వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25న జరుపుకోబడుతుంది. ఏదైనా ఇతర ఆరోగ్య అవగాహన ప్రచారంలానే ఈరోజు యొక్క ఉద్దేశ్యం, థీమ్‌పై దృష్టి పెట్టడం మరియు ఈ సంవత్సరం యొక్క థీమ్ "మలేరియాను శాశ్వతంగా నిర్మూలించడం". WHO ప్రకారం, ఆగ్నేయాసియాలో 58% మలేరియా-సంబంధిత కేసులలో భారతదేశం మాత్రమే ఉంది, వీటిలో 95% గ్రామీణ ప్రాంతాల నుండి మరియు 5% పట్టణ ప్రాంతాల నుండి వచ్చాయి. ఇది భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రముఖ కారణం. దోమలు కుట్టడం కారణంగా మలేరియా వస్తుంది. అందువల్ల, అప్రమత్తంగా ఉండటం మరియు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంలో ఎక్కువగా సంక్రమించే ప్రాంతాలు - ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మరియు ఏడు ఈశాన్య రాష్ట్రాలు. మీరు ఆ ప్రభావిత ప్రాంతాలలో దేనికైనా ప్రయాణిస్తే, ప్రయాణానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు యాంటీ మలేరియా మాత్రలు వేసుకోండి. మీరు ఇటువంటి కొన్ని నివారణ చర్యలను కూడా తీసుకోవచ్చు:
- మస్కిటో నెట్ కింద నిద్ర– దోమలు మరియు కీటకాలను దూరంగా ఉంచడానికి మస్కిటో నెట్ కింద నిద్రపోవడం అనేది ఉత్తమ మార్గం. మీరు నెట్‌ను పరుపు కింద ఉంచిన తర్వాత లోపల దోమలు ఏవీ లేకుండా ఉండేలాగా చూసుకోండి మరియు పేరుకుపోయిన దుమ్మును వదిలించుకోవడానికి ప్రతి 10 రోజులకు ఒకసారి కడగాలి.
- సిట్రోనెల్లా ఆయిల్– ఈ ఆయిల్ లెమన్‌గ్రాస్ నుండి సేకరించబడుతుంది మరియు ఎక్కువగా బ్యూటీ ప్రోడక్టులలో ఉపయోగించబడుతుంది. అయితే, ఇది ఆలివ్ లేదా కొబ్బరి నూనెతో పాటు శరీరంపై రాసినప్పుడు దోమలను నివారించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా ఎక్కువ సువాసన ఉన్నందున కొన్ని చుక్కలు మాత్రమే సరిపోతాయి.
- మీ శరీరాన్ని కవర్ చేయండి– మీ చర్మం బహిర్గతం అయినప్పుడు దోమలు మిమ్మల్ని కుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుట్టడాన్ని నివారించడానికి పూర్తి స్లీవ్స్ మరియు పూర్తిగా ఉన్న ప్యాంట్లు ధరించండి.
- మస్కిటో రిపెల్లెంట్ క్రీమ్‌లు మరియు లోషన్లను ఉపయోగించండి– మీరు మీ శరీరంలోని కొన్ని భాగాలను బహిర్గతం చేసే దుస్తులను ధరించవలసి వస్తే, ఆ ప్రాంతాల్లో మీరు మస్కిటో రిపెల్లెంట్‌ను రాసుకోండి. అలాగే, మీరు సన్‌స్క్రీన్ రాస్తే పైన రిపెల్లెంట్‌ని అప్లై చేయండి, ఎందుకంటే రిపెల్లెంట్ నుండి వచ్చే ఘాటైన వాసన దోమలను దూరంగా ఉంచుతుంది.
- ఇంటిలోపల స్ప్రేలను ఉపయోగించడం– ఇంటి వద్ద మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉన్న రిపెల్లెంట్ స్ప్రేలు మరియు వేపరైజర్లను ఉపయోగించండి. ఈ రిపెల్లెంట్లు సాధారణంగా ప్లగ్-ఇన్ చేయబడతారు లేదా మీరు గదిలో వాటిని స్ప్రే చేయాలి. ఈ పద్ధతిని మరింత ప్రభావవంతంగా చేయడానికి, తలుపులు మరియు కిటికీలను మూసివేయాలి.
మీ ప్రయాణం తర్వాత, రాబోయే లక్షణాల మీద దృష్టి పెట్టండి, మలేరియా యొక్క కొన్ని సాధారణ లక్షణాలు ఇవి:
- జ్వరం
- తలనొప్పి
- వికారం
- కండరాల నొప్పులు
- అలసట
- డయేరియా
- రక్తపు విరేచనాలు
- విపరీతమైన చెమట
- అనీమియా
- మూర్ఛలు
పశ్చాత్తాప పడడం కంటే సురక్షితంగా ఉండడం ఎల్లప్పుడూ మంచిది. అనారోగ్యం ఉన్నప్పుడు అనేక విషయాలు మన దృష్టికి వస్తాయి. అటువంటి సమయాల్లో, చికిత్స యొక్క ఆర్థికపరమైన అంశాలను జాగ్రత్తగా చూసుకునే బ్యాకప్‌ను కలిగి ఉండటం పెద్ద వరం. అందువల్ల,
మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు మానసికంగా మరియు ఆర్థికంగా ఒత్తిడి లేకుండా ఉండడానికి అవసరం. మీ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన పాలసీ కోసం చూడడానికి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
are small insects that are responsible for causing and spreading fatal diseases like Dengue, Malaria and Chikungunya. Besides infecting people with these hazardous diseases, mosquitoes also are a
25 th april is malaria day and who recomndation –end malaria for good and the analysis of malaria in india that is 58%malaria cases in india which 95% from rural and 5%from urban is quite satisfactory analysis for us.