ఉద్యోగానికి వెళ్తూ మార్గం మధ్యలో తక్షణ బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోవడమే నేటి సరికొత్త బ్రేక్‌ఫాస్ట్ ట్రెండ్. అలాగే, ఇంట్లో చేసిన ఆరోగ్యకరమైన భోజనం కూడా మీకు నచ్చిన ఫాస్ట్-ఫుడ్ సెంటర్ల నుండి ఈజీగా రీప్లేస్ చేయబడుతుంది. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా ఇలాంటి ఆహారాలను ఇష్టపడుతున్నారు, తద్వారా వారి పోషణ అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం మీకు సంతృప్తిని ఇచ్చే రుచి కోసమే కావచ్చు కానీ, ఈ జంక్ ఫుడ్‌లో అతి తక్కువ పోషణ విలువలు ఉంటాయి. మన బిజీ షెడ్యూల్లో తరచుగా జంక్ ఫుడ్‌ను ఆదరిస్తాము. అయితే, రెగ్యులర్‌గా దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి తీరని నష్టం జరుగుతుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే వీటిని ఫ్యాటెనింగ్ ఫుడ్స్ అంటాము, ఇవి శరీరంలో కొవ్వును ఏర్పరచడమే కాకుండా, ఇతర తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. జంక్ ఫుడ్ యొక్క కొన్ని హానికరమైన ప్రభావాలను చూద్దాం, ఇది మీ శరీరం మరియు మెదడు పై ప్రభావం చూపుతుంది:
ఊబకాయం
జంక్ ఫుడ్ యొక్క అత్యంత సాధారణ మరియు గుర్తించదగిన ప్రభావాల్లో ఊబకాయం పెరుగుదల కూడా ఒకటి. జంక్ ఫుడ్‌లో ముఖ్యంగా చక్కెర, కేలరీలు మరియు కొవ్వులు ఉంటాయి, ఇవి ప్రధానంగా బరువు పెరుగుదలకు కారణమవుతాయి. అంతేకాకుండా, మధుమేహం, కీళ్ల నొప్పులు మరియు వివిధ గుండె జబ్బులు లాంటి అనేక సమస్యలకు ఊబకాయం ప్రారంభ దశ అని చెప్పుకోవచ్చు.
అభ్యాసం మరియు జ్ఞాపకశక్తి సమస్యలు
అధిక మోతాదులో చక్కెరలు మరియు కొవ్వులను తీసుకోవడం అనేది, అభ్యాసం మరియు జ్ఞాపకశక్తిని ఏర్పరచే మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ దృగ్విషయాన్ని ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల్లో గమనించవచ్చు, ముఖ్యంగా వారిలో జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ద్వారా దీనికి మరింత మద్దతు లభించింది, ఇక్కడ జంక్ ఫుడ్ వినియోగం అనేది పేలవమైన అభిజ్ఞాన పరీక్షా ఫలితాలకు దారితీసిందని కొనుగొనడం జరిగింది. మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగం ఆకస్మిక ఫలితాలను ప్రదర్శిస్తుంది, ఇది మీ జ్ఞాపకశక్తికి మరియు గుర్తింపు కోసం బాధ్యత వహిస్తుంది.
ఆకలి లేకపోవడం మరియు జీర్ణశక్తి కోల్పోవడం
జంక్ ఫుడ్ యొక్క చెడు ప్రభావాల్లో ఒకటి అతిగా తినడం. తమ రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గుల కారణంగా, ఒకరు అవసరమైన దానికంటే ఎక్కువగా తింటారు. ఇది మెదడుకు సాధారణ అవసరాల కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తుంది. అంతేకాకుండా, అలాంటి ఆహారాన్ని జీర్ణం చేయడంలో కూడా సమస్యలు తలెత్తుతాయి, ఇవి జంక్ ఫుడ్ వినియోగం యొక్క హానికరమైన ప్రభావాలతో జోడించబడతాయి.
మానసిక ప్రభావం డిప్రెషన్‌కు దారితీస్తుంది
జంక్ ఫుడ్స్ యొక్క అదనపు వినియోగం, మీ మెదడుకు సంబంధించిన రసాయన కూర్పును మారుస్తుంది. ఈ మార్పు మీ శరీరాన్ని అలాంటి జంక్ ఫుడ్ పై మరింతగా ఆధారపడేలా చేస్తుంది మరియు వాటినే ఎక్కువగా తీసుకునేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఇది దాదాపుగా ఒక వ్యసనం మాదిరిగా పనిచేస్తుంది, ప్రజలు బానిసలుగా మారిపోతారు మరియు తద్వారా డిప్రెషన్‍కు లోనవుతారు. ఇది శరీరంలో హార్మోనల్ అసమతుల్యతను కలిగిస్తుంది, అలాగే, ఆ జంక్ ఫుడ్‌ను మరింతగా తీసుకోవడానికి దారి తీస్తుంది.
తగినంత వృద్ధి లేకపోవడం మరియు అభివృద్ధి లోపం
ఆరోగ్యకరమైన శరీరానికి, దాని పెరుగుదల మరియు అభివృద్ధి కోసం కావలసినన్ని పోషకాలు అవసరం. జంక్ ఫుడ్ యొక్క చెడు ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తాయి, వాటిలో ప్రాథమిక పోషకాహారం కూడా ఉండదు. ఈ అనారోగ్యకరమైన అలవాట్లు, సరిపోని పోషకాహార స్థాయిలతో పాటు మెదడు మరియు మీ శరీరంలోని ఇతర భాగాలకు ఆటంకం కలిగిస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్ మీ శరీరంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయి కనుక ఆహార నిపుణులు వాటిని చాలావరకు తీసుకోకూడదని సూచిస్తారు. కాబట్టి మీరు ఆ చిప్‌లను తీసుకునే ముందు లేదా మీ ఫిజ్ డ్రింక్ కోసం కోరికలను తీర్చుకోవడానికి ముందు, మీ శరీరాన్ని మాత్రమే కాకుండా మీ మనస్సును కూడా ప్రభావితం చేసే జంక్ ఫుడ్ యొక్క అన్ని హానికరమైన ప్రభావాలను గురించి ఆలోచించండి. మీరు ఇంటి వద్ద భోజనం సిద్ధం చేయడానికి మరియు వంట చేయడానికి తక్కువ సమయం కలిగి ఉన్నప్పటికీ, మీ ఆరోగ్యం ఆసక్తిలో ఆ అదనపు అడుగు వేయండి మరియు పెట్టుబడి పెట్టండి
మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఏవైనా ఊహించని అత్యవసర పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు సురక్షితం చేసుకోవడానికి. కావున, ఆరోగ్యమే మహా భాగ్యం అని ప్రతిఒక్కరు గుర్తించాలి.
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.
రిప్లై ఇవ్వండి