మీరు మీ పిల్లలకు నేర్పించాల్సిన అనేక మంచి అలవాట్లలో ఆరోగ్యకరమైన పరిశుభ్రత అలవాటు కూడా ఒకటి. పిల్లలు చురుకుగా ఉంటారు మరియు మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు, అందుకే చిన్నప్పటి నుండే వారికి మంచి అలవాట్లను నేర్పడం అనేది దీర్ఘకాలంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు,
కరోనా వైరస్ వ్యాప్తి మీరు ఇంట్లో ఉన్నందున మీ పిల్లలతో మీ సమయాన్ని గడుపుతున్నారు, మీరు మీ పిల్లలకు కొన్ని వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లను నేర్పించవచ్చు, ప్రస్తుత పరిస్థితులలో ఇది అవసరం కూడా.
మీరు మీ పిల్లలకు నేర్పించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు ఏమిటి?
- నీరు మరియు సబ్బుతో చేతులు కడుక్కోవడాన్ని మీ పిల్లలకు నేర్పించండి. పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లకపోయినా, వారు తమ చుట్టూ ఉన్న ప్రదేశంలో ఏదైనా మరియు ప్రతి దానిని పట్టుకుంటారు. మీరు మీ ఇంటిని తరచుగా శుభ్రం చేస్తున్నప్పటికీ, టేబుల్ టాప్‌లు మరియు షో-పీస్‌ల పై దుమ్ము పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల, మీ పిల్లలను ముఖ్యంగా తినడానికి ముందు, వాష్‌రూమ్‌ను ఉపయోగించిన తర్వాత మరియు ఇంట్లో పెంపుడు జంతువులను (ఏవైనా ఉంటే) చూసుకున్న తర్వాత వారి చేతులను శుభ్రంగా కడగటం మంచిది.
- తినడానికి ముందు కూరగాయలను మరియు పండ్లను కడగటాన్ని మీ పిల్లలకు నేర్పించండి. పండ్లు మరియు కూరగాయలు సాధారణంగా వాటి ఉపరితలం పై ఇ.కోలి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. అలాగే, ఇంటిని చేరుకునే లోపు వారు అనేక ఆటలు ఆడతారు, పలువురి చేతుల్ని తాకుతారు. అందువల్ల, వారు చేతులను శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే వాటిని వినియోగించాలి.
- దగ్గినప్పుడు మరియు తుమ్మినప్పుడు నోటిని టిష్యూతో లేదా రుమాలుతో కప్పుకోవాలని మీ పిల్లలకు నేర్పించాలి. కరోనావైరస్ లాంటి అంటు వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి. అలాగే మీరు, మీ పిల్లలకు మాస్క్‌ను ఎలా ఉపయోగించాలి మరియు దానిని ఎలా ధరించాలి అనే విధానాన్ని నేర్పించాలి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్‌ను ధరించడం తప్పనిసరి కానప్పటికీ, ఈ మంచి అలవాటును వారికి నేర్పించడం అనేది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
- సామాజిక దూరం మరియు దాని ప్రాముఖ్యత గురించి వారికి అవగాహన కల్పించండి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉంటునప్పటికీ, ప్రతిదీ నెమ్మదిగా మరియు స్థిరంగా సాధారణ స్థితికి చేరే వరకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని కొనసాగించడాన్ని ఒక విలువైన పాఠంగా భావించాలి.
- మీ పిల్లలు అలవాటు చేసుకోవాల్సిన కొన్ని ఇతర ప్రాథమిక పరిశుభ్రత విధానాలు ఈ కింద అందించబడ్డాయి:
- రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం
- క్రమం తప్పకుండా స్నానం చేయడం
- క్రమం తప్పకుండా తలస్నానం చేయడం
- ప్రతిరోజూ శుభ్రమైన మరియు చక్కని బట్టలు ధరించడం
- వారి గదులను శుభ్రంగా ఉంచుకోవడం
- ఉపయోగించిన ప్రతి సారి టాయిలెట్‌ను ఫ్లష్ చేయడం
- గోళ్లు పెరిగిన ప్రతిసారి వాటిని కత్తిరించడం
- గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం
మీ పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లను ఎలా నేర్పించాలి?
మీరు మీ పిల్లలకు ‘మిమ్మల్ని మీరు శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోండి’ అనే మంచి ఉపన్యాసాన్ని బోధించినప్పుడు వారు మీ మాటలు వినకపోవచ్చు. మంచి అలవాట్లను మీ పిల్లలకు బోధించడానికి గల ఉత్తమ మార్గం ఏంటంటే ముందుగా ఆ అలవాటును మీరే అలవరచుకోవడం. పెద్దలు చేసే పనిని పిల్లలు త్వరగా అనుకరిస్తారు. కాబట్టి, మీరు బోధించడానికి ముందు ఆచరించాలి అని గుర్తుంచుకోండి. మీ పిల్లలకు పరిశుభ్రత నేర్పించడానికి గల మరొక ఆసక్తికరమైన మార్గం ఏమిటంటే, ఆటలు ఆడుతున్న సమయంలో వారికి పజిల్స్ పరిష్కరించడం మరియు కొన్ని సరదా సైన్స్ ప్రయోగాలు చేయించడం ద్వారా నేర్పించవచ్చు. వివిధ కార్టూన్‌లు మరియు యానిమేటెడ్ ప్రోగ్రామ్‌లు మీ పిల్లలకు ఈ పరిశుభ్రమైన అలవాట్లను నేర్పడంలో మీకు సహాయపడతాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు, వాటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి మీరు ఒక సరదా మరియు సమాచారవంతమైన పప్పెట్ షో నిర్వహించవచ్చు. ఈ చిట్కాలు మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము. మీరు వారి ఆరోగ్యానికి సంరక్షణను నిర్ధారిస్తూనే, ఒక
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా వారి భద్రతను కూడా నిర్ధారించుకోవాలని సిఫార్సు చేస్తున్నాము, ఇది ఒక ఊహించని వైద్య అత్యవసర పరిస్థితిలో గొప్పగా సహాయ పడుతుంది.
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.
రిప్లై ఇవ్వండి