రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
How Many Times We Can Claim Car Insurance In A Year?
30 మార్చి, 2021

ఒక సంవత్సరంలో కారు ఇన్సూరెన్స్‌లో ఎన్ని క్లెయిమ్‌లు అనుమతించబడతాయి?

జనాభా మరియు ప్రజల ఆదాయంలో పెరుగుదలతో రోడ్డుపై వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు భద్రత స్థాయిలు మాత్రం తీవ్రంగా లోపించాయి. దీంతో ప్రతిరోజూ జరిగే ప్రమాదాల సంఖ్య మరింత పెరిగింది. ప్రమాదాల తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉంది మరియు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన మరణాల రేటు కూడా పెరిగింది. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి, అదేసమయంలో కారు ఇన్సూరెన్స్‌ సంబందిత కొన్ని ప్రధాన అంశాలను లేవనెత్తుతాయి. కాబట్టి, కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు మరియు దానిని క్లెయిమ్ చేసేటప్పుడు అనేక అంశాలను గుర్తుంచుకోవాలి, అయితే, ఇక్కడ మేము తరచుగా అడిగే ఒక ప్రశ్నను పరిష్కరిస్తున్నాము అది, కారు ఇన్సూరెన్స్‌లో ఎన్నిసార్లు క్లెయిమ్ చేయవచ్చు అనే దానిపై ఏదైనా పరిమితి ఉందా? కారు ఇన్సూరెన్స్‌లో ఎన్ని క్లెయిమ్‌లు అనుమతించబడతాయి? సూటిగా చెప్పాలంటే, ఒక సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు కారు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయవచ్చు అనేదానిపై ఎలాంటి పరిమితి లేదు. అయితే, మీ పాలసీ అలాంటి ఏదైనా నిబంధనను కలిగి ఉండవచ్చు, కాబట్టి మీరు పాలసీని ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి లేదా పాలసీ రెన్యూవల్ సమయంలో ప్రొవైడర్ తరచుగా చేసే క్లెయిమ్‌ల విషయంలో అలాంటి ఏదైనా నిబంధనను జోడించవచ్చు. కాబట్టి, పాలసీని కొనుగోలు చేసేటప్పుడు దానిని తప్పకుండా చదవాలి. కొన్ని పరిస్థితుల్లో ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయకూడదని ప్రజలు ఎందుకు సలహా ఇస్తారు? మొదటిది, మీరు మీ కారు ఇన్సూరెన్స్ కింద ఏదైనా క్లెయిమ్ చేసినప్పుడు 'నో క్లెయిమ్ బోనస్' ప్రభావితం అవుతుంది. అనగా, మీరు మునుపటి సంవత్సరంలో పాలసీ కింద ఏ క్లెయిమ్ చేయకపోతే, తదుపరి సంవత్సరంలో చెల్లించే ప్రీమియంపై డిస్కౌంట్‌ను పొందుతారు, దీనినే నో క్లెయిమ్ బోనస్ అంటారు. మీరు ఎంత కాలం పాటు క్లెయిమ్‌ చేయలేదు అనే దానిని బట్టి ఇది 20% నుండి 50% వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా క్లెయిమ్‌ చేసినట్లయితే, సంవత్సరాల తరబడి జమచేసిన మీ నో క్లెయిమ్ బోనస్ మొత్తం ఒక్కసారిగా పోతుంది. కథ మళ్లీ మొదటికి వస్తుంది, చిన్న విషయాల కోసం తరచుగా క్లెయిమ్‌లు చేయడం వలన కస్టమర్ విశ్వసనీయత దెబ్బతింటుంది మరియు తదుపరి సంవత్సరాల్లో చెల్లించాల్సిన ప్రీమియం ప్రభావితం అవుతుంది. తరచూ క్లెయిమ్‌లు చేయడంతో పాలసీ రెన్యూవల్‌ కూడా మరింత ఖరీదైనదిగా మారుతుంది. అయితే, రిపేర్ ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం క్లెయిమ్ చేయడం మంచిది అని గుర్తుంచుకోవాలి. క్లెయిమ్‌లు ఎప్పుడు చేయకూడదో ఎలా నిర్ణయించుకోవాలి? అయితే, కారు ఇన్సూరెన్స్‌లో ఎన్ని సార్లు క్లెయిమ్ చేయవచ్చు అనే దానిపై ఎలాంటి పరిమితి లేదని మనకు తెలుసు; మనం ఎప్పుడు క్లెయిమ్ చేయకూడదో కూడా తెలుసుకోవాలి. కాబట్టి, క్లెయిమ్ చేయకూడదని సలహా ఇవ్వబడిన పరిస్థితులు ఇలా ఉన్నాయి
  • 'నో క్లెయిమ్ బోనస్' రిపేర్ ఖర్చుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు: ఇన్సూరెన్స్ ప్రీమియంపై అందే నో క్లెయిమ్ బోనస్ మొత్తం, కారు రిపేర్ ఖర్చుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఇన్సూరెన్స్ పాలసీ కింద ఎలాంటి క్లెయిమ్ చేయకూడదని సూచించడమైనది.
  • రిపేర్ ఖర్చుల మొత్తం మినహాయించదగిన మొత్తం కంటే ఎక్కువగా లేనప్పుడు: మినహాయించదగినది అనగా మీరు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసిన ప్రతిసారి స్వచ్చందంగా చెల్లించే క్లెయిమ్ మొత్తంలోని ఒక భాగం. అయితే, మీరు చెల్లించాల్సిన ఖర్చుల మొత్తం ఆ మినహాయించదగిన మొత్తాన్ని మించకపోతే, మీరు ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏమీ పొందలేరు.
కాబట్టి, ఒక క్లెయిమ్ చేయడం ద్వారా మీకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు, క్లెయిమ్ చేయకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎందుకు కోల్పోవాలి? అలాగే, ఒకవేళ మీరు ఒక క్లెయిమ్ కింద ఒక మొత్తాన్ని క్లెయిమ్ చేస్తున్నట్లయితే, ఆ మొత్తం రెండు ప్రత్యేక సందర్భాలకు సంబంధించినది అయితే, అప్పుడు మినహాయింపు అనేది రెండు సందర్భాలకు విడిగా వర్తిస్తుందని గుర్తుంచుకోండి.
  • ఒక థర్డ్ పార్టీ మీ ఖర్చులను చెల్లించినప్పుడు: అవతలి వ్యక్తి కారణంగా మీరు యాక్సిడెంట్‌కు గురైనప్పుడు, జరిగిన నష్టాలకు చెల్లించడానికి వారు బాధ్యత వహిస్తారు. కాబట్టి, ఆ ప్రయోజనాన్ని పొందండి మరియు మరికొంత కాలం పాటు మీ ఇన్సూరెన్స్‌ను ఆనందించండి.
మొత్తానికి, జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి, మినహాయించదగిన మొత్తానికి వర్తించే పరిమితులు తెలుసుకోవాలి, 'నో క్లెయిమ్ బోనస్' పై సంభావ్య ప్రభావాన్ని గుర్తించాలి మరియు ఆ తరువాత క్లెయిమ్ చేయాలి. ఈ అంచనా ఒక నిర్ణయాత్మక అంశం అయినప్పటికీ, అవసరమైనప్పుడు కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి అనే విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. క్లెయిమ్స్ ఫైల్ చేయడం అంటే నేను తరువాతి సంవత్సరాల్లో మరిన్ని ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుందా? మీ పాలసీ కోసం ఎంత ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించాలి అనే దానికి అనేక అంశాలు దోహదపడతాయి. అది ఐడివి అనగా ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూలో మార్పులను మొదలుకొని, ప్రీమియం అమౌంటు సాధారణ స్థాయిలు, పాలసీహోల్డర్ లేదా థర్డ్-పార్టీ చేసిన పొరపాటు కారణంగా ఫైల్ చేయబడిన క్లెయిమ్ స్వభావం మరియు కొన్ని ఇతర అంశాలలో మార్పులకు లోబడి ఉంటుంది. కాబట్టి, క్లెయిమ్‌ల సంఖ్య మరియు ఇన్సూరెన్స్ ప్రీమియం మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉండదు. తరచుగా అడిగే ప్రశ్నలు: ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను సమర్పించాల్సిన సమయ పరిమితి ఏదైనా ఉందా? లేదు, క్లెయిమ్‌ను సమర్పించడానికి ఎలాంటి సమయ పరిమితి లేదు, కానీ సాధ్యమైనంత త్వరగా దానిని పూర్తి చేయడం మంచిది, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ, ఈ విధమైన జాప్యాల కారణంగా క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉండదు. “నేను కారు ఇన్సూరెన్స్ కింద ఒకసారి క్లెయిమ్ చేశాను, కానీ నా ఐడివి అయిపోలేదు. అయితే, అదే పాలసీ కింద నేను మరోసారి క్లెయిమ్ చేయవచ్చా?” అనేది రజియా గారి ప్రశ్న కారు ఇన్సూరెన్స్‌లో ఎన్ని క్లెయిమ్‌లు అనుమతించబడతాయి అనే దానిపై పరిమితి లేదు, అయితే క్లెయిమ్ మొత్తం ఐడివి లోపు ఉండాలి. అప్పుడు, మీరు అదే పాలసీ కింద క్లెయిమ్ చేయవచ్చు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి