రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
CKYC Insurance & Car Insurance in India
మే 20, 2022

IRDAI మరియు దాని పాత్రను వివరంగా తెలుసుకుందాం

భారతదేశంలో ఇన్సూరెన్స్‌కు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అలాగే, ఇన్సూరెన్స్ అనే ఆలోచన కూడా చాలా సంవత్సరాల నాటిది, కొందరు వ్యక్తులు వారికి రక్షణ లేదా భద్రత అవసరం అని భావించినప్పుడు దీనిని ఆశ్రయించారు. కాలక్రమేణా ఈ అవసరం ఇన్సూరెన్స్ భావనకు జన్మను ఇచ్చింది. సమయం గడిచే కొద్దీ ఇన్సూరెన్స్ భావన క్రమంగా అభివృద్ధి చెందింది. IRDAI అనేది Insurance Regulatory and Development Authority of India కోసం సంక్షిప్త రూపం. సులభంగా చెప్పాలంటే, IRDAI అనేది భారతదేశంలోని ఒక ఇన్సూరెన్స్ నియంత్రణ సంస్థ. ఇది భారతదేశంలోని జనరల్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల పనితీరును పర్యవేక్షిస్తుంది. ఈ ఆర్టికల్‌లో మేము IRDAI మరియు దాని పనితీరు పై ఒక త్వరిత అవగాహనను అందిస్తాము.

IRDAI ఆవిర్భావం

  • స్వయంప్రతిపత్త సంస్థ Insurance Regulatory and Development Authority of India అనేది 1999, IRDAI చట్టం కిందకు వస్తుంది.
  • IRDAI ప్రధాన లక్ష్యం పాలసీహోల్డర్ల ప్రయోజనాలకు భద్రత కల్పించడం, భారతీయ ఇన్సూరెన్స్ రంగంలో వృద్ధిని నిర్ధారించడం, ప్రోత్సహించడం, నియంత్రించడం మరియు దాని సంబంధిత లేదా యాదృచ్ఛిక అంశాలను పర్యవేక్షించడం.

పూర్తి సమీక్ష: IRDAI

Insurance Regulatory and Development Authority of India అనేది ఒక చట్టపరమైన సంస్థ. ఈ IRDAI సంస్థ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధి కిందకు వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇన్సూరెన్స్ మరియు రీ-ఇన్సూరెన్స్ సంస్థలకు లైసెన్స్ ఇవ్వడం మరియు నియంత్రించడమే దీని కర్తవ్యం. IRDAI, పాలసీహోల్డర్ ప్రయోజనాలను సురక్షితం చేయడమే కాకుండా, భారతదేశంలోని బీమా పరిశ్రమలను కూడా నియంత్రిస్తుంది. భారతదేశంలో ఉమ్మడి కుటుంబం అనే భావన మనందరికీ సుపరిచితమే. ప్రతి ఉమ్మడి కుటుంబంలో ఒక ఇంటి పెద్ద ఉంటారు, అందులో చాలా వరకు మన తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ ఉంటారు, వారు అన్నింటికీ బాధ్యత వహిస్తూ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపిస్తారు. ఈ పెద్దలు ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయం పట్ల శ్రద్ధ వహిస్తారు, మంచిచెడు నిర్ణయిస్తారు మరియు ఇతర సభ్యులకు ఏమి చేయాలో, ఎలా చేయాలో మరియు ఏమి చేయకూడదో కూడా వివరిస్తారు. ఎలాగైతే ఒక కుటుంబంలో ఇంటి పెద్దలు ప్రధాన పాత్ర పోషిస్తారో, అదేవిధంగా IRDAI సంస్థ కూడా ఇన్సూరెన్స్ సంస్థలకు అధిపతిగా ఉంటూ మార్గదర్శకాలు మరియు నియమాలను జారీ చేస్తుంది మరియు వాటిని నియంత్రిస్తుంది. భారతదేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీల అగ్రగామి వ్యవస్థ, IRDAI గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ ఒక శీఘ్ర అవలోకనం ఇవ్వబడింది:

భారతీయ ఇన్సూరెన్స్ పరిశ్రమలో IRDAI పాత్రను అర్థం చేసుకోవడం

ఇన్సూరెన్స్ కంపెనీలు వ్యాపార ఎంపిక ప్రాతిపదికన ఇన్సూరెన్స్ పరిహారాన్ని లెక్కించి క్లెయిమ్‌లను తిరస్కరించే రోజులు పోయాయి. ఇది మంచి మరియు చెడు రిస్క్ ఈ రెండింటి గురించిన వారి అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అలాంటి చర్యలను తగ్గించడానికి మరియు నియంత్రించడానికి, IRDAI అమలులోకి వచ్చింది. మనందరికీ తెలిసినట్లుగా, భారతదేశంలోని బ్యాంకులు ఆర్‌బిఐ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు, బ్యాంకర్లు అకౌంట్‌హోల్డర్లతో అనుచితంగా ప్రవర్తించలేరు. ఆర్‌బిఐ నిర్వచించిన నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు రుణాలు మరియు వడ్డీని అందిస్తాయి. ఇవన్నీ గుత్తాధిపత్యానికి ఎలాంటి చోటు ఇవ్వవు మరియు ప్రజలకు ఉత్తమ ప్రయోజనాలు చేకూరే విధంగా పనిచేస్తాయి. ఇన్సూరెన్స్ పరిశ్రమలో IRDAI పాత్ర గురించి ఇక్కడ ఒక సంక్షిప్త వివరణ ఇవ్వబడింది:
  • ప్రజలకు పాలసీలో పెట్టుబడి పెట్టడానికి మరియు సురక్షితంగా ఉండటానికి సహాయపడే విధంగా ఇన్సూరెన్స్ రంగంలో క్రమబద్ధమైన అభివృద్ధిని నిర్ధారించడం
  • ఇన్సూరెన్స్ మార్కెట్లో సమగ్రత యొక్క న్యాయమైన పద్ధతులు మరియు ప్రమాణాలను ప్రోత్సహించడం
  • ప్రస్తుత వ్యవస్థ పై విశ్వాసం కలిగే విధంగా పాలసీ హోల్డర్ ప్రయోజనాలను సురక్షితం చేయడం
  • క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను వేగవంతం చేయండి మరియు సంబంధిత వివాదాలను సకాలంలో పరిష్కరించడం
  • ఏదైనా మోసం లేదా స్కామ్‌ను గుర్తించడానికి ప్రమాణాలను రూపొందించడం మరియు విజిలెన్స్ నిర్వహించడం

ముగింపు

IRDAI, భారతదేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలకు నిబంధనలు లేదా నియమాల్లోని ఏవైనా మార్పులను గురించి తెలియజేస్తుంది. ఇది కార్యకలాపాలు, ప్రీమియంలు మరియు అనేక ఇతర ఇన్సూరెన్స్ సంబంధిత ఖర్చుల పరంగా ఇన్సూరెన్స్ వ్యాపారం సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ, మొదలైనటువంటి తగిన పాలసీని కొనుగోలు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు సురక్షితం చేసుకోండి. IRDAI పాత్ర కేవలం పైన పేర్కొన్న దానికి మాత్రమే పరిమితం కాదు. ఇది దేశంలోని ఇన్సూరెన్స్ సంస్థలకు వ్యాపారాలు మరియు వివిధ ఇతర విధులను నిర్వహించడానికి వీలుగా రిజిస్ట్రేషన్ కూడా మంజూరు చేస్తుంది. IRDAI పాత్ర దాని పనితీరులో పారదర్శకత కనబరుస్తుంది మరియు సకాలంలో మార్పులు చేస్తుంది.   *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి