ఇప్పుడు అన్ని ఇన్సూరెన్స్ పాలసీలను ఆధార్ మరియు పాన్/ఫారం 60కు లింక్ చేయడం తప్పనిసరి అని Insurance Regulatory and Development Authority of India (IRDAI) ఒక ప్రకటనను జారీ చేసింది. ఈ డాక్యుమెంట్లు సమర్పించని ఏ కస్టమర్‌కు కూడా కొత్త పాలసీలు జారీ చేయబడవని, అలాగే ప్రస్తుత కస్టమర్లు వారి ఆధార్, పాన్ కార్డును వారి అన్ని పాలసీలకు లింక్ చేయాలని ఈ ఆదేశం పేర్కొంది.
ఈ కొత్త నిబంధనకు సంబంధించి మీకు ఉన్న కొన్ని సాధారణ ప్రశ్నలకు సమాధానాలు క్రింద ఇవ్వబడ్డాయి:
- ప్ర. ఇది వర్తించినప్పటి నుండి ఏదైనా నిర్దిష్ట తేదీ ఉందా లేదా అది తక్షణమే అమలులోకి వస్తుందా?జ. IRDAI సర్క్యులర్ తక్షణ ప్రభావంతో వర్తిస్తుంది.
- ప్ర. అర్థం చేసుకున్నట్లు, IRDAI నోటిఫికేషన్ ప్రకారం, ఆధార్ కార్డ్ లేకుండా కొత్త పాలసీలు జారీ చేయబడవు. జారీ చేసే సమయంలో నాకు ఆధార్ కార్డ్ లేకపోతే ఏం చేయాలి?జ. పాలసీ జారీ చేసే సమయంలో క్లయింట్ ఆధార్ నంబర్ మరియు పర్మనెంట్ అకౌంట్ నంబర్‌ను సమర్పించకపోతే కొత్త పాలసీలను జారీ చేయవచ్చు. అయితే, పాలసీ జారీ చేసిన తేదీ నుండి ఆరు నెలల వ్యవధిలోపు కస్టమర్ దానిని సమర్పించాలి.
- ప్ర. ఇప్పటికే ఉన్న పాలసీల కోసం, పాలసీని జారీ చేసే సమయంలో ఆధార్ నంబర్ ఇవ్వకపోతే (ఉదాహరణకు మరొక ఐడి రూపంలో, చిరునామా రుజువు ఉపయోగించబడితే), ఈ పాలసీలను ఆధార్‌తో లింక్ చేయాల్సిన సమయానికి ఏదైనా గడువు ఉందా? గడువు ముగియకపోతే, పాలసీదారులకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి?జ. ఇప్పటికే ఉన్న పాలసీల కోసం, కస్టమర్ తమ ఆధార్ మరియు పాన్ నంబర్/ఫారం 60 ను 31 మార్చి 2018 నాటికి సమర్పించాలి. ఒకవేళ కస్టమర్ సరైన సమయం లోపు దానిని సమర్పించకపోతే, పేర్కొన్న అకౌంట్ అదే సమయం వరకు పనిచేయడం నిలిపివేయబడుతుంది.
- ప్ర. ఒకవేళ కొంతమంది పాలసీదారులు ఇంకా వారి ఆధార్‌ను లింక్ చేయకుండా క్లెయిమ్ చేస్తే, వారి క్లెయిమ్ తిరస్కరించబడుతుందా?జ. ఒకవేళ పాలసీదారు తమ ఆధార్ మరియు పాన్ వివరాలను లింక్ చేయకపోతే, వారు వాటిని సమర్పించే వరకు వారి క్లెయిమ్‌లు నిలిపివేయబడతాయి.
- ప్ర. ఒకవేళ పాలసీదారునికి ఆధార్ లేకపోతే అతని/ఆమె పాలసీ రద్దు అవుతుందా లేదా క్లెయిములు తిరస్కరించబడతాయా?జ. లేదు, పాలసీలు రద్దు కావు, లేదా క్లెయిములు తిరస్కరించబడవు. అయితే, పాలసీదారు ఆధార్ మరియు పాన్/ ఫారం 60 వివరాలను సబ్మిట్ చేసేంత వరకు క్లెయిముల తాత్కాలికంగా నిలిపివేయబడతాయి.
- ప్ర. ప్రస్తుత పాలసీహోల్డర్ల విషయంలో, పాలసీని లేదా క్లెయిమ్‌లను నిలిపివేసిన సందర్భంలో ఇన్సూరెన్స్ ఒప్పందం అమలులోకి రాదా?? ఎందుకనగా, గతంలో పాలసీని జారీ చేసే సమయంలో ఆధార్ గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు.ప్ర. ఇన్సూరెన్స్ కాంట్రాక్టులు భారత కాంట్రాక్ట్ చట్టం ద్వారా నిర్వహించబడతాయి. అయితే, మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 ఆధారంగా రూపొందించిన పిఎంఎల్ నిబంధనల ప్రకారం, ఆధార్ మరియు పాన్/ఫారం 60 సమర్పించాల్సిన అవసరం ఉంది. పిఎంఎల్ నియమాలు చట్టపరమైన విధానాలతో కూడినవి మరియు వాటిని తప్పక అనుసరించాలి.
మీ ఏవైనా సందేహాలకు సమాధానం లభిస్తుందని మేము ఆశిస్తున్నాము!
మీకు మా వద్ద ఒక పాలసీ ఉంటే, మరియు మీ ఆధార్ మరియు పాన్/ఫారం 60 వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేయండి
రిప్లై ఇవ్వండి