ఏవైనా ఊహించని సంఘటనల కారణంగా మీ ఇంటికి మరియు/ లేదా ఇంట్లోని వస్తువులకు సంభావ్య నష్టం/ డ్యామేజీ జరిగే అవకాశం ఉన్న ప్రమాదాల నుండి హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని రక్షిస్తుంది. ఇల్లు అనేది మీ అత్యంత విలువైన ఆస్తులలో ఒకటి, మీ కలల ఇంటిని నిర్మించుకోవడానికి మరియు దానిని విలువైన వస్తువులతో అలంకరించడానికి ఎంతో సమయం పడుతుంది. కాబట్టి, దానిని సురక్షితం చేయడం తప్పనిసరి అవసరం.
ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ కింది కవరేజీలను కలిగి ఉంది:
- ఇలాంటి ప్రమాదాల సందర్భంలో మీ ఇల్లు/ ఇంట్లోని వస్తువులకు జరిగిన నష్టం/ డ్యామేజీ కోసం కవరేజ్:
- అగ్ని ప్రమాదం
- చోరీ
- దొంగతనం
- ప్రమాదం వలన నష్టం
- వరద
- భూకంపం మరియు మరిన్ని
- భారతదేశంలో ఎక్కడైనా పోర్టబుల్ పరికరాలకు జరిగిన నష్టం/ డ్యామేజీ కోసం కవరేజ్
- ఆభరణాలు మరియు విలువైన వస్తువులకు జరిగిన నష్టం/ డ్యామేజ్ కోసం కవరేజ్
హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ముందు మీరు ఈ కవరేజీలను తప్పనిసరిగా చెక్ చేసి ఉంటారని మేము అనుకుంటున్నాము. కానీ, మీరు మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ మినహాయింపులను చెక్ చేసారా? అవును, మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమి కవర్ చేయబడదు అనేది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం, తద్వారా మీరు హోమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల ప్రాసెస్‌ను సజావుగా పూర్తి చేయవచ్చు.
భారతదేశంలో హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద సాధారణ మినహాయింపులు
సాధారణంగా, ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ కింది సందర్భాల్లో మీ ఇల్లు/ ఇంట్లోని వస్తువులకు జరిగిన నష్టం/ డ్యామేజీని కవర్ చేయదు:
- ఆస్తికి (ఇంటి మరియు వస్తువులు) ఉద్దేశపూర్వకంగా/ కావాలని హాని తలపెట్టడం
- కచ్చా నిర్మాణంతో కూడిన ఏదైనా ఆస్తి
- మీ ఇల్లు మరియు ఇంట్లోని వస్తువులకు ముందుగానే జరిగిన నష్టం
- ఎలక్ట్రికల్, మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులలో తయారీ లోపాలు
- వినియోగించదగిన స్వభావం గల వస్తువులకు నష్టం/ డ్యామేజ్
- రహస్యంగా అదృశ్యం కావడం మరియు వివరించలేని నష్టాలు
- వస్తువుల యొక్క సరికాని నిర్వహణ
- యుద్ధం లేదా దండయాత్ర ఫలితంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరిగిన నష్టం/ డ్యామేజ్
- ఏదైనా అణు ఇంధనం లేదా అణు వ్యర్థాల నుండి వచ్చిన రేడియో ధార్మికత వలన జరిగిన నష్టం/ డ్యామేజ్
- దొంగతనం మరియు దోపిడీ క్లెయిమ్‌లు, ఇన్సూర్ చేయబడిన ఇల్లు నిరంతరంగా 45 రోజులకు పైగా ఖాళీగా ఉన్నప్పుడు
మీరు మీ పాలసీ డాక్యుమెంట్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని కోరుకుంటున్నాము మరియు మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలోని కవరేజీలు, ఫీచర్లు, ప్రయోజనాలు, చేరికలు, ప్రీమియం వివరాలను మాత్రమే కాకుండా, అందులోని మినహాయింపులను కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము. మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడని విషయాలను తెలుసుకోవడం వలన మీరు ఒక చట్టపరమైన క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌లో ఎదురయ్యే అవాంతరాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, చివరగా క్లెయిమ్ తిరస్కరణకు గురి కాకుండా జాగ్రత్త వహించవచ్చు.
బజాజ్ అలియంజ్ వద్ద మేము, మీ విలువైన ఆస్తులకు ఏదైనా నష్టం/ డ్యామేజ్ కారణంగా కలిగే ఆర్థిక ఒత్తిడిని అర్థం చేసుకున్నాము, కాబట్టి, మేము మై హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తాము, ఇది దురదృష్టకర సంఘటన సందర్భంలో మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకుంటుంది.
" బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్‌లో హోమ్ ఇన్సూరెన్స్ గురించి మరింత చదవండి."
రిప్లై ఇవ్వండి