రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
1 Crore Health Insurance
17 మార్చి, 2021

1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్

ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్న సమయంలో మనం ఉన్నందున, మనకి మరియు మన కుటుంబానికి రక్షణ కలిపించడం ఈ సమయంలో అవసరం. ఈ కీలకమైన సమయంలో, హెల్త్ ఇన్సూరెన్స్ మన ఆర్థిక ఆరోగ్యాన్ని రక్షించే ఒక వ్యాక్సిన్‌గా ఉపయోగపడుతుంది. 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ముందు హెల్త్ ఇన్సూరెన్స్‌ను అనే పదం యొక్క అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అవయవ మార్పిడి, కీమోథెరపీ, డయాలిసిస్, ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ మొదలైనటువంటి మీ వైద్య చికిత్సలను కవర్ చేసే ఒక ఇన్సూరెన్స్.

1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటో మనకు ఇప్పుడు తెలుసు కాబట్టి, 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకుందాం. హెల్త్ ఇన్సూరెన్స్‌లో రూ. 1 లక్ష నుండి ప్రారంభమయ్యే అనేక కవరేజీలు ఉన్నాయి. ఈ ఆధునిక సమయాల్లో, వైద్య చికిత్సల ఖర్చు ఒక దశాబ్దం క్రితం కంటే ఎక్కువ ఖరీదైనదిగా మారింది. భారతదేశంలో, పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ చికిత్సల కంటే ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణను కోరుకుంటారు. అందువల్ల, ఒక 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక సాధారణ అవసరంగా మారింది, ఎందుకంటే ప్రజలు తమను తాము కవర్ చేసుకోవడమే కాకుండా వారి కుటుంబాలను కూడా కవర్ చేస్తారు. తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌లను ఎంచుకోకపోవడం ద్వారా వారి జీవితాలను మరియు వారి కుటుంబాల జీవితాలను అనేక మంది ప్రమాదంలో పడేస్తున్నారు. అదనంగా, తక్కువ ప్లాన్‌ను ఎంచుకోవడం మరియు క్యాన్సర్ లేదా డయాలిసిస్ వంటి తీవ్రమైన అనారోగ్యం లేదా వ్యాధిని తరువాత కనుగొనడం వలన భారీ ఆర్థిక ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. ఇలా ఎందుకంటే, ఒకసారి అనారోగ్యం నిర్ధారణ అయిన తర్వాత, 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడం మీకు ఏ విధంగానూ సహాయపడదు. ఉదాహరణకు, మీరు ఒక కారులో ప్రయాణిస్తున్నారు మరియు ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ప్రమాదం కారణంగా తక్షణ శస్త్రచికిత్స చేయించవలసిన తీవ్రమైన గాయాలు కలిగాయి. మీ సర్జరీ యొక్క మొత్తం ఖర్చు రూ. 30 లక్షల వరకు ఉంటుంది, ఇది మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేసే మొత్తాన్ని మించిపోతుంది. అటువంటి సందర్భంలో, అటువంటి ఊహించని పరిస్థితుల కోసం అన్ని ఖర్చులను కవర్ చేసే అవకాశం ఉన్న 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు సహాయం చేస్తుంది. సాధారణంగా, ప్రజలు తక్కువ ప్లాన్‌ను ఎంచుకుంటారు, తద్వారా వారు చెల్లించగలుగుతారు తక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఆ కొన్ని వేల రూపాయాల వ్యత్యాసంతో వారు, ఒక దుర్ఘటన జరిగినప్పుడు లక్షలలో చెల్లించవలసి ఉంటుంది అనే, వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క కొన్ని సాధారణ ప్రయోజనాల్లో అంబులెన్స్ కవర్, ఇన్‌పేషెంట్ హాస్పిటలైజేషన్, ఇన్సూర్ చేయబడిన మొత్తం యొక్క ఆటోమేటిక్ రీస్టోరేషన్, రెన్యూవబిలిటీ, నో క్లెయిమ్ బోనస్, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ మొదలైనవి ఉంటాయి. కొత్త 1 కోటి ఇన్సూరెన్స్ వ్యక్తిగత మరియు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కంటిశుక్లం, మైనర్ జాయింట్ రిపేర్లు, గాల్‌బ్లాడర్ తొలగింపు, టెండన్ మరియు మజిల్ రిపేర్లు మొదలైనటువంటి డేకేర్ విధానాలను కూడా కవర్ చేస్తాయి. ప్రస్తుత సమయాల్లో, ఒక 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ మీకు మాత్రమే కాకుండా మీ ప్రియమైన వారికి కూడా అన్ని రకాల ప్రధాన ఆరోగ్య ప్రమాదాలను కవర్ చేస్తుంది. భవిష్యత్తు అనిశ్చితమైనది మరియు జాగ్రత్త ఉండడం అనేది ఎల్లప్పుడూ చికిత్స కంటే మెరుగైనది!  

తరచుగా అడిగే ప్రశ్నలు:

  1. 1 కోటి ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రధానంగా ఎవరు కొనుగోలు చేయాలి? ఈ ప్లాన్‌ను వీరు కొనుగోలు చేయాలి:

    • కుటుంబంలో ఏదైనా తీవ్రమైన అనారోగ్యం ఉంటే
    • మీ వయస్సు 40 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే
    • మీ కుటుంబానికి మీరు బాధ్యత వహిస్తే మరియు సంపాదించే ఏకైక వ్యక్తి అయితే
  2. నేను మరణించే వయస్సు వరకు ప్రతి సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ కోసం నేను ప్రీమియం చెల్లించవలసి ఉంటుందా?

    • లేదు, మీకు 5/8/12/15 సంవత్సరాలు వంటి వివిధ చెల్లింపు వ్యవధులను ఎంచుకునే ఎంపిక ఉంది.
  3. ఎవరైనా 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

    • మీకు లేదా మీ కుటుంబ సభ్యునికి ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు ఊహించుకోండి, ఆ సమయంలో తగినంత నిధులను ఏర్పాటు చేయడం ఒక సవాలుగా మారుతుంది మరియు తగిన కవర్ తీసుకోకపోవడం అనే బాధ కూడా ఉంటుంది. పశ్చాత్తాపం కన్నా సురక్షితంగా ఉండటం మిన్న.
  4. నాకు ధూమపానం, పొగాకు తినడం వంటి అలవాట్లు ఉన్నాయి. నాకు ఇన్సూరెన్స్ అందుబాటులో ఉందా?

    • అవును, మీకు ఏ అలవాట్లు ఉన్నా, మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు.
  5. నా స్వంత డబ్బును తీసుకోకుండా ఇన్సూరెన్స్ పొందడానికి ఏదైనా మార్గం ఉందా?

    • అవును, నగదురహిత చెల్లింపు సదుపాయంతో క్లయింట్ ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేకుండా మరియు బిల్లు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానే సెటిల్ చేయబడుతుంది.
  6. రెన్యూవల్ తేదీ మిస్ అయితే ఏం జరుగుతుంది?

    • అదృష్టవశాత్తు, రెన్యూవల్ తేదీ మిస్ అయితే మీరు తదుపరి 30 రోజులపాటు దానిని రెన్యూ చేసుకోవచ్చు, ఇందులో మీరు మునుపటి పాలసీలో ఉన్న ప్రయోజనాలను పొందుతారు. అదనపు 30 రోజులలో క్లయింట్ ఏ క్లెయిమ్ కోసం కవర్ చేయబడరు అని దయచేసి గమనించండి.
  7. నేను 1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసినట్లయితే, ఒకేసారి నేను ఎంత క్లెయిమ్ చేయగలను అనేదానిపై ఏదైనా పరిమితి ఉందా?

    • లేదు, ఒకేసారి క్లెయిమ్ చేయగలిగిన మొత్తం పై ఎటువంటి పరిమితి లేదు. మీ ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం అయిపోయే వరకు మీరు ఎన్నిసార్లు అయినా క్లెయిమ్ చేయవచ్చు.
  8. ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన ఏదైనా ఆదాయపు పన్ను ప్రయోజనం ఉందా?

    • స్వీయ, జీవిత భాగస్వామి మరియు పిల్లల కోసం 25000 వరకు 80D క్రింద మినహాయింపు ఉంది. అదనంగా, తల్లిదండ్రుల వయస్సు 60 కంటే తక్కువగా ఉంటే 25000 మరియు 60 కంటే ఎక్కువగా ఉంటే 50,000 మినహాయింపు అందుబాటులో ఉంటుంది.
  9. ఆన్‌లైన్‌లో తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ మరియు భౌతికంగా తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ మధ్య ఏదైనా వ్యత్యాసం ఉందా?

    • ప్రాథమిక కవరేజ్ అనేది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఒకే విధంగా ఉంటుంది, కానీ సంప్రదాయ పద్ధతిలో తీసుకునే ఇన్సూరెన్స్‌తో పోలిస్తే ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ ‌లో విభిన్నమైన డీల్స్ ఉండవచ్చు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి