ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలలో ఊబకాయం ఒకటిగా మారింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, ప్రాసెస్డ్ ఆహార ప్రోడక్టులపై ఆధారపడటం వంటివి ఊబకాయానికి దోహదపడే కొన్ని కారణాలు. 2015 లో ICMR-INDIAB చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఉదర ఊబకాయం హృదయ సంబంధ వ్యాధులకు దోహదపడే ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. మగవారితో పోలిస్తే మహిళల్లో ఊబకాయం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం నివేదించింది.
బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏమిటి?
ఊబకాయం యొక్క మరింత తీవ్రమైన రూపం కూడా ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తుంది మరియు శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం కావచ్చు. ఈ విధానాన్ని బేరియాట్రిక్ సర్జరీ అని పిలుస్తారు, ఇక్కడ డైటింగ్, సాధారణ మరియు కఠినమైన వ్యాయామం వంటి ప్రామాణిక బరువు-తగ్గించే చర్యలు విఫలమైన తర్వాత మాత్రమే డాక్టర్లు దీనిని సిఫార్సు చేస్తారు.
బేరియాట్రిక్ సర్జరీ ఎవరు చేయించుకోవాలి?
ప్రస్తుతం, మెడికల్ ప్రొఫెషనల్స్ మూడు దశాబ్దాల నాటి ప్రమాణాలను అనుసరిస్తారు, ఇక్కడ ఒక వ్యక్తి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ) 40 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. లేదా, 35 లేదా అంతకంటే ఎక్కువ బిఎంఐ కలిగి ఉండాలి కానీ టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బు లేదా నిద్రలేమి వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ఉన్నాయి. అయితే, పైన పేర్కొన్న ప్రాణాంతక వ్యాధులతో ఉన్న వ్యక్తులకు బిఎంఐ ప్రమాణాలను 30కి తగ్గించడం అనేది సహాయకరంగా ఉంటుందని చాలా మంది డాక్టర్ల అభిప్రాయం. చాలా మంది రోగులు ఆరోగ్యకరమైన
ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు మంచి ఆహార పద్ధతులను ఎంచుకోవడానికి బదులుగా బరువు తగ్గడానికి ఒక ఊతకర్రగా బేరియాట్రిక్ సర్జరీని ఆశ్రయిస్తారు మరియు వారు శస్త్రచికిత్స తర్వాత వెంటనే బరువు పెరుగుతారు.
బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడానికి నిర్దిష్టమైన ప్రక్రియ ఉందా?
అవును, బేరియాట్రిక్ సర్జరీకి రోగి మీ సాధారణ జీవితంలో భాగంగా వ్యాయామంతో ఒక కఠినమైన డైట్ ప్లాన్‌ను అనుసరించవలసి ఉంటుంది - ఇవన్నీ మళ్లీ బరువు పెరగకుండా ఉండేందుకు సహాయపడతాయి. అయితే, ఇది అన్ని ఇతర చర్యలు విఫలమైన తీవ్ర సందర్భాలకు సురక్షితమైన ప్రత్యామ్నాయం.
మెడికల్ ఇన్సూరెన్స్ బేరియాట్రిక్ సర్జరీ కోసం కవరేజ్ అందిస్తుందా?
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రకం, అంటే,
కుటుంబం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు లేదా పాలసీలో ఏమి కవర్ చేయబడతాయో, చేయబడవో వ్యక్తిగత కవర్లు నిర్ణయిస్తాయి. సాధారణంగా, చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలు అటువంటి బేరియాట్రిక్ చికిత్స కోసం క్లెయిమ్‌లను అంగీకరిస్తాయి, అయితే, మీరు మీ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిని తనిఖీ చేయాలి. బేరియాట్రిక్ చికిత్స ఖరీదైనది, మరియు దాని ఖర్చులు రూ. 2.5 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఉంటాయి. ఇది సర్జరీ రకం, చికిత్స తీవ్రత, సర్జన్స్ ఫీజు, ఎంచుకున్న వైద్య సదుపాయం, ఉపయోగించిన సాధనాలు, కన్సల్టెంట్స్ ఆన్-బోర్డ్, అనస్థీషియా మరియు ఇతర ఫాలో-అప్ విధానాలు వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. అటువంటి అధిక చికిత్స ఖర్చును పరిష్కరించడానికి, మీ ఇన్సూరెన్స్ సంస్థతో
ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఉత్తమం, ఇది ఆర్థిక సంబంధం అంశాల గురించి ఆలోచించకుండా మీ రికవరీ పై దృష్టి పెట్టే విధంగా సహకరిస్తుంది. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
బేరియాట్రిక్ చికిత్స కోసం కవరేజీకి ఏవైనా మినహాయింపులు ఉన్నాయా?
ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లాగానే, చికిత్స కోసం అందించబడే కవరేజ్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క నిబంధనలు మరియు షరతులకు లోబడి పరిమితం చేయబడింది. 30 రోజుల ప్రారంభ వెయిటింగ్ పీరియడ్ సమయంలో బేరియాట్రిక్ చికిత్స కోసం మీ
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో గల బేరియాట్రిక్ చికిత్స కోసం చేసే ఏవైనా క్లెయిమ్‌లు ఇన్సూరర్ ద్వారా తిరస్కరించబడతాయి. అలాగే, ముందు నుండి ఉన్న ఏవైనా పరిస్థితుల కోసం క్లెయిమ్‌లు అటువంటి చికిత్స క్రింద కవర్ చేయబడవు. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఊబకాయాన్ని ఎదుర్కోవటానికి బేరియాట్రిక్ చికిత్స అనేది చివరి దశ ప్రయత్నం అయితే, అటువంటి అనారోగ్యం కారణంగా ప్రాణాపాయాన్ని నివారించడానికి ఇది ఒక సమర్థవంతమైన మార్గం. అందువల్ల తిరిగి ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక ఉపయోగకరమైన మార్గం. ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ఒక కొనుగోలుని పూర్తి చేయడానికి ముందు దాని ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించిన మరిన్ని వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/పాలసీ షరతులు మరియు నిబంధలను జాగ్రత్తగా చదవండి.
రిప్లై ఇవ్వండి