Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

బజాజ్ అలియంజ్ - ఫార్మ్‌మిత్ర మొబైల్ యాప్

Farmitra

మీకు అందుబాటులో వ్యవసాయం! మీ అన్ని వ్యవసాయ సంబంధిత ప్రశ్నల కోసం ఈ వన్-స్టాప్-షాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి!

Scroll

పరిచయం

ఫార్మ్‌మిత్ర యాప్ అనేది రైతులకు తమ రోజువారీ కార్యకలాపాలలో సహాయపడటానికి సాంకేతికతను వినియోగించుకునే ఒక ఇనీషియేటివ్. వాతావరణ అంచనా, భారతదేశ వ్యాప్తంగా మార్కెట్ ధర మరియు మరిన్ని వివరాలను అందించే ఈ యాప్ రైతులకు నిజమైన స్నేహితునిగా పనిచేస్తుంది. రైతులకు వ్యవసాయం గురించి అవసరమైన అంత పరిజ్ఞానంతో సాధికారత కల్పించడానికి ఈ యాప్ ఒక ఇనీషియేటివ్.

క్రియాశీలంగా ఉన్న బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ యూజర్ల కోసం ఇది ఒక దృష్టికోణంగా కూడా పనిచేస్తుంది మరియు క్లెయిమ్ సపోర్ట్‌లో కూడా సహాయపడుతుంది.

ముఖ్యమైన ఫీచర్లు

ఫార్మ్‌మిత్రని అత్యంత ఉపయోగకరమైన ఒక యాప్‌గా చేసే కొన్ని ఫీచర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి

వాతావరణ అంచనాలు

వ్యవసాయంలో వాతావరణం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు వ్యవసాయ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. ఈ యాప్ వర్షపాతం, ఉష్ణోగ్రతలో మార్పులు, తేమ స్థాయిలు, గాలి వేగం వంటి వాతావరణ అప్‌డేట్‌లను బ్లాక్ స్థాయిలో ఏడు రోజుల వరకు అందిస్తుంది. యాప్ షేర్ చేసే సమాచారం: మరింత చదవండి

వాతావరణ అంచనాలు

వ్యవసాయంలో వాతావరణం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు వ్యవసాయ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. ఈ యాప్ వర్షపాతం, ఉష్ణోగ్రతలో మార్పులు, తేమ స్థాయిలు, గాలి వేగం వంటి వాతావరణ అప్‌డేట్‌లను బ్లాక్ స్థాయిలో ఏడు రోజుల వరకు అందిస్తుంది. యాప్ షేర్ చేసే సమాచారం:

  • 24 గంటలపాటు ఉష్ణోగ్రత మరియు వర్షపాతం అప్‌డేట్‌లు
  • వ్యవసాయ కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి తదుపరి 7 రోజుల సూచన

క్రాప్ అడ్వయిజరీ మరియు క్రాప్ డాక్టర్

రైతులకు పంట ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ యాప్ అనేక మార్గాల్లో వారికి సహాయపడే ఫీచర్లతో లోడ్ చేయబడింది, అవి: మరింత చదవండి

క్రాప్ అడ్వయిజరీ మరియు క్రాప్ డాక్టర్

రైతులకు పంట ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ యాప్ అనేక మార్గాల్లో వారికి సహాయపడే ఫీచర్లతో లోడ్ చేయబడింది, అవి:

  • పంట విత్తడం తేదీకి సంబంధించి రైతు స్థాయిలో వ్యక్తిగతీకరించబడిన ప్రాంతీయ భాషలలో సిఫార్సులతో ఆటోమేటెడ్ లొకేషన్ లేదా బ్లాక్ నిర్దిష్ట సలహా.
  • సీజన్, వాతావరణం మరియు నేల పరిస్థితుల ఆధారంగా సలహాలు
  • ఎంపిక చేయబడిన పంటల కోసం కీటక మరియు వ్యాధుల డయాగ్నోస్టిక్ సాధనం

మార్కెట్ ధర

రోజువారీ ప్రాతిపదికన కమోడిటీ యొక్క మార్కెట్ ధరలను తెలుసుకోవడం రైతులకు ముఖ్యం. ఎప్పుడు దేనిని విక్రయించాలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ యాప్ రైతులకు సహాయపడుతుంది. మరింత చదవండి

మార్కెట్ ధర

రోజువారీ ప్రాతిపదికన కమోడిటీ యొక్క మార్కెట్ ధరలను తెలుసుకోవడం రైతులకు ముఖ్యం. ఎప్పుడు దేనిని విక్రయించాలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ యాప్ రైతులకు సహాయపడుతుంది.

  • ఎంపిక చేయబడిన కమోడిటీ కోసం అన్ని భారతదేశ స్థాయి మార్కెట్లు (స్థానిక, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి మార్కెట్లు) ధర
  • దేశవ్యాప్తంగా ప్రాదేశిక విజువలైజేషన్ల కోసం డిజి-మండీ టూల్

వార్తలు

వ్యవసాయ రంగంలో ఇటీవలి అభివృద్ధి, మెరుగైన పద్ధతులపై అప్‌డేట్‌లు, రైతుల విజయ గాథలు, మంచి వ్యవసాయ పద్ధతులు గురించి రైతులు తెలుసుకోవాలి, మరింత చదవండి

వార్తలు

వ్యవసాయ రంగంలో ఇటీవలి అభివృద్ధి, మెరుగైన పద్ధతులపై అప్‌డేట్‌లు, రైతుల విజయ గాథలు, మంచి వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, అగ్రి-ఇన్సూరెన్స్ మరియు ప్రాంతీయ భాషలో లోన్ సంబంధిత అప్‌డేట్‌ల గురించి రైతులు తెలుసుకోవాలి. ఈ యాప్ వారికి మార్గనిర్దేశం చేస్తుంది మరియు వీటిని ఎనేబుల్ చేస్తుంది:

  • అత్యంత విశ్వసనీయ సమాచార సేవల నుండి రియల్ టైమ్ సమాచారం
  • రైతులలో పంట బీమా గురించి అవగాహనను ప్రోత్సహించడానికి రాష్ట్ర నిర్దిష్ట ఆర్టికల్స్

ఇన్సూరెన్స్ బ్రీఫ్‌కేస్

ఈ సేవ రైతులు తమ పాలసీ మరియు క్లెయిమ్స్ సమాచారం గురించి ఒకే వీక్షణను కలిగి ఉండడానికి వీలు కల్పిస్తుంది. ఈ సేవ రైతుకు వీటికి వీలు కల్పిస్తుంది: మరింత చదవండి

ఇన్సూరెన్స్ బ్రీఫ్‌కేస్

ఈ సేవ రైతులు తమ పాలసీ మరియు క్లెయిమ్స్ సమాచారం గురించి ఒకే వీక్షణను కలిగి ఉండడానికి వీలు కల్పిస్తుంది. ఈ సేవ రైతుకు వీటికి వీలు కల్పిస్తుంది:

  • అప్లికేషన్ ఐడి కి సంబంధించి పాలసీ వివరాలను చూడండి
  • సెల్ఫ్-సర్వే ఎంపికతో పాటు క్లెయిమ్‌ను తెలియజేయండి
  • క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయండి మరియు ఏవైనా ఫిర్యాదులు/ప్రశ్నలను పంపండి

ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంది

యాప్‌ను మెరుగ్గా అర్థం చేసుకోవడంలో మరియు అనుసరించడంలో రైతులకు సహాయపడటానికి ఫార్మ్‌మిత్ర యాప్ ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంది.

వివరణ

 

ఫార్మ్‌మిత్ర యాప్ అనేది రైతులు వ్యవసాయం గురించి అన్ని వివరాలను తెలుసుకోవడానికి అనుకూలమైన యాప్. ఈ వీడియో మీకు యాప్ గురించిన సమాచారాన్ని మరియు సరైన మార్గంలో దానిని ఎలా ఉపయోగించాలి అనేదాని గురించి తెలియజేస్తుంది. వాటిని ఒక సారి పరిశీలించండి!

ఫార్మ్‌మిత్ర వీడియో పేరు- ఫార్మ్‌మిత్ర-కేరింగ్లీ యువర్స్ | | ప్రతి రైతు యొక్క విశ్వసనీయ స్నేహితుడు మరియు ఇన్సూరెన్స్ గైడ్!

ఫార్మ్‌మిత్ర-కేరింగ్లీ యువర్స్ | | ప్రతి రైతు యొక్క విశ్వసనీయ స్నేహితుడు మరియు ఇన్సూరెన్స్ గైడ్!

bajaj allianz
faq

ఏవైనా ప్రశ్నలున్నాయా? సమాధానాల కోసం ఇక్కడ చూడండి

నా ప్రాంతీయ భాషలో నేను ఖచ్చితమైన ప్రాంతీయ వ్యవసాయ సలహాలను పొందవచ్చా?

మట్టి, వాతావరణం, వివిధ రకాల ప్రాధాన్యత, ఇంటర్‌క్రాపింగ్ వ్యవస్థలు వంటి అన్ని ప్రాంతీయ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా శాస్త్రీయ పరిశోధన ఆధారంగా సలహాలు అందించబడతాయి. అవి ప్రాంతీయ భాషలో అందించబడతాయి మరియు పంట జీవన చక్రం, విత్తడం తేదీ ఆధారంగా క్రమానుగతంగా అప్‌డేట్ చేయబడతాయి.

నేను సలహాల కోసం చెల్లించలేను, వీటిని ఉచితంగా పొందవచ్చా?

అవును, ఎంపిక చేయబడిన భౌగోళిక ప్రాంతాల్లో రైతులకు ఉచిత సలహాలు అందుబాటులో ఉన్నాయి. 

ఫార్మ్‌మిత్ర యాప్‌లో వాతావరణ సూచన ఖచ్చితంగా అందుబాటులో ఉందా?

ఫార్మ్‌మిత్రలో అందుబాటులో ఉన్న వాతావరణ సూచన అక్షాంశం మరియు రేఖాంశ వివరాల ఆధారంగా మా సలహా భాగస్వాములచే అందించబడుతుంది. ఈ విధంగా, మేము బ్లాక్ స్థాయిలో అత్యంత ధృవీకరించబడిన వాతావరణ సూచనను అందించగలుగుతాము.

ఈ రోజు వర్షం పడుతుందా లేదా అని నేను ఎలా తెలుసుకోగలను?

ఈ యాప్ సకాలంలో వాతావరణ సూచనను అందించడానికి ఇంటిగ్రేట్ చేయబడింది, ఇది బ్లాక్ స్థాయిలో గంటలవారీగా వర్షపు సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఈ గంటలవారీ వాతావరణ సూచన మీకు నీటిపారుదల మరియు పిచికారీ వంటి కార్యకలాపాలను నిర్వహించడానికి మీకు సహాయం చేస్తుంది. 

భవిష్యత్తు వాతావరణ సూచన ఆధారంగా నేను నా పంట నిర్వహణ పద్ధతులను ఎలా ప్లాన్ చేయాలి? (విత్తడం, పిచికారీ చేయడం, నీటిపారుదల, కోత, పంటకోత అనంతర కార్యకలాపాలు)

విశ్వసనీయ వాతావరణ సూచన ఏజెన్సీల నుండి వాతావరణ హెచ్చరికలు మరియు అప్‌డేట్‌లు ముందస్తు ప్రణాళిక సహాయపడతాయి. విత్తడం/నాటడం తేదీ ఆధారంగా మీరు కార్యకలాపాల పూర్తి పంట క్యాలెండర్‌ను చూడవచ్చు. ఇది వివిధ వ్యవసాయ పద్ధతుల నిర్వహణలో సహాయపడుతుంది.

నేను నా పరిసరాల్లో మట్టి మరియు విత్తన పరీక్ష ల్యాబ్‌లను కనుగొనవచ్చా?

భారతదేశ వ్యాప్తంగా మట్టి మరియు విత్తన టెస్టింగ్ ల్యాబ్‌లను శోధించడానికి లొకేటర్ సమాచారం మీకు అందుబాటులో ఉంది. మీకు లొకేషన్‌ను ఎంచుకోవడానికి మరియు ల్యాబ్‌ల చిరునామాను చూడటానికి ఒక ఎంపిక ఉంది. 

నా ఉత్పత్తులు కోతకు సిద్ధంగా ఉంటాయి మరియు అది వృథాగా లేదా మురికిగా అవ్వకుండా శీతల గిడ్డంగులలో నిల్వ చేయాలి. నా ప్రాంతంలో శీతల గిడ్డంగులను నేను ఎలా కనుగొనగలను?

భారతదేశ వ్యాప్తంగా లొకేటర్ సమాచారం అందుబాటులో ఉంది. మీ ప్రాంతాన్ని ఎంచుకోండి మరియు డ్రాప్ డౌన్ నుండి లొకేటర్‌ను ఎంచుకోవడానికి ఎంపికను ఎంచుకోండి. మీ ప్రాంతంలో శీతల గిడ్డంగి యొక్క సమీప లొకేషన్‌ను మీరు కనుగొంటారు.

మంచి దిగుబడిని నిర్ధారించడానికి, మేము కీటకనాశిని రేణువుల సరైన మేళవింపుపై సమాచారాన్ని పొందవచ్చా?

అవును! కీటకనాశిని రేణువుల సరైన మేళవింపుపై చాలా సమాచారం అందుబాటులో ఉంది. మీరు ఫార్మ్‌మిత్ర యాప్‌ను శోధించవచ్చు మరియు అవసరమైన వివరాలను కనుగొనవచ్చు.

హామీ ఇవ్వబడిన మొత్తం, ప్రాంతం మరియు కవర్ చేయబడిన పంట, పాలసీ వివరాలు వంటి నా పంట బీమా వివరాల గురించి నాకు తెలియదు, నేను ఈ సమాచారాన్ని ఎక్కడ పొందగలను?

మీరు మీ పంట, అకౌంట్ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా అప్లికేషన్ మరియు పాలసీ సమాచారం కోసం శోధించవచ్చు. హామీ ఇవ్వబడిన మొత్తం, ప్రాంతం మరియు కవర్ చేయబడిన పంట వంటి అన్ని వివరాలు యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

స్థానికీకరించిన నష్టాలు మరియు పంటకోత తర్వాత నష్టాల కోసం నేను ఇన్సూరెన్స్ సంస్థకు ఎలా మరియు ఎక్కడ క్లెయిమ్‌ను తెలియజేయాలి?

ఫార్మ్‌మిత్ర యాప్ యొక్క ఇన్సూరెన్స్ బ్రీఫ్‌కేస్ మాడ్యూల్‌లో క్లెయిమ్ ఫంక్షన్ ఎనేబుల్ చేయబడింది, ఇక్కడ మీరు మీ ఇన్సూర్ చేయబడిన పంటకు జరిగిన నష్టంపై స్థానికీకరించిన క్లెయిమ్‌ను తెలియజేయవచ్చు. 

‘ఫార్మ్‌మిత్ర’ ద్వారా ఏ రకమైన పంట నష్టాలను తెలియజేస్తారు?

కేవలం పిఎంఎఫ్‌బివై స్కీం సంబంధిత స్థానిక పంట క్లెయిమ్ నష్టాలను మాత్రమే 'ఫార్మ్‌మిత్ర' మొబైల్ అప్లికేషన్ ద్వారా తెలియజేయవచ్చు.

మిక్స్‌డ్ లేదా ఇంటర్‌క్రాప్స్ కోసం క్లెయిమ్‌లను ఎలా తెలియజేయాలి?

ఇంటర్‌క్రాపింగ్ లేదా మిక్స్‌డ్ క్రాపింగ్ సిస్టమ్‌లో 2 లేదా 2 కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు ప్రతి పంట క్లెయిమ్ కోసం వారి ప్రభావిత ప్రాంతంతో విడిగా సమాచారం అందించాలి.

ఈ యాప్‌లో అందించబడే ఇన్సూరెన్స్ మరియు సేవలకు సంబంధించిన ప్రశ్నలను నేను ఎలా ఆడగగలను?

మీరు 'సహాయం' విభాగం కింద ఫార్మ్‌మిత్ర యాప్ ద్వారా మీ ప్రశ్నలను లేవదీయవచ్చు.

క్లెయిమ్ సమాచారం తర్వాత అకౌంట్‌లో క్లెయిమ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి ఏదైనా కాలపరిమితి ఉందా?

అకౌంట్ నంబర్‌లో ఏవైనా సమస్యలు, ప్రభుత్వ సబ్సిడీలో ఆలస్యం, సర్వేలో ఆలస్యం, తప్పు సమాచారాలు క్లెయిమ్ చెల్లింపుల సెటిల్‌మెంట్‌లో ఆలస్యానికి దారితీయవచ్చు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం