రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Health Insurance for Elderly Citizens
నవంబర్ 2, 2020

వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమో అనేదానికి 7 ప్రధాన కారణాలు

అది ఒక యువకుడైనా సరే లేదా వృద్ధుడైనా సరే, మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో తమను తాము సురక్షితం చేసుకోవడం అందరికీ ముఖ్యం. అయితే, వయస్సు పెరిగే కొద్దీ మీరు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకనగా, వయస్సు పైబడిన వారు తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. అందువల్ల, వీలైనంత త్వరగా మీరు ఒక హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు సురక్షితం చేసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. వయస్సు పైబడిన పెద్దలు వీలైనంత త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ ‌ను ఎందుకు కొనుగోలు చేయాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది:
  1. వృద్ధుల కోసం హెల్త్ ప్లాన్లు ఖరీదైనవి కావచ్చు
ప్రీమియంల విషయానికి వస్తే వయస్సు చాలా ముఖ్యమైన అంశం. ఒక యువకుడి హెల్త్ ప్లాన్‌తో పోలిస్తే వృద్ధుల హెల్త్ ప్లాన్ కోసం ఎక్కువ ఖర్చవుతుంది. అందువల్ల, ప్రీమియం అమౌంటుపై ఆదా చేయడానికి మీరు వీలైనంత త్వరగా అంటే యుక్త వయస్సులోనే ఒక హెల్త్ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సిందిగా సలహా ఇవ్వడమైనది.  
  1. తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొవడం
కొన్ని అనారోగ్యాలకు చికిత్స అనేది మీ చేయిదాటిపోవచ్చు, దానికి మీ పూర్తి సేవింగ్స్ కూడా ఖర్చుచేయాల్సి రావచ్చు. చాలామంది వృద్ధులు తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతుంటారు, వారికి అదనపు వైద్య సహాయం మరియు ఖరీదైన చికిత్సలు అవసరం అవుతాయి. అయితే, మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేయకుండా అలాంటి వ్యాధులకు చికిత్స పొందడానికి, మీరు క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్‌‌ను కొనుగోలు చేయాలి. అయితే, ఈ ప్లాన్లు ముందు నుండి ఉన్న వ్యాధులకు లోబడి ఉంటాయి. అందువల్ల, ఇలాంటి ప్లాన్‌ను కొనుగోలు చేసే ముందు నిబంధనలు మరియు షరతులను క్షుణ్ణంగా పరిశీలించడం తప్పనిసరి.  
  1. నానాటికీ పెరుగుతున్న వ్యాధులు
పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎదుర్కొనే వ్యాధులతో తాము పోరాడాల్సిన అవసరం లేదని భావిస్తారు. అయితే, పట్టణాల్లో నివసించే ప్రజలు కాలుష్యం మరియు ఆధునిక జీవనశైలి కారణంగా తరచూ అనారోగ్యానికి గురవుతారు. అయితే, దీని అర్థం గ్రామీణ లేదా సెమీ-అర్బన్ ప్రాంతాలకు చెందిన ప్రజలు వీటిని తప్పించుకోగలరని కాదు. మునుపెన్నడూ లేనంతగా నేడు రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్ల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ‌‌‌ను కొనుగోలు చేయడం అనేది కుటుంబ ఆర్థిక స్థితిని కాపాడుతుంది, ముఖ్యంగా అందులో వృద్ధులు ఏదైనా వైద్య సమస్యలతో బాధపడినప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది.  
  1. సమగ్రవంతమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు
కొన్ని కంపెనీలు/ సంస్థలు తమ ఉద్యోగులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తాయి. మరికొన్ని సంస్థలు అందించే గ్రూప్ ప్లాన్లు ఉద్యోగుల తల్లిదండ్రులను చేర్చడానికి కూడా ఏర్పాట్లను కలిగి ఉండవచ్చు. అయితే, ఈ నిర్దిష్ట కవరేజ్ అనేది సరిపోదు. అందుకని, ప్రజలు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లను ఎంచుకుంటారు, కానీ వారు కస్టమైజ్ చేయబడిన వ్యక్తిగత కవరేజీని అందుకోనప్పుడు నిరాశకు గురవుతారు. అందువల్ల, మీరు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక కవరేజీని ఎంచుకోవాలని సలహా ఇవ్వబడుతుంది. ఒకవేళ, మీరు ఒక సమగ్ర పాలసీని కొనుగోలు చేస్తే, అది వృద్ధులు ఎదుర్కొనే వివిధ వైద్య సమస్యలను కవర్ చేస్తుంది. అధిక కవరేజ్ అంటే అధిక ప్రీమియం అని అర్ధం మరియు అది విలువైనదే ఎందుకంటే, వయస్సు పైబడిన పెద్దల చికిత్స కోసం వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి.  
  1. వైద్య ద్రవ్యోల్బణంలో పెరుగుదల
సంవత్సరాలుగా ప్రజలను బాధించే వ్యాధుల రకాలు మరియు వాటి సంఖ్య పెరుగుతూ వస్తుంది, అయితే, దీనితోపాటు వైద్య పరిశ్రమలో కూడా అభివృద్ధిని చూసాము, నేడు దాదాపు ప్రతి వ్యాధికి నివారణ అందుబాటులో ఉంది. అయితే, వైద్య ద్రవ్యోల్బణం క్రమంగా పెరగడంతో ఈ చికిత్సలు మీ అన్ని పొదుపులను కూడా హరించివేస్తాయి. అందువల్ల, వైద్య ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి మరియు ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భద్రతను కలిగి ఉండడానికి సీనియర్ సిటిజన్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం అవసరం. ఈ రోజుల్లో వృద్ధుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీనిని ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేయవచ్చు. మీరు గతంలో మాదిరిగా సుదీర్ఘమైన ఫారంను నింపాల్సిన అవసరం లేదు. అదనంగా, మీరు ఒక బ్రోకర్/ ఏజెంట్/ మధ్య-వర్తి ప్రమేయం లేకుండా దీనిని పూర్తి చేయవచ్చు. పాలసీని కొనుగోలు చేయడానికి ముందు మీరు మీ అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు మరియు పూర్తి ప్రాసెస్‌ను చాలా సులభమైన పద్ధతిలో పూర్తి చేయవచ్చు. మీ పాలసీకి సంబంధించి మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే, మీరు ఎప్పుడైనా ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమిటంటే, పాలసీని కొనుగోలుకు సంబంధించిన పన్ను ప్రయోజనం. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80D కింద, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను ప్రయోజనాలను అందుకుంటారు. కాబట్టి, ఈ రోజే దానిని సద్వినియోగం చేసుకోండి!

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి