ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది విదేశాలలో విద్యను కొనసాగించే విద్యార్థులను ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు మరియు అత్యవసర పరిస్థితుల నుండి రక్షించే ఒక ఇన్సూరెన్స్ ప్లాన్. వైద్య ఖర్చులు, ప్రయాణ అంతరాయాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లను కోల్పోవడం కోసం కవరేజ్ లభిస్తుంది, విద్యార్థులు ఆర్థిక ఒత్తిడి లేకుండా చదువు పై దృష్టి పెట్టే విధంగా నిర్ధారిస్తుంది. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ విద్యార్థి శ్రేయస్సు మరియు స్థోమతకు ప్రాధాన్యత ఇచ్చే సమగ్ర మరియు సరసమైన స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తుంది. ఈ ప్లాన్లను ఎంచుకోవడం ద్వారా, విద్యార్థులు అంతర్జాతీయ అధ్యయనం అనుభవాన్ని పొందుతూనే ఏర్పడే ఇబ్బందులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు.
ఇల్లు వదిలి వెళ్ళడం కష్టం. మీకు బాగా అలవాటైన మరియు సౌకర్యవంతమైన ఇంటిని వదిలి వెళ్లడమే కాకుండా, మీ కుటుంబం యొక్క ఆలంబనకు కూడా దూరం అవుతున్నారు. కొత్త దేశంలోని పరిస్థితులకు సర్దుకుపోవడమే కాక మీరు మీ చదువుపై కూడా దృష్టి నిలపాలి, ఇది మొదట్లో చాలా కష్టంగా ఉండవచ్చు.
ఇటువంటి పరిస్థితిలో, మీకు బలమైన మద్దతును అందించే వ్యవస్థ సహాయపడుతుంది మరియు మా స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆ పనిని చేస్తుంది.
విదేశీ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించడం వలన మీ కెరీర్‌కి ప్రయోజనకరంగా ఉంటుంది, అయితే ఒక స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎప్ప్పుడైనా ఎదురయ్యే ఊహించని ఖర్చుల నుండి మీకు రక్షణ కలిపిస్తుంది. ఒక మెడికల్ ఎమర్జెన్సీ, పాస్‍పోర్ట్ కోల్పోవడం, బ్యాగేజ్ కోల్పోవడం లేదా ఒక వైద్య అత్యవసర పరిస్థితిలో కుటుంబ సభ్యుని సందర్శన, విదేశంలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు నమ్మకమైన స్నేహితుని వలె సహకరిస్తుంది.
ఇటువంటి పరిస్థితులలో మా కస్టమైజ్ చేయబడిన స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు మీకు ఆర్థిక సహాయం అందించి మనఃశాంతిని అందిస్తాయి. ఆయా విధంగా, ఇది మిమ్మల్ని చదువు పై దృష్టి నిలిపేలా చేసి మీ లక్ష్యాలను సాధించడానికి సహకరిస్తుంది.
స్థానిక పరిస్థితులపై అవగాహనతో పాటు మాకు ఉన్న అంతర్జాతీయ నైపుణ్యం మీ అవసరాలను తెలుసుకోవడానికి మాకు సహకరిస్తుంది మరియు తదనుగుణంగా మేము మా స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలను రూపొందించాము. ఇన్ హౌస్ అంతర్జాతీయ టోల్ ఫ్రీ మరియు ఫ్యాక్స్ నంబర్లతో పాటు ఇబ్బందులు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్స్ పంపిణీ మీకు అవసరం అయినప్పుడు వెంటనే మద్దతును అందిస్తాయి.
1 హాస్పిటలైజేషన్ కారణంగా అయిన వైద్య ఖర్చులు
2 చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం
3 బెయిల్ బాండ్లు మరియు ట్యూషన్ ఫీజు (స్టూడెంట్ ఎలైట్ మరియు స్టూడెంట్ ప్రైమ్ ప్లాన్లతో అందించబడుతుంది)
4 పాస్‍పోర్ట్ కోల్పోవడం (బ్రిలియెంట్ మైండ్స్ మరియు స్టూడెంట్ ప్రైమ్ ప్లాన్లతో అందించబడుతుంది)
5 కుటుంబ సందర్శన
6 స్పాన్సర్‌కి ప్రమాదం మరియు ఇతర ఆకస్మిక ఖర్చులు
7 ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ (స్టడీ కంపానియన్, స్టూడెంట్ ఎలైట్ మరియు స్టూడెంట్ ప్రైమ్ ప్లాన్లతో అందించబడుతుంది)
ఇంటి వద్ద మీ ప్రియమైన కుటుంబ సభ్యులు ఎలాగో, విదేశాలలో మేము మీ సహచరులము. ఏదైనా ప్రశ్న లేదా సపోర్ట్ కోసం మాకు మా టోల్-ఫ్రీ నంబర్ +91-124-6174720 పై ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి మరియు మేము ప్రాధాన్యత క్రమంలో మిమ్మల్ని సంప్రదిస్తాము. త్వరిత, వేగవంతమైన మరియు ఇబ్బందులు-లేని ప్రాసెస్, మీకు అవసరం అయినప్పుడు మేము మీ వెన్నంటే ఉంటాము.
ఒక స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది విదేశాలలో విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థుల కోసం రూపొందించబడి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అందించబడే ఒక రకమైన ఇన్సూరెన్స్ పాలసీ.
విదేశాలలో ఉన్నత చదువులను కొనసాగించాలనుకుంటున్న లేదా ఒక పరదేశంలో ఉన్నత విద్య కోసం విదేశాలకు ప్రయాణం చేయవలసి ఉన్న ఏ విద్యార్థి అయినా స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు.
లేదు. స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి కాదు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాల్లో మీరు ఉన్నత విద్య కోసం నమోదు చేసుకున్నప్పుడు, అవి ప్రతి విదేశీ విద్యార్థికి స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని తప్పనిసరి చేశాయి.
అలాగే, పాస్‌పోర్ట్ కోల్పోవడం, అత్యవసర వైద్య పరిస్థితి, బ్యాగేజ్ కోల్పోవడం మొదలైనటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు, మీ ఆర్థిక రక్షణ కోసం దీనిని ఎంచుకోవడం ఆర్థిక పరంగా ఒక తెలివైన నిర్ణయం.
మీరు ఆన్‌లైన్‌లో ఒక స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు. మా వెబ్‌సైట్‌ను సందర్శించండి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం నింపండి, చెల్లింపు చేయండి. ఇది వేగవంతమైనది, అవాంతరాలు లేనిది మరియు ఇబ్బందులు లేనిది.
మీరు విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించడానికి కొంత కాలం పాటు ఉండవలసిన అవసరం ఉన్నప్పుడు, మీరు ఒక స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి. మీరు ఎంచుకునే కోర్స్ ప్రకారం, విదేశంలో మీ బస అనేది ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు ఉండవచ్చు. మరో విధంగా చెప్పాలంటే, మీరు విదేశాల్లో ఎంత కాలం పాటు నివసించే సంవత్సరాల ఆధారంగా మీరు ఈ ఇన్సూరెన్స్ పొందాలి.
ఒక స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నదాని కంటే విదేశాలలో వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు విదేశాలలో అత్యవసరమైన వైద్య పరిస్థితిని ఎదుర్కొంటే, అది ఆర్థికంగా మీకు చాలా నష్టం కలిగించవచ్చు. ఈ పాలసీని కలిగి ఉండటం వలన హాస్పిటలైజేషన్ ఖర్చులు భారం తొలగిపోతుంది.
మీ బస సమయంలో బ్యాగేజ్ లేదా పాస్‍పోర్ట్ కోల్పోవడం వలన ఏర్పడే ఆర్థిక నష్టాన్ని కూడా ఇది కవర్ చేస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా శారీరక గాయం కలిగితే, మీ చికిత్స ఖర్చును పాలసీ భరిస్తుంది. ఈ పాలసీ కలిగి ఉండడం వలన మీకు వెంటనే లభించే ప్రయోజనాలలో ఇవి కొన్ని.
విదేశాలలో నివసిస్తున్నప్పుడు మీ ప్రత్యేక అవసరాలను తీర్చడానికి, బజాజ్ అలియంజ్ వద్ద, మేము స్టూడెంట్ కంపానియన్ ప్లాన్, స్టూడెంట్ ఎలైట్ ప్లాన్ మరియు స్టూడెంట్ ప్రైమ్ ప్లాన్ అనే మూడు రకాల స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాము. ఈ ప్లాన్లలో ప్రతి ఒక్కదానిలో ముందుగా-నిర్వచించబడిన ప్రయోజనంతో మరిన్ని వేరియంట్లు ఉన్నాయి.
మీ ఎంపిక ప్రకారం ఈ ప్లాన్లు మరియు దాని వేరియంట్లలో మీరు దేనినైనా ఎంచుకోవచ్చు.
ప్రీమియం మొత్తం అనేది మీరు ఎంచుకున్న ప్లాన్ రకం, ఇన్సూర్ చేయబడిన మొత్తం, మరియు యాడ్-ఆన్ ఫీచర్లపై ఆధారపడి ఉంటుంది. మీ అవసరాలకు సరిపోయే మరియు మీకు పూర్తి రక్షణను అందించే ప్లాన్‌ను మీరు ఎంచుకోవాలి.
లేదు. మీ ప్రయాణం కోసం మీకు ఒక పాలసీ మాత్రమే జారీ చేయబడుతుంది.
● కనీస వయస్సు: 16 సంవత్సరాల వయస్సు.
● గరిష్ట వయస్సు: 35 సంవత్సరాల వయస్సు.
సాధారణంగా, పాలసీ వ్యవధి 1-3 సంవత్సరాల వరకు ఉంటుంది. దీనిని మరో 1 సంవత్సరం వరకు పొడిగించవచ్చు.
మినహాయింపు అనేది ఒక ఖర్చు-పంచుకునే విధానం, ఇందులో ఇన్సూరర్ పేర్కొనబడిన మొత్తాన్ని చెల్లించే బాధ్యత కలిగి ఉండరు లేదా ఒక పేర్కొనబడిన కాలవ్యవధి తరువాత పాలసీ ప్రయోజనాలు అమలవుతాయి. ఒక మినహాయింపు అనేది మీ ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని తగ్గించదు అని గమనించండి.
అంటే దానర్థం ఖర్చులలో కొంత భాగాన్ని మీరు స్వయంగా భరించవలసి ఉంటుంది. మా స్టూడెంట్ ప్రైమ్ ప్లాన్ కొన్ని విభాగాల క్రింద మినహాయింపులను కలిగి ఉంది.
ఒక క్లెయిమ్ చేయడం చాలా సులభం. మీరు చేయవలసిందల్లా మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి మీ క్లెయిమ్‌కు సంబంధించిన సమచారాన్ని మాకు తెలియజేయడం. అది అందిన వెంటనే మా ఎగ్జిక్యూటివ్‍లు క్లెయిమ్ ఇనీషియేషన్ ప్రాసెస్ ప్రారంభిస్తారు. ఒక క్లెయిమ్ చేసేటప్పుడు మీ పాలసీ వివరాలు, పాస్‍పోర్ట్ నంబర్ మొదలైనవి మీ వద్ద సిద్ధంగా ఉంచుకోండి.
మీ క్లెయిమ్‌ను నిరూపించడానికి అవసరమైన డాక్యుమెంట్ల గురించి మా ఎగ్జిక్యూటివ్‌లు మీకు చెబుతారు. మేము Y గంటల్లో మీ క్లెయిమ్‌ను సెటిల్ చేస్తాము.
మీ విదేశీ బస మీ నియంత్రణలో లేని కారణాల వలన పొడిగించబడినట్లయితే, మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించాలి. మేము పొడిగింపునకు వీలు కలిపిస్తాము, కానీ మీరు అదనపు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.
మీరు పాలసీని వద్దనుకొని దానిని రద్దు చేయాలని కోరుకుంటే, మీరు దానిని సులభంగా చేయవచ్చు. మీ పాలసీని రద్దు ప్రక్రియ మూడు విభాగాల క్రిందికి వస్తుంది:
1 పాలసీ వ్యవధి ప్రారంభానికి ముందు
2 పాలసీ వ్యవధి ప్రారంభమైన తర్వాత మీరు ప్రయాణం చేయని సమయం
3 పాలసీ వ్యవధి ప్రారంభమైన తర్వాత మీరు ప్రయాణించి ఉన్న సమయం
ఈ విభాగాలలో ప్రతి ఒక్కదాని క్రింద రద్దు చేయడానికి ఉన్న నియమాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. మొదటి సందర్భంలో మీరు మాకు కేవలం ఈమెయిల్ చేయవలసి ఉండగా, రెండవ సందర్భంలో మీరు మాకు కొన్ని డాక్యుమెంట్లను పంపవలసి/ఈమెయిల్ చేయవలసి ఉంటుంది. మూడవ సందర్భంలో, రిఫండ్స్ గురించి తెలుసుకోవడానికి పైన ఇవ్వబడిన పట్టికను చూడండి.
విదేశాలలో చదువుకునే విద్యార్థుల కోసం ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో ఆరోగ్యం, ప్రయాణం మరియు అధ్యయనం సంబంధిత రిస్కుల కోసం సమగ్ర కవరేజ్ ఉంటుంది. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సరసమైన ప్రీమియంలు మరియు మంచి ప్రయోజనాలతో ప్లాన్లను అందిస్తుంది, విద్యార్థులు వారి అంతర్జాతీయ విద్య సమయంలో విశ్వసనీయమైన మద్దతును కలిగి ఉండేలాగా నిర్ధారిస్తుంది.
అంతర్జాతీయ స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వైద్య అత్యవసర పరిస్థితులు, విద్యా అంతరాయాలు, ప్రయాణ ఆలస్యాలు మరియు కోల్పోయిన వస్తువులను కవర్ చేస్తుంది. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్లాన్లు విద్యార్థులకు సమగ్ర రక్షణను నిర్ధారిస్తాయి.
సరసమైన స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కనుగొనడానికి తక్కువ ధర మరియు ముఖ్యమైన ప్రయోజనాల మధ్య సమతుల్యత పాటించే ఎంపికలను మూల్యాంకన చేయడం అవసరం. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వైద్య ఖర్చులు, ప్రయాణ అంతరాయాలు మరియు అధ్యయనం కొనసాగింపు మద్దతు వంటి కీలకమైన కవరేజీని కలిగి ఉండి తక్కువ ఖర్చు అయ్యే ప్లాన్లను అందిస్తుంది.
స్టాండర్డ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తరచుగా విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉండదు. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు విద్యా మరియు ప్రయాణంలో సంభవించే నిర్దిష్ట ప్రమాదాల నుండి రక్షణను అందిస్తాయి, ఇవి విదేశాలలో చదువుకునే విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి.
వీటిని అందించే ప్లాన్ల కోసం చూడండి:
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వీటన్నింటినీ అందిస్తుంది, విద్యార్థులకు అనుగుణంగా రూపొందించబడిన ప్లాన్లను అందిస్తుంది.
అవును, స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు అధ్యయనంలో అంతరాయాలు వంటి విద్యకు సంబంధించిన నిర్దిష్ట అవసరాలపై దృష్టి పెడుతుంది. విదేశాల్లో విద్య ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో విస్తృతమైన ప్రయాణ ప్రయోజనాలు ఉండవచ్చు, కానీ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఫీచర్లను విద్యార్థుల కోసం ఒకే ప్లాన్‌లో అందిస్తుంది.
అవును, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పొడిగించబడిన అకాడెమిక్ వ్యవధుల ఆవశ్యకతలను తీర్చే వార్షిక స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది. ఈ ప్లాన్లు ఆరోగ్యం, ప్రయాణం మరియు విద్యా రక్షణను అందిస్తాయి, విద్యార్థులు మరియు వారి కుటుంబాలకు మనశ్శాంతిని అందిస్తాయి.
మీ అవసరాల ప్రకారంగా మీరు ఎంచుకోవడానికి స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను మేము ఆఫర్ చేస్తాము. మేము ఆఫర్ చేసేవాటిల్లో ఇవి ఉంటాయి:
విదేశాలలో చదువుకుంటున్నప్పుడు మీరు ఎదుర్కొనే ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చును స్టూడెంట్ కంపానియన్ ప్లాన్ కవర్ చేస్తుంది. ఇన్సూర్ చేయబడిన మొత్తం మరియు ప్రీమియం మొత్తం ఆధారంగా మీరు ఎంచుకోవడానికి మేము మూడు ప్లాన్లను అందిస్తున్నాము - స్టాండర్డ్, సిల్వర్ మరియు గోల్డ్.
స్టాండర్డ్ | సిల్వర్ | గోల్డ్ | |
కవరేజీలు | US$ ల ప్రయోజనం | US$ ల ప్రయోజనం | US$ ల ప్రయోజనం |
---|---|---|---|
వైద్య ఖర్చులు, తరలింపు మరియు రిపేట్రియేషన్ | 50,000 | 1,00,000 | 2,00,000 |
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ పైన ఉన్న (I) లో చేర్చబడింది | 500 | 500 | 500 |
ట్యూషన్ ఫీజు | 10,000 | 10,000 | 10,000 |
ఒక ప్రమాదానికి గురి అయినప్పుడు అయ్యే శారీరక గాయం లేదా ప్రమాదం వలన సంభవించే మరణం ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణానికి సంబంధించి హామీ ఇవ్వబడిన మొత్తంలో కేవలం 50% |
50,000 | 50,000 | 50,000 |
బ్యాగేజ్ కోల్పోవడం (చెక్ చేయబడినది) – ప్రతి బ్యాగేజ్‍కు, గరిష్టంగా 50%, మరియు బ్యాగేజ్లో ప్రతి వస్తువుకు గరిష్టంగా 10% | 1,000 | 1,000 | 1,000 |
ప్రాయోజకునికి ప్రమాదం | 10,000 | 10,000 | 10,000 |
కుటుంబ సందర్శన | 7,500 | 7,500 | 7,500 |
వ్యక్తిగత బాధ్యత | 1,00,000 | 1,00,000 | 1,00,000 |
*అన్ని అంకెలు USD లో ఉన్నాయి
నేడే స్టూడెంట్ కంపానియన్ ప్లాన్ కొనండి!
మా కస్టమైజ్డ్ స్టూడెంట్ ఎలైట్ ప్లాన్ మీ విదేశీ ప్రయాణాన్ని కవర్ చేస్తుంది మరియు మీరు వేరే దేశంలో బస చేస్తున్నప్పుడు మీ ఆరోగ్యానికి సంబంధించిన అవసరాలను నెరవేరుస్తుంది. మీ కోసం ఇందులో మూడు ప్లాన్లు అందించబడుతున్నాయి - స్టాండర్డ్, సిల్వర్ మరియు గోల్డ్.
స్టాండర్డ్ | సిల్వర్ | గోల్డ్ | |
కవరేజీలు | US$ ల ప్రయోజనం | US$ ల ప్రయోజనం | US$ ల ప్రయోజనం |
---|---|---|---|
వైద్య ఖర్చులు, తరలింపు మరియు రిపేట్రియేషన్ | 50,000 | 1,00,000 | 2,00,000 |
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ పైన (I) లో చేర్చబడింది |
500 | 500 | 500 |
వ్యక్తిగత ప్రమాదం | 25,000 | 25,000 | 25,000 |
ప్రమాదం కారణంగా సంభవించిన మరణం మరియు వైకల్యం కామన్ క్యారియర్ | 2,500 | 2,500 | 2,500 |
బ్యాగేజ్ నష్టం (చెక్ చేయబడినది) ప్రతి బ్యాగేజ్‍కు గరిష్టంగా 50% మరియు బ్యాగేజ్లో ప్రతి వస్తువుకు 10% | 1,000 | 1,000 | 1,000 |
బెయిల్ బాండ్ ఇన్సూరెన్స్ | 500 | 500 | 500 |
ట్యూషన్ ఫీజు | 10,000 | 10,000 | 10,000 |
ప్రాయోజకునికి ప్రమాదం | 10,000 | 10,000 | 10,000 |
కుటుంబ సందర్శన | 7,500 | 7,500 | 7,500 |
వ్యక్తిగత బాధ్యత | 1,00,000 | 1,00,000 | 1,00,000 |
*అన్ని అంకెలు USD లో ఉన్నాయి
నేడే స్టూడెంట్ ఎలైట్ ప్లాన్ కొనండి!
ప్రీమియం ఫీచర్లతో నిండి ఉన్న మా స్టూడెంట్ ప్రైమ్ ప్లాన్ హాస్పిటలైజేషన్ సహా ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితిని మరియు ఇతర ఖర్చులను అతి తక్కువ ఖర్చు వద్ద కవర్ చేస్తుంది. మీ కోసం స్టూడెంట్ ప్రైమ్ ప్లాన్ ఏడు ఎంపికలను అందిస్తుంది - స్టాండర్డ్, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, సూపర్ గోల్డ్, సూపర్ ప్లాటినం మరియు మాగ్జిమం.
స్టాండర్డ్ | సిల్వర్ | గోల్డ్ | ప్లాటినం | సూపర్ గోల్డ్ | సూపర్ ప్లాటినం | గరిష్ఠం | మినహాయింపు | |
కవరేజీలు | 50,000 USD | 1 లక్షల USD | 2 లక్షల USD | 3 లక్షల USD | 5 లక్షల USD | 7.5 లక్షల USD | 10 లక్షల USD | - |
---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత ప్రమాదం* | 25,000 USD | 25,000 USD | 25,000 USD | 25,000 USD | 25,000 USD | 25,000 USD | 25,000 USD | నిల్ |
వైద్య ఖర్చులు, తరలింపు | 50000 USD | 100000 USD | 200000 USD | 300000 USD | 500000 USD | 750000 USD | 1000000 USD | 100 USD |
వైద్య ఖర్చులు, తరలింపు సెక్షన్‌లో ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ చేర్చబడింది | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 100 USD |
రిపాట్రియేషన్ | 5000 USD | 5000 USD | 5000 USD | 5500 USD | 5500 USD | 6000 USD | 6500 USD | లేదు |
చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం** | 1000 USD | 1000 USD | 1000 USD | 1000 USD | 1000 USD | 1000 USD | 1000 USD | లేదు |
పాస్‌పోర్ట్ నష్టం | - | - | - | 250 USD | 250 USD | 300 USD | 300 USD | 25 USD |
వ్యక్తిగత బాధ్యత | 100,000 USD | 100,000 USD | 100,000 USD | 150,000 USD | 150,000 USD | 150,000 USD | 150,000 USD | 200 USD |
ప్రమాదం కారణంగా సంభవించిన మరణం మరియు వైకల్యం కామన్ క్యారియర్ | 2500 USD | 2500 USD | 2500 USD | 3000 USD | 3000 USD | 3500 USD | 3500 USD | లేదు |
బెయిల్ బాండ్ ఇన్సూరెన్స్ | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 50 USD |
ల్యాప్‌టాప్ కోల్పోవడం | - | - | - | 500 USD | 500 USD | 500 USD | 500 USD | లేదు |
ట్యూషన్ ఫీజు | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | లేదు |
ప్రాయోజకునికి ప్రమాదం | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | 10,000 USD | లేదు |
కుటుంబ సందర్శన | 7500 USD | 7500 USD | 7500 USD | 7500 USD | 7500 USD | 7500 USD | 7500 USD | లేదు |
ఆత్మహత్య | - | - | - | 1500 USD | 2000 USD | 2000 USD | 2000 USD | లేదు |
సంకేత పదం: * ప్రతి బ్యాగేజ్‍కు గరిష్టంగా 50% మరియు బ్యాగేజ్లో ప్రతి వస్తువుకు 10% కు పరిమితం చేయబడింది |
*అన్ని అంకెలు USD లో ఉన్నాయి
నేడే స్టూడెంట్ ప్రైమ్ ప్లాన్ కొనండి!
మీ స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరాల కోసం బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోవడం వలన అనేక ప్రయోజనాలు లభిస్తాయి:
నిరూపించబడిన ట్రాక్ రికార్డ్‌తో, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ విదేశాలలో చదువుకోవడానికి ప్లాన్ చేసే విద్యార్థులకు ఒక విశ్వసనీయమైన సంస్థగా నిలుస్తుంది.
స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం వివిధ దేశాలకు వివిధ అవసరాలు ఉన్నాయి. విద్యార్థులు వారి గమ్యస్థానం ఆధారంగా నిర్దిష్ట అవసరాల కోసం కవర్ చేయబడతారని బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్ధారిస్తుంది.
అమెరికాలో విద్య అంటే అధిక వైద్య ఖర్చులు కూడా ఉంటాయి, అందువలన అంతర్జాతీయ విద్యార్థుల ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఇది తప్పనిసరి. అనేక విశ్వవిద్యాలయాలు హాస్పిటలైజేషన్ నుండి మానసిక ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటినీ కవర్ చేసే సమగ్ర ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేశాయి.
ట్యూషన్ మరియు జీవన ఖర్చులకు అదనంగా, యు.కె.లోని అంతర్జాతీయ విద్యార్థులకు ఆరోగ్యం మరియు ప్రయాణ కవరేజ్ అవసరం.
వీసా అప్లికేషన్ల కోసం సాధారణంగా విదేశాలలో విద్య ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క రుజువు అవసరం. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆస్ట్రేలియాకు వెళ్లే విద్యార్థుల కోసం రూపొందించబడిన అత్యవసర హెల్త్ కవరేజ్, ప్రయాణ అంతరాయాలు మరియు స్వదేశానికి తిరిగి రావడం ప్రయోజనాలను కలిగి ఉన్న ప్లాన్లను అందిస్తుంది.
కెనడాలోని కొన్ని ప్రాంతాలు అంతర్జాతీయ విద్యార్థులకు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కలిగి ఉండవు, ఈ కారణంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కీలకంగా మారుతుంది. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అత్యవసర పరిస్థితులలో వైద్య సంరక్షణ మరియు ఆర్థిక మద్దతుకు అవాంతరాలు లేని యాక్సెస్‌ను నిర్ధారిస్తుంది.
అంతర్జాతీయ విద్యార్థులకు జర్మనీ ఆరోగ్యం మరియు లయబిలిటీ కవరేజీని తప్పనిసరి చేస్తుంది. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రయాణ సహాయం మరియు వ్యక్తిగత వస్తువుల నష్టం వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తూ ఈ అవసరాలను తీర్చడానికి ప్రణాళిక వేస్తుంది.
ప్రతి గమ్యస్థానంలో ప్రత్యేక సవాళ్లు ఉన్నాయి, మరియు విద్యార్థులు ఆ సవాళ్ళను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడానికి బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ సహకరిస్తుంది.
చదవడానికి విదేశాలకు వెళ్తున్నారా? బజాజ్ అలియంజ్ మీకు సహకరిస్తుంది!
ఒక కోట్ పొందండిరెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి అంతర్జాతీయ స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది:
చిన్న అనారోగ్యాల నుండి తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితుల వరకు, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటలైజేషన్, అవుట్‌పేషెంట్ కేర్ మరియు ప్రిస్క్రిప్షన్ ఔషధాలను కవర్ చేస్తుంది. ఇది విద్యార్థులు ఆర్థిక ఒత్తిడి లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందగలిగే విధంగా నిర్ధారిస్తుంది.
ఆలస్యాలు, రద్దులు లేదా మిస్డ్ కనెక్షన్లు స్టడీ షెడ్యూల్స్‌ను అంతరాయం కలిగించవచ్చు. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఊహించని ప్రయాణ అంతరాయాలకు పరిహారం అందిస్తుంది, విద్యార్థులకు ఒత్తిడిని తగ్గిస్తుంది.
వైద్య అత్యవసర పరిస్థితులు లేదా కుటుంబ సంక్షోభాల విషయంలో, విద్యార్థులు వారి విద్యను తాత్కాలికంగా నిలిపి వేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ చదువులో అంతరాయాల కలిగినట్లయితే, ట్యూషన్ ఫీజులు మరియు ఇతర సంబంధిత ఖర్చులను రీయింబర్స్ చేస్తుంది.
24/7 గ్లోబల్ అసిస్టెన్స్‌తో, విద్యార్థులు పోయిన డాక్యుమెంట్లు, చట్టపరమైన సమస్యలు లేదా ఊహించని ప్రమాదాలు వంటి సవాళ్లను నిర్వహించవచ్చు.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తక్కువ ఖర్చు అయ్యే ప్లాన్లను అందిస్తుంది, ఇది విద్యార్థులకు మంచి కవరేజీని నిర్ధారిస్తూ సరసమైన స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను యాక్సెస్ చేయడం సులభతరం చేస్తుంది.
అఫోర్డబిలిటీ మరియు సమగ్ర రక్షణ యొక్క ఈ కలయిక బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని విద్యార్థుల కోసం ఒక ఉత్తమ ఎంపికగా చేస్తుంది.
విద్యా ప్రయాణాలు తరచుగా ప్రారంభ వ్యవధులకు మించి సాగుతాయి, పెరుగుతున్న అవసరాలకు సరిపోయే విధంగా విద్యార్థులు వారి ఇన్సూరెన్స్ కవరేజీని సర్దుబాటు చేయవలసి ఉంటుంది. దీనిని గుర్తించి, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తన స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం అనేక ఫ్లెక్సిబుల్ ఎక్స్టెన్షన్ ఎంపికలను అందిస్తుంది, ఇది వారి విద్యా ప్రయత్నాల అంతటా అంతరాయం లేని రక్షణను నిర్ధారిస్తుంది.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రెన్యూవల్ ప్రక్రియను సులభతరం చేసింది, విద్యార్థులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా వారి పాలసీలను సులభంగా పొడిగించడానికి అనుమతిస్తుంది. ఈ అవాంతరాలు-లేని ప్రక్రియ కవరేజ్ నిరంతరంగా ఉండేలాగా నిర్ధారిస్తుంది, విద్యార్థులు విదేశాలలో ఉన్నప్పుడు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయపడుతుంది.
విద్యార్థులు అదనపు విద్యా సంవత్సరాలు, ఇంటర్న్‌షిప్‌లు లేదా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లలో పాల్గొంటున్నట్లయితే, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఎంపికలను అందిస్తుంది. ఈ ప్లాన్లు సుదీర్ఘమైన అధ్యయనం కాలపరిమితులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి, భవిష్యత్తులో వారి విద్య ఏ దిశలో సాగుతుంది అనే అంశంతో సంబంధం లేకుండా సమగ్ర రక్షణను నిర్ధారిస్తాయి.
తమ పాలసీలను విస్తరించే విద్యార్థులు హెల్త్ కవరేజ్, ప్రయాణ సహాయం మరియు ఊహించని అత్యవసర పరిస్థితుల కోసం మద్దతుతో సహా అన్ని ప్రయోజనాలను కలిగి ఉంటారు. పొడిగించబడిన వారి విద్యా ప్రయాణంలో వారు పూర్తిగా కవర్ చేయబడతారు అనే విశ్వాసంతో వారు మనఃశాంతితో ఉండవచ్చు.
ఈ ఫ్లెక్సిబుల్ ఎక్స్టెన్షన్ పరిష్కారాల ద్వారా, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మారుతున్న విద్యా కాలపరిమితులను అర్థం చేసుకున్నందున విద్యార్థులకు మద్దతు అందించేందుకు కట్టుబడి ఉంది మరియు వారి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సమగ్ర కవరేజ్‌ను అందిస్తుంది.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద ఒక క్లెయిమ్ ఫైల్ చేయడం అనేది సులభంగా ఉంటుంది మరియు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, అత్యవసర పరిస్థితులలో ఇది విద్యార్థులకు తగిన సహకారాన్ని అందిస్తుంది. బాగా రూపొందించబడిన ప్రక్రియతో, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అవసరమైనప్పుడు హామీని అందించడానికి సామర్థ్యం మరియు పారదర్శకతకు ప్రాధాన్యతను ఇస్తుంది.
క్లెయిమ్ ప్రాసెస్‌లో మొదటి దశలో ఒక సంఘటన సంభవించిన వెంటనే బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం ఉంటుంది. విద్యార్థులు టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ ద్వారా లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సంఘటనను రిపోర్ట్ చేయవచ్చు, ఇది 24/7 అందుబాటులో ఉంటుంది . వేగవంతమైన రిపోర్టింగ్ ఆలస్యం లేకుండా క్లెయిమ్ ప్రాసెస్ ప్రారంభించబడుతుందని నిర్ధారిస్తుంది.
క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం, విద్యార్థులు వైద్య నివేదికలు, ఖర్చుల రసీదులు లేదా దొంగతనం లేదా ప్రమాదాల సందర్భంలో పోలీస్ రిపోర్టులు వంటి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అవసరమైన డాక్యుమెంటేషన్ పై స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తుంది, ఇది సమర్పణ ప్రక్రియను అవాంతరాలు లేకుండా చేస్తుంది మరియు తక్కువ సమయం తీసుకుంటుంది.
విద్యార్థుల చదువుకు అతి తక్కువ అంతరాయం ఉండేలాగా నిర్ధారించడానికి క్లెయిమ్‌ల వేగంగా మరియు అవాంతరాలు లేకుండా ప్రాసెస్ చేయడానికి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కట్టుబడి ఉంది. రీయింబర్స్మెంట్లు సమర్థవంతంగా పంపిణీ చేయబడతాయి, తక్షణ సేవకు కంపెనీ యొక్క అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి.
క్లెయిమ్ ప్రాసెస్ సమయంలో ఏవైనా సవాళ్లు ఎదురైతే, విద్యార్థులు మార్గదర్శకత్వం మరియు మద్దతు కోసం బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క 24/7 గ్లోబల్ అసిస్టెన్స్ సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు, ఇది సులభమైన పరిష్కారాన్ని నిర్ధారిస్తుంది.
ఈ సమర్థవంతమైన మరియు విద్యార్థికి ప్రయోజనం చేకూర్చే క్లెయిమ్ ప్రక్రియ క్లిష్టమైన క్షణాల్లో విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క నిబద్ధతను తెలియజేస్తుంది, ఇది వారు విదేశాలలో వారి విద్యా ప్రయాణం అంతటా సురక్షితంగా మరియు జాగ్రత్తగా ఉండేలాగా నిర్ధారిస్తుంది.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
మా స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం ఎంత సులభమో, దానిని రద్దు చేసే మార్గం కూడా అంతే సులభం. మూడు సంభావ్య పరిస్థితులలో రద్దు విధానం క్రింద ఇవ్వబడింది:
ఈ సందర్భంలో రద్దు ఛార్జీల రూపంలో మీరు రూ 250/- చెల్లించవలసి ఉంటుందని గమనించండి.
ఈ సందర్భంలో, పాలసీని రద్దు చేయడానికి మీరు ఈ క్రింది డాక్యుమెంట్లను మాకు పంపాలి:
మా అండర్‌రైటర్ల నుండి అందిన ఆమోదం ఆధారంగా, ప్రారంభ తేదీ తరువాత మీ ఈమెయిల్ మరియు పాస్‌పోర్ట్ కాపీ అందుకున్న ఒక పని దినం తరువాత మీ పాలసీ రద్దు చేయబడుతుంది.
ఈ సందర్భంలో, పాలసీ వ్యవధి గడువు ముగియడానికి ముందుగానే తిరిగి రావడం, క్రింద ఇవ్వబడిన పట్టికలో చూపించిన విధంగా మేము ప్రీమియంలను నిలిపి ఉంచుతాము, మరియు పాలసీ పై ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే, మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తాము.
రిస్క్ వ్యవధి |
మేము కొనసాగిస్తున్న ప్రీమియం రేటు |
పాలసీ వ్యవధిలో 50% కంటే ఎక్కువ |
100% |
పాలసీ వ్యవధి యొక్క 40%-50% మధ్య |
80% |
పాలసీ వ్యవధి యొక్క 30%-40% మధ్య |
75% |
పాలసీ వ్యవధి యొక్క 20-30% మధ్య |
60% |
పాలసీ వ్యవధి యొక్క పాలసీ inception-20% |
50% |
(5,340 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
డేవిడ్ విలియమ్స్
చాలా సులభమైన ప్రాసెస్. ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు అవాంతరాలు లేని ప్రాసెస్
సత్విందర్ కౌర్
నాకు మీ ఆన్‌లైన్ సర్వీస్ నచ్చింది. నేను దీనితో సంతోషంగా ఉన్నాను.
మదన్‌మోహన్ గోవిందరాజులు
స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ మరియు ధర. చెల్లించడం మరియు కొనుగోలు చేయడం సులభం
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి