Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

భారతదేశంలో పెట్ డాగ్ ఇన్సూరెన్స్

మీ పెంపుడు కుక్కకు అత్యుత్తమ సంరక్షణను అందించడం- ఊహించని సమస్యల నుండి రక్షణ కలిపించడం

మీరు ఇష్టపడే వాటిని మేము రక్షిస్తాము
Dog Insurance in India

పెట్ డాగ్ ఇన్సూరెన్స్

దయచేసి పేరును నమోదు చేయండి
/pet-dog-insurance/buy-online.html ఒక కోట్ పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
సబ్మిట్ చేయండి

దీనితో మీకు కలిగే లాభం?

పేర్కొనబడిన వ్యాధులు లేదా గాయాలు అలాగే సర్జరీల చికిత్స ఖర్చులు, అనారోగ్యాలు లేదా ప్రమాదాల కారణంగా జరిగే హాస్పిటలైజేషన్ లేదా మరణాన్ని కవర్ చేస్తుంది

పెంపుడు కుక్క యొక్క దొంగతనం/కోల్పోవడం లేదా తప్పిపోవడం వంటి వాటిని కవర్ చేస్తుంది

క్లెయిమ్‌ రక్షణ కోసం అయ్యే చట్టపరమైన ఖర్చులతో సహా పెంపుడు జంతువు యజమాని యొక్క థర్డ్ పార్టీ లీగల్ లయబిలిటీ పై రక్షణను అందిస్తుంది

బజాజ్ అలియంజ్ పెట్ డాగ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకోవాలి

మనలో చాలా మంది పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల లాగా భావిస్తాము. వాటి గురించి శ్రద్ధ వహించడానికి మనం చేయగలిగినవి అన్నీ చేస్తాం. మన పెంపుడు జంతువులకు మంచి-ఆహారం అందించబడిందని, బాగా శిక్షణ ఇవ్వబడింది అని, పరుగెత్తి ఫిట్‍గా ఉండేందుకు తగినంత స్థలం లభిస్తుందని, ఇంకా, ప్రేమ మరియు సంరక్షణ బాగా పొందే విధంగా జాగ్రత్త వహిస్తాము. కాబట్టి బజాజ్ అలియంజ్ పెట్ డాగ్ ఇన్సూరెన్స్ పాలసీతో, ఇన్సూరెన్స్ అందించే రక్షణ పరిధిలో వాటిని ఎందుకు చేర్చకూడదు.

బజాజ్ అలియంజ్ పెట్ డాగ్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీ బ్యాంక్ అకౌంట్‌ను ఊహించని, మరియు ఖరీదైన, వెటరినరీ బిల్లుల నుండి రక్షించుకుంటూ మీరు మీ కుక్కకు ఉత్తమ వైద్య సంరక్షణ ఇవ్వవచ్చు. ఈ వార్షిక పాలసీ కేవలం ఒక డాగ్ హెల్త్ ఇన్సురెన్స్ లాగా పనిచేయడం మాత్రమే కాక, మీ పెంపుడు జంతువు కనిపించకుండా పోయిన సందర్భంలో కూడా సపోర్ట్ అందిస్తుంది.

అంతే కాదు, మీ పెట్ డాగ్ ఇన్సూరెన్స్ పాలసీతో కలిగే అదనపు ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

పెట్ డాగ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేక ప్రయోజనాలతో విస్తృత కవరేజ్ అందిస్తుంది:

 

  • Lifetime Cover లైఫ్‌టైమ్ కవర్

    3 నెలల నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల మీ పెంపుడు కుక్కకు జీవిత కాల కవరేజ్ అందిస్తుంది 

    *నిబంధనలు & షరతులు వర్తిస్తాయి 

  • No Waiting Period for Accidents ప్రమాదాల జరిగితే వెయిటింగ్ పీరియడ్ ఉండదు

    ఎటువంటి వేచి ఉండే వ్యవధి లేకుండా, పాలసీ జారీ చేసిన సమయం నుండి ఏదైనా ప్రమాదం వలన కలిగిన ఏదైనా గాయానికి చికిత్స/సర్జరీ లేదా మరణం కవర్ చేస్తుంది

  • Discount on RFID Tagging RFID ట్యాగింగ్ పై డిస్కౌంట్

    మీ పెంపుడు జంతువు పై మైక్రో-చిప్ ఉంటే లేదా RFID ట్యాగ్ చేయబడి ఉంటే, మీరు మీ ప్రీమియం పై అదనంగా 5% ఆదా చేసుకోగలుగుతారు

పెట్ డాగ్ ఇన్సూరెన్స్ #కేరింగ్లీపాస్

క్లెయిమ్ ప్రాసెస్

ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగితే, మరియు మీరు ఒక క్లెయిమ్ చేయవలసి ఉంటే, మా టోల్ ఫ్రీ పై కాల్ చేయండి
నంబర్ 1800-209-5858 సంఘటన జరిగిన 24 గంటల్లోపు.

 

క్లెయిమ్ ప్రాసెస్ సమయంలో మీకు అవసరమవగల కొన్ని డాక్యుమెంట్లలో ఇవి ఉంటాయి::

● సరిగ్గా పూర్తి చేయబడిన క్లెయిమ్ ఫారం

● టీకా సర్టిఫికెట్లు 

● మరణించిన కుక్క రంగు ఫోటోలతో పాటు (మోర్టాలిటీ బెనిఫిట్ కవర్ క్రింద క్లెయిమ్ చేసినట్లయితే) మరణ ధృవీకరణ సర్టిఫికేట్

● వెటర్నరీ మెడికల్ పేపర్లు మరియు బిల్లు (సర్జరీ ఖర్చులు మరియు హాస్పిటలైజేషన్ కవర్, మోర్టాలిటీ బెనిఫిట్ కవర్, దీర్ఘ కాలిక కేర్ కవర్ మరియు OPD కవర్ క్రింద క్లెయిముల విషయంలో)

● పోలీస్ ద్వారా లాడ్జ్ చేయబడిన సాధారణ డైరీ ఎంట్రీ కాపీ (దొంగతనం/పోయిన/తప్పిపోయిన కవర్ క్రింద క్లెయిమ్ చేసిన సందర్భంలో)

● FIR (థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ క్రింద క్లెయిమ్ చేసిన సందర్భంలో)

● ప్రకటన యొక్క కాపీ (దొంగతనం/పోయిన/తప్పిపోయిన కవర్ క్రింద క్లెయిమ్ సందర్భంలో)

● హాస్పిటల్ బిల్లు (హాస్పిటలైజేషన్ క్రింద క్లెయిమ్ చేసిన సందర్భంలో)

● కోర్ట్ ఆర్డర్లు (థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ క్రింద క్లెయిమ్ చేసిన సందర్భంలో)

● డయాగ్నోస్టిక్స్ రిపోర్ట్ (టర్మినల్ వ్యాధుల కవర్, దీర్ఘకాలిక సంరక్షణ కవర్ మరియు OPD కవర్ కింద క్లెయిమ్ చేసిన సందర్భంలో)

● వార్తాపత్రిక యొక్క తేదీ కనిపిస్తూ, క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ తేదీనాటి వార్తాపత్రికతో మీ పెంపుడు కుక్క యొక్క కలర్ ఫోటో.

● మీ పెట్ కు RFID ట్యాగ్/మైక్రోచిప్ ఉంటే, ఐడెంటిఫికేషన్ నంబర్ స్పష్టంగా కనిపించే RFID ట్యాగ్ యొక్క కలర్ ఫోటో కూడా పనిచేస్తుంది.

● క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి కంపెనీకి అవసరమైన ఏవైనా ఇతర డాక్యుమెంట్లు

 

పెట్ డాగ్ ఇన్సూరెన్స్ గురించి అత్యంత సాధారణ ప్రశ్నలకు సమాధానాలతో ప్రారంభిద్దాం

కుక్కల కోసం పెట్ ఇన్సూరెన్స్ ముఖ్యమా?

పెంపుడు జంతువుల సంపూర్ణ శ్రేయస్సు కోసం ప్రతి పెంపుడు యజమానికి ఒక పెట్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. తగిన పెట్ ఇన్సూరెన్స్ కవరేజ్‌తో, మీ పెట్ డాగ్ వైద్య సంరక్షణను పొందవచ్చు మరియు ఊహించని వెటరినరీ బిల్లుల నుండి మిమ్మల్ని సురక్షితం చేసుకోవచ్చు.

భారతదేశంలో పెట్ డాగ్ ఇన్సూరెన్స్‌ను ఎలా కొనుగోలు చేయాలి?

మీ కుక్క కోసం పెట్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలని అనుకుంటే, వారి అవసరాలను అంచనా వేయడం ముఖ్యం. ప్రీమియం తక్కువగా ఉన్నందున చవకైన డాగ్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోకండి. క్రింద జాబితా చేయబడిన దశలను అనుసరించడం ద్వారా మీ పెంపుడు కుక్కకు మా వద్ద సంరక్షణను అందించండి: https://www.bajajallianz.com/pet-insurance/dog-insurance.html సందర్శించండి

1. మీ పేరును ఎంటర్ చేయండి మరియు 'కోట్ పొందండి' పై క్లిక్ చేయండి

2. 'ప్రారంభిద్దాం' పై క్లిక్ చేయండి

3. 'కాల్ బ్యాక్ అభ్యర్థన' ఫారంలో అవసరమైన వివరాలను సరిగ్గా నమోదు చేయండి

అవాంతరాలు-లేని అనుభవం కోసం ప్రక్రియ అంతటా మీకు సహాయం చేసే మా 'కస్టమర్ సపోర్ట్' బృందం నుండి మీరు ఒక కాల్ అందుకుంటారు.

పెట్ డాగ్ ఇన్సూరెన్స్ వ్యాక్సినేషన్ ఖర్చులను కవర్ చేస్తుందా?

మా పెట్ డాగ్ ఇన్సూరెన్స్ వ్యాక్సినేషన్ల వైఫల్యాన్ని కవర్ చేస్తుంది. ఇది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు మారవచ్చు. మీరు పెట్ డాగ్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకునే ముందు, భవిష్యత్తులో గందరగోళం నివారించడానికి కవరేజ్ ప్రయోజనాలను శ్రద్ధగా చదవండి. 

నేను పెట్ డాగ్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చా?

అవును, మీ పెంపుడు కుక్క అవసరాలను అంచనా వేయండి మరియు తరువాత పెట్ డాగ్ ఇన్సూరెన్స్‌ను అవాంతరాలు-లేని పద్ధతిలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి. 

కుక్కల కోసం ఇన్సూరెన్స్ కొనుగోలు ఖరీదైనదా?

పెట్ గ్రూమింగ్, మెడికల్ కేర్ మొదలైన వాటి పెరుగుతున్న ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే, పెట్ డాగ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం అనేది ఒక తెలివైన నిర్ణయం. తగిన పెట్ ఇన్సూరెన్స్‌తో, మీరు ఒక ప్రత్యేక డాగ్ మెడికల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. మా పెట్ డాగ్ ఇన్సూరెన్స్ మీ పెంపుడు కుక్కను అనేక ప్రమాదాల నుండి కవర్ చేస్తుంది, మీరు ఆందోళన లేకుండా ఉండవచ్చు.

పెట్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత?

పెట్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది పాలసీ అవధి, బ్రీడ్, పెంపుడు జంతువు వయస్సు మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పెంపుడు కుక్క వైద్యం కోసం అయ్యే సగటు ఖర్చు మరియు ఒక పెట్ డాగ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి చెల్లించిన ప్రీమియం ఖర్చును పోల్చి చూసినట్లయితే, ఇన్సూరెన్స్ కోసం అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది.

దత్తతు తీసుకున్న వీధి కుక్క కోసం నేను పెట్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చా?

అవును, మీరు దత్తతు వీధి కుక్క కోసం పెట్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇన్సూర్ చేయబడిన పెంపుడు కుక్క తగిన స్థానిక ప్రభుత్వ అథారిటీ/మునిసిపల్ కార్పొరేషన్ లేదా భారతదేశం యొక్క సర్టిఫైడ్ కెన్నెల్ క్లబ్ లో రిజిస్టర్ చేయబడాలి. ఇది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు మారవచ్చు.

*నిబంధనలు & షరతులు వర్తిస్తాయి

నా పెంపుడు కుక్క దొంగిలించబడితే నాకు పరిహారం చెల్లించబడుతుందా?

అయితే, ఇన్సూర్ చేయబడిన పెంపుడు కుక్క దొంగతనం/తప్పిపోయిన సందర్భంలో ఏదైనా ప్రకటన ఖర్చు కోసం కవర్ అందించబడుతుంది. అంతేకాకుండా, కస్టమర్ ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా మేము చెల్లిస్తాము.

*నిబంధనలు & షరతులు వర్తిస్తాయి

పెట్ ఇన్సూరెన్స్‌తో థర్డ్-పార్టీ లయబిలిటీ కోసం ఏదైనా కవర్ అందించబడుతుందా?

ఇది రూ. 15, 00,000 వరకు ఉండే ఇన్సూర్ చేయబడిన మొత్తం ఎంపికతో పెంపుడు జంతువు యజమాని యొక్క థర్డ్-పార్టీ బాధ్యతను కవర్ చేస్తుంది. అన్ని పెట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్రయోజనాన్ని అందించవు. అందువల్ల, దాని కోసం ఇన్సూరర్ వద్ద తనిఖీ చేయవలసిందిగా సూచించబడుతుంది.

*నిబంధనలు & షరతులు వర్తిస్తాయి

* గమనిక: ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క ప్రీమియం కుక్క యొక్క వయస్సు, బ్రీడ్ మరియు లింగం పై ఆధారపడి ఉంటుంది. కుక్క బ్రీడ్ ఆధారంగా పెంపుడు కుక్కలు స్మాల్, మీడియం, లార్జ్ లేదా జైంట్ సైజులుగా వర్గీకరించబడతాయి.

Claim settlement

మేము మీ కుక్క కోసం టెర్మినల్ వ్యాధుల కవర్ కూడా అందిస్తాము

అంతే కాదు, మీ పెట్ డాగ్ ఇన్సూరెన్స్ పాలసీతో కలిగే అదనపు ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

మా పెట్ డాగ్ ఇన్సూరెన్స్ మీ పెట్ కోసం వివిధ ప్రయోజనాలను అందిస్తుంది:
Pre-Policy Medical Check-ups

ప్రీ-పాలసీ మెడికల్ చెక్-అప్స్

మీ పెంపుడు కుక్క వయస్సు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటి కోసం తప్పనిసరి ప్రీ-పాలసీ వైద్య పరీక్షలు ఉండవు. అయితే, కొన్ని వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి,.

Vaccination

టీకాలు

పాలసీ వ్యవధిలో మీ పెంపుడు కుక్కకు అవసరమైనప్పుడు టీకాలు ఇవ్వబడ్డాయని మేము నమ్ముతున్నాము.. మరింత చదవండి

టీకాలు :

పాలసీ వ్యవధిలో మీ పెంపుడు కుక్కకు అవసరమైనప్పుడు టీకాలు ఇవ్వబడ్డాయని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. మరియు టీకా వేయబడినట్లయితే, ఈ ఇన్సూరెన్స్ టీకా వైఫల్యాన్ని కూడా కవర్ చేస్తుంది. కవరేజ్ చెల్లుబాటు అయ్యేందుకు, పాలసీ వ్యవధి అంతటా మీ కుక్కకు టీకాలు వేయబడి ఉండాలి అని దయచేసి గమనించండి.

* గమనిక : ‌‌ ప్లాన్ A యొక్క కొనుగోలు విధానం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది, అయితే, మీరు సమీప శాఖను సంప్రదించవచ్చు లేదా మా 24 గంటల టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు 1800-209-5858 / 1800-102-5858 మరియు పొందవచ్చు ప్రత్యామ్నాయ ప్లాన్ B

పెట్ డాగ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు:

  • చేర్పులు

  • మినహాయింపులు

సర్జరీ ఖర్చులు మరియు హాస్పిటలైజేషన్ కవర్

ఈ ప్రోడక్టులో ఉన్న ఏకైక తప్పనిసరి కవర్ ఇది, ఇందులో

మరింత చదవండి

 సర్జరీ ఖర్చులు మరియు హాస్పిటలైజేషన్ కవర్ :

ఈ ప్రోడక్టులో ఉన్న ఏకైక తప్పనిసరి కవర్ ఇది, ఇందులో

సర్జరీ ఖర్చులు:

ఒక అర్హత కలిగిన వెటర్నరీ వైద్యుని ద్వారా కుక్కకు చేయబడిన చికిత్స కోసం గరిష్టంగా INR 50000 వరకు సర్జరీ ఖర్చులను క్లెయిమ్ చేయడానికి ఈ కవర్ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది మీ పెట్‍కు సర్జరీ పూర్వ మరియు అనంతర ఖర్చుల కవర్ కూడా ఇస్తుంది, కాబట్టి మీ పెట్ సౌకర్యవంతంగా కోలుకోవచ్చు. అదనంగా, గరిష్టంగా INR 5000 పరిమితికి లోబడి, మీరు పెంపుడు కుక్క యొక్క విరిగిన అవయవాల చికిత్స కోసం కూడా రక్షణ పొందుతారు.

హాస్పిటలైజేషన్ ఖర్చులు:

మీ పెట్ ఆసుపత్రిలో చేరవలసి వస్తే, అయ్యే ఖర్చుల కోసం మిమ్మల్ని ఫైనాన్షియల్‍గా సురక్షితం చేసే కవర్ ఇది, ఇన్సూర్ చేయబడిన కుక్క హాస్పిటలైజ్ చేయబడిన ప్రతి రోజుకు, గరిష్టంగా INR. 2500 కు లోబడి, గరిష్టంగా 4 రోజులపాటు.

మోర్టాలిటీ బెనిఫిట్ కవర్

ఈ ఆప్షనల్ కవర్ ఇంతవరకు మీరు ఒక క్లెయిమ్ ఫైల్ చేయడానికి అనుమతిస్తుంది 

మరింత చదవండి

మోర్టాలిటీ బెనిఫిట్ కవర్ :

ఒకవేళ మీ కుక్క అనారోగ్యం, యాక్సిడెంట్, ఈనడం, గర్భధారణ లేదా వెట్ ద్వారా సూచించబడిన యుథనేసియా కారణంగా దురదృష్టవశాత్తు చనిపోయినట్లయితే ఈ ఆప్షనల్ కవర్ మీరు ఎంచుకున్న SI (సమ్ ఇన్స్యూర్డ్) వరకు మీరు ఒక క్లెయిమ్ ఫైల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ కుక్క దహనం/ఖననం కోసం కూడా మోర్టాలిటీ బెనిఫిట్ కవర్ మీకు INR 3,000 చెల్లిస్తుంది.

టర్మినల్ వ్యాధుల కవర్

ఈ ఆప్షనల్ కవర్ మీకు ఏకమొత్తంలో పరిహారం అందిస్తుంది 

మరింత చదవండి

టర్మినల్ వ్యాధుల కవర్ :

మీకు ఇష్టమైన నేస్తం ఈ క్రింది క్లిష్టమైన అనారోగ్యాలలో దేనితోనైనా రోగనిర్ధారణ చేయబడితే, ఈ ఆప్షనల్ కవర్ మీకు INR 30,000 ఏకమొత్తం పరిహారం అందిస్తుంది:

✓ క్యాన్సర్

✓ మూత్రపిండ వైఫల్యం

✓ రక్తం గడ్డకట్టడం వలన రుగ్మతలు

✓ గుండె సంబంధిత సమస్యలు

✓ డిస్టెంపర్

✓ లెప్టోస్పిరోసిస్ 

 

దీర్ఘకాలిక సంరక్షణ కవర్

ఆప్షనల్ దీర్ఘ కాలిక సంరక్షణ కవర్ మీకు ఏకమొత్తంలో పరిహారం అందిస్తుంది 

మరింత చదవండి

దీర్ఘకాలిక సంరక్షణ కవర్ :

దీర్ఘకాలిక సంరక్షణ అవసరమయ్యే ఈ క్రింది వ్యాధుల్లో ఏదైనా ఉన్నట్లు మీ కుక్కకు రోగనిర్ధారణ చేయబడితే, ఆప్షనల్ దీర్ఘ కాలిక సంరక్షణ కవర్ మీకు INR 25,000 ఏకమొత్తం పరిహారం అందిస్తుంది:

✓ మూర్ఛలు

✓ ప్యాంక్రియాటైటిస్

✓ కుషింగ్స్ సిండ్రోమ్

✓ మధుమేహం

✓ థైరాయిడ్ సరిగా పనిచేయకపోవడం

✓ అసైటెస్

✓ గ్లాకోమా

✓ ఇన్‌ఫ్లమేటరీ బౌవెల్ డిసీజ్

ఓపిడి కవర్

ఒక ప్రమాదం కారణంగా మీ పెంపుడు జంతువు గాయపడితే, లేదా వ్యాధుల బారిన పడితే 

మరింత చదవండి

ఓపిడి కవర్ :

ఒక ప్రమాదం కారణంగా మీ పెంపుడు జంతువు గాయపడితే, లేదా క్రింద పేర్కొన్న వ్యాధుల బారిన పడితే, మా ఆప్షనల్ OPD పెట్ కవర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కవర్ చేయబడిన వ్యాధుల్లో ఇవి ఉంటాయి:

✓ మెనింజైటిస్

✓ హెపటైటిస్/కాలేయం పనిచేయకపోవడం

✓ న్యూమోనియా

✓ పెరిటోనైటిస్

✓ ప్రోస్టేట్ గ్రంధుల వాపు

✓ పయోమెట్రా

✓ వెస్టిబ్యులార్ రుగ్మత

✓ గ్లాకోమా మినహా కంటి సంబంధిత సమస్యలు

✓ పార్వో వైరస్

ఈ కవర్ మిమ్మల్ని INR 30,000 ఖర్చు వరకు రక్షిస్తుంది. అయితే, ప్రతి క్లెయిమ్ పై, కనీసం INR 1000కు లోబడి, క్లెయిమ్ మొత్తంలో 10% తొలగించబడుతుంది.

థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్

పెంపుడు జంతువులు ఉన్నప్పుడు ప్రమాదాలు తప్పవు

మరింత చదవండి

థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ :

పెంపుడు జంతువులు ఉన్నప్పుడు ప్రమాదాలు తప్పవు. మరొకరికి గాయం, మరణం, వ్యాధి లేదా ఆస్తి నష్టానికి కారణమైన ఒక దుర్ఘటనకు మీ పెంపుడు జంతువు కారణమైతే, ఒక వేమీరు ఎంచుకున్నట్లయితే, చట్టపరమైన బాధ్యత కోసం ఈ కవర్ మీకు ఆసరాగా నిలుస్తుంది. అంతేకాకుండా, ఒక క్లెయిమ్‌ ప్రతివాదన చేయడానికి చట్టపరమైన ఖర్చుల నుండి కూడా మేము మిమ్మల్ని రక్షిస్తాము. మీరు ఈ కవర్ క్రింద INR 5 లక్షలు లేదా INR 10 లక్షల ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని ఎంచుకోవచ్చు.

దొంగిలించబడిన/తప్పిపోయిన/పోగొట్టుకున్న కవర్

మీ పెంపుడు జంతువు తప్పిపోయినట్లయితే, దీని కోసం మీరు ఒక ఆప్షనల్ కవర్ క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు 

మరింత చదవండి

దొంగిలించబడిన/తప్పిపోయిన/పోగొట్టుకున్న కవర్ :

మీ పెంపుడు జంతువు తప్పిపోయినట్లయితే, దీని కోసం మీరు ఎంచుకున్న SI (సమ్ ఇన్స్యూర్డ్) వరకు మీరు ఒక ఆప్షనల్ కవర్ క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అంతేకాకుండా, మీ అమూల్యమైన పెంపుడు జంతువును కనుగొనడానికి మీకు సహాయపడగల ఎవరికైనా INR 5000 వరకు రివార్డ్ అందించడానికి ఈ కవర్లు మిమ్మల్ని అనుమతిస్తాయి.

నష్టం జరిగిన తర్వాత, మీరు తక్షణమే పోలీస్ అధికారులకు నష్టాన్ని రిపోర్ట్ చేయాలి మరియు సాధారణ డైరీ ఎంట్రీని లాడ్జ్ చేయించుకోవాలి అలాగే మాతో ఈ సంఘటనను రిజిస్టర్ చేసుకోవాలి. అవసరమైతే, స్థానిక వార్తపత్రాలలో ప్రకటనలతో సహా కనీసం 45 రోజుల వరకు మీరు మీ పెంపుడు జంతువును కనుగొనడానికి పూర్తి ప్రయత్నాలు చేయాలి మరియు ఈ కవర్ మీకు INR 1000 వరకు అటువంటి ప్రకటన ఖర్చు కోసం కూడా ఇన్సూర్ చేస్తుంది.

1 ఆఫ్ 1

సర్జరీ ఖర్చులు మరియు హాస్పిటలైజేషన్ కవర్

ఏదైనా ప్రమాదం/అనారోగ్యం కారణంగా ఏర్పడని ఏవైనా శస్త్రచికిత్సలు

మరింత చదవండి

సర్జరీ ఖర్చులు మరియు హాస్పిటలైజేషన్ కవర్ 

 

సెక్షన్ 1A (సర్జరీ) కు వర్తించే నిర్దిష్ట మినహాయింపులు:

ఈ సెక్షన్ కింద, ఈ క్రింది వాటికి సంబంధించి అయిన ఖర్చు కోసం ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి కంపెనీ నష్టపరిహారం చెల్లించదు: 

1 ఏదైనా ప్రమాదం/అనారోగ్యం కారణంగా ఏర్పడని ఏవైనా శస్త్రచికిత్సలు

2 పుట్టుక లోపాలు/ అంగవికృతి సరిచేసుకోవడానికి చేయబడిన ఏవైనా శస్త్రచికిత్సలు 

3 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుగల జైంట్ బ్రీడ్‍ల కోసం మరియు 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుగల అన్ని ఇతర బ్రీడ్‍ల కోసం శుక్లాల శస్త్రచికిత్సలు. (ప్లాన్ B లో కవర్ చేయబడవచ్చు) 

4 ఒక అనారోగ్యం/ప్రమాదం కారణంగా వైద్యపరంగా అవసరమైతే లేదా క్లెయిమ్ చేయబడిన ఖర్చులు అటువంటి ప్రక్రియల నుండి ఉత్పన్నమయ్యే సమస్యల చికిత్స కోసం అయితే తప్ప గర్భాశయం తొలగింపు, లైంగిక గ్రంథుల తొలగింపు మరియు వీర్యహరణం వంటి విధానాలకు సంబంధించిన ఏవైనా సర్జరీలు

5 గర్భధారణ లేదా ఈనడానికి సంబంధించి ఏదైనా శస్త్రచికిత్స చేయబడింది. 

6 ప్రమాదం వలన అవసరం ఏర్పడని దంత శస్త్రచికిత్స 

7 గ్రూమింగ్‍కు సంబంధించి చేయబడిన ఏదైనా సర్జరీ

8 టెయిల్ డాకింగ్, డిక్లాయింగ్, ఐల్యాషెస్ తొలగింపు, చెవుల క్రాపింగ్ లేదా అనారోగ్యం లేదా గాయానికి సంబంధించని ఏదైనా ఇతర విధానంతో సహా కాస్మెటిక్, ఈస్థెటిక్ లేదా ఎంపిక చేసుకోబడిన శస్త్రచికిత్స.

9 పులిపిరి కాయ లేదా గడ్డ వంటి ఏదైనా అసాధారణ పెరుగుదలను తొలగించడానికి ఏవైనా శస్త్రచికిత్సలు 

10 చర్మం వ్యాధులకు సంబంధించిన ఏవైనా శస్త్రచికిత్సలు 

11 ఏవైనా ప్రయోగాత్మక శస్త్రచికిత్సలు 

12 కృత్రిమ శరీర భాగాలు మరియు/లేదా ప్రొస్థెసిస్ ఖర్చు. 

13 హాస్పిటలైజేషన్ (సెక్షన్ 1 B) కింద కవర్ చేయబడగల ఏవైనా ఖర్చులు 

 

1B (హాస్పిటలైజేషన్)కు వర్తించే నిర్దిష్ట మినహాయింపులు: 

ఇన్సూర్ చేయబడిన కుక్క కోసం హాస్పిటలైజేషన్ కింద కంపెనీ ఎటువంటి మొత్తాలను చెల్లించదు వీటి కోసం: 

1 చికిత్స ఒక గాయానికి సంబంధించినది అయితే తప్ప డెంటల్ చికిత్స ఖర్చు. 

2 చర్మం సంబంధిత చికిత్సల నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా క్లెయిమ్. 

3 ఈ విధానం నుండి ఉత్పన్నమయ్యే ఏవైనా సమస్యలకు చికిత్స చేయడం కాకుండా, టీకాలు మరియు మైక్రో-చిప్పింగ్ కోసం అయ్యే ఖర్చుల నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా క్లెయిమ్. 

4 లైంగిక గ్రంథుల తొలగింపు (ఒక తప్పు గర్భధారణ తర్వాత లైంగిక గ్రంధుల తొలగింపుతో సహా) లేదా వీర్యహరణం కోసం అయిన ఖర్చుల నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా క్లెయిమ్,:  

              ఏ. ఇన్సూర్ చేయబడిన కుక్క గాయం లేదా అనారోగ్యం వలన బాధపడుతున్నప్పుడు మరియు గాయం లేదా అనారోగ్యానికి చికిత్స చేయడానికి ప్రక్రియ నిర్వహించబడితే 

               బి. ఈ విధానం వలన ఏర్పడే సంక్లిష్టతల చికిత్స కోసం క్లెయిమ్ చేయబడిన ఖర్చులు. 

5 పునరుత్పత్తి, గర్భధారణ లేదా పిల్లలు పెట్టడానికి సంబంధించి అయిన ఖర్చుల నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా క్లెయిమ్.

6 ఇన్సూర్ చేయబడిన కుక్క కోసం ఇన్సూర్ చేయబడిన వ్యక్తి చేసిన ఏదైనా వైద్యేతర ఖర్చు.

7 తలెత్తే సంక్లిష్ట సమస్యలతో సహా, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి చేయించుకోవాలని ఎంచుకునే ఒక గాయం లేదా అనారోగ్యంతో నేరుగా సంబంధం లేని ఏదైనా ఎంపిక చేసుకోబడిన చికిత్స, ఏదైనా నివారణ చికిత్స లేదా ఏదైనా చికిత్స ఖర్చు.

8 పాలసీ అమలులోకి వచ్చే తేదీకి పూర్వం క్లినికల్ సంకేతం(లు) కనిపించే లేదా ఈ పాలసీ ప్రారంభ తేదీకి (14) రోజుల ముందు కనిపించిన పుట్టుక లోపాలు లేదా అసాధారణతలకు సంబంధించి అయిన ఖర్చుల నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా క్లెయిమ్; 

దీని కారణంగా అనారోగ్యం లేదా గాయం చికిత్స కోసం అయిన ఖర్చుల నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా క్లెయిమ్:

                a. రేసింగ్;

                b. కోర్సింగ్;

                c. కమర్షియల్ గార్డింగ్;

                d. వ్యవస్థీకరించబడిన పోరాటం; లేదా

                e. ఇన్సూర్ చేయబడిన కుక్క యొక్క ఏదైనా ఇతర వృత్తిపరమైన, ప్రొఫెషనల్ లేదా వ్యాపార ఉపయోగాలు; 

9 ఇన్సూర్ చేయబడిన వ్యక్తి లేదా ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క గృహ సభ్యుని ద్వారా ఇన్సూర్ చేయబడిన కుక్క పై చేసిన దుర్మార్గం ఫలితంగా కలిగే ఒక ఉద్దేశ్యపూర్వక గాయం లేదా పరిస్థితి చికిత్స కోసం అయిన ఖర్చుల నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా క్లెయిమ్;

10 పాలసీ ప్రారంభం కావడానికి పూర్వం నివారణ చర్యలు తీసుకోవలసిందిగా వెట్ ద్వారా ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి సలహా ఇవ్వబడిన మరియు అతను/ఆమె అలా చేయకపోయిన ఒక అనారోగ్యం లేదా గాయం చికిత్స కోసం ఖర్చులు లేదా ఫీజులు. 

 

 

మోర్టాలిటీ బెనిఫిట్ కవర్

దానిని ఒక అనారోగ్యానికి తప్ప దాడి చేసిన కారణంగా మీ కుక్కను నిద్రపుచ్చడం జరిగితే

మరింత చదవండి

 మోర్టాలిటీ బెనిఫిట్ కవర్ :

1 దానిని ఒక అనారోగ్యానికి ఆపాదించగలిగితే మరియు ఒక వెటరినరీ డాక్టర్ ద్వారా సర్టిఫై చేయబడితే తప్ప దాడి చేయడం కారణంగా మీ కుక్కను నిద్రపుచ్చడం జరిగితే.

2 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుగల జైంట్ బ్రీడ్‍లకు మరియు 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుగల ఇతర బ్రీడ్‍లకు మూత్రపిండ వైఫల్యం కారణంగా మరణం సంభవిస్తే. (ప్లాన్ B లో కవర్ చేయబడవచ్చు)

3 ప్రభుత్వం, స్థానిక అధికారి లేదా ఈ విషయంలో అధికార పరిధి కలిగి ఉన్న ఎవరైనా వ్యక్తి ద్వారా ఏదైనా ఆర్డర్‍తో నిమిత్తం లేకుండా అంతర్జాతీయ వధ నుండి ఉత్పన్నమయ్యే క్లెయిములు.

 

*గమనిక:

✓ బ్రేక్ లేకుండా మాతో రెన్యూ చేయబడితే తప్ప, 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుగల జైంట్ బ్రీడ్‍లకు మరియు 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల ఇతర బ్రీడ్‍లకు మోర్టాలిటీ బెనిఫిట్ కవర్ అందుబాటులో ఉండదు.

✓ టెర్మినల్ వ్యాధుల విభాగం కింద చెల్లింపు చేయబడిన తర్వాత టర్మినల్ వ్యాధులు లేదా ఏదైనా ఇతర అనారోగ్యం కారణంగా మరణం చెల్లించబడదు.

టర్మినల్ వ్యాధుల కవర్

రోగనిర్ధారణ తేదీ నుండి 30 రోజులు పూర్తి కాక ముందు మీ కుక్క మరణిస్తే 

మరింత చదవండి

 టర్మినల్ వ్యాధుల కవర్ :

1 పైన పేర్కొన్న టెర్మినల్ వ్యాధుల రోగనిర్ధారణ తేదీ నుండి 30 రోజులు పూర్తి కాక ముందు మీ కుక్క మరణిస్తే

2 మీ కుక్క జీవితకాలంలో ఈ విభాగం కింద ఒకటి కంటే ఎక్కువ క్లెయిమ్ చెల్లించబడదు.

 

*గమనిక:

✓ 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుగల జైంట్ బ్రీడ్‍లు మరియు 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల అన్ని ఇతర బ్రీడ్‍లకు టర్మినల్ వ్యాధుల కవర్ అందుబాటులో ఉండదు. (ప్లాన్ B కింద కవర్ చేయబడవచ్చు)

✓ పాలసీ క్రింద ఒకసారి క్లెయిమ్ చేయబడిన తర్వాత టర్మినల్ వ్యాధుల కవర్ జీవితకాలం కోసం నిలిచిపోతుంది. 

దీర్ఘకాలిక సంరక్షణ కవర్

మీ కుక్క జీవితకాలంలో ఈ విభాగం కింద ఒకటి కంటే ఎక్కువ క్లెయిమ్ చెల్లించబడదు.

ఓపిడి కవర్

గ్లాకోమాకు సంబంధించిన ఏదైనా క్లెయిమ్ ఈ పాలసీ క్రింద చెల్లించబడదు.

మరింత చదవండి

ఓపిడి కవర్ :

1 గ్లాకోమాకు సంబంధించిన ఏదైనా క్లెయిమ్ ఈ పాలసీ క్రింద చెల్లించబడదు.

2 మీ కుక్కపై నిర్వహించబడిన శస్త్రచికిత్స నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా క్లెయిమ్.

 

*గమనిక:

బ్రేక్ లేకుండా మాతో రెన్యూ చేయబడితే తప్ప, 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుగల జైంట్ బ్రీడ్‍లు మరియు 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల అన్ని ఇతర బ్రీడ్‍లకు OPD కవర్ అందుబాటులో ఉండదు

థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్

చట్టం కింద ఏర్పాటు చేయబడిన ఒక సమర్థవంతమైన న్యాయస్థానం లేదా ట్రిబ్యూనల్ లేదా ఫోరమ్ ద్వారా ఎటువంటి బాధ్యత నిరూపించబడని క్లెయిములు.

మరింత చదవండి

థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ :

1 చట్టం కింద ఏర్పాటు చేయబడిన ఒక సమర్థవంతమైన న్యాయస్థానం లేదా ట్రిబ్యూనల్ లేదా ఫోరమ్ ద్వారా ఎటువంటి బాధ్యత నిరూపించబడని క్లెయిములు.

2 మీరు లేదా మీ కుటుంబ సభ్యులు, సిబ్బంది / సంరక్షకులతో సహా మీ ద్వారా నియమించబడినవారి ద్వారా ఉద్దేశ్యపూర్వక చర్యలు లేదా ఉపేక్ష కారణంగా కలిగిన గాయం లేదా నష్టం కోసం ఏవైనా డామేజీలు, ఖర్చులు మరియు వ్యయాలు.

3 కుక్కలు ప్రత్యేకంగా నిషేధించబడిన ఒక ప్రాంతం లేదా ప్రదేశంలో ఆ సంఘటన జరిగితే ఏదైనా పరిహారం ఖర్చు మరియు వ్యయాలు, మీ కుక్క పారిపోయి మీ నియంత్రణలో లేకుండా ఆ ప్రదేశంలో ప్రవేశిస్తే తప్ప.

4 గాయపడిన వ్యక్తి మీ కుటుంబంలో భాగం, మీ ఇంటిలో నివసించేవారు లేదా మీ కుక్క గురించి శ్రద్ధ వహించడానికి చెల్లించబడే లేదా మీ కుక్కకు శిక్షణ ఇవ్వడానికి చెల్లించబడే వ్యక్తి అయితే పరిహారం లేదా చట్టపరమైన ఖర్చులు.

5 వారి ప్రొఫెషన్/వృత్తిని నిర్వహించే సమయంలో సంఘటన సంభవించినట్లయితే, అందరు వెట్స్, కుక్క ట్రైనర్లు, కెనెల్ ఉద్యోగులు, డాగ్ బ్రీడర్లు, డాగ్ షాప్ యజమానులు

 

దొంగతనం/పోవడం/తప్పిపోవడం కవర్

మీ పోయిన కుక్కను కనుగొనడానికి చేయబడిన ఏదైనా ప్రకటన సాక్ష్యం ద్వారా సపోర్ట్ చేయబడని ఏదైనా క్లెయిమ్.

మరింత చదవండి

దొంగతనం/పోవడం/తప్పిపోవడం కవర్ :

1 మీ పోయిన కుక్కను కనుగొనడానికి చేయబడిన ఏదైనా ప్రకటన సాక్ష్యం ద్వారా సపోర్ట్ చేయబడని ఏదైనా క్లెయిమ్.

2 మీరు దానిని చేస్తున్న తీరును మేము అంగీకరించకపోతే మీ కుక్కను కనుగొనడానికి మీరు ఖర్చు చేసిన ఏదైనా డబ్బును తిరిగి చెల్లించడం.

3 మీతో నివసిస్తున్న మీ కుటుంబం లేదా గృహంలోని సభ్యునికి లేదా మీ ద్వారా నియమించబడిన ఎవరైనా వ్యక్తి ద్వారా ఏదైనా బహుమానం.

*ప్రత్యేక షరతులు:

1 నష్టం జరిగిన తర్వాత, మీరు పోలీస్ అధికారులకు నష్టాన్ని వెంటనే రిపోర్ట్ చేయాలి మరియు ఒక సాధారణ డైరీ ఎంట్రీని లాడ్జ్ చేయించుకోవాలి.

2 అవసరమైతే, స్థానిక వార్తపత్రాలలో ప్రకటనతో సహా మీ కుక్క ఆచూకీ తెలుసుకోవడానికి ప్రతి ప్రయత్నం చేయబడుతుంది.

3 నష్టం జరిగిన సందర్భం నుండి 24 గంటల్లోపు దొంగతనం/దొంగిలించబడిన సంఘటనను రిజిస్టర్ చేయడం ద్వారా మీరు కంపెనీకి తెలియజేయాలి. 45 రోజుల్లోపు మీ కుక్క జాడ ఏమీ తెలియకపోతే మీరు తుది క్లెయిమ్ డాక్యుమెంట్ సమర్పించిన తర్వాత మీరు క్లెయిమ్ సమాచారం నంబర్ సమర్పించాలి.

4 వివిధ ప్రయత్నాలు చేసినప్పటికీ కనిపించకుండా పోయిన తేదీ నుండి 45 రోజుల్లోపు మీ కుక్క కనుగొనబడకపోతే, ఒక దొంగతనం లేదా తప్పిపోవడం క్లెయిమ్ సబ్మిట్ చేయండి (మీ కుక్క కనిపించకుండా పోయిన తర్వాత ఒక సంవత్సరం కంటే మించకుండా).

5 మీ కుక్క కనుగొనబడితే లేదా తరువాత తిరిగి ఇవ్వబడినట్లయితే, మీరు పాలసీ యొక్క ఈ కవర్ క్రింద చెల్లించబడిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.

*గమనిక:

బ్రేక్ లేకుండా మాతో రెన్యూ చేయబడితే తప్ప 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల జైంట్ బ్రీడ్‍లు మరియు 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుగల ఇతర బ్రీడ్‍ల కోసం దొంగతనం/పోయిన/ తప్పిపోయిన కవర్ అందుబాటులో ఉండదు

 

1 ఆఫ్ 1

* గమనిక : మోర్టాలిటీ బెనిఫిట్ కవర్ మరియు దొంగతనం/పోయిన/తప్పిపోయిన కవర్ కోసం, మీరు గరిష్ట ధర వరకు ఏదైనా ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని ఎంచుకోవచ్చు (ఇది కుక్క బ్రీడ్ మరియు కుక్క పెడిగ్రీ కలిగినది లేదా పెడిగ్రీ లేనిది అనేదాని పై ఆధారపడి ఉంటుంది). మీరు ఒక పెడిగ్రీ కుక్కకు మాత్రమే వర్తించే బీమా చేయబడిన మొత్తాన్ని ఎంచుకోవాలనుకుంటే, మీరు పెడిగ్రీ లీనియేజ్ నిరూపించడానికి కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా (KCI) నుండి మాకు ఒక సర్టిఫికెట్ అందించాలి. గరిష్ట ధర కంటే ఎక్కువగా ఉన్న బీమా చేయబడిన మొత్తాన్ని మీరు ఎంచుకోవాలనుకుంటే, మీరు మాకు ఒక ఇన్వాయిస్ లేదా కొనుగోలు ధర యొక్క ఏదైనా ఇతర రుజువును అందించాలి.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

పెట్ డాగ్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లను డౌన్‍లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

 

పెట్ డాగ్ ఇన్సూరెన్స్ కోసం ప్రవేశం మరియు నిష్క్రమణ వయస్సు

 

మీరు పెట్ డాగ్ ఇన్సూరెన్స్ ఎంపికలను చూడటం గొప్ప ఐడియా అని మేము భావిస్తున్నాము. ఈ కవర్ కోసం అర్హత కలిగి ఉండడానికి, మీ కుక్క జైంట్ బ్రీడ్‍ల కోసం 3 నెలలు నుంచి 4సంవత్సరాల మధ్య వయస్సు మరియు S/M/L బ్రీడ్‍ల కోసం 3 నెలల నుండి 7 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. మాతో నిరంతరం రెన్యూ చేసుకున్నట్లయితే మేము జైంట్ బ్రీడ్‍ల కోసం 6 సంవత్సరాల వయస్సు వరకు లేదా చిన్న/మధ్యస్థ/పెద్ద బ్రీడ్‍ల కోసం 10 సంవత్సరాల వయస్సు వరకు మేము మీ కుక్కకు ఇన్సూరెన్స్ అందించగలము.

ఇప్పుడు, పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది అని మీరు ఆశ్చర్యపోతూ ఉండి ఉండొచ్చు. సరే, మీరు ప్రారంభించడానికి సహాయపడటానికి ఒక జాబితా ఇక్కడ ఇవ్వబడింది:

 

డాగ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు

 

  • ✓ మీరు ఫారంను పూరించాలి మరియు మా వెబ్‌సైట్‌లో మీ పెంపుడు కుక్కకు సంబంధించిన వివరాలను అందించాలి

  • ✓ To help identify your pet, we’ll need colour photos of your pet from 5 sides, Front, Back, Left, Right and Top. If your pet has an RFID chip, a colour photo, which clearly captures the identification number will work too. The photo needs to include the newspaper as on the date of application, with the date of the newspaper visible.

  • ✓ మీ పెంపుడు జంతువు తన టీకాలను అన్నింటినీ సకాలంలో పొందిందని కూడా మీరు స్వీయ-ప్రకటన చేయాలి

  • ✓ మీ పెట్ 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉంటే, మరియు మీరు 90 రోజుల వేచి ఉండే వ్యవధిని (ప్రత్యేక పరిస్థితులలో వివరించినట్లుగా) మాఫీ చేయాలని ఎంచుకుంటున్నట్లయితే, మాకు బయో-కెమిస్ట్రీ పరీక్ష, సర్క్యులేటరీ బ్లడ్ కౌంట్, మూత్రం పరీక్ష మరియు ఛాతీ ఎక్స్-రే వంటి కొన్ని డయాగ్నోస్టిక్స్ పరీక్షా ఫలితాలు అవసరం.

  • ✓ మీరు ఒక పెడిగ్రీ లినియేజ్ కోసం వర్తించే ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని ఎంచుకుంటూ ఉంటే, మీరు భారతదేశ కెనల్ క్లబ్ నుండి ఒక పెడిగ్రీ సర్టిఫికెట్ కూడా అందించాలి

  • ✓ ఆ బ్రీడ్ కోసం నిర్వచించబడిన గరిష్ట ధర కంటే మీరు అధిక బీమా చేయబడిన మొత్తాన్ని ఎంచుకుంటూ ఉంటే, మీరు కొనుగోలు రుజువును అందించాలి

     

     

ప్రత్యేక షరతులు

 

మీరు 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల పెంపుడు కుక్క కోసం అప్లై చేస్తున్నట్లయితే, మీరు ఒకదానిని ఎంచుకోవాలి:

 

బయో-కెమిస్ట్రీ పరీక్ష, సర్క్యులేటరీ బ్లడ్ కౌంట్, మూత్ర పరీక్ష మరియు ఛాతీ ఎక్స్-రే వంటి ఈ క్రింది వైద్య పరీక్షల కోసం గత 7 రోజుల్లో నిర్వహించబడిన కుక్క వైద్య పరీక్ష నివేదికలను అందించడం.

లేదా

ఈ క్రింది అనారోగ్యాలకు సంబంధించి ఏదైనా శస్త్రచికిత్స, హాస్పిటలైజేషన్, మరణం, టర్మినల్ వ్యాధులు, దీర్ఘకాలిక సంరక్షణ లేదా OPD సంబంధిత కవర్ల కోసం పాలసీ వ్యవధి ప్రారంభమైన తేదీ నుండి మొదటి 90 రోజుల కోసం కవర్ ఉండదు:

సి.నం. అనారోగ్యం పేరు
1 కాలేయం సరిగా పనిచేయకపోవడం
2 మూత్రపిండం సరిగా పనిచేయకపోవడం
3 క్లోమం సరిగా పని చేయకపోవడం
4 కుషింగ్స్ సిండ్రోమ్
5 డయాబెటిస్
6 థైరాయిడ్ సరిగా పని చేయకపోవడం
7 అన్ని రకాల క్యాన్సర్లు మరియు కణితులు
8 మెనింజైటిస్
9 ఎపిలెప్సీ
10 పెరిటోనైటిస్
11 ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క శోధ
12 రక్తం గడ్డకట్టే రుగ్మతలు
13 గుండె సరిగా పని చేయకపోవడం
14 ఒటైటిస్
15 హిప్ డిస్‍ప్లాసియా
16 అసైటెస్
17 పర్వో వైరస్ ఇన్ఫెక్షన్
18 చిరాకు
19 కెనైన్ లెప్టోస్పైరోసిస్
20 ఎగువ శ్వాస నాళ సంక్రమణం
21 మూత్ర మార్గ సంక్రమణం
22 వెస్టిబ్యులార్ రుగ్మత
23 న్యూమోనియా
24 పయోమెట్రా
25 ఓస్టియో ఆర్థ్రైటిస్
26 వెనీరియల్ గ్రాన్యులోమా
27 ఇన్సులినోమా
28 చెవిలో హెమటోమా
29 కంటి సంబంధిత అన్ని సమస్యలు

 

 

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 31st అక్టోబర్ 2023

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి