రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Insure vs Assure: Key Differences
ఫిబ్రవరి 4, 2023

ఇన్సూరెన్స్ వర్సెస్ అస్యూరెన్స్: మెరుగైన అవగాహన కోసం ముఖ్యమైన తేడాలు వివరించబడ్డాయి

ఒక ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే విషయానికి వస్తే, ఇన్సూరెన్స్ ఏజెంట్ లేదా మధ్యవర్తిని సంప్రదించడానికి చాలామంది ఇష్టపడతారు. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్‌లనేవి పరిభాషతో ముడిపడి ఉండడం వల్ల, దానిని అర్థం చేసుకోవడం ఒక సాధారణ వ్యక్తికి గందరగోళంగా ఉండడమే అందుకు కారణం. 'ఇన్సూరెన్స్' మరియు 'అస్యూరెన్స్' అనే రెండు పదాలు ఈ కోవలోకే వస్తాయి. సాధారణంగా మీరు అన్వేషించే పాలసీ మీద ఆధారపడి, ఇవి మీ ఇన్సూరెన్స్ పాలసీల్లో కనిపిస్తాయి. ఇవి రెండూ పరస్పరం ఏవిధంగా భిన్నమైనవో మీరు తెలుసుకోవాలనుకుంటే, మరింత తెలుసుకోవడానికి చదవడం కొనసాగించండి: ఇన్సూరెన్స్ మరియు అస్యూరెన్స్ అనే రెండు పదాలను వీటి కోసం పరస్పరం మార్చగలిగేలా ఉపయోగిస్తుంటారు. అవి లైఫ్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు. అయితే, నిజానికి అవి రెండూ భిన్నమైన అర్థాలు కలిగి ఉంటాయి. ఇవి రెండూ ఆర్థిక నష్టం నుండి కొంత రక్షణ అందించేవి అయినప్పటికీ, పరిధి మరియు ప్రయోజనం విషయంలో అవి భిన్నంగా ఉంటాయి.

ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏమిటి?

ఇన్సూరెన్స్ అనేది ప్రమాదాలు, అనారోగ్యం లేదా ఆస్తికి నష్టం లాంటి ఊహించని సంఘటనల నుండి ఆర్థిక పరిహారం అందించడం కోసం ఒక వ్యక్తి మరియు ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య కుదిరే ఒక ఒప్పందం. ప్రీమియంలు క్రమం తప్పకుండా చెల్లించడం మీద ఆధారపడి, పాలసీదారుకు ఏర్పడిన ఏవైనా నష్టాలను కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే పరిహారం అనేది సాధారణంగా నగదు పరమైన నష్టానికి సమానంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇన్సూరెన్స్ ప్లాన్‌లనేవి ఒక నిర్దిష్ట చెల్లుబాటు కాల పరిమితి కలిగి ఉంటాయి. ఈ సమయంలో మాత్రమే కంపెనీ కవరేజీని అందిస్తుంది. *

దానిని ఒక ఉదాహరణతో వివరించవచ్చు:

శ్రీ రాజేష్ గారు ఒక కొత్త కారు కొనుగోలు చేశారు. దానిని రిజిస్ట్రేషన్‌ చేయడానికి జనరల్ ఇన్సూరెన్స్ కవరేజీ రూపంలో ఒక కార్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరమైంది. చట్టానికి అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించడం కోసం, థర్డ్-పార్టీ పాలసీ కొనుగోలు చేయాలని ఆయన భావించారు. అయితే, ఆయన వాహనానికి జరిగే నష్టాల నుండి రక్షించడానికి థర్డ్-పార్టీ ప్లాన్ సరిపోదని ఆయన్ని డీలర్ ఒప్పించారు. అప్పుడు శ్రీ రాజేష్ గారు, స్వంత డ్యామేజ్ కవర్ మరియు కనీసం అవసరం అయిన థర్డ్ పార్టీ కవరేజ్ కలిగి ఉన్న ఒక సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అదనంగా, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది వ్యక్తి గాయాలు మరియు మరణం కోసం ఫైనాన్షియల్ కవరేజీని నిర్ధారిస్తుంది. విస్తృత ఇన్సూరెన్స్ కవరేజీ కావడంతో, యాడ్-ఆన్‌లు ఉపయోగించి దానిని మెరుగుపరచే ఎంపిక కూడా ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్‌ గురించి వివరించడానికి కార్ ఇన్సూరెన్స్ ఒక ఉదాహరణ అయినప్పటికీ, ఇతర ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా ఉన్నాయి. అవి ట్రావెల్ ఇన్సూరెన్స్ , ప్రాపర్టీ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ మరియు మరిన్ని.

అస్యూరెన్స్ అంటే అర్థం ఏమిటి?

మరోవైపు, అస్యూరెన్స్, అనేది మరణం లేదా వైకల్యం వంటి కొన్ని సంఘటనల నుండి రక్షణను అందించే ఒక రకం ఇన్సూరెన్స్‌గా ఉంటుంది. ఇన్సూరెన్స్ లాగా కాకుండా, అస్యూరెన్స్ పాలసీలకు గడువు తేదీ ఏదీ ఉండదు లేదా అవి ఎక్కువ కాలం చెల్లుబాటుతో ఉంటాయి. అస్యూరెన్స్ అందించే ఇన్సూరెన్స్ పాలసీల కోసం, ప్రత్యేకించి, దీర్ఘకాలం పాటు క్రమం తప్పకుండా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. పాలసీదారు లేదా వారిమీద ఆధారపడినవారు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే చెల్లింపుకి లబ్ధిదారులుగా ఉంటారు. *

దానిని ఒక ఉదాహరణతో వివరించవచ్చు:

శ్రీ కమలేష్ గారు తన కోసం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ కొనుగోలు చేశారు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది పాలసీదారు మరణం కోసం మాత్రమే చెల్లింపు అందిస్తుంది కాబట్టి, పాలసీదారు మీద ఆధారపడిన వారికి పాలసీ కాల వ్యవధిలో ఇది హామీ పూరిత చెల్లింపుగా ఉంటుంది. ఇతర రకాల లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో ఎండోమెంట్ పాలసీ లాంటి మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వీటి విషయంలో, పాలసీదారు మెచ్యూరిటీ ఆదాయం ప్రయోజనం అందుకోవచ్చు. అస్యూరెన్స్ అందించే పాలసీకి మరొక ఉదాహరణగా ఒక క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది నిర్దిష్ట వ్యాధుల రోగనిర్ధారణ మేరకు పాలసీదారునికి పరిహారం చెల్లిస్తుంది. ఇన్సూరెన్స్ మరియు అస్యూరెన్స్ మధ్య వ్యత్యాసం అర్థం చేసుకోవడానికి ఒక మార్గం ఏంటంటే, ఇన్సూరెన్స్ అనేది భవిష్యత్తులో జరిగే అవకాశం ఉన్న ప్రమాదాల నుండి రక్షణ అందిస్తే, అస్యూరెన్స్ అనేది అనివార్య సంఘటనల కోసం హామీ ఇచ్చే రక్షణగా ఉంటుంది. దేశం మరియు పరిశ్రమ మీద ఆధారపడి, ఇన్సూరెన్స్ మరియు అస్యూరెన్స్ మధ్య నిబంధనలు మారవచ్చని గమనించడం ముఖ్యం. ఉదాహరణకు, కొన్ని దేశాల్లో, ఈ పదాలను పరస్పరం మార్పు చేస్తూ ఉపయోగిస్తుంటారు. అదేసమయంలో, ఇతర దేశాల్లో విభిన్న రకాల పాలసీల కోసం ఈ పదాలు ఉపయోగిస్తుంటారు. కాబట్టి, అందించే కవరేజీ మరియు ప్రయోజనాల గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం ఏదైనా ఇన్సూరెన్స్ లేదా అస్యూరెన్స్ పాలసీ నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా చదవడం అవసరం.

ఇన్సూరెన్స్ మరియు అస్యూరెన్స్ మధ్య తేడా

పైన వివరించిన విధంగా, ఇన్సూరెన్స్ అనే పదం ఎక్కువగా హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ లేదా కార్ ఇన్సూరెన్స్ వంటి సాధారణ ఇన్సూరెన్స్ పాలసీలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, అస్యూరెన్స్ అనే పదం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో ఉపయోగించబడుతుంది. వీటి మధ్య వ్యత్యాసాలను జాబితా చేసే ఒక పట్టిక ఇక్కడ ఇవ్వబడింది:

ఇన్సూరెన్స్

అస్యూరెన్స్

లక్ష్యం

దొంగతనం, ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు మొదలైన వాటి వల్ల ఏర్పడే నష్టానికి పరిహారం చెల్లించడమనేది ఇన్సూరెన్స్ లక్ష్యం. పాలసీదారు మరణం లాంటి భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనల కోసం డబ్బు మద్దతు అందించడం దీని లక్ష్యం.
   

క్లెయిమ్ డబ్బు

ఇన్సూరెన్స్‌‌తో వచ్చే ప్లాన్‌ల కోసం అందించే క్లెయిమ్ అమౌంట్ అనేది సుమారుగా నష్టం మొత్తానికి సమానంగా ఉంటుంది. * అస్యూరెన్స్‌తో వచ్చే ప్లాన్‌ల కోసం అందించే క్లెయిమ్ అమౌంట్ అనేది ప్రారంభం నుండి నిర్వచించబడుతుంది. *
   

అనుమతించబడిన క్లెయిముల సంఖ్య

పాలసీ నిబంధనల మీద ఆధారపడి, ఇన్సూరెన్స్ ప్రయోజనాలతో వచ్చే ప్లాన్‌ల కోసం అనేక క్లెయిమ్‌లు అనుమతించబడుతాయి. * అస్యూరెన్స్ ప్రయోజనం అందించే ప్లాన్ల కోసం ఒక క్లెయిమ్ మాత్రమే అనుమతించబడుతుంది. *
   

ఇన్సూర్డ్ అంటే ఏమిటి?

వ్యక్తులు మరియు ఆస్తి అనే రెండూ ఈ రకాల పాలసీల క్రింద ఇన్సూర్ చేయబడుతాయి.* అస్యూరెన్స్ ప్రయోజనాలు అందించే పాలసీల క్రింద వ్యక్తులు మాత్రమే ఇన్సూర్ చేయబడుతారు. *
   

కవర్ చేయబడిన రిస్క్ స్వభావం

ఇన్సూరెన్స్ ప్రయోజనాలతో కూడిన ప్లాన్‌లనేవి ప్రమాదం, దోపిడీ, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన అనిశ్చిత మరియు ఊహించని ప్రమాదాలను కవర్ చేస్తాయి.* ఈ ప్లాన్‌లనేవి అనిశ్చితమైనప్పటికీ, ఊహించదగిన ప్రమాదాలైన వ్యక్తి మరణం లాంటి వాటిని కవర్ చేస్తాయి. *
   
  * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.      

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి