ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
పేరు సూచించినట్లుగా, కరోనా కవచ్ పాలసీ అనేది ఒక స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది కరోనావైరస్ కారణంగా తలెత్తే హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. కరోనావైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన లక్ష్యం, ఇన్సూరెన్స్ రక్షణను సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి విస్తరింపజేయడం. తద్వారా, మనమందరం కలిసికట్టుగా దేశంలో చొరబడ్డ ఈ మహమ్మారితో పోరాడవచ్చు. ఇది ఒక స్టాండర్డ్ పాలసీ కాబట్టి, కరోనా కవచ్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం నిబంధనలు మరియు షరతులు అనేవి విభిన్న సంస్థలలో కూడా ఒకే విధంగా ఉంటాయి.
మరో మాటలో చెప్పాలంటే, మీరు కరోనా కవచ్ పాలసీతో కరోనావైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, అలాగే ఆర్థికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి నిస్సందేహంగా అడుగు ముందుకు వేయవచ్చు. మీరు ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు. పాలసీలను కరోనా కవచ్‌తో సరిపోల్చవలసిన అవసరం లేదు, ఇలాంటి సూటి మరియు పారదర్శకమైన కోవిడ్-19 హెల్త్ ఇన్సూరెన్స్‌తో మీరు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితం చేసుకోవచ్చు.
కరోనావైరస్ అని కూడా పిలువబడే కోవిడ్-19 అనేది సార్స్-కోవ్-2 వైరస్ కారణంగా సంభవించే తీవ్రమైన సంక్రమణ వ్యాధి, ఇది చైనాకు చెందిన వూహన్‌లో 2019 చివరిలో ఉద్భవించింది. ప్రాథమికంగా ఈ వైరస్ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గు, తుమ్ము లేదా మాట్లాడే సమయంలో విడుదల చేయబడిన శ్వాసకోశ తుంపర్ల ద్వారా విస్తరిస్తుంది, ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. కోవిడ్-19 జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట మరియు రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలకు దారితీయవచ్చు. కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా వృద్ధులలో మరియు ఇతర అనారోగ్య పరిస్థితులు ఉన్నవారిలో ఈ వైరస్ తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం, న్యూమోనియా మరియు మరణానికి కూడా కారణం కావచ్చు.
కోవిడ్-19వ్యాప్తి ప్రారంభం నుండి, వేగంగా ఒక ప్రపంచ మహమ్మారిగా మారి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసింది మరియు సామాజిక దూరం, మాస్క్ ధరించడం మరియు చేతి పరిశుభ్రత వంటి ఆరోగ్య చర్యలను అమలు చేయడానికి దేశాలను ప్రేరేపించింది. మహమ్మారిని అరికట్టడంలో వ్యాక్సినేషన్ ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయి, ఇది తీవ్రమైన కేసులు మరియు హాస్పిటలైజేషన్ల సంఖ్య తగ్గించడంలో సహాయపడింది. వైరస్ మార్పులకు లోనవుతున్నప్పటికీ, దాని వ్యాప్తిని నియంత్రించడానికి మరియు దాని ప్రభావాన్ని తగ్గించడానికి నిరంతర పరిశోధన మరియు నివారణ చర్యలు చాలా ముఖ్యం.
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులు మరియు భయాందోళనలను గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఇది భారీ ప్రాణనష్టానికి దారితీసింది మరియు అన్ని దేశాలను స్తంభింపజేసింది. మనమందరం ఇంకా ఈ మహమ్మారిపై పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఏదైనా ఒక విషయం స్పష్టమైతే, అది ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరాన్ని తెలియజేస్తుంది.
కరోనా కవాచ్ పాలసీ ఎందుకు కోవిడ్ లేదా కరోనా ఇన్సూరెన్స్, ముఖ్యమైనదో తెలుసుకోవాలనుకుంటున్నారా?? చదవండి! కరోనావైరస్ ప్రపంచ పర్యాటకురాలిగా రుజువైంది, ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించి లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేసింది. లాక్‌డౌన్, అలాగే గతంలో చేపట్టిన అన్ని రకాల చర్యలు ఖచ్చితంగా వైరస్ ప్రభావాన్ని తగ్గించడంలో దోహదపడ్డాయి. కానీ, మనం అందరం లాక్‌డౌన్ నుండి కోలుకుంటున్న ఈ సందర్భంలో, వైరస్ కేవలం మన ఊహకు దగ్గరలోనే ఉందని గమనించాలి.
వైరస్ బారిన పడకుండా ఉండటానికి పరిశుభ్రతను, సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనందరికీ తెలుసు. కానీ ఏ పద్ధతి కూడా 100% గా రుజువు కాలేదు. వాస్తవానికి, CDDEP (US ఆధారిత సెంటర్ ఫర్ డిసీజ్, డైనమిక్స్ మరియు ఎకనామిక్ పాలసీ) యొక్క నివేదిక ప్రకారం, భారతదేశంలో కేసులు సెప్టెంబర్ 2020 నాటికి 55-138 కోట్ల పరిధిలో ఉండవచ్చని అంచనా వేసింది. మరియు అక్కడే ఆ వ్యాధితో పోరాడటానికి, కరోనావైరస్ ఇన్సూరెన్స్ పాలసీ అతిపెద్ద ఆయుధంగా మలచబడింది.
SARS-COV-2 వైరస్ యొక్క ఊహించని స్వభావం మరియు పెరుగుతున్న ఖర్చులు, దానితో పోరాటం చేయడానికి బలవంతపెడతాయి, ఒక దురదృష్టకరమైన సందర్భంలో మీరు కరోనావైరస్ బారిన పడినప్పుడు, కరోనా కవచ్ హెల్త్ ఇన్సూరెన్స్ నిజానికి ఒక కట్టుదిట్టమైన శూరుని కవచంలా మీకు రక్షణ కలిపిస్తుంది.
కరోనావైరస్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని అవసరమైన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
ఈ పద్ధతులు మీకు ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు మీ చుట్టూ ఉన్న ఇతరులను రక్షించడానికి సహాయపడగలవు.
మా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఫీచర్లు, సంపూర్ణ హెల్త్ ఇన్సూరెన్స్ పరిష్కారాన్ని అందిస్తాయి.
మా పర్సనల్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ మరియు దాని ముఖ్యమైన ఫీచర్ల గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.
కరోనా కవచ్ పాలసీతో మీకు, మీ కుటుంబంలోని ప్రతి సభ్యునికి, ఒక ప్రత్యేక ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. మీరు మీ మొత్తం కుటుంబాన్ని ఒకే పాలసీలో కవర్ చేయాలనుకుంటే, కరోనా కవచ్ పాలసీ ఆ ఎంపికను కూడా మీకు అందిస్తుంది.
కరోనా కవచ్ కవర్‌తో, సాంప్రదాయ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగా మీరు ఎక్కువ కాలం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ కోవిడ్-19 హెల్త్ ఇన్సూరెన్స్, పాలసీ ప్రారంభమైనప్పటి నుండి కేవలం 15 రోజుల వెయిటింగ్ పీరియడ్‌ని మాత్రమే కలిగి ఉంది.
50, 000 యొక్క గుణిజాలలో, అనగా INR 50, 000 నుండి INR 5 లక్షల వరకు ఎంచుకోగలిగే అనేక ఇన్సూరెన్స్ మొత్తాల ఆప్షన్‌లు ఉన్నాయి
ఒక సంఘటనకు కవర్ చేయబడే రోజుల సంఖ్యపై పరిమితుల రూపంలో, కరోనా కవచ్ పాలసీలో చాలా తక్కువ మరియు సహేతుకమైన ఉప-పరిమితులు ఉంటాయి. ఈ సంఖ్య పూర్తిగా, కరోనావైరస్ రోగులు వ్యాధి నుండి కోలుకోవడానికి తీసుకున్న సగటు వ్యవధిపై ఆధారపడి ఉంటుంది, ఇది సుమారు 15 రోజులు. హాస్పిటల్ క్యాష్ అను ఆప్షనల్ కవర్‌పై కూడా ఉప-పరిమితి ఉంటుంది, ఇది మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తం శాతంపై ఆధారంగా ఉంటుంది.
ఇవి కాకుండా, కరోనా కవచ్ కవర్‌కు ఇతర ఉప-పరిమితులు అంతగా లేవు!
కరోనా కవచ్ కవర్‌ని కొనుగోలు చేయడానికి ఎవరు అర్హులు, అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు వెతుకుతున్న సమాధానం ఇక్కడ ఉంది - 18 నుండి 65 మధ్య వయస్సు గల ఎవరైనా! మీరు మీతో పాటు మీ కుటుంబాన్ని కవర్ చేయాలని చూస్తున్నట్లయితే, ఇక్కడ కరోనా కవచ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడే వారి జాబితా ఇవ్వబడింది:
కరోనా వైరస్‌తో పాజిటివ్‌గా నిర్ధారించబడి మీరు హాస్పిటల్‌లో చేరినట్లయితే, కరోనా కవచ్ పాలసీ రూమ్ రెంట్ ఖర్చులకు కూడా కవరేజీని అందిస్తుంది.
ఏ విధమైన కరోనావైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క నిజమైన పరీక్ష అనేది క్లెయిమ్ సమయంలో ఉంటుంది. కరోనా కవచ్‌తో ముఖ్యంగా క్లెయిమ్ సెటిల్‌మెంట్ సులభతరం అనేది ఒక విభిన్న అంశం కావచ్చు మరియు అందుకోసమే మీరు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ నుండి ఒక కరోనా కవచ్ పాలసీని కొనుగోలు చేయడాన్ని ఎంచుకోవాలి. మీకు అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఆప్షన్‌లతో మేము పూర్తిగా అవాంతరాలు లేని క్లెయిమ్‌ల అనుభవాన్ని అందిస్తాము.
మీ కరోనావైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిములను సెటిల్ చేయడానికి, మేము మీకు అందించే కొన్ని వేగవంతమైన మరియు సులభమైన దశలను గురించి చదవండి.
గుర్తుంచుకోండి, ఏ రకమైన క్లెయిమ్ విషయంలో నైనా, మీ ఇన్సూరెన్స్ సంస్థకు అనగా మాకు ముందస్తు సమాచారాన్ని అందించడం మర్చిపోవద్దు, మేము మీకు పూర్తి ప్రాసెస్ గురించి మార్గనిర్దేశం చేస్తాము.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తరపున, మనకు భారతదేశం అంతటా విస్తారమైన నెట్‌వర్క్ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. కరోనా కవచ్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఈ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నప్పుడు, క్యాష్‌లెస్ క్లెయిమ్స్ పొందగలిగే సామర్థ్యాలు ఉన్నాయని దీని అర్థం.
మీ కరోనావైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద క్యాష్‌లెస్ క్లెయిమ్ విషయంలో ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఇవ్వబడింది:
దశ 1: సమాచారం అందించడం
మీరు బజాజ్ అలియంజ్ నెట్‌వర్క్ హాస్పిటల్‌ను సంప్రదించాలి, వారు మీ వివరాలను ధృవీకరిస్తారు మరియు అధికారం కోసం వాటిని మాకు పంపిస్తారు
స్టెప్ 2: ఆథరైజేషన్
మేము హాస్పిటల్ నుండి అవసరమైన సమాచారాన్ని స్వీకరించిన తర్వాత, ఆ వివరాలను పరిశీలిస్తూ మీ క్లెయిమ్ ఆమోదయోగ్యమైతే, అదే రోజు అప్రూవల్ ఇస్తాము. కొన్ని ప్రశ్నలు ఉన్నట్లయితే మేము తిరిగి హాస్పిటల్ వారిని సంప్రదించవచ్చు మరియు ఆ ప్రశ్నలు సంతృప్తికరంగా పరిష్కరించబడిన తర్వాత, ముందుకు సాగి 7 రోజుల్లోపు వారికి ఒక ఆథరైజేషన్ లెటర్‌ని పంపుతాము.
దశ 3: చికిత్స
మీ అధికారం అమల్లోకి వచ్చిన తర్వాత, మీరు చేయవలసిందల్లా అడ్మిషన్ పొందడం, చికిత్స పొందడం మరియు త్వరగా కోలుకోవడం. హాస్పిటల్ వారితో సమన్వయం చేసుకోవడం, అవసరమైన అన్ని వైద్య బిల్లులు, ఖర్చులను క్లియర్ చేయడం వంటి వాటిలో ఎదురయ్యే తలనొప్పిని మేము భరిస్తాము!
సులభం కదూ?
కొన్ని కారణాల వల్ల మీకు బజాజ్ అలియంజ్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లో క్యాష్‌లెస్ సదుపాయం లభించకపోతే, మీ కరోనావైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని క్లెయిమ్ చేయడానికి మీరు రీయింబర్స్‌మెంట్ ప్రాసెస్‌ని ఎంచుకోవాలి. ఈ సందర్భంలో మీరు వైద్య ఖర్చుల కోసం హాస్పిటల్‌కు చెల్లించాల్సి ఉంటుంది మరియు అప్రూవల్ పొందిన తర్వాత, మా నుండి రీయింబర్స్‌మెంట్ అందుకుంటారు.
మీ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ ప్రాసెస్ సజావుగా సాగేలా చూడడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి:
ఒకసారి మేము మీ క్లెయిమ్‌ని స్వీకరించిన తర్వాత, ప్రతిదీ సరిగ్గా ఉందని నిర్ధారించుకోవడానికి, అన్ని డాక్యుమెంట్లు మరియు వివరాల పరిశీలనలో త్వరగా ముందుకు సాగుతాము. ఒకవేళ కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు పంపించడం మిగిలి పోతే, చింతించకండి. మేము మీకు తెలియజేసినపుడు మీరు దానిని పంపించగలరు, 30 రోజులలో మూడు రిమైండర్‌లను కూడా మీకు పంపుతాము. ఈ సమయంలో మీరు లోపించిన డాక్యుమెంట్లను మాకు పంపవచ్చు, తదనుగుణంగా మేము ఈ ప్రాసెస్‌ని ముందుకు కొనసాగిస్తాము.
క్లెయిమ్‌ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు
మీ కోసం క్లెయిమ్ ప్రాసెస్‌ని మరింత సులభతరం చేయడానికి, అవసరమైన డాక్యుమెంట్ల సమగ్ర జాబితాను మేము సంకలనం చేశాము:
హాస్పిటలైజేషన్ క్లెయిమ్స్ కోసం:
కొన్ని సందర్భాల్లో, మాకు కొన్ని ఇతర సంబంధిత డాక్యుమెంట్లు కూడా అవసరం అవ్వచ్చు, వీటిని మేము మీకు కేసుల వారీగా తెలియజేస్తాము.
హోమ్ ట్రీట్‌మెంట్ క్లెయిమ్స్ కోసం:
నా హెల్త్ కేర్ సుప్రీమ్ పాలసీని రెన్యూ చేసుకోవడానికి, మీరు అందించిన సహకారానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు.
లాక్‌డౌన్ సమయంలో కూడా మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ సర్వీస్. కాబట్టి నేను ఎక్కువ కస్టమర్‌లకు బజాజ్ అలియంజ్ హెల్త్ పాలసీని విక్రయించాను
బజాజ్ అలియంజ్ వారి అద్భుతమైన, ఇబ్బందులు లేని సేవలు, కస్టమర్ల కోసం ఫ్రెండ్లీ వెబ్‌సైట్, అర్థం చేసుకోవడం సరళం మరియు ఆపరేట్ చేయడం సులభం. కస్టమర్‌లకు పూర్తి ఆనందంతో మరియు ఉత్సాహంతో సేవలు అందిస్తున్నందుకు మీ బృందానికి ధన్యవాదాలు...
కోవిడ్-19 ఇన్సూరెన్స్ కోసం బజాజ్ అలియంజ్ ఒక విశ్వసనీయమైన ఎంపికగా ఎందుకు నిలుస్తుందో ఇక్కడ ఇవ్వబడింది:
బజాజ్ అలియంజ్ విస్తృతమైన కవరేజీతో కోవిడ్-19 ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తుంది, ఇది కోవిడ్ సంబంధిత చికిత్సల కోసం హాస్పిటల్ ఖర్చులు, మందులు మరియు హోమ్ కేర్ యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
బజాజ్ అలియంజ్ ద్వారా, మీరు మీ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన వివిధ ప్లాన్ల నుండి ఎంచుకోవచ్చు, ఇవి మీ వ్యక్తిగత లేదా కుటుంబ కవరేజ్ కోసం సరైన స్థాయి రక్షణను పొందుతారని నిర్ధారిస్తాయి.
భాగస్వామి ఆసుపత్రుల విస్తృత నెట్‌వర్క్ ద్వారా, బజాజ్ అలియంజ్ నగదురహిత చికిత్సను సులభతరం చేస్తుంది, మీరు అదనపు ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా రికవరీ పై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.
బడ్జెట్-ఫ్రెండ్లీ రేట్ల వద్ద సమగ్ర రక్షణ పొందండి. బజాజ్ అలియంజ్ కోవిడ్-19 ఇన్సూరెన్స్ ప్లాన్లు యాక్సెస్ చేయదగినవిగా రూపొందించబడ్డాయి, భారీ ఆర్థిక ఒత్తిడి లేకుండా మనశ్శాంతిని అందిస్తాయి.
ప్రతి దశలో మీకు మార్గనిర్దేశం చేయడానికి అందుబాటులో ఉన్న కస్టమర్ సపోర్ట్ క్లెయిమ్స్ ప్రక్రియను సరళంగా, వేగవంతమైనది మరియు అవాంతరాలు-లేనిదిగా చేస్తుంది.
బజాజ్ అలియంజ్ అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో వేగవంతమైన పాలసీ జారీని నిర్ధారిస్తుంది కాబట్టి, తక్షణమే కవర్ పొందండి అత్యవసర సమయంలో సిద్ధంగా ఉండండి.
బజాజ్ అలియంజ్ కోవిడ్-19 ఇన్సూరెన్స్‌తో, మీరు కస్టమర్-ఫస్ట్ అనే విధానం మరియు సమర్థవంతమైన మద్దతు అందించే ప్రసిద్ధి చెందిన విశ్వసనీయ భాగస్వామి ద్వారా మీ ఆరోగ్యం మరియు ఆర్ధిక వనరులను రక్షించుకోవచ్చు.
మహమ్మారిని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని కోరుకునే ఎవరికైనా బజాజ్ అలియంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోవిడ్ కవచ్, చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కోవిడ్ - 19 మహమ్మారిని కవర్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రత్యేకత, దాని కవరేజ్. కావున, ఈ పాలసీ కరోనావైరస్ పాజిటివ్ కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రధాన వైద్య అవసరాలు మరియు సంఘటనలను కవర్ చేస్తుంది, ఇది మీ సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్‌ని కవర్ చేయకపోవచ్చు.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
మెడికల్ ఎమర్జెన్సీ మీ ఇంటి వరకు వచ్చేదాకా వేచి ఉండకండి!
కరోనా కవచ్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఉన్న ఈ కవర్, మీరు కరోనావైరస్ చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరినప్పుడు అయ్యే ఖర్చులకు పరిహారాన్ని చెల్లిస్తుంది మరింత చదవండి
కోవిడ్ హాస్పిటలైజేషన్ కవర్
కరోనా కవచ్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఉన్న ఈ కవర్, మీరు కరోనావైరస్ చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరినప్పుడు అయ్యే ఖర్చులకు పరిహారాన్ని చెల్లిస్తుంది. ఈ విభాగం కింద కవర్ చేయబడే అన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి:
కవర్ పూర్తిగా వర్తించాలంటే, మీరు కనీసం 24 గంటల పాటు నిరంతరాయంగా హాస్పిటలైజ్ చేయబడి ఉండాలి.
ఒకవేళ ప్రభుత్వ అధీకృత రోగనిర్ధారణ కేంద్రం నుండి మీ టెస్ట్ పాజిటివ్‌గా వస్తే మరియు మీరు హాస్పిటల్‌కు బదులుగా ఇంట్లోనే చికిత్స పొందాల్సి ఉంటే, కరోనా కవచ్ పాలసీ దానిని కూడా కవర్ చేస్తుంది. మరింత చదవండి
హోమ్ కేర్ చికిత్స ఖర్చులకు కవర్
ఒకవేళ ప్రభుత్వ అధీకృత రోగనిర్ధారణ కేంద్రం నుండి మీ టెస్ట్ పాజిటివ్‌గా వస్తే మరియు మీరు హాస్పిటల్‌కు బదులుగా ఇంట్లోనే చికిత్స పొందాల్సి ఉంటే, కరోనా కవచ్ పాలసీ దానిని కూడా కవర్ చేస్తుంది. ఈ కవర్ అమలులోకి రావడానికి, కొన్ని నిబంధనలు ఉన్నాయి:
మీరు ఈ రెండు షరతులను నెరవేర్చినట్లయితే మరియు చికిత్స చేసే డాక్టర్ సంతకం చేసిన చికిత్స రికార్డుతో సహా అతను రోజువారీగా నిర్వహించిన చికిత్సను ఒక చార్ట్ రూపంలో అందించగలిగితే, కరోనా కవచ్ కవర్ మీకు వర్తిస్తుంది.
ఈ కరోనావైరస్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క హోమ్ కేర్ చికిత్స ఖర్చుల కవర్ కింద కవర్ చేయబడే అంశాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది:
ఒకవేళ సాధారణ హాస్పిటల్స్ మీ ఒక కప్పు టీ కాకపోతే మరియు మీరు ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతివైద్యం, యునాని, సిధా లేదా హోమియోపతి రూపంలో కోవిడ్-19 కోసం సంరక్షణ ఎంచుకుంటే, కరోనా కవచ్ కవర్ మీ వెన్నంటే ఉంటుంది. మరింత చదవండి
ఆయుష్ చికిత్సా కవర్
ఒకవేళ సాధారణ హాస్పిటల్స్ మీ ఒక కప్పు టీ కాకపోతే, మీరు ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతివైద్యం, యునాని, సిధా లేదా హోమియోపతి రూపంలో కోవిడ్-19 కోసం సంరక్షణ ఎంచుకుంటే, కరోనా కవచ్ కవర్ మీ వెన్నంటే ఉంటుంది. మీరు కరోనావైరస్‌తో పాజిటివ్‌గా నిర్ధారించబడి ఏదైనా AYUSH హాస్పిటల్‌లో ప్రవేశం పొందాలని ఎంచుకుంటే, మీరు కరోనా కవచ్ పాలసీలోని ఈ విభాగాన్ని కూడా పొందవచ్చు.
కరోనా కవచ్ పాలసీతో మేము కేవలం మీ హాస్పిటలైజేషన్ సమయంలో మాత్రమే కాకుండా, హాస్పిటలైజేషన్‌కు ముందు మరియు తరువాత కూడా మీకు తోడుగా ఉంటాము. కరోనా కవచ్ హెల్త్ ఇన్సూరెన్స్, 15 రోజుల వరకు ప్రీ-హాస్పిటలైజేషన్ వైద్య ఖర్చులను మరియు 30 రోజుల వరకు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తుంది.
సాంకేతికతలో పురోగతి కారణంగా, ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం ఇప్పుడు చాలా సులభం. కేవలం కొన్ని దశలతో, మీరు బజాజ్ అలియంజ్‌తో ఒక కోవిడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందవచ్చు.
సులభమైన, కాగితరహిత కొనుగోలు అనుభవం కోసం బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను తెరవండి. మీకు అవసరమైన ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఉంటుంది-భౌతిక డాక్యుమెంట్లు అవసరం లేదు.
మీ పేరు, వయస్సు, ఎంచుకున్న కవరేజ్ మరియు పాలసీ వ్యవధి వంటి అవసరమైన సమాచారాన్ని అందించండి. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను ఎంచుకుంటే, కుటుంబ సభ్యుల వివరాలను చేర్చండి.
ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయండి, మరియు తక్షణ యాక్సెస్ కోసం మీ పాలసీ డాక్యుమెంట్ నేరుగా మీ ఇమెయిల్‌కు పంపబడుతుంది.
కరోనావైరస్ విషయానికి వస్తే, మీరు దానితో సంబంధం ఉన్న ‘కోమోర్బిడిటీ’ అనే పదాన్ని చాలాసార్లు విని ఉండవచ్చు. వాస్తవానికి, ఈ కోమార్బిడిటీ అనే అంశం, ఈ వ్యాధిని వయోజనులకు ప్రాణాంతకంగా మారేలా చేస్తుంది,
కాబట్టి కోమోర్బిడిటీ అంటే ఏమిటి? సరళంగా చెప్పాలంటే, కోమోర్బిడిటీ అనేది ఒకే రోగిలో ఒకటి కంటే ఎక్కువ వ్యాధుల ఉనికిని సూచిస్తుందని అర్థం. ఉదాహరణకు, ఎవరికైనా డయాబెటిస్ మరియు గుండె-జబ్బు ఉంటే, అవి కోమోర్బిడిటీ పదం కిందకు వస్తాయి. అదేవిధంగా, కరోనావైరస్ విషయంలో SARS-COV-2 బారిన పడిన రోగికి కోమోర్బిడిటీ అనగా శ్వాసకోశ అనారోగ్యం లేదా గుండె జబ్బు వంటి మరొక అనారోగ్య పరిస్థితిని సూచిస్తుంది.
కోమోర్బిడిటీ మీరు ఊహించిన దాని కంటే సర్వ సాధారణమైనవి మరియు వీటికి కోరోనావైరస్‌తో పాటుగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే కరోనావైరస్ కోసం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కోమోర్బిడిటీలను కూడా కవర్ చేస్తుంది.
పాలసీ యొక్క బేస్ కవరేజీకి మించి కరోనా కవచ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, హాస్పిటల్ క్యాష్ కోసం ఒక యాడ్-ఆన్ కవర్‌ను ఎంచుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ యాడ్-ఆన్ కవర్ అనేది ఒక ప్రయోజనకరమైన కవర్, ఇది మీ హాస్పిటలైజేషన్ యొక్క ప్రతి రోజు మీ బీమా చేయబడిన మొత్తం నుండి 0.5% వరకు పొందడంలో మీకు అర్హత కల్పిస్తుంది.
ఇది ఒక ప్రయోజనకరమైన యాడ్-ఆన్ కవర్ కాబట్టి, బిల్లులు లేదా రశీదులు అవసరం లేదు. మీ బేస్ క్లెయిమ్ ఆమోదయోగ్యమైనది అయితే, మీ బకాయి మొత్తాన్ని మీరు పొందుతారు.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
మీ ఆవశ్యకత | కరోనా కవచ్ | స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ |
---|---|---|
కవర్ చేయబడే అంశాలు ఏమిటి | కేవలం కోవిడ్ -19 చికిత్స | కోవిడ్-19 తో సహా అన్ని అనారోగ్యాలను కవర్ చేస్తుంది |
ఇన్సూర్ చేయబడిన మొత్తం | రూ. 50,000 నుండి 5,00,000 వరకు | రూ. 50,000 నుండి 50,00,000 వరకు |
మీ ఫ్యామిలీ కోసం కవర్ | ఉంది | ఉంది |
గరిష్ఠ ప్రవేశ వయస్సు పరిమితి | 65 సంవత్సరాలు | 70 సంవత్సరాలు (సీనియర్ సిటిజన్ ప్లాన్ కోసం) |
కోవిడ్ పై కవరేజ్ | కోవిడ్ కోసం మాత్రమే | కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్యాలను కూడా కవర్ చేస్తుంది |
జీవితకాల పునరుద్ధరణ | వర్తించదు | |
పాలసీ టర్మ్ | 3.5/6.5/9.5 నెలలు | కనీసం 1 సంవత్సరం నుండి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు |
PPE కిట్ ఖర్చులు | కవర్ చేయబడుతుంది | కవర్ చేయబడనిది |
వెయిటింగ్ పీరియడ్ | 15 రోజులు | కనీసం 30 రోజులు |
ముందు నుండి ఉన్న వ్యాధి | కవర్ చేయబడనిది | ఒక నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ చేయబడుతుంది |
ప్రీ-పాలసీ మెడికల్స్ | వర్తించదు | వర్తిసాయి |
ప్రీమియం చెల్లింపు టర్మ్ | సింగిల్ | ఇన్‌స్టాల్‌మెంట్ ఎంపిక అందుబాటులో ఉంది |
కరోనా కవచ్ పాలసీ కింద వెయిటింగ్ పీరియడ్ అనేది పాలసీ ప్రారంభం నుండి 15 రోజులుగా ఉంటుంది.
అవును, ఇవి ఖచ్చితంగా కరోనా కవచ్ పాలసీ కింద కవర్ చేయబడతాయి, మీ క్లెయిమ్ ఆమోదయోగ్యమైనది.
మీ వయస్సు 18 నుండి 65 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే, కరోనా కవచ్ కవర్‌ని మీరు కొనుగోలు చేయవచ్చు!
ఒకే రోగిలో ఒకటి కంటే ఎక్కువ వ్యాధులు ఏకకాలంలో ఉన్నప్పుడు, వైద్య పరిభాషలో ఆ రోగికి కోమోర్బిడిటీ ఉందని చెబుతారు. ఉదాహరణకు, ఎవరైనా డయాబెటిస్ మరియు గుండె జబ్బులను కలిగి ఉంటే దానిని కోమోర్బిడిటీ కేసుగా పరిగణిస్తారు.
ఏదైనా ఆరోగ్య ప్రకటనతో ప్రతిపాదనలు అనేవి UW నిర్ణయం కోసం సూచించబడతాయి.
ఉంది. మీ ఇంటి వద్దనే కోవిడ్-19 చికిత్స తీసుకోమని మీ డాక్టర్ సూచిస్తే, మీరు అందిస్తున్న చికిత్సకు సంబంధించి మీ మెడికల్ ప్రాక్టీషనర్ ద్వారా సంతకం చేయబడిన రోజువారీ పర్యవేక్షణ ఛార్టులను అందించగలిగితే, మీరు కరోనా కవచ్ కవర్ క్రింద కోవిడ్-19 కోసం ఇంటి వద్ద పొందిన వైద్యం యొక్క ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చు.
అవును. కరోనా కవచ్ పాలసీలో ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్ కూడా ఉంది, దీని కింద మీరు, మీ జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అత్తమామలు మరియు ఆధారపడిన పిల్లలను (25 సంవత్సరాల వయస్సు వరకు) ఒకే పాలసీలో కవర్ చేయవచ్చు.
కరోనా కవచ్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క బేస్ కవర్ కోసం కాల వ్యవధి మినహా, పెద్దగా ఉప పరిమితులు ఏమి లేవు. హాస్పిటల్ క్యాష్ యాడ్-ఆన్ కవర్ కోసం, ఇన్సూరెన్స్ చేసిన మొత్తంలో ఉప పరిమితి 0.5%.
అవును! హెల్త్‌కేర్ వర్కర్స్ 5% డిస్కౌంట్ పొందుతారు
దురదృష్టవశాత్తు, మీరు కరోనా కవచ్ పాలసీ కోసం ఇన్‌స్టాల్‌మెంట్‌లో ప్రీమియం చెల్లించలేరు.
కరోనావైరస్ యొక్క వ్యాప్తి ఊహించలేనిది మరియు అన్ని భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ, మీరు వ్యాధి బారిన పడే అవకాశం ఉండవచ్చు ఎందుకనగా, లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా ఎత్తివేయబడుతున్నాయి. ఈ వ్యాధి చికిత్స కోసం మీరు హాస్పిటల్‌లో చేరాల్సి వస్తే, ఖర్చులు లక్షలను మించే అవకాశం ఉంటుంది, ఇది వ్యాధి తీవ్రతను బట్టి మరియు చికిత్స పొందటానికి ఎంచుకున్న ప్రదేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందువలన, మీరు కొరోనావైరస్ ఇన్సూరెన్స్ కవరేజీని పొందడం చాలా అవసరం, ఎందుకంటే ఇది అటువంటి అత్యవసర పరిస్థితుల్లో అమూల్యమైనదని రుజువు చేస్తుంది.
కొరోనా వైరస్ కోసం కరోనా కవచ్ పాలసీ అనేది ఒక స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్. దీని అర్థం, ఇది వివిధ కంపెనీలు ఆఫర్ చేసే అదే కవరేజీని అందించే ఒక కరోనావైరస్ ఇన్సూరెన్స్ పాలసీ.
కరోనావైరస్ హాస్పిటలైజేషన్ నుండి ఉత్పన్నమయ్యే వైద్య అవసరాలను తీర్చడానికి ఈ కోవిడ్-19 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రత్యేకంగా సృష్టించబడింది. చికిత్స కంటే నివారణ మేలు కనుక, భవిష్యత్తులో మీరు దురదృష్టవశాత్తు పాజిటివ్‌గా నిర్ధారించబడితే, ఆ విషయంలో ముందస్తు భద్రతా చర్యగా మీరు ఈ ప్రత్యేకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందాల్సి ఉంటుంది.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి