బజాజ్ అలియంజ్ వద్ద మేము మా కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు కృషి చేస్తాము. మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్
సెటిల్‌మెంట్ ప్రక్రియని సులభతరం చేసే ప్రయత్నాలలో మోటార్ ఒటిఎస్ కూడా ఒకటి. బజాజ్ అలియంజ్ తొలిసారి మోటార్ ఒటిఎస్ (ఆన్-ది-స్పాట్) ఫీచర్‌ను ప్రారంభించింది, ఇది మా కస్టమర్లకు కేవలం 20 నిమిషాల్లో రూ. 30,000 వరకు కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను సెటిల్ చేయడంలో సహాయపడుతుంది. మా కేరింగ్లీ యువర్స్ యాప్‌లో అందుబాటులో ఉన్న ఈ మోటార్ ఒటిఎస్ ఫీచర్ 'ఆన్-ది-స్పాట్', సెటిల్‌మెంట్ ఆప్షన్‌ను అందించడం ద్వారా కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తుంది. మేము మోటార్ ఒటిఎస్ ద్వారా 4000 కంటే ఎక్కువ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు సెటిల్ చేసాము, ఇది మొత్తం క్లెయిమ్ సెటిల్‌మెంట్ టిఎటిలో 11% తగ్గింపుకు దారితీసింది. మేము ఒక అడుగు ముందుకు వేసి, ఈ వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ ప్రయోజనాన్ని మా
టూ వీలర్ ఇన్సూరెన్స్ కస్టమర్లకు కూడా అందించాలనుకుంటున్నాము. టూ వీలర్ క్లెయిమ్‌ల కోసం మోటార్ ఒటిఎస్ ఫీచర్ ప్రారంభించడంతో మేము ఆ పని చేస్తున్నాము!
టూ వీలర్ క్లెయిమ్‌ల కోసం మోటార్ ఒటిఎస్ ప్రయోజనాలు:
- మోటార్ ఒటిఎస్ ఫీచర్ రూ. 10,000 వరకు ఓన్ డ్యామేజ్ క్లెయిముల క్లెయిమ్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తుంది
- మీరు కేవలం 20 నిమిషాల్లో క్లెయిమ్ నమోదు చేసుకోవచ్చు మరియు సెటిల్ చేసుకోవచ్చు
- మా కేరింగ్లీ యువర్స్ యాప్‌ను ఉపయోగించి మీరు మీ స్మార్ట్ ఫోన్ నుండి క్షణాల్లో టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయవచ్చు
- యాప్ ద్వారా అవసరమైన అన్ని వివరాలను పూరించిన తర్వాత మీరు నేరుగా మీ బ్యాంక్ అకౌంటులోకి క్లెయిమ్ మొత్తాన్ని అందుకోవచ్చు
- కేరింగ్లీ యువర్స్ యాప్‌లోని ఈ ఫీచర్‌ను భారతదేశంలో ఎక్కడినుండైనా యాక్సెస్ చేయవచ్చు
- మీ క్లెయిమ్ ప్రాసెస్ చాలా సులభం, వేగవంతమైనది మరియు సౌకర్యవంతమైనది
టూ వీలర్ క్లెయిమ్‌ల ప్రాసెస్ ఫ్లో కోసం మోటార్ ఒటిఎస్:
- మీ మొబైల్ డివైజ్‌లో మా కేరింగ్లీ యువర్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
- మీరు ఒక కొత్త యూజర్ అయితే, కేరింగ్లీ యువర్స్ యాప్‌లో ఫీచర్లు, సర్వీసులను యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోండి మరియు లాగిన్ అవ్వండి
- మీరు ప్రస్తుత యూజర్ అయితే, కేరింగ్లీ యువర్స్ యాప్‌లో మీ ధృవీకరించబడిన క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వండి.
- మీరు "పాలసీని నిర్వహించండి" ఆప్షన్ కింద మీ పాలసీ నంబర్, ప్రీమియం అమౌంట్, మొబైల్ నంబర్ మరియు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై అందుకున్న ఒటిపిని ఎంటర్ చేయడం ద్వారా మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని యాడ్ చేయవచ్చు
- మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి "క్లెయిమ్‌లు – నా క్లెయిమ్‌లు" ఆప్షన్‌ను ఉపయోగించండి
- కింద ఇవ్వబడిన వివరాలను అందించడం ద్వారా మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజిస్టర్ చేయడానికి ఉపయోగించండి, మోటార్ ఒటిఎస్ ఫీచర్:
- యాక్సిడెంట్ తేదీ, సమయం మరియు స్థలం
- వాహన తనిఖీ చిరునామా
- వాహనం రిజిస్టర్ చేసుకున్న రాష్ట్రం
- వాహన రిజిస్ట్రేషన్ నంబర్
- రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్.
- లింగం
- పుట్టిన తేదీ
- థర్డ్ పార్టీ ఏదైనా ప్రమేయం
- ప్రమాదం యొక్క సంక్షిప్త వివరణ
- మరమ్మతుల కోసం వర్క్‌షాప్‌కు పంపబడితే వాహనం ఉన్న ప్రదేశం
- సమీప బజాజ్ అలియంజ్ కార్యాలయం
- డ్రైవర్ పేరు
- బంధుత్వం
- డ్రైవర్ లైసెన్స్ నంబర్
- లైసెన్స్ గడువు తేదీ
- జారీ చేసే ఆర్‌టిఒ
- డ్రైవర్ మొబైల్ నంబర్
- సేవ్ పై క్లిక్ చేయండి.
- రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
- "రిజిస్టర్" పై క్లిక్ చేసిన తర్వాత, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై క్లెయిమ్ నంబర్‌తో ఒక మెసేజ్ అందుకుంటారు.
- మీరు క్లెయిమ్ ఫారం సబ్మిట్ చేసి, మీ నెఫ్ట్ వివరాలు, యాప్‌లోని సూచన చిత్రాల ప్రకారం వెహికల్ ఫోటోగ్రాఫ్‌లు, తప్పనిసరి విఐఎన్ నంబర్, ఓడోమీటర్ రీడింగ్, డ్యామేజ్ అయిన విడిభాగాల స్పష్టమైన ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోగ్రాఫ్‌లు మరియు ఆర్‌సిని అప్‌లోడ్ చేయాలి.
- సబ్మిట్ క్లిక్ చేయండి.
- క్లెయిమ్ ఫారం మరియు అన్ని డాక్యుమెంట్ల ఇమేజ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో బాధ్యత మొత్తాన్ని ఎస్ఎంఎస్ ద్వారా అందుకుంటారు, అందులోని లింక్ పై ఆఫర్ చేసిన పరిహారం మొత్తాన్ని అంగీకరిస్తున్నారు/ అంగీకరించడం లేదు అనేది తెలియజేయాలి.
- మీరు "అంగీకరిస్తున్నాను" పై క్లిక్ చేస్తే, మీ క్లెయిమ్ ప్రాసెస్ చేయబడుతుంది మరియు మీరు మీ బ్యాంక్ అకౌంట్లో క్లెయిమ్ మొత్తాన్ని జమ చేస్తారు.
- మీరు "అంగీకరించడం లేదు" పై క్లిక్ చేస్తే, మా మోటార్ క్లెయిమ్స్ బృందం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై మిమ్మల్ని సంప్రదిస్తుంది.
- కేరింగ్లీ యువర్స్ యాప్ ఉపయోగించి, మీరు "క్లెయిమ్ స్థితి" ఆప్షన్ కింద మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ క్లెయిమ్ స్థితిని కూడా చెక్ చేయవచ్చు.
టూ వీలర్ మోటార్ ఒటిఎస్ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఈ స్లైడ్‌షేర్ ప్రెజెంటేషన్‌ను చూడండి.
మీ టూ వీలర్ క్లెయిమ్‌లను త్వరగా మరియు సౌకర్యవంతంగా సెటిల్ చేసుకోవడానికి మా మోటార్ ఒటిఎస్ ఫీచర్ మీకు సరళీకృతమైన
ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను అందిస్తుంది అని మేము ఆశిస్తున్నాము.
రిప్లై ఇవ్వండి