రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
What is General Insurance: Types of General Insurance in India
1 మార్చి, 2022

జనరల్ ఇన్సూరెన్స్ రకాలు

మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెలవుల కోసం బయలుదేరినట్లు ఊహించుకోండి, మీ ఇల్లు, కారు మరియు ఇతర వస్తువుల గురించి ఎడతెగని ఆందోళన మీ ట్రిప్ అంతటా ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు ఆనందించగలిగే సెలవు కాదు. బదులుగా, మీ ఇంటి గురించి ఆలోచించాలా లేదా విహారయాత్రను ఆనందించాలా అనే సంశయం మీకు నిరంతర ఆందోళన కలిగిస్తుంది. ఇటువంటి సమయంలో జనరల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్ ప్రాథమికంగా రెండు వర్గాలుగా విభజించబడుతుంది - లైఫ్ మరియు నాన్-లైఫ్. నాన్-లైఫ్ ఇన్సూరెన్స్‌ను జనరల్ ఇన్సూరెన్స్ అని కూడా పేర్కొంటారు. ఈ వర్గానికి చెందిన ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా అన్ని రకాల ఇన్సూరెన్స్‌లను కవర్ చేస్తుంది. పైన పేర్కొన్న ఉదాహరణలో, ఒక జనరల్ ఇన్సూరెన్స్ పాలసీని ఉపయోగించి మీ అన్ని వస్తువులను కవర్ చేయవచ్చు. వివిధ రకాల జనరల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఉన్నప్పటికీ, ఒక నిర్దిష్ట రకమైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడంతో మీ ప్రతి ఆస్తిని సురక్షితం చేయవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీ పనిచేసే ప్రాథమిక సూత్రం మీ నష్టాలకు నష్టపరిహారాన్ని అందించడం. కాబట్టి గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ అనేది ఒక రక్షణ కవచం మాత్రమే కాదు. ఇది నష్టాలను నివారిస్తుంది, బదులుగా ఏదైనా నష్టం లేదా డ్యామేజీకి పరిహారం చెల్లిస్తుంది.

జనరల్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?

లైఫ్ ఇన్సూరెన్స్‌తో సమానంగా జనరల్ ఇన్సూరెన్స్ కూడా చాలా మంది వ్యక్తులకు ఒకేసారి సంభవించే ప్రమాద సూత్రం పై పనిచేస్తుంది. ప్రమాదం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ నష్టాలను ఎదుర్కోరు. ఇది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మీ అన్ని రకాల క్లెయిములను స్వీకరిస్తాయని సూచిస్తుంది. రిస్క్‌ను కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం వసూలు చేస్తుంది. అదే రకం రిస్క్ కోసం ఇన్సూర్ చేయడానికి సిద్ధంగా ఉన్న అనేక మందికి ఇలాంటి కవరేజ్ అందించబడుతుంది. క్లెయిమ్‌లు చేసినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ నిధుల నుండి చెల్లింపులు చేస్తాయి. మీరు లేని సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ మీ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినట్లే, పాలసీ నిబంధనల ప్రకారం సమయం వచ్చినప్పుడు మీకు డబ్బు అందుతుందని జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా నిర్ధారిస్తుంది.

మీరు కొనుగోలు చేయగల జనరల్ ఇన్సూరెన్స్ పాలసీల రకాలు ఏమిటి?

ఈ రోజుల్లో మీరు వర్తించే ధరను చెల్లించినట్లయితే, దాదాపు దేనినైనా ఇన్సూర్ చేయవచ్చు, మీరు కొనుగోలు చేయగల కొన్ని ప్రధాన జనరల్ ఇన్సూరెన్స్‌ రకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి -  

#1 హెల్త్ ఇన్సూరెన్స్

మీ జీవితం ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సామెత హెల్త్ కవర్‌ కొనుగోలును పూర్తిగా సమర్థిస్తుంది. భారతదేశంలోని అనేక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద మీ కోసం సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం అనేది మీ ఎంపిక. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు, హాస్పిటలైజేషన్ కోసం నిర్దిష్ట హామీ ఇవ్వబడిన మొత్తం వరకు కవర్ చేస్తాయి. మీ అవసరాన్ని బట్టి మీరు ఎంచుకోగల వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ‌లు ఉన్నాయి. ఒక స్టాండ్అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ ప్రాధాన్యతగా ఉండాలి, మీరు మీపై ఆధారపడిన వారిని, పిల్లలను మరియు మీ జీవిత భాగస్వామిని చేర్చడానికి ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఏదైనా జబ్బు ఉంటే, మీరు క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌తో ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. అన్ని హెల్త్ పాలసీలు తమ కవర్‌ను వర్తింపజేసేందుకు మీరు హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది గమనించగలరు. మీరు ఎంచుకున్న ప్లాన్‌పై ఆధారపడి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని చికిత్సలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడతాయి.  

#2 మోటార్ ఇన్సూరెన్స్

మోటారు వాహనాన్ని కొనుగోలు చేయడం అంత సులభమేమి కాదు, ఖచ్చితంగా మీరు దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. విధ్వంసం, నష్టం, దొంగతనం లేదా యాక్సిడెంట్ ఏదైనా మోటారు ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడుతుంది. సరైన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం వల్ల మీ కారుకు పూర్తి రక్షణను కలిగి ఉండవచ్చు. ఆరోగ్యకరమైన కవరేజీని పొందడానికి ఎంపిక చేసిన యాడ్-ఆన్‌లను ఉపయోగించడం ద్వారా మీ కారు ఇన్సూరెన్స్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒక కారు ఇన్సూరెన్స్ పాలసీ మీ స్వంత నష్టాల కోసం మాత్రమే కాకుండా థర్డ్-పార్టీ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. అంతేకాకుండా, మోటారు వాహనాల చట్టం 2019 ప్రకారం, ప్రతి వాహనం కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కవర్ కలిగి ఉండటం తప్పనిసరి.  

#3 హోమ్ ఇన్సూరెన్స్

మరొక రకమైన జనరల్ ఇన్సూరెన్స్ మీ ఇంటిని మరియు ఇంట్లోని వస్తువులను సురక్షితం చేస్తుంది. మీరు ఒక ఇంటి యజమాని అయినా లేదా అద్దె వసతిలో నివసిస్తున్నా, ఒక హోమ్ ఇన్సూరెన్స్ మీ కోసం కవర్. ఒక హోమ్ కవర్ మీ ఇంటిని ప్రకృతి వైపరీత్యాల నుండి మరియు మానవ ప్రమాదాల నుండి రక్షిస్తుంది, మీకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.  

#4 ట్రావెల్ ఇన్సూరెన్స్

మీరు పర్యటనలో ఉన్నప్పుడు ఎపుడైనా ప్రయాణంలో మీ లగేజీని పోగొట్టుకున్నారా? ఈ దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి, ముఖ్యంగా విదేశీ పర్యటన కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పోయిన సామాను లేదా మీరు ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు హాస్పిటలైజేషన్ అత్యవసర పరిస్థితి కారణంగా ఏదైనా ఆర్థిక నష్టాన్ని కవర్ చేస్తుంది. అంతేకాకుండా, డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఇలాంటి కవరేజీని అందిస్తుంది.  

#5 కమర్షియల్ ఇన్సూరెన్స్

పైన పేర్కొన్న ఇన్సూరెన్స్ మీ జీవితంలోని అన్ని వ్యక్తిగత అంశాలను కవర్ చేస్తుంది, మీ బిజినెస్ కోసం ఈ అదనపు జాగ్రత్త అవసరం. ఏదైనా ఊహించని వ్యాపార నష్టం భారీ ఆర్థిక వైఫల్యాన్ని కలిగిస్తుంది, మిమ్మల్ని అప్పుల బాధకు గురి చేస్తుంది. ఇలాంటి ఊహించని నష్టాలను నివారించడానికి, భారతదేశంలోని వివిధ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం మన ముందున్న మార్గం. ఇవి మీరు కొనుగోలు చేయగల కొన్ని ముఖ్యమైన జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు అయితే, మీకు నచ్చిన ఇన్సూరెన్స్ సంస్థ నుండి కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ కవర్ కోసం కూడా మీరు వెళ్లవచ్చు. చివరగా, వివేకంతో ఉండండి మరియు ఇన్సూరెన్స్ చేసుకోండి! *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి