రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Gas Cylinder Safety Tips
జూన్ 13, 2019

గ్యాస్ సిలిండర్లను ఉపయోగించేటప్పుడు ఇంట్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు

గ్యాస్ సిలిండర్, భారతదేశంలో ఇంట్లో ఆహారం వండడానికి అత్యంత సాధారణంగా ఉపయోగించే ఒక ప్రధాన ఇంధన వనరు. గ్యాస్ సిలిండర్లు ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్)తో నింపబడతాయి, ఇది సహజంగా ఎక్కువగా మండుతుంది. కావున, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్లను ఉపయోగించేటప్పుడు మీరు కొన్ని భద్రతా చర్యలను తప్పక పాటించాలి.
  • ఎల్లప్పుడూ, ISI గుర్తు ఉన్న ఎల్‌పిజి సిలిండర్లను మాత్రమే ఉపయోగించండి.
  • మీరు గ్యాస్ సిలిండర్లను నిజమైన డీలర్ల నుండి కొనుగోలు చేసినట్లు నిర్ధారించుకోండి. వాటిని బ్లాక్‌ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయవద్దు.
  • గ్యాస్ సిలిండర్‌ డెలివరీ సమయంలో సిలిండర్ సరిగ్గా సీల్ చేయబడి ఉందని మరియు దాని సేఫ్టీ క్యాప్ ట్యాంపర్ చేయబడలేదని నిర్ధారించుకోండి, ఎందుకనగా అది ఎల్‌పిజి లీకేజీకి కారణం కావచ్చు మరియు భయంకరమైన పేలుడుకు దారితీయవచ్చు.
  • ఒకసారి సిలిండర్ అందుకున్న తర్వాత దానిని నిలువు స్థితిలో, సమాంతర ఉపరితలంపై మరియు సరైన వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచండి.
  • గ్యాస్ సిలిండర్ సమీపంలో ఎలాంటి పేలుడుకు కారణమయ్యే మండే పదార్థాలు మరియు ఇంధనాలు (కిరోసిన్ లాంటివి) లేవని నిర్ధారించుకోండి.
  • గ్యాస్ సిలిండర్‌ను జాగ్రత్తగా మరియు సరిగ్గా అమర్చడానికి, దానిని కనెక్ట్ చేయడానికి సర్వీస్ మ్యాన్ లేదా డెలివరీ మ్యాన్ నుండి సహాయం పొందండి.
  • ఏదైనా ప్రమాదవశాత్తు లీకేజీని నివారించడానికి ఎల్లప్పుడూ, ఉపయోగించిన తర్వాత గ్యాస్ సిలిండర్ పై నాబ్‌ను ఆఫ్ చేయండి.
  • ఉపయోగించిన తర్వాత అలాగే, మీకు లీక్ అయినట్లు వాసన వస్తే అన్ని స్టవ్ నాబ్స్‌ ఆఫ్ చేయండి.
  • గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీక్ కారణంగా ఏవైనా ప్రమాదాలను నివారించడానికి, మీ వంటగదిలో మరియు మీరు మీ గ్యాస్ సిలిండర్‌ను ఉంచే గదిలో గ్యాస్ డిటెక్టర్లను ఇన్‌స్టాల్ చేయండి.
గ్యాస్ సిలిండర్ల కారణంగా వంట త్వరగా పూర్తయిప్పటికీ, మీరు వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలి, ఎందుకంటే వాటిలోని ఎల్‌పిజి ఎక్కువగా మండుతుంది మరియు గ్యాస్ సిలిండర్ పేలుడు మీ ఇంటిని మరియు/లేదా ఇంట్లోని వస్తువులను నాశనం చేస్తుంది, అంతేకాకుండా మీకు, మీ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలను కూడా కలిగించవచ్చు. కావున, గ్యాస్ సిలిండర్‌తో వ్యవహరించేటప్పుడు మీరు ఈ భద్రతా చర్యలను తప్పక పాటించాలని సిఫార్సు చేస్తున్నాము. అలాగే, ఏదైనా ప్రమాదం జరిగితే, అది మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయవచ్చు కనుక మీ ఆర్థిక స్థితిని కూడా సురక్షితం చేసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. అందువల్ల, మీరు ఏదైనా దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు మీ ఆర్థిక స్థితిని కాపాడుకోవడానికి హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని అలాగే తగిన మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి