రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Maternity Health Insurance
నవంబర్ 7, 2024

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్: మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు

ఒక కొత్త జీవితాన్ని ఆస్వాదించడం విషయానికి వస్తే, అది ముఖ్యంగా మహిళల విషయంలో మాతృత్వం అనేది ఒక గొప్ప అనుభవం. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం ఏకకాలంలో శారీరక వ్యవస్థ మరియు హార్మోన్ల పరంగా అనేక మార్పులకు లోనవుతుంది. ఈ మార్పులు జీవితకాల ప్రభావాన్ని కలిగి ఉంటాయి, అందువల్ల మొదటి నుండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం మాత్రం లేకపోలేదు. అయితే, ఇవి ఊహించని పరిస్థితులు అయినందున, వాటి పట్ల నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలి. మెటర్నిటీ కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు మరియు నవజాత శిశువుకు సంబంధించిన వైద్య ఖర్చులను నిర్వహించడానికి రూపొందించబడింది. ఈ సమయంలో డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బదులుగా అవసరమైన వైద్య సంరక్షణపై దృష్టి పెట్టాలి.

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

మెటర్నిటీ కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ గర్భధారణ మరియు ప్రసవం సంబంధించిన వైద్య ఖర్చులను కవర్ చేస్తూ పాలసీహోల్డర్‌కు సహాయంగా ఉంటుంది. ప్రసవ ఖర్చులు మాత్రమే కాకుండా, వైద్య సహాయం అవసరమైన ఇతర సమస్యలు కూడా వీటి ద్వారా కవర్ చేయబడతాయి:‌ ప్రసూతి ఆరోగ్య బీమా ప్లాన్లు.

మెటర్నిటీ హెల్త్ కవర్‌ను కలిగి ఉండటంలోని ప్రయోజనం ఏమిటి?

నేటి వైద్య ద్రవ్యోల్బణం రేటు రీత్యా చూసుకుంటే, కష్టపడి సంపాదించిన పొదుపు నుండి ప్రసవ ఖర్చుతో సహా ఏ చికిత్సకు అయినా ఖర్చులను చెల్లించడం ఒక సవాలుగా మారింది. సాధారణంగా ఎక్కడైనా ఒక నార్మల్ డెలివరీ లేదా సి-సెక్షన్ విధానం కోసం వరుసగా రూ.60,000 నుండి రూ.2,00,000 వరకు ఖర్చవుతుంది. మెటర్నిటీ కవర్‌తో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడంతో ఈ భారీ ప్రసవ ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది మరియు తల్లీబిడ్డకు తగినంత రక్షణ లభిస్తుంది.

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ తల్లి మరియు పిల్లల ఆరోగ్యాన్ని ఎలా సురక్షితం చేస్తుంది?

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు దిగువ పేర్కొన్న ప్రయోజనాలను అందిస్తాయి –
  • ప్రీ అలాగే పోస్ట్-నేటల్ కేర్

తల్లి మరియు బిడ్డ ఇద్దరూ సానుకూల పురోగతిని సాధిస్తున్నట్లు నిర్ధారించుకోవడానికి, ప్రెగ్నెంట్ తల్లికి తరచుగా డాక్టర్ సందర్శనలు మరియు హెల్త్ చెక్-అప్స్ అవసరం. కొన్ని సందర్భాల్లో గర్భిణీ స్త్రీలలో పోషకాహారం సమతుల్యత కోసం కొన్ని ఔషదాలు తీసుకోవాలని సలహా ఇవ్వబడుతుంది. మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో ఈ హాస్పిటల్ సందర్శనలు అలాగే అవసరమైన వైద్య ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీ కవరేజీలో చేర్చబడ్డాయి. సాధారణంగా, ఎంచుకున్న కవరేజీని బట్టి డెలివరీకి 30 రోజులు ముందు మరియు 30-60 రోజుల తర్వాత సంబంధించిన ఖర్చులు కవర్ చేయబడతాయి.
  • డెలివరీ కోసం కవరేజ్

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో ప్రసవ ఖర్చులు అనేవి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కవర్ చేయబడతాయి, అది నార్మల్ డెలివరీ లేదా సిజేరియన్ విధానం అయినా సరే. ఎందుకనగా, ఈ సందర్భంలో వైద్య నిపుణులతో పాటు ప్రత్యేక సాధనాలు, పరికరాలను కలిగి ఉండాలి మరియు ఖర్చులు అధికంగా ఉంటాయి.
  • నవజాత శిశువు కోసం ఇన్సూరెన్స్ కవర్

మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు నవజాత శిశువులు ఎదుర్కొనే ఏవైనా పుట్టుకతో వచ్చే వ్యాధులను కవర్ చేస్తాయి. ఏదైనా ప్రత్యేక సంరక్షణ అవసరమైతే ఈ ఖర్చులు పుట్టినప్పటి నుండి 90 రోజుల వరకు కవర్ చేయబడతాయి. ఇది పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ఎంచుకున్న కవర్‌పై కూడా ఆధారపడి ఉంటుంది.
  • టీకా కవరేజ్

చివరగా, కొన్ని మెటర్నిటీ ఇన్సూరెన్స్ పాలసీలు టీకాకు సంబంధించిన ఖర్చులను కూడా కవర్ చేస్తాయి. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనలపై ఆధారపడి పోలియో, తట్టు, ధనుర్వాతం, కోరింత దగ్గు, హెపటైటిస్, డిఫ్తీరియా మరియు మరిన్ని వాటికి ఇమ్యూనైజేషన్ ఖర్చు అనేది పుట్టిన తర్వాత 1 సంవత్సరం వరకు కవర్ చేయబడుతుంది. ఇవి మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు తమ కవరేజీలో కలిగి ఉన్న కొన్ని ప్రయోజనాలు. అయితే, ఒక పాలసీని కొనుగోలు చేసేటప్పుడు వెయిటింగ్ పీరియడ్‌ను గుర్తుంచుకోండి, అది 2 నుండి 4 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. అయితే, కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. కానీ, ప్రీమియం కొంత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ మెటర్నిటీ హెల్త్ ప్లాన్లను స్టాండ్‌అలోన్ పాలసీలుగా లేదా దీనికి యాడ్-ఆన్‌లుగా కొనుగోలు చేయవచ్చు:‌‌ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. కాబట్టి, గర్భిణీ స్త్రీ మరియు నవజాత శిశువు ఆరోగ్యాన్ని సురక్షితం చేసుకోవడానికి ముందుగానే ఒకదాన్ని ఎంచుకోవడం మంచిది. ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ఒక కొనుగోలుని పూర్తి చేయడానికి ముందు దాని ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించిన మరిన్ని వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/పాలసీ షరతులు మరియు నిబంధలను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి