Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

గ్లోబల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్: గ్లోబల్ పర్సనల్ గార్డ్

యాక్సిడెంట్‌ల పై ప్రపంచవ్యాప్త కవరేజ్

Global accident insurance policy

ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రమాదాల నుండి రక్షణ

మీ ప్రయోజనాలను పొందండి

పరిశ్రమలోనే మొదటిసారిగా అందించబడుతున్న వినూత్నమైన గ్లోబల్ కవర్

ప్రయాణ ఖర్చులు, ఎయిర్ అంబులెన్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్‌ని కవర్ చేస్తుంది

ప్రమాదవశాత్తు గాయం మరియు/లేదా మరణం కోసం సమగ్ర కవర్

గ్లోబల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి?

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ ఒక సమగ్ర గ్లోబల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పరిష్కారాన్ని అందిస్తుంది, ప్రమాదం కారణంగా కలిగే గాయాలు, శాశ్వత వైకల్యాలు మరియు ప్రమాదం కారణంగా మరణం పై ఇది ప్రపంచవ్యాప్తంగా కవరేజ్ అందిస్తుంది. జీవితంలో ఊహించని పరిస్థితులు అంటే ప్రమాదాలు ఎప్పుడైనా, ఎక్కడైనా జరగవచ్చు, ఇది తమను మరియు వారి ప్రియమైన వారిని రక్షించాలని అనుకునే వారికి ఈ పాలసీ ఒక అమూల్యమైన ఆస్తిగా నిలుస్తుంది. సాంప్రదాయక యాక్సిడెంట్ కవరేజ్ లాగా కాకుండా, ఈ పాలసీ జాతీయ సరిహద్దులకు ఆవల కూడా పని చేస్తుంది, ప్రమాదం సంభవించినప్పటికీ ఆర్థిక భద్రత మరియు మద్దతును నిర్ధారిస్తుంది.

గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ యొక్క ముఖ్యమైన ఫీచర్లలో యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఎయిర్ అంబులెన్స్ సేవలు, పిల్లల విద్య మరియు కోమా కేర్ కోసం కవరేజ్ ఉంటాయి. అదనంగా, గ్లోబ్ లైఫ్ మరియు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఆదాయ నష్టం కోసం ఆర్థిక రక్షణను అందిస్తుంది మరియు వివిధ ఆకస్మిక ఖర్చులను కవర్ చేస్తుంది. కస్టమైజ్ చేయదగిన కవరేజ్ మరియు రూ. 25 కోట్ల వరకు ఉండే ఫ్లెక్సిబుల్ ఇన్సూరెన్స్ మొత్తం ఎంపికలతో, గ్లోబల్ పర్సనల్ గార్డ్ అనేది జీవితంలోని ఊహించని సంఘటనల ద్వారా పాలసీదారులకు మద్దతు ఇవ్వడానికి రూపొందించబడింది, వ్యక్తులు మరియు కుటుంబాలకు మనశ్శాంతిని ఇస్తుంది.

బజాజ్ అలియంజ్ గ్లోబల్ పర్సనల్ గార్డ్‌ని ఎందుకు ఎంచుకోవాలి?

జీవితం అనిశ్చితం ; ఇది ఎవరినైనా, ఏ సమయంలోనైనా ఊహించని ప్రమాదాలతో మలుపు తిప్పుతుంది. అదనంగా, యాక్సిడెంట్ కారణంగా సంపాదనాపరుని మరణం లేదా వైకల్యం సంభవిస్తే, అది మీ కుటుంబానికి తీవ్రమైన ఆర్థిక సమస్యలను తెచ్చిపెడుతుంది మరియు మీరు దీనికి సిద్ధంగా ఉండకపోవచ్చు.

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అటువంటి ఆర్థిక ఒత్తిడి నుండి మిమ్మల్ని రక్షించడానికి మరియు మీ అవసరమైన సమయంలో, ఎప్పుడైనా మరియు ప్రపంచంలో ఎక్కడైనా మీకు సహాయపడటానికి ఒక ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉంది.

మా గ్లోబల్ పర్సనల్ గార్డ్ మరణం, పూర్తి శాశ్వత వైకల్యం లేదా పాక్షిక శాశ్వత వైకల్యం మరియు ప్రమాదం కారణంగా సంభవించే ఏవైనా ఇతర గాయాలకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన కవరేజ్ అందిస్తుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు సంభవించే ప్రమాదాలకు కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇది గ్లోబల్ కవరేజీని అందిస్తుంది.

గ్లోబల్ పర్సనల్ గార్డ్ విషయానికి వస్తే మేము చాలా ఎక్కువ అందిస్తున్నాము 

ముఖ్యమైన ఫీచర్లు

గ్లోబల్ పర్సనల్ గార్డ్ ఈ క్రింది ఫీచర్లతో ఒక ప్రమాదం కారణంగా జరిగిన గాయాల కోసం రక్షణను అందిస్తుంది:

  • ప్రమాదవశాత్తు మరణం మరియు గాయాలను కవర్ చేస్తుంది

    ఈ పాలసీ, యాక్సిడెంట్ కారణంగా తలెత్తే గాయాల కోసం అయ్యే ఖర్చులకు కవరేజీని అందించడంతో పాటు యాక్సిడెంటల్ డెత్ కవరేజీని కూడా అందిస్తుంది.

  • జీవనశైలిలో సవరణ ప్రయోజనం

    ఈ పాలసీ ప్రమాదవశాత్తు గాయం తర్వాత, జీవనశైలి సవరణ కోసం అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది.

  • మొత్తం కుటుంబాన్ని కవర్ చేస్తుంది

    ఈ పాలసీ మిమ్మల్ని, మీ జీవిత భాగస్వామిని, తల్లిదండ్రులు మరియు పిల్లలను ఒకే పాలసీ క్రింద కవర్ చేస్తుంది.

  • దీర్ఘ-కాలిక పాలసీ

    మీరు 1, 2 లేదా 3 సంవత్సరాల వ్యవధి కోసం ఈ పాలసీని ఎంచుకోవచ్చు.

  • క్యుములేటివ్ బోనస్

    ప్రతీ క్లెయిమ్-రహిత సంవత్సరం కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తంపై 10% కుములేటివ్ బోనస్ పొందండి.

  • రూ. 25 కోట్ల వరకు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం కోసం ఆప్షన్‌లు

    మీ ఆదాయం ఆధారంగా రూ. 50, 000 నుండి రూ. 25 కోట్ల వరకు ఇన్సూరెన్స్ మొత్తం గురించిన ఆప్షన్‌లలో ఒకదానిని ఎంచుకోండి.

మా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్‍ల గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ వీడియోను చూడండి

video

అన్ని విభాగాలకు రీయింబర్స్‌మెంట్ కవర్

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ ప్రాసెస్

యాక్సిడెంటల్ మరణం లేదా గాయాల విషయంలో, రీయింబర్స్‌మెంట్ ప్రాసెస్‌ని ఉపయోగించి మీరు మీ సెటిల్‌మెంట్‌ని క్లెయిమ్ చేయవచ్చు. మీరు క్లెయిమ్ చేసిన కవర్‌ను బట్టి, అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇక్కడ ఉన్నాయి:

మరణం సందర్భంలో అవసరమైన డాక్యుమెంట్లు:

  • ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి యొక్క నామినీ/చట్టపరమైన వారసుడు సక్రమంగా పూర్తి చేసి మరియు సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్.
  • అడ్రస్ ప్రూఫ్ యొక్క ఒక కాపీ (ఆధార్/PAN కార్డ్).
  • డెత్ సర్టిఫికెట్ యొక్క అటెస్టెడ్ కాపీ.
  • ధృవీకరించబడిన FIR/పంచనామ/విచారణ పంచనామ కాపీ.
  • పోస్ట్ మార్టం రిపోర్ట్ యొక్క ధృవీకరించబడిన కాపీ.
  • విసేరా రిపోర్ట్ యొక్క ధృవీకరించబడిన కాపీ. (ఒకవేళ ఇది భద్రపరచబడి మరియు మరింత విశ్లేషణ కోసం పంపించబడినట్లు, పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో పేర్కొన్నట్లయితే మాత్రమే).
  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క నామినీ / చట్టపరమైన వారసుల NEFT వివరాలు మరియు రద్దు చేయబడిన చెక్.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

అదృశ్యమైన సందర్భంలో డాక్యుమెంట్లు అవసరమవుతాయి:

  • ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి యొక్క నామినీ/చట్టపరమైన వారసుడు సక్రమంగా పూర్తి చేసి మరియు సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్.
  • అడ్రస్ ప్రూఫ్ యొక్క ఒక కాపీ (రేషన్ కార్డ్ లేదా విద్యుత్ బిల్లు).
  • బలవంతంగా ల్యాండింగ్, స్ట్రాండింగ్, మునిగిపోవడం లేదా రవాణా యొక్క ధ్వంసం తరువాత, అధికారిక సంస్థ నుండి అదృశ్యమైనట్లు ధృవీకరించబడిన కాపీ.
  • ఒక ప్రయాణికుడిగా రవాణాలో ఛార్జీలను చెల్లించినట్లు డాక్యుమెంటరీ ప్రూఫ్.
  • పోలీసు అధికారుల వద్ద ఏదైనా ఫిర్యాదు ఉంటే, సాక్షి స్టేట్‌మెంట్ యొక్క అటెస్టెడ్ కాపీ.
  • ధృవీకరించబడిన FIR/పంచనామా/ఇంక్వెస్ట్ పంచనామా కాపీ.
  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క నామినీ / చట్టపరమైన వారసుల NEFT వివరాలు మరియు రద్దు చేయబడిన చెక్.
  • ఒరిజినల్ అసైన్‌మెంట్ ఎండార్స్‌మెంట్‌తో పాటు ఒరిజినల్ పాలసీ కాపీ (ఏదైనా ఉంటే).
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

అంబులెన్స్ కవర్ విషయంలో అవసరమైన డాక్యుమెంట్లు:

  • హక్కుదారు చేత సరిగ్గా పూర్తి చేసి, సంతకం చేయబడిన క్లెయిమ్ ఫారమ్.
  • రిజిస్టర్‌ చేయబడిన అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ నుండి, రవాణా కోసం చెల్లించిన ఒరిజినల్ బిల్లులు మరియు రశీదులు.
  • క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌కు అవసరం అయ్యే ఇతర డాక్యుమెంట్లు.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

శాశ్వతంగా పూర్తి వైకల్యం మరియు శాశ్వతంగా పాక్షిక వైకల్యం కోసం అవసరమైన డాక్యుమెంట్లు:

  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తిచే సరిగ్గా పూర్తి చేసి, సంతకం చేయబడిన క్లెయిమ్ ఫారమ్.
  • వైకల్యం యొక్క శాతం పేర్కొంటూ ఒక ప్రభుత్వ ఆసుపత్రి యొక్క సివిల్ సర్జన్ నుండి వైకల్యం సర్టిఫికెట్ యొక్క ధృవీకరించబడిన కాపీ.
  • ధృవీకరించబడిన FIR కాపీ. (ఒకవేళ అవసరమైతే)
  • వైకల్యాన్ని తెలియజేసే అన్ని X-ray / ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు మరియు ఫిల్మ్‌లు.
  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క NEFT వివరాలు మరియు రద్దు చేయబడిన చెక్.
  • వైకల్యానికి మద్దతుగా, ప్రమాదానికి ముందు మరియు తరువాత తీసిన రోగి ఫోటో.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ కోసం ప్రత్యేకమైన క్లెయిమ్ డాక్యుమెంట్ల జాబితా:

  • పాఠశాల/కళాశాల నుండి బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా విద్యా సంస్థ నుండి ఎడ్యుకేషన్ సరిఫికేట్/బర్త్ సర్టిఫికేట్.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

అడ్వెంచర్ స్పోర్ట్స్ బెనిఫిట్ కోసం అవసరమయ్యే క్లెయిమ్ డాక్యుమెంట్ల జాబితా:

  • స్పోర్ట్స్ ఈవెంట్ ఆర్గనైజర్/సర్వీస్ ప్రొవైడర్ నుండి పార్టిసిపేషన్ సర్టిఫికేట్.
  • ప్రీ-పార్టిసిపేషన్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్.
  • గాయం యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ట్రీట్‌మెంట్ చేసే డాక్టర్ నుండి ఒక సర్టిఫికేట్.
  • అన్ని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లు.
  • డిశ్చార్జ్ సారాంశం (ఒకవేళ హాస్పిటలైజ్ చేయబడితే).
  • మరణం/శాశ్వతంగా పూర్తి వైకల్యం కింద, క్లెయిమ్ కోసం జాబితా చేయబడిన డాక్యుమెంట్లు.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

ఫ్రాక్చర్ కేర్ కవర్‌ కోసం ప్రత్యేకమైన క్లెయిమ్ డాక్యుమెంట్ల జాబితా:

  • ఫ్రాక్చర్ మరియు ఫ్రాక్చర్ యొక్క ప్రదేశాన్ని నిర్ధారిస్తున్న X-ray రిపోర్ట్.
  • గాయం యొక్క పరిధి, గాయానికి గల కారణం, గాయం జరిగిన ప్రదేశం మరియు గాయపడిన తేదీని పేర్కొంటూ ట్రీట్‌మెంట్ చేసే సర్జన్ నుండి ఒక సర్టిఫికేట్.
  • చికిత్స వివరాలు.
  • డిశ్చార్జ్ సారాంశం (ఒకవేళ హాస్పిటలైజ్ చేయబడితే).
  • జీతం ఉన్న వ్యక్తి విషయంలో, సెలవు రికార్డుతో పాటు HR నుండి లెటర్.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

ఇఎంఐ చెల్లింపు కవర్‌ కోసం నిర్ధిష్టమైన క్లెయిమ్ డాక్యుమెంట్ల జాబితా:

  • ఫైనాన్సర్ నుండి ప్రస్తుత లోన్ అవుట్‌స్టాండింగ్ సర్టిఫికెట్‌తో పాటు లోన్ కోసం సమర్పించిన డాక్యుమెంట్లు.
  • నష్టం జరిగిన తేదీ నాటికి, బ్యాలెన్స్ లోన్ అవుట్‌స్టాండింగ్ స్టేట్‌మెంట్‌తో పాటు రీపేయిమెంట్ షెడ్యూల్ యొక్క అటెస్టెడ్ కాపీ.
  • వైకల్యాన్ని తెలియజేసే అన్ని X-ray / ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు మరియు ఫిల్మ్‌లు.
  • ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి సంతకం చేసిన క్యాన్సెల్ చెక్ మరియు NEFT వివరాలతో ఉన్న క్లెయిమ్ ఫారమ్.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

హాస్పిటల్‌ క్యాష్ బెనిఫిట్ కవర్ కోసం ప్రత్యేకించిన క్లెయిమ్ డాక్యుమెంట్ల జాబితా:

  • హక్కుదారు చేత సరిగ్గా పూర్తి చేసి, సంతకం చేయబడిన క్లెయిమ్ ఫారమ్.
  • హాస్పిటల్ డిశ్చార్జ్ కార్డ్ కాపీ.
  • ఆసుపత్రి బిల్లు కాపీ, డబ్బు రశీదు, రెవెన్యూ స్టాంప్ కార్డుతో సరిగ్గా సంతకం చేయబడింది.
  • ఉదాహరణకు అన్ని లేబొరేటరీ మరియు డయాగ్నోస్టిక్ టెస్ట్ రిపోర్ట్‌లు: X-ray, ECG, USG, మరియు MRI స్కాన్, హెమోగ్రామ్ మొదలైనవి.
  • క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌కు అవసరం అయ్యే ఇతర డాక్యుమెంట్లు.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

లోన్ ప్రొటెక్టర్ కవర్‌ కోసం ప్రత్యేకించిన క్లెయిమ్ డాక్యుమెంట్ల జాబితా:

  • యాక్సిడెంట్ జరిగిన తేదీ వరకు చెల్లింపు రికార్డుతో పాటు, లోన్ డిస్బర్స్‌మెంట్ లెటర్.
  • నష్టం జరిగిన తేదీ నాటికి, బ్యాలెన్స్ లోన్ అవుట్‌స్టాండింగ్ స్టేట్‌మెంట్‌తో పాటు రీపేయిమెంట్ షెడ్యూల్ యొక్క అటెస్టెడ్ కాపీ.
  • డెత్ సర్టిఫికెట్ యొక్క అటెస్టెడ్ కాపీ.
  • వైకల్యాన్ని తెలియజేసే అన్ని X-ray / ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు మరియు ఫిల్మ్‌లు.
  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణం సందర్భంలో, అతని/ఆమె యొక్క నామినీ ద్వారా సంతకం చేయబడిన క్యాన్సెల్ చెక్‌ మరియు NEFT వివరాలతో ఒక క్లెయిమ్ ఫారం.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

ప్రమాదవశాత్తు వైకల్యం కారణంగా ఆదాయాన్ని కోల్పోవడం నుండి యాక్సిడెంటల్ కవరేజ్ కోసం ప్రత్యేకమైన క్లెయిమ్ డాక్యుమెంట్ల జాబితా:

  • ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి చేత సంతకం చేయబడిన, పర్సనల్ యాక్సిడెంట్ క్లెయిమ్ ఫారమ్.
  • FIR యొక్క ధృవీకరించబడిన కాపీ (అవసరమైతే).
  • వైకల్యాన్ని తెలియజేసే అన్ని X-ray / ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు మరియు ఫిల్మ్‌లు.
  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ద్వారా సరిగ్గా సంతకం చేయబడిన క్యాన్సెల్ చెక్, NEFT వివరాలతో క్లెయిమ్ ఫారమ్.
  • ఉద్యోగస్తుల కోసం; ఖచ్చితమైన సెలవు వ్యవధిని పేర్కొంటూ యజమాని నుండి లీవ్ సర్టిఫికేట్, యజమాని సంతకం చేసి, సీల్ చేసినదై ఉండాలి.
  • ట్రీట్‌మెంట్ చేసే డాక్టర్ నుండి, వైకల్యం రకం, వైకల్యం యొక్క కాలం మరియు రోగి తన విధులను తిరిగి ప్రారంభించడానికి తగిన ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే ఫైనల్ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

రోడ్ అంబులెన్స్ కవర్ కోసం ప్రత్యేకించిన క్లెయిమ్ డాక్యుమెంట్ల జాబితా

  • క్లెయిమెంట్ సంతకం చేసిన మరియు సరిగ్గా పూర్తి చేయబడిన క్లెయిమ్ ఫారం.
  • రిజిస్టర్ చేయబడిన అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ నుండి రవాణా కోసం చెల్లించిన ఒరిజినల్ బిల్లులు మరియు రశీదులు.
  • గాయపడిన వ్యక్తిని తదుపరి చికిత్స కోసం ఉన్నత వైద్య కేంద్రానికి బదిలీ చేయడానికి, చికిత్స చేసే డాక్టర్ నుండి ఒక సర్టిఫికెట్.
  • ఉదాహరణకు అన్ని లేబొరేటరీ మరియు డయాగ్నోస్టిక్ టెస్ట్ రిపోర్ట్‌లు: X-ray, ECG, USG, and MRI స్కాన్, హెమోగ్రామ్ మొదలైనవి.
  • క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌కు అవసరం అయ్యే ఇతర డాక్యుమెంట్లు.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

ప్రయాణ ఖర్చుల బెనిఫిట్ కవర్‌ కోసం నిర్ధిష్టమైన క్లెయిమ్ డాక్యుమెంట్ల జాబితా:

  • ఒరిజినల్ ప్రయాణ టిక్కెట్లు/బిల్లులు మరియు రశీదులు, బుకింగ్ తేదీ మరియు ప్రయాణ తేదీతో సహా ప్రయాణానికి సంబంధించిన వాస్తవ ఖర్చులను తెలియజేస్తాయి.
  • డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్.
  • క్లెయిమెంట్ సంతకం చేసిన మరియు సరిగ్గా పూర్తి చేయబడిన క్లెయిమ్ ఫారం.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

ప్రమాదవశాత్తు హాస్పిటల్‌లో చేరడం వలన అయ్యే ఖర్చుల కోసం నిర్ధిష్టమైన క్లెయిమ్ డాక్యుమెంట్ల జాబితా:

  • డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్.
  • క్లెయిమెంట్ సంతకం చేసిన మరియు సరిగ్గా పూర్తి చేయబడిన క్లెయిమ్ ఫారం.
  • ఒరిజినల్ హాస్పిటల్ డిశ్చార్జ్ కార్డు.
  • బిల్లులో పేర్కొన్న అన్ని ఖర్చుల గురించి వివరణాత్మక విశ్లేషణను అందించే ఒరిజినల్ హాస్పిటల్ బిల్లు. OT ఛార్జీలు, డాక్టర్ కన్సల్టేషన్ మరియు సందర్శన ఛార్జీలు, OT కంజ్యూమబుల్స్, ట్రాన్స్‌ఫ్యూజన్స్, రూమ్ రెంట్ మొదలైన వాటి గురించిన వివరాలను స్పష్టంగా పేర్కొనవలసి ఉంటుంది.
  • రెవెన్యూ స్టాంప్‌తో పాటు సంతకం చేయబడిన ఒరిజినల్ డబ్బు రశీదు.
  • ఉదాహరణకు అన్ని లేబొరేటరీ మరియు డయాగ్నోస్టిక్ టెస్ట్ రిపోర్ట్‌లు: X-ray, ECG, USG, and MRI స్కాన్, హెమోగ్రామ్ మొదలైనవి.
  • క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌కు అవసరం అయ్యే ఇతర డాక్యుమెంట్లు.
  • మీ ఆధార్ కార్డ్, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ ఫోటో ID మరియు PAN కార్డ్ యొక్క కాపీ. పాలసీని జారీ చేసేటప్పుడు లేదా మునుపటి క్లెయిమ్‌లో మీ ID కార్డు పాలసీతో లింక్ చేయబడి ఉంటే, ఇది తప్పనిసరి కాదు.

క్యాష్‌లెస్ క్లెయిమ్ ప్రాసెస్

క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్, కేవలం నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌ని పొందటానికి, క్రింద పేర్కొన్న విధానాన్ని అనుసరించండి:

a. ప్రమాదవశాత్తు జరిగిన గాయాలకు చికిత్స మరియు/లేదా వైద్య ఖర్చులను నెట్‌వర్క్ హాస్పిటల్ నుండి పొందడానికి ముందు, మీరు మాకు కాల్ చేసి, మేము అందించే ఫారమ్ ద్వారా వ్రాతపూర్వకంగా ప్రీ-ఆథరైజేషన్ కోసం అభ్యర్థన చేయాలి. ప్రమాదవశాత్తు శారీరక గాయం వలన అత్యవసర హాస్పిటలైజేషన్ సందర్భంలో, ఈ పరిస్థితి మినహాయింపు కింద పరిగణించబడుతుంది.

b. మీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మరియు పూర్తి సమాచారం మరియు డాక్యుమెంటేషన్ పొందిన తర్వాత, మేము మీకు లేదా నెట్‌వర్క్ ఆసుపత్రికి ఒక అధికార లేఖను పంపుతాము. ఆథరైజేషన్ లెటర్, మీ పాలసీ ID కార్డ్ మరియు మేము పేర్కొన్న ఏదైనా ఇతర సమాచారం లేదా డాక్యుమెంటేషన్‌ను ఆసుపత్రిలో మీ అడ్మిషన్ సమయంలో ప్రీ-ఆథరైజేషన్ లెటర్‌లో గుర్తించబడిన నెట్‌వర్క్ హాస్పిటల్‌లో తప్పనిసరిగా అందజేయాలి.

c. పైన పేర్కొనబడిన విధానం అనుసరించినట్లయితే, ఒక ప్రమాదం కారణంగా గాయపడినప్పుడు మీరు నెట్‌వర్క్ హాస్పిటల్ వైద్య ఖర్చుల కోసం నేరుగా చెల్లించనక్కర్లేదు. యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ ఖర్చుల కింద హాస్పిటల్‌కి మా నుండి పరిహారం అందుతుంది మరియు అసలు బిల్లులు మరియు చికిత్స చేసినట్లు రుజువు హాస్పిటల్ వద్ద వదిలివేయబడుతుంది. అయితే, అన్ని ధరలు మరియు ఖర్చులు కవర్ చేయబడతాయని ప్రీ-ఆథరైజేషన్ హామీ ఇవ్వదు. వైద్య ఖర్చుల కోసం ప్రతి క్లెయిమ్‌ను సమీక్షించే హక్కును మేము కలిగి ఉంటాము మరియు తదనుగుణంగా ఈ పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం కవరేజ్ నిర్ణయించబడుతుంది. మీరు ఏదైనా సందర్భంలోనైనా, ఇతర అన్ని ఖర్చులను నేరుగా సెటిల్ చేయవలసి ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్‌ని సరళంగా చూద్దాం

గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ అంటే ఏమిటి?

గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది యాక్సిడెంట్‌ల వల్ల సంభవించే మరణం, వైకల్యం లేదా గాయాల విషయంలో విస్తృతమైన గ్లోబల్ కవరేజీని అందిస్తుంది.

నాకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఎందుకు ఉండాలి?

మీరు ప్రమాదం తర్వాత వికలాంగులైతే లేదా గాయపడినట్లయితే పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలు మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. ఊహించని వైద్య ఖర్చులు, ఫైనాన్షియల్‍గా పెద్ద ఎదురుదెబ్బ కావచ్చు. కాంప్రిహెన్సివ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఊహించని సంఘటనల తర్వాత ఆర్థికంగా సురక్షితంగా ఉండడానికి భరోసా ఇస్తుంది.

గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ, ఇతర పర్సనల్ యాక్సిడెంట్ పాలసీల కంటే భిన్నంగా ఎలా ఉంటుంది?

స్టాండ్‌అలోన్ యాక్సిడెంట్ పాలసీ మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం మరియు పాక్షిక వైకల్యం నుండి కవర్ చేస్తుంది. అయితే, మీరు హాస్పిటల్ ఖర్చులు, అంబులెన్స్ ఛార్జీలు, లోన్ లయబిలిటీ, ఫిజియోథెరపీ మరియు ఇతర ఖర్చుల నుండి అసురక్షితంగా ఉంటారు. గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ ఈ ఖర్చులన్నిటితో పాటు, ఆదయ కవర్, ఫ్రాక్చర్ కవర్, అడ్వెంచర్ స్పోర్ట్స్ బెనిఫిట్, డైలీ క్యాష్ బెనిఫిట్ మరియు ప్రయాణ ఖర్చులు వంటి అదనపు ప్రయోజనాలను ఒకే పాలసీ కింద అందిస్తూ, ఆర్థిక మద్దతుని తెలుపుతుంది మరియు ఊహించని ప్రమాదం సందర్భంలో పూర్తి మనఃశాంతిని కల్పిస్తుంది.

గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ అనేది కొన్ని అనారోగ్యాలు/వ్యాధి కారణంగా సంభవించే మరణం లేదా సహజ మరణాన్ని కవర్ చేస్తుందా?

గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ ప్రమాదవశాత్తు మరణం లేదా ప్రమాదవశాత్తు గాయాల వల్ల సంభవించే మరణాన్ని మాత్రమే కవర్ చేస్తుంది.

ప్రాథమిక కవర్ కింద లభించే ప్రయోజనాలు ఏమిటి?

ప్రాథమిక కవర్‌లో మరణం, పూర్తి శాశ్వత వైకల్యం మరియు పాక్షిక శాశ్వత వైకల్యాలు ఉంటాయి.
మరణం: ప్రమాదం కారణంగా మరణించినప్పుడు డెత్ బెనిఫిట్. డెత్ కవర్‌తో పాటు, ఇటువంటి అదనపు ప్రయోజనాలు అందించబడతాయి:

  1. భౌతిక ఖాయాల రవాణా - మరణం కింద ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తంలో 1% గా చెల్లించబడుతుంది.
  2. అంత్యక్రియల ఖర్చులు - మరణం కింద ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తంలో 1% గా చెల్లించబడుతుంది.

ఆ రెండు ప్రయోజనాలు ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తానికి మించి ఉన్నాయి.

అలాగే, మేము అదృశ్య కవర్‌ని అందిస్తాము. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏదైనా రవాణాలో ప్రయాణిస్తుంటే బలవంతపు ల్యాండింగ్‌, స్ట్రాండింగ్, మునిగిపోవడం లేదా శిధిలానికి గురవ్వడం వంటివి జరిగితే మరియు ఆ ప్రమాదం కారణంగా అతను అదృశ్యమైతే, అదృశ్యమైన 12 నెలల తరువాత, ఆ వ్యక్తి మరణించినట్లు భావించబడతాడు, ప్రమాదవశాత్తు మరణం వల్ల ప్రయోజనం నామినీకి చెల్లించబడుతుంది.

పూర్తి శాశ్వత వైకల్యం:

ప్రమాదవశాత్తు శారీరక గాయం జరిగిన సందర్భంలో పూర్తి శాశ్వత వైకల్యం ప్రయోజనం:

  1. రెండు కళ్లలో చూపుని కోల్పోవడం.
  2. శారీరకంగా విడిపోవడం లేదా రెండు చేతులు మరియు రెండు పాదాలను ఉపయోగించగల సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోవడం.
  3. శారీరికంగా విడిపోవడం లేదా ఒక చేయి లేదా ఒక పాదం ఉపయోగించే సామర్థ్యం కోల్పోవడం.
  4. ఒక కంటి చూపు నష్టం మరియు భౌతికంగా విడిపోవడం లేదా ఒక చేతి లేదా అడుగు నష్టం,దానిని ఉపయోగించే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోవడం.

పైన పేర్కొన్న వాటికి అదనంగా, బీమా చేసిన మొత్తంలో 2% జీవనశైలి సవరణ ప్రయోజనం కోసం, బీమా చేయబడిన వ్యక్తికి చెల్లించబడుతుంది. ఈ ప్రయోజనం బీమా ఎంచుకున్న మొత్తానికి మించి ఉంటుంది.

శాశ్వత పాక్షిక వైకల్యం:

పాలసీ వ్యవధిలో మీరు ప్రమాదవశాత్తు శారీరక గాయాన్ని ఎదుర్కొంటే, ఇది ప్రత్యక్షంగా మరియు స్వతంత్రంగా అన్ని ఇతర కారణాల వలన ప్రమాదం తేదీ నుండి 12 నెలలలో శాశ్వత వైకల్యానికి దారితీస్తే, అప్పుడు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తంలో కొంత శాతం, క్రింద చూపబడిన విధంగా చెల్లించబడుతుంది:

శాశ్వత పాక్షిక వైకల్యం బీమా చేయబడిన మొత్తంలో % శాశ్వత పాక్షిక వైకల్యం బీమా చేయబడిన మొత్తంలో %
రెండు చెవుల వినికిడి 75% మడమ వద్ద ఒక పాదం 40%
భుజం జాయింట్ వద్ద ఒక బాహువు 70% ఒక చెవి వినికిడి 30%
ఒక కాలికి మధ్య తొడపై 70% ఒక బొటనవేలు 20%
మోచెయ్యి జాయింట్ పైన ఒక బాహువు 65% ఒక చూపుడు వేలు 10%
మోచెయ్యి జాయింట్ క్రింద ఒక బాహువు 60% వాసన అనుభూతి 10%
మధ్య-తొడ వరకు ఒక కాలు 60% రుచి అనుభూతి 5%
మణికట్టు వద్ద ఒక చెయ్యి 55% ఏదైనా ఇతర వేలు 5%
మోకాలి కింది వరకు ఒక కాలు 50% ఒక పెద్ద బొటనవేలు 5%
ఒక కన్ను 50% ఏదైనా ఇతర కాలివేలు 2%
మధ్య-పిక్క వరకు ఒక కాలు 45%    

యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ ఏం కవర్ చేస్తుంది?

యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ అనేది, కనీసం 24 గంటల వరకు హాస్పిటలైజేషన్ కారణంగా తలెత్తే ఇన్-పేషెంట్ చికిత్స ఖర్చులను మరియు వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

ఆశీష్ జుంజున్వాలా

2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...

సునీత ఎం అహూజా

లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు

రేని జార్జ్

నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...

additional solutions

అడ్వెంచర్ స్పోర్ట్స్ సమయాల్లో మాత్రమే ప్రమాదాలను కవర్ చేసే పాలసీ.

అంతే కాదు, మీ గ్లోబల్ పర్సనల్ గార్డ్‌తో అదనపు ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

ఊహించని ప్రమాదాలకు వ్యతిరేకంగా మేము ఇతర ప్రయోజనాలతో కూడిన ఆర్థిక కవర్‌ని కూడా అందిస్తాము:

యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ ఖర్చులు

మీరు హాస్పిటలైజ్ చేయబడిన సందర్భంలో జరిగిన వైద్య ఖర్చుల నుండి మిమ్మల్ని రక్షించే ఒక ఆప్షనల్ కవర్... మరింత చదవండి

యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ ఖర్చులు

మీరు కనీసం 24 గంటలు హాస్పిటల్‌లో చేరినప్పుడు లేదా ప్రమాదవశాత్తు గాయం కారణంగా జాబితా చేయబడిన డేకేర్ విధానాలలో దేనినైనా ఎదుర్కొన్నప్పుడు అయ్యే వైద్య ఖర్చుల నుండి మిమ్మల్ని రక్షించే ఒక ఆప్షనల్ కవర్ ఇది. అటువంటి సందర్భంలో ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.

Personal guard adventure sports

అడ్వెంచర్ స్పోర్ట్స్ బెనిఫిట్

ఈ పాలసీ మరణం లేదా ప్రమాదవశాత్తు గాయాల కారణంగా సంభవించే శాశ్వత పూర్తి వైకల్యాన్ని...కవర్ చేసే ఒక ఆప్షనల్ కవర్‌ని అందిస్తుందిమరింత చదవండి

అడ్వెంచర్ స్పోర్ట్స్ బెనిఫిట్

సూపర్‌విజన్ కింద ఏదైనా నాన్-ప్రొఫెషనల్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో నిమగ్నమైనప్పుడు, ప్రమాదవశాత్తు శారీరక గాయం వలన జరిగిన మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం కోసం ఈ పాలసీ ఆప్షనల్ కవర్‌ని అందిస్తుంది.

overall protection

ఎయిర్ అంబులెన్స్ కవర్

ఆప్షనల్ ఎయిర్ అంబులెన్స్ కవర్, ప్రమాద స్థలం నుండి సమీప హాస్పిటల్‌ వరకు అత్యవసర ఎయిర్ అంబులెన్స్ ఖర్చులను చెల్లిస్తుంది.

పిల్లల విద్యా ప్రయోజనం

చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ అనేది మీ పిల్లల చదువుల కోసం అయ్యే ఖర్చులను కవర్ చేయడానికి గల ఒక ఆప్షనల్ కవర్ ... మరింత చదవండి

పిల్లల విద్యా ప్రయోజనం

చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ అనేది ఒక ఆప్షనల్ కవర్, ప్రమాదం కారణంగా మీరు శాశ్వతంగా వికలాంగులైతే లేదా పనిచేసే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతే, ఇది మీపై ఆధారపడిన పిల్లల చదువుకు అయ్యే ఖర్చులను భరిస్తుంది.

Global Personal Guard Coma cover

కోమా కవర్

ఒకవేళ మీరు ప్రమాదవశాత్తు గాయం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్తే, ఈ పాలసీ మీ ఇన్సూరెన్స్ మొత్తానికి ఆప్షనల్ కవర్‌ని అందిస్తుంది.

Global Personal card

ఇఎంఐ చెల్లింపు కవర్

పాలసీ నిబంధనల ప్రకారం, ప్రమాదవశాత్తు గాయం కారణంగా శాశ్వత పాక్షిక వైకల్యం సంభవించిన సందర్భంలో 3 నెలల వరకు మీ యాక్టివ్ ఇఎంఐ ని ఇన్సూర్ చేయడానికి ఈ ఆప్షనల్ కవర్‌ని ఎంచుకోవచ్చు.

Global personal Guard Fracture Care

ఫ్రాక్చర్ కేర్

ఈ ఆప్షనల్ కవర్, ఒక ఫ్రాక్చర్ చికిత్స కోసం అయ్యే ఖర్చులను రూ. 5 లక్షల వరకు చెల్లిస్తుంది.

Global Personal Hospital Cover

హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్

ఈ ఆప్షనల్ కవర్ కింద, ప్రమాదవశాత్తు గాయం కారణంగా హాస్పిటల్‌లో చేరినప్పుడు, మీరు 60 రోజుల వరకు డైలీ క్యాష్ బెనిఫిట్ కోసం అర్హులు.

Global Personal Guard loan

లోన్ ప్రొటెక్టర్ కవర్

ఈ ఆప్షనల్ కవర్ కింద ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తం వరకు, పాలసీలో పేర్కొన్న మీ లోన్ యొక్క అవుట్‌స్టాండిగ్ మొత్తానికి అనుగుణంగా ఉన్న మొత్తాన్ని మీరు స్వీకరించవచ్చు.

Global guard disability

ప్రమాదం నుండి వైకల్యం కారణంగా ఆదాయాన్ని కోల్పోవడం

ప్రమాదవశాత్తు గాయం ఫలితంగా వైకల్యం, తద్వారా జరిగిన మీ ఆదాయం నష్టాన్ని ఈ పాలసీ కవర్ చేస్తుంది.

Global Personal Guard Road Ambulace cover

రోడ్ అంబులెన్స్ కవర్

ఈ ఆప్షనల్ కవర్, ప్రమాదవశాత్తు గాయం కారణంగా హాస్పిటల్‌లో చేరినప్పుడు తలెత్తే అత్యవసర అంబులెన్స్ ఖర్చులను, ఇన్సూరెన్స్ చేసిన మొత్తం వరకు చెల్లిస్తుంది.

Global Personal card Travel expenses

ప్రయాణ ఖర్చులకు బెనిఫిట్

మీ నివాస నగరం వెలుపల, ప్రమాదవశాత్తు గాయం కారణంగా మీరు హాస్పిటల్‌లో చేరినట్లయితే, ఈ ఆప్షనల్ కవర్ కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చుల కోసం బీమా చేసిన మొత్తం వరకు చెల్లిస్తుంది.

గ్లోబల్ పర్సనల్ గార్డ్ కోసం అర్హతా ప్రమాణాలు

ప్రమాణం

వివరాలు

ప్రపోజర్ కోసం ప్రవేశ వయస్సు

18 నుంచి 70 సంవత్సరాలు

ఆధారపడిన పిల్లల కోసం ప్రవేశ వయస్సు

3 నెలల నుండి 25 సంవత్సరాలు వరకు

ఆధారపడినవారు కవర్ చేయబడతారు

స్వీయ, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు మరియు ఆధారపడిన తల్లిదండ్రులను పాలసీలో చేర్చవచ్చు.

వృత్తి-ఆధారిత రిస్క్ క్లాసులు

రిస్క్ తరగతులు వృత్తి ఆధారంగా ప్రీమియం రేట్లను నిర్ణయిస్తాయి, వాటిలో నిర్వహణ విధులు (తక్కువ రిస్క్) మరియు అధిక రిస్క్ కలిగిన వృత్తులు (ఉదాహరణకు ఎలక్ట్రీషియన్లు) ఉంటాయి.

ఇన్సూర్ చేయబడిన మొత్తం అర్హత

మరణం కోసం 100 రెట్లు నెలవారీ ఆదాయం మరియు పూర్తి వైకల్యం కోసం 60 సార్లు ఇన్సూర్ చేయబడిన మొత్తం ఎంపికలు, గరిష్టంగా ₹25 కోట్ల వరకు కవరేజ్‌తో

ఆధారపడినవారి కవరేజ్ పరిమితులు

ఆధారపడిన పిల్లలకు 25% వరకు మరియు జీవిత భాగస్వామి/తల్లిదండ్రుల కోసం ప్రపోజర్ యొక్క ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 50% వరకు కవరేజ్.

ఈ పాలసీ క్యుములేటివ్ బోనస్‌లను కూడా అందిస్తుంది, ప్రతి క్లెయిమ్-రహిత సంవత్సరానికి 10% జోడిస్తుంది, 50% వరకు . పాలసీ రెన్యూవల్స్ అనేవి జీవితకాలం-అర్హత కలిగినవి, నిర్దిష్ట మినహాయింపులను మినహా.

గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీని ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి?

దశ

వివరణ

1. పాలసీ ప్రయోజనాలను చర్చించండి

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వైజర్‌ను సంప్రదించండి లేదా కవరేజీలు, ప్రయోజనాలు మరియు ప్రీమియంలను అర్థం చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో వివరాలను అన్వేషించండి.

2. కవరేజ్ స్థాయిని ఎంచుకోండి

మీ వ్యక్తిగత మరియు కుటుంబ అవసరాల ఆధారంగా బేస్ మరియు ఆప్షనల్ కవర్లను ఎంచుకోండి. కావలసిన రక్షణ కోసం తగినంత కవరేజీని నిర్ధారించుకోండి.

3. ప్రతిపాదన ఫారం సబ్మిట్ చేయండి

ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం ధృవీకరణ కోసం ఒక ప్రతిపాదన ఫారం నింపండి, ఖచ్చితమైన వ్యక్తిగత వివరాలు మరియు ఏవైనా అవసరమైన ఆదాయ డాక్యుమెంటేషన్ అందించండి.

4. పాలసీని సమీక్షించండి మరియు ఫైనలైజ్ చేయండి

నిబంధనలు మరియు మినహాయింపులతో సహా పాలసీ డాక్యుమెంట్‌ను సమీక్షించండి. ప్రాసెసింగ్ కోసం అవసరమైన ఏదైనా డాక్యుమెంటేషన్ ఫైనలైజ్ చేయండి మరియు సబ్మిట్ చేయండి.

5. చెల్లింపు మరియు నిర్ధారణ

ఆన్‌లైన్‌లో చెల్లింపును పూర్తి చేయండి. పాలసీ యాక్టివేషన్‌ను నిర్ధారిస్తూ, పాలసీ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ ఇమెయిల్‌కు పంపబడుతుంది.

ఈ ప్రక్రియ చాలా సులభం, మరియు ఆన్‌లైన్ పోర్టల్‌తో పాలసీ కొనుగోళ్లు సమర్థవంతమైనవి మరియు సులభంగా అందుబాటులో ఉంటాయి.

గ్లోబల్ పర్సనల్ గార్డ్ భీమాను కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు

  • చేర్పులు

  • మినహాయింపులు

హాస్పిటలైజేషన్ ఖర్చులు

ప్రమాదవశాత్తు గాయం కారణంగా హాస్పిటల్‌లో చేరినప్పుడు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది.

సాహస క్రీడలు

పర్యవేక్షణ క్రింద అడ్వెంచర్ స్పోర్ట్‌లో పొల్గొన్నపుడు సంభవించిన మరణం లేదా వైకల్యాన్ని కవర్ చేస్తుంది.

ఫ్రాక్చర్ కేసులు

ప్రమాదం కారణంగా జరిగిన ఫ్రాక్చర్ విషయంలో తలెత్తే ఖర్చులను కవర్ చేస్తుంది.

ఎమర్జెన్సీ అంబులెన్స్ కవర్

అత్యవసర పరిస్థితిలో రోడ్ మరియు ఎయిర్ అంబులెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది.

ప్రయాణ ఖర్చులు

మీ నివాస నగరం వెలుపల ప్రమాదం కారణంగా మీరు హాస్పిటల్‌లో చేర్చబడినట్లయితే, కుటుంబ సభ్యుని ప్రయాణాన్ని కవర్ చేస్తుంది.

1 ఆఫ్ 1

ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం లేదా స్వయంగా చేసుకున్న గాయం లేదా అనారోగ్యం ఫలితంగా జరిగిన ప్రమాదం కారణంగా ఏర్పడిన శారీరక గాయం.

మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంలో జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన గాయం/మరణం.

నేరపూరితమైన ఉద్దేశ్యంతో ఏదైనా చట్టం ఉల్లంఘించడం వలన జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన గాయం/మరణం.

ఏవియేషన్ లేదా బెలూనింగ్‌లో పాల్గొని ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన గాయం/మరణం...

మరింత చదవండి

విమానయానం లేదా బెలూనింగ్‌లో పాల్గొనడం వల్ల, ప్రపంచంలో ఎక్కడైనా సక్రమంగా లైసెన్స్ పొందిన ప్రామాణిక రకం విమానాలలో ప్రయాణీకుడిగా (ఛార్జీల చెల్లింపు లేదా ఇతరత్రా) కాకుండా వేరే బెలూన్ లేదా విమానంలో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు లేదా ప్రయాణించేటప్పుడు ప్రమాదవశాత్తు జరిగే గాయం/మరణం.

మోటార్ రేసింగ్ లేదా ట్రయల్ రన్స్ సమయంలో డ్రైవర్, కో-డ్రైవర్ లేదా మోటార్ వాహనం ప్రయాణీకునిగా పాల్గొన్నప్పుడు జరిగిన ప్రమాదం కారణంగా కలిగిన గాయం/ మరణం.

మీ శరీరంపై మీరు నిర్వహించే లేదా నిర్వహించిన ఏవైనా స్వస్థత కలిగించే చికిత్సలు లేదా ఇంటర్వెన్షన్లు.

సైనిక వ్యాయామాల రూపంలో నిర్వహించబడిన ఏదైనా నావికాదళ, సైనిక లేదా వైమానిక దళ కార్యకలాపాలలో పాల్గొనడం ...

మరింత చదవండి

ఎటువంటి విరామం లేకుండా నిర్వహించబడిన మిలిటరీ ఎక్సర్‌సైజెస్ లేదా వార్ గేమ్స్ లేదా విదేశీ లేదా దేశీయ శత్రువుతో యుద్ధం రూపంలో ఏదైనా నేవీ, మిలిటరీ లేదా ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క భాగస్వామ్యం.

మీ పై వాస్తవంగా లేదా ఆరోపించబడిన చట్టపరమైన బాధ్యతల వలన కలిగిన పర్యవసాన నష్టాలు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు.

హెచ్ఐవి మరియు/లేదా ఎయిడ్స్ తో సహా ఏదైనా హెచ్ఐవి సంబంధిత అనారోగ్యం మరియు/లేదా ఏ రకంగానైనా కలిగిన దాని మ్యూటెంట్ డెరివేటివ్స్ లేదా దాని వేరియేషన్లు.

గర్భధారణ, దాని ఫలితంగా శిశుజననం, గర్భస్రావం, అబార్షన్ లేదా వీటిలో దేని నుండి అయినా ఉత్పన్నమయ్యే సమస్యలు.

యుద్ధం (ప్రకటించబడినా లేదా కాకపోయినా), అంతర్యుద్ధం, ఆక్రమణ, విదేశీ చర్య కారణంగా ఉత్పన్నమయ్యే చికిత్స...

మరింత చదవండి

యుద్ధం, దండయాత్ర, విదేశీ శత్రువుల చర్యలు, శత్రుత్వాలు (యుద్ధం ప్రకటించబడినా లేదా ప్రకటించబడకపోయినా), అంతర్యుద్ధం, కల్లోలం, అశాంతి, ఉద్యమాలు, విప్లవం, తిరుగుబాటు, సైనిక లేదా స్వాధీనం చేసుకున్న అధికారం లేదా జప్తు లేదా జాతీయం లేదా ఏదైనా ప్రభుత్వం లేదా ప్రజా, స్థానిక సంస్థల అధికారం చేత జారీచేయబడిన ఆదేశాల ద్వారా జరిగిన నష్టం/ దెబ్బతినడం కారణంగా జరిగే చికిత్స.

అణు శక్తి, రేడియోధార్మికతకి గురి అయితే చేయబడే చికిత్స.

1 ఆఫ్ 1

గ్లోబల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మరియు వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య తేడా

ప్రమాణం

గ్లోబల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (గ్లోబల్ పర్సనల్ గార్డ్)

వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్

కవరేజ్ పరిధి

ప్రమాదం కారణంగా గాయాలు, మరణం మరియు వైకల్యం కోసం ప్రపంచవ్యాప్తంగా కవరేజ్ అందిస్తుంది

సాధారణంగా స్థానిక లేదా జాతీయ కవరేజీకి పరిమితం చేయబడుతుంది

క్లెయిమ్ రకాలు

ప్రమాదం కారణంగా మరణం, పూర్తి/శాశ్వత వైకల్యం, ప్రమాదాల కారణంగా హాస్పిటలైజేషన్‌ను కవర్ చేస్తుంది

అనారోగ్యం మరియు ఆరోగ్య సంబంధిత హాస్పిటలైజేషన్లను కవర్ చేస్తుంది

అడ్వెంచర్ స్పోర్ట్స్ బెనిఫిట్

అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటి అధిక-రిస్క్ కార్యకలాపాల కోసం ఆప్షనల్ కవరేజ్

సాధారణంగా స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల క్రింద కవర్ చేయబడదు

ఆదాయం రక్షణ

ప్రమాదం సంబంధిత వైకల్యం కారణంగా ఆదాయ నష్టం కోసం పరిహారం అందిస్తుంది

సాధారణంగా ఆదాయ నష్టాన్ని కవర్ చేయదు

ఆప్షనల్ కవర్లు అందుబాటులో ఉన్నాయి

పిల్లల విద్య ప్రయోజనం, కోమా కవర్ మరియు ఇఎంఐ చెల్లింపు కవర్ వంటి అదనపు ఎంపికలు

పాలసీ రకం ఆధారంగా పరిమిత యాడ్-ఆన్‌లు

ఇన్సూరెన్స్ మొత్తం ఆప్షన్‌లు

రూ. 25 కోట్ల వరకు అధిక కవరేజ్‌తో ఫ్లెక్సిబుల్

సాధారణంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కంటే తక్కువగా ఉంటుంది

హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‍లోడ్ చేసుకోండి

మీ మునుపటి పాలసీ గడువు ఇంకా ముగియలేదా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

4.75

(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

Rama Anil Mate

రమా అనిల్ మాటే

ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
మీ వెబ్‌సైట్‌లో రెన్యూవల్ అద్భుతమైనది,
యూజర్-ఫ్రెండ్లీ మరియు సరళమైనది.

Suresh Kadu

సురేష్ కాడు

బజాజ్ అలియంజ్ వారి ఎగ్జిక్యూటివ్
తీవ్ర మద్దతుని అందించారు, అందుకుగాను
నేను వారిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.

Ajay Bindra

అజయ్ బింద్ర

బజాజ్ అలియంజ్ వారి ఎగ్జిక్యూటివ్
పాలసీ ప్రయోజనాలను చక్కగా విశదీకరించారు. ఆమె చాలా మంచి
కమ్యూనికేషన్ స్కిల్స్‌‌ని కలిగి ఉన్నారు మరియు చక్కగా వివరించారు.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి