రెండు కర్రలను కలిపి వాయిస్తే ఆసక్తిని కలిగించే శబ్దం వస్తుంది అని మానవులు గ్రహించినప్పటి నుండి సంగీతం మనుగడలో ఉంది. సంగీతం మన మనస్సుకు ఉత్తేజం కలిగిస్తుంది, ఆనందం, దయ మరియు ప్రేమ లాంటి భావనలను మనలో పెంచుతుంది. సంగీతం ఏదైనా సామాజిక సమావేశంలో ఒక అవిభాజ్య భాగం. ఇది మన మనస్సుకు సాంత్వనను అందిస్తుంది, ఎంతలా అంటే ఇప్పుడు ఇది ఒక రకమైన థెరపీలాగా గుర్తించబడుతుంది.
ఇరవైవ శతాబ్దం మధ్యలో, మ్యూజిక్ థెరపీ ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందింది మరియు శిక్షణ పొందిన థెరపిస్టులు దానిని ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించడం ప్రారంభించారు. ఆధునిక సాంకేతికల అభివృద్ధి వలన సంగీతం వలన మన మెదడు యొక్క నిర్మాణం మరియు పనితీరు పై పడే ప్రభావం గురించి, మన మానసిక స్థితిని మెరుగుపరచడం గురించి మరియు మన భావావేశాలను ప్రేరేపించడం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సంగీతం మన మెదడును చైతన్యవంతం చేస్తుంది
సంగీతం నేర్చుకోవడం వలన మన మెదుడు నిర్మాణంలో మార్పులు ఏర్పడి మరింత చురుకుగా మరియు ధృడంగా మారుతుంది. ప్రశాంతమైన సంగీతం వినే వారిలో సమాచారాన్ని ప్రాసెస్ చేసే వేగం, తర్కం, సృజనాత్మకత, అవధానవిస్తృతి మరియు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి.
సంగీతం ఒత్తిడి సంబంధిత హార్మోన్లను నియంత్రిస్తుంది
హాయిని అందించే సంగీతాన్ని వినడం వలన రక్తంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గిస్తుంది మరియు కొన్ని సందర్భాలలో ఔషధాల అవసరాన్ని కూడా తొలగిస్తుంది.
సంగీతం రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
సంగీతాన్ని వినడం ద్వారా ఆహ్లాదకరమైన స్థితిని సాధించవచ్చు, ఇది ప్రత్యేకమైన శారీరక మార్పులకు దారితీస్తుంది, చివరికి ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
సంగీతం ఉత్పాదకతను పెంచుతుంది
పని చేసే సమయంలో మన దృష్టిని ఆకర్షించే అనేక అంశాలు ఉంటాయి. సంగీతం మనల్ని మెరుగైన ఉత్పాదకతను అందించడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం సంగీతాన్ని విన్న వ్యక్తులు సంగీతం వినని వ్యక్తుల కంటే తమ పనులను మరింత త్వరగా పూర్తి చేసారని మరియు మెరుగైన ఆలోచనలను కలిగి ఉన్నారని చూపుతుంది.
సంగీతం జ్ఞాపక శక్తిని మరియు అభ్యసనను బలోపేతం చేస్తుంది
సంగీతం మెరుగైన ఏకాగ్రతను సాధించడంలో ప్రజలకు సహకరిస్తుంది. ఇది స్పెల్లింగ్స్ మరియు కవితలను గుర్తు పెట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచగలదు. పాఠశాలలో సంగీత కార్యక్రమంలో పాల్గొనడం వలన అభ్యాసన, ప్రేరణ మరియు ప్రవర్తనపై సానుకూల ప్రభావం ఉంటుంది అని చూపబడింది.
సంగీతం నొప్పిని తగ్గిస్తుంది
సంగీతం వలన ఎందుకు నొప్పి తగ్గుతుందో సరిగ్గా తెలియకపోయినప్పటికీ, డోపమైన్ విడుదలలో సంగీతం యొక్క ప్రభావం కీలకమైన పాత్రను కలిగి ఉండవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం వెన్నుముక సర్జరీకి ముందు సంగీతం వినని పేషంట్లతో పోలిస్తే, సంగీతం వినే పేషంట్లు తక్కువ నొప్పిని అనుభవించారు.
సంగీతం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది
ఒత్తిడి మరియు ఆందోళన అనేవి నిద్రను ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రధాన అంశాలు. సంగీతం వాటిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. సంగీతం వినడం వలన మరింత మంచి నిద్ర మరియు మెరుగైన నిద్ర ప్యాటర్న్‌లు ఏర్పడతాయి అని ఒక పరిశోధన చూపించింది. కొన్ని సందర్భాల్లో అది నిద్రలేమికి చికిత్స చేయడంలో సహాయపడవచ్చు.
మీ బాధ్యత
ఈ ప్రపంచ సంగీత దినోత్సవం నాడు మంచి సంగీతాన్ని వినండి మరియు మీ మనస్సు, ఆత్మ మరియు శరీరం పై పడే దాని అద్భుతమైన ప్రభావాన్ని ఆస్వాదించండి!
అన్వేషించండి మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు బజాజ్ అలియంజ్ ద్వారా అందించబడుతున్నవి మరియు మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని సురక్షితం చేసుకోండి.
I like folk bands! I really do! And yes, it helps me a lot to relax my mind.