పాలసీ కొనుగోలు చేసేటప్పుడు, ప్లాన్ కవరేజీ మరియు చేర్పుల కోసం తనిఖీ చేయండి. మీకు దేని నుండి రక్షణ లభిస్తుందో మీరు అర్థం చేసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.

ఒకరు ఎలాంటి యాడ్-ఆన్‌లు ఎంచుకోవాలి?

మీరు సమగ్ర ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ కోసం ఎంచుకుంటే, మీకోసం అనేక యాడ్-ఆన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

జీరో డిప్రిసియేషన్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ మరియు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లాంటివి వీటిలో కొన్నిగా చెప్పవచ్చు. వీటిలో ప్రతి ఒక్కటి వివిధ మార్గాల్లో మీకు రక్షణ కల్పించడంలో మీకు సహాయపడుతుంది.

మీ అవసరాల ఆధారంగా మరియు మీకు ఏది సాధ్యమవుతుందనే దాని ఆధారంగా ఒక కవర్‌ ఎంచుకోండి.

ఎలక్ట్రిక్ వాహనాల కోసం సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ తప్పనిసరిగా ఎంచుకోవాలా?

మోటార్ వాహన నిబంధనల మేరకు మీరు మీ ఎలక్ట్రిక్ కార్ల కోసం సమగ్ర కార్ ఇన్సూరెన్స్ తీసుకోవలసిన అవసరం లేదు. థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్‌ను మాత్రమే మీరు తప్పనిసరిగా ఎంచుకోవాలి.

అయితే, ఒక సమగ్ర కవర్ ఎంచుకోవడం ద్వారా, వివిధ అవకాశాల నుండి మీరు అదనపు కవరేజీ పొందవచ్చు.

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ మీద ఎలా ఆదా చేయాలి?

గడువు ముగియడానికి ముందే మీరు మీ ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేసుకోవాలి. మీరు గతంలో మీ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయకపోతే, మీరు మెరుగైన ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ రేట్లు పొందవచ్చు.

ఇది మీకు 'నో-క్లెయిమ్ బోనస్' అందించగలదు’.

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్‌లో టోయింగ్ కవర్ చేయబడుతుందా?

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అందించే సమగ్ర కవర్ మీకు ఉంటే, మీ కారును సమీప సర్వీస్ సెంటర్‌కు తరలించడమనేది మీ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడుతుంది.

అయితే, ఇది మీ ఇన్సూరెన్స్ పాలసీ చేర్పులకు కూడా లోబడి ఉంటుంది.

ఈవి ఇన్సూరెన్స్ క్రింద సాధారణంగా ఏవి కవర్ చేయబడుతాయి?

మీరు కారు ఈవి ఇన్సూరెన్స్ కోసం ఒక సమగ్ర ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసినప్పుడు, అది క్రింది వాటి నుండి మిమ్మల్ని కవర్ చేయగలదు:

-          ప్రమాదాలు

-          ప్రకృతి వైపరీత్యాలు

-          అగ్ని ప్రమాదం

-          దొంగతనం

థర్డ్-పార్టీ కవరేజ్ అనేది సమగ్ర ఈవి కార్ల కోసం ఇన్సూరెన్స్లో ఒక భాగంగా ఉంటుంది మరియు ఇది ఒక స్టాండ్‌అలోన్‌గా కూడా అందుబాటులో ఉంటుంది. థర్డ్ పార్టీలకు జరిగిన నష్టం నుండి ఇది మీకు కవర్ అందిస్తుంది.

ఈవి ఇన్సూరెన్స్ కింద బ్యాటరీలు కవర్ చేయబడతాయా?

సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీలో భాగంగా, మీరు బ్యాటరీ రీప్లేస్‌మెంట్ కవర్‌ ఎంచుకుంటే, ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చు కూడా కవర్ కాగలదు.

అదనపు కవర్ ఎంచుకోవడమనేది మీ ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్ రేట్లు మీద కొద్దిమేర ప్రభావం చూపవచ్చు.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి