రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Types Of Home Insurance
31 మార్చి, 2021

హోమ్ ఇన్సూరెన్స్ రకాలు

హోమ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అనే దాని గురించి సమగ్ర పరిశోధన చేసి మరియు మీ అందమైన నివాసం కోసం ఒక దానిని కలిగి ఉండాలని మీరు, మీ కుటుంబసభ్యులు నిర్ణయించుకోవడం ఒక గొప్ప విషయం. అయితే, మీరు అంతిమంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడానికి ముందు హోమ్ ఇన్సూరెన్స్ రకాలను పరిశోధించాలి. ఇది మీ అవసరాలను వ్యక్తీకరించడంలో మరియు మీకు సరిపోయే ఒక ఇన్సూరెన్స్ కవర్‌ను ఎంచుకోవడంలో సహాయపడుతుంది.  

హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రాథమిక అంశాలు

ప్రకృతి వైపరీత్యాలు, సామజిక అల్లర్లు కారణంగా ఇంటిని ఎవరైనా తగలబెట్టడం, ప్రమాదం కారణంగా దెబ్బతిన్న మీ ఇంటి కోసం మీ సేవింగ్స్ ఖర్చు అవ్వకుండా హోమ్ ఇన్సూరెన్స్ మీకు సహాయపడుతుంది. ఇలాంటి సందర్భాలు ఊహించలేనివి మరియు అందువల్ల ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తాయి. మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ నిర్దిష్ట సంఘటనను కవర్ చేస్తే, మీ పాలసీలో జాబితా చేయబడిన బకాయిల ప్రకారం మీరు పరిహారం పొందవచ్చు.  

భారతదేశంలో హోమ్ ఇన్సూరెన్స్ పాలసీల రకాలు

ఫైర్ ఇన్సూరెన్స్ అనేది భారతదేశంలోని అత్యంత సాధారణ రకాల హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఒకటి. అయితే, భారతీయ హోమ్ ఇన్సూరెన్స్ మార్కెట్ అందిస్తుంది మరిన్ని ఇతర హోమ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు.
  1. స్ట్రక్చరల్ కవర్: ఇది ఇన్సూరెన్స్ పాలసీ యొక్క అత్యంత ప్రామాణిక రూపం. ఇలాంటి పాలసీలు తీవ్రంగా దెబ్బతిన్న మీ ఇంటి నిర్మాణాన్ని కవర్ చేస్తాయి. ఈ పాలసీ సాధారణంగా డ్యామేజ్ అయిన భాగాల పునరుద్ధరణ లేదా భర్తీ కోసం అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. ఇలాంటి పాలసీలు తరచుగా పోస్ట్-బాక్సులు, బ్యాక్‌యార్డ్స్, డిస్టెంట్ గ్యారేజీలు మొదలైనటువంటి నిర్మాణాల కోసం కవరేజ్ అందించే యాడ్-ఆన్‌లతో వస్తాయి.
 
  1. ఇంటి వస్తువులకు కవర్: ఇంటి వస్తువులకు కవర్, పేరు సూచిస్తున్నట్లుగా ఇది మీ ఇంట్లోని వస్తువులకు కవరేజ్ అందిస్తుంది. ఇందులో సాధారణంగా మీ ఫర్నిచర్, కదిలే మరియు స్థిరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు లాంటి విలువైన వస్తువులు ఉంటాయి. కానీ ఇక్కడున్న షరతు ప్రకారం మీరు ఇన్సూర్ చేయబడిన ఆస్తికి యజమాని అయి ఉండాలి మరియు ఇది మీ హయాంలో జరిగిన ఒక ఉద్దేశపూర్వక చర్య యొక్క ఫలితం అయి ఉండకూడదు.
 
  1. ఫైర్ కవర్: ఇతర ఇన్సూరెన్స్ పాలసీలు 'పాలసీ కవర్ చేసే దానిని' బట్టి వేరుగా ఉంటాయి'. ఫైర్ కవర్ అగ్నిప్రమాదం యొక్క సాధారణ వనరుల కారణంగా జరిగిన నష్టం నుండి మీకు కవరేజీని అందిస్తుంది. ఊహించని ప్రకృతి వైపరీత్యాలు మరియు ప్రమాదాలు లాంటి సంఘటనలు ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడతాయి. ఇది మీ ఇల్లు, ఇంట్లోని వస్తువులు లేదా ఈ రెండింటి కోసం కవరేజీని అందించడంలో సహాయపడుతుంది. ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీలతో మీరు సుదూరంగా గిడ్డంగులలో నిల్వ చేసిన మీ వస్తువులకు కూడా ఫైర్ ఇన్సూరెన్స్ పొందవచ్చు.
 
  1. పబ్లిక్ లయబిలిటీ కవర్: ఉదాహరణకు ఒక సందర్భం చూద్దాం - రాజు తన స్నేహితుడు మోహన్‌ కొత్త ఇంటిని సందర్శించడానికి వెళ్లాడు. మోహన్ కొంత డబ్బును పోగు చేసి పాత అపార్ట్‌మెంట్‌ను కొన్నాడు. అయితే, ఆ అపార్ట్‌మెంట్‌లో ఇంకా అవసరమైన మరమ్మత్తులు చేయించాల్సి ఉన్నప్పటికీ రాజు గృహప్రవేశం చేసాడు. తన స్నేహితుడు మోహన్‌ని ఒకరోజు సాయంత్రం ఇంటికి ఆహ్వానించాడు. అయితే, అదే రోజున సాయంత్రం తాను కొనుగోలు చేసిన కొత్త PlayStationను రాజు డైనింగ్ ఏరియాలోని టేబుల్‌ మీద సరిగ్గా మధ్య భాగంలో ఉంచాడు, అంతే, ఉన్నట్టుండి ఒక్కసారిగా గట్టి శబ్దం వినిపించింది. ఇంటి పైకప్పు నుండి ఒక పెద్ద భాగం విరిగి ఆ PlayStation మీద పడింది, అది పూర్తిగా డ్యామేజ్ అయింది. ఒకవేళ మోహన్‌ పబ్లిక్ లయబిలిటీ కవర్‌ను కలిగి ఉన్నట్లయితే, అతను రాజుకు జరిగిన నష్టం కోసం పరిహారం పొందవచ్చు మరియు తన స్నేహితుడికి సంబంధించిన ఏవైనా బాధ్యతలను కవర్ చేయవచ్చు.
  కాబట్టి, మీ ఇంటి లోపల లేదా మీ చట్టపరమైన ఆధీనంలోని మీ ప్రాంగణంలో ఏదైనా కారణం వల్ల జరిగిన ఊహించని నష్టాల వల్ల తలెత్తిన ఖర్చులకు పబ్లిక్ లయబిలిటీ కవర్ పెద్ద మొత్తంలో పరిహారం అందిస్తుంది.  
  1. దొంగతనం కొరకు కవర్: హోమ్ ఇన్సూరెన్స్ యొక్క ఈ నిర్దిష్ట రకమైన కవర్ దొంగతనం కారణంగా మీకు జరిగిన ఏవైనా నష్టాలకు కవరేజీని అందిస్తుంది. ఇది పాలసీ కింద కవర్ చేయబడినంత వరకు ఏవైనా దొంగిలించబడిన మరియు విలువైన వస్తువులకు పరిహారం చెల్లిస్తుంది మరియు మీ ఇన్సూరర్ వాటి విలువను అంచనా వేస్తారు.
 
  1. భూస్వామి కవర్: ఇది సాధారణంగా భూస్వాముల కోసం ఉద్దేశించిన కవర్. మీరు మీ భవనంలో నివసించకపోయినా, ఇది మీ భవన నిర్మాణం మరియు దానిలోని వస్తువులను కవర్ చేస్తుంది. మీ విలువైన వస్తువులు మరియు భవనాలు ఎలా నిర్వహించబడతాయో మీకు ఖచ్చితంగా తెలియకపోవచ్చు. కాబట్టి, ఇది మీకు ఆ ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. భవనం మరియు అందులోని వస్తువులు మీ యాజమాన్యంలో ఉన్నంత వరకు, మీరు నష్టాల కోసం పరిహారం పొందవచ్చు.
 
  1. అద్దెదారు కవర్: అద్దెదారులు భవన నిర్మాణాన్ని కలిగి ఉండరు కావున, ఇది కేవలం అందులోని వస్తువులను మాత్రమే కవర్ చేస్తుంది. అయితే, ఒక అద్దెదారుగా మీరు భూస్వామి ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడిన ఒక అపార్ట్‌మెంట్ లేదా ఇంటిని మాత్రమే అద్దెకు తీసుకోవడాన్ని పరిగణించాలి. ఇది ఆస్తి లేదా అందులోని వస్తువులు లేదా రెండింటికీ నష్టం జరిగిన సందర్భంలో మీ యజమానితో సంభావ్య ఇబ్బందుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
 

వివిధ రకాల హోమ్ ఇన్సూరెన్స్ పాలసీల నుండి ఎలా ఎంచుకోవాలి?

విస్తృత శ్రేణిలో ఉన్న హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ రకాలను అన్వేషించడం అనేది మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడవచ్చు, కానీ గందరగోళానికి గురిచేస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి మరియు ఏ ఇన్సూరెన్స్ పాలసీ మీ కోసం ఉత్తమంగా పనిచేస్తుందో అనే దానిపై మీకు ఒక అవగాహన వస్తుంది:
  1. మీరు ఏ ఆస్తులను కవర్ చేయాలనుకుంటున్నారు?
  2. మీరు కవర్ చేయాలనుకుంటున్న ఆస్తులు ఎవరి సొంతం?
  3. మీ ఇల్లు లేదా ఇంట్లోని వస్తువులకు నష్టం కలిగించే అవకాశం ఉన్న సందర్భాలు ఏవి?
  4. ఈ ఆస్తులు మీ కోసం ఎంత విలువైనవి?
 

తరచుగా అడిగే ప్రశ్నలు

  1. ఉత్తమ రకం హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏది?
సాధారణంగా, ఒక సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.  
  1. నాకు ఎంత మొత్తంతో కూడిన హోమ్ ఇన్సూరెన్స్ అవసరం?
పునర్నిర్మాణం ఖర్చు, ఆస్తుల ఖర్చు, తాత్కాలిక ప్రత్యామ్నాయ జీవన ఖర్చు, ప్రజా బాధ్యతలు మరియు మీ ఇన్సూరెన్స్ పై మినహాయింపును లెక్కించండి. వీటిని జోడించండి మరియు మీకు అవసరమైన ఇన్సూరెన్స్ మొత్తం గురించి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి