రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Why Do We Need Insurance?
డిసెంబర్ 10, 2024

మనకి ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం అనేదానికి 5 ప్రధాన కారణాలు

మనం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బహుళ ఆదాయ వనరులను కలిగి ఉన్నప్పుడు మరియు మన జీవితాల్లో ఉత్తమ స్థాయిలో జీవిస్తున్నప్పుడు మనకు ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమని మనం తరచుగా ఆలోచిస్తాము. మీరు ఎంత సంపాదిస్తారు లేదా మీ వ్యాపారం ఎంత సజావుగా సాగుతోంది, మీరు ఎంత ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉన్నారనే దానితో సంబంధం లేకుండా, జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలలో ఒకటి అత్యవసర పరిస్థితి కోసం ఆదా చేయడం. అనేక ఇన్సూరెన్స్ ప్రోడక్టులు అయిన జనరల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, రిటైర్‌మెంట్ ప్లాన్, లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ మొదలైనవి ఉన్నాయి. ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సంక్షోభ సమయంలో గణనీయమైన ఆర్థిక భారం నుండి మిమ్మల్ని రక్షించడం మరియు ఉపశమనం అందించడం. ఉదాహరణకు, డేవిడ్ రూ. 40 లక్షల లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అతను ఆన్‌లైన్‌లో కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసారు, అందులో రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు జీరో డిప్రిషియేషన్ యాడ్-ఆన్‌తో థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ మరియు కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. దానితోపాటు, ఏవైనా ఊహించని అత్యవసర పరిస్థితుల నుండి తన భవిష్యత్తును రక్షించడానికి అతను హెల్త్, మెడికల్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేశారు. అతని స్నేహితుడు హమీద్ ఒక కొత్త సెడాన్ కొనుగోలు చేశారు మరియు కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్  - థర్డ్-పార్టీ పాలసీ కొనుగోలు చేశారు, ఎందుకంటే అది తప్పనిసరి కాబట్టి, ఏదైనా ఇతర ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడాన్ని డబ్బులు వృధా చేయడం అని ఆయన భావిస్తున్నారు. రెండు సంవత్సరాల తర్వాత కొన్ని ఊహించని పరిస్థితుల కారణంగా, డేవిడ్ మరియు హమీద్ ఒక యాక్సిడెంట్‌కు గురయ్యారు. డేవిడ్ తన కారు డ్యామేజ్ కోసం క్లెయిమ్ పొందాడు, హెల్త్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అతని హాస్పిటలైజషన్ బిల్లులను చెల్లించాయి. హమీద్ దాదాపు ప్రతి ఖర్చు కోసం తన స్వంత డబ్బును చెల్లించవలసి వచ్చింది. ఎందుకనగా, అతను యాక్సిడెంట్స్ వల్ల కలిగే గాయాలను మాత్రమే కవర్ చేసే థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నాడు. ఇక్కడ హమీద్ లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వారు ఇన్సూరెన్స్‌లో పెట్టుబడిని వ్యర్థమని భావిస్తారు. జీవితంలో కొన్ని/నిర్దిష్ట ఇన్సూరెన్స్ ప్రోడక్టులను కలిగి ఉండటం చాలా ముఖ్యం. మనకు ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం, అందుకు 5 ప్రధాన కారణాలను ఈ దిగువన ఉన్న కథనం ద్వారా తెలుసుకుందాం. ఇవి కూడా చదవండి: వివిధ రకాల జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు

ఇన్సూరెన్స్ యొక్క ఉద్దేశ్యం మరియు అవసరం

1. అత్యవసర సమయంలో ఇన్సూరెన్స్ ఒక ఆర్థిక బ్యాకప్‌గా పనిచేస్తుంది

భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనలో ఎవరికీ తెలీదు. గాయాలు, ప్రమాదాలు, అనారోగ్యం మరియు మరణం లాంటి ఊహించని అత్యవసర పరిస్థితులు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని విపరీతమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. ఇన్సూరెన్స్ ప్లాన్లు మీకు మానసికంగా మరియు ఆర్థికంగా సహాయపడతాయి, తద్వారా మీరు మీ జీవితాన్ని పునర్నిర్మించడంపై దృష్టి పెట్టవచ్చు.

2. ఇన్సూరెన్స్ రిటైర్‌మెంట్‌ను సురక్షితం చేస్తుంది

రిటైర్‌మెంట్ పాలసీ అనేది ఒక రకమైన ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది మీ ఆదాయంలో కొంత భాగాన్ని దీర్ఘకాలిక అవధిలో ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది మరియు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థికంగా మిమ్మల్ని సురక్షితం చేస్తుంది. కూడబెట్టిన ఆదాయం మొత్తం ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి తిరిగి పెన్షన్‌ రూపంలో అందించబడుతుంది.

3. భవిష్యత్తును సురక్షితం చేయడంలో ఇన్సూరెన్స్ మీకు తోడ్పడుతుంది

మీ ప్రస్తుత జీవితం స్థిరమైన ఆదాయ ప్రవాహంతో స్థిరంగా ఉండవచ్చు, అది మీ మరియు మీ కుటుంబ అవసరాలను తీరుస్తుంది. కానీ జీవితం అనిశ్చితమైనది. కొన్ని అనుకోని సంక్షోభాలు జీవితాన్ని తలకిందులు చేస్తాయి. మీరు లేకుండా, మీ కుటుంబం భవిష్యత్తు అవసరాలను తీర్చుకోగలదా? టర్మ్ ఇన్సూరెన్స్‌తో మీరు, మీ కుటుంబ సభ్యులకు ఏకమొత్తంలో ప్రయోజనం అందేలా, వారి అవసరాలను తీర్చుకోవడంలో సహాయం చేకూరేలా భద్రత కల్పిస్తారు.

4. ఇన్సూరెన్స్ సేవింగ్స్‌ని ప్రోత్సహిస్తుంది

మనీ-బ్యాక్ పాలసీ లాంటి అనేక ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లు, ప్రతి సంవత్సరం ప్రీమియం రూపంలో కొంత నిధులను కేటాయించడం ద్వారా క్రమబద్ధమైన పొదుపులు చేసుకోవడంలో సహాయపడతాయి. మెచ్యూరిటీ సమయంలో డబ్బును తిరిగి ఇచ్చే ప్రాథమిక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ మాదిరిగా కాకుండా, మనీ-బ్యాక్ పాలసీ అనేది పాలసీలో పెట్టుబడి పెట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత పాలసీహోల్డర్‌కు కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది.

5. ఇన్సూరెన్స్ మనశ్శాంతిని ఇస్తుంది

ఆర్థిక భద్రతతో పాటు ఇన్సూరెన్స్ మీకు మనశ్శాంతిని కూడా అందిస్తుంది. మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇంటికి జరిగిన నష్టాలకు కవరేజ్ పొందడానికి మీకు సహాయపడుతుంది. మీ ఫ్యామిలీ ఫ్లోటర్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ హాస్పిటలైజేషన్ సమయంలో మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని కవర్ చేస్తుంది. ఏదైనా ఇన్సూరెన్స్ ప్లాన్ సంక్షోభ సమయంలో అందుబాటులో ఉంటుంది. ఇవి కూడా చదవండి: రెండు ప్రధాన రకాల హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఏమిటి?

తరచుగా అడిగే ప్రశ్నలు

1. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అత్యవసర సమయంలో పాలసీహోల్డర్‌కి పెద్ద మొత్తంలో సెటిల్‌మెంట్‌ను ఎలా అందిస్తుంది?

మనం ఇన్సూరెన్స్ ప్రోడక్ట్‌ కొనుగోలు చేసినప్పుడు ప్రీమియంలు చెల్లిస్తాము మరియు కొందరు ఇన్సూరెన్స్ కంపెనీకి డిడక్టబుల్ రూపంలో నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీహోల్డర్లు అందరి కోసం ఆ మొత్తాన్ని సేకరిస్తుంది మరియు కాలక్రమేణా నిధులను కూడబెట్టడానికి మరియు పాలసీహోల్డర్ క్లెయిమ్ చేసినప్పుడు వారికి ఆ నిధులు చెల్లించడానికి సురక్షితంగా పెట్టుబడి పెడుతుంది.

2. భారతదేశంలో ఏ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి?

భారతదేశంలో థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ఇవి కూడా చదవండి: పూర్తి-కవరేజ్ కార్ ఇన్సూరెన్స్: ఒక సమగ్ర గైడ్

ముగింపు

ఎవరూ భవిష్యత్తును అంచనా వేయలేనప్పటికీ మరియు ఏవైనా ఊహించని విషయాలు జరగకుండా ఆపలేకపోయినప్పటికీ, మనం చేయగలిగిందల్లా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడం. అత్యవసర సమయంలో మీకు మరియు మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడం ద్వారా ఇన్సూరెన్స్, మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది కేవలం పన్నును ఆదా చేసే ఒక ఎంపిక మాత్రమే కాదు, కాలానుగుణంగా చిన్న పెట్టుబడులు పెట్టడం మీకు ముందస్తు భద్రతను అందిస్తుంది. మనలో చాలామంది మనకు ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం అని ఒత్తిడికి గురవుతారు లేదా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచనను విరమించుకుంటారు, ఎందుకనగా దీనికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. కానీ, జీవితానికి రక్షణ కలిపించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఖరీదైనవి కావచ్చు కానీ, సరైన ఇన్సూరెన్స్ లేకుంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది.   *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి