భారతదేశంలో వేసవి కాలం మార్చి నెలలో మొదలై జూన్ వరకు కొనసాగుతుంది. భారతదేశంలో వేసవి అత్యంత కఠినమైన కాలం, ఎందుకనగా ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంటుంది మరియు దానికి మించి కూడా పెరుగుతుంది. ఈ భరించలేని వేడి వల్ల వేసవిలో చాలా అనారోగ్యాలు వస్తాయి - వడ దెబ్బ, తలనొప్పి, ఎపిస్టాక్సిస్ (ముక్కు నుండి రక్తస్రావం), డీహైడ్రేషన్, దోమల వల్ల వచ్చే వ్యాధులు మొదలైనవి. వాస్తవానికి దీనికి ఎలాంటి ఉపశమనం లేదు, కానీ, మనం చేయగలిగింది వేడి మరియు దాని పర్యవసానాలు మనల్ని ప్రభావితం చేయకుండా ఉండటానికి నివారణ చర్యలు తీసుకోవడం. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు ముందుకు సాగడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి:
- దుస్తులు –
లేత రంగులో ఉంది వదులుగా ఉండే దుస్తులను ధరించండి, ముదురు రంగులో ఉన్న సింథటిక్ దుస్తులను ధరించడం నివారించండి. బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించండి మరియు ఎల్లప్పుడూ సన్ స్క్రీన్ ట్యూబ్‌ను అందుబాటులో ఉంచుకోండి.
- తేలికైన ఆహారం తీసుకోండి –
మీ ఆహారంలో పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోండి, దోసకాయలు మరియు పుచ్చకాయ లాంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. పచ్చని ఆకు కూరలు, పసుపు మరియు నారింజ రంగు పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు మరియు గింజలు మరియు బాదం, గుమ్మడి విత్తనాలు మరియు మెంతులు వంటివి పుష్కలంగా తినడం వల్ల మీ శరీరం చల్లగా ఉంటుంది మరియు వడ గాలులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. మసాలా ఆహారం నుండి దూరంగా ఉండండి.
- నీరు తాగుతూ ఉండండి –
ఎక్కువ మోతాదులో నీరు తాగండి, దాహం వేయకముందే నీరు తాగండి. రోజంతా పుష్కలంగా ద్రవాలు తీసుకోవడం వల్ల మీ శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉంటాయి. మజ్జిగ మరియు లేత కొబ్బరి కూడా ఆరోగ్యకరమైన ఎంపికలు. చక్కెర మరియు కేలరీలు అధికంగా ఉండే కోలాలు మరియు ప్యాక్ చేసిన జ్యూస్‌లను నివారించండి.
- వ్యాయామం –
వేసవిలో కసరత్తు చేయడం అంత సులభం కాదు కానీ ఇది మీ సత్తువను పెంచుతుంది. మండే ఎండలో కసరత్తు చేయవద్దు, ఉదయం, సాయంత్రం లేదా ఇంటి లోపల వ్యాయామం చేయండి.
- ఇంట్లోనే ఉండండి –
అవసరమైతే తప్ప, ఉదయం 10:30 – సాయంత్రం 5:30 మధ్యన బయటకు వెళ్లకుండా ఉండండి. ఇంట్లోనే ఉండండి లేదా మీ ఆఫీసు లోపలే ఉండండి, తరచుగా బయటకు వెళ్లడం మరియు ఎసి నుండి నాన్-ఎసి వాతావరణంలోకి మారడం మీ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పగటి పూట ఎక్కువగా ఉండే వేసవి కాలంలో విరబూసే అందమైన పువ్వులు మరియు సాయంత్రం వేళ చల్లని గాలులతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి, ఇలాంటి పరిస్థితి నుండి మనం తప్పించుకోలేము కాబట్టి, మనం మన ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా వహించాలి, వేడి మనల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. ఇక్కడ జాబితా చేయబడిన చర్యలు నివారణకు సంబంధించినవి మరియు నివారణలో ఒక భాగం మీరు ఇన్సూరెన్స్ పొందడం, ప్రతికూల పరిస్థితిలో ఇది మీకు ఉపయోగపడుతుంది. మనం అనారోగ్యానికి గురైనప్పుడు, మన
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే హాస్పిటల్ బిల్లుల ఆర్థిక భారం నుండి మనల్ని రక్షిస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీల గురించి మరింత తెలుసుకోవడానికి, మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.