రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
What Is Super Top Up Health Insurance Policy
5 మార్చి, 2021

సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

రోజులు గడిచే కొద్దీ కొత్త వ్యాధులు పుట్టుకొస్తునే ఉన్నాయి మరియు ద్రవ్యోల్బణం కూడా వేగంగా పెరుగుతోంది. మన చుట్టూ నెలకొన్న వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వైద్య అత్యవసర పరిస్థితుల్లో మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు సరిపోకపోవచ్చు. దీనికి గల ప్రధాన కారణం, హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ రూ. 3 నుండి 5 లక్షల వరకు ఉంటుంది. మీ పూర్తి వైద్య ఖర్చులను చెల్లించడానికి మీకు అదనపు కవరేజ్ అవసరం కావచ్చు.

సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ‌తో ఒక బేస్ పాలసీ రూపంలో ఉన్న ఒక అదనపు పాలసీ, మీ వైద్య ఖర్చులు బేస్ పాలసీలోని ఇన్సూరెన్స్ మొత్తాన్ని మించినట్లయితే, మీరు సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఇన్సూర్ చేయబడిన మొత్తం వరకు అదనపు మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు.

ఇది ఇతర టాప్ అప్ ప్లాన్ల నుండి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది?

  • మినహాయింపు: Under normal top up health insurance, the deductible is applicable on per claim basis. That is if every claim amount doesn’t exceed the deductible amount, you will not get the claim for that bill. But what is super top up health insurance; is making deductible applicable on total claims made during a policy year.
  • క్లెయిమ్‌ల సంఖ్య: ఇతర టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు పాలసీ సంవత్సరంలో ఒక క్లెయిమ్‌ను మాత్రమే అంగీకరిస్తాయి. కాబట్టి, తదుపరిగా క్లెయిమ్‌లు చేయాల్సిన అవసరం ఏర్పడితే, అప్పుడు ఎలా? ఇటువంటి పరిస్థితులలో సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయపడుతుంది.

సాధారణ టాప్ అప్ పాలసీని కొనుగోలు చేయాలా లేక సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలా?

మీరు తరచూ వైద్య ఖర్చులు మరియు క్లెయిమ్‌లు చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు అయితే, మీకు ఒక సాధారణ టాప్ అప్ సరిపోవచ్చు. మీరు ఏదైనా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారైతే లేదా 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారైతే, ఒక సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం మంచిది.

ఎవరైనా సూపర్ టాప్ అప్‌ను ఎందుకు ఎంచుకోవాలి మరియు మీ బేస్ పాలసీలో ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎందుకు పెంచకూడదు?

ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ మొత్తం యొక్క అర్థం తెలిసినట్లయితే, అప్పుడు అది పెరిగే కొద్దీ వార్షిక ప్రీమియం కూడా పెరుగుతుందని మీకు తెలిసే ఉంటుంది. మరోవైపు, మీరు మీ అవసరానికి అనుగుణంగా సూపర్ టాప్ అప్ పాలసీని ఎంచుకుంటే, పెరిగిన ఇన్సూరెన్స్ మొత్తానికి చెల్లించాల్సిన ప్రీమియం తులనాత్మకంగా తక్కువగా ఉంటుంది.

మీరు మీ కోసం తగిన సూపర్ టాప్ అప్ పాలసీని ఎలా ఎంచుకోవచ్చు?

  • మినహాయింపు

మొట్టమొదట, మీరు మినహాయించదగిన మొత్తంపై ఒక నిర్ణయానికి రావాలి. మినహాయించదగిన మొత్తాన్ని బేస్ పాలసీలో పేర్కొన్న ఇన్సూరెన్స్ మొత్తానికి సమానంగా లేదా కనీసం దానికి దగ్గరగా ఉంచడం మంచిది. సూపర్ టాప్ అప్ ప్లాన్ కింద ఇన్సూర్ చేయబడిన మొత్తంలో మీరు చెల్లించాల్సిన ఏదైనా మొత్తం వరకు మీరు సురక్షితంగా ఉంటారు. ఉదాహరణ: ఒకవేళ మీరు రూ.50000 సహ-చెల్లింపు నిబంధనతో రూ.3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను బేస్ పాలసీగా కలిగి ఉంటే మరియు మీరు రూ.3 లక్షల మినహాయింపుతో ఒక సూపర్ టాప్ అప్ పాలసీని కలిగి ఉంటే. ఇప్పుడు మీరు రూ. 1.5 లక్ష వరకు వైద్య ఖర్చు చేసినట్లయితే. మీరు రూ. 50000 చెల్లింపు చేయాలి మరియు ఇన్సూరెన్స్ కంపెనీ రూ. 1 లక్ష చెల్లిస్తుంది. తర్వాత, అదే పాలసీ సంవత్సరంలో మీరు రూ. 4 లక్షల వరకు మరొక వైద్య ఖర్చు చేసినట్లయితే. ఇప్పుడు మీరు బేస్ పాలసీ కింద రూ. 1.5 లక్ష మరియు సూపర్ టాప్ అప్ పాలసీ కింద రూ. 2.5 లక్షలను క్లెయిమ్ చేయవచ్చు.  
  • నికర కవరేజ్
ఒకరు టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినప్పుడల్లా, తప్పనిసరిగా 'నికర కవరేజ్' కోసం చూడాలి. అనగా దీని అర్థం ఇన్సూరెన్స్ మొత్తం నుండి పాలసీహోల్డర్ చెల్లించాల్సిన మినహాయింపు మొత్తాన్ని తీసివేయాలి.   ఉదాహరణ: రియా రూ. 8 లక్షల ఇన్సూరెన్స్ మొత్తం మరియు రూ. 3 లక్షల మినహాయింపుతో సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉంది. అంటే ఆమె నికర కవరేజీ రూ. 5 లక్షలు.  
  • క్లెయిమ్ మొత్తాన్ని నిర్ణయించడంలో పరిగణనలోకి తీసుకోబడే పారామితులు
వివిధ పారామితుల ఆధారంగా క్లెయిమ్ మొత్తం నిర్ణయించబడుతుంది. క్లెయిమ్ మొత్తాన్ని నిర్ణయించడంలో ప్రీ-డయాగ్నోసిస్ చెకప్‌లు, అంబులెన్స్ లేదా ఇతర రవాణా ఖర్చులు, గదుల కేటగిరీ, నెట్‌వర్క్ లేదా నాన్-నెట్‌వర్క్ హాస్పిటల్స్ మరియు వివిధ ఇతర అంశాలు పరిగణలోకి తీసుకోబడతాయి. ఇప్పుడు రెండు పాలసీలకు పారామితులు ఒకే విధంగా ఉంటే, ఎలాంటి రీక్యాలిక్యులేషన్ లేకుండా క్లెయిమ్స్ చేయవచ్చు కనుక ఇది మెరుగైనది.   ఉదాహరణ: బేస్ పాలసీ కింద షరతుల ప్రకారం, క్లెయిమ్ అమౌంట్ అనేది రూ. 4 లక్షల నుండి రూ. 3 లక్షల ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని చేరితే, మీరు సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద అదనపు మొత్తాన్ని క్లెయిమ్ చేయాలి. అయితే, దాని షరతుల ప్రకారం సూపర్ టాప్ అప్ పాలసీ కింద లెక్కించబడిన అర్హతగల క్లెయిమ్ మొత్తం రూ. 3.5 లక్షలు మరియు మీ సూపర్ టాప్ అప్ రూ. 3 లక్షల మినహాయింపును కలిగి ఉంది, అప్పుడు మీకు అదనంగా రూ. 50000 మాత్రమే చెల్లించబడుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు:

    1. నేను సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే నాకు పన్ను ప్రయోజనం లభిస్తుందా? అవును, మీరు చెల్లించిన సూపర్ టాప్ అప్ ప్రీమియం కోసం సెక్షన్ 80D కింద ఆదాయపు పన్ను మినహాయింపు పొందుతారు.
    2. ఈ పాలసీ తీసుకోవడానికి ముందు మీకు ఏవైనా వైద్య పరీక్షలు అవసరమా?

ఇది ప్రొవైడర్ పై ఆధారపడి ఉన్నప్పటికీ, ముందు నుండి ఉన్న వ్యాధులు కోసం లేదా మీరు నిర్దిష్ట వయస్సును మించితే, అంటే, 45 లేదా 50 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ పాలసీలలో కొన్ని పరీక్షలు అవసరం కావచ్చు.

3. ఒక సూపర్ టాప్-అప్ పాలసీ అనేది ఇండివిడ్యువల్ పాలసీగా మాత్రమే అందించబడుతుందా లేదా దీనిలో ఫ్యామిలీ ఫ్లోటర్ వేరియంట్ కూడా ఉంటుందా?

It has both the variants, individual policy and ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ. మీరు మీ అవసరాలను బట్టి ఎంచుకోవాలి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి