అన్ని వ్యాపారాలు వారి వ్యాపార కార్యకలాపాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగిస్తాయి. అవి వ్యాపారాన్ని స్థానిక స్థాయి నుండి ప్రపంచ స్థాయికి పెంచడంలో సహాయపడతాయి. వ్యాపార నెట్‌వర్క్ విస్తరణలో ఈ పరికరాలు ఒక కీలక పాత్రను పోషిస్తాయి. డేటా మార్పిడికి సంబంధించి సాంప్రదాయ మార్గాలను ఎలక్ట్రానిక్ డేటా భర్తీ చేశాయి. ఈ పరికరాలతో తలెత్తే ఏదైనా సమస్య పనికి ఆటంకం కలిగించవచ్చు, అది ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. ఈ సమస్యను నివారించడానికి, ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం తక్షణ అవసరం.
ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
పెరిగిన టెక్నాలజీ వినియోగం అనేది ఏదైనా రూపంలో అయినా ఆటంకం కలిగించవచ్చు, అది ఆర్థిక ప్రభావానికి దారి తీయవచ్చు. అన్ని సంస్థలు వారి రోజువారీ కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తాయి. కంప్యూటర్ల నుండి పారిశ్రామిక పరికరాల వరకు, వైద్య పరికరాల నుండి ఎలక్ట్రానిక్ నగదు రిజిస్టర్ల వరకు, మీ వ్యాపార కార్యకలాపాల కోసం అన్నీ ముఖ్యమైనవి. ఒక
కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ వ్యాపారాన్ని అవాంతరాలు లేకుండా నిర్వహించడంలో సహాయపడే ఎలక్ట్రానిక్ పరికరాలకు, ఏవైనా రిపేర్స్ లేదా నష్టాలు జరిగిన సందర్భంలో వాటిని కవర్ చేస్తుంది.
ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్‌లోని విభాగాలు ఏమిటి?
మీ ఎలక్ట్రానిక్ పరికరాలను కవర్ చేసే ఒక సాధారణ ఇన్సూరెన్స్ మూడు విభాగాలుగా వర్గీకరించబడింది-
ఎక్విప్‌మెంట్ కవర్
మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు జరిగిన ఏదైనా నష్టం, మీ పాలసీలోని ఈ విభాగం కింద కవర్ చేయబడుతుంది. పాక్షిక నష్టంతో సహా ఆకస్మిక భౌతిక నష్టం కారణంగా తలెత్తే ఏదైనా నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుంది. అలాంటి ఏదైనా నష్టం, రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్ ద్వారా ఇన్సూర్ చేయబడుతుంది. ఈ అమౌంటు పాలసీ ప్రకారం, హామీ ఇవ్వబడిన గరిష్ట మొత్తానికి లోబడి ఉంటుంది.
ఎక్స్‌టర్నల్ డేటా మీడియా కవర్
మీ డిస్క్ డ్రైవ్ లేదా ఏదైనా ఇతర స్టోరేజ్ డివైజ్ పనిచేయకపోవడం మరియు డేటా ఇకపై అందుబాటులో ఉండకపోవడం లాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో, పాలసీహోల్డర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకున్నట్లయితే, పోయిన డేటాను తిరిగి పొందడానికి ఇది ఆర్థిక కవర్‌ను అందిస్తుంది. ఈ డేటా మీ సంస్థకు ముఖ్యమైనది కావచ్చు మరియు ఆర్ధిక ప్రభావం కూడా భారీగా ఉండవచ్చు.
వర్కింగ్ కవర్ యొక్క పెరిగిన ఖర్చు
డేటా ప్రాసెసింగ్ యూనిట్‌కు ఊహించని నష్టం జరిగినప్పుడు, ప్రత్యామ్నాయ యూనిట్‌ను ఏర్పాటు చేయడం తప్పనిసరి అవసరం. ఈ పాలసీ, హార్డ్‌వేర్ మరియు హ్యూమన్ రిసోర్సెస్ ఖర్చులను కవర్ చేసే అలాంటి అదనపు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ కింద కవరేజ్ అంటే ఏమిటి?
మీ ఎలక్ట్రానిక్ పరికరాలను కవర్ చేసే జనరల్ ఇన్సూరెన్స్ చిన్న వ్యాపార యజమానులు మరియు పెద్ద సంస్థలకు తప్పనిసరి. ఇది ఈ కింది వాటిని కవర్ చేస్తుంది -
డ్యామేజ్ అయిన పరికరాలకు కవరేజ్ - ఇన్సూర్ చేయబడిన పరికరాలకు ఏవైనా రిపేర్స్ లేదా రీప్లేస్‌మెంట్ అనేవి కవరేజీలో చేర్చబడ్డాయి. ఇది భారీ యంత్రాలు లేదా దిగుమతి చేసుకున్న పరికరాల విషయంలో సరుకు రవాణా, నిర్మాణాలు మరియు కస్టమ్ డ్యూటీ లాంటి అనుబంధ ఖర్చులను కలిగి ఉంటుంది.
డ్యామేజ్ అయిన డేటా మీడియా కోసం కవరేజ్ - మీ వ్యాపార కార్యకలాపాల సంబంధిత కీలక సమాచారం నష్టం అనేది ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడుతుంది.
పని ఖర్చులు - పరికరాలు మరియు లేబర్ రూపంలో వనరుల పెరుగుదలకు కారణం అయ్యే డేటా అంతరాయం జరిగినప్పుడు పూర్తి ప్రక్రియ యొక్క రీకాన్ఫిగరేషన్ కోసం అయ్యే ఖర్చు ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడుతుంది.
సాఫ్ట్‌వేర్ నష్టం - ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ హార్డ్‌వేర్ ఖర్చులను కవర్ చేయడమే కాకుండా హార్డ్‌వేర్ కోసం అయ్యే సాఫ్ట్‌వేర్ ఖర్చును కూడా కవర్ చేస్తుంది.
మరింత చదవండి:
ఇన్సూరెన్స్ వర్సెస్ అస్యూరెన్స్: మెరుగైన అవగాహన కోసం ముఖ్యమైన తేడాలు వివరించబడ్డాయి
ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్‌ను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వలన కలిగే కొన్ని ప్రయోజనాలు -
- ఎలక్ట్రానిక్ పరికరాలకు మరియు డేటాకు జరిగిన నష్టం లేదా డ్యామేజీకి సంబంధించిన మొత్తం ఖర్చు ఈ పాలసీ కింద ఇన్సూర్ చేయబడుతుంది. ఇది అటువంటి పరికరాలకు డిప్రిసియేషన్ అంశాన్ని మినహాయిస్తుంది.
- ఓవర్ టైమ్, డబుల్ పే మరియు నైట్ షిఫ్ట్‌లు లాంటి నిర్వహణ ఖర్చులను పెంచే ఏవైనా లేబర్ ఖర్చులు పాలసీ కింద భరించబడతాయి.
- పరికరాన్ని రీప్లేస్ చేయడం సాధ్యం కాకపోతే, ఇన్సూరర్ పాలసీహోల్డర్‌కు రిపేర్ ఖర్చుల కోసం నష్టపరిహారం చెల్లిస్తారు.
ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్‌లో సాధారణ మినహాయింపులను గుర్తుంచుకోండి -
- ఈ పాలసీ కింద సాధారణ అరుగుదల మరియు తరుగుదల ప్రత్యేకంగా మినహాయించబడుతుంది.
- పరికరాలను సరిచేయడం మరియు సవరించడం మరియు నష్టం కలిగించే డేటా.
- పాలసీ హోల్డర్ వినియోగం సమయంలో చేసిన ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం.
- ఇతర కారణాల వల్ల పరికరానికి జరిగిన ఏదైనా పర్యవసాన నష్టం మినహాయించబడుతుంది.
- పెయింట్ లేదా ఎనామెల్ చేయబడిన ఉపరితలాలపై గీతలు, సౌందర్యాత్మక లోపాలు.
- ఏదైనా తప్పుడు ప్రోగ్రామింగ్, లేబులింగ్ లేదా సమాచారాన్ని అనుకోకుండా రద్దు చేయడం మరియు అదనపు ఖర్చులకు దారితీసే డేటా తొలగింపు.
ముగింపు
చివరగా, మీ పరికరాలు మరియు డేటాను సురక్షితం చేసే కమర్షియల్ ఇన్సూరెన్స్ అనేది మీ నియంత్రణలో లేని అంశాల కారణంగా అంతరాయాలు ఏర్పడినప్పుడు అందుబాటులోకి వస్తుంది. ఇలాంటి ఆకస్మిక ఖర్చులను కవర్ చేసే ఇన్సూరెన్స్ పాలసీని పొందడం అనేది, వ్యాపార కార్యకలాపాలు సాఫీగా సాగడంలో సహాయపడుతుంది.
రిప్లై ఇవ్వండి