Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్

International Travel Insurance

ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ కోసం మీ వివరాలను అందించండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

 

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది విదేశాలలో మీ ట్రిప్ సమయంలో ఊహించని సంఘటనలను కవర్ చేయడానికి రూపొందించబడిన ఒక పాలసీ. ఇందులో అత్యవసర వైద్య పరిస్థితులు, ట్రిప్ రద్దు, సామాను పోగొట్టుకోవడం మరియు ఇతర ప్రయాణ సంబంధిత ప్రమాదాల కోసం కవరేజ్ ఉంటుంది. ఈ రకమైన ఇన్సూరెన్స్ మీరు ఆర్థికంగా రక్షించబడతారని నిర్ధారిస్తుంది మరియు మీరు ఆందోళనలు లేకుండా మీ ప్రయాణాన్ని ఆనందించవచ్చు.

మీరు విదేశీ దేశంలో పాస్ పోర్ట్ లేదా చెక్ ఇన్ చేసిన సామాను పోగొట్టుకున్నట్లు ఊహించుకోండి. లేదా మీరు అనారోగ్యానికి గురయ్యారు, అలాగే విమానం ఆలస్యం జరిగింది లేదా మీరు కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యారు అని అనుకోండి. అయితే, ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా భయానకంగా ఉండవచ్చు. విదేశాల్లో ఉన్నప్పుడు ఏదైనా దురదృష్టకర సంఘటన లేదా అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.

 

బజాజ్ అలియంజ్ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మీరు సంతోషకరమైన జ్ఞాపకాలతో తిరిగి రావచ్చు. అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం వల్ల ఏదైనా దురదృష్టకర సంఘటన నుండి మీకు ఆర్థికంగా భద్రత లభిస్తుంది.

 

విదేశీ మెడికల్ ఎమర్జెన్సీ మొదలుకొని ట్రిప్ తగ్గింపు లేదా పాస్‌పోర్ట్ కోల్పోవడం లేదా సామాను నష్టం వరకు మేము మిమ్మల్ని ట్రిప్ అంతటా కవర్ చేస్తాము. ట్రావెల్ ఇన్సూరెన్స్ ను ముఖ్యంగా మహమ్మారి తర్వాత ప్రపంచంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కోవిడ్-19 అనేది మన జీవితంలో ఉహించని భయంకరమైన సంఘటనకు ఉదాహరణ. ఇన్సూరెన్స్ రూపంలో ఆర్థిక భద్రతను కలిగి ఉండటం వల్ల మీరు ప్రపంచమంతటా నిశ్చింతగా ప్రయాణించవచ్చని మీకు భరోసా ఉంటుంది.

 

మీరు మీ విమాన టికెట్లను బుక్ చేసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రయాణ మార్గదర్శకాలను చెక్ చేయండి. ప్రయాణం అనేది వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు విద్యా జీవితంలో ఒక భాగం. మీరు విమానయానానికి ముందు, భారతదేశం నుండి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు సురక్షితం చేసుకోండి.

 

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

తగినంత ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ను కలిగి ఉండటం వలన మీరు విదేశాల్లో ఉన్నప్పుడు మీ భద్రతకు హామీ ఇవ్వబడుతుంది. అత్యుత్తమ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద అందించబడే ముఖ్యమైన ఫీచర్ల గురించి ఇక్కడ క్లుప్తంగా వివరించడం జరిగింది:

  • ప్రతి వయస్సు వారికి ప్లాన్:

    ప్రతి ఒక్కరి ప్రయాణ అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు, ఒక విద్యార్థి అవసరాలు ఒంటరిగా లేదా కుటుంబంతో ప్రయాణించే వ్యక్తితో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. మీరు మీ వయస్సుకి అనుగుణంగా, తగిన ప్రయోజనాలతో ఆన్‌లైన్‌లో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కొనుగోలు చేయవచ్చు.

  • పాస్‌పోర్ట్/ లగేజ్ నష్టం కోసం కవర్:

    మీ పాస్‌పోర్ట్ లేదా సామాను పోగొట్టుకోవడం అనేది మీ ఊహకు అందని భయంకరమైన విషయం. చెక్‌ఇన్ చేసిన సామాను పూర్తిగా, శాశ్వతంగా పోయిన సందర్భంలో ఈ కవర్ అమలులోకి వస్తుంది.

  • ఇంటి దోపిడీ నుండి రక్షణ:

    మీరు సెలవుల కోసం ఇంటికి దూరంగా విహారయాత్రకు వెళ్లినప్పుడు, దొంగ అదే సమయంలో ప్రయోజనం పొందాలనుకోవచ్చు. ఇంట్లో దోపిడీ కోసం కవరేజ్‌ను కలిగి ఉండటం వలన మీరు లేనప్పుడు మీ ఇంట్లో దొంగతనం జరిగితే మీకు పరిహారం లభిస్తుంది.

  • ప్రయాణం వల్ల కలిగే కష్టాలకు కవరేజ్:

    కొన్ని సందర్భాల్లో మీరు మీ ట్రావెల్ ప్లాన్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఎదురు కావచ్చు. ఇది మీ అనారోగ్యం లేదా ఏదైనా కుటుంబ అత్యవసర పరిస్థితి మొదలైన వాటి కారణంగా జరగవచ్చు. చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ప్లాన్ కలిగి ఉండటం వలన ఇది మిమ్మల్ని ఆర్థిక భారం నుండి రక్షిస్తుంది. ఇందులో హోటల్ రూమ్ రిజర్వేషన్లు, విమాన టికెట్లు మొదలైనవి ఉంటాయి.

  • అత్యవసర నగదు అడ్వాన్స్:

    లగేజీ లేదా డబ్బు దొంగతనం/ దోపిడీ లాంటి ఊహించని సంఘటనలు జరిగినప్పుడు మీకు అత్యవసర నగదు అవసరం కావచ్చు. మీరు అంతర్జాతీయ ట్రావెల్ పాలసీని కలిగి ఉన్నప్పుడు ఒక నిర్దిష్ట పరిమితి వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చు.

  • వ్యక్తిగత బాధ్యత:

    ఒక ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఏవైనా చట్టపరమైన బాధ్యతలు, థర్డ్-పార్టీ క్లెయిమ్‌లకు నష్టపరిహారం అందించేందుకు వారి జేబు నుండి చెల్లించాల్సిన అవసరం లేదు. తగినంత ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వలన అది ఇన్సూర్ చేయబడిన ట్రిప్ వ్యవధిలో జరిగిన ప్రమాదవశాత్తు శారీరక గాయాలు/ ఆస్తి నష్టం నుండి ఉత్పన్నమయ్యే ఖర్చులకు బాధ్యత వహిస్తుంది.

 

బజాజ్ అలియంజ్ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

బజాజ్ అలియంజ్ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మీరు మా ప్రత్యేక సంరక్షణతో తెలివిగా, సురక్షితంగా ప్రయాణిస్తున్నారు. మా ప్లాన్లు పూర్తి రక్షణ మరియు మనశ్శాంతిని అందించడానికి రూపొందించబడ్డాయి. 

 

పారామీటర్

సమాచారం

ప్లాన్ రకాలు

ఇండివిడ్యువల్, ఫ్యామిలీ, సీనియర్ సిటిజన్, కార్పొరేట్ మరియు స్టూడెంట్

సౌలభ్యం

మీ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా పాలసీని కస్టమైజ్ చేసుకునే స్వేచ్ఛ

సహాయం

మిస్డ్ కాల్ సదుపాయంతో పాటు ఇరవై నాలుగు గంటల మద్దతు

కోవిడ్-19 కవర్

కవర్ చేయబడుతుంది*

యాడ్-ఆన్ ప్రయోజనం

అవును, ట్రిప్ డిలే డిలైట్, షెన్‌గన్ కవర్, అత్యవసర హోటల్ వసతి మొదలైనటువంటివి.

క్లెయిమ్ ప్రాసెస్

డిజిటల్‌గా ఎనేబుల్ చేయబడిన ప్రక్రియలు

క్లెయిమ్ సెటిల్‌మెంట్

వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం ఇన్-హౌస్ బృందం

 

మీకు అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?


తరచుగా, మనలో చాలామంది ట్రావెల్ ఇన్సూరెన్స్ అంత ముఖ్యం కాదని భావిస్తున్నారు. ఒక దేశంలో తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ప్రజలు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి.

అవును, మీరు చదివింది నిజమే! క్యూబా, రష్యా, షెన్‌గన్ దేశాల వంటి దేశాలు తప్పనిసరి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరాన్ని కలిగి ఉన్నాయి.


మీకు తెలుసా?


  • భారతదేశం వెలుపల వైద్య ఖర్చులు 2-3 రెట్లు అధికంగా ఉంటాయి
  • పర్యటన సమయాల్లో ప్రజలు సాధారణంగా వారి పాస్ పోర్ట్‌లు, సామాను, నగదు, బ్యాంకు కార్డులు మొదలైన వాటిని కోల్పోతారు.
  • ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో మోసాలు అనేవి సర్వసాధారణం

సమగ్ర అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం వలన, అది ట్రిప్ వ్యవధిలో ఏ సమయంలోనైనా తలెత్తే ఆర్థిక మరియు వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తుంది. ఇది ఒక నిర్దిష్ట పరిమితి వరకు పరిహారం కూడా అందిస్తుంది.


  • వైద్య ఖర్చులు : విదేశాలలో వైద్య చికిత్సలు భారతదేశంలో కంటే చాలా ఖరీదుగా ఉంటాయి.
  • అనిశ్చిత సంఘటనలు : పోయిన పాస్‌పోర్ట్‌లు, లగేజ్, క్యాష్ మరియు ట్రావెల్ స్కామ్‌ల నుండి రక్షణ.
  • తప్పనిసరి ఆవశ్యకత : షెన్గన్ దేశాలు వంటి అనేక దేశాలకు వీసా అప్రూవల్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం.

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంచుకునేటప్పుడు, ప్రయాణం సమయంలో సరైన రక్షణను నిర్ధారించడానికి వారి ప్రఖ్యాతి, అందించబడుతున్న ప్లాన్ మరియు కస్టమర్ సపోర్ట్ సేవలను మదింపు చేయడం చాలా ముఖ్యం.

 

బజాజ్ అలియంజ్ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద ఏమి కవర్ చేయబడుతుంది?

 

భారతదేశంలో మా అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది, మీ విదేశీ పర్యటనలో ఏ సమయంలోనైనా తలెత్తే ప్రతి పరిస్థితి కోసం కవరేజీని అందిస్తుంది:

  • పాస్‌పోర్ట్ నష్టం:

    ఒకవేళ మీరు మీ పాస్‌పోర్టును విదేశాల్లో పోగొట్టుకున్నా లేదా కోల్పోయినా ఇన్సూరర్ మీకు సహాయం చేస్తారు, డూప్లికేట్ పాస్‌పోర్ట్ పొందడానికి అయ్యే సహేతుకమైన ఖర్చుల కోసం పరిహారం చెల్లిస్తారు.

  • బ్యాగేజ్ కోల్పోతే:

    మీరు ప్రయాణిస్తున్నప్పుడు చెక్ ఇన్ చేసిన సామాను ఆధారంగానే, సామాను యొక్క శాశ్వత నష్టానికి మీకు పరిహారం ఇవ్వబడుతుంది. సాధారణంగా లగేజ్ కవర్ అవసరమైన ఖర్చులను భరించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.

  • లగేజ్ రాకలో ఆలస్యం:

    మీ దుస్తులు, టాయిలెట్రీలు మొదలైన సామానులో అవసరమైన వస్తువులకు మీకు పరిహారం చెల్లించబడుతుంది. అలాంటి కవర్‌ను కలిగి ఉండటం వలన, ఇలాంటి ఒత్తిడితో కూడిన పరిస్థితి ఎదురైనప్పుడు, మీ ప్రయాణం సజావుగా సాగుతుంది.

  • ట్రిప్ రద్దు/తగ్గింపు:

    ఒక ట్రిప్‌ను రద్దు చేయడానికి/ కుదించడానికి వివిధ కారణాలు ఉండవచ్చు. ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితి, ప్రకృతి వైపరీత్యం మొదలైనవి ట్రిప్ తగ్గింపుకు దారితీయవచ్చు. ఈ పాలసీతో మీకు బుక్ చేసిన టికెట్లు మొదలైన వాటి కోసం రీయంబర్స్‌మెంట్ అందుతుందని హామీ ఇవ్వబడుతుంది. బుక్ చేసిన టికెట్లు నాన్-రీఫండబుల్ అయినప్పుడు ఇలాంటి కవర్ ఉపయోగకరంగా ఉంటుంది.

  • విమాన ఆలస్యం:

    విమాన ఆలస్యాలు అనేవి ఏ సమయంలోనైనా జరగవచ్చు. విమానం ఆలస్యం లేదా కొత్త విమానం కోసం మీ బుకింగ్ మార్చుకున్న సందర్భాల్లో అదనపు ఖర్చులు భర్తీ చేయబడతాయి. కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు విమానం ఆలస్యమైనప్పుడు కొత్త విమానాన్ని బుక్ చేసుకునేందుకు కూడా ఆఫర్ చేయవచ్చు. అయితే, సాధ్యమైనంత త్వరగా విషయాన్ని ఇన్సూరర్‌కు తెలియజేయాలి.

  • ప్రీ-హోటల్ బుకింగ్/ బౌన్స్ అయిన ఫ్లైట్:

    మీరు ఇప్పటికే ఒక హోటల్/ ఫ్లైట్ టికెట్‌ను బుక్ చేసుకున్నట్లయితే, మీకు ఫ్లైట్ టికెట్లు లేదా ముందుగా బుక్ చేసుకున్న హోటల్ గదుల ఖర్చులు రీయంబర్స్ చేయబడతాయి. అయితే, వాటి కోసం కవరేజీని ఎంచుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.

  • హైజాకింగ్:

    విమానం హైజాక్ చేయబడే అరుదైన సందర్భాల్లో, ఆర్థిక ఇబ్బందుల కోసం రీయింబర్స్‌మెంట్‌ను ఆఫర్ చేస్తుంది. మీరు అత్యంత విలాసవంతమైన గమ్యస్థానానికి ప్రయాణిస్తున్నట్లయితే, ఈ కవర్ కలిగి ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది.

  • ప్రమాదం కారణంగా మరణం:

    ఇది అంతర్జాతీయ ప్రయాణం చేస్తున్న ఎవరికైనా తప్పనిసరి కవర్. ప్రమాదవశాత్తు మరణం లాంటి ప్రతికూల పరిస్థితులు సంభవించినప్పుడు, మరణించినవారి కుటుంబానికి ఒక నిర్దిష్ట పరిమితి వరకు పరిహారం అందించబడుతుంది.

  • వ్యక్తిగత ప్రమాదం:

    ట్రిప్ సమయంలో జరిగిన ఏదైనా వ్యక్తిగత గాయం కోసం ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా పరిహారం చెల్లించబడుతుంది. అయితే, మద్యపానం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం కారణంగా గాయం జరిగితే, ఎలాంటి పరిహారం చెల్లించబడదు.

  • వ్యక్తిగత బాధ్యత:

    ఇది ప్రయాణ సమయంలో శారీరక గాయాలు లేదా ఆస్తి/ థర్డ్ పార్టీ వ్యక్తికి జరిగిన నష్టం కోసం చేసిన ఏదైనా క్లెయిమ్ కోసం కవరేజీని అందిస్తుంది. ఇటువంటి కవర్‌ను కలిగి ఉండటం అనేది విదేశంలో స్థిరపడటానికి కష్టమయ్యే అనుకోని పరిస్థితుల నుండి భద్రతను నిర్ధారిస్తుంది.

  • మెడికల్ తరలింపు:

    ప్రయాణం కోసం ఒక స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అత్యవసర వైద్య తరలింపును కవర్ చేస్తుంది. ఇన్సూర్ చేయబడిన వ్యక్తిని ఎయిర్‌లిఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఈ కవరేజీని కలిగి ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి, వైద్య పరికరాలతో కూడిన విమానాల ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చేందుకు అయ్యే ఖర్చులను కూడా రీయంబర్స్ చేస్తారు.

  • చదువులో అంతరాయం:

    ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ఎవరైనా, దీనిని ఎంచుకోవాలి స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌. ఇది విదేశాలలో చదువుతున్నప్పుడు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. ఒక ప్లాన్ లోపల అందించబడే కవర్లు కంపెనీ నుండి కంపెనీకి మారవచ్చు మరియు అవసరం ప్రకారం వాటిని కస్టమైజ్ చేసుకోవాలి.

  • ఇంటి దోపిడీ:

    ఇన్సూర్ చేయబడిన వ్యక్తి దేశం వెలుపల ప్రయాణిస్తున్నట్లయితే మరియు ఇన్సూర్ చేయబడిన వ్యక్తి లేనప్పుడు దొంగతనం/ దోపిడీ చర్యలు జరిగితే, ఇన్సూరెన్స్ సంస్థ నష్టాలు/ డ్యామేజీలకు చెల్లిస్తుంది. ఇది ఒక నిర్దిష్ట పరిమితి వరకు మరియు కవరేజ్ పరిధి ప్రకారం కవర్ చేయబడుతుంది.

  • క్రెడిట్ కార్డ్ దొంగతనం:

    ఒక అంతర్జాతీయ దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు ఈ కవర్ తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ దొంగతనం/ దోపిడీ కారణంగా క్రెడిట్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, ఇన్సూరర్‌కు తెలియజేయండి. మీరు అత్యవసర నగదు అడ్వాన్స్‌ని అందుకుంటారు. దీని గురించిన సమాచారం ఏజెంట్ ద్వారా ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి అందించబడుతుంది.

 

ఇతర అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన ప్లాన్లను సరిపోల్చేటప్పుడు, అందించబడే కవరేజ్ కోసం మీరు ఉత్తమ విలువను పొందడానికి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఖర్చును పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. విదేశాలలో సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ మనశ్శాంతి మరియు ఆర్థిక రక్షణను అందిస్తుంది.

గమనిక: ఇది ఒక సమగ్ర జాబితా కాదు. మరింత సమాచారం కోసం పాలసీ వివరాలను జాగ్రత్తగా చదవండి.

 

బజాజ్ అలియంజ్ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ చేయబడదు?

మీ అంతర్జాతీయ పర్యటనలో ఏ తప్పూ జరగకూడదనే ఆశతో మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కవరేజ్ చేయబడినవి ఏమిటో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద కవరేజ్ చేయబడనివి ఏమిటో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మినహాయించబడిన సాధారణ పరిస్థితులు/ సంఘటనలు/ దృష్టాంతాల గురించిన త్వరిత వివరణ ఇక్కడ ఇవ్వబడింది:

  • సైనిక విన్యాసాలు లేదా యుద్ధ కార్యకలాపాలు లేదా వాస్తవ పోరాట రూపంలో ఏదైనా నౌకా, సైనిక లేదా వైమానిక దళ కార్యకలాపాలలో పాల్గొనడం

  • ఏదైనా ఆస్తికి నష్టం, విధ్వంసం లేదా నష్టం లేదా ఏదైనా డ్యామేజ్ లేదా ఖర్చుల ఫలితంగా లేదా అక్కడ ఉత్పన్నమయ్యే లేదా ఏదైనా పర్యవసాన నష్టం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంభవించే లేదా దాని వలన లేదా దాని కారణంగా ఉత్పన్నమయ్యే ఏదైనా నష్టం

  • ఏదైనా నేరపూరిత లేదా ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా పాల్గొనడానికి ప్రయత్నించడం

  • ఏదైనా పర్యవసాన నష్టాలు

  • భారత ప్రభుత్వం ఆంక్షలు విధించిన ఏ దేశానికైనా ప్రయాణించడం లేదా ఒకవేళ భారతదేశానికి చెందిన పౌరుల పై అటువంటి ఆంక్షలను విధించిన లేదా విధించే అవకాశం ఉన్నటువంటి దేశానికి ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి ప్రయాణిస్తే

  • ఒక విమానయాన సంస్థలో ప్రయాణీకునిగా కాకుండా మరో విధంగా విమానయానం చేస్తే

గమనిక: ఇది ఒక సమగ్ర జాబితా కాదు. మరింత సమాచారం కోసం పాలసీ వివరాలను జాగ్రత్తగా చదవండి.


అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా ఎంచుకోవాలి?


మీరు సింగిల్-ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ లేదా మల్టీ-ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నా, దీనికి చాలా పరిశోధన అవసరం. మీరు సరైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడటానికి, ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు దిగువన ఇవ్వబడ్డాయి:

  • ప్రయాణ గమ్యస్థానం:

    ట్రావెల్ ఇన్సూరెన్స్ ముఖ్యంగా మీరు ఎంచుకున్న గమ్యస్థానంపై ఆధారపడి ఉంటుంది. కవరేజ్ కోసం అవసరాలు దేశానికి దేశానికి మారవచ్చు. మీకు తగినంత అంతర్జాతీయ ప్రయాణ కవరేజ్ లేకపోతే కొన్ని దేశాలు వీసాకు కూడా అనుమతి ఇవ్వకపోవచ్చు.

  • ట్రిప్ వ్యవధి:

    మీరు ఒక ప్లాన్‌ కోసం చూసే ముందు, పర్యటన కోసం ఎంత సమయం పడుతుందో పరిగణలోకి తీసుకోండి. పర్యటన తేదీ కన్నా ఎక్కువ వ్యవధి గల ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. ఒకవేళ మరి కొన్ని రోజులకు మీ పర్యటనను పొడగించాల్సి వస్తే, మీరు కవర్ కోల్పోవడం లాంటి నష్టాన్ని ఎదుర్కోలేరు. 

  • ప్రయాణిస్తున్న వ్యక్తుల సంఖ్య:

    మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే ఒక ఇండివిడ్యువల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్. కుటుంబంతో ప్రయాణిస్తున్నట్లయితే ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవాలి. ఒక ప్లాన్ కొనుగోలు చేయడానికి ముందు ప్రయాణికుల సంఖ్యను లెక్కించండి, తదనుగుణంగా లొకేషన్‌ను బట్టి దానిని కస్టమైజ్ చేసుకోండి. అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఖర్చు సాధారణంగా ప్లాన్ నుండి ప్లాన్‌కు మారుతూ ఉంటుంది.

  • ట్రావెల్ ఫ్రీక్వెన్సీ:

    ప్రయాణం చేయడానికి కారణాలు భిన్నంగా ఉండవచ్చు. మీరు తరచూ ప్రయాణం చేసే వారైతే, మీరు మల్టీ-ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవాలి. ప్రతిసారీ కొత్త ట్రావెల్ ప్లాన్ కోసం అప్లై చేయాల్సిన అవసరం లేకుండా, సెలవులను ఆస్వాదించడానికి ఈ ప్లాన్ మీకు సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఒక్క సారి మాత్రమే ప్రయాణిస్తున్నట్లయితే దీనిని ఎంచుకోండి సింగిల్-ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్.

  • క్లెయిమ్ ప్రాసెస్:

    మీరు ఏ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసినా, ఇన్సూరెన్స్ సంస్థ వివిధ క్లెయిమ్‌ల కోసం చెల్లించే ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుంది. ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకునేటప్పుడు, క్లెయిమ్ పరిమితిని పరిగణనలోకి తీసుకోండి. తక్కువ క్లెయిమ్ పరిమితితో, ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితిలో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది సరిపోదు. మీరు ఎక్కడికి వెళుతున్నారో, ఎంత కాలం పాటు ఉంటున్నారో అనే దానిని బట్టి, మీ అంతర్జాతీయ ప్రయాణానికి తగిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోండి. అధిక ఇన్సూరెన్స్ మొత్తం అనేది అధిక ప్రీమియంను సూచిస్తుంది, అయినప్పటికీ ; ఏదైనా ఊహించని సంఘటన జరిగినప్పుడు ఇది విలువైనదిగా ఉంటుంది.

వివిధ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు వాటి ఆఫర్లను పరిశోధించడం అనేది మీ ప్రయాణ అవసరాలకు బాగా సరిపోయే ప్లాన్‌ను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.


నిబంధనలు & షరతులు వర్తిస్తాయి

అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు తెలుసుకోవలసిన విషయాలు


అంతర్జాతీయ పర్యటన ఉత్సాహంగా అనిపించినప్పటికీ, దాని కోసం ప్లాన్ చేయడం అంత ఈజీ కాదు. మీరు మీ గమ్యస్థానానికి బయలుదేరడానికి ముందు, గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు దిగువన ఇవ్వబడ్డాయి:


ప్రప్రథమ విషయాలు!

ఆన్‌లైన్‌లో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం


  • https://www.bajajallianz.com/general-insurance.html ని సందర్శించండి

  • మీరు పొందాలనుకుంటున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ రకాన్ని ఎంచుకోండి

  • తరువాత, మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి

  • మూడు ఎంపికలలో నుండి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ రకాన్ని ఎంచుకోండి:
    1. లీజర్
    2. బిజినెస్ మల్టీ-ట్రిప్
    3. స్టూడెంట్

  • తదుపరి ప్రక్రియ అంతా కూడా మీరు ఎంచుకున్న చివరి ఎంపిక ప్రకారం ఉంటుంది


  • పుట్టిన తేదీ, ప్రయాణ గమ్యస్థానం, తిరిగి వచ్చే మరియు బయలు దేరే తేదీలు, మీరు నివసించే ప్రదేశం పిన్ కోడ్ అందించండి

  • కోట్ అందుకోవడానికి చెల్లుబాటయ్యే ఫోన్ నంబర్‌ను నమోదు చేసి, 'గెట్ మై కోట్' పై క్లిక్ చేయండి

  • విలువలు విశ్లేషించబడతాయి మరియు ఫోన్ పై ఒక కోట్ పంపబడుతుంది. అవసరాన్ని బట్టి మీరు మీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని మార్చుకోవచ్చు

  • మీరు కోరుకుంటున్న ప్లాన్‌ను ఎంచుకోండి. అవసరమైతే మీరు యాడ్-ఆన్‌ల కోసం కూడా చూడవచ్చు

  • సికెవైసి నంబర్ లేదా పాన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి

  • మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం వివరాలను చూడవచ్చు లేదా నేరుగా 'కొనసాగండి' ట్యాబ్ పై క్లిక్ చేయవచ్చు

  • పూర్తి వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, ఆపై 'చెల్లింపు చేయండి' పై క్లిక్ చేయండి

  • చెల్లింపు విధానాన్ని ఎంచుకోండి మరియు చెల్లింపు చేయండి

  • మీరు చెల్లింపు ధృవీకరణ సందేశాన్ని అందుకున్న తర్వాత, ఇన్సూరెన్స్ సంబంధిత డాక్యుమెంట్లు తక్షణమే ఇమెయిల్ ద్వారా పంపబడతాయి

ఆన్‌లైన్‌లో షెన్‌గన్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందడం ద్వారా మీరు సురక్షితంగా ఉంచవచ్చు.

అంతర్జాతీయ ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరా?


తగినంత ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీని కలిగి ఉండటం, ముఖ్యంగా విదేశీ దేశంలో ఉన్నప్పుడు అది తెలివైన నిర్ణయం. అలాగే, ప్రతి విదేశీ దేశంలోకి ప్రవేశించడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదని అర్థం చేసుకోవడం ముఖ్యం.


ఒక అత్యవసర పరిస్థితి ఎప్పుడూ మీ తలుపు తట్టి రాదు. బ్యాగేజ్ పోగొట్టుకోవడం లేదా ట్రిప్ రద్దు వంటి ఊహించని సంఘటనలు మానసికంగా మరియు ఆర్థికంగా మీపై ప్రభావం చూపుతాయి. తగినంత అంతర్జాతీయ కవరేజీని కలిగి ఉండటం అనేది మీ ఆర్థిక స్థితిని మెరుగ్గా ఉంచుతుంది, అలాగే, మీరు నిశ్చింతగా ఉండవచ్చు.


ఏయే దేశాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం అని ఆలోచిస్తున్నారా? ఏదైనా గందరగోళాన్ని నివారించడానికి, మీరు సందర్శించాలనుకుంటున్న గమ్యస్థానం యొక్క రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించండి. దిగువ నున్న పట్టికలో ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయిన దేశాల పేర్లు ఉన్నాయి:


అల్జీరియా

మొరాకో

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

అర్జెంటీనా

నేపాల్

టోగో

అరుబా

రోమానియా

టర్కీ

క్యూబా

షెన్‌గన్ దేశాలు

 

లెబనాన్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

 


గమనిక: ఇది ఒక సమగ్ర జాబితా కాదు. మార్పుకు లోబడి ఉన్న దేశాల విధానానికి అనుగుణంగా దేశాలను జోడించవచ్చు/ తొలగించవచ్చు.


 

భారతీయులకు అరైవల్ వీసా ఎక్కడ లభిస్తుంది?

కొన్నిసార్లు వీసా కోసం అప్లై చేయడం మరియు పొందడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే, కొన్ని దేశాలు వచ్చిన వెంటనే వీసా ఇస్తాయి మరియు మీరు మొత్తం ప్రక్రియను అనుసరించవలసిన అవసరం లేదు.

 

దిగువన ఉన్న పట్టిక భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం వీసా-ఆన్-అరైవల్‌ను అనుమతించే దేశాల పేర్లను చూపుతుంది:

 

అంగోలా

ఇండోనేషియా

మౌరిటానియ*

సోమాలియా*

బొలీవియా

ఇరాన్

నైజీరియా*

ట్యునీషియా

కాబో వెర్డే

జమైకా

ఖతర్

టువాలు

కామెరూన్ యూనియన్ రిపబ్లిక్

జోర్డాన్

రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐల్యాండ్స్

వెనౌటు

కుక్ ఐల్యాండ్స్

కిరిబాటి

రీయూనియన్ ఐల్యాండ్*

జింబాబ్వే

ఫిజీ

లావోస్

ర్వాండా

 

గీని బిసావ్*

మడగాస్కర్

సీషెల్స్

 

 

దిగువ పట్టికలో వీసా ఆన్ అరైవల్ మరియు ఇ-వీసా సదుపాయాన్ని అందించే దేశాల జాబితా ఉంది:

కంబోడియా

మయన్మార్

సురినామ్

థాయిలాండ్

ఇథియోపియా*

సెయింట్ లూసియా

తజకిస్థాన్

వియత్నాం

కెన్యా

శ్రీలంక

టాంజానియా

 

ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా భారతీయులు షెన్‌గన్ వీసా పొందవచ్చా?


భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్ షెన్‌గన్ వీసా అవసరాలతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండకూడదు. షెన్‌గన్ దేశాలు వీసా దరఖాస్తు ప్రమాణాలను నెరవేర్చడానికి ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలని నియమాలను ఏర్పాటు చేశాయి.


షెన్‌గన్ దేశాన్ని సందర్శించాలనుకునే భారతీయులు ఎవరైనా యూరోప్‌ను సందర్శించడానికి షెన్‌గన్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండాలి. భారతదేశం నుండి షెన్‌గన్ వీసా కోసం అప్లై చేయడానికి, నెరవేర్చవలసిన ప్రమాణాలు కింద ఇవ్వబడ్డాయి:!

ఆన్‌లైన్‌లో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం


  • కనీస కవరేజ్ మొత్తం €30,000.00 (మే 2023 నాటికి రూ. 2,699,453.67 కు సమానం)

  • అన్ని షెన్‌గన్ సభ్య దేశాలలో వర్తించే కవరేజ్

  • అత్యవసర వైద్య చికిత్స, వైద్య ప్రయోజనాల కోసం తరలింపు లేదా యూరోప్ నుండి భారతదేశానికి తిరిగి రావడానికి సంబంధించిన ఖర్చుల కోసం కవర్

ఆన్‌లైన్‌లో షెన్‌గన్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందడం ద్వారా మీరు సురక్షితంగా ఉంచవచ్చు.

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?


ట్రావెల్ ఇన్సూరెన్స్ అంతర్జాతీయ క్లెయిమ్ ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు travel@bajajallianz.co.inకు డాక్యుమెంట్లను పంపడం ద్వారా ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు


హాస్పిటలైజేషన్ సంబంధిత సమాచారం అందించడానికి, దయచేసి మా నెంబర్ +91 124 6174720 పై మిస్డ్ కాల్ ఇవ్వండి:


నగదురహిత ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్


విదేశాల్లో హాస్పిటలైజేషన్ కోసం మాత్రమే నగదురహిత క్లెయిమ్ వర్తిస్తుంది. హాస్పిటలైజేషన్ ఖర్చు యుఎస్‌డి 500 కంటే ఎక్కువగా ఉండాలి.

  • ఈ డాక్యుమెంట్లను travel@bajajallianz.co.inకు పంపడం ద్వారా సమర్పించండి

  • మీ క్లెయిమ్ సమర్పించబడి ధృవీకరించబడిన తర్వాత, చెల్లింపు హామీ లేఖను అందుకుంటారు

  • అందించిన సమాచారం లేదా ఏదైనా డాక్యుమెంట్ లోపించినట్లయితే, ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి ఇన్సూరర్ మిమ్మల్ని సంప్రదిస్తారు. తదుపరి ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ కొనసాగుతుంది

  • నగదురహిత క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు
    1. క్లెయిమ్ ఫారం (ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పూరించాలి మరియు సంతకం చేయాలి)
    2. హాజరైన వైద్యుని స్టేట్‌మెంట్ (విదేశీ డాక్టర్ చేత నింపబడి మరియు సంతకం చేయబడాలి)
    3. వైద్య సమాచారాన్ని పొందడానికి మెడికల్ ఇన్ఫర్మేషన్ విడుదల ఫారం (ఆర్ఒఎంఐఎఫ్) పూరించి మరియు సంతకం చేయాలి
    4. మెడికల్ రికార్డులు/కన్సల్టేషన్ పేపర్లు/ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు
    5. ఇన్వాయిస్‌లు/ బిల్లులు / క్లెయిమ్ మొత్తాన్ని అంచనా వేయండి
    6. విదేశీ దేశం నుండి ఎంట్రీ స్టాంప్‌ మరియు భారతదేశం నుండి నిష్క్రమణ స్టాంప్‌తో వీసా కాపీ
    7. ప్రమాదం జరిగిన సందర్భంలో ఎఫ్ఐఆర్ కాపీ (స్థానిక పోలీసు అధికారుల వద్ద ఫైల్ చేయబడింది)
    8. మరణం సందర్భంలో డెత్ సర్టిఫికెట్/ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్

రీయంబర్స్‌మెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్


రీయంబర్స్‌మెంట్‌ కోసం సాధారణంగా 10 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పడుతుంది. సమర్పించిన డాక్యుమెంట్లు సంపూర్ణమైనవి మరియు సరైనవి అని నిర్ధారించుకోండి.


  • డాక్యుమెంట్ యొక్క అన్ని ఒరిజినల్ కాపీలను సేకరించండి మరియు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ అండ్ ట్రావెల్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ (హెచ్ఏటి)కి సమర్పించండి

  • డాక్యుమెంట్లు ధృవీకరించబడిన తర్వాత, 10 పని దినాల్లోపు ఎన్ఇఎఫ్‌టి ద్వారా చెల్లింపు అందుతుంది

  • అందించిన వివరాలు లేదా ఏదైనా డాక్యుమెంట్ పోగొట్టుకున్నట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీకు దానిని గురించి తెలియజేస్తుంది. పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను 45 రోజుల్లోపు సమర్పించాలి

  • ఫార్మాలిటీలను పూర్తి చేయాలని అభ్యర్థిస్తూ, ఇన్సూరర్ 15 రోజుల అంతరంతో మూడు రిమైండర్లను కూడా పంపుతారు

  • 45 రోజులు పూర్తయిన తర్వాత కూడా డాక్యుమెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లయితే, క్లెయిమ్ ప్రాసెస్ నిలిపివేయబడుతుంది

అంతర్జాతీయ ప్రయాణం కోసం మీరు ఏమేమి సిద్ధం చేసుకోవాలి?


లగేజీని ప్యాక్ చేయడం, వసతిని బుక్ చేయడం మరియు విమాన టికెట్లు మాత్రమే కాకుండా మరిన్ని విషయాలు ఉన్నాయి. త్వరిత అవసరమైన అంతర్జాతీయ ప్రయాణ జాబితా ఇక్కడ ఇవ్వబడింది:


  • ప్రయాణ మార్గదర్శకాలను తెలుసుకోండి

  • మీ గమ్య స్థానం, స్థానిక ఆచారాలు, చట్టాలు, భాష మొదలైనవి తెలుసుకోండి.

  • డబ్బు, డెబిట్/ క్రెడిట్ కార్డులు

  • ఒక బలమైన ట్రావెల్ బ్యాగ్

  • యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్

  • పునర్వినియోగించదగిన వాటర్ బాటిల్

  • పాస్‌పోర్ట్, వీసా, గుర్తింపు రుజువు మరియు అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ లాంటి అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ల ఎలక్ట్రానిక్ మరియు హార్డ్ కాపీలను అందుబాటులో ఉంచుకోండి

  • మందులు/ ఫస్ట్-ఎయిడ్ కిట్

  • వ్యాక్సినేషన్ వేయించుకోండి/ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకెళ్లండి

  • అవసరమైతే, కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ రేట్లు మరియు ఏటిఎం ఫీజులను తెలుసుకోండి

  • ప్రాథమిక డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి (ఆఫ్‌లైన్ గూగుల్ మ్యాప్స్ లాంటివి)

  • సౌకర్యవంతమైన వాకింగ్ షూస్

  • ప్రయాణం కోసం టాయిలెట్ ఉపకరణాలు

  • సామాను తాళాలు

  • మైక్రోఫైబర్ టవల్

  • ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండండి!

ట్రావెల్ విత్ కేర్!

మొబైల్ యాప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్


ట్రిప్ ఆలస్యమైన సందర్భంలో మేము ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ యొక్క ప్రత్యేక సేవలను కూడా అందిస్తున్నాము. మీరు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, ట్రిప్ ఆలస్యం కోసం క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు.


మొబైల్ యాప్ విమానాన్ని ట్రాక్ చేస్తుంది. విమాన ఆలస్యం జరిగిన సందర్భంలో పరిమితి ప్రకారం చెల్లింపులు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయబడతాయి.


*నిబంధనలు & షరతులు వర్తిస్తాయి


కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

 4.62

(5,340 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

మదన్‌మోహన్ గోవిందరాజులు

స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ మరియు ధర. చెల్లించడం మరియు కొనుగోలు చేయడం సులభం

పాయల్ నాయక్

చాలా యూజర్ ఫ్రెండ్లీ మరియు సౌకర్యవంతమైనది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు.

కింజల్ బోఘర

ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క సరసమైన ప్రీమియంతో అద్భుతమైన సేవలు

GOT A QUESTION? HERE ARE SOME ANSWERS

ఏవైనా ప్రశ్నలున్నాయా? సమాధానాల కోసం ఇక్కడ చూడండి

వీసా పొందడానికి నాకు అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరమా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి చేయలేదు. అయితే, అవాంతరాలను నివారించడానికి మరియు ప్రయాణాన్ని సాఫీగా సాగించేందుకు, చెల్లుబాటు అయ్యే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలని సిఫార్సు చేయబడింది.

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ మిస్ అయిన విమానాలను కవర్ చేస్తుందా?

అవును, భారతదేశంలోని ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్‌ల కోసం కవరేజీని అందిస్తాయి. ఇది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు మారవచ్చు. ఒక ప్లాన్‌ని కొనుగోలు చేసే ముందు, ప్లాన్ గురించి పూర్తిగా అర్థం చేసుకోండి.

ట్రిప్ రద్దులను కవర్ చేయడానికి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఉపయోగించవచ్చా?

ట్రిప్ రద్దు అయిన సందర్భంలో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది షెడ్యూల్‌లోని నిబంధనలు మరియు షరతులకు లోబడి కవరేజీని అందిస్తుంది. మీ ఇన్సూరెన్స్ సంస్థతో కూడా ఇదే విషయాన్ని చెక్ చేసుకోవడం మంచిది. .

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ హోటల్ బుకింగ్ రద్దులకు కవరేజ్ అందిస్తుందా?

అంతర్జాతీయ ప్రయాణాన్ని రద్దు చేసుకోవడానికి వివిధ కారణాలు ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితిలో సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీని కలిగి ఉండటం వల్ల, మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఉంటారు. హోటల్ బుకింగ్ రద్దు మొదలైన వాటి కోసం మీరు పేర్కొన్న పరిమితి వరకు రీయంబర్స్ అందుకుంటారు.

టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం సాధ్యమేనా?

మీరు టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. అవును, మీరు కొన్ని ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను కోల్పోకుండా ఉండటానికి ముందుగానే జాగ్రత్తగా ఉండటం మంచిది.

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి?

మేము వివిధ వయస్సుల వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తున్నాము. ఈ కింది పట్టిక భారతదేశంలో మా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడానికి అర్హత ప్రమాణాలను చూపుతుంది:

 

ప్లాన్ రకాలు

ప్రమాణం

ఇండివిడ్యువల్/ ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్

వ్యక్తిగత వయస్సు: 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు

స్వీయ, అతని/ ఆమె జీవిత భాగస్వామి మరియు 2 ఆధారపడిన పిల్లలు: 21 సంవత్సరాల లోపు పిల్లలు

పిల్లల వయస్సు: 6 నెలల నుండి 21 సంవత్సరాల మధ్య

స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్

16 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు

సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్

70 సంవత్సరాలు మరియు పైన

గ్రూప్ ట్రావెల్ బీమా

కనీసం: 10 సభ్యులు

 

గమనిక: ఈ ప్రమాణాలు ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు మరియు దేశానికి బిన్నంగా ఉండవచ్చు.

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఏవైనా వైద్య పరీక్షలు అవసరమా?

వైద్య పరీక్షలు చేయించుకోకుండానే ఇన్సూరెన్స్ కవరేజీని అందించే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. అయితే, కొన్ని వయసుల వారికి వైద్య పరీక్షలు అవసరం. కొన్ని దేశాల్లో వైద్య పరీక్షలు తప్పనిసరి. గమ్యస్థానం యొక్క ప్రయాణ మార్గదర్శకాలను అలాగే, ఇన్సూరర్‌‌ను కూడా చెక్ చేయాలని సిఫార్సు చేయడమైనది.

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం మంచిది?

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం సులభం, సౌకర్యవంతమైనది మరియు వేగవంతమైనది. మీరు ట్రావెల్ ప్లాన్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. మీకు అందుబాటులో ఉన్న విధంగా మీరు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు

అంతర్జాతీయ ప్రయాణాల కోసం అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి కాదా?

విదేశీ దేశంలో వైద్య సంరక్షణ లేదా చికిత్స పొందడం అత్యంత ఖరీదైనది. అంతేకాకుండా, కొన్ని దేశాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. పాస్‌పోర్ట్ నష్టం, చెక్-ఇన్ చేసిన సామాను, ట్రిప్ తగ్గింపు లాంటి ఏవైనా అనిశ్చిత సంఘటనలు సంభవించినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రముఖ దేశాల కోసం వీసా మార్గదర్శకాలు


డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి