Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (పిఎంఎస్‌బివై)

Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) Policy

మీరు అందుకునేది

నేటి కాలంలో ప్రతి భారతీయ పౌరునికి ఇన్సూరెన్స్ ఉండాలి ! ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనతో, మిమ్మల్ని మీరు ఇప్పుడు 'ఇన్సూర్ చేయబడిన' వ్యక్తిగా సగర్వంగా చెప్పుకోవచ్చు! అంతేకాకుండా, ఈ చౌకైన ఇన్సూరెన్స్ గణనీయమైన కవరేజీ అందిస్తుంది - ప్రమాదం కారణంగా మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు సామాన్య వ్యక్తికి ఇది రక్షణ అందించే గొడుగులా మారుతుంది. మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? చదవండి.

ముందుగా, ఈ ప్రతిష్టాత్మక, దేశ-వ్యాప్త ఇన్సూరెన్స్ ప్లాన్‌ వెనుక ఉన్న హేతుబద్ధతను చూద్దాం. భారతీయ సమాజంలోని అట్టడుగు వర్గాలకు కూడా ఆర్థిక చేర్పు ప్రయోజనాలు అందించే లక్ష్యంతో, 2015లో ప్రారంభించబడిన ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (పిఎంఎస్‌బివై) అనేది నెలకు కేవలం రూ. 1 కనీస ఖర్చుతో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ అందిస్తుంది. స్థూల దృష్టితో చూస్తే, తగినంత ఇన్సూరెన్స్ సౌకర్యం ద్వారా గ్రామీణ మరియు పట్టణ తరహా గ్రామాల్లోని సమాజాలకు సమానమైన వృద్ధి అవకాశాలు అందించడానికి ఆర్థిక వనరులు సమీకరించడానికి ఈ ప్లాన్ రూపొందించబడింది.

వినియోగదారులకు ఇది ఎలాంటి ప్రయోజనం అందిస్తుందని ఆలోచిస్తున్నారా? పెద్ద సంఖ్యలోని కాంట్రిబ్యూటర్లకు ప్రమాద అవకాశాన్ని విస్తరింపజేయడం అనే ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ప్రాథమిక సూత్రం ఆధారంగా, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన సంవత్సరానికి కేవలం రూ. 12/- అనే నామమాత్రపు రుసుముతో మరణం మరియు వైకల్యం కోసం కవరేజీ అందిస్తుంది. ప్రత్యేకించి, క్రమమైన ఉపాధి మరియు తగినంత వైద్య సేవలు అందుబాటులో లేని కారణంగా ప్రమాద బాధితులకు తక్కువ మొత్తంలో మరియు సకాలంలో వైద్య సంరక్షణ అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల వారి కోసం ఉద్దేశించబడిన ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన అనేది 18 మరియు 70 మధ్య వయస్సు కలిగిన భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది.

పంట వైఫల్యం లాగానే, ఒక ప్రమాదం కారణంగా మీ సంపాదన సామర్థ్యం తీవ్రంగా ప్రభావితం కావచ్చు. ఇది మీ కుటుంబ ఆర్థిక స్థితి మీద భారీ ప్రభావం చూపడంతో పాటు అప్పులు మరియు ఆర్థిక అనిశ్చితి రూపంలో అనేక తరాలు వెంటాడే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనతో, వైద్య ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితిని నివారించడంతో పాటు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, తక్కువ ఖర్చుతో, మీ ఆర్థిక అవసరాలు తీరేలా మీకు భరోసా లభిస్తుంది.

ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన అనేది నష్ట భయాన్ని తగ్గించడానికి, ఆర్థిక అనావశ్యకతను తగ్గించడానికి మరియు ఆరోగ్య సంరక్షణ మరియు పునరావాస ఖర్చులలో పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య భేదాన్ని తగ్గించడమే లక్ష్యంగా కలిగి ఉన్న ఒక విస్తృత స్థాయి సామాజిక కార్యాచరణలో ఒక భాగం.

Scroll

చెల్లింపు విధానం

భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, భాగస్వామ్య బ్యాంకుల సహకారంతో ఏదైనా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనను అందించవచ్చు. మీ స్థానిక బ్యాంకు శాఖ భాగస్వామ్యంతో, బజాజ్ అలియాంజ్ ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద సేవలు అందుకోవచ్చు.

ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద ప్రయోజనాలు పొందడానికి, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే, మీరు యోజన కింద చెల్లించే ప్రీమియం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆటో డెబిట్ చేయబడుతుంది.

కవరేజీ రద్దు

18 మరియు 70 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా భారతీయ పౌరులు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో నమోదు చేసుకోవచ్చు. మీరు ఒంటరి వ్యక్తి అయినా, కుటుంబాన్ని పోషించాల్సిన వ్యక్తి అయినా లేదా కార్పొరేట్ కార్యాలయంలో రోజువారీ వేతనం కోసం పనిచేసేవారైనా లేదా ఉద్యోగి అయినా, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన మిమ్మల్ని స్వాగతిస్తుంది. ఈ ఆఫర్ మీద ప్రయోజనాలనేవి ఈ ఇన్సూరెన్స్ కొనుగోలును ఆకర్షణీయంగా చేస్తాయి! అయితే, ఈ ప్లాన్ క్రింద పూర్తి ప్రయోజనాలు పొందడానికి తెలుసుకోవలసిన కొన్ని షరతులు కూడా ఉన్నాయి:

 

  • ✓ మీరు 70 సంవత్సరాల వయస్సుకు చేరుకుంటే, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద మీకు కవరేజీ నిలిపివేయబడుతుంది

  • ✓ మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ మూసివేస్తే లేదా మీ పాలసీని అమలులో ఉంచడానికి తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ నిర్వహించకపోతే

  • ✓ మీరు ఎన్ని అకౌంట్‌ల నుండి ప్రీమియం చెల్లిస్తున్నారనేది పాలసీ కవరేజీని నిర్ణయించదు. ప్రతి వ్యక్తి ఒక పాలసీకి మాత్రమే అర్హత కలిగి ఉంటారు

నిబంధనలు మరియు షరతులు

ఈ పాలసీ ప్రయోజనాలను ఆనందించడం కొనసాగించాలంటే, దీనికి సంబంధించిన నియమాలు తెలుసుకోవడానికి చదవండి:

  • ✓ ఒక వ్యక్తి, ఒక పాలసీ

  • ✓ పాలసీ తీసుకున్న తేదీ ప్రకారం, ప్రీమియం మొత్తం మారదు

  • ✓ 70 సంవత్సరాల వయస్సు వరకు కవరేజ్ అందించబడుతుంది

  • ✓ పాలసీ జారీ చేయడానికి మీ మొబైల్ నంబర్‌ను బ్యాంకు వద్ద అప్‌డేట్ చేయడం ముఖ్యం

  • ✓ ఆటో రెన్యూవల్‌ను యాక్టివేట్ చేయడానికి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఒక ఎస్ఎంఎస్ నిర్ధారణ ఉండాలి.

  • ✓ ఇన్సూరెన్స్ భాగస్వామిగా, మీ వ్యక్తిగత సమాచారాన్ని బజాజ్ అలియాంజ్‌తో పంచుకునే అవకాశం ఉంది

  • ✓ ఇన్సూరెన్స్ అనేది అత్యంత గొప్ప విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మాకు అందించబడిన ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే, పాలసీ విషయంలో మేము మరింత ముందుకు సాగలేము. మీరు అప్పటికే చెల్లించిన ఏదైనా ప్రీమియంను కోల్పోవచ్చు

  • ✓ నిర్దిష్ట రెన్యూవల్ తేదీన మీ సంబంధిత బ్యాంక్ అకౌంట్ నుండి రెన్యూవల్ ప్రీమియం ఆటో డెబిట్ చేయబడుతుంది

  • ✓ మీరు ఆటో డెబిట్‌ను రద్దు చేయాలనుకుంటే, తదుపరి ప్రీమియం గడువు ముగియడానికి ముందే మాకు తెలియజేయండి.

  • ✓ ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజనలో జాయిన్ అకౌంట్ హోల్డర్లు కూడా చేరవచ్చు! మీరు చేయవలసిందల్లా సూచించబడిన ఫారమ్‌లు నింపడం మాత్రమే

     

ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన పాలసీ వివరణలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు

  • చేర్పులు

  • మినహాయింపులు

ఇది మీకు 1950ల కాలాన్ని గుర్తు చేయవచ్చు! ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజనతో, ఇప్పుడు రూపాయికి గొప్ప కొనుగోలు శక్తి లభించింది. 

మరింత చదవండి

ఇది మీకు 1950ల కాలాన్ని గుర్తు చేయవచ్చు! ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజనతో, ఇప్పుడు రూపాయికి గొప్ప కొనుగోలు శక్తి లభించింది. 

మీరు ఒక సమగ్ర ఇన్సూరెన్స్ కవర్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు యోజన మెరుగైన ఎంపిక అవుతుంది. పెట్టుబడి మీద మీరు పొందే రాబడులు కూడా గణనీయంగా ఉంటాయి. నేడే సైన్ అప్ చేయడం ద్వారా మీరు పొందగల కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం సంభవించినప్పుడు పరిహారం

ప్రమాదంలో ప్రాణం కోల్పోయినా లేదా అవయవాలు కోల్పోయినా దానిని ఏ మొత్తమూ భర్తీ చేయలేదని ప్రతిఒక్కరికీ తెలుసు. అయితే, ఆందోళన మరియు నిస్సహాయత కారణంగా సంభవించే మానసిక మరియు భావోద్వేగ గాయాల నుండి ఇన్సూరెన్స్ అనేది ఉపశమనం కలిగించగలదు. 

మరింత చదవండి

మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం సంభవించినప్పుడు పరిహారం

ప్రమాదంలో ప్రాణం కోల్పోయినా లేదా అవయవాలు కోల్పోయినా దానిని ఏ మొత్తమూ భర్తీ చేయలేదని ప్రతిఒక్కరికీ తెలుసు. అయితే, ఆందోళన మరియు నిస్సహాయత కారణంగా సంభవించే మానసిక మరియు భావోద్వేగ గాయాల నుండి ఇన్సూరెన్స్ అనేది ఉపశమనం కలిగించగలదు. 

అత్యవసర వైద్య పరిస్థితులలో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎలాగో, పిఎంఎస్‌బివై కూడా అంతే ప్రధానమైనది.

ప్రమాదం కారణంగా మరణం సంభవించినట్లయితే, మీ కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల మొత్తం అందుతుంది. ప్రమాదం కారణంగా రెండు చేతులు, కాళ్లు లేదా రెండు కళ్లు కోల్పోతే, మీకు రూ.2 లక్షల మొత్తం లభిస్తుంది.

ప్రమాదం కారణంగా ఒక కంటిలో చూపు కోల్పోవడంతో పాటు ఒక చేతికి లేదా కాలికి నష్టం జరిగితే, అప్పుడు మీకు 2 లక్షల రూపాయల మొత్తం పొందడానికి అర్హత కలిగి ఉంటారు.

శాశ్వత పాక్షిక వైకల్యం సంభవించినప్పుడు పరిహారం

మీరు ఒక కంటిలో చూపు కోల్పోయినా లేదా మీ చేతులు లేదా కాళ్లలో ఒకదానిని కోల్పోయినా, మీకు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద 1 లక్షల రూపాయల మొత్తం లభిస్తుంది.

1 ఆఫ్ 1

మీరు ఆత్మహత్య చేసుకున్న పక్షంలో, మీ కుటుంబానికి ఎలాంటి క్లెయిమ్ లభించదు

ప్రమాదం కారణంగా చేతులు, కళ్ళు లేదా కాళ్లకు నష్టం వాటిల్లినప్పటికీ, చికిత్స ద్వారా వాటిని సరిచేసే పరిస్థితి ఉన్నప్పుడు, మీ క్లెయిమ్ ప్రాసెస్ చేయబడదు

1 ఆఫ్ 1

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం