రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Who Cannot Be Covered Under A Family Floater Policy?
5 మార్చి, 2021

ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కింద కవర్ చేయబడని వ్యక్తులు ఎవరు?

ఏ వయస్సులో ఉన్న వ్యక్తికైనా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం మరియు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో ప్రీమియం రేట్లు పెరగడంతో అన్ని ఆదాయ వర్గాల ప్రజలకు ఇది అందుబాటులో ఉండకపోవచ్చు. అంతేకాకుండా, భారతదేశం లాంటి దేశాల్లో పిల్లలు వారి చదువు ముగిసిన తర్వాత కూడా తల్లిదండ్రులపై ఆధారపడతారు మరియు తల్లిదండ్రులు వారి జీవితంలోని తరువాతి దశల్లో వారి ఆర్థిక అవసరాల కోసం వారి పిల్లలపై ఆధారపడతారు. ఇటువంటి పరిస్థితులలో ఫ్యామిలీ ఫ్లోటర్లు మరియు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ వంటి రక్షణను అందిస్తాయి.

ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అంటే ఏమిటి?

ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా పాలసీహోల్డర్ కుటుంబాన్ని కూడా కవర్ చేస్తుంది. ఈ ప్రయోజనం ఒకే ప్రీమియం చెల్లింపు పై అందుబాటులో ఉంటుంది మరియు ఇన్సూరెన్స్ మొత్తం అనేది పాలసీహోల్డర్ కుటుంబానికి పంచబడుతుంది. ఇది వివిధ కుటుంబ సభ్యుల బహుళ హాస్పిటలైజేషన్‌ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. ఉదాహరణ: మిస్టర్ అగ్ని స్వీయ, జీవిత భాగస్వామి మరియు ఇద్దరు పిల్లలను కవర్ చేసే రూ. 10 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకున్నారు. ఇప్పుడు, పాలసీ సంవత్సరంలో మిస్టర్ అగ్నికి డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయింది మరియు అతనికి రూ. 3.5 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులు అయ్యాయి. అతను క్లెయిమ్ ఫైల్ చేసాడు మరియు అది అంగీకరించబడింది. ఇప్పుడు మిగిలిన సంవత్సరానికి రూ. 6.5 లక్షలను 4 కుటుంబ సభ్యులలో ఎవరైనా వినియోగించుకోవచ్చు. అయితే, సంవత్సరం చివరిలో మిస్టర్ అగ్ని కుమార్తె మలేరియాతో బాధపడినప్పుడు, ఆమెకు రూ. 1.5 లక్షలు ఖర్చు కాగా, అదే పాలసీ కింద క్లెయిమ్ చేయడం జరిగింది. కొన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు బిన్నంగా రూపొందించబడ్డాయి, అవి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ప్రత్యేక కవర్‌ను కలిగి ఉంటాయి మరియు మొత్తానికి అందరికి వర్తించే హామీ ఇవ్వబడిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని కలిగి ఉంటాయి.

ఫ్లోటర్ పాలసీని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సరసమైనది: అనేక పాలసీలను తీసుకోవడం వల్ల ఒక వ్యక్తికి స్వంత డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు లో మీ ప్రియమైన వారందరు సభ్యులుగా ఉంటారు మరియు మిగతా వాటితో పోలిస్తే ఇది తక్కువ ఖర్చుతో లభిస్తుంది. అవాంతరాలు-లేని: ఇది మీ కుటుంబానికి సంబంధించి అనేక పాలసీలను నిర్వహించాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. పన్ను ప్రయోజనాలు: మీరు చెల్లించిన ప్రీమియం, మీ పూర్తి ఆదాయంపై చేసే ఆదాయపు పన్ను లెక్కింపు నుండి మినహాయింపు కోసం అనుమతించబడుతుంది.

ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కింద కవర్ చేయబడని వ్యక్తులు ఎవరు?

As the floater policies are available for families, it is important to know how they define family and who cannot be covered under a ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ. సాధారణంగా, ప్రతి పాలసీ కుటుంబం కోసం దాని స్వంత నిర్వచనాన్ని కలిగి ఉంటుంది, చేరికలు మరియు మినహాయింపులకు సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. ఒక కుటుంబంలో జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు మరియు అత్తమామలు ఉండవచ్చు. అయితే, కొన్ని పాలసీలు కుటుంబసభ్యుల సంఖ్యను 2 వయోజనులకు మాత్రమే పరిమితం చేస్తాయి, మరికొన్ని పాలసీలు ఒకే పాలసీ కింద 4 వయోజనుల వరకు పరిమితిని పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తాయి.

ఫ్లోటర్ పాలసీ కింద మీరు, మీ తల్లిదండ్రులను చేర్చవచ్చా?

మీ పాలసీ ప్రొవైడర్‌ను బట్టి ఫ్లోటర్ పాలసీలు 60 లేదా 65 ఏళ్ల వయస్సు పరిమితిని కలిగి ఉంటాయి. మీ తల్లిదండ్రులు ఆ వయో పరిమితిని మించితే, వారు ఫ్లోటర్ కింద కవర్ చేయబడరు మరియు మీరు వారి కోసం ప్రత్యేక పాలసీని కొనుగోలు చేయాలి. అయితే, వారు పాలసీ ప్రమాణాలను నెరవేర్చినా, ఈ కింది కారణాల వల్ల వారి కోసం ప్రత్యేక పాలసీ కొనుగోలు చేయవలసిందిగా సిఫార్సు చేయడమైనది:
  • ప్రీమియం మొత్తం: ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వయస్సు పెరిగే కొద్దీ, ప్రీమియం కూడా పెరుగుతుంది. కావున, మీ తల్లిదండ్రులు అదే పాలసీలో కవర్ చేయబడితే మీ ఫ్లోటర్ ప్రీమియం మొత్తం పెరగవచ్చు.
  • వ్యాధుల కోసం కవరేజ్: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడానికి ముందు వైద్య పరీక్షలు అవసరం. తల్లిదండ్రులకు ప్రస్తుతం కొన్ని ముందు నుండి ఉన్న వ్యాధులు‌ ఉంటే, పాలసీ అలాంటి వ్యాధుల కోసం కవరేజీని అందించకపోవచ్చు
  • నో క్లెయిమ్ బోనస్: మీరు పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే, తదుపరి సంవత్సరంలో మీకు కొంత బోనస్ ఇవ్వబడవచ్చు. మీతో పాటు వృద్ధులు కూడా పాలసీలో ఉన్నట్లయితే, క్లెయిమ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండవచ్చు. కావున, నో క్లెయిమ్ బోనస్‌ పొందే అవకాశం తగ్గిపోవచ్చు మరియు మీ ఖర్చులో కొంతమేరకు పొదుపు చేసుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు.

మీరు ఫ్లోటర్ పాలసీలో మీ పిల్లలను చేర్చవచ్చా లేదా మీరు వారి కోసం ఒక ప్రత్యేక పాలసీని కొనుగోలు చేయాలా?

కుటుంబం అనగానే అందులో పిల్లలు కూడా ఉంటారు. అయితే, వారు మీ ఫ్లోటర్ పాలసీలో భాగస్వాములు కావాలా అనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ, పిల్లలు వయస్సులో చిన్న వారై మీపై ఆధారపడినప్పుడు వారు ఫ్లోటర్ కింద కవర్ చేయబడతారు, కానీ పిల్లలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటే, వారి కోసం ప్రత్యేక పాలసీని కలిగి ఉండటం మంచిది అని సూచించబడుతుంది. ఎందుకనగా, వారికి కవరేజ్ అవసరం ఎక్కువగా ఉండవచ్చు మరియు అధిక కవరేజీతో కూడిన ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు సాధారణంగా చాలా ఖరీదైనవి. అలాగే, వారు వారి ఆదాయం నుండి పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. కేవలం దంపతులు మరియు పిల్లలు చిన్నవారైతే ఫ్లోటర్ పాలసీలు మంచివి. కానీ, ఇండివిడ్యువల్ పాలసీని ఎంచుకోవాలా లేదా ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవాలా అనేది వ్యక్తి యొక్క స్వంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు:

1. మిస్టర్ ధీరజ్ అడిగారు, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కింద నా భార్య యొక్క తల్లిదండ్రులను నేను కవర్ చేయవచ్చా? ఆమె వారికి ఏకైక కూతురు అయితే కాదు, అలాగే, వారు ఆమె పై ఆధారపడి లేరు.

అవును, మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో మీ అత్తమామలను కవర్ చేయవచ్చు. మీ అత్తమామలు మీ జీవిత భాగస్వామిపై ఆధారపడి ఉన్నారా లేదా అనేది ముఖ్యం కాదు.

2. మిస్ రియా గారి ప్రశ్న, "నేను ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో మా మామ గారిని చేర్చవచ్చా? అతను ఆర్థికంగా నాపై ఆధారపడి ఉన్నారు”.

లేదు, మీ మేనమామ లేదా మేనత్త మీపై ఆధారపడి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మీరు వారిని మీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కింద కవర్ చేయలేరు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి