2019 మరియు 2020 మధ్యకాలంలో, సుమారు రూ.1.29 లక్షల కోట్లకు పైగా ధనం సైబర్ నేరస్తుల చర్యలకు ఆవిరైపోయింది. ఈ దాడులు చాలా వరకు సరికొత్త సాంకేతికత కలిగిన బృందాల ద్వారా జరిగాయి మరియు ఇవి భద్రతా ఉల్లంఘనలు, బ్రాండ్ ఈక్విటీకి హాని, వ్యాపార కొనసాగింపు నష్టాలు మరియు భద్రతా వ్యవస్థలను పునర్నిర్మించడానికి అయ్యే ఖర్చులకు దారితీసాయి. సైబర్ దాడి తర్వాత కూడా సంస్థ ప్రయోజనాలను కాపాడేందుకు సైబర్ ఇన్సూరెన్స్ ఒక గొప్ప భద్రతా కవచంగా నిలిచింది. ఒక
సైబర్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క సమర్థతను పూర్తిగా గుర్తించడానికి భారతదేశంలో సైబర్ నేరాల ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
భారతదేశంలో టాప్ 5 సైబర్ నేరాలు ఏమిటి?
భారతదేశంలో అత్యంత ప్రబలంగా ఉన్న సైబర్ నేరాలను అర్థం చేసుకోవడం అనేది సంస్థ యొక్క వ్యవస్థలోని సంభావ్య దుర్బలత్వాలను గుర్తించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో, ఇది ఒక సంస్థకు అవసరమైన తగిన ఇన్సూరెన్స్ కవరేజీ పై అంతర్దృష్టిని అందిస్తుంది.
సైబర్‌క్రైమ్ అంటే ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, భారతదేశంలోని టాప్ 5 సైబర్ క్రైమ్‌ల గురించి ఇక్కడ వివరించబడింది:
1. హ్యాకింగ్
హ్యాకింగ్ అనేది ఒక వ్యవస్థలోని లోపాలను గుర్తించడానికి మరియు వ్యవస్థలో దాదాపుగా అన్ని పరిపాలనా నియంత్రణలను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. ఇది సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఏ సమాచారం ఎన్క్రిప్ట్ చేయబడుతుంది మరియు ఈ నిర్దిష్ట ప్రాసెస్‌ల ఫలితాల పై హ్యాకర్ నియంత్రణ పొందడానికి దారి తీస్తుంది. సైబర్ వాల్యూ చెయిన్‌లోని ప్రతి టచ్‌పాయింట్‌లో చాలా వ్యాపారాలు, కంప్యూటర్లు మరియు క్లౌడ్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగిస్తున్నందున హ్యాకింగ్ పరిధి పెరిగింది. ఈ రోజుల్లో ఒక సంస్థ యొక్క బ్యాక్‌ఎండ్ సిస్టమ్‌లు, వెబ్‌సైట్లు మరియు బ్యాంకు ఏటిఎంలను హ్యాకింగ్ చేయడం అనేది సర్వసాధారణంగా మారింది. సైబర్‌ఎటాక్‌లలో అత్యంత లోతుగా పాతుకుపోయిన రూపాల్లో ఒకటైన హ్యాకింగ్, అన్ని పరిశ్రమల్లోని వ్యాపారాలకి ప్రధాన రిస్క్‌గా మారింది.
2. ఎక్స్ఎస్ఎస్: క్రాస్-సైట్ స్క్రిప్టింగ్
ఇలాంటి దాడులు లక్షిత దాడిని నిర్వహించడానికి ప్రస్తుతం ఉనికిలో ఉన్న మరియు విశ్వసనీయమైన యుఆర్‌ఎల్ వెబ్‌సైట్‌ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాయి. దాడి చేసే వ్యక్తి థర్డ్-పార్టీ సైట్‌లో జావాస్క్రిప్ట్, హెచ్‌టిఎంఎల్ లేదా ఫ్లాష్ ఆధారిత కోడ్‌ను చొప్పించడానికి ప్రయత్నిస్తాడు. యూజర్లను ప్రత్యేక పేజీకి దారి మళ్లించడానికి లేదా తప్పుడు నెపంతో వారి సమాచారాన్ని కాజేయడానికి ఇది జరుగుతుంది. ఇలాంటి లక్ష్యాలు వ్యాపారంపై వ్యవస్థాపరంగా మరియు దీర్ఘకాలం పాటు ప్రభావాన్ని చూపుతాయి, ఎందుకనగా అది తన వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతుంది.
3. డినయల్-ఆఫ్-సర్వీస్ అటాక్
ఉదాహరణకు, మీరు ఒక పెద్ద సంస్థలో పని చేసే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని మరియు ఆఫీసులో ఐటి మౌలిక సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారు అని అనుకుందాం. మీ కర్తవ్యం, గరిష్ట అప్‌టైమ్‌ని నిర్ధారించడం మరియు సంస్థ యొక్క ఉత్పాదకత స్థాయిలకు దోహదపడటం. మీరు మీ ప్లాట్‌ఫారంలోని సిస్టమ్‌ల పనితీరును పర్యవేక్షిస్తున్నప్పుడు, మీరు అకస్మాత్తుగా కస్టమర్ సపోర్ట్ టీమ్ నుండి కొన్ని సిస్టమ్‌ల క్లౌడ్ డేటా వినియోగంలో పెరుగుదలను చూస్తారు. మొదట, వారు చాలా ప్రాసెస్‌లను అమలు చేస్తున్నారని మరియు అది కొద్దిసేపట్లో పరిష్కరించబడుతుంది మీరు భావిస్తారు. అప్పుడు, మీరు హెచ్‌ఆర్ టీమ్ నుండి కొన్ని సిస్టమ్‌లు సాధారణం కంటే ఎక్కువ క్లౌడ్ వనరులను వినియోగించడాన్ని గమనిస్తారు. అందుకు మీరు రియాక్ట్ అవ్వడానికి ముందుగానే, ఆపరేషన్స్ టీమ్ నుండి అన్ని సిస్టమ్‌లు మీ క్లౌడ్ రిసోర్సెస్‌ను ఎక్కువగా ఉపయోగిస్తాయి. కొన్ని నిమిషాల్లోనే, ఈ సిస్టమ్‌లు మీ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ యొక్క థ్రెషోల్డ్ స్థాయిలోకి ప్రవేశించాయి. మరియు ఇప్పుడు - మీరు సమస్యను పరిష్కరించడానికి సాధారణ బిజినెస్ ప్రాసెస్‌లను నిలిపివేయాలి. ఇది డిస్ట్రిబ్యూటెడ్ డినియెల్-ఆఫ్-సర్వీస్ ఎటాక్ అయ్యే సంభావ్యత ఎక్కువగా ఉంది, దీనినే డిడిఒఎస్ ఎటాక్ అని పేర్కొంటారు. మీ నెట్‌వర్క్‌లో అత్యంత బలహీనంగా ఉన్న సిస్టమ్‌లను కనుగొని, మీ షేర్డ్ రిసోర్సెస్‌ను అధికంగా ఉపయోగించుకోవడానికి మరియు మొత్తం నెట్‌వర్క్‌ను నిలిపివేయడానికి వాటిని గేట్‌వేగా ఉపయోగించడం ఇక్కడ దాడి చేసేవారి ఉద్దేశ్యం.
4. ఫిషింగ్ స్కామ్
సాధారణంగా, ప్రజలు మొదటి 5 సైబర్ నేరాలను గురించి అడిగినప్పుడు, వాటి జాబితాలో ఫిషింగ్ స్కామ్‌లు ఉంటాయి. మనలో చాలామంది మోసానికి గురికాక పోయినా ఒకటి, రెండుసార్లు వాటిని ఎదుర్కొని ఉంటారు. సంస్థలు మరియు ఇండివిడ్యువల్స్ పై దాడి చేసే ఈ పద్ధతితో ఎటాకర్, ఒక తెలిసిన వ్యక్తిగా లేదా అధికారిక సంస్థగా దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది క్రెడిట్ కార్డు వివరాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఐడెంటిటీ ప్రూఫ్‌లు మరియు ఇతర సున్నితమైన డాక్యుమెంట్ల వంటి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించేందుకు జరుగుతుంది. ఫిషింగ్ స్కామ్‌ని నిర్వహించే పద్ధతి చాలా వరకు విభిన్న రకాలుగా ఉండవచ్చు. చాలా వరకు ఫిషింగ్ స్కామ్‌లు ఇమెయిల్స్ ఉపయోగంతో జరుగుతాయి. అయితే, దాడి చేసేవారు ఫోన్ కాల్స్‌తో చేరుకోవడం కూడా సర్వసాధారణం.
5. స్పామింగ్
అనేక అధికార పరిధిలో స్పామింగ్ నేరపూరిత చర్యగా పరిగణించబడనప్పటికీ, ఇది గ్రహీతకు అసౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఒక కాంప్రమైజ్డ్ కార్పొరేట్ ఇమెయిల్ ఐడిని ఉపయోగిస్తుంటే, మీ ఇన్‌బాక్స్ అయాచిత సందేశాలతో నిండిపోవచ్చు, ఇది మీ పనిదినం నుండి మిమ్మల్ని మళ్లించి, మీ సంస్థ యొక్క వనరులను వినియోగిస్తుంది. మా ప్లాన్ల కింద అందించబడే
సైబర్ ఇన్సూరెన్స్ కవరేజ్ ని చూడండి. బజాజ్ అలియంజ్‌ను సందర్శించండి మరియు నేడు ఈ సైబర్ నేరాల నుండి ఆర్థికంగా మిమ్మల్ని మీరు రక్షించుకోండి!
తరచుగా అడిగే ప్రశ్నలు
- భారతదేశంలో సైబర్ నేరాలకు వ్యక్తులు మరియు వ్యాపారాలు రెండూ సమాన స్థాయిలో ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయా?
సంస్థలకి అత్యంత ధృడమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, దాడి చేసే వ్యక్తి ఒక వేళ విజయవంతం అయితే, ఆమెకి/అతనికి అవి చాలా ప్రయోజనకరంగా మారతాయి. అయితే, వ్యక్తులు అదే స్థాయి రిస్కును ఎదురుకోరు అనే భావన తప్పు.
- సైబర్‌ఎటాక్స్ నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
మీరు తీసుకోగల కొన్ని చర్యలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- సమర్థవంతమైన ఫైర్‌వాల్‌ను కలిగి ఉండండి.
- పైరేటెడ్ లేదా అవుట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించవద్దు.
- మీ క్రెడెన్షియల్స్‌ను ఎన్నడూ ఎవరితోనూ షేర్ చేయకండి.
- మీరు క్లౌడ్‌లో షేర్ చేసే వాటి పట్ల జాగ్రత్తలు వహించండి.
రిప్లై ఇవ్వండి