రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Benefits of Porting Health Insurance
మే 31, 2021

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనేది అధిక ప్రీమియంలు వసూలు చేసి పేలవమైన సేవలను అందించే నాసిరకమైన ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద చిక్కుకుపోయిన వ్యక్తులకు ఒక ఆశీర్వాదంగా ఉండవచ్చు. మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఒక కొత్త ఇన్సూరర్‌కు పోర్ట్ చేయడం అనేది అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకనగా, మీరు మీకు నచ్చిన ఇన్సూరర్‌ను మరియు మెరుగైన ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు, పాలసీ ప్రస్తుత ప్రయోజనాలను కూడా పొందవచ్చు.‌ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా మొదట 2011 లో ప్రవేశపెట్టబడింది (IRDAI). దాని క్రింద, క్లెయిమ్-సెటిల్‌మెంట్ సమస్యలు, అధిక ప్రీమియంలు, తక్కువ రీయింబర్స్‌మెంట్ లేదా సరిగాలేని సర్వీస్ కారణంగా తమ ప్రస్తుత ఇన్సూరెన్స్ పాలసీ పట్ల ఎవరైనా వ్యక్తి అసంతృప్తిగా ఉన్నట్లయితే, వారు తమ పాలసీని ఏ ప్రయోజనాలను కోల్పోకుండా ఒక కొత్త ఇన్సూరర్‌కు మార్చుకోవడానికి అర్హులు.

మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పోర్టింగ్ వల్ల పొందే 7 ప్రధాన ప్రయోజనాలు

మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మీరు సంతృప్తి చెందకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని ప్రధాన ప్రయోజనాలను చూద్దాం:

1.     మునుపటి పాలసీ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం జరుగదు

మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పోర్ట్ చేయడం వల్ల మీరు పొందే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ ప్లాన్ నుండి ఎలాంటి ప్రయోజనాలను కోల్పోరు. మీ ప్రస్తుత పాలసీ అందించే అన్ని ప్రయోజనాలు మీరు ఎంచుకున్న కొత్త పాలసీ ప్లాన్‌లో అమలులో ఉంటాయి.

2.     మెరుగైన ఇన్సూరెన్స్ మొత్తం విలువ

మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఒక కొత్త ఇన్సూరర్‌కు పోర్ట్ చేసినప్పుడు, మీ మునుపటి పాలసీకి సంబంధించిన బోనస్ కొత్త ఇన్సూరెన్స్ మొత్తానికి జోడించబడుతుంది. ఇది మీ పాలసీ ప్రస్తుత విలువను పెంచుతుంది మరియు మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా, నో క్లెయిమ్ బోనస్ కూడా మీ కొత్త ఇన్సూరెన్స్ మొత్తం విలువలో చేర్చబడుతుంది.

3.     తగ్గించబడిన పాలసీ ప్రీమియంలు

ఇటీవలి సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ కంపెనీల సంఖ్య విస్తృతంగా పెరిగింది. ఈ కంపెనీలు ఎల్లప్పుడూ వారి ప్రస్తుత కస్టమర్ల బేస్‌ను పెంచుకోవడానికి అనేక డిస్కౌంట్లు మరియు ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయి. అందువల్ల, మీరు ఒక కొత్త ఇన్సూరర్‌కు మారినప్పుడు, పాత పాలసీకి చెందిన ప్రయోజనాలను చాలా తక్కువ ప్రీమియం రేటుతో పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్సూరెన్స్ ఖర్చును తగ్గించడంలో మరియు డబ్బును ఆదా చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

4.     పాలసీని కస్టమైజ్ చేసుకోగల సామర్థ్యం

పోర్టింగ్ యొక్క అతి ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి మీ అవసరాలకు తగినట్లుగా మీరు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీ పాలసీ వాటిని మాత్రమే కవర్ చేయాలని మీరు కోరుకోవచ్చు లేదా మీరు మీ పాలసీలో నామినీలను మార్చాలనుకోవచ్చు. మీరు పాత ఇన్సూరర్ నుండి కొత్త ఇన్సూరర్‌కు మారేటప్పుడు పాలసీని మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

5.     మరింత పారదర్శక వ్యవస్థను పొందే అవకాశం

ఇన్సూరెన్స్ కంపెనీలు ఎల్లప్పుడూ వాటి పాలసీలలో పారదర్శకత లేకపోవడం మరియు రహస్య నిబంధనల వలన విమర్శలు ఎదుర్కొంటాయి. మీరు ఒక కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి మారుతున్నందున, దానిలో ఎలాంటి రహస్య నిబంధనలు, షరతులు లేకుండా మరియు మరింత పారదర్శక పద్ధతులు మరియు పనితీరును కలిగి ఒక సంస్థను పరిశోధించి ఎంచుకోవచ్చు.

6.     ఉత్తమ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను పొందండి

మీ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం ఒక కొత్త ఇన్సూరెన్స్ సంస్థను ఎంచుకునేటప్పుడు, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి ని తప్పకుండా చెక్ చేయండి. చాలా మంది వారి ప్రస్తుత ఇన్సూరర్ నుండి ఎదుర్కొనే ఫిర్యాదులు నిదానమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌‌కు సంబంధించినవే ఉంటాయి. పాలసీని కొనుగోలు చేసే ముందు మీరు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మీరు మీ కొత్త ఇన్సూరర్‌ వద్ద మెరుగైన సేవలను ఆనందించవచ్చు.

7.     మెరుగైన సర్వీస్ ప్రొవైడర్‌ను పొందండి

ప్రస్తుత ఇన్సూరర్ పేలవమైన సేవల కారణంగా మీరు ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేస్తున్నట్లయితే, దానికి మీరు సంతోషించవచ్చు. పోర్టింగ్‌ సదుపాయంతో మీరు ఒక మెరుగైన ఇన్సూరర్‌ను ఎంచుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు. అధిక నాణ్యత గల సేవలను పొందడానికి ఎక్కువ రివార్డులు పొందిన కంపెనీ కోసం చూడండి, ఆపై మీకు నచ్చిన దానిని ఎంచుకోండి.

పోర్టబిలిటీ అభ్యర్థనను తిరస్కరించడానికి సంభావ్యమైన కారణాలు

అవును, మీరు సరిగ్గానే చదివారు! హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, మీ పోర్టబిలిటీ అభ్యర్థన తిరస్కరించబడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా జరగడానికి గల కారణాలు ఇలా ఉన్నాయి:
  1. పాలసీ రెన్యూవల్ వ్యవధిలో విరామం ఉన్నప్పుడు.
  2. మీరు సరికాని లేదా తగని సమాచారాన్ని అందించినప్పుడు.
  3. డాక్యుమెంట్ల సమర్పణలో ఆలస్యం జరిగితే.
  4. మీరు సమర్పించిన డాక్యుమెంట్లకు ఎలాంటి ప్రాప్యత లేకపోతే.
  5. క్లెయిమ్ చరిత్రలో ఎవైనా లోపాలు ఉంటే.

తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఎక్యూలు)

  1. కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు పోర్ట్ చేసినప్పుడు ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందా?
లేదు, పోర్టబిలిటీ ప్రాసెస్ కోసం మీకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వర్తించదు.
  1. పోర్టింగ్ ప్రాసెస్ కోసం ఎంత సమయం పడుతుంది?
సాధారణంగా, అప్లికేషన్ సమర్పించిన 15 రోజుల్లోపు కొత్త ఇన్సూరర్ ప్రతిస్పందించాలి. మొత్తానికి, ఈ ప్రాసెస్ పూర్తవడానికి దాదాపు 30 రోజులు పట్టవచ్చు. ముగింపు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి, మీరు మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ సంస్థ వద్ద ఇబ్బందిగా భావిస్తే, వారి సేవలతో సంతృప్తి చెందకపోతే, మీ పాలసీని పోర్ట్ చేసుకోవడం మరియు కొత్త ఇన్సూరెన్స్ ప్రదాత సేవలను ఆస్వాదించడం ఉత్తమం. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ఒక కొనుగోలుని పూర్తి చేయడానికి ముందు దాని ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించిన మరిన్ని వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/పాలసీ షరతులు మరియు నిబంధలను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి