రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Immunity Booster Foods for kids
సెప్టెంబర్ 14, 2020

కరోనావైరస్ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి 3 సాధారణ ప్రభావవంతమైన వంటకాలు

కోవిడ్ – 19 లేదా కరోనావైరస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసింది మరియు ఇప్పటికీ అత్యధిక స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. మీరు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటిస్తూ, ఇంట్లోనే ఉండి, వ్యాధి బారిన పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. కరోనావైరస్ కేసులు పెరుగుతున్నందున, మీరు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సహాయపడే వంటకాలతో ప్రయోగాలు చేయడానికి క్వారంటైన్ సమయాన్ని ఉపయోగించవచ్చు. ‌‌ ఆరోగ్యకరమైన జీవనశైలి ను గడుపుతున్నప్పుడు, మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ఉత్తమ మార్గం, మీరు ఆరోగ్యకరమైన మరియు తాజా వంటకాలను తినడం ద్వారా కూడా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచుకోవచ్చు. మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే ఆహారాలను తినడం ద్వారా మీరు ఒంటరిగా మీ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా క్వారంటైన్‌ సమయంలో మీరు సిద్ధం చేయగల ఈ సులభమైన మరియు వేగవంతమైన రెసిపీలను తనిఖీ చేయండి:
  1. కుకుంబర్ మింట్ బటర్‌మిల్క్ – వేసవి కాలంలో ఒక చల్లని పానీయం ఉల్లాసాన్ని అందిస్తుంది, ఎందుకంటే ఇవి తాజా మరియు ఆరోగ్యకరమైన పదార్థాలతో చేయబడతాయి.
    • బటర్‌మిల్క్ మరియు కుకుంబర్ అనేవి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు.
    • మింట్‌లో విటమిన్ సి ఉంటుంది మరియు ఏదైనా ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి అవసరమైన తెల్ల రక్త కణాలను జనరేట్ చేయడానికి రోగ నిరోధక వ్యవస్థకు సహాయపడుతుంది.
కుకుంబర్ మింట్ బటర్‌మిల్క్‌ను తయారు చేయడానికి మీకు ఈ క్రింది పదార్థాలు అవసరం:
  • కీరదోసకాయ: 1
  • పెరుగు: ½ కప్
  • నీరు:1.5 కప్పులు
  • పుదీనా ఆకులు
  • కొత్తిమీర ఆకులు (ఆప్షనల్)
  • ఉప్పు
  • చక్కెర
  • అల్లం: 1 అంగుళం (ఆప్షనల్)
  • వేయించిన జీలకర్ర పొడి (ఆప్షనల్)
రెసిపీ:
  • దోసకాయ మరియు పుదీనా ఆకులను బ్లెండర్‌లో వేసి మెత్తని పేస్ట్‌గా తయారు చేయండి. మీరు ఆప్షనల్ పదార్థాలను ఉపయోగిస్తున్నట్లయితే, మీరు దోసకాయ మరియు పుదీనా ఆకులను గ్రైండ్ చేసేటప్పుడు వాటిని జోడించవచ్చు.
  • ఈ మెత్తని మిశ్రమంలో పెరుగు మరియు ఉప్పు వేసి బాగా కలపండి.
  • దీనికి ఇప్పుడు నీటిని కలపండి, అంతే! మీ మజ్జిగ తయారైంది.
  • మీరు దీనిని కొత్తిమీర ఆకులు మరియు వేయించిన జీలకర్ర పొడితో గార్నిష్ చేయవచ్చు.
  1. అల్లం టీ: గొంతు నొప్పిని తగ్గించడానికి మరియు మీ శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి నిమ్మకాయ మరియు తేనే కలిసిన అల్లం టీ ఒక మంచి మార్గం. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మరియు ఇమ్యూన్ సిస్టమ్‌ను ధృడంగా చేయడానికి మీ శరీరానికి సహాయపడుతుంది.
    • వాపును తగ్గించడానికి అల్లం సహాయపడుతుంది.
    • నిమ్మ లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
అల్లం టీ తయారు చేయడానికి మీకు ఈ క్రింది పదార్థాలు అవసరం:
  • అల్లం: 1 అంగుళం
  • నిమ్మ రసం: 1 టేబుల్ స్పూన్
  • తేనె: 1 టేబుల్ స్పూన్
  • నీరు: 1.5 కప్పులు
రెసిపీ:
  • ఒక సాస్ ప్యాన్ లో నీటిని మరగ పెట్టండి.
  • ఈ వేడి నీటిలో అల్లం తురుమును జోడించండి.
  • అల్లం 2-3 నిమిషాలపాటు నీటిలో ఉండనివ్వండి.
  • మరొక గిన్నెలో తేనే మరియు నిమ్మ రసాన్ని కలపండి.
  • అల్లం ఉన్న నీటిని ఈ గిన్నెలోకి వడ కట్టండి.
  • ఈ మిశ్రమాన్ని కలపండి మరియు ఇమ్యూనిటీని పెంచే అల్లం టీ ని తాగండి.
  1. పాలకూర వెల్లుల్లి సూప్: పాలకూర మరియు వెల్లుల్లికి రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాలు ఉంటాయి. అంతేకాకుండా, స్పినాచ్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది మరియు అనేక యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. రక్తపోటును తగ్గించడానికి మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది.
పాలకూర వెల్లులి సూప్ చేయడానికి మీకు ఈ క్రింది పదార్థాలు అవసరం:
  • పాలకూర: 2 కప్పులు తరిగినవి
  • ఉల్లిపాయ: ½ కప్ తరిగినవి
  • వెల్లుల్లి: 3 – 4 బద్దలు
  • శనగ పిండి: 1 టేబుల్ స్పూన్
  • నీరు: 2 కప్పులు
  • మిరియాలు
  • ఉప్పు
  • వెన్న
  • వేయించిన జీలకర్ర పొడి
రెసిపీ:
  • ఒక పాన్ లో, బాగా నలగగొట్టిన వెల్లుల్లి బద్దలను వెన్నలో దోరగా వేయించండి.
  • తరిగిన ఉల్లిపాయ ముక్కలను కలిపి వేయించండి.
  • తరిగిన పాలకూర ఆకులను కడిగి వాటికి జోడించండి.
  • దీనికి, మీ రుచి ప్రకారం మిరియాలు మరియు ఉప్పు జోడించండి.
  • అన్నింటినీ సరిగ్గా కలపండి మరియు శనగ పిండిని జోడించండి.
  • పాన్ లోని అన్ని పదార్థాలను ఉడికించడానికి నీటిని జోడించండి.
  • చివరిలో జీలకర్ర పొడిని జోడించండి.
  • స్టవ్ ఆఫ్ చేయండి మరియు వండిన మిశ్రమం కొంచెం చల్లారపెట్టండి.
  • వండిన మిశ్రమాన్ని మృదువుగా చేయడానికి ఒక బ్లెండర్‌ను ఉపయోగించండి.
  • తాగడానికి ముందు ఈ సూప్‌ను ఒకసారి వేడి చేయండి.
ఇది మహమ్మారి సమయం అని మేము అర్థం చేసుకున్నాము మరియు ఒత్తిడి మరియు భయాన్ని నివారించడానికి బాగా సిద్ధం అవ్వడం మరియు నివారణ చర్యలు తీసుకోవడం అనేది ఉత్తమ మార్గం. ఈ సులభమైన వంటకాలతో, మీ ఆందోళనలలో కొన్నింటిని మర్చిపోతారని మరియు రోగ నిరోధక వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలో మీ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొంటారు అని మేము ఆశిస్తున్నాము. ఈ క్లిష్టమైన సమయంలో మీరు కవర్ చేయబడతారని మరియు రక్షించబడతారని మేము కోరుకుంటున్నాము, అందుకే మా అనేక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్తో మా సంరక్షణను అందిస్తున్నాము, ఇది కోవిడ్ – 19 (కరోనావైరస్ వ్యాధి) నుండి మిమ్మల్ని కవర్ చేస్తుంది. మీరు మరియు మీ ప్రియమైనవారు సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంటారని మరియు అత్యవసర సమయంలో కోవిడ్ - 19 తో పోరాడటానికి ధృడంగా ఉంటారు అని మేము ఆశిస్తున్నాము.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి